godavari district
-
కత్తులు దూసిన కోళ్లు
సాక్షి అమరావతి/నెట్వర్క్: సంక్రాంతి తొలిరోజునే రాష్ట్రవ్యాప్తంగా కోడి పందేల జాతర మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో హైటెక్ హంగులు.. మినీ స్టేడియంలను తలపించిన బరుల్లో కోళ్లు కత్తులు దూశాయి. భారీ టెంట్లు.. వీవీఐపీ, వీఐపీ, సామాన్య జనానికి వేర్వేరుగా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. పందేలను తిలకించేందుకు వీలుగా కుర్చీలు.. సోఫాలు.. ఎయిర్ కూలర్లతో సౌకర్యవంతమైన ఏర్పాట్ల నడుమ ఫ్లడ్ లైట్ల వెలుగుల మధ్య పందేలు సాగాయి.ప్రత్యేక ఎంట్రీ పాస్‌లు ఇచ్చి.. పందేల్లో తలపడిన కోళ్లు ప్రేక్షకులకు కన్పించేల భారీ ఎల్ఈడీ స్క్రీన్ల లైవ్ ఇచ్చారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లోను పెద్దఎత్తున కోడి పందేలు సాగాయి. గతానికి మించిన భారీ ఏర్పాట్లతో కోళ్ల సమరం సాగింది. ఈ ఏడాది కోడి పందేల జాతర రాయలసీమ జిల్లాలకు పాకింది. గోదావరి జిల్లాల్లో ఇలా.. ఏలూరు జిల్లా పెదవేగి మండలం దుగ్గిరాలలో జాతీయ రహదారి పక్కనే రూ.కోటి ఖర్చుతో కోడి పందేల బరిని మినీ స్టేడియాన్ని తలదన్నేలా నిర్మించారు. అక్కడ కోడి పందేలు వేసేవారికి.. వాటిని చూసేవారికి ప్రత్యేకంగా టోకెన్లు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గొల్లవానితిప్ప–డేగాపురం వద్ద హైటెక్ హంగులతో ఏర్పాటు చేసిన భారీ బరిలో కోడి పందేలు మొదలయ్యాయి. పందేలరాయుళ్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా బరులకు సమీపంలోనే కార్వేన్లు, రెస్ట్‌రూమ్‌ల సౌకర్యాలు కల్చించారు. బౌన్సర్లతో ప్రైవేటు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు.ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరం, సీసలి, మహాదేవపట్నం, ఆకివీడులో బరులను సినిమా సెట్టింగులను తలపించేలా తీర్చిదిద్దారు. ఇక్కడ ఓ బరిలో పందేలను ప్రారంభించేందుకు గోల్డ్ కాయిన్ తయారు చేయించి హెడ్ అండ్ టాస్ వేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 350 బరుల్లో కోడిపందేలు పోటాపోటీగా నిర్వహించారు. కోడిపందేలు, గుండాట కలిపి తొలిరోజు సుమారు రూ.250 కోట్లకు పైగా పందేలు జరిగాయని అంచనా. ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు పర్యవేక్షణలో ఐ.పోలవరం మండలం మురమళ్లలో 10 ఎకరాల లే–అవుట్లో భారీగా కోడిపందేలు, గుండాటలు నిర్వహించారు. కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రాతినిధ్యం వహిస్తున్న రామచంద్రపురం నియోజకవర్గంలో 15 బరుల్లో సుమారు రూ.3 కోట్ల పందేలు జరిగాయని అంచనా. డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో 30 బరులు ఏర్పాటు చేశారు. కరపలో మూడు రోజులపాటు నిర్వహించే 60 పందేల్లో ఎక్కువ పందేలు గెలిచిన వారికి బహుమతిగా రూ.25 లక్షల విలువైన తార్ జీపు, గురజనాపల్లి, గొర్రిపూడి బరుల్లో నాలుగు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లను విజేతలకు బహుమతిగా ఇచ్చేందుకు సిద్ధం చేశారు. బరిలోకి గుంటూరు ఉమ్మడి గుంటూరు జిల్లాలోనూ భారీ ఏర్పాట్ల నడుమ కోడి పందేలు, జూద జాతరకు సోమవారమే శ్రీకారం చుట్టారు. బాపట్ల జిల్లా రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లో భారీ ఎత్తున పందేలు మొదలయ్యాయి. మంతెనవారిపాలెంలో 40 ఎకరాల్లో భారీ బరి ఏర్పాటు చేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న రేపల్లె నియోజకవర్గంలోని తూర్పుపాలెం వద్ద 30 ఎకరాల్లో 6 బరులు ఏర్పాటయ్యాయి.వేమూరు నియోజకవర్గ పరిధిలోని కొల్లూరు బోస్‌నగర్, అనంతవరం, జంపని, చుండూరు మండలం కేఎన్ పల్లి, భట్టిప్రోలు మండలం పల్లకోన ప్రాంతాల్లో బరులు ఏర్పాటు చేశారు. ప్రకాశం జిల్లాలో పందేలు తొలిరోజే జోరందుకున్నాయి. సంతనూతలపాడు మండలం వడ్డెపాలెం పరిసరాల్లో సోమవారం కోడి పందేలు జరిగాయి. ఒంగోలు పాతపాడు, కొత్తపట్నం మండలం మడనూరు, గామళ్లపాడులో పందేలు మొదలయ్యాయి. ‘సీమ’లోనూ కాలు దువ్విన కోడి⇒ ఎకరాల్లో ప్రత్యేక బరి ఏర్పాటు చేశారు. ఇక్కడ కోడి పందేలు, క్యాసినో, కోత ముక్క ఆడించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విజయవాడ సమీపంలోని రామవరప్పాడు, ఎనికేపాడు, అంబాపురంలోనూ భారీ బరులు ఏర్పాటయ్యాయి. పెనమలూరు పరిధిలోని ఈడుపుగల్లు, గొడవర్రు, ఉప్పులూరు, పెద్దపులిపాకలో కోడి పందేలు జరిగాయి. నందిగామ, పామర్రు గుడివాడ, జగ్గయ్యపేట, పెడన, తిరువూరు, మచిలీపట్నం, మైలవరం నియోజకవర్గాల్లో భారీగా బరుల్లో కోడిపందేలు సాగుతున్నాయి. -
గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ కలకలం
-
ఎటో వెళ్లిపోతోంది 'పులస'
హిందూ మహాసముద్రంలో సందడి చేసే పులసలు.. గోదావరి వైపు చూడటం లేదు. సంతానోత్పత్తి కోసం నదిలోకి ఎదురీదే పులసలు ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు తమ రూటు మార్చేశాయి. ఆగస్టు రెండో వారం వచ్చేసినా గోదావరి పాయల వెంట పులస జాడ కనిపించడం లేదు. ఈ సీజన్లో ఇప్పటివరకు గోదావరి తీరంలో ఒక్క పులస మాత్రమే లభ్యమైంది.సాక్షి ప్రతినిధి, కాకినాడ: పుస్తెలమ్మి అయినా పులస తినాలనేది గోదావరి జిల్లాల్లో నానుడి. ఏటా జూలై, ఆగస్టు నెలల్లో పులసలు గోదావరి నదిలోకి వరస కట్టి.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మాంసాహార ప్రియుల జిహ్వచాపల్యాన్ని తీర్చేవి. అంతటి విశిష్టత కలిగిన పులసల రాక దాదాపు పదేళ్లుగా ఏటా తగ్గుతూ వస్తోంది. ఈ సీజన్లో ఇంతవరకు కోనసీమలోని రాజోలు దీవిలోని గోదావరి తీరంలో కేవలం ఒకే ఒక పులస మత్స్యకారుల వలకు చిక్కింది. ఆ చేపను వేలం వేస్తే రూ.24 వేలు పలికింది. అంతటి డిమాండ్ ఉన్న పులసలు గోదావరిలో అడుగుపెట్టకుండా మొహం చాటేస్తున్నాయి. హిందూ మహాసముద్రం నుంచి వేలాది కిలోమీటర్లు ఈదుకుంటూ బంగాళాఖాతంలోకి పులసలు వస్తున్నా.. గోదావరి నది వైపు చూడకుండా ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పరుగులు తీస్తున్నాయి. గోదావరి నదీ తీరం వెంబడి నెలకొన్న ఆటంకాలే ఇందుకు కారణమని మత్స్య శాస్త్రవేత్తలు స్పష్ట చేస్తున్నారు. ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’ ఇటు రావట్లేదుగోదావరిలో వరద ప్రవాహం పోటెత్తి సముద్రం వైపు పరుగులు తీసే రోజుల్లో.. వరదల్లో కొట్టుకొచ్చే బురద మట్టినే ఆహారంగా తీసుకుంటూ పునరుత్పత్తి కోసం ఇలసలు (సముద్ర జలాల్లో ఉన్నప్పుడు ఇలస అని పిలుస్తారు) గుంపులు, గుంపులుగా ఒక ప్రవాహం మాదిరిగా వలస వస్తుంటాయి. కానీ.. గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యకారకంగా మారడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. ఇలసల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా తీర ప్రాంతాల నుంచి సముద్ర జలాల్లో సుమారు 11 వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి ఇలసలు పునరుత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల వాటిలో ఉండే కొవ్వు కరిగి ఎరుపు, గోధుమ రంగులోకి మారుతుంది. ఈ దశలో పులస శరీరాకృతి పోషక విలువలతో కూడి రుచికరంగా తయారవుతుంది. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లో చమురు కార్యకలాపాల వెలికితీత కోసం చేపడుతున్న డ్రెడ్జింగ్ వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోయి పులసలు సముద్రం నుంచి గోదావరిలోకి రావడం లేదు.గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్ (నదీ ముఖద్వారం వద్ద) రిలయన్స్, ఓఎన్జీసీ తదితర సంస్థలు డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నాయి. గోదావరి తీరాన రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం, గాడిమొగ, ఎదుర్లంక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్భనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి విచ్చలవిడిగా వేల ఎకరాల్లో సాగవుతున్న రొయ్యల చెరువుల వ్యర్థాలు నేరుగా సముద్రం, గోదావరిలోనే కలుస్తున్నాయి. గోదావరి నుంచి సముద్రంలో ఈ అవశేషాలు కలుస్తుండటంతో పులస గోదావరి వైపు రావడం లేదు. గోదావరిలో వరద ప్రవాహం పోటెత్తి సముద్రం వైపు పరుగులు తీసే రోజుల్లో.. వరదల్లో కొట్టుకొచ్చే బురద మట్టినే ఆహారంగా తీసుకుంటూ పునరుత్పత్తి కోసం ఇలసలు (సముద్ర జలాల్లో ఉన్నప్పుడు ఇలస అని పిలుస్తారు) గుంపులు, గుంపులుగా ఒక ప్రవాహం మాదిరిగా వలస వస్తుంటాయి. కానీ.. గోదావరి ప్రాంతంలోని సముద్ర తీరం కాలుష్యకారకంగా మారడం, విచ్చలవిడిగా సాగుతున్న చేపల వేటతో ‘క్వీన్ ఆఫ్ ది ఫిష్’గా పిలిచే పులస బంగాళాఖాతం నుంచి గోదావరి వైపు రావడం లేదని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రెష్ వాటర్ రీఛార్జ్ ఇనిస్టిట్యూట్ (సిఫ్రీ) ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో తేల్చింది. ఇలసల్లో కొవ్వు అధికంగా ఉంటుంది. హిందూ మహాసముద్ర ప్రాంతంలోని ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, టాంజానియా తీర ప్రాంతాల నుంచి సముద్ర జలాల్లో సుమారు 11 వేల నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి ఇలసలు పునరుత్పత్తి కోసం గోదావరిలోకి ఎదురీదుతాయి. ఇలా ఎదురీత ప్రయాణం వల్ల వాటిలో ఉండే కొవ్వు కరిగి ఎరుపు, గోధుమ రంగులోకి మారుతుంది. ఈ దశలో పులస శరీరాకృతి పోషక విలువలతో కూడి రుచికరంగా తయారవుతుంది. కృష్ణా, గోదావరి (కేజీ) బేసిన్లో చమురు కార్యకలాపాల వెలికితీత కోసం చేపడుతున్న డ్రెడ్జింగ్ వల్ల ధ్వని కాలుష్యం పెరిగిపోయి పులసలు సముద్రం నుంచి గోదావరిలోకి రావడం లేదు.గోదావరి, బంగాళాఖాతం కలిసే సీ మౌత్ (నదీ ముఖద్వారం వద్ద) రిలయన్స్, ఓఎన్జీసీ తదితర సంస్థలు డ్రెడ్జింగ్ నిర్వహిస్తున్నాయి. గోదావరి తీరాన రాజమహేంద్రవరం, అంతర్వేది, కరవాక, యానాం, గాడిమొగ, ఎదుర్లంక సమీప ప్రాంతాల్లో పారిశ్రామిక వ్యర్థాలు గోదావరిలో కలిసిపోతున్నాయి. సల్ఫర్, అమోనియా, లెడ్, పాదరసం ఇతర కర్భనాలు నదిలో కలుస్తున్నాయి. తీరం వెంబడి విచ్చలవిడిగా వేల ఎకరాల్లో సాగవుతున్న రొయ్యల చెరువుల వ్యర్థాలు నేరుగా సముద్రం, గోదావరిలోనే కలుస్తున్నాయి. గోదావరి నుంచి సముద్రంలో ఈ అవశేషాలు కలుస్తుండటంతో పులస గోదావరి వైపు రావడం లేదు. అందుకే.. రూటు మార్చేసిందిగోదావరి తీరం కాలుష్యకారకంగా మారిపోవడం.. పునరుత్పత్తికి అనుకూల పరిస్థితులు లేకపోవడంతో సముద్రం నుంచి ప్రవాహం మాదిరిగా వచ్చే విలసలు అటు నుంచి అటే ఒడిశా, పశ్చిమ బెంగాల్ వైపు పరుగులు తీస్తున్నాయి. ఇందుకు ఒడిశా, పశ్చిమ బెంగాల్ నదీ జలాల్లో ఉన్న సానుకూల వాతావరణమే ప్రధాన కారణమని మత్స్య శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రధానంగా పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ నది వైపు పయనమవుతున్నాయని స్పష్టం చేస్తున్నారు.ఈ చర్యలు చేపడితే మేలుఅరుదైన పులస జాతిని పరిరక్షించేందుకు, ఆ జాతి వృద్ధి కోసం కోల్‌కతా సిఫ్రీ (సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రెష్ వాటర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగా పులస సీడ్‌ను వృద్ధి చేసి బంగాళాఖాతంలో విడిచిపెట్టే ప్రక్రియను రెండేళ్లుగా చేస్తోంది. ఇలాంటి కృషిని మన రాష్ట్రంలో కూడా చేపట్టాలి. సముద్రం, గోదావరి సహా నదుల్లో చేపలు పట్టే వలలకు మెష్ నియంత్రణ పాటించాలి. పిల్లలు పెట్టకుండానే తల్లి చేపలను పట్టేస్తున్న పరిస్థితులను కట్టడి చేయాలి. నదుల్లో విషతుల్యమైన వ్యర్థాలను, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించి పులస మనుగడ సాగించేందుకు కృషి జరగాలి. – సీహెచ్ గోపాలకృష్ణ, మత్స్య శాస్త్రవేత్త, కోనసీమపరిరక్షించాల్సిన అవసరం ఉందిఅరుదైన జాతి చేప పులస. ఇప్పటికే చాలా చేపలు అంతరించిపోతున్నాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం.. మితిమీరిన చేపలు వేల, జల కాలుష్యం, సరైన సంరక్షణ కొరత కారణంగా పులస చేపల సంఖ్య తగ్గుతోంది. పులసలు అంతరించిపోవడమనేది చాలా బాధాకరమైన విషయం. పులసలను పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. – డాక్టర్ కేఎన్ మూర్తి, ఫిషరీస్, అగ్రికల్చర్, ఆదిత్య డిగ్రీ కాలేజీ, కాకినాడ -
బుల్లి చేపలతో భలే మేలు!
సాక్షి ప్రతినిధి, కాకినాడ: గోదారోళ్లు తిండి పెట్టి చంపేస్తారురా బాబూ అంటుంటారు. గోదావరి తీరంలో లభించే రుచికరమైన చేపలు అటువంటివి మరి. ఒకప్పుడు ముక్క లేనిదే ముద్ద దిగదనే నానుడి గోదావరి జిల్లాలకే ప్రత్యేకం. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఈబాపతు జనం పెరిగిపోయారు. అందులోనూ చేపలు దొరకాలే కానీ ఎంతటి వారైనా ఇట్టే లొట్టలేసుకుని లాగించేస్తున్నారు. గోదావరిలో దొరికే పండుగప్ప, కొయ్యింగ, కొరమేను, సీజనల్‌గా ఆగస్టులో లభించే పులస వంటిì పది రకాల చేపలంటే మాంసాహార ప్రియులు పడిచస్తారు. ఇంతకాలం పెద్ద చేపలనే ఇష్టపడేవారు ఇప్పుడు చిన్న చేపలపైనా మక్కువ చూపిస్తున్నారు. చిన్న చేపలు రుచికి రుచి.. బలవర్ధకమైన మాంసాహారం, సంపూర్ణ ఆరోగ్యాన్నిస్తాయి. సముద్రపు చేపలకు గిరాకీ సముద్రపు ఉప్పు నీటిలో లభించే చేపలంటే మాంసాహార ప్రియులు ఇష్టపడతారు. పీతలు, రొయ్యలు, ట్యూనా, వంజరం, కోనం, చందువ తదితర రకాల చేపలకు మార్కెట్లో భలే గిరాకీ. ఇటువంటి చేపలు కాకినాడ రేవు నుంచి దక్షిణాదిన తమిళనాడు, కేరళతో పాటు ఒడిశా, మహారాష్ట్రలకు ఎగుమతి చేస్తున్నారు. పెద్ద చేపలతో పాటు చిన్నచిన్న చేపలకు కూడా ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోందని మత్స్యకారులు చెబుతున్నారు. చూడటానికి అరంగుళం, అంగుళం, ఒకటిన్నర అంగుళాల సైజులో ఉండే ఈ చిన్న చేపలు కొన్ని రకాల జబ్బులకు దివ్యౌషధమని వైద్యులు నిర్ధారిస్తున్నారు.ఈ జాబితాలో నెత్తళ్లు, కవళ్లు, కట్టచేపలు, పరిగెలు, కానగంత తదితర చేపలు ఉన్నాయి. పెద్ద చేపల కంటే చిన్న చేపలు మంచివని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. చిన్న చేపల్లో తక్కువ స్థాయిలో మెర్క్యురీ, అధిక స్థాయిలో మినరల్స్ ఉండటంతో ఆరోగ్యానికి మంచిదంటున్నారు. చిన్న చేపల్లో ఒమేగా–3 యాసిడ్స్ ఎక్కువగా ఉండటంతో మెదడు చురుగ్గా పని చేసేందుకు దోహదపడుతుంది. చిన్న చేపల్లో కలుíÙతాల స్థాయి కూడా తక్కువ మోతాదులో ఉంటుంది. పెద్ద చేపల కంటే చిన్న చేపల ధర కూడా తక్కువే. పండుగప్ప, వంజరం, ట్యూనా, కొరమేను వంటి కేజీ, కేజీన్నర ఉండే ఒక పెద్ద చేప కొనాలంటే కనీసం రూ.వెయ్యి వెచి్చంచాలి.అదే కేజీ చిన్న చేపలు కావాలంటే రూ.100 నుంచి రూ.200 పెడితే దొరికేస్తాయి. వివిధ రకాల పండ్లు, కూరగాయల నుంచి అదనంగా లభించే ఐరన్, జింక్ చిన్న చేపల ద్వారా పెరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. చిన్న చేపలను ఆహారంగా తీసుకునే మహిళల్లో రక్తహీనత తగ్గి శక్తిమంతులవుతారు. ప్రధానంగా గర్భిణులు, ప్రసవం అయిన మహిళలకు నెత్తళ్లు రకం చిన్న చేపలు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా గ్రామీణ మహిళలు భావిస్తారు. అల్పాదాయ దేశాల్లో మధ్యతరగతి, పేద వర్గాలు చిన్న చేపలనే ఎక్కువగా ఆహారంగా తీసుకుంటారు.వారంతా ఆరోగ్యవంతులుగా, బలవంతులుగా ఉంటారని వరల్డ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ తాజా అధ్యయనంలో పేర్కొంది. మహిళా సాధికారత కోసం ఒడిశా రాష్ట్రం మిషన్ శక్తి చొరవతో రెండేళ్ల క్రితం పైలట్ ప్రాజెక్టు చేపట్టింది. దీని ద్వారా 7 మిలియన్లకు పైగా చిన్న చేప పిల్లలను ఉత్పత్తి చేసిందని అధ్యయనం చెబుతోంది. వీటిని మహిళా స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసి, గ్రామీణ మహిళల్లో శక్తిసామర్థ్యాల పెంపునకు ఇతోధికంగా తోడ్పాటు అందించారు. స్విట్జర్లాండ్, కాంబోడియా వంటి దేశాల్లో స్వదేశీ చిన్న చేపలను కూరగాయల ఉత్పత్తితో పాటు మిళితం చేయడం గమనార్హం.కవళ్లతో గుండె జబ్బుల నివారణ చిన్న చేపల్లో ప్రధానంగా కవళ్లు ఆహారంగా తీసుకుంటే కాల్షియం, మినరల్స్, విటమిన్–డి వంటి పోషకాలు లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఆహారంగా తీసుకునే వారిలో గుండె జబ్బులకు ఆస్కారం ఉండదంటున్నారు. ఈ చేపలు చూసేందుకు చాలా చిన్నగా ఉంటాయి. వ్యావహారికంగా వీటిని ఆయిల్ సర్డిన్స్గా, శాస్త్రీయంగా సర్డెనెళ్ల లొంగిచెప్స్గా పిలుస్తారు. ఈ చేపల్లో పాలి అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉండటం వలన గుండె జబ్బులను తగ్గిస్తాయి.నెత్తళ్లతో కీళ్ల నొప్పులు మాయం సిల్వర్ కలర్లో కనిపించే నెత్తళ్ల చేపలు చాలా చిన్నగా ఉంటాయి. ఆంకూవీస్ అని వ్యవహారికంగా పిలిచే ఈ చేపల శాస్త్రీయ నామం స్టోల్ ఫోరస్ ఇండికస్. నెత్తళ్లలో కాల్షియం ఎక్కువగా ఉండడంతో కీళ్ల నొప్పుల నివారణకు పనికొస్తాయి. గర్భిణులు, వృద్ధులకు ఎంతో బలవర్ధకమైన ఆహారంగా భావిస్తారు. నెత్తళ్లు 100 గ్రాములు ఆహారంగా తీసుకుంటే 200 కిలో క్యాలరీల శక్తి, 45 గ్రాముల ప్రొటీన్లు, 3.3 గ్రాముల కొవ్వు పదార్థాలు, 1,400 మిల్లీగ్రాముల కాల్షియం, 2 గ్రాములు మిగిలిన ఖనిజాలు, 67 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ లభిస్తాయని కాకినాడ ఎస్‌ఐఎఫ్‌టీ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.చిన్న చేపల్లో కాల్షియం ఎక్కువ చిన్న చేపల్లో కాల్షియం, విటమిన్–ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ చేపలను ఆహారంగా తీసుకుంటే ఎముకలకు, కళ్లకు మేలు జరుగుతుంది. సహజంగా పెద్ద చేపలు ఇష్టంగా తీసుకుంటారు. పెద్ద చేపల కంటే చిన్న చేపలు బలవర్ధకం. గర్భిణులకు, ప్రసవానంతరం బలవర్ధకమైన ఆహారంగా నెత్తళ్లు పెట్టడం పల్లెల్లో ఆనవాయితీగా వస్తున్నదే. – టి.సుమలత, ప్రిన్సిపాల్, ఎస్‌ఐఎఫ్‌టీ, కాకినాడ చిన్న చేపలను ముళ్లతో తింటే మేలు చిన్న చేపల్లో ముళ్లు లేతగా ఉంటాయి. అందులో కాల్షియం, ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. గొంతులో గుచ్చుకుంటాయనే అనుమానం లేకుంటే చిన్న చేపలను ముళ్లతో తినడమే మేలు. ప్రకృతిలో దేని ద్వారానూ లభించనంత కాల్షియం చిన్న చేపల్లో లభ్యమవుతుంది. ఈ కాల్షియం ఎముకలు గుల్లబారడాన్ని నివారించి, ఆస్టియోపొరాసిస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది. చిన్న చేపల నుంచి లభ్యమయ్యే ప్రొటీన్ వల్ల కండ పుష్టి ఏర్పడి, శరీర నిర్మాణానికి దోహదపడుతుంది. – డాక్టర్ తొమూర్తి గౌరీశేఖర్, ఎముకల వైద్య నిపుణుడు, కాకినాడ -
టీడీపీ, జనసేన మధ్య బిగుస్తున్న ‘సీటు’ముడి
సాక్షి ప్రతినిధి, ఏలూరు: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం నియోజకవర్గంలో టీడీపీ, జనసేన మధ్య పడిన ‘సీటు’ముడి రోజురోజుకూ బిగుసుకుపోతోంది. రెండు పార్టీల మధ్య రాజకీయ కాక తారస్థాయికి చేరగా.. ఇరుపార్టీల నేతల మధ్య సిగపట్లు పెరిగాయి. ఉభయ పార్టీలు సోషల్ మీడియా వేదికగా పరస్పర మాటల యుద్ధంతో రచ్చకెక్కుతున్నారు. నరసాపురం టికెట్ తమదంటే.. తమదంటూ అనుకూల సమీకరణాలు చెప్పుకుంటూ హడావుడి చేస్తున్నాయి. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ టీడీపీతో దోస్తీ ప్రకటించిన నాటినుంచి నియోజకవర్గంలో రెండు పార్టీలూ కలిసికట్టుగా నిర్వహించిన కార్యక్రమాలు లేకపోగా.. తాజా పరిణామాలు ఆ పార్టీల మధ్య మరింత దూరం పెంచుతోంది. జనసేన నుంచి ఒకరు, టీడీపీ నుంచి నలుగురు టికెట్లు ఆశిస్తూ వర్గాలుగా విడిపోయి హంగామా సృష్టిస్తున్నారు. దీంతో తెలుగుదేశం పార్టీ నాలుగు వర్గాలుగా చీలిపోయింది. తాజా పరిణామాలతో టీడీపీ కార్యక్రమాలకు జన సైనికులు దూరం జరగ్గా.. జన సైనికులతో అంతకంటే ఎక్కువగా టీడీపీ దూరం పాటిస్తోంది. మింగుడు పడని రాజకీయం రాష్ట్రంలోనే అతి చిన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో నరసాపురం ఒకటి. రాజకీయ పరంగా ప్రతిపక్షాలకు ఆదినుంచీ కొరుకుడుపడని విధంగానే ఉంటోంది. ఇప్పుడు కూడా సీటు విషయంలో గందరగోళం నెలకొని టీడీపీ, జనసేన పార్టీలకు మింగుడుపడటం లేదు. రెండు పార్టీలకు కనీస స్థాయిలో కూడా బలమైన ఇన్చార్జిలు లేకపోవడం, ఆశావహులు ఎక్కువగా ఉండటం, కుల సమీకరణాలు కీలక ప్రాధాన్యంగా మారడంతో నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. 1983 నుంచి 2004 వరకు నరసాపురంలో టీడీపీ గెలుపొందుతూ వచ్చింది. 2009లో ముదునూరి ప్రసాదరాజు గెలుపొందారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్ ప్రభంజనంలో ఘన విజయం సాధించి ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొనసాగుతున్నారు. పూర్తిగా పాజిటివ్ పాలిటిక్స్‌తో అర్థరహిత విమర్శలకు పోకుండా నియోజకవర్గంలో గడచిన నాలుగేళ్ల 9 నెలల కాలంలో పెద్దఎత్తున అభివృద్ధి పనులు నిర్వహించారు. మొదటినుంచీ ఆయన జనంలో బలంగా తిరుగుతున్నారు. ప్రసాదరాజు అన్నివర్గాలనూ కలుపుకుపోతూ నానాటికీ బలపడుతుండటంతో టీడీపీ, జనసేన శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గత ఎన్నికల్లో రెండో స్థానం వచ్చినా.. 2019 ఎన్నికల్లో జనసేన ఈ నియోజకవర్గంలో టీడీపీ కంటే ఎక్కువ ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచింది. ఆ ఎన్నికల్లో టీడీపీని మూడో స్థానంలోకి నెట్టి దాదాపు 35 ఏళ్ల టీడీపీ రాజకీయ ప్రస్థానానికి జనసేన గండి కొట్టింది. నాటినుంచి నేటివరకు నియోజకవర్గంలో టీడీపీ కోలుకోలేని స్థితిలోకి వెళ్లిపోయింది. జనసేన అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,120 ఓట్లు సాధించగా.. టీడీపీ దారుణంగా పతనమై 27,059 ఓట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో పొత్తు లేకుండానే అత్యధిక ఓట్లు సాధించాం కాబట్టి పొత్తుల్లో పవన్ కల్యాణ్ కంటే ముందు నరసాపురం సీటును జనసేన పార్టీకే ప్రకటిస్తారని జనసేన కార్యకర్తలు నాయకులు సోషల్ మీడియాతోపాటు బహిరంగంగానూ బలంగా వాణి వినిపిస్తున్నారు. నియోజకవర్గంలో టీడీపీ పనైపోయిందంటూ జనసేన కార్యకర్తలు టీడీపీ నిర్వహించే కార్యక్రమాలకు, సమన్వయ కమిటీ కార్యక్రమాలకు, చంద్రబాబు పర్యటనలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. టీడీపీ సైతం జనసేనతో ఇదే దూరం పాటిస్తోంది. టీడీపీలో టికెట్ లొల్లి టీడీపీలో టికెట్ లొల్లి తారాస్థాయికి చేరడంతో గందరగోళం నెలకొంది. నలుగురు అభ్యర్థులు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నిస్తూ ఉన్న కొద్దిపాటి కేడర్‌ను చెల్లాచెదురు చేస్తున్నారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొంది.. 2019లో ఓడిపోయిన బండారు మాధవనాయుడును టీడీపీ ఇన్చార్జిగా తొలగించి అత్యంత మొక్కుబడి నాయకుడైన పొత్తూరు రామరాజును ఇన్చార్జిగా నియమించింది. అప్పటి నుంచి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ ఇన్చార్జి వేర్వేరుగా అడపాదడపా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా.. టీడీపీ సీటు ఆశిస్తూ ఎన్ఆర్ఐ కొవ్వలి యతిరాజ రామ్మోహన్నాయుడు కొద్ది నెలలుగా నియోజకవర్గంలో హంగామా చేస్తున్నారు. నరసాపురం సీటు జనసేనకు కేటాయించడం లేదని.. టీడీపీకి చెందిన ముగ్గురికీ కాకుండా తనకే వస్తుందంటూ సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో సొంత అజెండాతో ప్రతిచోటా ఇదే విషయాన్ని చెబుతున్నారు. ఇక అపార అనుభవం ఉండి.. అన్ని రాజకీయ పార్టీలూ తిరిగి వచ్చిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు టీడీపీ టికెట్ కోసం విపరీతంగా లాబీయింగ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు కూడా చంద్రబాబు తనకే సీటిస్తానని చెప్పారంటూ హడావుడి చేస్తూ నియోజకవర్గంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనసేనలోనూ గందరగోళమే మరోవైపు అభ్యర్థి ఎవరనే విషయంలో జనసేన పార్టీలోనూ గందరగోళం నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్‌కు ఈసారి ఆ పార్టీ నుంచి సీటొస్తుందో లేదో తెలియని సందిగ్ధ పరిస్థితి నెలకొంది. టీడీపీ సీటు కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు జనసేన పార్టీ టికెట్ కోసం కూడా కరీ్చప్ వేశారు. మెగాస్టార్ చిరంజీవి ద్వారా నరసాపురం జనసేన సీటు సాధించే ప్రయత్నాల్లో ఉన్నారు. మరోవైపు ఆక్వా వ్యాపారి చాగంటి మురళీకృష్ణ కూడా జనసేన టికెట్‌పై కన్నేశారు. -
సంక్రాంతికి సింహపురి ‘కోడ’ల్లుళ్లు
సాక్షి, భీమవరం/భీమవరం (ప్రకాశం చౌక్): సంక్రాంతి కోడి పందేలకు గోదావరి జిల్లాల్లో ఉండే క్రేజే వేరు. పందెం పుంజులకూ డిమాండ్ భారీగానే ఉంటుంది. సాధారణంగా సంక్రాంతి పందేల కోసం స్థానికులే పెద్దఎత్తున కోడి పుంజులను పెంచి విక్రయిస్తుంటారు. కాగా.. కోవిడ్ తరువాత సింహపురి (నెల్లూరు) ప్రాంత వ్యాపారులు పందెం పుంజులను గోదావరి జిల్లాలకు తెచ్చి అమ్మకాలు చేస్తున్నారు. పండుగ రోజుల్లో పూర్వ గోదావరి జిల్లాల్లోని ప్రధాన బరుల్లో ఒక్కొక్క చోట రోజుకు 25 నుంచి 30 వరకు పందేలు జరిగితే.. గ్రామాల్లోని చిన్న బరుల్లో జరిగే పందేలకు లెక్కే ఉండదు. పండుగ మూడు రోజుల్లో వేలాదిగా జరిగే పందేలకు రెట్టింపు సంఖ్యలో కోడి పుంజులు అవసరమవుతాయి. సంక్రాంతి పందేల కోసం కోడి పుంజుల పెంపకం ద్వారా గోదావరి జిల్లాల్లో వందలాది మంది ఉపాధి పొందుతున్నారు. వీటి అమ్మకాల రూపంలో ఏటా రూ.12 కోట్లకు పైగా వ్యాపారం జరుగుతుందని అంచనా. ప్రత్యేక వాహనాల్లో తీసుకొచ్చి మరీ.. కోవిడ్ అనంతరం సింహపురి ప్రాంతానికి చెందిన వారు పందెం పుంజుల పెంపంకంపై ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు జిల్లాతోపాటు సరిహద్దు రాష్ట్రమైన తమిళనాడుకు చెందిన నాటుకోళ్ల పెంపకందారులు, వ్యాపారులు గోదావరి జిల్లాల్లో అమ్మకాలు చేసేందుకు కోడి పుంజులతో తరలివస్తున్నారు. ఒక్కొక్కరు 20 వరకు పుంజులతో.. నలుగురైదుగురు కలిసి ప్రత్యేక వాహనాల్లో వస్తున్నారు. విజయవాడ–కాకినాడ హైవే వెంట తాడేపల్లిగూడెం, తణుకు, రావులపాలెం, పెరవలి, సిద్ధాంతం, గుండుగొలను తదితర ప్రాంతాల్లో జనసంచారం ఎక్కువగా ఉండే రద్దీ రోడ్లలో ఖాళీ ప్రదేశాల వద్ద కోడి పుంజులను ఉంచి అమ్మకాలు చేస్తున్నారు. కాకి, నెమలి, డేగ, పచ్చకాకి, సేతువ తదితర జాతులు, వివిధ రంగుల్లో వీరి వద్ద అందుబాటులో ఉంటున్నాయి. పుంజు రంగు, ఎత్తు, బరువును బట్టి ఒక్కో పుంజు రూ.3 వేల నుంచి రూ.10 వేల ధర పలుకుతున్నాయి. రోజుకో చోట విక్రయం స్థానికంగా పందేల కోసం సిద్ధం చేసే పుంజుల ధర అధికంగా ఉంటోంది. వాటికి అందించే ఆహారం, శిక్షణను బట్టి ఒక్కొక్క పుంజు రూ.25 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతాయి. నెల్లూరు పరిసర ప్రాంతాల నుంచి తెచ్చే పుంజులు ఇక్కడి పుంజులకు ఏమాత్రం తీసిపోని విధంగా మంచి సైజు, రంగుల్లో ఉంటున్నాయి. ఇక్కడ పెంచే పుంజులతో పోలిస్తే నెల్లూరు ప్రాంత పుంజుల ధర తక్కువగా ఉండటంతో పందేల రాయుళ్లు వాటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. పుంజుల్ని అమ్ముతున్న చోటే డింకీ పందాలు కట్టి బాగున్న పుంజులను ఎంపిక చేసుకుని తీసుకుంటున్నారు. పందెంలో అదృష్టం కలిసొస్తే తమకు పెద్ద పండుగేనంటున్నారు. తెచ్చిన పుంజులు మూడు నాలుగు రోజుల్లో అమ్ముడవుతున్నాయని.. ఒక్కోరోజు ఒక్కోచోట అమ్మకాలు చేస్తుంటామని నెల్లూరుకు చెందిన కోళ్ల పెంపకందారుడు వెంకటరమణ తెలిపాడు. నాలుగేళ్లుగా ఏటా వస్తున్నామని, అమ్మకాలు బాగానే ఉంటున్నాయని వివరించాడు. హోటళ్లు.. లాడ్జిలకు డిమాండ్ కోళ్ల కుంభమేళాగా పిలిచే సంక్రాంతి పందేలకు పశ్చిమ గోదావరి జిల్లాలోని హోటళ్లు, లాడ్జిలకు డిమాండ్ ఏర్పడింది. ఈ ఏడాది నవంబర్ నెల నుంచి హోటల్స్, లాడ్జి రూమ్‌ల ముందస్తు బుకింగ్ ముమ్మరంగా సాగుతోంది. బెంగళూరు, హైదరాబాద్, వరంగల్, ఏపీలోని విశాఖ, విజయవాడతోపాటు ఇతర రాష్ట్రాల నుంచి సైతం పెద్దఎత్తున పందేలరాయుళ్లు, పందేలను వీక్షించేందుకు వివిధ వర్గాల ప్రజలు ఇక్కడకు తరలి వస్తుంటారు. దీంతో అతిథుల కోసం ఈ ప్రాంతాల వారు జిల్లాలోని హోటల్స్‌లో బస ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ దృష్ట్యా సాధారణ లాడ్జిలతోపాటు పేరొందిన హోటల్స్‌లో రూమ్‌లను జనవరి 10 నుంచి 20వ తేదీ వరకు అడ్వాన్స్‌గా బుక్ చేస్తున్నారు. జిల్లాలోని భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం పట్టణాలతో పాటు ఆచంట, పెనుగొండ, అత్తిలి తదితర ప్రాంతాల్లోని హోటల్స్, లాడ్జిలలో ఇప్పటికే 70 శాతం రూమ్‌లు బుక్ అయ్యాయి. మరో వారం రోజులు గడిస్తే రూమ్‌లు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. రూమ్ రూ.5 వేల నుంచి రూ.10 వేలు సంక్రాంతికి అడ్వాన్స్‌గా బుక్ చేసే హోటల్స్ రూమ్‌ల ధరలు ఆయా హోటల్స్ బట్టి 24 గంటలకు రూ.5 వేల నుంచి డిమాండ్ బట్టి రూ.10 వేల వరకు ఉంటోంది. ధర ఎక్కువైనా రూమ్ కచ్చితంగా ఉండాలనే ఉద్దేశంతో ముందస్తుగానే దూర ప్రాంతాల నుంచి వచ్చే వారికోసం బుక్ చేసుకుంటున్నారు. రాజకీయ, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు దిగే డీలక్స్, సూట్ రూమ్‌లకు సైతం డిమాండ్ భారీగా పెరిగింది. పండుగ నాలుగు రోజుల ప్యాకేజీ రూపంలో అయితే రూమ్‌ను బట్టి రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటోంది. 24 గంటలకు అయితే రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ధర పలుకుతున్నాయి. -
బెంబేలెత్తించిన టోర్నడో
సాక్షి, భీమవరం/ఆకివీడు: మిచాంగ్ తుపాను తీరం దాటే సమయంలో సముద్ర తీరంపైకి దూసుకొచ్చిన టోర్నడో (సుడిగాలులు) సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో టోర్నడో ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని తీరప్రాంత సమీప గ్రామాలపై విరుచుకుపడి బీభత్సం సృష్టించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. టోర్నడోలు అమెరికాను వణికిస్తుంటాయని వినడమే తప్ప.. మన ప్రాంతంలో ఎన్నడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. వాహనాలను సైతం ఎగరేశాయి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాల్లో మంగళవారం రాత్రి టోర్నడో బీభత్సం సష్టించింది. ట్రాక్టర్లు, వరి కోత మెషిన్లు, ఇతర వాహనాలు సుడిగాలుల్లో చిక్కుకుని పైకి ఎగిరి కొంతసేపటికి నేలపై పడ్డాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం, వీరవాసరం, పాలకొల్లు, ఆచంట, ఆకివీడు మండలాల్లో టోర్నడో బీభత్సం సృష్టించి భారీగా ఆస్తి నష్టం కలగజేసింది. దాని ధాటికి నరసాపురం మండలం లిఖితపూడి, సరిపల్లి, మల్లవరంలంక గ్రామాల్లో 20 వరకు విద్యుత్ స్తంభాలు పడిపోగా.. 200కు పైగా కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. రోడ్ల వెంబడి చెట్లు నేలకొరిగాయి. వీరవాసరం, అదే మండలంలోని వడ్డిగూడెం, తోలేరు గ్రామాల్లో 40 విద్యుత్ స్తంభాలు, 250 వరకు కొబ్బరి చెట్లు విరిగిపడ్డాయి. 40 ఎకరాల్లో అరటి పంట ధ్వంసమైంది. పాలకొల్లు మండలం శివదేవుని చిక్కాల, పరిసర గ్రామాల్లో 200 కొబ్బరి చెట్లు, 41 విద్యుత్ స్తంభాలు, 4 ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి. ఆచంట మండలం పెదమల్లం, సిద్ధాంతం గ్రామాల మధ్య ఏర్పడిన టోర్నడో వృక్షాలను నేలకూల్చింది. ఆకివీడు మండలంలోని పలు గ్రామాల్లో ఇళ్లపై రేకులు ఎగిరిపోయాయి. ట్రాక్టర్లు, ఇతర వాహనాలు సైతం పక్కకు పడిపోయాయి. కాగా.. కాకినాడ జిల్లాలోనూ టోర్నడో బీభత్సం సృష్టించింది. గండేపల్లి మండలం మల్లేపల్లి జాతీయ రహదారి పక్కన పెట్రోల్ బంక్ ఎదురుగా సుడిగాలి ధాటికి హైవేపై వెళ్తున్న ఆటోలు గాలిలో ఎగిరాయి. సుడిగాలి రావడంతో బంక్‌లోని ఉద్యోగులు భయంతో పరుగులు తీశారు. అన్నవరం రైల్వే గేటు సమీపంలో ఆగివున్న వాహనాలు ఎగిరిపడ్డాయి. ఆటోలో ఉన్న ఇద్దరికి గాయాలయ్యాయి. గేటుపక్కనే ఉన్న ఓ ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి. భారీ వృక్షాలు నేలకొరిగాయి. అన్నవరం క్షేత్రంలోనూ సుడిగాలి బీభత్సం సృష్టించింది. ఘాట్రోడ్లో వృక్షాలు నేల కూలాయి. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని వై.జంక్షన్, వీఎల్ పురం, మోరంపూడి, హుకుంపేట, ప్రకాశం నగర్, దానవాయిపేట, ఆర్ట్స్ కళాశాల పరిసరాల్లో టోర్నడో కలకలం సృష్టించింది. నివాసాలు, దుకాణాలపై రేకులు గాల్లోకి ఎగిరాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేలకొరిగాయి. పీడన వ్యత్యాసమే కారణం తుపాను భూమికి చేరువగా తీరం దాటడం వల్ల టోర్నడో ఏర్పడేందుకు కారణమైందని నిపుణులు అంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో తీరప్రాంతం వెంబడి పెద్దఎత్తున ఆక్వా చెరువుల విస్తరించి ఉన్నాయి. సాధారణంగా నీరు, నేల ఉన్న ప్రదేశాల్లో ఉష్ట వ్యత్యాసాల వల్ల పీడన వ్యత్యాసం ఏర్పడుతుందని పేర్కొంటున్నారు. వాతావరణంలో అసాధారణ మార్పులు ఏర్పడినప్పుడు గాలి పొరలు విరూపణం (షియర్) చెంది పీడనంలో కదలికలు వచ్చి సుడులు (ఎడ్డీ ఫ్లో) ఏర్పడుతుంటాయి. ఇవి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో ఉంటాయి. చుట్టుపక్కల పీడన పరిస్థితులను బట్టి 150 కిలోమీటర్లు వేగంతోనూ కదులుతుంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. మిచాంగ్ తుపాను భూమికి చేరువగా తీరం దాటడం, తీరం వెంబడి ఉన్న అనుకూల పరిస్థితులతో టోర్నడో (సుడిగాలులు) ఏర్పడ్డాయని చెబుతున్నారు. వాతావరణంలో అసాధారణ మార్పులతో.. సముద్ర తీర ప్రాంతానికి ఆనుకొని తుపాను పయనించి తీరం దాటడంతో వాతావరణంలో అసాధారణ మార్పులు తలెత్తి టోర్నడోలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో గాలుల వేగం గంటకు 90 నుంచి 110 కిలోమీటర్లు వరకు ఉంది. గతంలో కొల్లేరు సరస్సులో సుడిగాలులు వచ్చాయి. – డాక్టర్ పి.రఘురామ్, అసోసియేట్ ప్రొఫెసర్, ఎస్ఆర్కేఆర్ ఇంజినీరింగ్ కళాశాల, భీమవరం -
పచ్చళ్లు పెట్టే వనితల ఊరు ఉసులుమర్రు
గోదావరి జిల్లా వాసులంటే తిండితో చంపేస్తారురా బాబు అంటుంటారు. గోదావరి తీరాన వంటకాలకు ప్రసిద్ధి చెందిన పల్లెలు చాలానే ఉంటాయి. కండ్రిగ పాలకోవా, నగరం గరాజీలు, ఆత్రేయపురం పూతరేకులు, అంబాజీపేట ΄పొట్టిక్కలు... ఉసులుమర్రు పచ్చళ్లు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని వశిష్ట గోదావరి గట్టుకు ఆనుకుని తణుకుకు అరగంట ప్రయాణ దూరంలో ఉండే ఆ గ్రామం ఎప్పుడూ సముద్రంలో ఉప్పునూ చెట్టు మీద కాయను కలిపి పచ్చళ్లు పెట్టడంలో నిమగ్నమై ఉంటుంది. వ్యక్తిగతంగా కావచ్చు, యజమాని కింద కావచ్చు ఆ గ్రామంలోని స్త్రీలలో ముప్పై, నలభై శాతం పచ్చళ్లు పెట్టడంలో ఉపా ధి ΄పొందుతూ ఉంటారు. వీరితో పా టు ఇరవై శాతం మగవారు ఈ పనిలో ఉంటారు. ఇక్కడి స్త్రీల చేతికి రుచి ఎక్కువ. అందుకే ఉసులుమర్రు పచ్చళ్లకు గిరాకీ ఎక్కువ. 40 సంవత్సరాల క్రితం నుంచి ఉసులుమర్రి జనాభా 2500 మాత్రమే. వీరిలో ఐదు వందల మంది స్త్రీలకు పైగా, మూడు వందల మంది పురుషులకు పైగా అందరూ కలిసి దాదాపు 1000 మంది వరకు సీజన్లో పచ్చళ్లు పెట్టడంలో బిజీగా ఉంటారని అంచనా. ఏప్రిల్ నుంచి జూన్ వరకు చిన్న, పెద్ద, ముసలి అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్షణం తీరిక లేకుండా రేయింబవళ్లు అనేక రకాల పచ్చళ్లు పెడుతుంటారు. ఊరు ఊరంతా ఏ కంపెనీ కోసం, ఏ యజమాని కోసం ఎదురు చూడకుండా స్వయం ఉపా ధిని కల్పించుకున్నారు. 40 సంవత్సరాల క్రితం పిళ్లా పెదకాపు కుటుంబం వారు మొదటిసారిగా పచ్చళ్లను తయారు చేయడం మొదలుపెట్టారు. మంచి లాభాలు, మిగులు ఉండడంతో వారిని చూసి వారి బంధువులు మొదలుపెట్టారు. అలా ఒకరిని చూసి మరొకరు అదే పనిని నేర్చుకుని స్వంతంగా తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. 200 కుటుంబాలకు పైగానే ఈ చిరు వ్యాపా రాన్ని చేస్తున్నారు. ఇప్పుడు తయారీలో మూడోతరం నిమగ్నమైంది. ఇవీ ప్రత్యేకం టమాటా, ఉసిరి, అల్లం, మాగాయి, ఆవకాయ, గోంగూర, కాలీఫ్లవర్, పండుమిరప, నిమ్మ తదితర పచ్చళ్ళకు ఉసులుమర్రు ప్రత్యేకం. పచ్చళ్ల తయారీలో మహిళలకు కనీసం 300 రోజు కూలీ దక్కుతోంది. అన్ని రకాల పచ్చళ్ళు పెట్టాలంటే రూ.5 లక్షలు పెట్టుబడి అవుతుంది. ఖర్చులు పొ గా మిగిలే లాభంతో తమకెంతో సంతోషంగా ఉంటుందంటున్నారు. ఈ ఒక్క పల్లెలో అన్ని రకాల పచ్చళ్లూ కలిసి ఏడాదికి 500 టన్నులు పచ్చళ్లు పడుతుంటారని అంచనా. టన్ను పచ్చడి రూ.2.50 లక్షలు వంతున విక్రయిస్తుంటారు. ఈ లెక్కలను పరిగణనలోకి తీసుకుంటే రూ.10 నుంచి రూ.12 కోట్లు. మహిళలు ఇళ్లవద్ద పచ్చళ్లు పెడితే పురుషులు మాత్రం ఏడెనిమిది నెలలపా టు ఊళ్లు తిరుగుతూ చివరిడబ్బా అమ్మేశాక మాత్రమే ఇంటికి తిరిగొస్తారు. కుటుంబాన్ని వదిలి ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో, వరంగల్, నల్గొండ, బోధన్, హైదరాబాద్, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, ఖమ్మం, మిరియాలగూడ, అశ్వారావుపేట తదితర ప్రాంతాల్లో విక్రయిస్తుంటారు. ఏడాది ΄పొడవునా నిల్వ ఉసులుమర్రు ఆవకాయ అంటే ఏడాది ΄పొ డవునా నిల్వకు తిరుగుండదంటారు. ముదురు మామిడికాయలను ముక్కలుగా కోసి ఆరబెట్టి ఆవపిండి, మెంతులు, ఎర్రపచ్చడి కారం, వేరుశెనగ లేదా నువ్వుల నూనె కలిపి మూడు రోజుల తరువాత జాడీలో పెడతారు. ఉప్పు, కారం, ఆవపిండి కలిపిన ముక్కలను డ్రమ్ములో వేసుకుని ఎక్కడ అవసరమైతే అక్కడే వారి కళ్లెదుటే అన్నీ కలిపి ఇవ్వడంతో నమ్మకం రెట్టింపు అయ్యిందంటారు. వేసవిలో పండుమిరప, ఉసిరి, ఆవకాయ, గోంగూర, కాకరకాయ పెడతారు. వానాకాలం బ్రేక్ ఇచ్చి మళ్లీ ఆగస్టు నుంచి అల్లం, వెల్లుల్లి, టొమాటో, కాలీఫ్లవర్, కొత్తిమీరలాంటివి పెడతారు. మిక్స్డ్ వెజిటబుల్ అడిగితే పెట్టి ఇస్తారు. నిమ్మకు నిల్వ తక్కువ కాబట్టి తక్కువగా పెడతారు. చికెన్, రొయ్యలతో నాన్‌వెజ్ పచ్చళ్లు కూడా చేసి ఇస్తారు. సరుకును బట్టి లాభం. ఉదాహరణకు డ్రమ్ (200 కిలోలు) పండు మిరప పచ్చడి పట్టడానికి 20 వేలు అవుతుంటే మార్కెట్లో కిలో రూ.250కు అమ్ముతుంటారు. – లక్కింశెట్టి శ్రీనివాసరావు సాక్షి, కాకినాడ ,ఫొటోలు: పంతం వెంకటేశ్వర్లు, పెరవలి అందరూ ఆవకాయ పెట్టుకోరు. బయటి నుంచి తెచ్చుకునేవారు. ఎప్పుడూ ఉంటారు. అలాంటి వారి కోసమే ఆ ఊరి స్త్రీలు ఆవకాయ పెడతారు. మే నుంచి జూన్ వరకూ ఉమ్మడి తూ.గో.జిల్లాలోని ఉసులుమర్రు స్త్రీలు ఆవకాయతో పా టు రకరకాల పచ్చళ్లు పెడుతుంటారు. వాటిని తీసుకుని మగవారు జిల్లాలకు బయలుదేరి నెలల తరబడి అమ్ముతారు. రోజూ ఏదో ఒక పచ్చడి తయారు చేసే ఆ ఊరి స్త్రీలు శ్రమైక జీవన సౌందర్యానికి ప్రతినిధులు. -
పాలిసెట్‌లో మెరిసిన గోదావరి విద్యార్థులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డిప్లొమా సాంకేతిక విద్యకు ఉద్దేశించిన పాలిటెక్నిక్ ఎంట్రన్స్– 2023 (పాలిసెట్)లో గోదావరి జిల్లాల విద్యార్థుల హవా కొనసాగింది. కాకినాడ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన 15 మంది 120కి 120 మార్కులు సాధించి ప్రథమ–ర్యాంకర్లుగా నిలిచారు. మొదటి ర్యాంకును కాకినాడ జిల్లాకు చెందిన గోనెళ్ల శ్రీరామ శశాంక్ సాధించాడు. మే 10న నిర్వహించిన పాలిసెట్ ఫలితాలను రాష్ట్ర సాంకేతిక విద్యా సంచాలకులు సి.నాగరాణి శనివారం విజయవాడలో విడుదల చేశారు. పరీక్ష జరిగిన పది రోజుల్లోనే ఫలితాలను వెల్లడించామని ఆమె చెప్పారు. పాలిసెట్‌కు 1,43,625 మంది హాజరయ్యారని, 1,24,021 మంది (86.35 శాతం) విద్యార్థులు అర్హత సాధించారని చెప్పారు. ఉత్తీర్ణుల్లో 74,633 మంది బాలురు (84.74శాతం), 49,388 మంది బాలికలు (88.90శాతం) ఉన్నట్టు వివరించారు. అత్యధికంగా 10,516 మంది విద్యార్థులు విశాఖపట్నం జిల్లా నుంచి అర్హత సాధించారన్నారు. 120 మార్కులకు 30 మార్కులు (25 శాతం) అర్హతగా పరిగణించామన్నారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు పరీక్షకు హాజరైన అందరినీ ఉత్తీర్ణులుగా ప్రకటించినట్టు వివరించారు. ప్రవేశ పరీక్షలో ఒకే మార్కులు పొందిన విద్యార్థులకు గణితం మార్కుల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించామని, గణితంలోనూ ఒకేలా వస్తే భౌతిక శాస్త్రం మార్కులు, అందులోనూ సమానంగా వస్తే పదో తరగతి మార్కులను పరిగణనలోకి తీసుకున్నామన్నారు. అక్కడా సమాన మార్కులుంటే పుట్టిన తేదీ ఆధారంగా ఎక్కువ వయసున్న వారికి మొదటి ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ర్యాంకు కార్డులను https://polycetap.nic.in/ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 25న వెబ్ కౌన్సెలింగ్ తేదీలను ప్రకటిస్తామని, 29 నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని చెప్పారు. అడ్మిషన్ కోసం విద్యార్థులు వెబ్ అప్లికేషన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. సర్టిఫికెట్ల పరిశీలనకు 39 సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. జూలై 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఈ ఏడాది నుంచి నంద్యాల జిల్లా బేతంచెర్ల, వైఎస్సార్ జిల్లా మైదుకూరు, అనంతపురం జిల్లా గుంతకల్లులో 840 సీట్లతో కొత్తగా మూడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ప్రారంభిస్తున్నామన్నారు. వీటితో కలిపి మొదటి సంవత్సరం విద్యార్థులకు 268 ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో రెండేళ్లు, మూడేళ్లు, మూడున్నరేళ్ల వ్యవధితో కూడిన 31 కోర్సుల్లో 77,177 సీట్లు ఉన్నాయన్నారు. ఈ ఏడాది నుంచి గన్నవరం ప్రభుత్వ కాలేజీలో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్, కంప్యూటర్స్‌లో రెండు కోర్సులు, కాకినాడ బాలికల కళాశాలలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం 33 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో కొత్త కరిక్యులమ్‌తో శిక్షణ ఇస్తున్నామన్నారు. 4 వేల మందికి ప్లేస్‌మెంట్స్ ఈ ఏడాది ప్రభుత్వ కాలేజీల్లో చివరి సంవత్సరం చదువుతున్న 4 వేల మందికి పైగా విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్లు సాధించినట్టు వివరించారు. వార్షిక వేతనం అత్యధికంగా రూ.6.25 లక్షలు, సరాసరి వేతనం రూ.2.50 లక్షలుగా ఉందని చెప్పారు. 84,117 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న విద్యా దీవెన కింద రూ.44.37 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అందుకున్నారని, 79,768 మంది విద్యార్థులు తొలి విడత జగనన్న వసతి దీవెనగా రూ.57.44 కోట్ల ఆర్థిక సాయాన్ని పొందారని తెలిపారు. ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు కార్యదర్శి కేవీ రమణబాబు, జాయింట్ డైరెక్టర్ వి.పద్మారావు, ప్లేస్మెంట్ సెల్ డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ, ఇతర అధికారులు పాల్గొన్నారు. 120 కి120 మార్కులు సాధించిన విద్యార్థులు ♦ గోనెళ్ల శ్రీరామ శశాంక్ (కాకినాడ) ♦ వనపర్తి తేజశ్రీ (తూర్పు గోదావరి) ♦ కొంజర్ల శంకర్ మాణిక్ (తూర్పు గోదావరి) ♦ దువ్వి ఆశిష్ సాయి శ్రీకర్ (తూర్పు గోదావరి) ♦ శీల గౌతమ్ (తూర్పు గోదావరి) ♦ గ్రంధె గీతిక (తూర్పు గోదావరి) ♦ అగ్గాల కృష్ణ సాహితి (తూర్పు గోదావరి) ♦ ఉరింకాల జితు కౌముది (తూర్పు గోదావరి) ♦ పాల గేయ శ్రీ సాయి హర్షిత్ (తూర్పు గోదావరి) ♦ కోటిపల్లి యశ్వంత్ సాత్విక్ (తూర్పు గోదావరి) ♦ కొడవటి మోహిత్ శ్రీరామ్ (పశ్చిమ గోదావరి) ♦ దొంగ శ్రీ వెంకట శర్వణ్ (పశ్చిమ గోదావరి) ♦ కానూరి భాను ప్రకాష్ (పశ్చిమ గోదావరి) ♦ దుద్దుపూడి రూపిక (తూర్పు గోదావరి) ♦ కప్పల వెంకటరామ వినేష్ (తూర్పు గోదావరి) -
అకాల వర్షంతో అన్నదాత ఆక్రందన
-
గోదావరి జిల్లాలో జోరుగా సంక్రాంతి సంబరాలు
-
అభిమాని అత్యుత్సాహం: పవన్ కళ్యాణ్‌కు తప్పిన పెను ప్రమాదం
-
ప్రకృతి అందాలు
-
వాడి తగ్గిన కోడి పందెం
సాక్షి, అమరావతి: సంక్రాంతి కోడి పందేల ముచ్చట గురువారంతో ముగిసింది. ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లోను మూడు రోజుల పాటు పందేలు జరిగాయి. గోదావరి జిల్లాల్లో కోడి పందేలకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పందేల బరుల్లో కోళ్ల హంగామాతో పాటు సమీపంలో పేకాట, గుండాట, కోతాట వంటి జూదం, అనధికార మద్యం షాపులు లెక్కకు మిక్కిలి ఉండేవి. అయితే ఈఏడాది కోడి పందేలు గతానికంటే భిన్నంగా జరిగాయని నిర్వాహకులు చెబుతున్నారు. పోలీసులు గట్టి నిఘాతో జూదానికి బ్రేక్ పడింది. కోడి పుంజులకు కత్తులు కట్టకుండా పందేలు వేసుకోవాలని పోలీసులు సూచించారు. అలా జరపడం వల్ల ఉపయోగంలేదని, కత్తులు కట్టి పందెం వేస్తేనే త్వరగా గెలుపోటములు తేలుతాయని నిర్వాహకులు పట్టుబట్టారు. బరుల వద్ద జూదం, మద్యం విక్రయాలు జరిగితే సహించేది లేదని పోలీసు యంత్రాంగం అల్టిమేటం ఇచ్చింది. దీంతో పందేలు చప్పగా సాగాయని నిర్వాహకులు నిట్టూర్చారు. అయితే కొన్ని చోట్ల చాటుమాటుగా గుండాటలతో పాటు పేకాటలు నిర్వహించారు. మద్యంపై పోలీసులు ఉక్కుపాదం మోపడంతో దూర ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ షాపుల్లో మద్యం కొని తెచ్చుకుని కొందరు బరుల వద్ద సేవించారు. భోగి రోజు మధ్యాహ్నం మొదలై.. కనుమ రోజున ముగిసిన పందేలలో ఈ ఏడాది క్రేజ్ తగ్గిందని, జూదం కూడా తగ్గడం మంచి పరిణామమని గోదావరి జిల్లాలకు చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, కోడి పందెం బరులకు ఆనుకుని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన పకోడి దుకాణాలు, బిర్యాని సెంటర్లు, కూల్‌డ్రింక్ షాప్‌లతో పాటు కార్లు, బైక్ పార్కింగ్‌లతో భారీ ఎత్తున వ్యాపారం జరిగింది. పందేలు తిలకించిన పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాల్లో కోడి పందేలను చూసేందుకు గత కొన్నేళ్లుగా క్రమం తప్పకుండా వస్తున్న తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈసారి కూడా వచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో జరిగిన కోడి పందేలను ఆయన తిలకించారు. ఉండి–భీమవరం రోడ్డు పక్కన ఉన్న కోట్ల ఆడిటోరియంలో ఆయనకు ప్రత్యేక బస ఏర్పాటు చేశారు. సినీ నటుడు శ్రీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు గోదావరి జిల్లాలకు వచ్చి మూడు రోజులపాటు పండుగను సరదాగా గడిపారు. -
పండుగంటే భీమవరమే..
సాక్షి, అమరావతి: ట్వంటీ ట్వంటీ(2020) కోడి పందాలకు ఉభయ గోదావరి జిల్లాలు ‘బరి’ గీస్తున్నాయి. 2020 క్రికెట్ మ్యాచ్‌ను తలదన్నే రీతిలో ఉత్కంఠ రేపే ఈ పందాలకు జోరుగా ఏర్పాట్లు సాగుతున్నాయి. ప్రత్యర్థి కోడిని గురి చూసి కొట్టేందుకు పందెంరాయుళ్లు తదేక దీక్షతో కసరత్తు చేస్తున్నారు. కోడి పందాలను అడ్డుకునేందుకు ప్రతి సంవత్సరం పోలీసులు గట్టి ప్రయత్నాలు చేయడం.. చివరికి చేతులెత్తేయడం పరిపాటిగా మారిపోయింది. ఈసారి పందాలను ఎలాగైనా అడ్డుకుంటామని పోలీసులు చెబుతున్నారు. ముందస్తు బైండోవర్లు, హెచ్చరికలు జారీ చేస్తున్నప్పటికీ పందాల నిర్వాహకులు మాత్రం ధీమాగానే ఉన్నారు. తమ ఏర్పాట్లు తాము చేసుకుంటున్నారు. సంక్రాంతి పండుగ సమయంలో మూడు రోజులపాటు జరిగే పందాలకు ఎప్పటిలాగే బరులు సిద్ధం చేస్తున్నారు. ఊరూవాడా దద్దరిల్లేలా.. సంక్రాంతికి నిర్వహించే కోడిపందాలే గోదావరి జిల్లాల్లో స్పెషల్ ఈవెంట్. గతంలో సరదా కోసం, సాంప్రదాయంగా కోళ్లను బరిలో దించేవారు. ఇప్పుడు బెట్టింగ్‌ల కోసం పందాలు నిర్వహించడం ఆనవాయితీగా మారిపోయింది. తొలినాళ్లలో సాంప్రదాయంగా మొదలైన కోడి పందాలు 1996 నుంచి రూపుమార్చుకున్నాయి. పెద్ద ఎత్తున బెట్టింగ్‌లకు తెరతీయడంతో ఏటా కోడి పందాల్లో రూ.కోట్లాది చేతులు మారుతున్నాయి. ఈసారి మరింత భారీగా పందాలు నిర్వహించేందుకు గోదావరి జిల్లాల్లో సన్నాహాలు చేస్తున్నారు. కోడి పందాలు చూడటానికి వచ్చిన ప్రజలు (ఫైల్) బంధుమిత్రులకు ప్రత్యేక ఏర్పాట్లు కోడి పందాలను చూసేందుకు బంధువులతోపాటు పొరుగు ప్రాంతాల్లోని మిత్రులు, ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తారు. ఇక్కడికి వచ్చే అతిథులు సైతం సంక్రాంతి ఎప్పుడొస్తుందా? అని ఉత్కంఠతో ఎదురు చూస్తుంటారు. తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. పండుగంటే భీమవరమే.. సంక్రాంతి సంబరాలు.. కోడి పందాలు అంటే వెంటనే గుర్తొచ్చేది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరమే. సంక్రాంతి సమయంలో రాజకీయ, పారిశ్రామిక రంగాలతోపాటు పలువురు ప్రముఖుల దృష్టి భీమవరంపైనే ఉంటుంది. ప్రతిఏటా పండుగకు పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల్లో ఎక్కువ మంది భీమవరం వస్తుంటారు. కోడి పందాలు, సంక్రాంతి ప్రస్తావన వస్తే సినిమా, టీవీలతోపాటు పాటల్లోనూ భీమవరం ప్రస్తావన లేకుండా ఉండదంటే అతిశయోక్తి కాదు. మూడు రోజుల సంబరాలు.. ఖరీదైన కార్లు.. డబ్బుల మూటలు.. చంకలో కోడి పుంజులు.. పొలాల్లో షామియానాలు.. టెంట్లు.. కళ్లు మిరుమిట్లు గొలిపే ఫ్లడ్‌లైట్ల కాంతులు.. కత్తులు దూసే పందెం కోళ్లు.. బరుల చెంతనే పేకాట, గుండాట.. కోడి పకోడి, కోడి పలావ్‌లతో విందు.. విచ్చలవిడిగా మద్యం.. సేద తీరేందుకు ఘనమైన ఏర్పాట్లు. ఇదీ గోదావరి జిల్లాల్లో కనిపించే సంక్రాంతి సందడి. మూడు రోజులపాటు జరిగే ఈ సంబరాలకు ఏడాదంతా కసరత్తు జరుగుతుంది. ప్రత్యేకంగా పుంజులను ఎంపిక చేస్తారు. ఒక్కో పుంజు రూ.5 వేల నుంచి రూ.లక్షకుపైగా ధర పలుకుతుంది. పందెంలో గెలిచిన కోడి దర్జాగా యజమాని భుజం మీదకు చేరితే.. పోరాడి ఓడిన కోడి కూరగా మారిపోతుంది. పందెంలో ప్రాణాలు కోల్పోయిన కోడికి సైతం విపరీతమైన డిమాండ్ ఉంటుంది. దీన్ని కూర వండి, బంధుమిత్రులకు పంపించడం గోదావరి జిల్లాల ప్రజలు స్టేటస్ సింబల్‌గా భావిస్తున్నారు. -
ఆ రుచే వేరబ్బా!!!
గోదావరి జిల్లా వాసులను తియ్యటి అభిమానం, ఆప్యాయతలకు మారు పేరుగా చెప్పుకుంటారు. తియ్యటి ఆత్రేయపురం పూతరేకులు, కాకినాడ కాజా, తాపేశ్వరం మడత కాజా, ధవళేశ్వరం జీళ్లు, గంగరాజు పాల కోవా... ఒక్కో ప్రాంతం... ఒక్కో తీపి వంటకం.తీపి మాత్రమేనా... కారంలోనూ మాకు మేమే సాటి అంటున్నారు... భీమవరం గోపీ పచ్చళ్ల అధినేత గోపాలరాజు. అతిథులకు ఈ పచ్చళ్లతో కమ్మటి భోజనం వడ్డించి ఆదరిస్తున్నారు... గోపీ పచ్చళ్ల గోపాలరావుతో ఈ వారం ఫుడ్ ప్రింట్స్... గోదావరి జిల్లా వాసులకు గౌరవమర్యాదలతో పాటు రుచికరమైన భోజనం వడ్డించడం సంప్రదాయంగా వస్తోంది. బంధువులు, స్నేహితులకు వెజ్, నాన్‌వెజ్ అన్నిరకాల వంటకాలతో భోజనం ఏర్పాటు చేసినప్పటికీ, గోపీ పచ్చళ్లు వడ్డించకపోతే, తృప్తి చెందరు. ఇంటికి వచ్చినవారికి మంచి భోజనం ఏర్పాటు చేయడమనేది సరదాతో కూడిన మర్యాద. పాతికేళ్లుగా... భీమవరం పట్టణానికి చెందిన యరకరాజు గోపాలరాజు (గోపీ) వంటలు చేసేవారు. అప్పట్లో ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కడ వేడుకలు జరిగినా గోపాలరాజు స్వయంగా వంట చేయాల్సిందే. వంటకాలు రుచిగా ఉండటంతో, భోజనం చేసిన వారంతా ‘వంట చాలా బాగుంది’ అని ప్రశంసించేవారు. వంటలతో పాటు పచ్చళ్లు కూడా తయారు చేసేవారు గోపాలరాజు. అందువల్ల చాలామంది ఆయనతో ఊరగాయలు పెట్టించుకునేవారు. క్రమేపీ గోపాలరాజుకు పచ్చళ్ల వ్యాపారం చేయాలనే ఆలోచన కలిగింది. పెద్దగా చదువుకోకపోయినా, వంటలు చేసిన అనుభవాన్ని పెట్టుబడిగా పెట్టాలనుకున్నారు. పాతిక సంవత్సరాల క్రితం 1000 రూపాయల విలువ చేసే సరకులు అరువు తెచ్చి, ఆ డబ్బుకి సరిపడా వస్తువులు తెచ్చి, నాణ్యత పాటిస్తూ రుచికరమైన వెజ్, నాన్ వెజ్ పచ్చళ్లు తయారు చేసి, అమ్మడం ప్రారంభించారు. కొద్ది కాలానికే గోపీ పచ్చళ్ల ఘాటు ఉభయ గోదావరి జిల్లాలకు వ్యాపించింది. దానితో గోపీ పచ్చళ్లకు డిమాండు పెరిగింది. కొన్ని సంవత్సరాల పాటు ఒంటి చేతి మీదే పచ్చళ్లు తయారుచేశారు గోపాలరాజు. ఈ రోజు మరో పదిమందికి ఉపాధి కల్పించారు. చదువుకోకపోయినా, పెట్టుబడి పెట్టే స్థాయి లేకపోయినా, పట్టుదలతో ప్రయత్నిస్తే ఫలితం ఉంటుందని నిరూపించారు గోపాలరాజు. విదేశాలలోని తెలుగువారికి తెలుగువారి ఆవ ఘాటు రుచి చూపించారు, చూపిస్తూనే ఉన్నారు.నాణ్యమైన, తాజా వస్తువులను ఉపయోగిస్తూ, పరిశుభ్రత పాటించడం వల్ల ఎంత కాలం నిల్వ ఉన్నా, రుచి చెడకుండా, ఎర్రటి రంగులో ఏడాది పొడవునా కంటికి ఇంపు కలిగిస్తాయి ఈ పచ్చళ్లు అంటారు గోపీ పచ్చళ్ల అధినేత గోపాలరాజు. బొక్కా రామాంజనేయులు, తెలుగు వారికి ఊరగా యలంటే మహా ప్రీతి. ముఖ్యంగా గోదావరి జిల్లా వాసుల ఇళ్లల్లో పచ్చళ్లు లేకుండా ముద్ద దిగదు. వంటలు చేసిన అనుభవం నాకు ఉపాధి గా మారింది. పచ్చళ్లు కూడా చేయడం ప్రారంభించాను. పాతికేళ్లుగా అదే రుచి, నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నాను. దివంగత నేత వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి ఒకసారి ఓ ప్రముఖ రాజకీయనాయకుడి ఇంట్లో మా పచ్చళ్లు తిని, ‘ఇవి ఎక్కడి పచ్చళ్లు’ అని అడిగి తెలుసుకుని, మెచ్చుకున్నారట. ఆ సంఘటన నా జీవితంలో మరచిపోలేను. యరకరాజు గోపాలరాజు గోపీ పచ్చళ్ల అధినేత నాకు గత 15 ఏళ్లుగా గోపీ పచ్చళ్లతో అనుబంధం ఉంది. వారు నాటి నుంచి నేటి వరకు గోపీ పచ్చళ్లల్లో రుచి, నాణ్యత ఏ మాత్రం తగ్గ లేదు. కమ్మటి నువ్వుల నూనె, మంచి ఘాటు గల మిరప కారంతో ఈ పచ్చళ్లు చాలా రుచిగా ఉంటున్నాయి. భీమవరం వంటి పట్టణంలో ఇటువంటి రుచి గల పచ్చళ్లు తయారుచేసి, అందించడం అభినందనీయం. ద్వారంపూడి సూర్యనారాయణరెడ్డి, -
జన్మభూమి కార్యక్రమంలో సోంత పార్టీ నుంచే నిరసన సెగ
-
గోదారి జీవనం.. దిగజారిన వైనం
దిగజారిన జీవన ప్రమాణాలు పిట్టల్లా రాలిపోతున్న శిశువులు మాతృత్వమే శాపమవుతున్న దుస్థితి భావి పౌరులను పట్టిపీడిస్తున్న రక్తహీనత కుదేలైన వ్యవసాయం పారిశ్రామిక ప్రగతీ అంతంతే గోదావరి జిల్లాల దుస్థితిని వెల్లడించిన సెస్ నివేదిక సాక్షి, అమరావతి : ముక్కుపచ్చలారని శిశువుల్లో పలువురు పిట్టల్లా రాలిపోతున్నారు. మహిళల్లో కొందరు మాతృత్వమే శాపమై అసువులు బాస్తున్నారు. భావి పౌరుల్లో అత్యధికులు రక్తహీనతతో తల్లడిల్లుతున్నారు. అధిక శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయం కుదేలైపోయింది. పరుగులెత్తుతోందని పాలకులు చెబుతున్న పారిశ్రామిక ప్రగతి కుంటుపడింది. ఉన్న ఊళ్లో చేయడానికి చేతి నిండా పనుల్లేక.. పొట్ట చేత పట్టుకుని పెళ్లాం పిల్లలతో కలిసి సుదూర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి దాపురించింది. ఇదీ సామాజిక ఆర్థిక అధ్యయనాల సంస్థ (సెస్) నివేదిక ఆవిష్కరించిన రాష్ట్ర అభివృద్ధి ముఖచిత్రం. విభజన తర్వాత రాష్ట్రంలో పరిస్థితులపై సెస్ సమగ్రంగా అధ్యయనం చేసింది. మానవాభివృద్ధి సూచిలో రాష్ట్రం అధమ స్థానానికి చేరిందని.. జీవన ప్రమాణాలు పూర్తిగా దిగజారాయని స్పష్టం చేసింది. ఇదే విధానాలను కొనసాగిస్తే అధోగతి తప్పదని హెచ్చరించింది. ప్రభుత్వ విధానాల్లో సమూల మార్పులు తెచ్చి.. చిత్తశుద్ధితో అమలు చేయకపోతే జీవన ప్రమాణాలు మరింత దిగజారడం ఖాయమని అభిప్రాయపడింది. ఉభయ గోదావరి జిల్లాల్లోని స్థితిగతులపై సెస్ నివేదిక వెల్లడించిన విషయాలిలా ఉన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా భౌగోళిక విస్తీర్ణం 7,742 చదరపు కిలోమీటర్లు. జనాభా 39.37 లక్షలు. జన సాంద్రత చదరపు కిలోమీటర్‌కు 509. అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాల్లో రెండో స్థానం మన జిల్లాదే. అక్షరాస్యత 74.6 శాతం. 68.6 శాతం మంది ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. 61 శాతం భూమి సాగులో ఉంది. సాగుకు యోగ్యమైన భూమిలో 80 శాతానికి నీటిపారుదల సౌకర్యం ఉంది. పంటల సాగులో 61 శాతం వరి ఆక్రమిస్తుంది. జీఎస్డీపీలో జిల్లా వాటా 8.5 శాతం. వ్యవసాయ రంగంలో జిల్లా వాటా 14 శాతం. పరిశ్రమల రంగంలో వాటా 5.4 శాతం. సేవల రంగంలో వాటా 7.6 శాతం. ప్రతి వెయ్యి మంది శిశువుల్లో 28 మంది మరణిస్తున్నారు. ప్రతి వెయ్యి మంది గర్భిణులకు 80 మంది మరణిస్తున్నారు. 75 శాతం మంది పిల్లలు ఎనీమియా(రక్తహీనత)తో బాధపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లా భౌగోళిక విస్తీర్ణం 10,807 చదరపు కిలోమీటర్లు. జనాభా 51.54 లక్షలు. జన సాంద్రత చదరపు కిలోమీటర్‌కు 477. అత్యధిక జనసాంద్రత ఉన్న జిల్లాల్లో ఈ జిల్లాది మూడో స్థానం. ఏటా 0.50 శాతం జనాభా పెరుగుతోంది. అక్షరాస్యత 71 శాతం. 61.3 శాతం మంది ప్రజల ప్రధాన జీవనాధారం వ్యవసాయం. సాగుకు యోగ్యమైన భూమిలో 64 శాతానికి నీటిపారుదల సౌకర్యం ఉంది. సాగు విస్తీర్ణంలో 66.4 శాతం వరి పంటను సాగు చేస్తారు. జీఎస్డీపీలో జిల్లా వాటా 10.3 శాతం. వ్యవసాయ రంగంలో వాటా 11.7, పారిశ్రామిక రంగం వాటా 9.9 శాతం. ప్రతి వెయ్యి మంది శిశువులకు 35 మంది మరణిస్తున్నారు. ప్రతి వెయ్యి మంది గర్భిణిలలో 74 మంది మరణిస్తున్నారు. మాతా మరణాలు అతి తక్కువ ఉన్న జిల్లా ఇదే. 81 శాతం మంది పిల్లలు ఎనీమియాతో బాధపడుతున్నారు. -
కోడిపందేల సమరం మదలైంది
-
గోదావరి జిల్లాలో పూలస చేప సందడి
-
బరిలో కోళ్లు.. ఢీ కొట్టిన పొట్టేళ్లు
* గోదావరి జిల్లాల్లో కోడిపందాలజోరు * తొలిరోజు రూ.100 కోట్ల పందాలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : భోగి పండుగనాడు గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు జూలు విదిల్చాయి. పందాలు జరిగే బరులన్నీ పందెంరాయుళ్లు, ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్‌లోని పోలీసు ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో పోలీసు పికెట్లను ఎత్తివేయడంతో పందెం రాయుళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక కృష్ణా జిల్లాలో పొట్టేళ్ల పందాలు నిర్వహించారు. నెల్లూరు ఎడ్లబండ్ల పోటీలు సాగాయి. గురువారం రాత్రి పొద్దుపోయే నాటికి ఉభయగోదావరి జిల్లాల్లో రూ.100 కోట్లు చేతులు మారాయనేది ఓ అంచనా. ఇక సంక్రాంతి పర్వదినమైన శుక్రవారం, కనుమ రోజైన శనివారం నాటికి ఈ రెండు జిల్లాల్లో మొత్తం రూ.300 కోట్లపైనే చేతులు మారే అవకాశం కనిపిస్తోంది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి గురువారం పాలకొల్లు బైపాస్ రోడ్డులో కోడిపందేలను తిలకించగా, ‘స్వామి రారా’ డెరైక్టర్ సుధీర్ వర్మ కొణితివాడలో పందాలను చూశారు. సంక్రాంతి పర్వదినమైన శుక్రవారం మరింతమంది సినీ, రాజకీయప్రముఖులు తరలిరానున్నారు. కిక్కిరిసిన భీమవరం, పరిసర గ్రామాలు పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం, సమీప గ్రామాలు జాతర్లను తలపిస్తున్నాయి. వివిధ రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన ఎన్నారైలతో బరులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. గురువారం నాడు భీమవరం పరిసర ప్రాంతాల్లోనే రూ.50 కోట్ల మేర పందాలు జరిగినట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో సుమారు రూ.25 కోట్ల మేర పందేలు జరిగినట్టు అంచనా. మినీ స్టేడియంలా .... అమలాపురం: పదిహేను ఎకరాల సువిశాల స్థలం.. కోడి పందాలు జరిగే బరి చుట్టూ ఐరెన్ ఫెన్సింగ్.. 150 మంది కూర్చునేందుకు వీలుగా వీఐపీ గ్యాలరీ.. 3 వేలమంది పట్టే విధంగా పెవిలియన్.. పందెం కోళ్లు తలపడే దృశ్యాలు కనిపించే విధంగా మూడు పెద్ద ఎల్సీడీ టీవీలు.. ఏర్పాటు చేశారు. కామెంటేటర్లు గొంతు సవరించారు. ఇవి తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం మురమళ్లలో బరి వద్ద దృశ్యాలు. వీఐపీలకు డ్రింకులు, జ్యూస్‌లు, కోస (పందెంలో ఓడిన పుంజు) మాంసాలతో ఆతిథ్యం. ఫుడ్ కోర్టులు వెలిశారుు. ఫ్లడ్‌లైట్లు ఏర్పాటు చేశారు. మరో వైపు కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో పొట్టేళ్ల పందేలు, ఎడ్లబండ్ల పరుగుల పోటీలు వంటివి ఈమారు సంక్రాంతికి అదనపు హంగును చేకూర్చాయి. -
గోదావరిలో కనిపించని సంక్రాంతి సంబరాలు
-
పిచ్చి కుక్క దాడిలో నలుగురికి గాయాలు
రాజమండ్రి: గోదావరి జిల్లాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులపై దాడికి దిగింది. దీంతో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైరవిహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. -
పండుగకు వెళ్లి వచ్చేసరికి.. భారీగా దోచేశారు
రామచంద్రాపురం: దసరా సెలవులకు బంధువుల ఇంటికి వెళ్లి పండుగ చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నవారి ఆనందాన్ని దొంగలు అడియాసలు చేశారు. ఇంటికి తాళాలు వేసి వెళ్లినవారు.. ఇంటికి వచ్చేసరికి తలుపులు బార్లా తెరిచి ఉండటంతో కంగుతినడం వాళ్ల వంతైంది. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం ఉట్రుమిల్లి గ్రామంలో భారీ దొంగతనం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎల్ఐసీ ఏజెంట్ శేషగిరిరావు నాలుగు రోజుల క్రితం కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం వారు ఇంటికి చేరుకునేసరికి తలుపులు పగులగొట్టి..ఇంటిలోని వస్తువులన్నీ చిందరబందరగా ఉన్నాయి. ఇంట్లో ఉన్న రూ.15 లక్షల విలువైన బంగారు, వెండి వస్తువులు కనిపించక పోవడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తుపాను విరాళంగా పింఛన్ల సొమ్మా!
ఉదయగిరి : మండలంలోని టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. హుదూ ద్ తుపాను బాధితులకు తమ వంతు విరాళాలు అందించి సీఎం వద్ద ప్రశంసలు పొందాలని భావించారు. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లు విరాళంగా సొం త డబ్బు కాకుండా సామాజిక పింఛన్లు పొందుతున్న లబ్ధిదారులు ఒక నెల పింఛన్ల మొత్తాన్ని విరాళంగా ఇవ్వాలని డిమాండ్ పెట్టారు. చివరకు ఒక్కొక్క లబ్ధిదారు దగ్గర రూ.100 నుంచి రూ.500 వసూలు చేస్తున్నారు. హుదూద్ తుపాన్ విశాఖపట్టణం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొంత భాగాన్ని అతలాకుతం చేసింది. బాధితుల్ని ఆదుకునే నిమిత్తం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఇతర సంస్థలు రంగంలోకి దిగాయి. వివిధ వర్గాల ప్రజలు వారికి బాసటగా నిలిచారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం తప్పులేదు. అది కనీస ధర్మం కూడా. కానీ కొంత మంది టీడీపీ నాయకులు తమ మెహర్బానీని చాటుకునేందుకు ఐకేపీ, పొదుపు గ్రూపులు, ప్రభుత్వ కార్యాలయాలకు టార్గెట్ నిర్దేశించి చందాలు వసూలు చేస్తున్నారు. తాజాగా ఉదయగిరిలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు పంపిణీ చేసే సామాజిక పింఛన్లలో కొంత మొత్తం వసూలు చేస్తున్నారు. మండలంలో 3,884 మంది పింఛన్ లబ్ధిదారులు ఉండగా ఈ నెలకు సంబంధించి రూ.43.29 లక్షలు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను గురువారం నుంచి పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పంపిణీకి శ్రీకారం చుట్టారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు ఈ నెలకు సంబంధించిన సామాజిక పింఛన్ల మొత్తాన్ని హుదూద్ బాధితులకు ఇవ్వాలని ప్రతిపాదించారు. కానీ దీన్ని కొంతమంది అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామస్థాయి నేతలు వ్యతిరేకించడంతో ప్రతి పింఛన్‌దారు నుంచి రూ.100 తీసుకోవాలని నిర్ణయించారు. దీంతో గురువారం పంపిణీ జరిగిన బిజ్జంపల్లి, అయ్యవారిపల్లిల్లో ఈ మేరకు మినహాయించినట్లు సమాచారం. మండలంలోని మిగతా పంచాయతీల్లో విరాళాల పంచాయితీ వ్యవహారం సాయంత్రం వరకు సాగడంతో గురువారం పంపిణీ కాలేదు. శుక్రవారం పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక్కడ కూడా రూ.100 నుంచి రూ.500 వసూలు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. పింఛన్‌దారుల పరిస్థితులు, గ్రామ పరిస్థితులను అంచనా వేసుకుని అక్కడ చోటు చేసుకునే పరిస్థితులను పరిగణలోకి తీసుకొని వసూళ్ల మొత్తాన్ని నిర్ణయించుకోవాల్సిందిగా మండల స్థాయి టీడీపీ నేతలు పంచాయతీ కార్యదర్శులకు, గ్రామస్థాయి నేతలకు సూచించినట్లు సమాచారం. దీనికి స్థానిక నేతలు రూ.200 నుంచి రూ.1000కు పింఛను పెంచింది తమ ప్రభుత్వమేనని, మీరు కాదంటే వచ్చే నెల నుంచి మీకు పింఛను ఉండదని బెదిరించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మండలంలో రూ.5 లక్షలకు పైగా ఒక్క పింఛన్‌దారుల నుంచే వసూలు చేయాలని టార్గెట్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉపాధి హామీ, ఐకేపీ, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా టార్గెట్లు నిర్దేశించారు.ఈ విషయమై ఎంపీడీఓ ఫణి పవన్‌కుమార్‌ను వివరణ కోరగా విరాళాల వసూలు తనకు తెలియదని, ఎక్కడైనా జరిగి ఉంటే విచారించి సంబంధిత కార్యదర్శులపై చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రాణాలకు ముప్పయినా ఖర్చు తప్పడమే ముఖ్యం
మలికిపురం :నేల పొరల నుంచి వెలికితీసే గ్యాస్‌కు వెల కట్టగలం. దాన్ని తరలించడానికి వేసే లోహపు పైపులకు ధర నిర్ణయించగలం. కానీ..దేశంలోని సంపదనంతా వెచ్చించినా పోయిన ఒక్క ప్రాణాన్ని తిరిగి పోయగలమా? అది మానవాళికి అసాధ్యం. అలాంటప్పుడు ప్రాణాలను ఎంత అపురూపంగా పరిగణించాలి? వాటికి ముప్పు వాటిల్లకుండా ఎంత ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి? దురదృష్టవశాత్తు కోనసీమలో కార్యకలాపాలు సాగిస్తున్న చమురు సంస్థలకు ఈ దృష్టే లోపించింది. అవి ధనానికిచ్చే ప్రాధాన్యాన్ని మానవ ప్రాణాలకు ఇవ్వడం లేదు. అందుకే కాలం చెల్లిన పైపులైన్లతో క్షణమైనా ఉత్పాతం జరిగే అవకాశం ఉందని తెలిసినా.. దండగమారి ఖర్చు అన్న వైఖరితో నిర్లక్ష్యం చేస్తున్నాయి. వారి నిర్లక్ష్యంపై కొరడా ఝుళిపించాల్సిన రాష్ట్ర ప్రభుత్వంలోనూ స్పందన కొరవడుతోంది. వారి తప్పిదాలకు మూల్యం అమాయకులు చెల్లించాల్సి వచ్చింది. తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం 16 మందిని బలిగొన్న గెయిల్ గ్యాస్ పైపులైన్ పేలుడుకు ప్రధాన కారణం.. కాలం చెల్లిన ఆ పైపులైన్‌ను మార్చకుండా మరమ్మతులతో కాలక్షేపం చేయడమే. తాటిపాక నుంచి విజయవాడకు 15 ఏళ్ల క్రితం వేసిన ఆ పైపులైన్ నిడివి 250 కిలోమీటర్ల పైనే. దీనితో కేజీ బేసిన్లో అనేక గెయిల్ పైప్‌లైన్లూ శిథిలావస్థకు చేరాయి. అయితే భారీ వ్యయంతో కొత్తగా లైన్లు వేయడం దండగ అనుకుంటున్న గెయిల్ పాత లైన్లతోనే నెట్టుకొస్తోంది. తాటిపాక-విజయవాడ పైపులైన్‌ను కొత్తగా వేయడానికి రూ.1000 కోట్లు పైనే ఖర్చవుతుంది. ఆ మొత్తం వెచ్చించడానికి ఇచ్ఛగించని గెయిల్ పైపులైన్ దుస్థితిని పసిగట్టేందుకు సెన్సర్లు కలిగి, రింగులా ఉండే ‘పిగ్’ అనే పరికరాన్ని వాడుతూ చేతులు దులుపుకొంటున్నారు. 18 అంగుళాల వెడల్పు గల తాటిపాక - విజయవాడ పైపులైన్లో రూ.40 కోట్ల విలువైన పిగ్‌ను వినియోగిస్తోంది. పైపులైన్లో గ్యాస్‌తో పాటు ఎంత దూరమైనా పయనించే పిగ్ ఎక్కడైనా దెబ్బ తిన్న భాగాలుంటే గుర్తిస్తుంది. ఆ సమాచారం మేరకు గెయిల్ అధికారులు పైపులైన్ దెబ్బతిన్న చోట కట్ చేసి మరమ్మతులు చేయిస్తున్నారే తప్ప, కొత్త పైపులైన్ వేయడం లేదు. 18 అంగుళాల పైపులైన్లో వాడే పిగ్ రూ.40 కోట్లు కాగా పది, 12 అంగుళాల పైపులైన్లలో వాడేది రూ.పది కోట్లుంటుంది. పిగ్‌లను వాడుతున్న కొద్దీ పైపులైన్ లోపాలను పసిగట్టడంలో వాటి సామర్థ్యం క్షీణిస్తుంది. అంటే కాలం చెల్లిన పైపులైన్లలో సామర్థ్యం తగ్గిన పిగ్‌లను వినియోగించినా లోపాలను గుర్తించే అవకాశం ఆట్టే ఉండదన్న మాట! అంటే..గెయిల్ తన ధనం ఖర్చు కాకుండా జనం ప్రాణాలతో చెలగాటమాడుతోందన్న మాట! ఈ చెలగాటానికి తక్షణం అడ్డుకట్ట వేయాలని కోనసీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. కొత్త పైపులైన్ వేసే వరకూ గ్యాస్ సరఫరాను నిలిపివేయాలంటున్నారు. అంతగా అవసరమైతే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసుకోవాలే తప్ప.. తమ కంటికి కునుకునూ, ప్రాణాలకు హామీనీ, ఆస్తులకు భద్రతనూ కరువు చేసే పైపులైన్లను వినియోగించరాదంటున్నారు. -
గోదారికి ఆ దరి.. అభిమాన ఝరి
‘పశ్చిమ’లో జగన్‌పై వెల్లువెత్తిన జనాదరణ ‘తూర్పు’ పర్యటనలో అనివార్యమైన జాప్యం సాక్షి, కాకినాడ : పురపోరు సందర్భంగా ‘జనభేరి’ మోగిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్రెడ్డిపై పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజల అభిమానం వరద గోదారిలా వెల్లువెత్తుతోంది. ఆయనకు అడుగడుగునా నీరాజనాలు పడుతుండడంతో పర్యటనలో తీవ్ర జాప్యం అనివార్యమవుతోంది. ముందు నిర్ణయించిన ప్రకారం జగన్ పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగించుకొని, ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు కొవ్వూరు మీదుగా రాజమండ్రి చేరుకోవాల్సి ఉంది. అయితే పశ్చిమగోదావరి జిల్లాలో జగన్ నిర్వహిస్తున్న రోడ్ షోలకు అపూర్వ స్పందన లభిస్తోంది. ప్రతి చోటా ప్రజలు తమ అభిమాన నేతను చూసేందుకు పరవళ్లు తొక్కుతున్నారు. దీంతో పర్యటన ముందు నిర్ణయించినట్టు కాక.. గంటల కొద్దీ ఆలస్యంగా సాగుతోంది. శనివారం నాటి పర్యటన ముందు రూపొందించిన షెడ్యూల్ ప్రకారం కాక ఆరుగంటలకు పైగా ఆలస్యంగా జరిగింది. దాంతో ఆదివారం కూడా జగన్ పర్యటన పూర్తిగా పశ్చిమ గోదావరి జిల్లాలోనే జరపక తప్పడం లేదు. తూర్పు గోదావరి జిల్లాకు ఆయన రాక ఒకరోజు ఆలస్యం కానున్నా.. పర్యటన మాత్రం ముందు నిర్ణయించిన ప్రాంతాల్లోనే మూడురోజుల పాటు జరగనుంది. -
ఎమ్మెల్యే సాక్షిగా కోడి పందేలాట
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కోడి పందేలాట... ఆ పేరు వింటేనే పశ్చిమ గోదావరి జిల్లా గుర్తుకు వస్తుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా అక్కడ పల్లెపల్లెనా కోడి పందేలు జాతరను తలపిస్తాయి. వినోదం మాటున సాగే జూదమది. కోళ్లకు కత్తులు కట్టి లక్షలకు లక్షలు బెట్టింగ్ కాసే సంస్కృతి మన జిల్లాకూ పాకింది. స్వయానా టీడీపీ ఎమ్మెల్యే తన సొంత ఊళ్ల్లోనే ఈ పందేరానికి తెరలేపారు. కోడి పందేలాటకు ఆయనే సారథ్యం వహించి... దగ్గరుండి మరీ పందెం రాయుళ్ల పోటాపోటీని కళ్లారా చూసి పండుగ జరుపుకున్నారు. ఏకంగా భీమవరంను తలపించేలా జిల్లాలోని ఎలిగేడు మండలం శివపల్లిలో సంక్రాంతి పండుగ రోజున కోడి పందేలు జోరుగా సాగాయి. గతంలోనూ ఇక్కడ కోడి పందేలు ఆనవాయితీగా నిర్వహిస్తారనే ప్రచారం ఉన్నప్పటికీ... ఈ సారి ఆంధ్రాతో పోటీ పడ్డట్లుగా పందెంరాయుళ్లు బరిలోకి దిగడం... వేలకు వేల నోట్ల కట్టలు కుమ్మరించిన తీరు అందరినీ విస్మయపరిచింది. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు, శివపల్లికి సర్పంచ్‌గా ఉన్న ఆయన సోదరుడు శ్యాంసుందర్‌రావు దగ్గరుండి ఈ పోటీల నిర్వహణలో పాలు పంచుకున్నారు. ఏకంగా బడా నేతలే బరిలో ఉండడంతో జిల్లా పోలీసు యంత్రాంగం సైతం అటువైపు కన్నెత్తి చూడలేదు. స్వయానా ఎమ్మెల్యే సారథ్యం వహించడంతో తమకు అడ్డూ అదుపేం లేనట్లు పందెంరాయుళ్లు రెచ్చిపోయారు. దీంతో భారీ మొత్తంలోనే బెట్టింగ్‌లు జరిగాయి. కనీసం రూ.3 వేల నుంచి లక్ష రూపాయల వరకు పందెం కాసేందుకు పందెంరాయుళ్లు పోటీ పడ్డారు. ఆ ఒక్కరోజునే కోటి రూపాయలకు పైగా చేతులు మారినట్లు అంచనాలున్నాయి. పక్కాగా సమాచారం అందడంతో స్థానిక పోలీసులు అటువైపు వెళ్లేందుకు ప్రయత్నించినప్పటికీ... ఉన్నతాధికారుల నుంచి అప్పటికప్పుడు వచ్చిన ఆదేశాలతో మార్గమధ్యం నుంచే వెనుదిరిగినట్లు తెలిసింది. దీంతో పందెం రాయుళ్లకు పొద్దంతా ఆడినంత ఆటగా పందేలాట కొనసాగింది. కాళ్లకు కత్తులు కట్టిన కోళ్లు... నెమలి, పర్ల పేర్లతో కోడిపుంజులు... చేతిలో వెయ్యి రూపాయల నోట్ల కట్టలతో పందెంరాయుళ్లు.. ఎటు చూసినా అదే కోలాహలం. వేలాది మంది పందెం రాయుళ్లు.. పోటీలకు చూసేందుకు వచ్చిన జనంతో శివపల్లిలో జాతర వాతావరణం కనిపించింది. గ్రామ శివారులో మూడు చోట్ల బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. ఒక్కో బరిని వెయ్యి మందికి పైగా చుట్టుముట్టారు. పిల్లలు మొదలు పెద్దలు... ఉద్యోగులు మొదలు రాజకీయ నాయకులందరూ ఈ పోటీలకు ఎగబడ్డారు. కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్, నిజామాబాద్, ఖమ్మం, కృష్ణా, హైదరాబాద్ ప్రాంతాల నుంచి వందలాది వాహనాల్లో పందెం రాయుళ్లు తరలివచ్చారు.