రాజమండ్రి: గోదావరి జిల్లాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులపై దాడికి దిగింది.
దీంతో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైరవిహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు.