Mad dog
-
ఐదుగురిని కరిచిన పిచ్చికుక్క
గుత్తి : పట్టణంలోని షారోన్ నగర్లో మంగళవారం ఓ పిచ్చికుక్క పుల్లమ్మ, పావన జ్యోతి, లక్ష్మిదేవి, రంగయ్య మరొకరిని కరిచింది. వీరిలో తీవ్రంగా గాయపడిన పావన జ్యోతి, పుల్లమ్మను స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాలనీవాసులు సునిల్, లారెన్స్, దివ్య, ఉషారాణి, రాజు, శ్యాం ప్రసాద్, అమృత్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో ఊర కుక్కలు, పిచ్చికుక్కల బెడద పెరిగిపోయిందన్నారు. మున్సిపల్ అధికారులు స్పందించి కుక్కల బారి నుంచి తమను రక్షించాలని కోరారు. -
అల్వాల్‌లో పిచ్చికుక్క స్వైర విహారం
నగరంలోని అల్వాల్ పరిధిలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. రోడ్డు పై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న ఎనిమిది మంది పై దాడి చేసి గాయాపర్చింది. దీంతో వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికులు జీహెచ్ఎంసీ సిబ్బందికి సమాచారం అందించినా.. అధికారులు స్పందించడంలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
ప్రకాశంలో పిచ్చికుక్క స్వైరవిహారం
-
అయ్యో పాపం
చిన్నారిపై పిచ్చికుక్క దాడి ప్రాణాపాయ స్థితిలో బాధితురాలు మధురానగర్ : పాలప్యాకెట్ తీసుకువచ్చేందుకు బయటకు వెళ్లిన చిన్నారిపై పిచ్చి కుక్క దాడిచేసింది. తీవ్రంగా గాయపడిన బాలిక అపస్మారకస్థితికి చేరుకుంది. 53వ డివిజన్ దేవీన గర్‌లో బుధవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం దేవీనగర్ బుడమేరుకు చెందిన ముద్రబోయిన నాగరాజు, గంగ దంపతులకు ఒక అమ్మాయి, కుమారుడు ఉన్నారు. బుధవారం ఉదయం పాలప్యాకెట్ కోసం నాగరాజు కుమార్తె ముద్రబోయిన వెన్నెల పాలబూత్‌కు వెళ్లింది. పాలప్యాకెట్ తీసుకువ స్తుండగా పిచ్చికుక్క మీదపడి ఇష్టారాజ్యంగా కరవడంతో వెన్నెల తీవ్రంగా గాయపడింది. ఆమె దేహం రక్తంతో తడిసిపోయింది. ఇది గమనించిన స్థానికులు పిచ్చికుక్కను కర్రలతో కొట్టి చంపారు. అప్పటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్న వెన్నెలను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వాస్పత్రిలో వైద్యులు మూడు రోజులు గడిస్తే కానీ చెప్పలేమనడంతో నాగరాజు కుటుంబంలో విషాధఛాయలు అలుముకున్నాయి. స్పందించని అధికారులు వీధి కుక్కల సంచారంపై స్థానికులు భయాందోళన వ్యక్తంచేస్తున్నారు. చీకటిపడితే బయటికి రాలేని పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. వీధికుక్కల దాడికి పలువురు గురైన ఘటనలు ఉన్నాయి. వీధికుక్కల సమస్యపై ‘సాక్షి’లో పలుమార్లు కథనాలు ప్రచురితమయ్యాయి. దీనిపై అధికారులు స్పందించి ఉంటే ఈరోజు ఈ ఘటన జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ డివిజన్ అధ్యక్షులు ముద్రబోయిన దుర్గారావు నాగరాజు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆస్పత్రికివెళ్లి చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తాము అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. మరో నాలుగు కుక్కలను కరిచింది వీధి కుక్కల సమస్యను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లాం. స్పందించలేదు. అధికారు ల నిర్లక్ష్యం వల్ల నేడు ఒక చిన్నారి ప్రాణం మీదకు వ చ్చింది. అప్పుడే స్పందించి తగు చర్యలు తీసుకు ని ఉంటే ఈ పరిస్థితి నెలకొనేది కాదు. వెన్నెలను కరిచిన పిచ్చికుక్క మరో నాలుగు కుక్కలను కరిచి ంది. దీనివల్ల ఆ కుక్కలను సైతం ఇక్కడ నుంచి తరలించి మరోమారు ఇటువంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలి. - ఎం వెంకట దుర్గారావు, స్థానికుడు -
పిచ్చి కుక్క దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు
ఇంటి ముందు ఆడుకుంటున్న రెండేళ్ల చిన్నారిపై ఓ పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరించింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం కొండాపురం గ్రామంలో గురువారం ఈ ఘటన జరిగింది. కుక్క దాడిలో ప్రణీత్ ముఖంపై తీవ్ర గాయాలు కాగా బాలుడిని చికిత్స కోసం జిల్లా ఆస్పత్రి రిమ్స్ కు తరలించారు. -
భౌబోయ్!
పిచ్చికుక్క దాడిలో 20మందికి తీవ్ర గాయాలు ఆరుగురిని విశాఖ తరలింపు కుక్కల ఏరివేతకు రంగం సిద్ధం పార్వతీపురం: పట్టణంలలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. దొరికినవారిని దొరికినట్టు దాడిచేసి కరిచేసింది. దాని బారినపడి 20మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఆరుగురిని మెరుగైన చికిత్స కోసం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. బుధవారం అర్ధరాత్రి రాయగడ రోడ్డులోని వివేకానంద కాలనీలో ఆరుబయట నిద్రిస్తున్న వారిపై తొలుత దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచింది. అక్కడి జనం తేరుకునేలోగా కొత్తవీధిలో పలువురిపై దాడిచేసింది. అక్కడినుంచి మాదిగ వీధి, దేవాంగుల వీధి, గొడగల వీధి, కుమ్మరవీధుల్లో చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరికి కండలు ఊడబెరికింది. తరువాత ఇందిరాకాలనీలో జనంపై దాడిచేసి, కొత్తవలస చేరుకొని ఎన్టీఆర్ కాలనీతోపాటు పలు వీధుల్లోని జనాన్ని గాయపరచింది. ఈ దాడిలో సిరిపురం ప్రసాద్, ఎం.తరుణ్, కన్నూరి గౌరి, చీపురుబిల్లి రాముడమ్మ, బి.ఆదినారాయణ, ఎ.రమణమ్మ, కె.వెంకటి, ఎం.అప్పలనరసమ్మ, కె.రమణమ్మ, ఎస్.భద్రమ్మ, సిహెచ్.రామచంద్రమ్మ, బి.బుచ్చిరాజు, కె.రాము, పి.మరియమ్మ, డి.నారాయణరావు, ఎం.శంకర్రావు, ఆర్.అప్పలనరసమ్మ, సుందరాడ భద్రాచలం, రాజేటి రమణ తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. వారంతా బుధవారం అర్ధరాత్రి నుండే చికిత్స నిమిత్తం ఏరియా ఆస్పత్రికి క్యూ కట్టారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.నాగభూషణరావు, డా. పెద్దింటి రవికుమార్, డా. వెంకటరావు తదితరులు బాధితులకు వైద్య సేవలందించారు. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని మెరుగైన వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు రిఫర్ చేశారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.నాగభూషణరావు మాట్లాడుతూ బాధితులకు ఎటువంటి ప్రమాదం లేదని, అందరికీ ట్రీట్మెంట్ ఇచ్చామనీ తెలిపారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ కమిషనర్ వి.సిహెచ్.అప్పలనాయుడు మాట్లాడుతూ ఇప్పటికే ఆ పిచ్చికుక్కను పట్టుకునేందుకు సిబ్బందిని నియమించామనీ, కుక్కల ఏరివేత, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లకు చర్యలు చేపట్టామనీ తెలిపారు. -
పిచ్చికుక్కల స్వైరవిహారం
తెలంగాణలో ఎండలు ఎక్కువగా పెరుగుతుండడంతో పిచ్చికుక్కులు స్వైరవిహారం చేస్తున్నాయి. జిల్లాల్లో వీటి దాడికి గురై పదుల సంఖ్యలో బాధితులు ఆస్పత్రి పాలవుతున్నారు. అధికారులు వీటిని నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. జమ్మికుంట: కరీంనగర్ జిల్లాలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. జమ్మికుంట మండలం సీతంపేట, బూజునూర్ గ్రామాల్లో ఆదివారం రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న 21 మందిపై దాడి చేసి గాయపరిచింది. వీరిలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని వరంగల్ ఎంజీఎంకు తరలించారు. మిగతా వారికి స్థానిక పీహెచ్సీలో చికిత్స అందించారు. తహశీల్దార్ రజిని బాధితులను పరామర్శించారు. అధికారులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో ఘటనలో మహబూబ్‌నగర్ జిల్లాలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. రేగడిచిలకలమర్రి గ్రామంలో సోమవారం ఉదయం 12 మందిని పిచ్చికుక్క గాయపరిచింది. బాధితులను స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాధమిక చికిత్స అందించి అక్కడి నుంచి షాద్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. -
పిచ్చి కుక్క స్వైర విహారం
నల్గొండ : నల్గొండ జిల్లా నకిరేకల్ మార్కెట్ వీధిలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి... కనిపించినవారినల్లా కరిచింది. బుధవారం ఉదయం పిచ్చికుక్క దాడిలో 10 మంది గాయపడ్డారు. వారిలో ఓ మహిళ కూడా ఉంది. దీంతో స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆమెను నల్గొడం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నకిరేకల్... ఆ సమీపం ప్రాంతంలో పిచ్చికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దీనిపై స్థానికులు పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసిన.. వారు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో అధికారులపై స్థానికులు మండిపడుతున్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన చక్రవర్తి, సుబ్బారాయుడు, పెంకయ్య, హుసేనమ్మతో పాటు మరో వ్యక్తిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. -
పిచ్చి కుక్క స్వైర విహారం
- ఇద్దరు చిన్నారులకు తీవ్ర గాయాలు హిందూపురం (అనంతపురం) హిందూపురం పట్టణంలోని నింకంపల్లికి వెళ్ళే రహదారిలో పిచ్చికుక్క ఇద్దరు చిన్నారులను కరిచి తీవ్రంగా గాయపరిచిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానిక పరిగి రోడ్డు సమీపంలో నింకంపల్లి రహదారిలో ఇద్దరు చిన్నారులు చంద్రశేఖర్(7), ముజాయిద్(9)లు ఇంటి వద్ద ఆడుకుంటుండగా పిచ్చికుక్క కరిచిందని స్థానికులు తెలిపారు. చంద్రశేఖర్‌కు చెవిని, చేతిని కరవడంతో తీవ్రగాయాలు అయ్యాయి. ముజాయిద్‌కు కాలిని కరవడంతో దీన్ని గమనించిన స్థానికులకు కుక్కను తరిమివేసి చిన్నారులను స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చిన్నారులకు రెబిస్ ఇంజెక్షన్లు ఇచ్చి చికిత్స అందిస్తున్నారు. -
నిండు ప్రాణం తీశారు
ధారూరు: పిచ్చికుక్క కరిచిందని ఆవుకు ఉరి వేశాడో రైతు. గ్రామస్తుల ఒత్తిడి మేరకే అతను ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ధారూరు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. నాగారానికి చెందిన శ్రీజంగపు అంజిలయ్య ఆవును మూడు రోజుల క్రితం ఓ పిచ్చికుక్క కరిచింది. అప్పటి నుంచి నుంచి ఆవు పిచ్చిగా ప్రవర్తిస్తోంది. ఎవరు కనిపించినా కుమ్మేందుకు దూసుకెళుతోంది. దానికి వైద్యం చేయడానికి పశువుల ఆస్పత్రిలో సిబ్బంది కూడా లేరు. ఈ ఆవు వల్ల ప్రమాదం పొంచి ఉండడంతో సోమవారం దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాని అది దొరకలేదు. దీంతో దాన్ని చంపేయాలని గ్రామస్తులంతా అంజిలయ్యపై ఒత్తిడి తెచ్చారు. చేసేది లేక.. గ్రామానికి కొద్దిదూరంలో ఉన్న చింతచెట్టు వద్దకు ఆవు వచ్చేలా చేసి దానికి ఉరివేసి చంపారు. ఈ ఫొటో జెడ్పీ చైర్‌పర్సన్‌కు ఒకరు వాట్సప్‌లో పంపడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా పిచ్చికుక్క కరిచిందని.. ఆవును ఉరివేసి చంపడం బాధాకరమని జెడ్పీ చైర్పర్సన్ సునీతా మహేందర్‌రెడ్డి అన్నారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం
తోరణగల్లు : సండూరు తాలూకాలోని తోరణగల్లు గ్రామంలో ఆదివారం ఓ పిచ్చి కుక్క స్వైరవిహారం చేసి వరుసగా ఎనిమిది మందిపై దాడి చేసింది. ఆదివారం ఉదయం తోరణగల్లు గ్రామంలోని పంచాయితీ కార్యాలయం వద్ద ఓ పిచ్చి కుక్క ఎదురుగా వచ్చిన బాలలపై తీవ్రంగా దాడి చేస్తూ పరుగెత్తింది. ఈ పిచ్చికుక్క దాడిలో మొత్తం ఎనిమిది మంది పిల్లలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన సుంకన్న, సుబ్బలక్ష్మి తనయుడు సునీల్ (5)లను విమ్స్ ఆసుపత్రికి తరలించారు. మరో ముగ్గురిని విమ్స్‌కు, మిగిలిన వారిని జిందాల్ సంజీవిని, తోరణగల్లు ప్రభుత్వాసుపత్రుల్లో చేర్పించారు. పిచ్చికుక్కను గ్రామస్తులు కొట్టి చంపేశారు. తోరణగల్లులో కుక్కలు విపరీతంగా ఉన్నాయి. పగటిపూట సైతం హెచ్చెల్సీ కాలువ వైపు ఒంటరిగా వెళ్తున్న వారిపై దాడి చేసి గాయపరుస్తున్నాయని స్థానికులు సాక్షికి తెలిపారు. అయితే పంచాయతీ అధికారులు కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడ్డారు. -
పిచ్చికుక్క దాడి : ఐదుగురికి తీవ్రగాయాలు
ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఖానాపూర్లోని పలు కాలనీల్లో ఆదివారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులను కరించింది. దీంతో ఐదుగురి బాధితులకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే వారిని స్థానిక అసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. పిచ్చికుక్కను పట్టుకోవడంలో స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
పిచ్చికుక్క దాడిలో నలుగురికి గాయాలు
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో ఉదయం నుంచి పిచ్చి కుక్క స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటివరకు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పిచ్చికుక్క బారిన పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్థులు పిచ్చికుక్కను హతమార్చడానికి యత్నిస్తున్నారు. -
వినుకొండలో పిచ్చికుక్క స్వైరవిహారం
వినుకొండ పట్టణంలో ఓ పిచ్చికుక్క ఆదివారం ఉదయం స్వైరవిహారం చేసింది. మెయిన్ బజార్లో, మసీదు మాన్యం దగ్గర మొత్తం 15 మందిని కండ లూడేలా కరిచింది. గాయపడిన వారికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పిచ్చి కుక్క పట్టుకునేందుకు మున్సిపాలిటీవారు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. -
తుంగతుర్తిలో పిచ్చి కుక్క స్వైరవిహారం
నల్లగొండ జిల్లా తుంగతుర్తిలో ఓ కుక్క కనిపించిన వారినల్లా కరిచేసింది... స్థానిక రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో స్వైర విహారం చేసింది. పాఠశాలకు చెందిన బాలుడితో పాటు.. రోడ్డున పోయే వారినీ కరిచేసింది. కుక్క దాడిలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో అతడిని సూర్యా పేట ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. మిగిలిన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. -
లేపాక్షిలో పిచ్చికుక్క స్వైరవిహారం
లేపాక్షిలో బుధవారం మధ్యాహ్నాం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కనపడ్డవారందరినీ కండలూడేలా కొరికేసింది. ఈ ఘటనలో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులు పిచ్చికుక్కను కర్రలతో మోది చంపేశారు. -
పిచ్చి కుక్క దాడిలో నలుగురికి గాయాలు
రాజమండ్రి: గోదావరి జిల్లాల్లో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం పంచాయతీ కార్యాలయం సమీపంలో శుక్రవారం ఉదయం ఓ పిచ్చికుక్క స్థానికులపై దాడికి దిగింది. దీంతో నలుగురు గాయపడ్డారు. వారిని స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పిచ్చి కుక్కల స్వైరవిహారంపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అధికారులు చర్యలను తీసుకోవాలని కోరుతున్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం - ఐదుగురికి గాయలు
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తొరగల్ గ్రామంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి కనిపించినవారినల్లా కరిచింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో విజయలక్ష్మి(1), శివాని (5), యాదయ్య, పార్వతమ్మ, లింగమ్మ ఉన్నారు. చికిత్స కోసం వీరు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా రేబిస్ ఇంజెక్షన్లు లేవంటూ వైద్యులు హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి పంపించారు. -
కుక్క కాటుతో బాలుడికి తీవ్ర గాయాలు
ఆరు బయట ఆడుకుంటున్న బాలుడిని పిచ్చి కుక్క కరిచి తీవ్రంగా గాయపరిచింది. ఇచ్చాపురం పట్టణం ఉప్పాడ వీధికి చెందిన లక్ష్మీనారాయణ అనే రిక్షా కార్మికుని కుమారుడు ఈశ్వరరావు(6) సోమవారం ఉదయం తమ ఇంటి వద్ద ఇసుకలో ఆడుకుంటుండగా పిచ్చి కుక్క అతని వీపుపైన, దవడపైన కండ ఊడేలా కరిచింది. తీవ్రంగా గాయపడిన బాలుడిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
మాదిగపల్లిలో పిచ్చికుక్కల స్వైరవిహారం
సుండుపల్లి: వైఎస్సార్ జిల్లా సుండుపల్లి మండలం దిగువమాదిగపల్లిలో ఆదివారం పిచ్చికుక్కలు స్వైరవిహారం చేశాయి. ఇంటి ముందు ఆడుకుంటోన్న ఇద్దరు చిన్నారులను కుక్కలు తీవ్రంగా గాయపర్చి కొంతదూరం పాటు ఈడ్చుకెళ్లాయి. గాయపడిన ఇద్దరు చిన్నారులు మోహిత్ కుమార్ (ఏడాదిన్నర వయసు), బబ్లూ (ఏడాది వయసు)లను సుండుపల్లి ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా..అక్కడి వైద్యుల సూచనమేరకు తిరుపతికి తరలించారు. -
పిచ్చికుక్క స్వైరవిహారం.. ఏడుగురికి గాయాలు
తనకల్లు (అనంతపురం): పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఏడుగురిని గాయపరిచిన సంఘటన బుధవారం తనకల్లు మండలంలోని ఇందిరానగర్‌లో జరిగింది. ఇందిరానగర్‌కు చెందిన రామాంజులు, రెడ్డిప్రసన్న, నారాయణమ్మ, ప్రకాష్‌లతో పాటు చిన్నారులు పోమేష్, జాయ్, శివలను పిచ్చికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపరిచింది. గాయపడిన బాధితులు స్థానిక 30 పడకల ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నారు. -
పమ్మరాజుపల్లిలో పిచ్చికుక్క స్వైర విహారం
పాణ్యం(కర్నూలు): పాణ్యం మండలం పమ్మరాజుపల్లి గ్రామంలో ఆదివారం ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. కండ ఊడేలా నలుగురిని కరిచింది. గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పెనుకొండ ఆస్పత్రిలో ఉద్రిక్తత
అనంతపురం : అనంతపురం జిల్లా పెనుకొండ ఆస్పత్రి వద్ద గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పెనుకొండలో గురువారం ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. రెచ్చిపోయిన ఆ పిచ్చికుక్క దారిన వెళ్లేవారిపై దాడి చేసింది. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. దాంతో వారిని ఆస్పత్రికి తీసుకు వెళ్లగా బెంగళూరు వెళ్లి చికిత్స చేయించుకోమంటూ చేతులు దులుపుకోవటంతో స్థానికులు ఆందోళనకు దిగారు. చికిత్స చేయకుండానే వేరే ఆస్పత్రికి ఎలా రిఫర్ చేస్తారంటూ బాధిత కుటుంబాలు మండిపడ్డారు. మరోవైపు పిచ్చికుక్కను స్థానికులు కొట్టి చంపేశారు. -
కుక్క కాటు