ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో ఉదయం నుంచి పిచ్చి కుక్క స్వైరవిహారం చేస్తోంది.
ప్రకాశం జిల్లా బెస్తవారిపేట మండలం పూసలపాడు గ్రామంలో ఉదయం నుంచి పిచ్చి కుక్క స్వైరవిహారం చేస్తోంది. ఇప్పటివరకు గ్రామానికి చెందిన నలుగురు వ్యక్తులు పిచ్చికుక్క బారిన పడ్డారు. వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారికి తీవ్ర గాయాలైనట్లు వైద్యులు తెలిపారు. గ్రామస్థులు పిచ్చికుక్కను హతమార్చడానికి యత్నిస్తున్నారు.