గిద్దలూరు మండలం గుమ్మలపల్లిలో టీడీపీ వర్గ విబేధాలు బయటపడ్డాయి.
- గిద్దలూరులో కొట్టుకున్న టీడీపీ కార్యకర్తలు..
- ఏడుగురికి గాయాలు
గిద్దలూరు(ప్రకాశం జిల్లా)
గిద్దలూరు మండలం గుమ్మలపల్లిలో టీడీపీ వర్గ విబేధాలు బయటపడ్డాయి. పాత,కొత్త టీడీపీ కార్యకర్తల మధ్య తాగునీటి విషయంలో తలెత్తిన వివాదం చినికి చినికి గాలివానలా మారింది. పరస్పరం రాళ్లతో దాడి చేసుకోవడంతో ఏడుగురికి గాయాలయ్యాయి. ముగ్గురికి తీవ్రగాయాలవ్వడంతో గిద్దలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.