ఇంటి స్థలం విషయంలో జరిగిన వాగ్వాదం తీవ్రంగా మారి పరస్పరం ఇరువర్గాల వారు గొడ్డళ్లతో దాడి చేసుకున్నారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా అద్దంకి మండలం ధర్మవరంలో సోమవారం వెలుగుచూసింది. గ్రామంలోని ఓ ఇంటి స్థలానికి చెందిన అంశంలో గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య గొడవ జరుగుతోంది. ఈ క్రమంలో ఈ రోజు ఇరువర్గాల వారు గొడ్డళ్లతో దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఇంటిస్థలం కోసం గొడ్డళ్లతో దాడి
Published Mon, Jul 4 2016 2:08 PM | Last Updated on Mon, Sep 4 2017 4:07 AM
Advertisement
Advertisement