పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
పిచ్చికుక్క దాడిలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని శ్రీరాంనగర్‌లో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన చక్రవర్తి, సుబ్బారాయుడు, పెంకయ్య, హుసేనమ్మతో పాటు మరో వ్యక్తిపై పిచ్చికుక్క దాడి చేసి గాయపర్చింది. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.