నల్లగొండ జిల్లా కనగల్ మండలం తొరగల్ గ్రామంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి కనిపించినవారినల్లా కరిచింది.
నల్లగొండ జిల్లా కనగల్ మండలం తొరగల్ గ్రామంలో ఓ పిచ్చికుక్క స్వైర విహారం చేసి కనిపించినవారినల్లా కరిచింది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో జరిగిన ఈ దాడిలో ఇద్దరు చిన్నారులతో పాటు మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో విజయలక్ష్మి(1), శివాని (5), యాదయ్య, పార్వతమ్మ, లింగమ్మ ఉన్నారు. చికిత్స కోసం వీరు నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా రేబిస్ ఇంజెక్షన్లు లేవంటూ వైద్యులు హైదరాబాద్‌లోని నల్లకుంట ఫీవర్ ఆస్పత్రికి పంపించారు.