RMP Doctor Attack On Councillor At Nalgonda CCTV Footage Video Goes Viral - Sakshi
Sakshi News home page

వీడియో.. నల్గొండలో దారుణం.. కౌన్సిలర్‌ భర్తపై ఆర్‌ఎంపీ కత్తితో దాడి

Published Mon, Oct 17 2022 2:55 PM | Last Updated on Mon, Oct 17 2022 4:18 PM

RMP Doctor Attack On Councillor At Nalgonda CCTV Footage Viral - Sakshi

సాక్షి, నల్గొండ: నల్గొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కౌన్సిలర్ భర్తపై ఓఆర్ఎంపీ డాక్టర్ కత్తితో దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. పట్టణంలోని దేవరకొండ రోడ్డులో 25వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి భర్త శ్రీనివాస్ మీద అదే ప్రాంతంలో ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ అనంతుల యాదయ్య కత్తితో దాడికి దిగాడు. నడిరోడ్డుపై కౌన్సిలర్‌ వెంట పరుగెత్తి కత్తితో దాడి చేశాడు.

వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి దాడిని అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. కత్తితో వెంబడించడం, దాడి చేయడం వంటి వీడియోలు ..సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement