Councillor
-
బాలికపై కౌన్సిలర్ అఘాయిత్యం..
బోధన్ /ఎడపల్లి(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్ట ణంలోని శక్కర్ నగర్ 3వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ అదే వార్డుకు చెందిన ఓ మైనర్ బాలిక (16)పై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ ఎడపల్లిలో స్థానిక యువకులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలిలా.. బాలిక తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో మందులు తీసుకురావడానికి సోమవారం సాయంత్రం బోధన్ నుంచి ఆటోలో నిజామాబాద్‌కు వెళుతుండగా గమనించిన కౌన్సిలర్ కారులో వెంబడించాడు.ఎడపల్లి మండలం మంగల్ పాడ్ రోడ్డు వద్ద ఆటోను ఆపి కారులో వెళ్దామని చెప్పడంతో తెలిసిన వ్యక్తి కావడంతో ఆ బాలిక కౌన్సిలర్ వెంట వెళ్లింది. కారును నిజామాబాద్‌కు కాకుండా ఎడపల్లి నుంచి కూర్నపల్లి వెళ్లే దారిలోకి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి నుంచి బాలికను తీసు కొచ్చిన నిందితుడు ఓ వైన్స్ వద్ద కారు ఆపి మద్యం సేవిస్తుండగా.. కారులో ఉన్న బాలిక కేకలు వేసింది. గమనించిన స్థానికులు అనుమానంతో కౌన్సిలర్‌ను ఏమైందని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పక పోవడంతో యువకులు బాలికను అడగడంతో విషయం చెప్పింది. యువకులు ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. అనంతరం ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని బోధన్‌లోని సీఐ కార్యాలయానికి తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.అర్ధరాత్రి ఉద్రిక్తత..బాలికపై అఘాయిత్యం ఘటన తెలియడంతో స్థానిక మైనారిటీ నాయకులు, యువకులు అర్ధ రాత్రి పెద్ద ఎత్తున బోధన్‌లోని సీఐ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సుమారు గంట అనంతరం యువకులు ఆందోళన విరమించారు. అసెంబ్లీ ఎన్ని కల ముందు నిందితుడి తమ్ముడు సైతం అదే వార్డుకు చెంది న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో చట్టం కింద రిమాండ్‌కు వెళ్లాడు. ఆ ఘటనలో తమ్ముడిని రక్షించే ఉద్దేశంతో బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి నట్లు తెలియడంతో రాధాకృష్ణ పై పోలీసులు పోక్సో కేసు న మోదుచేసి రిమాండ్‌కు తరలించారు. టీఆర్ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాధాకృష్ణను అప్పటి ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. -
టీఎంసీ కార్యకర్తపై కౌన్సిలర్ దాడి.. వీడియో వైరల్
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సొంత పార్టీ కార్యకర్తపైనే దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ 18వ వార్డు టీఎంసీ కౌన్సిలర్ సునందా సర్కార్ అదే వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త(18వార్డ్ టీఎంసీ యూత్ ప్రెసిడెంట్)పై దాడి చేశారు. పలు అవినీతి కేసుల్లో సునందాకు ప్రమేయం ఉందని సదరు కార్యకర్త కొంత కాలం నుంచి ఆమెపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం అతను కనిపించగానే కోపం పట్టలేక కౌన్సిల్ సునందా కార్యకర్తపై దాడి చేశారు.This is one of the “finest” examples of the “Joy Bangla” model currently being implemented across West Bengal by TMC “luminaries”. Ms Sunanda Sarkar, TMC Councillor of Ward 18 is seen here administering a dose of “Joy Bangla” to TMC youth wing president of Ward 18 Mr Kedar… pic.twitter.com/R8rpZ5YIru— Dr. Anirban Ganguly (অনির্বাণ গঙ্গোপাধ্যায়) (@anirbanganguly) July 16, 2024 కార్యకర్తపై కౌన్సిల్ దాడి చేయటంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా జగ్రత్తగా ఉండాలి. ఇది చాలా హాస్యాస్పదమైనది’ అని అన్నారు. అయితే టీఎంసీ కౌన్సిల్ సొంతపార్టీ కార్యకర్తపై చేసిన దాడి ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ ఘటన బెంగాల్ టీఎంసీ పార్టీ అంతర్గత గందరగోళం, నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలను నిదర్శనమని పేర్కొంది. సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రటరీ మహ్మద్ సాలిమ్ ఖండించారు. ఈ ఘటనను చూస్తే.. ‘వీధి న్యాయం’లా కనిపిస్తోందన్నారు. -
మోజు తీర్చుకుని మొహం చాటేసిన టీడీపీ నేత..
తాడిపత్రి/రూరల్: యువతిని ప్రేమ పేరుతో లోబరుచుకుని మోజు తీర్చుకున్నాక మొహం చాటేశాడో టీడీపీ కౌన్సిలర్. పెళ్లి చేసుకోమని నిలదీస్తే బాధితురాలిపైనే దాడి చేశాడు. దీంతో ఆమె సోమవారం అనంతపురం పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’లో ఎస్పీ అన్బురాజన్‌ను కలిసి గోడు వెళ్లబోసుకుంది. ఎస్పీ సూచన మేరకు తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. తాడిపత్రి 30వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి మల్లికార్జున మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరుడు. పట్టణంలోని సీపీఐ కాలనీకి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ కొన్ని నెలల క్రితం వెంటపడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. యువతిని ఆమె ఇంటి నుంచి తీసుకొచ్చి తనకు తెలిసిన వారి ఇంట్లో ఉంచాడు. అనంతరం ఆమెతో సహజీవనం చేశాడు. యువతి రెండు సార్లు గర్భం దాల్చగా, ఇప్పుడే పిల్లలు ఎందుకు అంటూ అబార్షన్లు కూడా చేయించాడు. ఇటీవల యువతికి అనుమానమొచ్చి మల్లికార్జున సెల్‌ఫోన్ పరిశీలించగా, వాట్సాప్‌లో మరో మహిళతో చాటింగ్ చేసిన విషయం బయటపడింది. దీనిపై మల్లికార్జున ప్రశ్నిస్తే కొట్టి బయటకు వెళ్లిపోయాడు. ఈ క్రమంలోనే మల్లికార్జునతో సంబంధం పెట్టుకున్న మహిళ కూడా రంగంలోకి దిగింది. తను మల్లికార్జునతో తీయించుకున్న ఫొటోలను బాధిత యువతి సెల్‌ఫోన్‌కు పంపింది. వారం క్రితం మళ్లీ యువతి ఇంటికి వచ్చిన మల్లికార్జున మాయమాటలు చెప్పి రెండు రోజులు గడిపాడు. వివాహం చేసుకోమని ప్రశ్నిస్తే తీవ్రంగా కొట్టాడు. విషయం బయటకు చెబితే భూమిపైనే లేకుండా చేస్తానంటూ బెదిరించాడు. తాను వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నానని, తనతోనే జీవితం అంటూ చెప్పాడు. దీంతో ఆమె మల్లికార్జున ఇంటికి వెళ్లింది. తనకు జరిగిన అన్యాయాన్ని ఆయన కుటుంబసభ్యులకు వివరించింది. సర్దిచెప్పాల్సిన వారు కూడా దౌర్జన్యం చేశారు. యువతిని కొట్టి పంపించారు. దీంతో యువతి కుమిలికుమిలి ఏడ్చింది. తెలిసిన వారి సూచన మేరకు సోమవారం అనంతపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకుని గోడు వెళ్లబోసుకుంది. ఆయన సూచన మేరకు తాడిపత్రి పోలీసులను కలిసి ఫిర్యాదు చేసింది. ప్రేమ పేరుతో తనలాంటి వారి జీవితాలతో ఆటలాడుతున్న మల్లికార్జునపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. న్యాయం చేయకుంటే ఆత్మహత్యే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. -
గండం గట్టెక్కేనా..? మున్సిపల్ పాలకవర్గాలు సతమతం!
సాక్షిప్రతినిధి, ఖమ్మం: 'ఉమ్మడి జిల్లాలోని పలు మున్సిపల్ పాలకవర్గాలపై అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. పాలకవర్గాల్లో నెలకొన్న విభేదాలు, రాజకీయ కారణాలతో పదవీ కాలం పూర్తి కావడం సందేహంగానే కనిపిస్తోంది. ఇల్లెందు, వైరా మున్సిపల్ చైర్మన్లపై గతంలోనే పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందజేశారు. ఇల్లెందుకు సంబంధించి ఫార్మాట్లో లేదని కలెక్టర్ తిరస్కరించగా.. మరోసారి నోటీసు ఇచ్చారు. వైరా చైర్మన్‌పై పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం అందజేయగా.. చట్టంపై స్పష్టత లేకపోవడంతో నిర్ణయం వెలువడలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం మారడంతో పాత మున్సిపల్ చట్టం ఆధారంగా అవిశ్వాస అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. వైరా, ఇల్లెందు మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్‌లో, ఖమ్మం కార్పొరేషన్, సత్తుపల్లి, మధిర, కొత్తగూడెం మున్సిపల్ పాలకవర్గాలు బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి. ఈ నేపథ్యాన ఎక్కడెక్కడ అవిశ్వాసం పెట్టే అవకాశముంది, తద్వారా పాలకవర్గాలు మారుతాయా అనే చర్చ జరుగుతోంది.' ఇక్కడా సందేహమే.. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23 వార్డులకు అన్నీ బీఆర్ఎస్సే గెలిచింది. అసెంబ్లీ ఎన్నికల ముందు ఐదుగురు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 18కి తగ్గింది. ఇక్కడ బీఆర్ఎస్కు చెందిన కూసంపూడి మహేష్ చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌గా ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన తోట సుజలారాణి ఉన్నారు. కొత్తగూడెం మున్సిపాలిటీలో బీఆర్ఎస్కు చెందిన కాపు సీతాలక్ష్మి చైర్‌పర్సన్‌గా, వేల్పుల దామోదర్ వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. చైర్‌పర్సన్‌పై వ్యతిరేకతతో బీఆర్ఎస్, సీపీఐ కౌన్సిలర్లు గతంలో అవిశ్వాస తీర్మానానికి ప్రయత్నించినా, ఇప్పుడెలాంటి కదలికా లేదు. ఇక్కడ 36 వార్డులకు గాను బీఆర్ఎస్కు 25, సీపీఐకి ఎనిమిది మంది, కాంగ్రెస్‌కు ఒకరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. ఎన్నికల ముందు సీపీఐ కౌన్సిలర్లు ఐదుగురు బీఆర్ఎస్లో చేరగా ఆ పార్టీ బలం 30కి పెరిగింది. సీపీఐకి ముగ్గురే మిగిలారు. మధిరలో 22 వార్డులకు బీఆర్ఎస్కు 15 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, టీడీపీ నుంచి ముగ్గురు, సీపీఎం, స్వతంత్ర అభ్యర్థి ఒక్కొక్కరు గెలిచారు. బీఆర్ఎస్కు చెందిన ఎరగ్రుంట లక్ష్మి, మొండితోక నాగరాణి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. స్వతంత్ర కౌన్సిలర్ గద్దల మాధురి ప్రమాణ స్వీకారానికి ముందే బీఆర్ఎస్లో చేరారు. 20వ వార్డు కౌన్సిలర్ ముత్తవరపు రాణి అనారోగ్యంతో మృతి చెందగా ఆ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ప్రస్తుతం బీఆర్ఎస్లో 13 మంది, కాంగ్రెస్‌కు నలుగురు, టీడీపీ ముగ్గురు, సీపీఎంకు ఒకరు ఉన్నారు. చైర్ పర్సన్ మొండితోక లత, వైస్ చైర్పర్సన్ శీలం విద్యాలత బీఆర్ఎస్లో గెలిచి అదే పార్టీలో కొనసాగుతున్నారు. పాలకవర్గాల్లో విభేదాలు! ఏడాది కాలంగా పలు మున్సిపల్ పాలకవర్గాల్లో విభేదాలు పొడచూపాయి. పార్టీ తరఫున ఎన్నికై న చైర్మన్లకు, నాయకత్వానికి పొసగకపోవడం, కౌన్సిలర్లు – చైర్మన్‌కు మధ్య విభేదాల వంటి కారణాలతో అవిశ్వాసానికి అడుగులు పడ్డాయి. మరికొన్ని చోట్ల అవిశ్వాస తీర్మానానికి నిర్ణయించినా సర్దుబాట్లతో ముందుకు సాగలేదు. ఇల్లెందు, వైరాలో మాత్రం అవిశ్వాస తీర్మాన నోటీసులు కలెక్టర్లకు అందాయి. మున్సిపాలిటీ, కార్పొరేషన్ పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలంటే మూడేళ్ల పదవీ కాలం పూర్తి కావాలని చట్టంలో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం దీన్ని నాలుగేళ్లకు పెంచి గవర్నర్‌కు పంపించగా ఆమోదం లభించలేదు. దీంతో ఇల్లెందు, వైరా తీర్మానాలపై కలెక్టర్లు నిర్ణయం తీసుకోలేదు. మరోసారి తెరపైకి.. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అవిశ్వాస అంశం మరోసారి తెరపైకి వచ్చింది. బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన నాలుగేళ్ల చట్టానికి గవర్నర్ ఆమోదం లభించకపోవడంతో, మూడేళ్లు దాటిన పాలకవర్గాలపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే వెసులుబాటు ఉంది. ఉమ్మడి జిల్లాలోని మున్సిపల్ పాలకవర్గాలు 2020 జనవరిలో కొలువుదీరాయి. ప్రస్తుతం మూడేళ్లు దాటడంతో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశముంది. గతంలో అవిశ్వాసానికి యత్నించిన వైరా, ఇల్లెందు మున్సిపాలిటీల చైర్మన్లు ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరడంతో బలాబలాలు మారాయి. మిగతా మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు మెజార్టీ ఉన్నా.. వచ్చే నాలుగు నెలల్లో రాజకీయ సమీకరణలతో తమ బలం పెరుగుతుందన్న అంచనాలో కాంగ్రెస్ ఉంది. తద్వారా అవి శ్వాసం పెట్టి ఆయా మున్సిపాలిటీలను హస్తగతం చేసుకుంటామని ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. ఖమ్మంపై రాజకీయ కాక.. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌పై రాజకీయ కాక మొదలైంది. ఈ పాలకవర్గం 2021 మే 7న కొలువుదీరింది. 60 డివిజన్లలో బీఆర్ఎస్, సీపీఐ కలిసి పోటీ చేయగా.. బీఆర్ఎస్ 43, సీపీఐ రెండు స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్ 10, సీపీఎం, స్వతంత్రులు రెండేసి స్థానాలు, బీజేపీ ఒక స్థానం దక్కించుకున్నాయి. దీంతో బీఆర్ఎస్ పగ్గాలు చేపట్టగా, ఆ తర్వాత ముగ్గురు కాంగ్రెస్ కార్పొరేటర్లు బీఆర్ఎస్లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల సమయాన స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు కాంగ్రెస్‌లో చేరగా.. బీఆర్ఎస్కు చెందిన తొమ్మిది మంది సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో కాంగ్రెస్ బలం 18కి చేరగా, బీఆర్ఎస్కు 37 మంది ఉన్నారు. వచ్చే ఏడాది మే 7తో కేఎంసీ పాలకవర్గం మూడేళ్లు పూర్తి చేసుకోనుంది. ఇప్పటివరకు బీఆర్ఎస్కే బలం ఉన్నా, వచ్చే నాలుగు నెలల్లో మారే సమీకరణలతో తమ బలం పెరిగి కార్పొరేషన్‌ను ‘హస్త’గతం చేసుకుంటామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. అయితే తమ కార్పొరేటర్లెవరూ కాంగ్రెస్ వైపు చూడరని బీఆర్ఎస్ నేతలు ధీమాగా ఉన్నారు. వైరా, ఇల్లెందుల్లో ఇలా.. ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కౌన్సిలర్లు వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్‌పై కలెక్టర్‌కు అవిశ్వాస నోటీసులు ఇచ్చారు. ఇక్కడ బీఆర్ఎస్కు 16 మంది, కాంగ్రెస్‌కు ఇద్దరు, సీపీఎంకు ఒకరు, స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఉన్నారు. ఎన్నికల అనంతరం కాంగ్రెస్, బీఆర్ఎస్కు పదేసి మంది కౌన్సిలర్లు ఉన్నారు. అయితే మరికొందరు కాంగ్రెస్‌లో చేరే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ఇక ఇల్లెందు మున్సిపాలిటీలో ఏడాది కాలంగా చైర్మన్‌కు వ్యతిరేకంగా కౌన్సిలర్లు కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇక్కడ 24 వార్డులకు గాను చైర్మన్ డి.వెంకటేశ్వర్లు, వైస్ చైర్మన్ జానీపాషాతో పాటు 21 మంది బీఆర్ఎస్ నుంచి గెలిచారు. సీపీఐ, న్యూడెమోక్రసీ, బీఆర్ఎస్ రెబల్‌గా ఒక్కొక్కరు గెలుపొందారు. ఇటీవల బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్‌పై కలెక్టర్‌కు అవిశ్వాసం నోటీసు ఇచ్చినా ఫార్మాట్ ప్రకారం లేదనడంతో వారం క్రితం మళ్లీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే హరిప్రియ, ఆమె భర్త హరిసింగ్ ప్రోద్బలంతో ఈ ప్రక్రియ సాగుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ఎన్నికల ముందు మున్సిపల్ చైర్మన్ సహా నలుగురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరడంతో ప్రస్తుతం బీఆర్ఎస్ బలం 17కు తగ్గింది. వైరా, ఇల్లెందులో ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వారు గెలవడం, ఆ పార్టీకే చెందిన చైర్మన్లు ఉండడంతో ఆ పార్టీ నేతలు ఎలా చక్రం తిప్పుతారో వేచి చూడాల్సిందే. ఇవి చదవండి: సర్కారు ఖజానాలో పైసల్లేవ్.. క్రమశిక్షణతో ఆదాయం పెంచుతాం! -
టీడీపీ కౌన్సిలర్ల దురుసు ప్రవర్తన
నర్సీపట్నం: మున్సిపల్ అభివృద్ధిని అడ్డుకోవడమే ఎజెండాగా పెట్టుకున్న టీడీపీ కౌన్సిలర్లు ఎప్పటి మాదిరిగానే కౌన్సిల్ సమావేశానికి అడ్డంకులు సృష్టించారు. సభ సజావుగా సాగకుండానే.. కనీసం ప్రజా సమస్యలు ప్రస్తావించకుండానే.. అధికార పార్టీ కౌన్సిలర్లపై ఏకవచనంతో దురుసుగా ప్రవర్తించారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య సైతం ఏకవచనంతో మాట్లాడటంపై చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి అభ్యంతరం వ్యక్తం చేశారు. సాటి మహిళను గౌరవించటం ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం చైర్పర్సన్ అధ్యక్షతన నిర్వహించిన స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ప్రధానంగా మెయిన్ రోడ్డు విస్తరణలో తొలగిస్తున్న బాలికల వసతిగృహం, ఆర్డీవో కార్యాలయం ప్రహరీ పునర్నిర్మించడానికి మున్సిపల్ సాధారణ నిధులు కేటాయించటంపై టీడీపీ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇందుకు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమె ప్రస్తావించిన సమస్యలపై చర్చించకుండా వెళ్లిపోవటం సరికాదని వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ అన్నారు. దాంతో చాల్లెండి.. సిగ్గు పడండి.. అని టీడీపీ కౌన్సిలర్ పద్మావతి ఎగతాళి చేశారు. సిగ్గుపడే బయటకు వెళ్తున్నారని మరో వైస్ చైర్మన్ తమరాన అప్పలనాయుడు చురకంటించడంతో ఆమె అతని వైపు దూసుకొచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ, టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం నెలకొంది. వైస్ చైర్మన్ అప్పలనాయుడును టీడీపీ కౌన్సిలర్ ధనిమిరెడ్డి మధు ఏకవచనంతో ‘ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు’ అంటూ కోపోద్రిక్తుడయ్యాడు. వెంటనే చైర్పర్సన్ తన కుర్చీలో నుంచి లేచివచ్చి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సభ్యులను ఏకవచనంతో మాట్లాడితే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. దీంతో ఇరువర్గాల కేకలు, అరుపులతో సభ దద్దరిల్లింది. సభ నుంచి టీడీపీ కౌన్సిలర్లు బయటకు వెళ్లిపోయారు. జనసేన కౌన్సిలర్ సౌజన్య.. రెండు నెలల్లో మార్పు తెస్తానన్నారు.. ఏమి మార్పు తెచ్చారని ప్రశ్నించారు. సమస్యలు ప్రస్తావించడానికి వచ్చావా.. రాజకీయ ఉపన్యాసం చేయడానికి వచ్చావా అని చైర్పర్సన్ కౌంటర్ ఇచ్చారు. వినే ఓపిక లేనప్పుడు సమస్యలు ప్రస్తావించకూడదన్నారు. సమావేశంలో కమిషనర్ పూడి రవిబాబు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. -
తీవ్ర విషాదం: కుటుంబంతో సహా డీఎంకే కౌన్సిలర్ బలవన్మరణం
తమిళనాడు: రాశిపురం డీఎంకే మహిళా కౌన్సిలర్ దేవి ప్రియ (31) తన భర్త, కుమార్తెతో కలిసి బలన్మరణానికి పాల్పడింది. బుధవారం వారి ఇంట్లో వారు ఉరికి వేలాడుతుండటాన్ని గుర్తించిన పోలీసులు విచారణను వేగవంతం చేశారు. వివరాలు.. నామక్కల్ జిల్లారాశిపురం బొమ్మితేరు ప్రాంతానికి చెందిన అరుణ్‌లాల్(42) రెండు దశాబ్దాలుగా స్థానికంగా నగల దుకాణం నడుపుతున్నాడు. ఆయనకు భార్య దేవి ప్రియ(31), కుమార్తె మోనిక శ్రీ(18)తో పాటు మరో కుమార్తె ఉన్నారు. దేవిప్రియ రాశిపురం మునిసిపాలిటీ 13వ వార్డు డీఎంకే కౌన్సిలర్‌గా ఉన్నారు. మోనిశ్రీ ప్లస్–2 ఉత్తీర్ణత సాధించి ఉంది. పెద్దకుమార్తె బెంగళూరులోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తోంది. ఈ పరిస్థితులలో బుధవారం ఉదయం వీరి ఇంటి తలుపులు ఎంతకూ తెరుచుకోక పోవడంతో ఇరుగు పొరుగు వారు కిటికి గుండా లోనికి చూశారు. అరుణ్ లాల్, దేవిప్రియ ఉరికి వేలాడుతుండటంతో పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగల కొట్టి లోనికి వెళ్లారు. దంపతులు ఇద్దరూ ఆత్మహత్యకు పాల్పడినట్లు నిర్ధారించారు. చిన్న కుమార్తె మోనిక శ్రీకి విషం తాగి మరణించినట్లు తేలింది. ఎంతో ఆనందంగా ఉన్న కుటుంబం హఠాత్తుగా బలన్మరణానికి పాల్పడటం అనుమానాలకు దారి తీశాయి. వ్యాపారంలో ఏదైనా నష్టం వచ్చిందా..? లేదా మరెదేని కారణాలు ఉన్నాయా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరి మృతి విషయాన్ని బెంగళూరులోని పెద్దకుమార్తెకు పోలీసులు తెలియజేశారు. -
ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్.. కీలక ఎన్నికకు ముందు బీజేపీలో చేరిన కౌన్సిలర్..
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీకి షాక్ తగిలింది. ఢిల్లీ బవానా వార్డు కౌన్సిలర్ పవన్ సెహ్రావత్ శుక్రవారం బీజేపీలో చేరారు. కమలం పార్టీ కార్యాలయంలో ఆయన ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. బీజేపీ ఢిల్లీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీరేంద్ర సచ్వేదా, ప్రధాన కార్యదర్శి హర్ష్ మల్హోత్రా పవన్‌కు ఘన స్వాగతం పలికారు. అయితే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికకు ముందే ఆప్ కౌన్సిలర్ పార్టీని వీడటం గమనార్హం. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని, ఇది తనకు చాలా ఇబ్బందికరంగా ఉందని పవన్ ఆరోపించారు. ఢిల్లీ మేయర్ ఎన్నిక సందర్భంగా సభలో రచ్చ చేయాలని తనకు పార్టీ సూచించిందని పేర్కొన్నారు. ఇవన్నీ నచ్చకే తాను ఆప్‌ను వీడుతున్నట్లు చెప్పారు. Delhi | Aam Aadmi Party's Bawana councillor, Pawan Sehrawat, joins BJP pic.twitter.com/IYUFhxkEzV — ANI (@ANI) February 24, 2023 స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. ఆరుగురు సభ్యులుండే ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలను మేయర్ షెల్లీ ఒబెరాయ్ గురువారం నిర్వహించారు. అయితే ఓటింగ్‌కు మొబెైల్ ఫోన్లను అనుమతించడాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. కమలం, ఆప్ పార్టీ కౌన్సిలర్లు బాహాబాహీకి దిగారు. దీంతో 47 మంది ఓటు వేసిన అనంతరం ఓటింగ్‌ను అర్థాంతరంగా నిలివేశారు మేయర్. శుక్రవారం మళ్లీ ఈ ఎన్నిక నిర్వహించనున్నారు. పలుమార్ల వాయిదా అనంతరం బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన షెల్లీ ఒబెరాయ్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ ఎన్నిక రోజు కూడా సభలో బీజేపీ, ఆప్ కౌన్సిలర్లు రచ్చ రచ్చ చేశారు. ఒకరిపై ఒకరు వాటర్ బాటిళ్లు విసురుకున్నారు. చదవండి: పేపర్ లీక్ చేస్తే 10 ఏళ్ల జైలు శిక్ష.. రూ. కోటి జరిమానా! -
ఇలాంటి పరిస్థితి శత్రువులకు కూడా రావొద్దు.. బీజేపీ నేత ఫ్యామిలీ ఆత్మహత్య!
బీజేపీకి చెందిన మాజీ కార్పోరేటర్ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. అయితే, తమ కుమారుడికి అరుదైన వ్యాధి వచ్చిన కారణంగానే తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు తండ్రి, బీజేపీ నేత సంజీవ్ మిశ్రా తెలిపారు. తమ మృతికి ఇదే కారణమని చెప్పుకొచ్చారు. వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌లోని విదిషా జిల్లాకు చెందిన బీజేపీ మాజీ కార్పొరేటర్ సంజీవ్ మిశ్రా(45)కు భార్య నీలం(42), ఇదర్దు కుమారులు అన్మోల్(13), సార్థక్(7) ఉన్నారు. అయితే, గత కొద్ది రోజలుగా సంజీవ్ కొడుకు.. అరుదైన కండరాల వ్యాధి(muscular dystrophy)తో బాధపడుతున్నాడు. దీంతో, తన కుమారుడి ఆరోగ్యాన్ని మెరుగయ్యేందుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా, ఎన్ని ఆసుపత్రుల తిరిగినా అతడిని నయం కాకపోవడంతో సంజీవ్ మిశ్రా మనస్థాపానికి లోనయ్యారు. ఈ క్రమంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి కారణంగా దంపతులు ఒత్తిడికి లోనయ్యారు. ఈ క్రమంలో తమ కుమారులిద్దరికీ విషం తాగించారు. అనంతరం భార్యాభర్తలిద్దరూ కూడా పాయిజన్ సేవించి ఆత్మహత్య చేసుకున్నారు. కాగా, పిల్లలిద్దరూ ఘటనా స్థలంలోనే మృతిచెందగా.. సంజీవ్ మిశ్రా, నీలం మాత్రం చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మరణించారు. అయితే, వీరి ఆత్మహత్యకు ముందు సంజీవ్ మిశ్రా ట్విట్టర్ వేదికగా.. శత్రువుల పిల్లలను కూడా దేవుడు ఈ వ్యాధి నుంచి తప్పించాలి. నేను నా పిల్లలను రక్షించలేను.. అందుకే ఇకపై జీవించాలని అనుకోవడం లేదు అంటూ కామెంట్స్ చేశారు. ఇక, వీరి ఆత్మహత్యలపై స్థానిక బీజేపీ నేతలు సంతాపం తెలిపారు. మస్కిల్ డిస్ట్రోఫీ అంటే.. వారసత్వ (జన్యు) వ్యాధుల కారణంగా కండరాలు బలహీన పడటాన్ని కండరాల డిస్ట్రోఫీ సూచిస్తుంది. ఈ పరిస్థితిని ఒక రకమైన మయోపతి, అస్థిపంజర కండరాల వ్యాధిగా పేర్కొంటారు. ఈ వ్యాధి కారణంగా, కండరాలు కుంచించుకుపోతాయి, బలహీనపడతాయి. కండరాల బలహీనత కారణంగా నడవడం, రోజువారీ కార్యకలాపాలు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. ఈ వ్యాధి గుండె, ఊపిరితిత్తులను కూడా ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. ఇది అరుదైన వ్యాధి. దీని కారణంగా వీల్ చైర్ కూడా పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. కండరాల బలహీనత రకాలు.. కండరాల డిస్ట్రోఫీలో 30కి పైగా రూపాలు ఉన్నాయి. - డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ (DMD): ఈ పరిస్థితి 2 నుండి 5 సంవత్సరాల మధ్య వయస్సు గల అబ్బాయిలు, అమ్మాయిల్లో కనిపిస్తుంది. వీరు పరుగెత్తడం, నడవడం లేదా దూకడం వంటి కష్టంగా చేస్తారు. వ్యాధి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇది పిల్లల గుండె, ఊపిరితిత్తులను ప్రభావితం చేస్తుంది. DMD అనేది కండరాల బలహీనతకు చెందిన అత్యంత సాధారణ రూపం. ఇది ఉత్తర అమెరికా, ఐరోపాలోని 1,00,000 మంది పిల్లలలో దాదాపు ఆరుగురిని ప్రభావితం చేస్తుంది. - బెకర్ మస్కులర్ డిస్ట్రోఫీ (BMD): BMD రెండవ అత్యంత సాధారణ కండరాల బలహీనత. BMD లక్షణాలు 5-60 సంవత్సరాల మధ్య ఎప్పుడైనా కనిపిస్తాయి, కానీ, సాధారణంగా యుక్తవయస్సులో వస్తాయి. పురుషులకు BMD వచ్చే అవకాశం ఉంది. ఈ వ్యాధి తొంటి, తొడ, భుజాల కండరాలను, చివరికి గుండెను ప్రభావితం చేస్తుంది. - ఫేసియోస్కాపులోహ్యూమెరల్ మస్కులర్ డిస్ట్రోఫీ (FSHD): FSHD అనేది మూడవ అత్యంత సాధారణ కండరాల బలహీనత. ఈ వ్యాధి ముఖం, భుజం బ్లేడ్లు, పై చేతులపై కండరాలను ప్రభావితం చేస్తుంది. లక్షణాలు 20 సంవత్సరాల కంటే ముందే కనిపిస్తాయి. పుట్టుకతో వచ్చే కండరాల బలహీనత (CMD): CMD పుట్టుకతో వచ్చే కండరాల బలహీనత. శిశువు బలహీనమైన కండరాలు, వంగిన వెన్నెముక, కీళ్ళు చాలా గట్టిగా లేదా వదులుగా ఉండవచ్చు. CMD ఉన్న పిల్లలకు అభ్యాస వైకల్యాలు, మూర్ఛలు, దృష్టి సమస్యలు ఉండవచ్చు. -
స్థానిక కౌన్సిలర్ భర్తపై కత్తితో దాడి చేసిన ఆర్ఎంపీ డాక్టర్
-
వీడియో.. నల్గొండలో దారుణం.. కౌన్సిలర్ భర్తపై ఆర్ఎంపీ కత్తితో దాడి
సాక్షి, నల్గొండ: నల్గొండ పట్టణంలో దారుణం చోటుచేసుకుంది. స్థానిక కౌన్సిలర్ భర్తపై ఓఆర్ఎంపీ డాక్టర్ కత్తితో దాడికి ప్రయత్నించడం కలకలం రేపింది. పట్టణంలోని దేవరకొండ రోడ్డులో 25వ వార్డు కౌన్సిలర్ ధనలక్ష్మి భర్త శ్రీనివాస్ మీద అదే ప్రాంతంలో ఉంటున్న ఆర్ఎంపీ డాక్టర్ అనంతుల యాదయ్య కత్తితో దాడికి దిగాడు. నడిరోడ్డుపై కౌన్సిలర్ వెంట పరుగెత్తి కత్తితో దాడి చేశాడు. వెంటనే అక్కడున్న స్థానికులు గమనించి దాడిని అడ్డుకున్నారు. అనంతరం బాధితుడు శ్రీనివాస్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపడుతున్నారు. కత్తితో వెంబడించడం, దాడి చేయడం వంటి వీడియోలు ..సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. -
ఆప్ కౌన్సిలర్ దారుణ హత్య.. జిమ్‌లోకి వచ్చి తుపాకీతో కాల్చిన దుండగుడు
చండీగఢ్: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ మహమ్మద్ అక్బర్ దారుణ హత్యకు గురయ్యాడు. మాలెర్కోట్ల జిల్లాలో ఆదివారం ఈ ఘటన జరిగింది. అక్బర్ జిమ్‌లో ఉన్నప్పుడు ఓ వ్యక్తి అతడ్ని అతి సమీపం నుంచి తుపాకీతో కాల్చినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతని శరీరంలోకి బుల్లెట్ దిగి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. జిమ్‌లోకి ఓ వ్యక్తి వచ్చినట్లు సీసీటీవీలో రికార్డయ్యింది. అక్బర్ అతని దగ్గరకు వెళ్లాడు. అప్పుడు నిందితుడు వెంటనే తుపాకీ తీసి కాల్పులు జరిపాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. ఈ హత్యతో ఇద్దరికి సంబంధం ఉందని సీసీటీవీ ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారి కోసం ముమ్మర గాలింపు చేపట్టినట్లు తెలిపారు. అయితే వ్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీనే అధికారంలో ఉంది. ఆ పార్టీకే చెందిన మున్సిపల్ కౌన్సిలర్ దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. చదవండి: ప్రాణాల మీదకు తెచ్చిన డీజే.. కరెంటు షాక్‌తో 10 మంది మృతి -
కౌన్సిలర్ భర్తా మజాకా..! అక్రమ నిర్మాణాల్లో ఆ వార్డు నెం.1
అతనో మాజీ వార్డు సభ్యుడు, ఆ ప్రాంతం పై గట్టిగా పట్టు ఉంది. అంతకు మించి ఆయన ఇంట్లో ప్రస్తుతం అధికారం ఉంది. దీంతో ఆయన అవినీతికి అడ్డు అదుపు లేకుండా పోయింది. భార్య పదవిని అడ్డుపెట్టుకొని అక్రమంగా యథేచ్ఛగా అక్రమాలను పోత్సహిస్తున్నాడు. ఇదీ ఓ కౌన్సిలర్ భర్త బాగోతం. అతడి అక్రమ దందా తన వార్డులోనే కాకుండా మున్సిపాలిటీలోని మిగిలిన 15 వార్డుల్లోనూ కొనసాగిస్తున్నాడు. ఏ వార్డుల్లో అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్ట వచ్చు అని బిల్డర్లు ముందుగా భరత్సింగ్ను సంప్రదిస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. సాక్షి,శామీర్‌పేట్: శామీర్‌పేట మండల రెవెన్యూ పరిధి, ఔటర్ రింగ్ రోడ్డు లోపలి గ్రామాలను కలుపుతూ పంచాయతీ ఉన్న తూంకుంటలో మరి కొన్ని గ్రామాలను విలీనం చేస్తూ తూంకుంట కేంద్రంగా మున్సిపాలిటీని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ మహానగరానికి ఆనుకొని ఉండటమే కాకుండా నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు, కరీంనగర్ – హైదరాబాద్ రాజీవ్ రహదారి ఉండటంతో ఇక్కడి భూములకు ఊహించని రీతిలో రెక్కలొచ్చాయి. ఇదే స్థాయిలో పెద్ద పెద్ద భవంతులు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, విల్లాలకు డిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా భావించిన తూంకుంట మున్సిపాలిటీ 1వ వార్డు కౌన్సిలర్ పూజ భర్త భరత్‌సింగ్ అనుమతులు లేని నిర్మాణ యజమానులకు అండగా ఉంటూ కోట్లు దండుకుంటున్నాడు. అక్రమ నిర్మాణాలు ఇక్కడే అధికం.. తూంకుంట మున్సిపాలిటీలో 16 వార్డులు ఉన్నాయి. కానీ అన్ని వార్డులతో పోలిస్తే ఈ ఒక్క వార్డులోనే 90 శాతం అక్రమ నిర్మాణాలు వేలిశాయి. దీనికి కారణం లేకపోలేదు. 1వ వార్డు కౌన్సిలర్ భర్త భరత్‌సింగ్ తూంకుంట గ్రామపంచాయతీ ఉన్నప్పుడు వార్డు సభ్యుడు. దీంతో ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు, కల్వర్టులు ఉన్నాయనేది పూర్తిగా తెలుసు. అంతేకాకుండా అధికారులకు ఎలాంటి ముడుపులు అప్పజెప్పాలి, అనుమతులు తీసుకోకుండానే నిర్మాణాలు ఎలా చేపట్టాలనేవి పూర్తిగా తెలిసుండటంతో ఇతడి కనుసన్నల్లో మూడు షాపింగ్ కాంప్లెక్సులు.. ఆరు భవంతులుగా అతడి అక్రమ దందా కొనసాగుతోంది. ► ప్రభుత్వ స్థలాలు, నాలాలను కాపాడాల్సిన పదవిలో భార్య ఉండగా భర్త భరత్‌సింగ్ మాత్రం వాటిని కబ్జా చేసి నగదును సొమ్ము చేసుకుంటున్నాడు. ఇకనైనా సంబంధిత శాఖల అధికారులు అక్రమ నిర్మాణాల కట్టడికి చర్యలు తీసుకొని, ప్రభుత్వ ఆస్తులను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు. ►ఇటీవల ఉప్పరిపల్లిలోని 2వ వార్డులో సైతం స్థానిక కౌన్సిలర్‌కు ఫోన్ చేసి అన్నా.. వాళ్లు మనవాళ్లే.. నీకు నేను ఉన్నా.. చూసుకుంటా.. వాళ్ల ను ఇబ్బంది పెట్టకు అంటూ మ« ద్యవర్తిత్వం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ►1వ వార్డులో ఉన్న కల్వర్లులు, ప్రభుత్వ పార్కులు సైతం కబ్జాకు గురయ్యాయి. తూంకుంట నుంచి దేవరయాంజాల్‌కు వెళ్లే దారిలో కల్వర్టును సైతం మూసివేసి నిర్మించిన కట్టడాల వెనుక ఇతని పూర్తి సహకారం ఉన్నట్లు సమాచారం. ►అలాగే కరీంనగర్–హైదరాబాద్ రాజీవ్ రహదారికి ఆనుకొని ప్రభుత్వ పార్కు స్థలంలో ఓ వ్యాపారం కొనసాగుతుంది. ఈ స్థలాన్ని వాడుకున్నందుకు భరత్సింగ్కు ఏటా నగదు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. భరత్‌సింగ్ ఆగడాలతో అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తోటి ఉద్యోగులతో బాహాటంగానే చెప్పుకుంటున్నారు. చదవండి: TS Inter 1st Year Result: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులంతా పాస్ -
హుజురాబాద్: కౌన్సిలర్ ఇంటిముందు బీజేపీ కార్యకర్తల బైఠాయింపు
-
నడిరోడ్డుపై మహిళను తంతూ..
చండీగఢ్ : అప్పు తీర్చలేదంటూ తన అనుచురులతో కలిసి ఓ మహిళను రోడ్డు మీద దారుణంగా చితకబాదాడో కాంగ్రెస్ నాయకుడి సోదరుడు. వివరాలు.. ముక్త్సర్ పట్టణానికి చెందిన కాంగ్రెస్ కౌన్సిలర్ రాకేష్ చౌదరి సోదరుడు తన అనుచరులతో కలిసి ఓ మహిళను విచక్షణా రహితంగా కొట్టారు. అప్పు తీర్చే విషయంలో వివాదం తలెత్తడంతో సదరు మహిళను రోడ్డు మీద పడేసి కాళ్లతో తంతూ.. దారుణంగా హింసించారు. మరో మహిళ అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికి ఫలితం లేకుండా పోయింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. Muktsar: Woman thrashed by brother of Congress Councillor Rakesh Chaudhary and his aides over a money lending issue. SSP Manjeet Dhesi says 'This is an extremely unfortunate incident, we have arrested 6 ppl and will push for severe punishment.Victim admitted to hospital' #Punjab pic.twitter.com/J5PyfZJoi2 — ANI (@ANI) June 14, 2019 ఈ విషయం గురించి ఎస్ఎస్సీ మంజీత్ దేశి మాట్లాడుతూ.. ‘జరిగిన సంఘటన దురదృష్టకరం. ఇందుకు బాధ్యులైన ఆరుగురు వ్యక్తులను గుర్తించాం. వారిని కఠినంగా శిక్షిస్తాం’ అని తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్చినట్లు వెల్లడించారు. -
సీఎం ఫొటోను మార్ఫింగ్ చేసిన కౌన్సిలర్!
ఘజియాబాద్: ఉత్తరప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఫొటోను మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పోస్టు చేసిన ఓ కౌన్సిలర్ కటకటాలపాలయ్యాడు. యూపీ ఘజియాబాద్‌లోని లోనీ ప్రాంతానికి చెందిన మున్సిపల్ కౌన్సిలర్ రామ్‌కుమార్ చౌహాన్ సీఎం యోగి ముఖాన్ని చెరిపేసి.. మార్ఫింగ్ చేసిన ఫొటోను ఫేస్బుక్లో పోస్టు చేశారు. దీనిపై ఆదిత్యనాథ్ స్థాపించిన హిందు యువ వాహినీ సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో లోనీ బార్డర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి.. నిందితుడిని అరెస్టు చేశారు. ప్రస్తుతం నిందితుడు జ్యుడీషియల్ కష్టడీలో ఉన్నాడు. లోనీ 12వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ అయిన రాంకుమార్ ఫేస్బుక్లో పెట్టిన ఈ వివాదాస్పద పోస్టును తొలగించామని, ఆయన పోస్టుకు సంబంధించిన స్ర్కీన్ షాట్లను భద్రపరిచి.. కేసు విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. -
కొట్టుకున్నారంట..!
కోదాడటౌన్: కోదాడ మున్సిపాలిటీ లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి.. ఓ కౌన్సిలర్‌కు మధ్య అగ్గిరాజుకుంది. ఏమైం దో తెలియదు కానీ.. తనపై కౌన్సిలర్ దాడిచేశాడని డీఈ పోలీసులకు ఫిర్యా దు చేయగా.. కాదు. కాదు డీఈనే తనపై దాడి చేశాడని కౌన్సిలర్ అంటున్నారు.. ఈ సంఘటన జరిగిన సమయంలో మున్సిపల్ కమిషనర్, చైర్పర్సన్ ఇద్దరు అందుబాటులో లేకపోవడంతో సమస్య పోలీస్‌స్టేషన్‌కు చేరిం ది. వివరాలు.. కోదాడ మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డులో ఇటీవల రూ.లక్షతో డ్రెయినేజీ నిర్మాణ పనుల ను పూర్తి చేశారు. వాస్తవానికి కాంట్రాక్టర్ పనులు చేయాల్సి ఉండగా ఆయ న పేరు మీద అదే వార్డు కౌన్సిలర్ పనులు చేసినట్లు సమాచారం. ఈ క్ర మంలో పనులు పరిశీలించి ఎంబీ రికా ర్డు చేసి బిల్లు చెల్లించాలని కౌన్సిలర్ డీఈని కొంత కాలంగా కోరుతున్నట్లు తెలిసింది. కానీ డ్రెయినేజీ లోపభూయిష్టంగా ఉందని, వార్డుకు చెందిన కొందరు తనకు ఫిర్యాదు చేశారని, దీ నిని సరి చేస్తేనే ఎంబీ చేస్తానని డీఈ చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకున్నట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు. ఈ క్రమంలో కౌన్సిలర్ తనపై దాడి చేసి చొక్కా చింపివేశాడని, అసభ్య పదజాలంతో దూషిం చాడని డీఈపురుష్తోతం అంటున్నారు. ఉద్యోగుల విధుల బహిష్కరణ ప్రభుత్వ ఉద్యోగిపై దాడిచేసిన కౌన్సిలర్ కెఎల్ఎన్ ప్రసాద్‌పై చర్య తీసుకోవాలని డిమాం డ్ చేస్తూ మున్సిపల్ ఉద్యోగులు బుధవారం విధులు బహిష్కరించారు. కార్యాలయం నుంచి నేరుగా పోలీస్‌స్టేషన్ వరకు నడుచుకుంటూ వెళ్లి సదరు కౌన్సిలర్‌పై లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. బాధ్య త గల ప్రజాప్రతిని ధిగా ఉంటూ విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగిపై దాడి చేసిన కౌన్సిలర్‌ను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. విపక్షాల ఖండన విధి నిర్వహణలో ఉన్న మున్సిపల్ డీఈపై కౌన్సిలర్ కెఎల్ఎన్ ప్రసాద్ దాడి చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు టీఆర్ఎస్, టీడీపీ, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు పేర్కొన్నారు. దాడి విషయం తెలుసుకున్న వారు మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి డీఈని పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ బాధ్యత మరచి ప్రవర్తించిన కౌన్సిలర్‌ను ఆ పదవి నుంచి తొలగించడంతో పాటు వెంటనే అరె స్టు చేసి కఠినంగా శిక్షించాలని టీఆర్ఎస్ కౌన్సిలర్లు పారా సీతయ్య, నయీ ం, వీరారెడ్డి, షఫీ టీడీపీ కౌన్సిలర్ దండాల వీరభద్రం, ఎస్కె.ఖాజాగౌడ్, వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ తుమ్మలపల్లి భాస్కర్ కోరారు. డీఈనే దాడి చేశాడు: కెఎల్ఎన్ ప్రసాద్, కౌన్సిలర్ డ్రెయినేజీ బిల్లు విషయంలో తాను వివరాలను అడిగేందుకు వెళ్లగా డీఈ ఇబ్బంది పెట్టాడని, ఇదేమిటని అడిగితే తనపై దాడి చేశాడని కౌన్సిలర్ కెఎల్ఎన్ ప్రసాద్ ఆరోపించారు. తాను డీఈపై దాడిచేయలేదన్నారు. -
బాత్రూం శబ్దాలతో పకపకలు..
కొన్ని సందర్భాల్లో ఏమరపాటుతో ఉంటే నవ్వులపాలవడం ఖాయం. అలాంటి ఓ సంఘటనే టెక్సాస్‌లో జరిగింది. మేయర్ అధ్యక్షతన జార్జిటౌన్లో సమావేశం సీరియస్‌గా జరుగుతుండగా అందరూ ఒక్కసారిగా నవ్వడం ప్రారంభించారు. కౌన్సిలర్ రాచెల్ జోన్రో వ్యాధులకు సంబంధించిన విషయం గురించి సీరియస్‌గా చర్చిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాష్‌రూం శబ్దాలు బిగ్గరగా వినపడ్డాయి. తీరా ఏం జరిగిందని చూసేసరికి అదే సమావేశంలో పాల్గొన్న ఓ కౌన్సిలర్ బాత్రూం వెళ్తూ తన మైక్రో ఫోన్‌ని ఆఫ్ చేయడం మరచిపోయినట్లు గ్రహించారు. ఇంకేముంది బాత్రూం శబ్దాలను విన్న ఆ కమిటీలోని సభ్యులందరూ ఎంతగా తమ నవ్వును ఆపుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అంతేకాకుండా టాయిలెట్లో ప్లష్ చేసిన శబ్ధం వచ్చిన తర్వాత చేతులు శుభ్రం చేసుకున్న సౌండ్ రాకపోవడంతో...తమ సహచర సభ్యుడు చేతులు శుభ్రం చేసుకోవడం మరచిపోయి ఉంటుందనుకుంటూ బిగ్గరగా నవ్వారు. ప్రస్తుతం ఆ వీడియో యూ ట్యూబ్‌లో హల్చల్ చేస్తోంది. -
మహిళా భక్తులపై లైంగికదాడికి యత్నం
నిందితుల్లో అధికార పార్టీ కౌన్సిలర్ ? తాడేపల్లి రూరల్: పూజలకోసం వచ్చిన మహిళలపట్ల మద్యం సేవించిన యువకులు అసభ్యంగా ప్రవర్తించడమేగాకుండా వారిపై లైంగికదాడికి యత్నించిన సంఘటన తాడేపల్లి మండలం సీతానగరంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. అదృష్టవశాత్తూ బీటుకానిస్టేబుళ్లు వారిని రక్షించారు. దీనికి సంబంధించి బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తెనాలి గంగానమ్మపేటకు చెందిన మనుగోలు వర్మ వదినకు కొద్దికాలం నుంచి ఆరోగ్యం సరిగ్గా ఉండడం లేదు. స్థానిక గంగానమ్మ గుడిలో పూజలు నిర్వహించి ఆలయ పూజారి సలహా మేరకు పూజాద్రవ్యాలను కృష్ణానదిలో కలిపేందుకు ఆదివారం రాత్రి వర్మ కుటుంబ సభ్యులు ఏడుగురు తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం పెద ఆంజనేయస్వామి దేవాలయానికి వచ్చారు. పూజాద్రవ్యాలను కృష్ణానదిలో కలుపుతుండగా అక్కడికి సమీపంలో ఇసుక తిన్నెలపై మద్యం సేవిస్తున్న మందుబాబుల దృష్టి మహిళలపై పడింది. ముగ్గురు మహిళలపై వారు విచక్షణ కోల్పోయి వయసు కూడా చూడకుండా లైంగిక దాడికి యత్నించారు. వారితో వచ్చిన పురుషులు కూడా అడ్డుకోలేకపోయారు. అటుగా వస్తున్న బీటు కానిస్టేబుళ్లు వీరి కేకలు విని అక్కడకు వెళ్లి మహిళలను రక్షించారు. ఈ మేరకు బాధితులు తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మందుబాబులు తమ వద్ద నుంచి 17 వేల రూపాయల నగదు, మూడు సవర్ల నానుతాడు తీసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సకాలంలో పోలీసులు రాకపోతే బంధువుల ఎదుటే తమపై లైంగికదాడి చేసి, హత్య చేసి ఉండేవారని రోదిస్తూ తెలిపారు. నిందుతుల్లో ఒకరు అధికార పార్టీకి చెందిన మునిసిపల్ కౌన్సిలర్ కుమారుడని తెలియవచ్చింది. పోలీసుల అదుపులో ఐదుగురు ఈ సంఘటనపై ఎస్ఐ వినోద్‌కుమార్ మాట్లాడుతూ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించామని, వారిచ్చిన ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 333, 341, 323, 364, 356, 384, 149 ల కింద కేసు నమోదు చేయడమే కాకుండా, ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారిలో మహానాడుకు చెందిన అల్లాబక్షు, ఎ.స్వామి, అంజిరెడ్డి కాలనీకి చెందిన పద్మారవి, విజయవాడ గిరిపురానికి చెందిన ఖాజా, కత్తుల తులసీకృష్ణ ఉన్నారని చెప్పారు. పరారీలో ఉన్నవారి కోసం గాలిస్తున్నట్టు తెలిపారు. -
బాధ్యతలు చేపట్టిన కొత్త మేయర్లు ఇద్దరు తొలిసారి కౌన్సిలర్లే
సాక్షి, న్యూఢిల్లీ: నగరంలోని మూడు కార్పొరేషన్లకు మేయర్లుగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన వారిలో ఉత్తర ఢిల్లీ మేయర్ చందోలియా మినహా మిగతా ఇద్దరు కౌన్సిలర్లుగా తొలిసారి ఎన్నికైనవారే. వారం క్రితం ఈ మూడు కార్పొరేషన్లు కొత్త మేయర్లను ఎన్నుకున్నాయి. ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా యోగేంద్ర చందోలియా, తూర్పు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా మీనాక్షి, దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరే షన్ మేయర్‌గా ఖుషీ రామ్చునార్ ఎన్నికయ్యారు. ముగ్గురు మేయర్లు బీజేపీకి చెందినవారే. మూడుసార్లు మూడు మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్ పదవులను దక్కించుకున్న బీజేపీ హ్యాట్రిక్ సాధించింది. తూర్పు ఢిల్లీ మేయర్ మీనాక్షి ఢిల్లీకి ఇప్పటివరకు మేయర్లు అయిన వారందరి కంటే పిన్న వయస్కురాలు. 33 ఏళ్ల మీనాక్షి శివ్‌నగర్ అనధికార కాలనీ నుంచి కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. మేయర్‌గా వర్షాకాల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారిస్తానని మీనాక్షి అంటున్నారు. దక్షిణ ఢిల్లీ మేయర్ ఖుషీరామ్ కూడా తొలిసారిగా కౌన్సిలర్‌గా ఎన్నికైనవారే. తన తండ్రి ఎమ్సీడీలో పారిశుధ్య కార్మికునిగా పనిచేసేవారని ఆయన చెబుతున్నారు. మదన్గీర్లోని జె.జె.కాలనీలోగల మూడంతస్తుల భవనంలోని పైఅంతస్తులో ఆయన ఉంటున్నారు. మేయర్ అయినందువల్ల భారీ అధికారిక నివాసం కేటాయించాలని దక్షిణ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కోరింది. ఇల్లు చిన్నదిగా ఉండడంతో తనను కలవడానికి వచ్చేవారు ఇబ్బందిపడుతున్నారని ఖుషీరామ్ అంటున్నారు. మేయర్‌గా బాధ్యతలు చేపట్టిన తాను పార్కింగ్ సమస్యపై దృష్టి సారిస్తానని ఆయన చెబుతున్నారు. ఉత్తర ఢిల్లీ మేయర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన బీజే పీ సీనియర్ నేత యోగేంద్ర చందోలియా పారిశుధ్యంపై ప్రధానంగా దృష్టి సారిస్తానంటున్నారు. ఏకీకృత ఎమ్సీడీ స్టాండింగ్ కమిటీ అధ్యక్షునిగా రెండుసార్లు పనిచేసిన ఆయన మూడు మున్సిపల్ కార్పొరేషన్లను ఏకం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రతి ఓటూ కీలకమే
వెంకటగిరిటౌన్,న్యూస్‌లైన్: పట్టణంలోని 16 వార్డులో కౌన్సిలర్ స్థానానికి జరుగుతున్న పోటీ ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఎప్పుడూ ప్రధాన పార్టీల మధ్య జరిగే ఈ వార్డులో ఈ ధపా పట్టణంలోనే అత్యధికంగా 9 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలయిన వైఎస్సార్సీపీ, టీడీపీ, కాంగ్రెస్ట్, బీజేపీ, లోక్‌సత్తా అభ్యర్థులతో పాటు నలుగురు ఇండిపెండెంట్లు ఈ వార్డు బరిలో ఉన్నారు. దీంతో ప్రతి ఓటూ కీలకంగా మారింది. టీడీపీ మాజీ కౌన్సిలర్ బీరం రాజేశ్వరరావు ఈ వార్డు నుంచి తిరిగి పోటీలో ఉన్నారు. తొలుత ఈ వార్డు నుంచి 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు పోటీచేసిన పలువురిని బుజ్జగింజి పోటీ నుంచి విరమింపజేశారు. చివరకు 9 మంది బరిలో ఉండడంతో పట్టణంలో ఈ వార్డు పలితంపై ఆసక్తి నెలకొంది. కాగా 1868 మంది ఓటర్లు ఉన్న ఈ వార్డులో ప్రతి ఓటూ కీలకంగా మారుతుండడంతో వలసలు వెళ్లిన ఓటర్లును పోలింగ్‌కు రప్పించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి.