పోక్సో చట్టం కింద కేసు నమోదు... రిమాండ్‌కు తరలింపు
బోధన్ /ఎడపల్లి(బోధన్): నిజామాబాద్ జిల్లా బోధన్ పట్ట ణంలోని శక్కర్ నగర్ 3వ వార్డు కౌన్సిలర్ కొత్తపల్లి రాధాకృష్ణ అదే వార్డుకు చెందిన ఓ మైనర్ బాలిక (16)పై లైంగికదాడికి పాల్పడ్డాడంటూ ఎడపల్లిలో స్థానిక యువకులు దాడి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. వివరాలిలా.. బాలిక తన తల్లికి అనారోగ్యంగా ఉండడంతో మందులు తీసుకురావడానికి సోమవారం సాయంత్రం బోధన్ నుంచి ఆటోలో నిజామాబాద్‌కు వెళుతుండగా గమనించిన కౌన్సిలర్ కారులో వెంబడించాడు.
ఎడపల్లి మండలం మంగల్ పాడ్ రోడ్డు వద్ద ఆటోను ఆపి కారులో వెళ్దామని చెప్పడంతో తెలిసిన వ్యక్తి కావడంతో ఆ బాలిక కౌన్సిలర్ వెంట వెళ్లింది. కారును నిజామాబాద్‌కు కాకుండా ఎడపల్లి నుంచి కూర్నపల్లి వెళ్లే దారిలోకి మళ్లించి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అక్కడి నుంచి బాలికను తీసు కొచ్చిన నిందితుడు ఓ వైన్స్ వద్ద కారు ఆపి మద్యం సేవిస్తుండగా.. కారులో ఉన్న బాలిక కేకలు వేసింది. గమనించిన స్థానికులు అనుమానంతో కౌన్సిలర్‌ను ఏమైందని ప్రశ్నించారు. సరైన సమాధానం చెప్పక పోవడంతో యువకులు బాలికను అడగడంతో విషయం చెప్పింది. యువకులు ఆగ్రహంతో నిందితుడిని చితకబాదారు. అనంతరం ఎడపల్లి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడిని బోధన్‌లోని సీఐ కార్యాలయానికి తరలించారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. నిందితుడిపై పోక్సో చట్టం కేసు నమోదు చేసి మంగళవారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
అర్ధరాత్రి ఉద్రిక్తత..
బాలికపై అఘాయిత్యం ఘటన తెలియడంతో స్థానిక మైనారిటీ నాయకులు, యువకులు అర్ధ రాత్రి పెద్ద ఎత్తున బోధన్‌లోని సీఐ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వడంతో సుమారు గంట అనంతరం యువకులు ఆందోళన విరమించారు. అసెంబ్లీ ఎన్ని కల ముందు నిందితుడి తమ్ముడు సైతం అదే వార్డుకు చెంది న మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడి పోక్సో చట్టం కింద రిమాండ్‌కు వెళ్లాడు. ఆ ఘటనలో తమ్ముడిని రక్షించే ఉద్దేశంతో బాధిత కుటుంబాన్ని భయభ్రాంతులకు గురిచేసి నట్లు తెలియడంతో రాధాకృష్ణ పై పోలీసులు పోక్సో కేసు న మోదుచేసి రిమాండ్‌కు తరలించారు. టీఆర్‌ఎస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్‌గా ఉన్న రాధాకృష్ణను అప్పటి ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ అమేర్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పదవి నుంచి తొలగించి పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment