టీఎంసీ కార్యకర్తపై కౌన్సిలర్‌ దాడి.. వీడియో వైరల్‌ | TMC Councillor slaps party worker in viral video | Sakshi
Sakshi News home page

టీఎంసీ కార్యకర్తపై కౌన్సిలర్‌ దాడి.. వీడియో వైరల్‌

Published Tue, Jul 16 2024 7:16 PM | Last Updated on Tue, Jul 16 2024 7:39 PM

TMC Councillor slaps party worker in viral video

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్ కౌన్సిలర్‌ సొంత పార్టీ కార్యకర్తపైనే దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

వివరాల్లోకి వెళ్లితే.. కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ 18వ వార్డు టీఎంసీ కౌన్సిలర్‌ సునందా సర్కార్‌ అదే వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త(18వార్డ్‌ టీఎంసీ యూత్‌ ప్రెసిడెంట్‌)పై దాడి చేశారు. పలు అవినీతి కేసుల్లో సునందాకు ప్రమేయం ఉందని సదరు కార్యకర్త కొంత కాలం నుంచి ఆమెపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం అతను కనిపించగానే  కోపం పట్టలేక కౌన్సిల్‌ సునందా కార్యకర్తపై దాడి చేశారు.

 

కార్యకర్తపై కౌన్సిల్‌ దాడి చేయటంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్‌ ఘోష్‌ స్పందించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన, సీనియర్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా జగ్రత్తగా ఉండాలి. ఇది చాలా హాస్యాస్పదమైనది’ అని అన్నారు. అయితే టీఎంసీ కౌన్సిల్ సొంతపార్టీ కార్యకర్తపై చేసిన దాడి ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ ఘటన బెంగాల్‌  టీఎంసీ పార్టీ అంతర్గత  గందరగోళం, నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలను  నిదర్శనమని పేర్కొంది. సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రటరీ మహ్మద్‌ సాలిమ్‌ ఖండించారు. ఈ ఘటనను చూస్తే.. ‘వీధి న్యాయం’లా కనిపిస్తోందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement