TMC worker
-
టీఎంసీ కార్యకర్తపై కౌన్సిలర్ దాడి.. వీడియో వైరల్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ కౌన్సిలర్ సొంత పార్టీ కార్యకర్తపైనే దాడి చేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వివరాల్లోకి వెళ్లితే.. కోల్కతా మున్సిపల్ కార్పొరేషన్ 18వ వార్డు టీఎంసీ కౌన్సిలర్ సునందా సర్కార్ అదే వార్డుకు చెందిన పార్టీ కార్యకర్త(18వార్డ్ టీఎంసీ యూత్ ప్రెసిడెంట్)పై దాడి చేశారు. పలు అవినీతి కేసుల్లో సునందాకు ప్రమేయం ఉందని సదరు కార్యకర్త కొంత కాలం నుంచి ఆమెపై ఆరోపణలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మంగళవారం అతను కనిపించగానే కోపం పట్టలేక కౌన్సిల్ సునందా కార్యకర్తపై దాడి చేశారు.This is one of the “finest” examples of the “Joy Bangla” model currently being implemented across West Bengal by TMC “luminaries”. Ms Sunanda Sarkar, TMC Councillor of Ward 18 is seen here administering a dose of “Joy Bangla” to TMC youth wing president of Ward 18 Mr Kedar… pic.twitter.com/R8rpZ5YIru— Dr. Anirban Ganguly (অনির্বাণ গঙ্গোপাধ্যায়) (@anirbanganguly) July 16, 2024 కార్యకర్తపై కౌన్సిల్ దాడి చేయటంపై టీఎంసీ అధికార ప్రతినిధి కునాల్ ఘోష్ స్పందించారు. ‘ఇది చాలా దురదృష్టకరమైన ఘటన, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు చాలా జగ్రత్తగా ఉండాలి. ఇది చాలా హాస్యాస్పదమైనది’ అని అన్నారు. అయితే టీఎంసీ కౌన్సిల్ సొంతపార్టీ కార్యకర్తపై చేసిన దాడి ప్రతిపక్ష బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ ఘటన బెంగాల్ టీఎంసీ పార్టీ అంతర్గత గందరగోళం, నేతలు, కార్యకర్తల మధ్య ఘర్షణలను నిదర్శనమని పేర్కొంది. సీపీఐ(ఎం) రాష్ట్ర సెక్రటరీ మహ్మద్ సాలిమ్ ఖండించారు. ఈ ఘటనను చూస్తే.. ‘వీధి న్యాయం’లా కనిపిస్తోందన్నారు. -
రూపా గంగూలీపై ఎఫ్ఐఆర్
కోల్కతా: బీజేపీ నేత రూపా గంగూలీ దురుసుగా ప్రవర్తించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వాదులాడటమే కాకుండా ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను తోసివేశారు. అది కూడా పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హౌరా నియోజక వర్గం నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఒకప్పటి నటి రూపా గంగూలీ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం ఇక్కడ నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఆమెకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో ఆమె కాస్త దురుసుగా మాట్లాడటమే కాకుండా అక్కడ టీఎంసీ కార్యకర్తలపై చేయిచేసుకుంటూ వారిని తోసి వేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు కారణమైన రూపా గంగూలీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. -
స్థానిక ఎన్నికల్లో కాల్పులు..ఒకరు మృతి
కాట్వా(పశ్చిమబెంగాల్): స్థానిక ఎన్నికల నేపథ్యంలో చెలరేగిన అల్లర్లలో ఓ వ్యక్తి మరణించాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక ఎన్నికల పోలింగ్ శనివారం ఉదయం ప్రారంభమైంది. కాట్వా మున్సిపాలిటీ 14వ వార్డులోని పోలింగ్ బూత్ ఎదుట తృణముల్ కాంగ్రెస్(టీఎంసీ) కి చెందిన కార్యకర్తని ప్రత్యర్థులు కాల్చి చంపారు. మృతుడు ఇంద్రజిత్ సింగ్ గా పోలీసులు గుర్తించారు. ఈ హత్య వెనుక కాంగ్రెస్ హస్తం ఉన్నట్లు టీఎంసీ ఆరోపిస్తోంది. ఇక్కడ కాంగ్రెస్ కి బలమైన క్యాడర్ ఉండటమేకాకుండా గత ఎన్నికల్లో ఈ మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. మృతుడి శరీరాన్ని పోస్టుమార్టం నిమిత్తం కాట్వా సబ్ డివిజనల్ ఆస్పత్రికి తరలించారు.