రూపా గంగూలీపై ఎఫ్ఐఆర్ | BJP's star candidate Rupa Ganguly pushes TMC worker in Howrah | Sakshi
Sakshi News home page

రూపా గంగూలీపై ఎఫ్ఐఆర్

Published Mon, Apr 25 2016 12:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:13 PM

రూపా గంగూలీపై ఎఫ్ఐఆర్ - Sakshi

రూపా గంగూలీపై ఎఫ్ఐఆర్

కోల్కతా: బీజేపీ నేత రూపా గంగూలీ దురుసుగా ప్రవర్తించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వాదులాడటమే కాకుండా ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను తోసివేశారు. అది కూడా పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హౌరా నియోజక వర్గం నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఒకప్పటి నటి రూపా గంగూలీ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు.

సోమవారం ఇక్కడ నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఆమెకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో ఆమె కాస్త దురుసుగా మాట్లాడటమే కాకుండా అక్కడ టీఎంసీ కార్యకర్తలపై చేయిచేసుకుంటూ వారిని తోసి వేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు కారణమైన రూపా గంగూలీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement