Roopa Ganguly
-
భర్తకు విడాకులు.. సింగర్‌తో హీరోయిన్ సహజీవనం.. చివరకు అది కూడా!
రూపా గంగూలీ.. అలనాటి బెంగాలీ హీరోయిన్. మహాభారత్ సీరియల్లో ద్రౌపదిగా నటించి అన్ని భాషల ప్రేక్షకులకూ దగ్గరైంది. సీరియల్స్ మాత్రమే కాకుండా షార్ట్ ఫిలింస్, సినిమాల్లోనూ నటించింది. హిందీ, ఇంగ్లీష్, ఇటాలియన్, బెంగాలీ, కన్నడ, మలయాళ, అస్సామీ భాషల్లో నటించింది. తెలుగులో కథానాయికగా శశిరేఖ శపథం, నా ఇల్లే నా స్వర్గం, ఇన్స్పెక్టర్ భవానీ సినిమాలు చేసింది. ఎంతోమంది గొప్పగొప్ప దర్శకులతో పని చేసిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంది. కొడుకు పుట్టాక విడాకులు నటి రూపా గంగూలీ.. 1992లో మెకానికల్ ఇంజనీర్ ద్రుభో ముఖర్జీని పెళ్లాడింది. వీరికి 1997లో ఆకాశ్ అనే తనయుడు జన్మించాడు. కానీ తర్వాత కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఎక్కువకాలం కలిసి ఉండలేకపోయారు. 2007లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత రూపా బెంగాలీ సింగర్ దిబ్యేందు ముఖర్జీని ప్రేమించింది. వీరిద్దరూ కలిసి జీవించాలనుకున్నారు. రూపా ఇంట్లోనే దిబ్యేందు తిష్ట వేశాడు. కొన్నేళ్లపాటు సహజీవనం చేశారు. కానీ చివరకు ఈ బంధం కూడా ఎక్కువ కాలం నిలవలేదు. మూడుసార్లు చనిపోయేందుకు ప్రయత్నించా దీని గురించి రూపా గంగూలీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒకానొక సమయంలో నేను చనిపోవాలనుకున్నాను. మూడుసార్లు ఆత్మహత్యకు యత్నించాను. కొడుకు పుట్టకముందు ఓసారి వాడు పుట్టిన తర్వాత రెండుసార్లు చనిపోదామని ప్రయత్నించాను. కానీ ప్రతిసారీ బతికిపోయేదాన్ని. నన్ను నేను అంతం చేసుకోవాలని గట్టిగానే ప్రయత్నించాను. కానీ దేవుడు దాన్ని జరగనివ్వలేదు. వైవాహిక బంధంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నాను. సారీ చెప్పగానే విడాకులు వద్దనుకునేదాన్ని విడాకులు తీసుకుందామని ఎన్నోసార్లు అనుకునేదాన్ని, మళ్లీ చివరి నిమిషంలో ఆగిపోయేదాన్ని. విడాకులు కావాలనగానే అతడు సారీ చెప్పేవాడు. అలా మా మధ్య గొడవ చల్లారిపోయేది. కానీ 2002 సంవత్సరం నాటికి ఇంకా భరించడం నా వల్ల కాలేదు' అని చెప్పుకొచ్చింది. అలా వీరు 2007లో అధికారికంగా విడిపోయారు. భర్త నుంచి ఒక్క రూపాయి కూడా భరణంగా ఆశించలేదు రూపా. గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: ఊహించని పేరు, డబ్బు.. చివరి క్షణాల్లో నరకం.. ‘ఐటమ్ గర్ల్’ విషాద గాథ -
జీవించే హక్కుంది.. ప్రజలను బతకనివ్వండి.. కన్నీరుపెట్టిన ఎంపీ..
సాక్షి, న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో చోటుచేసుకున్న బీర్బమ్ కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ఘటనలో 8 మంది సజీవ దహనం అయ్యారు. తాజాగా ఈ ఘటన పార్లమెంట్లో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఎంపీ రూపా గంగూలీ ఈ ఘటనపై రాజ్యసభలో మాట్లాడుతూ ఉద్వేగానికిలోనై ఒక్కసారిగా కన్నీరు పెట్టుకున్నారు. జీరో అవర్‌లో భాగంగా ఆమె శుక్రవారం రాజ్యసభలో మాట్లాడుతూ.. బెంగాల్‌ను ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బెంగాల్లో జరిగిన బీర్బమ్ హింస గురించి ప్రస్తావించారు. బెంగాల రాష్ట్రంలో దారుణ హత్యలు జరుగుతున్నాయని ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అక్కడ కేవలం 8 మంది మాత్రమే మరణించారని, ఎక్కువ మంది చనిపోలేదని మమత సర్కార్‌పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. మరోవైపు ఆమె ఈ విషయంపై మాట్లాడుతున్న సమయంలో తృణముల్ కాంగ్రెస్ ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. అయినప్పటికీ ఆమె మాట్లాడుతూనే అటాప్పీ రిపోర్ట్ ప్రకారం.. చనిపోయిన వారిని మొదట దారుణంగా కొట్టారని ఆ తర్వాత సామూహిక హత్యలు చోటుచేసుకున్నాయని రూపా గంగూలీ ఆరోపించారు. భారత్‌లో బెంగాల్ భాగమని, అక్కడ జీవించే హక్కు ఉందని, మేం బెంగాల్లో పుట్టామని, అక్కడ పుట్టడం తప్పుకాదు అని, మహాకాళి భూమి అని ఆమె ఆవేశంగా మాట్లాడుతూ భావోద్వేగంతో కన్నీరుపెట్టుకున్నారు. అయితే, గత సోమవారం తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన బర్షాల్ గ్రామ పంచాయతీ ఉప ప్రధాన్ భాదు షేక్ హత్య జరిగింది. ఈ ఘటన జరిగిన కొద్దిగంటలకే బోగ్టూయి గ్రామంలో హింస చెలరేగింది. దాదాపు డజను ప్రత్యర్థుల ఇళ్లకు కొందరు వ్యక్తులు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో 8మంది సజీవదహనం అయ్యారు. తృణమూల్ బ్లాక్ ప్రెసిడెంట్ అనరుల్ హుస్సేన్ సహా 23మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు.. బీర్బమ్ సజీవదహనాల కేసులో కోల్కత్తా హైకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. #WATCH | BJP MP Roopa Ganguly broke down in Rajya Sabha over Birbhum incident, demanded President's rule in West Bengal saying, "Mass killings are happening there, people are fleeing the state... it is no more liveable..." pic.twitter.com/EKQLed8But — ANI (@ANI) March 25, 2022 -
మద్యం మత్తులో బీజేపీ ఎంపీ కుమారుడి బీభత్సం
కోల్‌కతా: నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ కుమారుడు మద్యం మత్తులో వాహనాన్ని నడిపి బీభత్సం సృష్టించాడు. రాష్ డ్రైవింగ్‌తో విలాసవంతమైన గోల్ఫ్ గార్డెన్ ఏరియాలోని కోల్‌కతా క్లబ్ గోడను ఢీకొట్టాడు. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కానీ గంగూలీ కొడుకు ఆకాష్ ముఖోపాధ్యాయ్ (20) మద్యం మత్తులో అతివేగంగా దూసుకొచ్చి ప్రమాదానికి కారణమయ్యాడన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆకాష్ బ్లాక్ సుడాన్ కారుతో మితిమీరిన వేగంతో దూసుకొచ్చాడు. అసలే మద్యం మత్తులో కారును అదుపు చేయలేక సౌత్ కోల్‌కతా క్లబ్‌ను గోడను ఢీకొట్టాడు. దీంతో గోడ కూలి, అక్కడే కారు చిక్కుపోయింది. డ్రైవర్ సీటులో ఆకాష్ ఇరుక్కుపోయాడు. అయితే అదృష్టవశాత్తూ అక్కుడన్న వారు భారీ ప్రమాదంనుంచి బయటపడ్డారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్టు ప్రత్యక్ష సాక్షలు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు తృటిలో తప్పించుకున్నారని పోలీసు వర్గాలు తెలిపాయి. అనంతరం సమీపంలోనే ఉన్న ముఖోపాధ్యాయ్ తండ్రి సంఘటనా స్థలానికి చేరుకుని కారులో చిక్కుకుపోయిన ఆకాష్‌ను బయటికి తీశారు. అయితే మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నాడని స్థానికులు ఆరోపించడంతో అతన్ని పోలీసులు జాదవ్‌పూర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన ఎంపీ రూపా గంగూలీ తమ నివాసానికి సమీంలో, తన కొడుకు ప్రమాదానికి గురయ్యాడంటూ ట్వీట్ చేశారు. నా కొడుకును ప్రేమిస్తున్నాను . కానీ అదే సమయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయాలకు తావు లేదనీ, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారని తెలిపారు. ఈ ట్వీట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్యాగ్ చేయడం గమనార్హం. My son has met with an accident near MY RESIDENCE. I called police to tke care of it with all legal implications No favours/ politics plz. I love my son & will tk cr of him BUT, LAW SHOULD TAKE ITS OWN COURSE. न मै घलत करती हूं, न मै सेहेती हू @narendramodi मै बिकाऊ नही हूँ — Roopa Ganguly (@RoopaSpeaks) August 15, 2019 -
‘ఈ విజయం ఊహించిందే’
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో బీజేపీ గెలుపు ఊహించిందేనని ఆ పార్టీ నేత రూపా గంగూలీ అన్నారు. కాషాయకూటమి కొన్ని స్ధానాలను కోల్పోతుందని విపక్ష నేతలు అంచనా వేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతింటుందని భావించారని, అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం ఉండదని, జాతీయ అంశాలే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ముందుకొస్తాయని ఆమె పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 290 స్ధానాల్లో ఎన్డీయే 340కి పైగా స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతోంది. -
రూపా గంగూలీపై పోలీసులకు ఫిర్యాదు
కోల్‌కతా: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీపైపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైంది. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో చెప్పే ఉద్దేశంతో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారంత తమ ఇళ్లలోని మహిళలను బెంగాల్ పంపించాలని, అలా చేస్తే వారు కచ్చితంగా 15 రోజుల్లో లైంగిక దాడికి గురవుతారని సంచలన ఆరోపణలు చేశారు. అలా జరగకుంటే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటానని అన్నారు. ఈ మాటలు అన్న క్షణంలోనే స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మంత్రి శోభన్‌దేవ్ చటోపాధ్యాయ్ స్పందిస్తూ అంతకంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మొత్తం రాష్ట్రాన్ని నిందించేముందు.. ఆమె(రూపా గంగూలీ) బెంగాల్లో ఎన్నిసార్లు లైంగిక దాడికి గురైందో కూడా బయటకు చెప్పాలి. ఆ విషయం చెబితేనే ఆమె మారాష్ట్రంపై చేసిన నిర్లక్ష్యపు ఆరోపణలు నిజమని తెలుస్తుంది' అన్నారు. ఇలా ఇరు పార్టీల నేతలు దిగజారి వ్యాఖ్యలు చేస్తుండటంతో రెండు వైపుల నుంచి కాస్తంత ఆలోచన చేసి మాట్లాడాలని, ఇరువురు మాట్లాడిన మాటలని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా పరిస్థితి తీవ్రతను తెలియజేశారని భావించాలంటూ బీజేపీ వర్గాలు సర్ది చెప్పే ప్రయత్నానికి దిగాయి. -
ఎంపీ రూపా గంగూలీని అడ్డుకున్న పోలీసులు
కోల్‌కతా: బీజేపీ ఎంపీ రూపా గంగూలీతో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు శుక్రవారం కోల్‌కతా విమానాశ్రయం సమీపంలో అడ్డుకున్నారు. పశ్చిమ్‌బంగాలోని బసిర్హత్ ప్రాంతంలో చెలరేగిన మతఘర్షణల్లో ఒకరు మృతి చెందగా, పలువురు గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘర్షణల్లో గాయపడిన వారిని పరామర్శించేందుకు వెళుతున్న ఎంపీ రూపా గంగూలీతో పాటు ఇతరులను పోలీసులు మధ్యలోనే అదుపులోకి తీసుకున్నారు. పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నందున శాంతిభద్రతల దృష్ట్యా బసిరహత్లో పర్యటనకు ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు. బసిరహత్ వెళ్లే మార్గంలో బారికేడ్లు ఏర్పాటు చేసి, గట్టి బందోబస్తు నిర్వహిస్తున్నారు. అయితే పరిస్థితి సద్దుమణిగే వరకూ అక్కడకు ఏ రాజకీయ నేతలు పర్యటించవద్దని, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా తమ పార్టీ నేతలు కూడా అక్కడ పర్యటించలేదని తెలిపారు. కాగా బెంగాల్‌లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో చెలరేగిన హింస ఆగడం లేదు. బదూరియలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఓ యువకుడు ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్‌పై చెలరేగిన వివాదం అంతకంతకూ పెరిగిపోయి రెండువర్గాల మధ్య ఘర్షణకు దారి తీశాయి. ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. భవనాలపై దాడులకు దిగారు. వాహనాలకు నిప్పుపెట్టారు. ఇరు వర్గాల ఘర్షణలతో బదూరియా రణరంగంగా మారింది. మంగళవారం నాటికి అల్లరు బదురియా, హరోరా, స్వరూప్‌నగర్, దిగంగ ప్రాంతాలకు వ్యాపించాయి. అయితే పుకార్లు వ్యాపించడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. మరోవైపు శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భారీగా భద్రత బలగాలు భారీగా మోహరించాయి. నాలుగు కంపెనీల పారామిలటరీ బలగాలను రంగంలోకి దించారు. అటు బదూరియా అల్లర్లపై కేంద్ర హోంశాఖ ఆరా తీసింది. ఎప్పటికప్పుడు వివరాలను అడిగి తెలుసుకుంటోంది. -
ప్రముఖ నటి, ఎంపీకి తీవ్ర అస్వస్థత
న్యూఢిల్లీ: ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ రూపా గంగూలీ (49) తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సెరిబ్రల్ ఎటాక్ రావడంతో ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఆమెను వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం సాయంత్రం ఆమె తనకు తలనొప్పిగా ఉందని, కళ్లు కూడా సరిగా కనిపించడం లేదని చెప్పడంతో వెంటనే ఆస్పత్రికి తరలించినట్టు పశ్చిమ బెంగాల్ బీజేపీ వైస్ ప్రెసిడెంట్ జాయ్ ప్రకాశ్ మజుందార్ తెలిపారు. కోల్‌కతాలోని సాల్ట్‌లేక్‌లోని ఏఎంఆర్ఏ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని, ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారన్న విషయాన్ని వైద్యులు ఇంకా చెప్పలేదని ప్రకాశ్ తెలిపారు. పశ్చిమ బెంగాల్ రాజధాని కోలకత్తాకు సమీపంలోని కళ్యాణిలో జన్మించిన రూపా గంగూలీ పలు చిత్రాల్లో బాలనటిగా తన కరియర్ ను ప్రారంభించారు. ఆ తర్వాత ప్రముఖ పౌరాణిక టీవీ మెగా సీరియల్ 'మహాభారత్' ద్వారా ఆమె బాగా పాపులర్ అయ్యారు. ద్రౌపది పాత్రను పోషించడం ద్వారా మంచి గుర్తింపు పొందారు. అనంతరం పలు సినిమాల్లో నటించిన ఆమె 2015లో బీజేపీ చేరి మహిళా నాయకురాలిగా ఎదిగారు. ఇటీవలి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన ఆమెను బీజేపీ అధిష్టానం రాజ్యసభకు నామినేట్ చేసింది. -
రాజ్యసభకు రూపా గంగూలీ
న్యూఢిల్లీ: ప్రముఖ బుల్లితెర నటి, పశ్చిమ బెంగాల్ బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు రూపా గంగూలీ(49) రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఆమెను కేంద్రం నామినేట్ చేసింది. ఈమేరకు రాష్ట్రపతి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 1988లో ప్రసారమైన మహాభారతం సీరియల్లో ద్రౌపదిగా నటించి రూపా ప్రేక్షకాదరణ పొందారు. ఇటీవలి పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసి ఓడారు. తనను రాజ్యసభ సభ్యురాలిగా ఎంపిక చేసినందుకు బీజేపీ నాయకత్వానికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తానన్నారు. పలు హిందీ, బెంగాలీ చిత్రాల్లో నటించిన రూపా గంగూలీ 2015లో బీజేపీలో చేరారు. -
సిద్ధూ స్థానంలో రూపా గంగూలీ
న్యూఢిల్లీ: ప్రముఖ మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ బీజేపీ నుంచి వైదొలిగి తన రాజ్యసభ స్థానానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలో రూపా గంగూలీని నియమిస్తూ ఆపార్టీ నిర్ణయం తీసుకుంది. నాలుగు నెలల క్రితం పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో స్థానిక క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లాపై పోటీ చేసిన రూపా ఓటిపోయారు. మహాభారత్ టీవీ సీరయల్లోని ద్రౌపది పాత్ర ద్వారా ఆమె ప్రాచుర్యాన్ని పొందిన రూపా గతేడాది బీజేపీలో చేరారు. రాష్ట్రపతి కోటా ద్వారా సిద్ధూ రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి ఆవాజ్ ఇ పంజాబ్ పేరుతో రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. తన ఎంపీ స్థానానికి రాజీనామా చేయడంతో ఆయన స్థానంలోరూపాను నియమిస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. -
రూపా గంగూలీపై దాడి
కోల్ కతా: పశ్చిమ బెంగాల్ బీజేపీ నాయకురాలు రూపా గంగూలీపై గర్తు తెలియని దుండగులు ఆదివారం దాడికి పాల్పడ్డారు. దక్షిణ 24 పరగణ జిల్లాలోని కాక్ డ్విప్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈశ్వరిపూర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన బీజేపీ కార్యకర్తను పరామర్శించి కాక్ డ్విప్ నుంచి తిరిగొస్తుండగా దుండగులు ఆమెపై దాడి చేశారు. టీఎంసీ మద్దతుదారుల దాడిలో గాయపడి కాక్ డ్విప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బీజేపీ కార్యకర్తను పరామర్శించేందుకు ఆమె వెళ్లారు. అక్కడి నుంచి తిరిగొస్తుండగా కొంతమంది గామస్తులు ఆమె కారును అడ్డుకున్నారు. ఆమెపై చేయి చేసుకున్నారు. ఆమె కారు కూడా ధ్వంసం చేశారు. ఈ ఘటనలో రూపా గంగూలీ తలకు గాయం కావడంతో ఆమెను డైమండ్ హార్బర్ ఆస్పత్రికి తరలించారు. స్థానిక టీఎంసీ నాయకులే ఈ దాడికి పాల్పడ్డారని బీజేపీ జాతీయ కార్యదర్శి రాహుల్ సిన్హా ఆరోపించారు. దాడికి కారణమైన వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలానికి భారీగా పోలీసులను తరలించారు. -
రూపా గంగూలీపై ఎఫ్ఐఆర్
కోల్‌కతా: బీజేపీ నేత రూపా గంగూలీ దురుసుగా ప్రవర్తించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో వాదులాడటమే కాకుండా ఆ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను తోసివేశారు. అది కూడా పోలింగ్ బూత్ వద్ద ఈ ఘటన చోటుచేసుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. హౌరా నియోజక వర్గం నుంచి రాజకీయ నాయకురాలిగా మారిన ఒకప్పటి నటి రూపా గంగూలీ బెంగాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. సోమవారం ఇక్కడ నాలుగో దశ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో పోలింగ్ బూత్ వద్దకు వచ్చిన ఆమెకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ వాగ్వాదంలో ఆమె కాస్త దురుసుగా మాట్లాడటమే కాకుండా అక్కడ టీఎంసీ కార్యకర్తలపై చేయిచేసుకుంటూ వారిని తోసి వేశారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి పోలింగ్ బూత్ వద్ద ఘర్షణకు కారణమైన రూపా గంగూలీపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదుచేశారు. -
రూపా గంగూలీపై రజాక్ అనుచిత వ్యాఖ్యలు
కోల్ కతా: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా అధికార టీఎంసీ, బెంగాల్ లో చోటు కోసం పాకులాడుతోన్న బీజేల మధ్య తీవ్ర మాటల యుద్ధం కొనసాగుతోంది. అయితే వాగ్బాణాలు కాస్తా గతితప్పి, మహిళలను కించపరిచేస్థాయికి దిగజారాయి. ప్రముఖ నటి, బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి రూపా గంగూలీపై టీఎంసీకి చెందిన వృద్ధ నేత రజాక్ మొల్లా అనుచిత వ్యాఖ్యలు చేశారు. జనాదరణ పొందిన 'మహాభారత్' సీరియల్ లో ద్రౌపతి పాత్రలో నటించి దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న రూపా గంగూలీ ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో హౌరా (నార్త్) నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. ఆ స్థానంలో ప్రముఖ క్రికెటర్ లక్ష్మీ రతన్ శుక్లా (టీఎంసీ)ను ఆమెను ఢీకొంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో పోరు హోరాహోరీగా మారింది. ఇతర నాయకులు కూడా తమ అభ్యర్థుల కోసం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. బుధవారం టీఎంసీ ప్రచారసభలో పాల్గొన్న ఆ పార్టీ నేత రాజక్ మొల్లా, రూపా గంగూలీని ఉద్దేశించి.. 'ఆమె తాగే సిగరెట్ పొడవు ఎంతుంటుందో నాకు తెలుసు. సీరియల్ పాత్రలోనే కాదు నిజజీవితంలోనూ ఆమె ద్రౌపతే' అని వ్యాఖ్యానించారు. అంతటితో ఆగని రజాక్.. తమ అధినేత్రి మమతా బెనర్జీపైనా, మరో నటి మున్ మున్ సేన్ పైనా అసహనపూరిత వ్యాఖ్యలు చేశారు. మున్ మున్ సేన్ ను పార్లమెంట్ (రాజ్యసభకు) పంపాలని మమత భావిస్తున్నదని, అయితే మున్ మున్ లాంటి సెలబ్రిటీలు ఎంపీలుగా ఏమాత్రం పనికిరారని, వారికి ప్రజాసమస్యలపై అవగాహన ఉండదని, అందుకే మమత ఆపని చేయకూడదని కోరుకుంటున్నట్లు రజాక్ చెప్పారు. అసలే ఎన్నికల సమయం కావటంతో రజాక్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. ఒక మహిళ నేతృత్వంలో నడిచే పార్టీ నాయకులు మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం దారుణమని, రజాక్ తనను అవమానించారని, ఆయనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తానని రూపా గంగూలీ అన్నారు. -
బీజేపీలో చేరిన ప్రముఖ నటి
కోల్ కతా: ప్రముఖ నటి, గాయని రూపా గంగూలీ బుధవారం బీజేపీలో చేరారు. హౌరాలోని శరత్ సదన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు బీజేపీ జెండా అందించి జైట్లీ ఆహ్వానం పలికారు. టీవీ మహాభారతంలో ద్రౌపతి పాత్రతో ఆమె ప్రఖ్యాతి గాంచారు. గౌతమ్ ఘోష్ 'పద్మ నాదిర్ మాజ్హి', అపర్ణా సేన్ 'యుగాంత్', రితుపర్ణ ఘోష్ 'అంతర్ మహలా' సినిమాలు ఆమె మంచి పేరు తెచ్చిపెట్టాయి. 'అబొషెషే' బెంగాలీ సినిమాకు ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ప్రముఖ గాయకుడు కుమార్ సాను కూడా ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.