రూపా గంగూలీపై పోలీసులకు ఫిర్యాదు
కోల్‌కతా: వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రూపా గంగూలీపైపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పరిపాలన ఎంత దారుణంగా ఉందో చెప్పే ఉద్దేశంతో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే మద్దతు ఇస్తున్నారో వారంత తమ ఇళ్లలోని మహిళలను బెంగాల్ పంపించాలని, అలా చేస్తే వారు కచ్చితంగా 15 రోజుల్లో లైంగిక దాడికి గురవుతారని సంచలన ఆరోపణలు చేశారు. అలా జరగకుంటే తన వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటానని అన్నారు.
ఈ మాటలు అన్న క్షణంలోనే స్పందించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మంత్రి శోభన్‌దేవ్ చటోపాధ్యాయ్ స్పందిస్తూ అంతకంటే సంచలన వ్యాఖ్యలు చేశారు. 'మొత్తం రాష్ట్రాన్ని నిందించేముందు.. ఆమె(రూపా గంగూలీ) బెంగాల్‌లో ఎన్నిసార్లు లైంగిక దాడికి గురైందో కూడా బయటకు చెప్పాలి. ఆ విషయం చెబితేనే ఆమె మారాష్ట్రంపై చేసిన నిర్లక్ష్యపు ఆరోపణలు నిజమని తెలుస్తుంది' అన్నారు. ఇలా ఇరు పార్టీల నేతలు దిగజారి వ్యాఖ్యలు చేస్తుండటంతో రెండు వైపుల నుంచి కాస్తంత ఆలోచన చేసి మాట్లాడాలని, ఇరువురు మాట్లాడిన మాటలని మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా పరిస్థితి తీవ్రతను తెలియజేశారని భావించాలంటూ బీజేపీ వర్గాలు సర్ది చెప్పే ప్రయత్నానికి దిగాయి.