బీజేపీలో చేరిన ప్రముఖ నటి | Actress Roopa Ganguly joins BJP | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ప్రముఖ నటి

Published Wed, Jan 7 2015 4:25 PM | Last Updated on Wed, Apr 3 2019 8:58 PM

బీజేపీలో చేరిన ప్రముఖ నటి - Sakshi

బీజేపీలో చేరిన ప్రముఖ నటి

కోల్ కతా: ప్రముఖ నటి, గాయని రూపా గంగూలీ బుధవారం బీజేపీలో చేరారు. హౌరాలోని శరత్ సదన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఆమెకు బీజేపీ జెండా అందించి జైట్లీ ఆహ్వానం పలికారు. టీవీ మహాభారతంలో ద్రౌపతి పాత్రతో ఆమె ప్రఖ్యాతి గాంచారు.

గౌతమ్ ఘోష్ 'పద్మ నాదిర్ మాజ్హి', అపర్ణా సేన్ 'యుగాంత్', రితుపర్ణ ఘోష్ 'అంతర్ మహలా' సినిమాలు ఆమె మంచి  పేరు తెచ్చిపెట్టాయి. 'అబొషెషే' బెంగాలీ సినిమాకు ఆమె ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు  అందుకున్నారు. ప్రముఖ గాయకుడు కుమార్ సాను కూడా ఇటీవల బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement