
కోల్‌కతా : లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యంతో బీజేపీ గెలుపు ఊహించిందేనని ఆ పార్టీ నేత రూపా గంగూలీ అన్నారు. కాషాయకూటమి కొన్ని స్ధానాలను కోల్పోతుందని విపక్ష నేతలు అంచనా వేశారని, అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి ఎదురైన రాష్ట్రాల్లో బీజేపీ దెబ్బతింటుందని భావించారని, అయితే వారి అంచనాలు తలకిందులయ్యాయని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో లోక్‌సభ ఎన్నికలకు ఏమాత్రం సంబంధం ఉండదని, జాతీయ అంశాలే ఈ ఎన్నికల్లో ప్రధానంగా ముందుకొస్తాయని ఆమె పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 290 స్ధానాల్లో ఎన్డీయే 340కి పైగా స్ధానాల్లో ఆధిక్యంతో దూసుకెళుతోంది.
Comments
Please login to add a commentAdd a comment