సాక్షి,ఉన్నావో(యూపీ): బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ పేరు ఓటర్ల జాబితా నుంచి గల్లంతైంది.యూపీ స్ధానిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు గదన్‌ఖేడా పోలింగ్ బూత్‌కు వెళ్లిన సాక్షి మహరాజ్ తన పేరు ఓటరు జాబితాలో లేకపోవడంతో ఓటు వేయకుండానే అక్కడి నుంచి వెనుతిరిగారు.తన పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సాక్షి మహరాజ్ ఇది కుట్రపూరిత చర్య అంటూ తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఎంపీ పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంపై జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. జిల్లా మేజిస్ర్టేట్ కొత్తవారని, అయితే అదనపు జిల్లా మేజిస్ర్టేట్(ఏడీఎం) గత ప్రభుత్వ హయాంలో నియమతులపై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేవారని ఎంపీ పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడం వెనుక కుట్ర జరిగిందని సాక్షి మహరాజ్ ఆరోపించారు.తనతో పాటు గదన్‌ఖేడా సాక్షిథామ్ ఆశ్రమ సభ్యుల ఓట్లు కూడా జాబితాలో లేవని ఆరోపించారు.
వివాదాస్పద వ్యాఖ్యలతో సాక్షిమహరాజ్ బీజేపీ ఫైర్‌బ్రాండ్ ఎంపీగా పేరొందిన విషయం తెలిసిందే. మరోవైపు మాజీ కాంగ్రెస్ ఎంపీ అను టాండన్ సైతం తన పేరు ఓటర్ల జాబితాలో లేకపోవడంపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment