Voters list
-
ప్రైవేట్ వ్యక్తి చేతిలో ‘పోలింగ్’ ప్రక్రియ
సాక్షి, అమరావతి : ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కీలకమైన ఓటర్ల జాబితా ప్రక్రియ పర్యవేక్షణ అంతా ఒక ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెడుతూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయంలో ఐటీ ప్రాజెక్టు మేనేజర్‌గా ప్రైవేట్ వ్యక్తి బోడపాటి అనిల్‌ను నియమించడం చర్చ నీయాంశమైంది. తొలుత ఏడాది పాటు ఔట్ సోర్సింగ్ విధానంలో నెలకు రూ.1.40 లక్షల వేతనంతో ఈయన పని చేస్తారని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎంపిక కమిటీ సిఫారసుతో ఈయన్ను నియమించామని తెలిపారు. ఎంపిక కమిటీలో ఎవరున్నారనేది ఉత్తర్వుల్లో ఎక్కడా పేర్కొనకపోవడం గమనార్హం. రాష్ట్రంలో ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్–నెట్‌ను ఐటీ ప్రాజెక్టు మేనేజర్ అమలు చేస్తారని తెలిపారు. ఈవీఎంలు, సాప్ట్వేర్ ట్రాకింగ్‌తో పాటు ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన సర్వం ఇకపై బోడపాటి అనిల్ పర్యవేక్షణలో ఉంటాయి. తద్వారా ఓటర్ల జాబితా సవరణ, పోలింగ్ ప్రక్రియలో పారదర్శకతకు పాతర వేయడమేననే అభిప్రాయం అధికార వర్గాల్లో వ్యక్తం అవుతోంది.ఐటీ ప్రాజెక్టు మేనేజర్ విధులు ఇలా.. » ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఏటా నిరంతర నవీకరణ వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ–సేవా, మీ–సేవా కేంద్రాల ద్వారా ఎలక్టోరల్ రోల్స్‌లో పేరు చేర్చడం, పీవీసీ కార్డుల జారీ కోసం పౌర సేవల దరఖాస్తు అమలు స్థితిని రోజువారీ పర్యవేక్షించడం. » రాష్ట్ర వ్యాప్తంగా ఈవీఎం ట్రాకింగ్ సాఫ్ట్వేర్ ద్వారా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు సంబంధించిన వివిధ సమస్యలను పర్యవేక్షించడం. » ఎస్ఎంఎస్ గేట్‌వే ఏకీకరణ, ఎస్ఎంఎస్ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థలను అమలు చేయడం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ అమలు పర్యవేక్షణ. ఐటీ అప్లికేషన్స్ (ఇఆర్ఓ–నెట్, సైబర్ సెక్యూరిటీ, ఈ–రోల్ పర్యవేక్షణ), ఫామ్ 1–8 డేటా పర్యవేక్షణ, జిల్లా అధికారులు, కేంద్ర ఎన్నికల సంఘం మధ్య ఎప్పటికప్పుడు సమన్వయం. » కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి వివిధ అప్లికేషన్ల పర్యవేక్షణతో పాటు పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్ కాస్టింగ్, కౌంటింగ్ అండ్ ఇండెక్స్ కార్డు అప్లికేషన్ల పర్యవేక్షణ. » కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాలతో ఆన్లైన్ కార్యకలాపాలు, ఐటీ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణ. వీటితో పాటు ఓటర్ల జాబితా సవరణకు ముందు తీసుకోవాల్సిన చర్యలను పూర్తి చేయడం. -
తెలంగాణ ఓటర్ల సంఖ్య 3,35,27,925
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,35,27,925కి పెరిగింది. వీరిలో 1,68,67,735 మంది మహిళలు, 1,66,41,489 మంది పురుషులు, 2,829 మంది ట్రాన్స్జెండర్లు, మరో 15,872 మంది సర్వీసు ఓటర్లు ఉన్నారు. పురుషులతో పోల్చితే మహిళా ఓటర్లు అధిక సంఖ్యలో ఉండటం గమనార్హం. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం 2025లో భాగంగా తుది ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సుదర్శన్‌రెడ్డి ప్రకటించారు. కొత్తగా 2,19,610 ఓటర్లను జాబితాలో చేర్చగా, మరో 1,17,932 ఓటర్లను తొలగించారు. 2024 ఫిబ్రవరి 8న ప్రకటించిన తుది ఓటర్ల జాబితా ప్రకారం అప్పట్లో రాష్ట్రంలో మొత్తం 3,30,21,735 మంది ఓటర్లు ఉన్నారు. 2024తో పోల్చుకుంటే–2025లో ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ పోలింగ్ కేంద్రాల వారీగా 119 శాసనసభ నియోజకవర్గాల తుది ఓటర్ల జాబితాను వెబ్సైట్ (https://ceotelangana.nic.in)లో ఉంచినట్టు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. కొత్తగా నమోదైన ఓటర్లకు ఓటరు గుర్తింపు కార్డులను పోస్టు ద్వారా ఇళ్లకు ఉచితంగా పంపిస్తున్నామన్నారు. ఓటర్ల నమోదు, వివరాల దిద్దుబాటు నిరంతర ప్రక్రియ అని, ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం వెబ్సైట్ (https://voters.eci.gov.in)లేదా ఓటర్ హెల్ప్ లైన్ యాప్‌ద్వారా ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఏడాది జనవరి 1 నాటికి 18 ఏళ్లు నిండినవారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే వారు సైతం ఓటరుగా నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని, వారిని18 ఏళ్లు నిండిన తర్వాత జాబితాలో చేర్చుతామని వివరించారు. కొత్త ఓటర్ల నమోదుకు ఫారం–6, ప్రవాస ఓటర్లకు ఫారం–6ఏ, స్వచ్ఛందంగా ఆధార్ వివరాలు ఇవ్వడానికి ఫారం–6బీ, ఓటర్ల తొలగింపు కోసం ఫారం–7, వివరాల దిద్దుబాటు/నవీకరణ కోసం ఫారం–8 ఉపయోగించాలని చెప్పారు. పెరిగిన పోలింగ్ కేంద్రాల సంఖ్య రాష్ట్రంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య 35,356 నుంచి 35,907కి పెరిగింది. పట్టణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 14,464 నుంచి 14,750కి, గ్రామీణ పోలింగ్ కేంద్రాల సంఖ్య 20,892 నుంచి 21,157కి పెరిగింది. మొత్తం 551 పోలింగ్ కేంద్రాలు కొత్తగా ఏర్పాటు కానుండగా, అందులో 286 పట్టణ, 265 గ్రామీణ పోలింగ్ కేంద్రాలున్నాయి. 90 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ రాష్ట్రంలోని 90 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉండడం గమనార్హం. కేవలం 29 స్థానాల్లోనే పురుష ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల్లోని నియోజకవర్గాలు మినహాయిస్తే దాదాపుగా అన్ని చోట్లా మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. -
ఇదేం విచిత్రం.. 138 మందికి ఒక్కడే తండ్రి..
ఎవరైనా ఒకరు, ఇద్దరికీ తండ్రి అనడం కామన్. లేదంటే నలుగురు, ఆరుగురుకి తండ్రిగా ఉంటారు. కానీ ఓచోట ఓ వ్యక్తి 100 మందిపైగా తండ్రి అయ్యాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 138 మందికే ఒకే తండ్రి ఉన్నారు. ఈ వార్త తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. దీని వెనుక అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.బిహార్‌లోని తిర్హుట్ పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం అధికారులు ఓటర్ల జాబితా తయారు చేశారు.ఔరాయ్ బ్లాక్‌లోని బూత నంబర్ 54లో 724 ఓటర్లు ఉన్నారు. అందులో 138 మంది ఓటర్ల తండ్రి పేరు మున్నా కమార్ అంకిత్‌గా ఉంది. వీరిలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జేడీయూ అభ్యర్థి అభిషేక్ ఝా ఓటర్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు.ఓట్లు తనకు పడకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీదనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. -
‘మహా’ ఎన్నికలు: తుది ఓటర్ల జాబితా విడుదల.. మహిళా ఓటర్లే అధికం
ముంబై: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో అధికార మహాయుతి కూటమి (బీజేపీ, అజిత్ పవార్(ఎన్సీపీ), షిండే(శివసేన), ప్రతిప్రక్షాల మహా వికాస్ అఘాడీ కూటమి (కాంగ్రెస్, ఠాక్రే (శివసేన), శరద్ పవార్ (ఎన్సీపీ) ప్రచారంతో దూసుకుపోతున్నాయి. ఈ క్రమంలో తాజాగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన కార్యాలయం రాబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఇక.. తుది ఓటర్ల జాబితా ప్రకారం మహారాష్ట్రలో మొత్తం 9.7 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. అందులో 4 కోట్లమంది పురుష ఓటర్లు, 4.7కోట్ల మంది మహిళా ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. ఎన్నికల తేదీలు ప్రకటించిన అక్టోబర్ 15, అసెంబ్లీ ఎన్నికలకు ముందు నమోదుకు చివరి తేదీ అక్టోబర్ 19 మధ్య సుమారు 6.55 లక్షల మంది కొత్త ఓటర్లుగా నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు అధికంగా ఉండటం గమనార్హం. కూటమి పార్టీల గెలుపులో మహిళా ఓటర్లు కీలకంగా మారనున్నారని ఎన్నికల విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక.. మహారాష్ట్రలో నవంబర్ 20న ఒకే దశలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఫలితాలు వెలువడనున్నాయి. -
గ్రామీణ ఓటర్లు @ 1,67,33,584
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) తాజాగా గ్రామ పంచాయతీల్లో వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితాలను ప్రచురించింది. దీనికి సంబంధించి ఇదివరకే ప్రచురించిన ముసాయిదా ఓటర్ల జాబితాలపై వచ్చిన అభ్యంతరాల పరిష్కారం, ఆ మేరకు ఓట్ల తొలగింపు తర్వాత మండల, పంచాయతీ కార్యాలయాల్లో నోటీస్ బోర్డులపై డిస్ప్లే చేసింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్రంలో 1,67,33, 584 మంది గ్రామీణ ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. రాష్ట్రంలోని మొత్తం 538 మండలాలు, వాటి పరిధిలోని 12,867 గ్రామ పంచాయతీలు, 1,13,722 వార్డుల్లో ఈ మొత్తం ఓటర్లలో 82,04,518 మంది పురుషులు, 85,28,573 మంది మహిళలు, 493 మంది ఇతరులు (ట్రాన్సజెండర్లు) ఉన్నారు. నల్లగొండ జిల్లా టాప్.. మేడ్చల్ లాస్ట్ గ్రామీణ ఓటర్ల పరంగా చూస్తే నల్లగొండ జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ జిల్లాలోని 31 మండలాల్లోని 856 గ్రామపంచాయతీల్లో 7,392 వార్డుల్లో మొత్తం 10,42,545 ఓటర్లున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో అత్యల్ప గ్రామీణ ఓటర్లు ఉన్నారు. ఈ జిల్లాలో గతంలో ఐదు మండలాలు ఉండగా వాటిలో కీసర, ఘట్కేసర్ మండలాలను మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో మేడ్చల్ జిల్లా 3 మండలాల్లోని 34 గ్రామపంచాయతీలు..320 వార్డుల్లో మొత్తం 64,397 ఓటర్లు ఉన్నట్టుగా తేలింది. -
4,85,729 మంది డూప్లికేట్ ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం(ఎస్ఎస్ఆర్) 2025లో భాగంగా రాష్ట్రంలో 4,85,729 మంది ఓటర్ల పేర్లు, ఇతర సమాచారం ఒకే రీతి(సిమిలర్ ఎంట్రీ)లో ఉన్నట్టు గుర్తించామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈఓ) సి.సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఒకే నియోజకవర్గం ఒకే పార్ట్ పరిధిలో 52,586 మంది, ఒకే నియోజకవర్గం వేర్వేరు పార్ట్‌ల పరిధిలో 1,10,994 మంది, వేర్వేరు నియోజకవర్గాల పరిధిలో 3,22,149 మంది ఇలాంటి ఓటర్లున్నట్టు గుర్తించామన్నారు. ఇప్పటివరకు 21,432 మంది డూప్లికేట్ ఓటర్లను జాబితాల నుంచి తొలగించామని చెప్పారు. బీఆర్కేఆర్ భవన్‌లోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓ) ఇంటింటికీ వెళ్లి ఓటర్ల పరిశీలన నిర్వహిస్తున్నారని, గత నెల 20న ప్రారంభమైన ఈ కార్యక్రమం అక్టోబర్ 18 వరకు కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్రంలో 3,33,11,347 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 70,60,288 (21.19 శాతం) మంది ఓటర్లను గుర్తించి నిర్ధారించినట్టు తెలిపారు. 10,224 మంది ఓటర్ల ఆచూకీ లభించలేదని, 23,220 మంది వలస వెళ్లారని, 21,465 మంది చనిపోయారని, 12,763 మంది ఫొటోలు సరిగ్గా లేవని, 5,677 మందికి రెండు ఓట్లున్నట్టు గుర్తించినట్టు సీఈఓ తెలిపారు. జనవరి 6న తుది ఓటర్ల జాబితా: అక్టోబర్ 29న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటిస్తామని సుదర్శన్‌రెడ్డి తెలిపారు. నాటి నుంచి నవంబర్ 28 వరకు కొత్త ఓటర్ల నమోదుకు దరఖా స్తులతో పాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తామని వెల్లడించారు. 2025 జనవరి 1కి కనీసం 18 ఏళ్లు కలిగి ఉండేవారు ఓటరుగా దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. డిసెంబర్ 24లోగా దరఖాస్తులు, అభ్యంతరాలను పరిష్కరించి వచ్చే ఏడాది జనవరి 6న తుది జాబితాను ప్రచురిస్తామన్నారు. రాజకీయ పార్టీల బూత్ స్థాయి ఏజెంట్లు సైతం ఒక పర్యాయంలో 10 దరఖాస్తులు, అభ్యంతరాలు చొప్పున 3 పర్యాయాల్లో 30 దరఖాస్తులు, అభ్యంతరాలను స్థానిక ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారులకు సమరి్పంచవచ్చునని చెప్పారు. -
శాంతిభద్రతల నిర్వహణలో అప్రమత్తంగా ఉండండి..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా తనిఖీలు, ఆస్తుల జప్తు జరుగుతున్న విధానంపై కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ 3న సీఎస్, డీజీపీలతో సమీక్ష నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం వినియోగాన్ని విస్తృత స్థాయిలో మెరుగు పర్చాల్సిందిగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు తీరును సమీక్షించారు. సీజర్ అంశంపై ఎన్ఫోర్స్మెంట్ ఏజన్సీలను అప్రమ్తతం చేయాలని, జిల్లా పరిధుల్లోనే కాకుండా సరిహద్దు ప్రాంతాల్లో కూడా నిఘాను పటిష్టపర్చాలన్నారు. ప్రతి సరిహద్దు చెక్ పోస్టు వద్ద కనీసం ఒక కెమేరాతో స్టాటిక్ సర్వలెన్స్ టీమ్‌ను ఉంచాలని చెప్పారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం నిత్యావసర సేవల్లో ఉండే 33 విభాగాలకు చెందిన ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించినట్టు తెలిపారు. వీటిలో ముఖ్యంగా పోలీస్, విద్యుత్, రవాణా, పోస్టల్ తదితర శాఖలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే మీడియా ప్రతినిధులతో పాటు ఆయా శాఖల ఉద్యోగులకు వారి విజ్ఞప్తి మేరకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని కల్పించాలని ఆదేశించారు. ముందస్తు అనుమతి తప్పనిసరి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు నిర్వహించే ఎలాంటి కార్యక్రమాలకైనా ముందుగా అనుమతి తప్పనిసరిగా పొందాల్సి ఉందని ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. అయితే నేరుగా గానీ, ఎన్కోర్ పోర్టల్ ద్వారా గానీ అందే దరఖాస్తులను వెంటనే పరిశీలించి సకాలంలో అనుమతులను మంజూరు చేయాలని ఆదేశించారు. శాంతి భద్రతల నిర్వహణ విషయంలో అప్రమ్తతంగా ఉండాలని, ఎలాంటి దుర్ఘటనలకు తావులేకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ఆ ఘటనలకు సంబంధించిన వాస్తవ నివేదికను వెంటనే తమకు పంపాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–7, వివరాలు సరిదిద్దేందుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న ఫారం–8లను చట్టబద్ధమైన విధానంలో ఈ నెల 26లోపు పరిష్కరించాలని ఆదేశించారు. నూతన ఓటర్ల నమోదు విషయంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి రోజూ తొమ్మిది నివేదికలను భారత ఎన్నికల సంఘానికి పంపాల్సి ఉందని, ఈ నివేదికలు పంపే విషయంలో ఏమాత్రం అలక్ష్యం వహించొద్దన్నారు. సమావేశంలో అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో పాటు అదనపు సీఈవోలు పి.కోటేశ్వరరావు, ఎం.ఎన్ హరేంధిరప్రసాద్, జాయింట్ సీఈవో వెంకటేశ్వరరావు, డిప్యూటీ సీఈవోలు కె.విశ్వేశ్వరరావు, మల్లిబాబు, సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీలో ఓటర్ల జాబితాలో అక్రమాలంటూ ఈనాడు కుట్రవార్తలు
-
ఓటర్ల జాబితాపై ఎల్లో మీడియా నోరు మూయించిన సుప్రీంకోర్టు
-
ఓటర్ల జాబితాలపై ‘సుప్రీం’ సంతృప్తి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులపై నిత్యం అడ్డగోలు ఆరోపణలు చేస్తూ నానా యాగీ చేస్తున్న ఎల్లో మీడియా నోళ్లు మూయిస్తూ సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు వెలువరించింది. ఓటర్ల జాబితాల విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) తీసుకుంటున్న చర్యలపై సుప్రీంకోర్టు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల సంఘం చర్యలు సంతృప్తికరంగా ఉన్నందున ఈ వ్యవహారంలో తదుపరి తమ నుంచి ఎలాంటి ఆదేశాలు అవసరం లేదని తేల్చి చెప్పింది. ఒక చిరునామా నుంచి మరో చిరునామాకు మారిన ఓటర్లు లేదా మరణించిన ఓటర్లు లేదా డూప్లికేట్‌గా నమోదైన ఓటర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించే విషయంలో చట్ట నిబంధనల మేరకు అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర ఎన్నికల సంఘం లిఖితపూర్వకంగా సమర్పించిన వివరాలు సంతృప్తికరంగా ఉన్నాయని స్పష్టం చేసింది. ఓటర్ల నమోదు ప్రక్రియ మొదలు, ఓటర్ల జాబితా సవరణ, తుది ఓటర్ల జాబితా తయారీ వరకు మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకతతో చేపడుతున్నామన్న సీఈసీ వాదనతో సుప్రీం కోర్టు ఏకీభవించింది. ఓటర్ల జాబితా నుంచి తొలగించే ముందు చట్ట ప్రకారం వారికి నోటీసు ఇచ్చి వారి వివరణ తీసుకున్న తరువాతే తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందని కూడా ఎన్నికల సంఘం చెప్పిన అంశాన్ని సుప్రీం కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఎన్నికల సంఘం పారదర్శకంగా అన్ని చర్యలు తీసుకుంటున్నప్పుడు ఇక తదుపరి ఆదేశాలతో పనేముందని విచారణ సందర్భంగా పిటిషనర్‌ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. పిటిషనర్ సందేహాలను ఎన్నికల కమిషన్ నివృత్తి చేసిందని సుప్రీం కోర్టు గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో తమ ముందున్న వ్యాజ్యంతో తదుపరి విచారణ అవసరం లేదంది. ఓటర్ల జాబితా విషయంలో అన్ని రాష్ట్రాల ప్రధాన ఎన్నికల అధికారులను ప్రతివాదులుగా చేర్చడంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను ప్రశ్నిస్తూ ‘సన్సద్ బాచావో ట్రస్ట్’ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు పరిష్కరించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధనుంజయ్ చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్ జంషేడ్ బుర్జోర్ పార్థీవాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన విసృ్తత ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సన్సద్ బచావో ట్రస్ట్ పిటిషన్‌పై విచారణ రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం సవరణ ఓటర్ల జాబితాలను తయారు చేసేలా ప్రధాన ఎన్నికల అధికారులను ఆదేశించాలని, అలాగే చిరునామా మారిన, మరణించిన, డూప్లికేట్‌గా నమోదైన ఓటర్ల విషయంలో ప్రజాప్రాతినిధ్య చట్ట నిబంధనల ప్రకారం వ్యవహరించేలా కూడా ఆదేశాలు ఇవ్వాలంటూ సన్సద్ బాచావో ట్రస్ట్ 2023లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై సీజే నేతృత్వంలోని విస్తృత ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆరోరా వాదనలు వినిపిస్తూ.. డూప్లికేట్ ఓటర్ల విషయంలో ఎన్నికల అధికారులు సరిగ్గా స్పందించడం లేదన్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది అమిత్ శర్మ స్పందిస్తూ.. డూప్లికేట్ ఓటర్లతో సహా ఓటర్ల జాబితా విషయంలో తాము తీసుకుంటున్న అన్ని చర్యలనూ వివరిస్తూ అఫిడవిట్ దాఖలు చేస్తామని చెప్పారు. ఇందుకు ధర్మాసనం అనుమతి ఇచ్చింది. ‘చట్టానికి లోబడే చేస్తున్నాం’ ఈ నేపథ్యంలో అమిత్ శర్మ కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ సమగ్ర కౌంటర్ దాఖలు చేశారు. అలాగే ఓ నోట్ కూడా ధర్మాసనం ముందుంచారు. సోమవారం ఈ వ్యాజ్యం విచారణకు వచ్చినప్పుడు సుప్రీం ధర్మాసనం ఆ నోట్‌ను క్షుణ్ణంగా పరిశీలించింది. చిరునామాలు మారడం, మరణించడం, భౌగోళికంగా ఒకే ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో తీసుకుంటున్న చర్యలను ఎన్నికల సంఘం తన కౌంటర్లో వివరించింది. చట్టానికి లోబడి తాము చేస్తున్న పనులన్నింటినీ కోర్టుకు తెలియచేసింది. ఓటర్ల జాబితా నుంచి ఎవరి పేరైనా తొలగించదలచుకుంటే వారికి నోటీసులు ఇచ్చి, అభ్యంతరాలు స్వీకరించి ఆ తరువాత మాత్రమే తదుపరి చర్యలు తీసుకుంటున్న విషయాన్ని సవివరంగా అత్యున్నత న్యాయస్థానానికి నివేదించింది. ప్రతి దశలో ఏం చేస్తున్నాయో తెలియజేసింది. డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరిస్తున్న విషయాన్ని కూడా చెప్పింది. లోపాలన్నింటినీ సవరించిన తరువాతే తుది జాబితాను ప్రకటిస్తున్నామని స్పష్టం చేసింది. ఎల్లో మీడియా నిత్య రాద్ధాంతం ఏపీలో ఓటర్ల జాబితాల విషయంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగిపోతున్నాయని, టీడీపీ అధినేత చంద్రబాబు సహా ఇతర నేతలు చేసిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం పట్టించుకోవడం లేదంటూ ప్రతిరోజూ ఎల్లో మీడియా పుంఖానుపుంఖాలుగా కథనాలు వండివారుస్తోంది. రాష్ట్రంలో ఏదో జరిగిపోతోందన్న ఆందోళనను ప్రజల్లో కలిగించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. కొంతకాలంగా ఎన్నికల అధికారులను లక్ష్యంగా చేసుకుని అసత్యాలను ప్రచారం చేస్తోంది. ఎన్నికల అధికారులపై నిరాధార ఆరోపణలు చేయడానికి కూడా ఏ మాత్రం వెనుకాడటం లేదు. ఓటర్ల జాబితాల తయారీ విషయంలో ఎన్నికల అధికారులు అడ్డగోలుగా వ్యవహరిస్తున్నారంటూ నిరాధార ఆరోపణలు చేస్తోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా తయారీలో స్వచ్ఛత లేదని నమ్మించే ప్రయత్నం చేస్తోంది. అడ్డగోలుగా ఓటర్ల జాబితా నుంచి తొలగింపులు చేస్తున్నారంటూ ఆరోపణలు గుప్పిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సుప్రీం కోర్టు ఇచ్చిన తాజా ఉత్తర్వులు ఎల్లో మీడియాకు గట్టిగానే షాకిచ్చేవిగా ఉన్నాయి. మొత్తం ఓటర్లు 96.85కోట్ల మంది 2024 ఫిబ్రవరి 8వ తేదీ నాటికి దేశవ్యాప్తంగా 96,85,01,358 మంది ఓటర్లు ఉన్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం తన అఫిడవిట్లో సుప్రీం కోర్టుకు తెలిపింది. ఇందులో 49.70 కోట్లు పురుషులు కాగా.. 47.13 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారని వివరించింది. 48,057 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారని, దివ్యాంగ ఓటర్లు 88.24 లక్షలు ఉన్నారని వివరించింది. 18–19 సంవత్సరాల వయసు మధ్య 1.84 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని పేర్కొంది. 80 సంవత్సరాల పైబడిన వారు 1.86 కోట్లు ఉన్నారని వివరించింది. 100 ఏళ్లు దాటిన ఓటర్లు 2.40 లక్షల మంది ఉన్నారని తెలిపింది. 2024 స్పెషల్ సమ్మరీ రివిజన్ (ఎస్ఎస్ఆర్)లో కొత్తగా 2.63 కోట్ల మంది ఓటర్లుగా చేరారని వివరించింది. ఇందులో 1.41 కోట్ల మహిళలు ఉన్నారని కోర్టుకు తెలిపింది. కొత్తగా నమోదైన వారందరికీ ఫొటో గుర్తింపు కార్డులు ఇచ్చామని వివరించింది. 2024 ఎస్‌ఎస్‌ఆర్‌లో 1.65 కోట్ల మంది ఓటర్లను తొలగించడం జరిగిందని, ఇందులో 67.82 లక్షల మంది చనిపోయారని, 75.11 లక్షల మంది శాశ్వతంగా చిరునామాలు మారారని, 22.05 లక్షలు డూప్లికేట్ ఓటర్లు ఉన్నారని తెలిపింది. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా సుప్రీం కోర్టుకు వివరించింది. పిటిషనర్ లేవనెత్తిన సందేహాలనూ నివృత్తి చేసింది. బహుళ ఎంట్రీలు, ఏకరూప ఫొటోలు, భౌగోళికంగా ఓ ప్రాంతంలో ఓటర్లుగా నమోదు కావడం వంటి విషయాల్లో ఎన్నికల సంఘం తీసుకుంటున్న చర్యలు సంతృప్తికరంగా ఉన్నాయని సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. దీనిపై తదుపరి ఎలాంటి ఉత్తర్వులు అవసరం లేదంది. ఈ ఉత్తర్వులతో సన్సద్ బచావో ట్రస్ట్ దాఖలు చేసిన వ్యాజ్యంలో ప్రొసీడింగ్స్‌ను మూసివేస్తున్నట్టు తెలిపింది. -
పచ్చ మీడియా పిచ్చి రాతలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పచ్చ మీడియా పైత్యం హద్దులు దాటుతోంది. రాజ్యాంగ వ్యవస్థలను సైతం తన కుట్రల్లోకి లాగుతూ అడ్డగోలుగా బురద జల్లుతోంది. ఎన్నికల సంఘంలో డేటా నిర్వహణ ప్రొటోకాల్స్‌పై అవగాహన లేకుండా పిచ్చిరాతలతో బొక్కబోర్లాపడింది. పబ్లిక్ డొమైన్లో ఎవరైనా సులభంగా యాక్సెస్ చేయగల డేటాను.. వైఎస్సార్సీపీ కోసం ఐప్యాక్ సభ్యులు దొంగలించారంటూ మంగళవారం ‘ఈసీలో దొంగలు పడ్డారు’ పేరుతో కథనాన్ని అచ్చేసి తన అజ్ఞానాన్ని బయటపెట్టుకుంది. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కార్యాలయం (సీఈఓ) తీవ్రంగా స్పందించింది. సీఈఓ పనితీరు, ఐటీ వ్యవస్థ నిర్వహణపై అవగాహన లేకుండా నిరాధార ఆరోపణలు చేయడం, తమ నుంచి ఎలాంటి స్పష్టత తీసుకోకుండానే ప్రజలను భయాందోళనకు గురిచేసేలా వార్తను ప్రచురించడాన్ని తీవ్రంగా ఖండించింది. ఇటువంటి నిరాధార ఆరోపణలు సీఈఓ కార్యాలయ సమగ్రతను, ప్రజాస్వామ్య ప్రక్రియలపై ప్రజలకున్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పేర్కొంది. ఈ డేటాను ఎవరైనా తీసుకోవచ్చు.. భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా తయారీకి ఈఆర్వో నెట్ 2.0ను అమలుచేస్తోంది. దేశంలోని మొత్తం డేటాబేస్‌ను సైబర్ సెక్యూరిటీ నిబంధనలను పాటిస్తూ ఈసీఐ తన సర్వర్ ద్వారా నిర్వహిస్తుంది. అంతేగానీ.. ఈసీఐ సర్వర్ ఒక రాష్ట్ర సీఈఓ నిర్వహణలో ఉండదు. ఇక్కడ ఈసీఐ నిర్దేశించిన అత్యాధునిక భద్రతా చర్యలు, అత్యంత పారదర్శకంగా ఉండే డేటాఫ్రేమ్ వర్క్‌లోనే సీఈఓ కార్యాలయం పనిచేస్తుంది. వాస్తవానికి.. రాష్ట్ర సీఈఓ కార్యాలయంలోని ఈఆర్వో నెట్లో రెండు రకాలుగా డేటా అందుబాటులో ఉంటుంది. ఇందులో ప్రస్తుత ఓటర్ల జాబితా డేటా, ఓటర్ల జాబితాలో మార్పులు–చేర్పులు, తొలగింపులకు వచ్చిన దరఖాస్తు ఫారాలకు సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది. ఇది పబ్లిక్ డొమైన్లో.. అంటే సీఈఓ వెబ్సైట్ ద్వారా సాధారణ ప్రజలు సైతం చూడొచ్చు. మరోవైపు.. ఓటర్ల జాబితా ప్రచురణ సమయంలో గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీ లకు హార్డ్డిస్్కలలో దీనిని అందిస్తుంది. ఈ డేటాను సీఈఓ ద్వారా నిర్ణీత రుసుము చెల్లించి ఎవరైనా తీసుకోవచ్చు. ఇంకా ఓటర్లు తమ ఓటులో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత సవరించిన జాబితా సైతం సీఈఓ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. దీనిని ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ సమాచారాన్ని ప్రతీవారం ఈఆర్వో, డీఈఓలు అన్ని రాజకీయ పార్టీలతోనూ పంచుకుంటారు. వాస్తవానికి.. ఈసీఐ నియంత్రణలో ఉన్న ఈఆర్వోనెట్ సర్వర్‌కు సీఈఓ, డీఈఓ, డీఆర్వోకి పరిమితంగా యాక్సెస్ ఉంటుంది. ఓటర్ల జాబితా, మార్పులుచేర్పులు అభ్యర్థనలు.. ఈ రెండురకాల డేటా మినహా మరే ఇతర డేటాను సీఈఓ స్థాయిలో యాక్సెస్ చేయలేరు. సీఈఓ సైతం ఈసీఐని అడగాల్సిందే.. ఏప్రిల్ 2023లో ఈసీఐ ఈఆర్వో నెట్ 2.0ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత ఈసీఐ ఆయా రాష్ట్రాల ఓటర్ల జాబితా మొత్తాన్ని తన సర్వర్‌లో భద్రపరిచింది. ఏ రాష్ట్ర సీఈఓ కార్యాలయం అయినా పాత డేటా కావాలంటే ఈసీఐ దృష్టికి తీసుకెళ్లాల్సిందే. అలాంటిది.. అంతభద్రంగా దాచిన డేటాను తొలగించడం అనేది అసాధ్యం. కానీ, పచ్చమీడియా మాత్రం 2021, 22 సంవత్సరాలకు సంబంధించిన డేటాను ఔట్ సోర్సింగ్ ఉద్యోగి సాయంతో కొంతమంది దొంగలించారని బరితెగించి అసత్య ఆరోపణ చేస్తోంది. ఎవ్వరూ ఈసీఐ సర్వర్‌ను యాక్సెస్ చేయలేనప్పుడు ఆ డేటా ఎలా దొంగిలిస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. -
మీ ఓటును సరిచూసుకోండి!
సత్తెనపల్లి: తుది ఓటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల కమిషన్.. దానిని ఆన్లైన్ ద్వారా అందరికీ అందుబాటులో ఉంచింది. జాబితాలో మీ పేరు ఉందో.. లేదో.. వెంటనే సరిచూసుకోవచ్చు. ఏమైనా అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యేక సెల్ కూడా ఏర్పాటు చేసింది. ఒకవేళ జాబితాలో మీ ఓటు లేకపోతే.. ఫారం–6 పూర్తి చేసి ఓటరుగా నమోదు చేసుకోవడానికి నామినేషన్ల చివరి రోజు వరకు అనుమతిస్తామని ఎన్నికల సంఘం తెలిపింది. మీ ఓటును సంబంధిత పోలింగ్ కేంద్రం బూత్ లెవల్ అధికారి వద్ద గానీ, స్మార్ట్‌ఫోన్, వెబ్సైట్ల ద్వారా గానీ సులభంగా తెలుసుకోవచ్చు. ‘స్మార్ట్’గా తెలుసుకోండిలా.. https://ceoandhra.nic.in వెబ్సైట్లోకి వెళితే పైభాగంలో పీడీఎఫ్ ఎలక్టోరల్ రోల్స్ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే అసెంబ్లీ నియోజకవర్గాలు అనే విభాగం కనిపిస్తుంది. అక్కడ తుది జాబితా–2024పై క్లిక్ చేసి మీ జిల్లా, మీ శాసనసభ నియోజకవర్గం నమోదు చేయాలి. ఆ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ కేంద్రాల ఓటర్ల జాబితా పీడీఎఫ్ ఫైల్స్‌లో వస్తాయి. మీ పోలింగ్ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితాను డౌన్లోడ్ చేసుకొని.. మీ ఓటు ఉందో? లేదో? చూసుకోవచ్చు. అలాగే https://voterportal.eci.gov.in వెబ్సైట్ ఓపెన్ చేస్తే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి.. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్‌ను నమోదుచేస్తే జాబితాలో మీ పేరు ఉందో..? లేదో..? ఓటు ఏ పోలింగ్ కేంద్రం పరిధిలో ఉంది? సీరియల్ నంబర్ ఎంత? తదితర వివరాలన్నీ కనిపిస్తాయి. మీ ఓటర్ గుర్తింపు కార్డు నంబర్ తెలియకపోతే.. ‘అడ్వాన్స్ సెర్చ్’ విభాగంలోకి వెళ్లి మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, శాసనసభ నియోజకవర్గం వివరాలు పొందుపరిచి జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. అలాగే www. nvsp.in వెబ్సైట్లోకి వెళితే.. ‘సెర్చ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై డీటెయిల్స్,’ ‘సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే రెండు ఉప విభాగాలు ఉంటాయి. మీ పేరు, తండ్రి పేరు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు నమోదు చేసి లేదా ఓటర్ గుర్తింపు కార్డు సంఖ్యను నమోదు చేసి ఓటరు జాబితాలో మీ పేరు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్‌లైన్ యాప్‌తో చిటికెలో.. గూగుల్ ప్లే స్టోర్‌లో ఎన్నికల సంఘానికి సంబంధించిన ‘ఓటర్ హెల్ప్ లైన్’ యాప్ ఉంటుంది. దానిని డౌన్లోడ్ చేసుకుని మీ ఫోన్ నంబర్, వివరాలతో రిజిస్టర్ చేసుకొని.. లాగిన్ కావాలి. యాప్‌లో ‘సెర్చ్ యువర్ నేమ్ ఇన్ ఎలక్టోరల్ రోల్’ అనే విభాగం ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే ‘సెర్చ్ బై బార్కోడ్, సెర్చ్ బై క్యూఆర్ కోడ్, సెర్చ్ బై డీటెయిల్స్, సెర్చ్ బై ఎపిక్ నంబర్’ అనే నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. మీ ఓటరు గుర్తింపు కార్డుపై ఉన్న బార్కోడ్ లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ ఓటు ఉందో? లేదో? తెలుసుకోవచ్చు. కార్టు నంబర్ ఉంటే ఎపిక్ నంబర్ ద్వారా సరిచూసుకోవచ్చు. లేకపోతే మీ పేరు, తండ్రి పేరు, వయసు, జిల్లా, నియోజకవర్గం తదితర వివరాలు పొందుపరచడం ద్వారా తెలుసుకునే వీలుంది. పోలింగ్ కేంద్రంలోనూ అవకాశం.. ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ అధికారి ఉంటారు. వారి వద్ద ఆ కేంద్రానికి సంబంధించిన ఓటర్ల జాబితా ఉంటుంది. అందులో మీ ఓటు ఉందో? లేదో? సరిచూసుకోవచ్చు. ఓటు లేకపోతే వెంటనే బీఎల్వో ద్వారా గానీ వెబ్సైట్ ద్వారా గానీ ఫారం –6 పూర్తి చేసి దరఖాస్తు చేసుకోవచ్చు. -
AP: రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు: సీఈసీ వార్నింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 4.07 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. రాష్ట్రంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారని, ఇది శుభపరిణామమని తెలిపింది. బుధవారం సాయంత్రం సీఈసీ రాజీవ్‌కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా వివరాలతో పాటు పలు కీలకాంశాలను వివరించారు. ఎన్నికలు స్వేచ్చాయుత వాతావరణంలో పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలో మహిళా ఓటర్లు 2.07 కోట్లు కాగా పురుష ఓటర్లు 1.99 కోట్ల మంది ఉన్నారన్నారు రాజీవ్ కుమార్. వచ్చే ఎన్నికల్లో సీనియర్ సిటిజన్లకు ఇంటి వద్దే ఓటు హక్కు వినియోగించుకునేలా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంటి వద్ద నుంచి ఓటు వేసేందుకు 5.8 లక్షల మందికి అవకాశముందన్నారు. 7.88 లక్షల మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకునే వారి సంఖ్య 7.88 లక్షలుగా ఉన్నట్లు చెప్పారు. వంద ఏళ్లు దాటిన వృద్ధులు 1174 మంది ఉన్నారన్నారు. ఈ నెల 22న ఓటర్ల తుది జాబితా విడుదల చేస్తామని తెలిపారు. సీఈసీ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ సందర్శిస్తున్నాం. ఎన్నికల సందర్భంగా సంప్రదింపులు జరుగుతున్నాయి. ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఓటర్లను కోరుతున్నాం. నిన్న విజయవాడలో పార్టీలతో సమావేశం నిర్వహించాం. ఓటర్ల జాబితాలో మార్పులపై కొన్ని పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. పారామిలిటరీ బలగాలతో ఎన్నికలు నిర్వహించాలని ఓ పార్టీ కోరింది. ఎన్నికల్లో ధన ప్రభావాన్ని నియంత్రించాలని కొన్ని పార్టీలు కోరాయి. చదవండి: రిపబ్లిక్ వేడుకల్లో ఏపీ శకటంగా జగనన్న విజన్! ఏపీ, తెలంగాణ రెండు చోట్లా కొందరు ఓట్లు నమోదు చేసుకున్న అంశాన్ని ఓ పార్టీ ప్రస్తావించింది. అన్ని పార్టీలకు సమాన అవకాశాలు కల్పిస్తాం. గతంలో 20 లక్షలకు పైగా ఓట్లను తొలగించారు. అందులో 13 వేల ఓట్లను అక్రమంగా తొలగించినట్టు గుర్తించాం. అక్రమంగా తొలగించినట్టు తేలిన ఓట్లను పునరుద్ధరించాం. రాష్ట్రంలో 46,165 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి . సగటున ఒక్కో పోలింగ్ కేంద్రం పరిధిలో 870 మంది ఓటర్లు. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 1500 వరకు ఓట్లు ఉన్నాయి. తప్పుడు అఫిడవిట్ ఇచ్చిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటాం. 70 శాతం పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ సౌకర్యం ఉంది. ఏపీ, తెలంగాణ లలో ఒకే సారి ఎన్నికలు పెట్టమని కొన్ని పార్టీలు కోరాయి. ఎవ్వరైనా ఒక్క చోట మాత్రమే ఓటు హక్కు తీసుకోవాలి. ఎక్కడ నివసిస్తే అక్కడే ఓటు ఉండాలి.(పుట్టిన ఊరు, సొంత గ్రామం అని కాదు, ఎక్కడ నివసిస్తే.. అక్కడ అని అర్థం). రెండు చోట్లా ఓటు ఉంటే క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, కేసు నమోదవుతుంది. తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ళు.. ఏపీలో ఓటు కోసం ఎలా దరఖాస్తు చేస్తారు?. ఏపీలో ఆస్తులు ఉన్నంత మాత్రానా.. ఏపీలో నివాసం ఉండకుండా ఉంటే ఓటు ఇవ్వలేం’ అని సీఈసీ పేర్కొన్నారు. -
‘దొంగ’ నాటకం!
సాక్షి, అమరావతి: ఎన్నికల యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించడంతో విపక్షం దొంగ నాటకానికి తెర పడింది! వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటర్ల జాబితాలో అక్రమాలకు తెగబడుతున్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసిన ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్ కడప, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో లక్షల సంఖ్యలో వైఎస్సార్సీపీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు కుట్ర పన్నారు. ఈ నాలుగు జిల్లాల్లో లక్షలాది మంది అధికార పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ తప్పుడు సమాచారంతో గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి సమర్పించడం గమనార్హం. మిగతా తొమ్మిది ఉమ్మడి జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల్లో దాదాపు మూడింతలు అధికంగా నకిలీ దరఖాస్తులు అందాయి. దీనిపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపిన జిల్లా కలెక్టర్లు వీటిల్లో 80 నుంచి 90 శాతం వరకు బోగస్ దరఖాస్తులేనని ఎన్నికల సంఘానికి నివేదిక ఇచ్చారు. తప్పుడు సమాచారం ఇచ్చిన కోనేరు సురేష్ పై ఐపీసీ సెక్షన్ 182, ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 31 మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల బృందానికి మరోసారి ఫిర్యాదు చేసేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. నాడు సేవామిత్ర.. నేడు మైపార్టీ డ్యాష్ బోర్డ్ గతంలో సేవామిత్ర యాప్ తరహాలోనే తాజాగా మైపార్టీ డ్యాష్ బోర్డ్ డాట్‌కామ్ వెబ్సైట్ ద్వారా ఓటర్ల వ్యక్తిగత వివరాలను సేకరించిన టీడీపీ రాష్ట్రవ్యాప్తంగా పది లక్షల మందికిపైగా ఓటర్లను తొలగించేందుకు ఫారం 7 దరఖాస్తులను గంపగుత్తగా సమర్పించింది. వైఎస్సార్సీపీకి మద్దతు ఇస్తున్న వారిని బతికున్నా చనిపోయినట్లుగా చిత్రీకరించడంతోపాటు అర్హులైన ఓటర్లను నకిలీలుగా, స్థానికంగా నివాసం ఉంటున్నా శాశ్వతంగా వలస వెళ్లినట్లు పేర్కొంటూ వీటిని దాఖలు చేసింది. మరికొందరిని రెండు ప్రదేశాల్లో రెండు ఓట్లు ఉన్నట్లు తప్పుడు సమాచారం సమర్పించి జాబితా నుంచి తొలగించే వ్యూహం రచించింది. కుప్పలు తెప్పలుగా అందిన ఫారం 7 దరఖాస్తుల్లో 70 నుంచి 80 శాతం తప్పుడువేనని తేల్చుతూ ఎన్నికల సంఘానికి కలెక్టర్లు నివేదిక ఇచ్చారు. గత ఎన్నికల్లో ఉమ్మడి కర్నూలు, వైఎస్సార్, నెల్లూరు, విజయనగరం జిల్లాల పరిధిలో శాసనసభ, లోక్‌సభ స్థానాలను వైఎస్సార్సీపీ క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ అక్కడ కనీసం ఉనికి కూడా చాటుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ నాలుగు జిల్లాలపై ప్రత్యేకంగా గురి పెట్టి అధికార పార్టీ మద్దతుదారుల ఓట్లను తొలగించేందుకు టీడీపీ బోగస్ దరఖాస్తులను సమర్పిస్తోంది. నెల్లూరులో సింహభాగం నకిలీ ♦ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లిలో 11,291 ఓట్లు తొలగించాలంటూ నియోజకవర్గ టీడీపీ సమన్వయకర్త సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి కోనేరు సురే‹Ùతో కలిసి ఫారం 7 దరఖాస్తులు సమర్పించారు. వాటిలో 85 శాతానికి పైగా బోగస్ అని అధికారుల విచారణలో వెల్లడైంది. జిల్లాలోని మిగతా ఆరు నియోజకవర్గాల్లోనూ ఇదే కథ. విజయనగరం 4 నియోజకవర్గాల్లో ♦విజయనగరం జిల్లాలో రాజాం, చీపురుపల్లి, నెల్లిమర్ల, శృంగవరపుకోట నియోజకవర్గాల్లో వైఎస్సార్ సీపీ మద్దతుదారులైన 19,407 మంది ఓట్లు తొలగించాలని కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7లను ఎన్నికల సంఘానికి సమర్పించాడు. ♦ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు దరఖాస్తులపై క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టిన విజయనగరం జిల్లా కలెక్టర్ 8,318 ఫారం 7లు తప్పుడువని తేల్చుతూ నివేదిక ఇచ్చారు. కర్నూలులో 88 శాతం బోగస్ ♦కర్నూలు, పాణ్యం, పత్తికొండ, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు నియోజక వర్గాల్లో 67,370 ఓట్లు తొలగించాలంటూ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను టీడీపీ ఎన్నికల సెల్ రాష్ట్ర కోఆర్డినేటర్ కోనేరు సురేష్ ఎన్నికల సంఘానికి అందజేశాడు. వీటిలో అత్యధికంగా కోడుమూరులో 17,576, ఆదోనిలో 13,968, ఆలూరులో 11,581 బోగస్ దరఖాస్తులున్నాయి. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కర్నూలు జిల్లా కలెక్టర్ వీటిపై బీఎల్వోలు, డిప్యూటీ తహసిల్దార్లు, తహసిల్దార్లతో క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించగా 59,054 ఫారం 7లు బోగస్ అని తేలింది. అంటే 88 శాతం తప్పుడు ఫారం 7లు సమర్పించినట్లు స్పష్టమవుతోంది. 11,935 మంది బతికే ఉన్నా వారు చనిపోయినట్లుగా చిత్రీకరించి వారి ఓటు హక్కును కాలరాసేందుకు టీడీపీ కుట్ర పన్నినట్లు విచారణలో వెల్లడైంది. అన్నమయ్య.. అక్రమ మార్గంలో ♦ అన్నమయ్య జిల్లాలో రాయచోటి, రాజంపేట, కోడూరు, పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ మద్దతుదారులైన 40,358 మంది ఓట్లు తొలగించాలంటూ కోనేరు సురేష్ గంపగుత్తగా ఫారం 7 దరఖాస్తులను ఎన్నికల సంఘానికి అందచేశాడు. ♦ ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ 25,097 దరఖాస్తులు నకిలీవని నిర్థారించారు. అక్కడ ఆరు నియోజకవర్గాల్లో 8,355 మంది బతికే ఉన్నా చనిపోయినట్లుగా చిత్రీకరించి టీడీపీ తప్పుడు దరఖాస్తులు సమర్పించినట్లు బహిర్గతమైంది. -
ఓట్ల..కేటుగాళ్లు
ప్రజాస్వామ్యమంటే... ప్రజల చేత.. ప్రజల కోసం.. ప్రజలే ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం. ప్రజలే ప్రభువులు!ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఓటూ కీలకమే. ఒకే ఒక్క ఓటు గెలుపోటములను నిర్దేశిస్తుంది. ఒకే ఒక్క ఓటు అభ్యర్థుల తలరాతలను మార్చేస్తుంది. ఓటర్ల జాబితా ఎంత పారదర్శకంగా ఉంటే ప్రజాతీర్పు అంత స్పష్టంగా ఉంటుంది. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. ప్రజల ఆశీస్సులతో కాకుండా.. అడ్డదారుల్లో అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని ఏమంటారు? కేటుగాడనే కదా! ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి దొంగదారిలో అధికారాన్ని దక్కించుకున్న చంద్రబాబు నాటి నుంచి ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడుతూ ‘డూప్లికేటు’ వేషాలు వేస్తున్నారు! సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లోనూ 2019కి మించి ఘోర పరాజయం తప్పదని నిర్ధారణకు వచ్చిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఓటమికి ఇప్పట్నుంచే సాకులు వెతుక్కుంటున్నారు. ఒకవైపు ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయంటూ ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెడుతున్న ఆయన మరోవైపు నిబంధనలను కాలరాస్తూ, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ యథేచ్ఛగా దొంగ ఓట్లను చేర్పిస్తున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17, 18 ప్రకారం దేశంలో ఒక నియోజకవర్గంలో ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండాలి. వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు నియోజకవర్గాల్లో ఓటు నమోదు చేయించుకోవడం చట్ట ప్రకారం నేరం. రాజకీయాల్లో 1978 నుంచి ఉన్న చంద్రబాబుకు ఇది తెలిసినా తెలంగాణలో ప్రధానంగా హైదరాబాద్‌లో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా నమోదు చేయిస్తున్నారు. తెలంగాణలోనూ, ఏపీలోనూ రెండు చోట్లా ఓట్లు ఉన్న వారు (డూప్లికేట్లు) 4,30,264 మంది ఉన్నారు. కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలో నివాసం ఉంటూ అక్కడ ఓటర్లుగా ఉన్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరుల పేర్లను ఏపీలోనూ సరిహద్దు నియోజకవర్గాల్లో చేర్పించారు. వాటిని తొలగించి ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిరక్షించాలని ప్రజాసంఘాలు, మేధావులు, రాజకీయ పరిశీలకులు డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణలో పోలింగ్ ముగిసిన మర్నాడే.. తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్ నవంబర్ 30న పూర్తయింది. ఆ మరుసటి రోజే అంటే డిసెంబర్ 1 నుంచే హైదరాబాద్‌లో ఓటర్లుగా ఉన్న టీడీపీ సానుభూతిపరులను ఏపీలోనూ ఓటర్లుగా చేర్పించేందుకు ఆ పార్టీ భారీ ఎత్తున శిబిరాలు నిర్వహించింది. కూకట్పల్లి, నిజాంపేట, వనస్థలిపురం, మణికొండ, భరత్‌నగర్ తదితర ప్రాంతాల్లో శిబిరాల ఇన్ఛార్జ్లను నియమించిన టీడీపీ ఉదయం 8 నుంచి 12 గంటల వరకూ ఓటర్లుగా చేర్పించే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పార్టీ సానుభూతిపరులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చింది. వయసు, చిరునామా ధ్రువీకరించే ఆధార్ కార్డును వాట్సప్‌లో పంపితే తామే ఆన్లైన్లో ఓటరుగా నమోదు చేయిస్తామని, ఎన్నికల సంఘానికి తామే ఫారం 6 సమర్పిస్తామంటూ సందేశాలు పంపింది. టీడీపీని భుజానికెత్తుకునే మోసే ఓ సామాజిక వర్గం నాయకులు ఈ ప్రచారంలో ప్రధాన భూమిక పోషించారు. ఇలా హైదరాబాద్, తెలంగాణలో నివాసం ఉంటున్న లక్షల మంది టీడీపీ సానుభూతిపరులను ఏపీలోని పలు నియోజకవర్గాల్లో ఓటర్లుగా చేర్చేందుకు ఫారం 6 దరఖాస్తులను ఆన్లైన్లో ఇప్పటికే సమర్పించారు. ఈ ప్రక్రియను ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పవన్ కుటుంబం బరి తెగింపు.. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అనే తరహాలో డూప్లికేటు ఓట్లు చేర్చడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కూడా అదే బాట పట్టారు. ఆయన సోదరుడు కొణిదల నాగేంద్రరావు(నాగాబాబు)కు హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ బూత్ నెంబరు 168లో సీరియల్ నెంబరు 323 ఎఫ్వైవై 6038202 ఓటరు కార్డు నెంబరుతో ఓటు ఉంది. నాగేంద్రరావు సతీమణి పద్మజ కొణిదలకు సీరియల్ నెంబరు 324, వారి కుమారుడు కొణిదెల సాయివరుణ్ తేజ్‌కు సీరియల్ నెంబరు 325తో అక్కడ ఓట్లున్నాయి. తెలంగాణ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే అంటే డిసెంబరు 4న ఏపీలోనూ ఓటు హక్కు కోసం వారు దరఖాస్తు చేసుకున్నారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలోని రాధారంగా నగర్ మూడో వీధి 5–263 డోర్ నెంబర్ ఇంటిలో తాము నివాసం ఉంటున్నామంటూ కొణిదల నాగేంద్రరావు, పద్మజ, సాయివరుణ్ తేజ్ ఓటర్లుగా నమోదు కోసం ఫారం 6 దరఖాస్తు సమర్పించడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాల కోసమే జనసేనను స్థాపించిన సినీనటుడు పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి జత కట్టడం ద్వారా దీన్ని రుజువు చేసుకున్నారని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, ప్రజాసంఘాలు స్పష్టం చేస్తున్నాయి. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా చంద్రబాబుకు బేషరతుగా మద్దతు తెలిపిన పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడం ద్వారా టీడీపీకి మేలు చేసేందుకు శక్తి వంచన లేకుండా ప్రయత్నించారు. డూప్లికేటు ఓట్లకు సాక్ష్యాలు ఇవిగో..: ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (టీజెడ్టీ 2164002)తో దీపిక సైలాడకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎఫ్జెడ్జెడ్ 8526691)తో పి.వెంకటేష్ తండ్రి పి.రామారావుకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (కేవైటీ 2765246)తో మారెమ్మ తురపాటి భర్త మారయ్యకు తెలంగాణలోని సత్తుపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా ఎనీ్టఆర్ జిల్లా మైలవరం నియోజవకర్గంలో మరో ఓటు ఉంది. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (ఎస్‌డబ్ల్యూడీ 1814962)తో భరణి బిళ్లపాటి భర్త వెంకట రమణమూర్తి బిళ్లపాటికి హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఒక ఓటు ఉండగా రాష్ట్రంలో అనకాపల్లి నియోజకవర్గంలో రెండు పోలింగ్ బూత్‌ల పరిధిలో రెండు ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తం మూడు ఓట్లు ఉన్నట్లు. ♦ ఒకే ఓటరు కార్డు నెంబరు (జేహెచ్జీ 1224126)తో 70 ఏళ్ల వంకదారి నారాయణస్వామి తండ్రి వి.కృష్ణయ్యకు గ్రేటర్ హైదరాబాద్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ జడ్పీహెచ్ఎస్ పోలింగ్ బూత్ పరిధిలో సీరియల్ నెంబరు 750తో ఒక ఓటు ఉండగా వయసును 72 ఏళ్లుగా మార్చి నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం ప్యాపిలిలో సీరియల్ నెంబరు 197తో మరో ఓటు ఉంది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగేంద్రరావు కొణిదల, ఆయన భార్య పద్మజ, కుమారుడు సాయి వరుణ్ తేజకు తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్‌లో జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో ఓట్లు ఉన్నాయనడానికి ఆధారం ఇదీ ఓటరు కార్డు నెంబరు ఆర్డీవీ0159780తో కొసరాజు సాంబశివరావు తండ్రి సూర్యప్రకాశరావుకు తెలంగాణలో కూకటిపల్లిలో ఒక ఓటు.. రాష్ట్రంలో రాజానగరం నియోజకవర్గంలో మరో ఓటు ఉందనడానికి ఆధారం ఓటరు కార్డు నెంబరు ఆర్ఎస్యూ0326876తో నూతలపాటి కృష్ణచైతన్య తండ్రి పేరు ఎన్ఎస్ఆర్ ప్రసాద్‌కు తెలంగాణలో పటాన్‌చెర్వు నియోజకవర్గంలో ఒక ఓటు.. రాష్ట్రంలో నూజివీడు నియోజకవర్గంలో మరో ఓటు కలిగి ఉన్నారనడానికి సాక్ష్యం -
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరగబోయే మూడో అసెంబ్లీ ఎన్నికలు ఇవి. గత ఎన్నికల ప్రక్రియ ముగిశాక.. తెలంగాణ అసెంబ్లీ కాలపరిమితి 2019 జనవరి 15వ తేదీ ప్రారంభమైంది. 2024 జనవరి 16వ తేదీతో తెలంగాణ అసెంబ్లీ గడువు ముగియనుంది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం.. నవంబర్ 30వ తేదీ గురువారం నాడు ఒకే దఫాలో 119 నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 3వ తేదీ ఆదివారం నాడు కౌటింగ్ ప్రక్రియ.. ఫలితాలు వెలువడనున్నాయి. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను అక్టోబర్ 9వ(సోమవారం) తేదీన కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. తక్షణమే ఎన్నికల కోడ్‌ను అమలులోకి తెచ్చింది. ఆపై నవంబర్ 3వ తేదీన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు గెజిటెడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. నోటిఫికేషన్ రిలీజ్ అయిన కాసేపటికే నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను ప్రారంభించింది. వారంపాటు సాగిన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ.. నవంబర్ 10వ తేదీతో ముగిసింది. నవంబర్ 13వ తేదీ వరకు నామినేషన్ల పరిశీలన చేపట్టారు రిటర్నింగ్ అధికారులు. నవంబర్ 15వ తేదీతో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఎన్నికల ప్రచారం నవంబర్ 28వ తేదీ సాయంత్రం ముగిసింది. మొత్తం ఓటు హక్కు ఉన్నవాళ్ల సంఖ్య.. ఈసీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. తెలంగాణలో మొత్తం 3.26 కోట్ల ఓటర్లున్నారు. ఇందులో పురుష ఓటర్లు 1.62 కోట్లు, మహిళా ఓటర్లు 1.63 కోట్లు. ట్రాన్స్ జెండర్ ఓటర్లు 2,676 మంది,సర్వీస్ ఓటర్లు(సాయుధ దళాల సిబ్బంది, దేశం వెలుపలా కేంద్ర ప్రభుత్వం పరిధిలో పని చేసే వ్యక్తులు) 15, 406 మంది ఉన్నారు. తొలిసారి ఓటు హక్కు వచ్చినవారు (18-19ఏళ్ల వయసు) 9,99,667 మంది ఉన్నారు. వీళ్లలో పురుష ఓటర్లు 5,70,274 మంది, మహిళా ఓటర్లు 4,29,273 మంది, ట్రాన్స్ జెండర్ ఓటర్లు 120 మంది ఉన్నారు. దివ్యాంగ ఓటర్లు(పీడబ్ల్యూడీ) 5,06,921 మంది ఉండగా.. ఇందులో పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు ఒకరు ఉన్నారు. ఓవర్సీస్ ఓటర్లు.. పురుషులు 2,380.. మహిళా ఓటర్లు 563, ట్రాన్స్‌జెండర్ ఓటర్లు 1 మొత్తంగా 2,944 ఓటర్లు ఉన్నారు. మొత్తం ఓటర్లలో 59 ఏళ్లలోపు వాళ్లు 86 శాతం ఉన్నారు. వయసు 80 ఏళ్లు దాటిన వాళ్లు 4,40,371 మంది ఉన్నారు. 80ఏళ్ల వయసు పైబడిన వారు ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉంది. మొత్తంగా తెలంగాణలో ఈసీ తుది జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 3,26,18,205. తెలంగాణలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయం కల్పించారు. ఈ వెసులుబాటుతో 27,178 మంది ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వికాజ్ రాజ్ ప్రకటించారు. అందులో 15,000 మంది సీనియర్ సిటిజన్లు, 9,374 మంది వికలాంగులు, 1,407 మంది నిత్యావసర సేవా సిబ్బంది ఉన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులకు పోస్టల్‌బ్యాలెట్ సౌకర్యం కల్పించారు. అత్యధికం.. అత్యల్పం అత్యధికంగా హైదరాబాద్‌లో 45 లక్షల 36 వేల 852 మంది ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా ములుగు జిల్లాలో 2,26,574 మంది ఓటర్లు ఉన్నారు. ఇక నియోజకవర్గాలను పరిశీలిస్తే.. రాష్ట్రంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంలో(హైదరాబాద్ జిల్లా) 7 లక్షల 32 వేల 560 మంది ఓటర్లు ఉన్నారు. అతి తక్కువగా భద్రాచలం(భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) నియోజకవర్గంలో లక్షా 48 వేల 713 మంది ఓటర్లు ఉన్నట్లు ఈసీ ప్రకటించింది. బరిలో.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. స్క్రూటినీ(పరిశీలన) తర్వాత 2,898 మంది నామినేషన్లకు ఆమోదం లభించింది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం చివరకు 2,290 మంది అభ్యర్థులు 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచారు. అత్యధికంగా ఎల్బీ నగర్(రంగారెడ్డి జిల్లా)లో 48 మంది, కేసీఆర్ పోటీ చేసే గజ్వేల్‌లో 44 మంది.. కామారెడ్డిలో 39 మంది పోటీలో మిగిలారు. అత్యల్పంగా నారాయణపేట(నారాయణపేట జిల్లా)లో ఏడుగురు, బాన్సువాడలో(కామారెడ్డి జిల్లా)లోనూ ఏడుగురు చొప్పున అభ్యర్థులు, బాల్కొండ(నిజామాబాద్)లో 8 మంది ఎన్నికల బరిలో ఉన్నారు. సాధారణంగా.. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం మిగిలిన అభ్యర్థులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయిస్తారు. గుర్తింపు పొందిన పార్టీలు, రిజిస్టర్డ్ పార్టీలు, స్వతంత్రులకు వరుస క్రమంలో ఎన్నికల అధికారులు జాబితా తయారు చేస్తారు. వాటి ఆధారంగానే బ్యాలెట్ రూపొందిస్తారు. పార్టీ ప్రతినిధుల నుండి క్లియరెన్స్ తర్వాత(నవంబర్ 29) ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పోలింగ్ స్టేషన్లకు తరలించనున్నారు. ఏర్పాట్లు.. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 35,655 పోలింగ్ కేంద్రాల్లో తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇందులో వెబ్‌క్యాస్టింగ్ ఉండే కేంద్రాలు 27,097 (78శాతం), 597 మహిళా పోలింగ్ కేంద్రాలు, 644 మోడల్ పోలింగ్ కేంద్రాలు, 120 దివ్యాంగ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఎన్నికల కోసం 67 మంది జనరల్ అబ్జర్వర్లను, 39 మంది పోలీస్ అబ్జర్వర్లను తెలంగాణ ఎన్నికల కోసం నియమించింది ఈసీ. మొత్తంగా ఎన్నికల విధుల కోసం 2.08 లక్షల మంది సిబ్బందిని నియమించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. వాళ్లను రెండు రోజులు ముందుగానే ఆ ప్రాంతాలకు తరలించింది. 35,655 పోలింగ్ కేంద్రాలు పోలింగ్: ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5గంటల దాకా పోలింగ్ కేంద్రాల వల్ల 144 సెక్షన్ అమలు 13 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో.. 4,400 సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4గంటలకే ముగింపు పోలింగ్ ముగిసే టైం వరకు లైన్లో ఉన్నవాళ్లకు మాత్రమే ఓటింగ్‌కు అనుమతి భద్రత కోసం 375 కంపెనీల కేంద్ర బలగాలు భద్రతా విధుల్లో 45 వేలమంది పోలీసులు ఏజెన్సీ ఏరియాల్లో భద్రత మరింత కట్టుదిట్టం నవంబర్ 30వ తేదీ ఉదయం 5.30ని. పోలింగ్ సిబ్బందికి అవగాహన కోసం మాక్ పోలింగ్ ఉంటుంది. ఉదయం ఏడు గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రారంభిస్తారు. సాయంత్రం ఐదు గంటలకు పోలింగ్ ముగుస్తుంది. డిసెంబర్ 3వ తేదీన ఓట్ల కౌంటిగ్.. అదే రోజు ఫలితాల వెల్లడి అవుతాయి. మొత్తంగా ఈసీ షెడ్యూల్ ప్రకారం డిసెంబర్ 5వ తేదీలోపు తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయనుంది తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం. -
ఏపీ ఓటర్ల జాబితా ముసాయిదా.. మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: ఏపీలో ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇదే సమయంలో ముసాయిదా ఓటర్ల జాబితాపై ఏవైనా అభ్యంతరాలుంటే డిసెంబర్ తొమ్మిదో తేదీ వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్టు ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేసింది. ఏపీలో మొత్తం ఓటర్లు 4,01,53,292 మంది ఉండగా ఇందులో పురుషులు 1,98,31,791, మహిళలు 2,03,85,851 మంది ఉన్నారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 19,79,775 ఓటర్లు ఉండగా… అల్లూరి సీతారామారాజు జిల్లాలో అత్యల్పంగా 7,40,857 ఓటర్లు ఉన్నట్లు ఈసీ తెలిపింది. జాబితా ఇదే.. మొత్తం ఓటర్లు- 4,01,53,292 పురుషులు- 1,98,31,791 మహిళలు - 2,03,85,851 ట్రాన్స్ జెండర్లు - 3808 సర్వీస్ ఓటర్లు- 66,158 ఇక, 2024 జనవరి 5న తుది ఓటర్ల జాబితా ప్రకటిస్తామని ఈసీ పేర్కొంది. ముసాయిదా ఓటర్ల జాబితాను అన్ని జిల్లాల్లోని రాజకీయ పార్టీలకు ఇవ్వాల్సిందిగా జిల్లా అధికారులకు ఈసీ సూచించింది. 2022 జనవరి 6 నుంచి 2023 ఆగస్టు 30వరకు అన్ని స్థాయిల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టినట్లు ఈసీ వెల్లడించింది. 21,18,940 ఓట్ల తొలగింపు ప్రక్రియను పునః పరిశీలన చేసినట్టు వివరించింది. ఆగస్టులో చేపట్టిన ఇంటింటి సర్వేలో జీరో డోర్ నెంబర్లతో 2,51,767 ఓట్లు గుర్తించినట్టు స్పష్టం చేసింది. -
ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ మినీ భారత్ లాంటిదని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించామని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించామని, అన్ని పార్టీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. అభ్యర్థుల ప్రచార వ్యయాన్ని పెంచాలని పార్టీలు కోరినట్లు వెల్లడించారు. తొలిసారి రాష్ట్రంలో వృద్ధులు ఇంటివద్దే ఓటు వేయడానికి ఫామ్ 12d ఏర్పాటు చేస్తున్నామన్నారు. దివ్యాంగుల కోసం ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల బృందం గురువారం మీడియా సమావేశం నిర్వహించింది. 2022-23లో తెలంగాణలో 22 లక్షల ఓట్లను తొలగించామని సీఈసీ రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. మరణాలు ఉన్నా ధృవీకరణ ఫామ్ అందిన తర్వాతే ఓటర్ల జాబితాలో పేర్లు తొలగించామని అన్నారు. ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదన్నారు. . పారదర్శకంగా ఓటర్ల జాబితా రూపొందించామని, ప్రతి ఒక్కరూ ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించారు. తెలంగాణలో 35, 356 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణలో ఓటర్ల సంఖ్య 3.17 కోట్లు ఉన్నట్లు రాజీవ్ కుమార్ చెప్పారు. మహిళా ఓటర్ల సంఖ్య గణనీయంగా పెరిగిందన్నారు.100 ఏళ్లు దాటిన ఓటర్ల సంఖ్య 7.689 ఉన్నట్లు పేర్కొన్నారు. కొత్తగా 8,11,640 లక్షల యువత ఓటు నమోదు చేసుకున్నారని తెలిపారు. కాగా తెలంగాణలో మూడు రోజులపాటు పర్యటించిన కేంద్ర ఎన్నికల సంఘం.. వివిధ రాజకీయ పార్టీలు, సీఎస్, డీజీపీ, జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో బుధవారం సమావేశమైంది. రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను పర్యవేక్షించింది. బుధవారం రాష్ట్ర ఓటర్ల జాబితాను సైతం ప్రకటించింది. సీఈసీ రాజీవ్ కుమార్ ఇంకేమన్నారో ఆయన మాటల్లోనే ► యంగెస్ట్ స్టేట్ తెలంగాణ... తెలంగాణ రాష్ట్రానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ► ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల నిర్వహణ కోసం మేము కమిట్మెంట్తో పనిచేస్తున్నాం. ►రాజకీయ పార్టీలతో కలిసినప్పుడు వాళ్ళ నుంచి అనేక విజ్ఞప్తులు వచ్చాయి ►అక్రమ నగదు - మద్యం ను కట్టడి చేయాలని విజ్ఞప్తి చేశారు. ► అర్బన్ ఏరియాల్లో మైక్రో అబ్జార్వార్లను పెట్టాలని కోరారు. ►119 సెగ్మెట్లలో 88 జనరల్, ఎస్టీ 12, ఎస్సీ 19 ఉన్నాయి. ►80ఏళ్లకు పైబడిన వాళ్ళు 4.43 లక్షలు ఉన్నారు. 100 ఏళ్లకు పైబడిన వాళ్ళు 7689 ఉన్నారు. ► 22లక్షల ఓట్లను 2022-23 డిలీట్ చేశాం. ►తెలంగాణ రాష్ట్రంలో అడ్రెస్స్ ఇష్యూ ఉంది. ► రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీలతో దాదాపు వెయ్యి సమావేశాలు నిర్వహించాం. ►ఎన్నికల ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరిగింది. ► ఈ సారి 8.11లక్షల మొదటిసారి ఓటర్స్‌ను నమోదు చేశాం. ►యువత - మహిళా ఓట్లను పెంచేందుకు మేమెంతో కృషి చేశాం. సక్సెస్ అయ్యాము. ► 3.45 లక్షల యంగ్ విమెన్ ఓట్లు నమోదు అయ్యాయి. ► థర్డ్ జెండర్స్ తో సమావేశాలు పెట్టాం. ► 35వేల పీస్‌లు, ప్రతీ పీఎస్‌కు 897 ఉన్నారు. ►మినిమమ్ వసతులు అన్ని కల్పిస్తున్నాం. ►అక్రమంగా నగదు మద్యం సరఫరా చేస్తే c vigil యాప్‌లో ఫోటో పెడితే 100 నిమిషాల్లో చర్యలు ఉంటాయి. ► ప్రతీ ఒక్కరూ ఓటర్ helpline app డౌన్లోడ్ చేసుకోవాలి. ►suvidha పోర్టల్ ప్రతీ అభ్యర్థి డౌన్లోడ్ చేసుకోవాలి.. సమాచారం తెలుసుకోవచ్చు. ► KYC అంటే KNOW YOUR CANDIDATE క్రిమినల్ బ్యాగ్రండ్ చెక్ చేసుకోవచ్చు. ► సరిహద్దుల్లో చెక్ పోస్ట్‌లు 89, మొత్తం 148 చెక్ పోస్టులు ఏర్పాటు. ► అక్రమంగా నగదు - మద్యం సరఫరా చేస్తే కఠినమైన చర్యలు ఉంటాయి. ► ఆన్లైన్ లో నగదు బదిలీల పై EC నిఘా ఉంటుంది. ► ఎలిప్యాడ్స్, ఎయిర్‌పోర్ట్స్ లో ప్రత్యేక నిఘా. ►ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ లు ప్రతీ వారానికి ఒకసారి రిపోర్ట్ చేయాలని ఆదేశించాం. ► ఆరోపణలు(ఫిర్యాదు )వచ్చిన ప్రతీ నాయకులు సమాధానం చెప్పాలి. ► ప్రకటనలు - సోషల్ మీడియా లో నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఉంటాయి. ►ఫ్రీ అండ్ ఫెర్ ఎన్నికల కోసం అబ్జర్లు కేంద్రం నుంచి విధులు నిర్వహిస్తారు ► ఎన్నికలు పారదర్శనంగా జరిపేందుకు అన్ని పక్కడ్బంధీ ఏర్పాట్లు చేస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నాహాక సమీక్ష సారాంశం కోసం క్లిక్ చేయండి -
Telangana: రాష్ట్ర ఓటర్లు 3,17,17,389
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఓటర్ల జాబితా సిద్ధమైంది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,17,17,389 కాగా, ఇందులో 1,58,71,493మంది పురుషులు, 1,58,43,339మంది మహిళలు, 2557 మంది ట్రాన్స్జెండర్లు ఉన్నారు. శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా రెండో ప్రత్యేక సవరణ చేపట్టారు. ఆ తర్వాత రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాలతుదిఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానఅధికారి(సీఈఓ) వికాస్‌రాజ్ బుధవారం ప్రకటించారు. 2023 జనవరితో పోల్చితే తుది ఓటర్ల జాబితాలో మొత్తం 5.8 శాతం ఓటర్లు పెరిగారు. రాష్ట్రంలో 15,338 మంది సర్వీసు ఓటర్లు, 2780 మంది ప్రవాస ఓటర్లున్నారు. 18–19 ఏళ్ల వయసు గల 5,32,990 మంది యువఓటర్లు కొత్తగా నమోదు చేసుకున్నారు. దీంతో 18–19 ఏళ్ల వయస్సు గల ఓటర్ల సంఖ్య 8,11,640కి చేరింది. దీంతో జాబితాలో యువ ఓటర్ల శాతం 2.56 శాతానికి పెరిగింది. కొత్త ఓటర్లు 17,01,087 మంది ఓటర్ల జాబితా రెండో సవరణలో చివరి గడువు సెప్టెంబర్ 19 నాటికి 57,617 దరఖాస్తులను పరిష్కరించామని, త్వరలో జరిగే శాసనసభ ఎన్నికల్లో అర్హులైన వారికి ఓటుహక్కు కల్పించామని సీఈఓ వికాస్‌రాజ్ ప్రకటించారు. కొత్తగా 17,01,087 మంది ఓటర్లు జాబితాలో చోటు పొందగా, 6,10,694 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. 5,80,208 మంది ఓటర్లు పేరు, ఇతర వివరాలు సరిదిద్దుకోవడం లేదా కొత్త చిరునామాకు ఓటు బదిలీ చేసుకున్నారు. స్త్రీ, పురుష ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 992 నుంచి 998కి మెరుగు పడిందని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. 18–19 ఏళ్ల వయసు గల ఓటర్ల మధ్య లింగ నిష్పత్తి 707 నుంచి 743కి మెరుగైందన్నారు. 80 ఏళ్లు పైబడిన ఓటర్ల సంఖ్య 43,943కి, దివ్యాంగ ఓటర్ల సంఖ్య 5,06,493కి, థర్డ్‌జెండర్ ఓటర్ల సంఖ్య 2557కి పెరిగిందన్నారు. ఓటర్ల నమోదుకుఇంకా అవకాశం కొత్త ఓటర్ల నమోదు నిరంతరంగా కొనసాగుతుందని, 2023 అక్టోబర్ 1తో 18 ఏళ్లు నిండిన వారు, గతంలో దరఖాస్తు చేసుకోనివారు దరఖాస్తు చేసుకోవచ్చని సీఈఓ వికాస్‌రాజ్ తెలిపారు. నామినేషన్ల దాఖలుకు 10 రోజుల ముందు వరకు దరఖాస్తు చేసుకుంటే, అర్హులకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటుహక్కు కల్పిస్తామన్నారు. https://voters.eci.gov.in/ వెబ్సైట్/ఓటర్ హెల్ప్‌లైన్ యాప్/బీఎల్ఓ ద్వారా ఓటరు నమోదుకు దరఖాస్తు చేసుకోవచ్చని, తమ పోలింగ్‌స్టేషన్, పేరు, ఇతర వివరాలు తెలుసుకోవచ్చన్నారు. ఓటర్ల జాబితాలో పొరపాట్లు ఉంటే ఫారం–8 దరఖాస్తు ఆన్లైన్/ యాప్/బీఎల్ఓ ద్వారా సమర్పించాలని సూచించారు. ఏమైనా ఫిర్యాదులుంటే ఓటరు హెల్ప్‌లైన్ నంబర్ 1950కి సంప్రదించాలన్నారు. 4లక్షల ఓటర్ల చిరునామాలు మార్పు ఒకే ఇంట్లో 6 కంటే ఎక్కువ ఓటర్లు ఉంటే స్వయంగా ఇళ్లకు వెళ్లి ఓటర్లను ధ్రువీకరించే కసరత్తు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా 4,15,824 మంది ఓటర్ల చిరునామాలు సవరించారు. 3,94,968 మంది ఓటర్లను ఒకే అసెంబ్లీ నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో కేంద్రానికి, 64,661 మంది ఓటర్లను ఒక అసెంబ్లీ స్థానం నుంచి మరో స్థానానికి బదిలీ చేశారు. ఈఆర్వో నెట్ ద్వారా 73,364 మంది ఓటర్ల చిరునామాలు, ఇళ్ల నంబర్లు సవరించారు. 4605 బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల్లో 757 బృందాలు తనిఖీ చేసి కొత్త ఓటర్ల నమోదు, వివరాల సవరణకు 50,907 దరఖాస్తులు స్వీకరించి వారికి ఓటుహక్కు కల్పించాయి. రెండేళ్లలో 22 లక్షల ఓటర్ల తొలగింపు ఓటర్ల జాబితా ప్రక్షాళనలో భాగంగా గత రెండేళ్లలో 22,02,168 మంది చనిపోయిన, డూప్లికేట్, వలస పోయిన ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. ఇందులో 4,89,574 మంది ఓటర్లు జీహె< చ్ఎంసీ పరిధిలోని వారే. ఈ ఏడాది 2,47,756 మంది చనిపోయిన ఓటర్లను తొలగించారు. ఓటర్ల జాబితా ప్రక్షాళనకు తీవ్రంగా శ్రమించామని, 14,24,694 ఓటర్ల వివరాలను సవరించామని సీఈఓ తెలిపారు. అప్పుడు ఓటర్లు ఇలా... గత ఆగస్టు 21న ప్రకటించిన ముసాయిదా ఓటర్ల జాబితాలో 1,53,73,066 మంది పురుషులు, 1,52,51,797 మంది మహిళలు, 2,133 మంది థర్డ్ జెండర్లు మొత్తం కలిపి రాష్ట్రవ్యాప్తంగా 3,06,42,333 ఓటర్లు ఉన్నారు. మరో 2,742 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 15,337 మంది సర్వీసు ఓటర్లు ముసాయిదాలో ఉన్నారు. 18–19 వయస్సు కలిగిన యువ ఓటర్ల సంఖ్య 4,76,597. ఓటర్ల జాబితా తొలి ప్రత్యేక సవరణ కార్యక్రమం 2023లో భాగంగా గత జనవరి 5న ప్రకటించిన తుది ఓటర్ల జాబితాలో మొత్తం 2,99,77,659 మంది ఓటర్లు ఉండగా, రెండో సవరణ నాటికి 3,17,32,727 మందికి పెరిగారు. -
తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల సంఘం వడివడిగా అడుగులేస్తోంది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం మూడు రోజులపాటు ఎన్నికల సన్నాహాక భేటీలు వరుసగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు తుది ఓటర్ల జాబితా విడుదల చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈసీ డేటా ప్రకారం సెప్టెంబర్ 18వ తేదీ వరకు.. కొత్త ఓటర్ల నమోదుకు 13.06 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో వివరాల సవరణ కోసం 7.77 లక్షల దరఖాస్తులు ఉండగా.. పేర్ల తొలగింపునకు 6.26 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. తెలంగాణలో మొత్తం 3.13 కోట్ల ఓటర్లు ఉన్నారు. అయితే రాజకీయ పార్టీలు మాత్రం ఓటర్ దరఖాస్తులన్నీ పరిష్కరించాకే.. తుది జాబితా విడదలు చేయాలని కోరుతున్నాయి. ఈ విజ్ఞప్తిని ఈసీ స్పందన ఏంటన్నది తెలియాల్సి ఉంది. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం రెండో రోజు సమావేశాలు హైదరాబాద్‌లో కొనసాగుతున్నాయి. జిల్లా ఎన్నికల అధికారులు - ఎస్పీలు, సీపీలతో ఇప్పటికే EC మీటింగ్ మొదలైంది. ఇవాళ రెండు సెషన్లుగా ఈ భేటీ జరగనుంది. మొదటి సెషన్లో అధికారులు చెప్పే అంశాల్ని కేంద్ర బృందం విననుంది. ఇక రెండో సెషన్లో అధికారులకు ఈసీ దిశానిర్దేశం చేస్తుంది. మరోవైపు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆయా జిల్లాలో నిర్వహించిన అవగాహన కార్యక్రమాల ఫోటో ఎగ్జిబిషన్‌ను కేంద్రం ఎన్నికల సంఘ బృందం పరిశీలించింది. -
మీ ఓటు ఉందా?.. చెక్ చేసుకోండి
సాక్షి, అమరావతి: ఓటర్ల జాబితాలో మీ ఓటు ఉందా? ఒకసారి పరిశీలించుకోండి. ఓటు లేకపోతే తక్షణం నమోదు చేయించుకోండి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితా రూపకల్పనకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణలో భాగంగా శుక్రవారం నుంచి వచ్చే నెల 21 వరకు అధికారులు ఇంటింటికీ తిరిగి ఓటర్ల జాబితాను పరిశీలిస్తారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో బూత్ లెవల్ ఆఫీసర్లు (బీఎల్వోలు) నెల రోజుల పాటు ఈ కార్యక్రమం చేపడతారు. ఓటర్ల జాబితాను పరిశీలించి సవరణలు చేస్తారు. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ బూత్ లెవల్ ఏజెంట్లను నియమించుకొని బీఎల్వోలతో కలిసి ఓటర్ల పరిశీలనలో పాల్గొంటాయి. ఇంటింటి సర్వే పూర్తయిన తర్వాత ఆగస్టు 22 నుంచి రాజకీయ పార్టీల సూచనల మేరకు పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేస్తారు. ఈ ప్రక్రియను సెప్టెంబర్ 30కి పూర్తి చేసి అక్టోబరు 17న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురిస్తారు. నవంబర్ 30 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. శనివారం, ఆదివారం అయిన అక్టోబర్ 28, 29, నవంబర్ 18, 19 తేదీల్లో క్లెయిమ్‌లు, అభ్యంతరాల స్వీకరణకు బూత్ స్థాయిల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తారు. డిసెంబరు 26 కల్లా క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పరిష్కరించి జనవరి 5న తుది ఓటర్ల జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటిస్తుంది. కొత్త ఓటర్ల నమోదుపై దృష్టి రాష్ట్రంలో 18 ఏళ్లు నిండిన ఓటర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో వీటి నమోదుపై ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి సారిస్తోంది. రాష్ట్ర జనాభా ప్రకారం 18 నుంచి 19 ఏళ్లు ఉన్న ఓటర్లు కనీసం 12 లక్షలు ఉండాలి. కానీ 3.50 లక్షల ఓటర్లు మాత్రమే నమోదయ్యారు. 2024 జనవరి1 నాటికి 18 ఏళ్లు నిండే వారు కూడా ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవకాశం ఉండటంతో వీరి నమోదుపైనా దృష్టి సారిస్తున్నారు. వీరు ఫారం 6ను వినియోగించి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చు. చనిపోయిన వారు, వేరే రాష్ట్రాలకు వెళ్లిపోయిన వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి ఫారం 7ను వినియోగించుకోవాలి. చిరునామా, నియోజకవర్గం మార్చుకోవడానికి ఫారం 8 ఇవ్వాలి. ప్రవాసాంధ్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలంటే ఫారం 6 ఏను ఇవ్వాలి. పరిశీలనకు తీసుకొనే అంశాలు ♦ ఓటరు జాబితాలో ఒకే వ్యక్తి రెండు మూడు చోట్ల ఓటు కలిగి ఉంటే వారి అభీష్టం మేరకు ఒక చోట ఉంచి మిగిలిన ఓట్లను తొలగిస్తారు. ♦ నకిలీ ఓట్ల గుర్తింపు, చనిపోయిన వారి ఓట్ల తొలగింపు, వందేళ్లు వయస్సు పైబడిన వారిని గుర్తిస్తారు. ♦ డోర్ నంబర్లు లేకుండా ఉన్నా, ఒకే డోర్ నంబరుపై పదుల సంఖ్యలో ఉన్న ఓట్లను పరిశీలిస్తారు. ♦ ఇంటి నంబరు లేనివి, ఒకే ఇంటి నంబరు, వీధి పేరుపై వందలాది ఓట్లు ఉంటే వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, పరిష్కరిస్తారు. ♦ దీర్ఘ కాలంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి ఓట్లను వారి అభీష్టం మేరకు ఒక్క ప్రాంతంలోనే ఉంచుతారు ♦ ఒక బూత్‌లో సరాసరి 1,500 ఓట్లకు మించి ఉంటే కొత్త బూత్ సిఫారసు చేస్తారు. దొంగ ఓట్ల దొంగ బాబే! 2019 ఎన్నికల్లో గెలవడానికి అప్పట్లో సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఇవ్వని హామీలేదు. అయినా నమ్మకం కుదరక ఇష్టానుసారంగా దొంగ ఓట్లు నమోదు చేయించారు. ఒకే ఇంట్లో 40–50 మొదలు.. ఏకంగా 600–700 ఓట్ల వరకు గంపగుత్తగా ఓట్లు ఉన్నట్లు సృష్టించారు. అయినప్పటికీ ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ ప్రభంజనం ముందు తట్టుకోలేక తల వంచారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో నాటి లీలలు ఒక్కటొక్కటిగా బయట పడుతుంటే ఉలిక్కిపడుతున్నారు. గంపగుత్తగా ఉన్న దొంగ ఓట్లను ప్రభుత్వం గుర్తించి తొలగిస్తుంటే బెంబేలెత్తిపోతున్నారు. విచారించగా ఆ దొంగ ఓట్లన్నీ నాటి బాబు పాలనలో రికార్డుల్లోకి ఎక్కినవేనని స్పష్టమవుతోంది. ఇలాగైతే ప్రజల్లో ఇంకా చులకనవుతానని భావించి ఎల్లో మీడియాను రంగంలోకి దింపారు. తను చేసిన తప్పును ప్రస్తుత ప్రభుత్వంపై, వైఎస్సార్సీపీపై వేసి.. తప్పించుకునేందుకు యత్నిస్తున్నారు. రోజుకో రీతిన తప్పుడు కథనాలు వండి వార్చుతూ ప్రజలను తప్పుదోవ పట్టించి, రాజకీయంగా లబ్ధి పొందాలని వ్యూహం పన్నారు. ఇది కూడా బెడిసి కొడుతోంది. బాబు తీరు చూస్తుంటే దొంగే.. దొంగ దొంగ అని అరిచినట్లుంది. -
ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేక దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: మరో తొమ్మిది నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణపై ప్రత్యేకదృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గాల పరిశీలకులను ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో 2014–19 మధ్య అధికారాన్ని అడ్డుపెట్టుకుని టీడీపీ నేతలు అరాచకాలకు పాల్పడి దొంగ ఓట్లను చేర్పించారని గుర్తుచేశారు. దాదాపు 68 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయని తేలిందని ఎత్తిచూపారు. ఆ దొంగ ఓట్లను గుర్తించి, వాటి తొలగింపునకు కృషిచేయాలని దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా అర్హులైన వారిని ఓటర్లుగా చేర్పించాలని సూచించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మంగళవారం 175 నియోజకవర్గాల పార్టీ పరిశీలకులతో ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పార్టీ కేంద్ర కార్యాలయ పర్యవేక్షకుడు, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిశీలకులు మరింత కీలకంగా, బాధ్యతగా పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ దిశానిర్దేశం చేసిన మేరకు 175 నియోజకవర్గాలకు 175 గెల్చుకోవడమే లక్ష్యంగా పనిచేయాలన్నారు. నియోజకవర్గాలపై అవగాహన పెంచుకోవాలని, స్థానిక సమస్యలు, వాటి పరిష్కారం, అక్కడి ప్రతిపక్షాల పాత్ర వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సూచించారు. వారంలో కనీసం రెండురోజులు నియోజకవర్గాల్లో ఉండి పార్టీని మరింత బలోపేతం చేసేదిశగా చర్యలు తీసుకోవాలన్నారు. నియోజకవర్గ ఎమ్మెల్యే లేదా పార్టీ సమన్వయకర్తకు తలలో నాలుకలాగా మెలుగుతూ కీలకంగా ఉండాలని కోరారు. ఏవైనా సమస్యలుంటే సమన్వయంతో పరిష్కరించడానికి కృషిచేయాలని సూచించారు. స్థానిక నేతల అభిప్రాయాలు విభిన్నంగా ఉంటే వాటిని పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్ల దృష్టికి, పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి తీసుకురావాలని ఆదేశించారు. జగనన్న సురక్ష పథకం నియోజకవర్గాల్లో ఏ విధంగా జరుగుతోంది.. ప్రజలకు సంబంధించి అన్ని సమస్యల పరిష్కారం, పథకాలను లబ్దిదారులకు అందించేలా సమన్వయం చేయడం వంటి వాటిపైన కూడా దృష్టిపెట్టాలని కోరారు. గృహసారథులు, గ్రామ, వార్డు సచివాలయాల కన్వి నర్లు.. మండల, డివిజన్ పార్టీ నేతలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్, వైఎస్సార్సీపీ పట్ల ప్రజలు అత్యంత విశ్వాసంతో ఉన్నారని.. రానున్న ఎన్నికలలో పార్టీ విజయం త«థ్యమని చెప్పారు. అయినప్పటికి నియోజకవర్గాలలో పార్టీ స్థితిగతులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. -
వరస తప్పిన ముఖ్యమైన లెక్క
దేశ జనన, మరణాల రిజిస్టర్‌ను ఓటర్ల జాబితాతో అనుసంధానించేలా త్వరలోనే పార్లమెంట్లో ఒక బిల్లు ప్రవేశపెట్టాలని కేంద్ర సర్కార్ యోచిస్తోంది. దేశ పౌరులెవరికైనా సరే 18 ఏళ్ళు నిండగానే వారి పేరు ఓటర్ల జాబితాలో చేరిపోయేలా ఆ బిల్లుతో వీలు కల్పించాలని భావిస్తోంది. సోమవారం ఢిల్లీలో భారత జనగణన కమిషనర్ కార్యాలయ ప్రారంభోత్సవ వేళ కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా వెల్లడించిన ఈ సంగతి మారుతున్న కాలమాన పరిస్థితుల్లో మంచి ఆలోచనే. మరణించినవారి పేర్లను తక్షణం తొలగించడానికీ, ఓటుహక్కు వయసు రాగానే జాప్యం లేకుండా కొత్త ఓటర్లు జాబి తాలో చేరడానికీ ఈ అనుసంధాన ప్రక్రియ ఉపకరిస్తుంది. అయితే, అదే సమయంలో పదేళ్ళకోసారి నిర్వహించాల్సిన కీలక జనగణనను ఈ దఫా ఎప్పుడు జరిపేదీ ప్రస్తావించకపోవడమే ఆశ్చర్యం. నిజానికి, 1948 జనగణన చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ ప్రక్రియను నిర్వహిస్తుంది. అలాగని ప్రతి పదేళ్ళకూ జనగణన చేయాలని చట్టమేమీ లేదు. ఎప్పుడు జనగణన చేయాలో, ఫలితాలెప్పుడు వెల్లడించాలో నిర్ణీత కాలవ్యవధి అందులో లేదు. అయితే, ఈ లెక్కల ప్రయోజనం అపారం. బ్రిటీష్ ఇండియాలో 1881లో వందల మంది శ్రమించి, 25 కోట్లకు పైగా జనాభా నుంచి జవాబులు సేకరించారు. అప్పటి నుంచి 130 ఏళ్ళ పాటు యుద్ధాలు సహా ఎన్ని సంక్షోభాలు వచ్చినా, మన పాలకులు ఒక క్రమం తప్పని యజ్ఞంగా ఈ జనగణన ప్రక్రియను సాగించారు. తీరా ఈసారి ఆక్రమం తప్పింది. దేశంలో తాజా జనగణన 2021లో జరగాల్సి ఉంది. 2020 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా అందులో తొలి దశ జరపాలని భావించారు. కరోనాతో అది నిరవధిక వాయిదా పడింది. జనం లెక్కను ప్రోదిచేసి, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక తదితర అంశాలతో ఒక సమాచార గనిగా, ప్రభుత్వ – ప్రజా కార్యాచరణకు కీలక సూచికగా ఉపకరించాల్సిన ఆ ప్రక్రియ ఈసారి అలా ఆలస్యమైంది. జాప్యానికి కరోనాయే కారణమన్న ప్రభుత్వ వాదన తర్కానికి నిలవదు. అత్యధికులు కరోనా టీకాలు వేయించుకున్నా, 2022లో మూడో వేవ్ ముగిసి జనజీవనం కుదుటపడినా, వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు సైతం సాగుతున్నా సరే... సర్కార్ ఎందుకనో ఇప్పటి దాకా మళ్ళీ జనగణన ఊసే ఎత్తలేదు. జిల్లాలు, తాలూకాలు, పోలీస్ స్టేషన్ల పాలనా సరిహద్దుల్ని స్తంభింపజేసే తుది గడువును ఈ జూన్ 30 వరకు కేంద్రం పొడిగించింది గనక లెక్కప్రకారం ఆ తర్వాత మూడు నెలలైతే కానీ జనగణన చేపట్టరాదు. అంటే, కనీసం ఈ సెప్టెంబర్ దాకా జనగణన లేనట్టే. ఇక, సాధారణంగా జనసంఖ్యను లెక్కించడం జనగణన చేసే ఏడాది ఫిబ్రవరిలో చేస్తారు. మార్చి 1కి ఇంత జనాభా అంటారు. కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలోనే సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో 2024 చివర ఎప్పటికో కానీ ప్రక్రియే మొదలు కాకపోవచ్చు. పైకి మామూలు గానే అనిపించినా, ఈ ఆలస్యం విస్తృత పర్యవసానాలకు దారి తీస్తుంది. ఎందుకంటే, పుష్కరకాలం గడిచిపోయినా ఇప్ప టికీ మన విధాన రూపకర్తలు పాత 2011 నాటి జనాభా లెక్కల ఆధారంగా సంక్షేమ పథకాల నుంచి సాయాల దాకా నిర్ణయాలు తీసుకోవాల్సి రావడం విచిత్రం, విషాదం. అసలు కరోనాతో ఆలస్యమవడానికి ముందే ఈ 2021 జనగణన వివాదాస్పదమై కూర్చుంది. జనగణనతో పాటు జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)ను నవీకరించేలా జనాభా సర్వే చేపడతామంటూ ప్రభుత్వం తేనెతుట్టె కదిల్చింది. అప్పటికే, ముస్లిమ్లే లక్ష్యంగా వివాదాస్పద ‘పౌరసత్వ చట్టం–2019’ తెచ్చారంటూ, దేశవ్యాప్తంగా నెలల తరబడి నిరసనలు సాగాయి. ఆ చట్టానికి, ఇప్పుడు భారతీయులమని నిరూపించుకోవాల్సిన ఈ ‘ఎన్పీఆర్’ జత చేరిందని విమర్శలు రేగాయి. మరో పక్క ఇప్పటికే ప్రతిపక్షాల్లోని అనేక రాజకీయ పార్టీలు, ప్రాంతీయ నేతలు దేశంలో కులగణన సాగాలని డిమాండ్ చేస్తున్నాయి. ఆ లెక్కలు కూడా తీస్తే తమ ఓటుబ్యాంకులో చీలికలు రావచ్చనీ, అది తమకు దెబ్బ కావచ్చనీ అధికార పార్టీ భయపడుతోంది. వివిధ వర్గాల నుంచి ప్రత్యేక కోటాలకు డిమాండ్లు తలెత్తుతాయని ఆందోళన చెందుతోంది. అయిన ఆలస్యం ఎలాగూ అయింది గనక వచ్చే ఎన్నికల్లో లెక్క తప్పకుండా ఉండాలంటే, ఈ లెక్కలు పక్కనపెట్టాలనుకుంటే ఆశ్చర్యమేమీ లేదు. జనగణన అంటే కేవలం భౌగోళిక ప్రాంతాల్లో తలకాయలు లెక్కపెట్టడం కాదు. సమాజంలోని భిన్న వర్గాల ఆకాంక్షలకు పునాదిగా నిలిచే ప్రక్రియ. గ్రామీణ – పట్టణ జనాభా వాటా, వలసలు, మాతృభాష, ఆయుఃప్రమాణం, గృహవసతులు వగైరా అనేక గణాంకాలను అందించే సమాచార నిధి. ఆర్థిక జీవిత అంశాలపై దృష్టి పెట్టే అనేక సర్వేలకు మాతృకైన ‘జాతీయ శాంపిల్ సర్వే’, ఆరోగ్యం – సామాజిక స్థితిగతులపై ఇంటింటి సర్వే అయిన ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వగైరాలు శాంపిల్స్ తీసుకోవడానికి జనగణనే ఆధారం. ఇంతటి ముఖ్యమైన వ్యవహారంపై ఈ సుదీర్ఘ అనిశ్చితి సమంజసం కాదు. జనగణన ప్రక్రియ ఎప్పుడు జరిగినా – ఆధునికతనూ, ఎప్పటి కప్పుడు లెక్కల్లో మార్పుల్ని పొందుపరుచుకొనే లక్షణాన్నీ సంతరించుకోవాలన్న ప్రభుత్వ యోచన ఆహ్వానించదగినదే. కాకపోతే ఎప్పుడో డిజిటల్ వేదికల్ని ఆశ్రయిస్తామనీ, వ్యక్తులు తమకు తామే ఎలక్ట్రానిక్‌గా సమాచారం పూర్తిచేసే హక్కు కల్పిస్తామనీ, అందులో సామాజిక – ఆర్థిక హోదాను లెక్కించే 35కు పైగా పరామితులు ఉంటాయనీ అంటూ... ఇప్పుడు అమితమైన జాప్యం చేయడం అర్థరహితం. అసలుకే మోసం. అయితే, జనగణన ఎప్పుడు చేస్తామో చెప్పకున్నా, ఎలా చేయాలను కుంటున్నదీ పాలకుల నోట వినపడడమే ప్రస్తుతానికి దక్కిన సాంత్వన. -
ఎమ్మెల్సీ ఎన్నికల ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల
సాక్షి, అమరావతి: రాష్ట్ర శాసన మండలిలో పట్టభద్రులు, ఉపాధ్యాయుల నియోజకవర్గాల నుండి ఎన్నికైన ఐదుగురు సిట్టింగ్ సభ్యులు వచ్చే ఏడాది మార్చి 29న పదవీ విరమణ చేయనున్నారు. వారి నియోజకవర్గాలకు ముసాయిదా ఓటర్ల జాబితా (డ్రాఫ్ట్ ఎలక్టోరల్ రోల్స్)ను రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ జాబితాలపై డిసెంబర్ 9 వరకు అభ్యంతరాలను స్వీకరిస్తామని, వాటిని పరిష్కరించి తుది జాబితాలను డిసెంబర్ 30న విడుదల చేస్తామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. డ్రాఫ్ట్ రోల్లో నమోదు చేసుకోలేకపోయిన అర్హులందరూ గ్రాడ్యుయేట్ల నియోజకవర్గం కోసం ఫారం–18, ఉపాధ్యాయుల నియోజకవర్గం కోసం ఫారం–19లో నమోదుకు దరఖాస్తులను దాఖలు చేయవచ్చని, ఏవైనా అభ్యంతరాలుంటే ఓటర్లు ఫారం–7, సవరణల కోసం ఫారం–8లో దాఖలు చేయవచ్చని తెలిపారు. బూత్ స్థాయి ఏజెంట్ల సాయం ముసాయిదా జాబితాలో సవరణల కోసం బూత్ స్థాయి ఏజెంట్ల సాయం తీసుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. అలాగే ఏజెంట్ల బాధ్యతలను కూడా వివరించింది. చనిపోయిన, మారిన ఓటర్లను ఇంటింటి సర్వే ద్వారా, ఇతర మార్గాల ద్వారా గుర్తించి ఒక జాబితా తయారు చేసి, నిర్ణీత ఫార్మాట్లో అధికారులకు అందించవచ్చని తెలిపింది. ఇలా ఏజెంట్లు ఒక రోజులో 10కి మించకుండా దరఖాస్తులను ఫైల్ చేయవచ్చని చెప్పింది. రాజకీయ పార్టీలు ప్రతి పోలింగ్ స్టేషన్‌కు బూత్ లెవల్ ఏజెంట్లను నియమించాలని ఆదేశించింది. -
మహిళా ఓటర్లే అధికం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. ప్రతీ వెయ్యి మంది పురుష ఓటర్లకు 1,025 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం రాష్ట్రంలో 1.96 కోట్ల పురుష ఓటర్లుండగా 2.01 కోట్లు మహిళా ఓటర్లు ఉన్నారు. 26 జిల్లాలకు గాను 24 జిల్లాల్లో మహిళా ఓటర్లే నిర్ణేతలుగా ఉన్నారు. విశాఖపట్టణం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మాత్రమే మహిళలకన్నా పురుష ఓటర్లు ఎక్కువగా ఉండగా మిగతా 24 జిల్లాల్లో మహిళా ఓటర్లదే పైచేయిగా ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 9.65 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఆ తరువాత అత్యధికంగా కర్నూలు జిల్లాలో 9.60 లక్షలు, అనంతపురం జిల్లాలో 9.56 లక్షలు, విశాఖ జిల్లాలో 9.38 లక్షలు, శ్రీకాకుళం జిల్లాలో 9.10 లక్షల మహిళా ఓటర్లు ఉన్నారు. ఇక ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం సాధారణ ఓటర్లలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 19.12 లక్షల ఓటర్లు ఉండగా ఆ తరువాత అనంతపురం జిల్లాలో 19.11 మంది, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 18.98 లక్షల ఓటర్లు ఉన్నారు. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో 12.61 లక్షల ఓటర్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 7.68 లక్షలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 7.15 లక్షల ఓటర్లు ఉన్నారు.