
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను ఎలక్షన్ కమిషన్ శనివారం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. అత్యధికంగా 40,13,770 లక్షల మంది ఓటర్లు కలిగిన జిల్లాగా తూర్పుగోదావరి నిలవగా, అత్యల్పంగా విజయనగరంలో 17,33,667 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య:
శ్రీకాకుళం | 20,64,330 |
విజయనగరం | 17,33,667 |
విశాఖపట్నం | 32,80,028 |
తూర్పు గోదావరి | 40,13,770 |
పశ్చిమ గోదావరి | 30,57,922 |
కృష్ణా | 33,03,592 |
గుంటూరు | 37,46,072 |
ప్రకాశం | 24,95,383 |
నెల్లూరు | 22,06,652 |
వైఎస్సార్ కడప | 20,56,660 |
కర్నూలు | 28,90,884 |
చిత్తూరు | 30,25,222 |
అనంతపురం | 30,58,909 |
Comments
Please login to add a commentAdd a comment