సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికల్లో విజయం కోసం వ్యూహం సిద్ధం చేస్తున్న టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు ఓటర్ల జాబితాలో చేర్పుల ప్రక్రియ కీలకమని భావి స్తున్నారు. ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను, ప్రతిపాదనలను, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 25 వరకు గడువు ఉంది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా ఓటరు అయ్యేలా చూడాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ ప్రక్రియను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునేలా చూడాలని టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ నేతలను ఆదేశించారు. క్షేత్రస్థాయిలోని వివరాలతో ప్రతిరోజూ నివేదికలు తెప్పించుకోవడంతోపాటు టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ నేతలతో మాట్లాడుతున్నారు. టీఆర్‌ఎస్‌లోని అన్ని స్థాయిల నేతలు ఈ నెల 25 వరకు ఓటర్ల జాబితా ప్రక్రియపైనే పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిపై ప్రజల్లో సానుకూలత ఉందని... అందరికీ ఓటు హక్కు ఉంటే ఫలితాలు అనుకూలంగా ఉం టాయని కేసీఆర్ భావిస్తున్నారు. ఓటరు జాబితా ప్రక్రియ అనంతరమే పార్టీ పరంగా ఇతర కార్యక్రమాల నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
‘స్టేషన్’పై కడియం వివరణ...
టీఆర్‌ఎస్ అభ్యర్థుల ఎన్నికల ప్రచారం ప్రక్రియపై మంత్రి కేటీఆర్ క్షేత్రస్థాయి నుంచి సమాచారం సేకరిస్తున్నారు. ఆయా జిల్లాల పరిస్థితిపై ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్‌కు వివరిస్తున్నారు. సమాచారం ఆధారంగా కొం దరు అభ్యర్థులకు ఎప్పటికప్పడు సూచనలు చేస్తున్నారు. పలువురు అభ్యర్థులను పిలిచి మాట్లాడుతున్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో నెలకొన్న తాజా పరిస్థితులను డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి శుక్రవారం కేటీఆర్‌కు వివరించారు. తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్య ప్రచారం తీరు, నియోజకవర్గంలోని అసంతృప్తి నేతల కార్యకలాపాలపై వీరిద్దరూ చర్చి ంచారు. మంత్రి మహేందర్‌రెడ్డి, చేవెళ్ల టీఆర్‌ఎస్ అభ్యర్థి కాలే యాదయ్య కేటీ ఆర్‌ను కలిశారు.
కొడంగల్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి ప్రచార తీరుపై చర్చించారు. చేవెళ్ల నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జి కె.ఎస్.రత్నం ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన వ్యవహారంపై మాట్లాడారు. రత్నం గతంలోనూ టీఆర్‌ఎస్‌ను వీడి మళ్లీ వచ్చారని, ఆయన వెళ్లినా పార్టీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని మహేందర్‌రెడ్డి ఈ సందర్భంగా వివరించారు. మరో మంత్రి సి.లక్ష్మారెడ్డి సైతం కేటీఆర్‌ను కలిశారు. గ్రేటర్ హైదరాబాద్ నేత దానం నాగేందర్ దాదాపు ప్రతిరోజూ కేటీఆ ర్‌ను కలుస్తూనే ఉన్నారు. ఖైరతాబాద్ టికెట్ విషయంపై శుక్రవారం మరోసారి కలసి విజ్ఞప్తి చేశారు. తన అభ్యర్థిత్వంపై అధికారిక ప్రకటన చేయాలని కోరారు. తలసాని శ్రీనివాసయాదవ్ కూడా కేటీఆర్‌ను కలిశారు.
అర్హులందరికీ ఓటు హక్కు
Published Sat, Sep 22 2018 1:44 AM | Last Updated on Sat, Sep 22 2018 1:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment