
ఎవరైనా ఒకరు, ఇద్దరికీ తండ్రి అనడం కామన్. లేదంటే నలుగురు, ఆరుగురుకి తండ్రిగా ఉంటారు. కానీ ఓచోట ఓ వ్యక్తి 100 మందిపైగా తండ్రి అయ్యాడు. బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఈ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ 138 మందికే ఒకే తండ్రి ఉన్నారు. ఈ వార్త తెలిసి అందరూ ఉలిక్కిపడ్డారు. దీని వెనుక అసలు విషయం వెలుగులోకి రావడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
బిహార్‌లోని తిర్హుట్ పట్టభద్రుల ఉప ఎన్నికల కోసం అధికారులు ఓటర్ల జాబితా తయారు చేశారు.ఔరాయ్ బ్లాక్‌లోని బూత నంబర్ 54లో 724 ఓటర్లు ఉన్నారు. అందులో 138 మంది ఓటర్ల తండ్రి పేరు మున్నా కమార్ అంకిత్‌గా ఉంది. వీరిలో హిందూ, ముస్లిం వర్గాలకు చెందిన ప్రజలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న జేడీయూ అభ్యర్థి అభిషేక్ ఝా ఓటర్ల జాబితాపై అధికారులను ప్రశ్నించారు.
ఓట్లు తనకు పడకుండా ఆపేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీదనిపై పై అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు. చివరికి సాంకేతిక లోపం కారణంగా ఈ పొరపాటు జరిగినట్లు తేలడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. దీనిపై స్పందించిన ఎన్నికల అధికారులు.. వీలైనంత త్వరగా సరిచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment