
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల జాబితాల్లో వందేళ్లకు పైబడిన వయో వృద్ధుల ఓట్లపై పునఃపరిశీలన జరపాలని అన్ని జిలా కలెక్టర్లను ఆదేశిం చినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌కుమార్ పేర్కొన్నారు. పరిశీలన ప్రక్రియ పూర్తయితే వెంటనే నకిలీ ఓట్లను తొలగిస్తా మని తెలిపారు. మరణ ధ్రువీకరణ రిజిస్టర్ ఆధారం గా ఓటరు జాబితాలను సరిచూస్తామన్నారు. ముం దస్తు ఎన్నికలకు జరుగుతున్న ఏర్పాట్లపై మంగళవారం సచివాలయంలో మాట్లాడారు.
ఓటర్ల జాబితాల్లో కొంత వరకు బోగస్ ఓటర్లున్నట్లు గుర్తించా మని చెప్పారు. ఓటర్ల జాబితాల్లో 70 లక్షల బోగస్ ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు విషయంలో స్పందించేందుకు నిరాకరించారు. 2014 ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో 2.81 కోట్లు ఉన్న ఓటర్ల సంఖ్య ఇప్పుడు 2.61 కోట్లకు ఎలా తగ్గిందన్న అంశంపై పరిశీలన జరుపుతున్నట్లు చెప్పారు. ఓటర్ల జాబితా నుంచి తమ పేర్లను తొలగించారని ఫిర్యాదు చేస్తున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉందన్నారు.