
సాక్షి, అమరావతి : మంగళగిరి నియోజకవర్గంలో 13వేల ఓట్లను టీడీపీ నేతలు గల్లంతు చేశారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి అన్నారు. ఎంపీటీసీ, సర్పంచ్ ఓట్లను కూడా గల్లంతు చేయడం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమాలకు పరాకాష్ట అని మండిపడ్డారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆర్కే సోమవారం కలిసి ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వం చేసిన అవినీతి, అక్రమాలతో ఎన్నికల్లో ప్రజలు తిరస్కరిస్తారనే భయంతో ప్రభుత్వమే ఓట్ల గల్లంతు కార్యక్రమం చేపట్టిందని ఆర్కే ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment