
సాక్షి, మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మంగళగిరి మిద్దె సెంటర్‌లో ఉచితంగా జ్యూట్ చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిని ప్లాస్టిక్ రహిత మంగళగిరిగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ సంచుల వాడకం మానేసి.. జ్యూట్ సంచులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అంతా కృషి చేయాలన్నారు. ఆదివారం నుంచి మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఒక జ్యూట్ చేతి సంచిని అందజేస్తామని ఆర్కే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments
Please login to add a commentAdd a comment