mla rk
-
లోకేష్‌కూ అనుమానమే.. మంగళగిరి నుంచి పోటీకి దూరమేనా?
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. సీట్ల కేటాయింపులపై ఇప్పటికీ ఏమీ తేల్చకపోవడం, మరోవైపు వైఎస్సార్సీపీలో జరిగిన మార్పులతో తాము కూడా అభ్యర్థులను మార్చాలని అధిష్టానం ఆలోచన చేస్తుండటంతో సీటు ఆశిస్తున్న నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో పొన్నూరు తప్ప అన్ని నియోజకవర్గాలలో అస్పష్టత కొనసాగుతోంది. పొన్నూరులో కూడా ధూళిపాళ్లను ఎంపీగా పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. గుంటూరు నగరానికి వస్తే మూడు వర్గాలు, ఆరు గ్రూపులుగా పార్టీ చీలిపోయింది. రెండు నియోజకవర్గాలలో ఇన్చార్జులను కాదని కొంతమంది నేతలు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, వారు బహిరంగంగానే గొడవలకు దిగడం పరిపాటిగా మారింది. లోకేష్‌కూ అనుమానమే మంగళగిరిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్కే స్థానంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్చార్జిగా ప్రకటించడంతో తెలుగుదేశం ఆలోచనలో పడింది. నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నా, చివరి నిముషంలో ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని మంగళగిరి పార్టీ నేతలు చెబుతున్నారు. పశ్చిమలో కోవెలమూడి వర్సెస్ ఉయ్యూరు గుంటూరు పశ్చిమలో నియోజకవర్గ ఇన్చార్జిగా కోవెలమూడి రవీంద్ర(నానీ) ఉండగా, అతనికి పోటీగా ఎన్ఆర్ఐలు మన్నవ మోహనకృష్ణ, ఉయ్యూరు శ్రీనివాస్, నియోజకవర్గ నేతలు డాక్టర్ నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్ యాదవ్ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో తమ సొంత ప్రచారం సాగిస్తున్నారు. చివరి నిముషంలో పొత్తులో తెనాలి జనసేనకు ఇస్తే మాజీ మంత్రి ఆలపాటి రాజాను రంగంలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి గుంటూరు పశ్చిమ బాధ్యతలు వైఎస్సార్ సీపీ అప్పగించడంతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి బదులుగా గుంటూరు పశ్చిమలో పోటీ చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది. తెలుగుదేశం–జనసేన మధ్య ‘తెనాలి’ రగడ తెనాలిలో తెలుగుదేశం–జనసేన మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. ఈ సీటు తమకే కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా పట్టుపడుతున్నారు. జనసేన తరపున తాను తెనాలి నుంచి పోటీ చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్ ఇప్పటికే పలుమారు ప్రకటించుకున్నారు. ఆలపాటి రాజా పేద యువతుల వివాహానికి మంగళసూత్రం ఉచితంగా ఇస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మిచాంగ్ తుఫాన్ బాధిత రైతుల పరామర్శ కోసం చంద్రబాబునాయుడు వచ్చినప్పుడు ఆయన బలప్రదర్శన చేశారు. మరోవైపు రోజు మార్చి రోజు నాదెండ్ల మనోహర్ ఇక్కడే ప్రెస్‌మీట్ పెడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. రైతు సమస్యలు, వ్యాపారుల సమస్యలపై నేరుగా వెళ్లి వారిని కలుస్తున్నారు. తాడికొండలో శ్రావణ్‌కు పొగ రాజధాని ప్రాంతమైన తాడికొండలో ప్రస్తుతం ఇన్చార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న తెనాలి శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా తొలినుంచి ఓ వర్గం పావులు కదుపుతుంది. అందులో భాగంగా గత ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు ఎదుట వారు శ్రావణ్‌కుమార్‌కు సీటు ఇవ్వకుండా శతవిధాలా అడ్డుపడ్డారు. దీంతో శ్రావణ్‌కుమార్‌ను బాపట్ల ఎంపీగా, అక్కడ ఎంపీగా పోటీ చేసిన మాల్యాద్రిని ఇక్కడకు సీటు కేటాయించగా శ్రావణ్‌కుమార్ వర్గం కూడా గట్టిగా పట్టుబట్టడంతో తిరిగి ఎక్కడ వారిని అక్కడే ఉంచేశారు. ఇప్పుడు కూడా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన గేరా రవిబాబు, తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామానికి చెందిన తోకల రాజవర్థన్‌లు సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజవర్ధన్‌కు రాయపాటి వర్గం అండగా నిలబడింది. ప్రత్తిపాడులో ఆర్.ఆర్. రగడ ప్రత్తిపాడులో ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న రిటైర్డ్ ఐఏఎస్ బి.రామాంజనేయులును పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయనకు మద్దతుగా ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పెత్తనాన్ని కూడా వారు వ్యతిరేకించడంతోపాటు బహిరంగంగానే తమ అసమ్మతిని బయటపెడుతున్నారు. పెదనందిపాడు, గుంటూరు రూరల్‌లో కూడా రామాంజనేయులు అనుకూల, వ్యతిరేకవర్గాలు బాహాబాహీకి దిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్తిపాడు, తాడికొండలలో ప్రస్తుతం ఇన్చార్జులుగా ఉన్న వారి సామాజిక వర్గాలకు చెందిన నేతలనే వైఎస్సార్సీపీ ఇన్చార్జులుగా ప్రకటించడంతో ప్రత్తిపాడు, తాడికొండలలో కూడా అభ్యర్థులను మార్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. తూర్పులో హెచ్చరికలు, కొట్లాటలు గుంటూరు తూర్పులో నియోజకవర్గ ఇన్చార్జిగా మహ్మద్ నసీర్ ఉండగా, అతనికి పోటీగా గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్, సయ్యద్ ముజీబ్ సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నసీర్, ముజీబ్ గ్రూపుల మధ్య గొడవలు పెరిగి పోలీసు స్టేషన్ మెట్లెక్కే పరిస్థితి ఇరుగ్రూపుల మధ్య నెలకొంది. మరోవైపు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జిగా నసీర్ అహ్మద్ తీరుపై కార్యకర్తలు, నాయకుల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట ఇక ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ అసలు పూర్తిగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టేశారు. నియోజకవర్గానికి వచ్చి కూడా సంవత్సరాలు దాటిపోతుండటం, మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడంతో ఎంపీ అభ్యర్థి కోసం కూడా వెతుకులాటలో ఉంది. ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్ నేతలు ఎంపీగా రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బయట వ్యక్తులను తీసుకువచ్చే ప్రయత్నాలలో ఆ పార్టీ ఉంది. -
నిచ్చెనలాగి.. కూలీలతో కలిసి విత్తనాలు నాటిన ఎమ్మెల్యే ఆర్కే
మంగళగిరి (గుంటూరు): ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) వ్యవసాయ సీజన్ వస్తే రైతుగా పొలంలో పనులు చేస్తుంటారు. ఎమ్మెల్యే ఆర్కేకు వ్యవసాయం అంటే ఎంతో మక్కువ. రాజకీయాలలో, ప్రజాసేవలో నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తూనే తనకెంతో మక్కువైన వ్యవసాయ పనులను రాజీపడకుండా చేస్తుంటారు. అందులో భాగంగా గురువారం ఫిరంగిపురం మండలం వేమవరం గ్రామంలోని తన పొలంలో కూలీలతో కలిసి వ్యవసాయ పనులు చేశారు. కలుపు ఏరి పొలంలో నాట్లు వేయడానికి మెరకపల్లాలను చదును చేయడానికి నిచ్చెనలాగారు. అనంతరం నారుమడికి విత్తనాలు చల్లి, కంది నాటారు. వ్యవసాయ కూలీలతో కలిసి పొలంలోనే వారితోపాటు భోజనం చేసి వ్యవసాయ పనులలో నిమగ్నమయ్యారు. -
‘భూస్కామ్ చేసిన బాబుకు నోటీస్ వస్తే తప్పేంటి’
కృష్ణా జిల్లా: అమరావతిలో దళితులను మోసం చేసేలా చంద్రబాబు అండ్ కో భారీ భూ స్కామ్‌లు చేశారని, సీఆర్డీఏ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇచ్చిన ఏకపక్ష జీఓలతో దళిత వర్గాలను మోసం చేశారని మంత్రి కొడాలి నాని ఆరోపించారు. అమరావతిలో అసైన్మెంట్ భూముల హక్కుదారులైన దళితులను బెదిరించి, మోసపూరిత ప్రచారాలు చేసి, నామమాత్ర ధర చెల్లించి, అక్రమ జీవోల ద్వారా చంద్రబాబు బ్యాచ్ కోట్లు కాజేశారని చెప్పారు. దళిత వర్గాలను మోసం చేసిన చంద్రబాబు అండ్ కోపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నమోదు చేయాలని మంత్రి డిమాండ్ చేశారు. ఆంబోతుల అచ్చెన్నాయుడు అరుస్తున్నా, కుక్కల బుద్ధ వెంకన్న మొరుగుతున్నా తాము అదిరేది లేదు బెదిరేది లేదని స్పష్టం చేశారు. అక్రమ మార్గాల్లో భూములు కాజేసిన పలువురికి ఇప్పటికే 41సీ నోటీసులు జారీ చేశారని తెలిపారు. రాజ్యాంగాన్ని వ్యతిరేకిస్తూ చంద్రబాబు చేసిన స్కామ్‌లకు సీఐడీ నోటీసులు ఇస్తే తప్పేంటి అని ప్రశ్నించారు. ప్రతిపక్షాలన్నీ ఏకమై ఏమనుకున్నా, దళిత వర్గాలకు చెందిన వందలాది కోట్లు కాజేసిన చంద్రబాబుపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. చంద్రబాబు స్క్రిప్ట్ ఫాలోఅవుతూ కుమ్మక్కు రాజకీయాలు చేసే ప్రతిపక్షాల కంటే తమకు దళిత వర్గాల ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారు. ప్రజలను మోసం చేసిన చంద్రబాబు సీఐడీ, కోర్టులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ ప్రభుత్వానికి ప్రజలకు న్యాయం చేయడమే ముఖ్యం, దళితులకు న్యాయం చేసేలా చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పించుకోలేరు: ఆర్కే సీఆర్డీఏ చైర్మన్‌గా ఉండి చంద్రబాబు, నారాయణ పెద్ద కుట్ర చేశారని.. పక్కా ప్లాన్‌తో ఎస్సీ, ఎస్టీల భూములు కాజేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆరోపించారు. ఒక్క మంగళగిరి నియోజకవర్గంలోనే 500 ఎకరాల భూములు కొట్టేశారని తెలిపారు. ఇక తాడికొండ నియోజకవర్గంలో 3,500 ఎకరాలను భయపెట్టి లాక్కున్నారని చెప్పారు. ప్యాకేజీ రాదు.. భూములు ఇవ్వాల్సిందేనని బలవంతంగా లాక్కున్నారని వివరించారు. శివాయి జమీందార్, లంక భూములు, ప్రభుత్వ, దేవాదాయ భూములను కూడా తన మనుషులకు కట్టబెట్టారని ఆర్కే వివరించారు. రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చి రికార్డులను తారుమారు చేయించారని ఆరోపించారు. పట్టా భూములను సైతం కారుచౌకగా కొట్టేశారని తెలిపారు. జీవోలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఎన్నో అక్రమాలు చేశారని, ఐఏఎస్‌ను తప్పించి చంద్రబాబు సీఆర్డీఏ చైర్మన్ అయ్యారని గుర్తుచేశారు. జీవో మీద చంద్రబాబు, నారాయణ సంతకాలు ఉండవు.. కానీ నోటిఫై ఫైల్స్ మీద మాత్రం చంద్రబాబు, నారాయణ సంతకాలు ఉన్నాయి అని వివరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబు, నారాయణ తప్పించుకోలేరని స్పష్టం చేశారు. -
ఎమ్మెల్యే ఆర్కేకు పితృ వియోగం
సాక్షి, పెదకాకాని/పేరేచర్ల: రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తండ్రి దశరథరామిరెడ్డి(86)కి కుటుంబ సభ్యులు, ఆప్తమిత్రులు, అభిమానులు శుక్రవారం కన్నీటితో అంతిమ వీడ్కోలు పలికారు. పెదకాకాని సర్పంచిగానే కాక ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం పాలకవర్గం చైర్మన్‌గా పనిచేసిన దశరథరామిరెడ్డి గ్రామ, ఆలయ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించి ప్రజల మన్ననలు పొందారు. కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న దశరథ రామిరెడ్డి గుంటూరు సాయిభాస్కర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించిన సంగతి విదితమే. పెదకాకానిలోని ఆయన నివాసానికి గురువారం రాత్రి స్థానిక నాయకులు, అభిమానులు, బంధుమిత్రులు చేరు కుని ఎంపీ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్కే, పారిశ్రామికవేత్త పేరిరెడ్డిని పరామర్శించారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు అంబులెన్స్‌లో దశరథరామిరెడ్డి భౌతికకాయం ఆయన నివాసానికి చేరుకుంది. దశరధరామిరెడ్డి సతీమణి వీరరాఘవమ్మ పెద్ద కుమారుడు అయోధ్యరామిరెడ్డి చేయి పట్టుకోగా భర్త భౌతికకాయంచుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి ‘అయ్యా వెళ్లిపోతున్నావా’ అంటూ కన్నీరుమున్నీరయ్యారు. పెదకాకానిలో ప్రజల సందర్శనానంతరం భౌతికకాయాన్ని ఫిరంగిపురం మండలం, వేమవరంలోని ఆళ్ల వ్యవసాయ క్షేత్రానికి తరలించారు. అయోధ్యరామిరెడ్డి శాస్త్రోక్తంగా పూజా క్రతువు నిర్వహించి తండ్రి పార్థివదేహానికి అంత్యక్రియలు జరిపించారు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించారు. సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లం, ఎమ్మెల్యేలు కిలారి వెంకటరోశయ్య, మహమ్మద్ ముస్తాఫా, అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్, మాజీ ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర్, లింగంశెట్టి ఈశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నం, పాదర్తి రమేష్‌గాంధీ, కళ్లం హరనాథరెడ్డి, మేరుగ విజయలక్ష్మి, డైమండ్ బాబు తదితరులు దశరథరామిరెడ్డి పార్ది్థవదేహానికి నివాళులర్పించారు. -
బినామీ భూముల కోసం చంద్రబాబు ఆరాటం
సాక్షి, నరసరావుపేట : ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మూడు రాజధానులకు మద్దతుగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో భారీ ర్యాలీ అనంతరం వైఎస్సార్ సీపీ నేతలు బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..‘రాజధానికి అమరావతి అనుకూలం కాదని 2014లోనే వైఎస్ జగన్ చెప్పారు. అమరావతి కట్టేటప్పుడు చంద్రబాబు ఎందుకు జోలె పట్టుకోలేదు. చంద్రబాబు బినామీలే అమరావతిలో ఆందోళనలు చేస్తున్నారు. ఆయన రైతులను రెచ్చగొడుతున్నారు. అయిదేళ్లలో అమరావతిలో ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. రాజధాని ముసుగులో వ్యాపారం చేసి వేలకోట్లు దోచుకున్నారు. చంద్రబాబు రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపించారు. రైతు పక్షపాతి సీఎం వైఎస్ జగన్’ అని అన్నారు. విశాఖ బ్రహ్మాండమైన నగరం అన్నారుగా? నరసారావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.... విశాఖ బ్రహ్మాండమైన నగరమని గతంలో చంద్రబాబే చెప్పారని గుర్తు చేశారు. విశాఖను దేశంలోనే రెండో ఆర్థిక రాజధానిగా అభివృద్థి చేస్తామన్నారని, ఇప్పుడు విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అంటే అడ్డుపడుతున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుకు వయసు పెరిగిన బుద్ధి మారలేదని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి విమర్శించారు. ఆయనకు అధికారం, డబ్బుయావ తప్ప ప్రజల గురించి పట్టదని అన్నారు. చంద్రబాబు ఎందుకు జోలె పట్టి డబ్బులు అడుగుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు అని జంగా కృష్ణమూర్తి పేర్కొన్నారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి.. అధికార వికేంద్రీకరణ జరిగినప్పుడే సమగ్రాభివృద్ధి జరుగుతుందని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజని అన్నారు. చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే కుదరదని వ్యాఖ్యానించారు. అభివృద్ధి గురించి అనుక్షణం ఆలోచిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అని విడదల రజని తెలిపారు. రైతులకు న్యాయం చేసేందుకు జగనన్న ఎప్పుడు ముందే ఉంటారన్నారు. చంద్రబాబు మాయలో ఎవరూ పడొద్దని, గ్రామ సచివాలయం ఆ గ్రామానికి రాజధానే అని అన్నారు. ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని, స్వార్థం కోసం చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టకూడదని హితవు పలికారు. ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ... ‘పల్నాడు అభివృద్ధి చంద్రబాబుకు ఇష్టం లేదు. ప్రశాంతమైన వాతావరణాన్ని ఆయన చెడగొడుతున్నారు. కలు, మతాలను అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నారు. సీఎం జగన్ బ్రహ్మాండమైన పాలన అందిస్తున్నారు. ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి’ అని అన్నారు. చంద్రబాబు పాపాలు...అమరావతికి శాపాలు చంద్రబాబు పదవిలో ఉన్నంతకాలం ఆర్భాటాలు చేశారని తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ధ్వజమెత్తారు. అమరావతిని భ్రమరావతిని చేసింది ఆయనే అని, గ్రాఫిక్స్‌తో రాష్ట్ర ప్రజలను మోసం చేశారని దుయ్యబట్టారు. అమరావతిలో బినామీ భూములపై చంద్రబాబుకు బెంగ పట్టుకుందని, రైతుల ముసుగులో ఆందోళన చేస్తుంది బాబు బినామీలేనని ఆరోపించారు. చంద్రబాబు దళిత ద్రోహి అని ఎమ్మెల్యే శ్రీదేవి నిప్పులు చెరిగారు. అమాయక రైతుల భూములు బినామీలకు అప్పచెప్పారని అన్నారు. చంద్రబాబు పాపాలు...అమరావతికి శాపాలు అని ఆమె వ్యాఖ్యానించారు. చదవండి: ఆ ఎమ్మెల్యేలు దున్నేశారు..! ‘ఆ వసూళ్లకు లెక్కలు లేవు.. ఇప్పుడు మరో జోలె’ విశాఖపై విషమెందుకు? -
చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు: ఆర్కే
సాక్షి, గుంటూరు : రాజధానికి సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు వల్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పరిస్థితికి కారణం చంద్రబాబు నాయుడు దోపిడీనే అని ఆయన విమర్శించారు. ఎమ్మెల్యే ఆర్కే ఆదివారమిక్కడ మాట్లాడుతూ...‘చంద్రబాబు చేసిన పాపం ఇప్పుడు రాజధాని రైతులు అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రాజధానిలో చంద్రబాబు ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. భూములు ఇచ్చిన రైతులకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. దోపిడీయే లక్ష్యంగా చంద్రబాబు పనిచేశారు. అన్నివిధాలుగా రాజధాని రైతులను చంద్రబాబు మోసం చేశారు. ఇవాళ రైతుల గురించి ఆయన మాట్లాడటం దారుణం. రాజధాని లో జరిగిన కుంభకోణాలు ప్రభుత్వం బయట పెడుతుంటే చంద్రబాబు కంగారు పడుతున్నారు. చంద్రబాబు అనుకూల మీడియాతో పాటు ఆయనకు అనుకూలంగా ఉన్న కొంతమంది రియల్టర్లు ఆయన బినామీల రాజధానిలో హంగామా చేస్తున్నారు. దీక్షలు చేయడానికి రైతులు రాకపోతే చంద్రబాబు కార్యకర్తలు పంపించి చేయిస్తున్నారు. రాజధాని పేరుతో తమను ఎందుకు మోసం చేశారని దీక్షలు చేసే రైతులు చంద్రబాబును నిలదీయాలి. రాజధానిపై సీఎం ప్రకటన, జీఎన్ రావు కమిటీ నివేదికపై మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదు. కుటిల రాజకీయాలు చేసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు. రాజధాని రైతులకు చంద్రబాబు చేయలేని పనులను సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాజధాని రైతులకు ప్రభుత్వం కౌలు ఇస్తోంది. రైతు కూలీలకు ప్రతి నెలా పెన్షన్ ఇస్తున్నాం. ప్రభుత్వం రైతులందరికి న్యాయం చేస్తుంది.’ అని అన్నారు. -
అవన్ని చెప్పాకే చంద్రబాబు పర్యటించాలి..
సాక్షి, అమరావతి: ప్యాకేజీలతో దళిత సోదరులకు చేసిన మోసాన్ని ప్రపంచానికి చెప్పి, ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు రాజధాని గ్రామాల్లో పర్యటించాలని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే ఆర్కే గురువారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ‘చేసిన వాగ్దానం ప్రకారం అమరావతిలో చంద్రబాబు చేత శంకుస్థాపన చేయబడి..నిర్మాణం పూర్తి చేసుకున్న 100 అడుగులు బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి..చంద్రబాబు తన అమరావతి పర్యటన ప్రారంభించాలి. పేద రైతుల భూములు ఏవిధంగా తన మనుషులకు దోచిపెట్టారు. రాజధాని కోసం చంద్రబాబును నమ్మి భూములు ఇచ్చిన రైతులకు ఏమి చేశారో చెప్పాలి. రైతులకు అన్ని చెప్పాకే చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి. చదవండి: అప్పుడు ఆర్భాటం ఇప్పుడు రాద్ధాంతం కౌలు రైతులు, చేతి వృత్తిదారులకు రాజధాని పేరుతో చంద్రబాబు చేసిన అన్యాయాన్ని చెప్పి ...తన పర్యటన కొనసాగించాలి. తన బినామీ కాంట్రాక్టర్లకు ఏవిధంగా రైతుల భూములు దోచిపెట్టారో చెప్పి గ్రామాల్లో తిరగాలి. తన హయాంలో ఒక్కటి కూడా శాశ్వత భవనం ఎందుకు కట్టలేకపోయారో చెప్పి పర్యటించాలి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాజధానిలో ఎక్కడ, ఏవిధంగా ఖర్చు పెట్టారో...ఎందుకు యుటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదో.. చెప్పి చంద్రబాబు తన పర్యటన కొనసాగించాలి. చంద్రబాబుకు నిరసన ఫ్లెక్సీలు స్వాగతం భూములు ఇవ్వని రైతులపై ఎందుకు కేసులు పెట్టించి, పోలీసులతో హింసించారో చెప్పాలి. గ్రామ కంఠాలను తేల్చకుండా సామాన్యులను సైతం ఎందుకు ఇబ్బంది పెట్టారు. నిర్మాణ వ్యయం చదరపు అడుగు సుమారు రూ.1500 అవుతుంటే.. ఇసుక, భూమి ఉచితంగా ఇచ్చి తన బినామీ కాంట్రాక్టర్లకు చదరపు అడుగు రూ.15,000లకు ఎందుకు ఇచ్చారో చెప్పి చంద్రబాబు పర్యటన చేయాలి. పేద, దళిత రైతుల భూములు ఎందుకు సింగపూర్ ప్రయివేట్ సంస్థలకు, కేంద్ర ప్రభుత్వ జోక్యం లేకుండా కట్టబెట్టారో చెప్పాలి’ అని డిమాండ్ చేశారు. చదవండి: దళిత ద్రోహి చంద్రబాబు -
ఎమ్మెల్యే ఆర్కే వినూత్న ఆలోచన
సాక్షి, మంగళగిరి: ప్లాస్టిక్‌ను విడనాడి..పర్యావరణాన్ని కాపాడుకుందామని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఆయన మంగళగిరి మిద్దె సెంటర్లో ఉచితంగా జ్యూట్ చేతి సంచులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరిని ప్లాస్టిక్ రహిత మంగళగిరిగా తీర్చిదిద్దుకుందామని ప్రజలకు సూచించారు. ప్లాస్టిక్ సంచుల వాడకం మానేసి.. జ్యూట్ సంచులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అంతా కృషి చేయాలన్నారు. ఆదివారం నుంచి మంగళగిరి పట్టణంలో ప్రతి ఇంటికి ఉచితంగా ఒక జ్యూట్ చేతి సంచిని అందజేస్తామని ఆర్కే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
‘వాళ్ల వైఖరి మారకుంటే భవిష్యత్‌లో టీడీపీ ఉండదు’
సాక్షి, విజయవాడ: తెలుగుదేశం పార్టీ నేతల దౌర్జన్యాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి శుక్రవారం రాష్ట్ర డీజీపీకి ఫిర్యాదు చేశారు. దళితులపై టీడీపీ నేతల దౌర్జన్యాలను ఎమ్మెల్యే ఆర్కే ఈ సందర్భంగా డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు వివరించారు. టీడీపీ నేతలు కూన రవికుమార్, అచ్చెన్నాయుడు,నన్నపనేని రాజకుమారిలపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. డీజీపీని కలిసిన అనంతరం ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. ‘అధికారం కోల్పోయినా టీడీపీ నేతలకు కనువిప్పు కలగడం లేదు. ఎవరినీ లెక్క చేయం అనే ధోరణిలోనే ఉన్నారు. పోలీసులు, దళితులంటే లెక్క లేదు. అసలు చట్టాల పట్ల టీడీపీ నేతలకు గౌరవం లేదు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దళిత మహిళా ఎస్ఐ పట్ల టీడీపీ నేతలు చేసిన దారుణమైన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం. తమ వ్యాఖ్యలపై ఇప్పటికైనా టీడీపీ నేతలు క్షమాపణ చెప్పాలి. చంద్రబాబు నాయుడు...టీడీపీ నేతలను పిలిచి బుద్ధి చెప్పాలి. వారి వైఖరి మారకుంటే భవిష్యత్‌లో టీడీపీ ఉండదు.’ అని వ్యాఖ్యానించారు. కాగా అంతకు ముందు ఎస్ఐ అనురాధను కులం పేరుతో దూషించిన నన్నపనేని రాజకుమారిని అరెస్ట్ చేయాలంటూ ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో మంగళగిరిలో వైఎస్సార్ సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. దళిత మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించిన నన్నపనేనిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. -
పవన్ రాజధాని పర్యటనపై ఆర్కే ఫైర్
సాక్షి, గుంటూరు: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రాజధాని పర్యటనపై మంగళగిరి ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు నుంచి ప్యాకేజి ముట్టినపుడు ఒకరకంగా, అందనపుడు ఇంకో రకంగా మాట్లాడటం పవన్‌కు అలవాటు అయిందన్నారు. బేతపూడి గ్రామంలో పర్యటించినపుడు అక్రమాలు జరుగుతున్నాయని చెప్పిన పవన్.. దమ్ముంటే చంద్రబాబు హయాంలో జరిగిన మోసాలను బయట పెట్టాలని సవాలు విసిరారు. భూ సేకరణ చేస్తే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానన్న పవన్, నాలుగుసార్లు భూసేకరణ జరిపినపుడు ఏమయ్యారని ఆర్కే సూటిగా ప్రశ్నించారు. పవన్‌కు నిజంగా రాజధాని మీద ప్రేమ ఉంటే ఇక్కడ నుంచి ఎందుకు పోటీ చేయలేదని, కనీసం జనసేన అభ్యర్థినైనా పోటీలో దింపలేదని విమర్శించారు. కమ్యూనిస్టులతో పొత్తు కారణంగా సీటు ఇచ్చారనుకున్నా.. వారి కోసం ఎందుకు ప్రచారం చేయలేదని ఆర్కే ప్రశ్నలు సంధించారు. లోకేష్‌ను గెలిపించడానికి పవన్ తెర వెనుక చేసిన ప్రయత్నాలన్నీ రాజధాని రైతులకు తెలుసని వ్యాఖ్యానించారు. ఇన్నిరోజుల పత్తాలేని పవన్ ఇప్పుడు రైతులపై ప్రేమ ఉన్నట్టు పర్యటిస్తే జనం నమ్మరని అన్నారు. -
లోకేష్ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు: ఆర్కే
సాక్షి, మంగళగిరి : గత ప్రభుత్వంలో ముచ్చటగా మూడు శాఖలకు మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన నారా లోకేష్ ప్రస్తుతం ఎక్కడ ఉన్నారంటూ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సూటిగా ప్రశ్నించారు. మంగళగిరి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న ఆయన ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు వారికి పరామర్శించాలన్న బాధ్యత లేదా అంటూ ప్రశ్నలు సంధించారు. వరద వచ్చి ప్రజలు ఇబ్బంది పడుతుంటే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కొడుకు హైదరాబాద్ పారిపోతారా అంటూ ఆర్కే మండిపడ్డారు. అక్రమ కట్టడంలో నివాసం ఉంటున్న చంద్రబాబు వరదలను రాజకీయం చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న మాజీమంత్రి దేవినేని ఉమా... మైలవరం నియోజకవర్గాల్లోని వరద ముంపు ప్రాంతాల్లో ఎప్పుడైనా పర్యటించారా అని ఎమ్మెల్యే ఆర్కే వ్యాఖ్యలు చేశారు. -
మా భూములు తిరిగిచ్చేయండి చంద్రబాబు..
సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లేందుకు రోడ్డు నిర్మాణం కోసం తీసుకున్న తమ భూములను తిరిగి ఇవ్వాలంటూ ఉండవల్లికి చెందిన రైతులు డిమాండ్ చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ రైతులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని ఆశ్రయించారు. ముఖ్యమంత్రి పదవి పూర్తయిన తర్వాత తమ భూములు అప్పగిస్తామంటూ రహదారి నిర్మాణం కోసం రైతులు శేషగిరిరావు, దాసరి సాంబశివరావు నుంచి అధికారులు భూమిని తీసుకుని ఆ మేరకు 2015లో ఒప్పంద పత్రం రాసిచ్చారు. అయితే ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడం, ప్రభుత్వం మారిన నేపథ్యంలో తమ భూములు ఇచ్చేయాలంటూ రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కేతో కలిసి రైతులు ...ఆ భూమిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. తమది రాజన్న ప్రభుత్వమని....భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. 10 అడుగులు కాస్తా... 23 అడుగులు రైతు దాసరి సాంబశివరావు మాట్లాడుతూ...చంద్రబాబు సీఎం అయ్యాక... లింగమనేని గెస్ట్‌హౌస్‌ను తమ అధికారిక నివాసంగా చేసుకున్నారని, రోడ్డు నిర్మాణం కోసం తమ వద్ద నుంచి 10 అడుగుల భూమిని తీసుకుని, సీఎం శాశ్వాత నివాసం కట్టుకున్న తర్వాత షరతు ప్రకారం పొలంలో కలిపేస్తామంటూ ఈ మేరకు అప్పటి ఆర్డీవో, ఎమ్మార్వో, గ్రామ కార్యదర్శి సంతకం చేసి ఓ పత్రాన్ని ఇచ్చారన్నారు. అయితే పది అడుగులు కాస్తా 23 అడుగులు తీసుకున్నారని రైతు సాంబశివరావు తెలిపారు. ఇదేంటని ప్రశ్నించినా...అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. అయితే ముఖ్యమంత్రి పదవి నుంచి చంద్రబాబు దిగిపోయారని, ఒప్పందం ప్రకారం తమ భూమి ఇచ్చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తమ భూమి తిరిగిచ్చేయాలని... తాము సీఆర్డీయే అధికారులు, జిల్లా కలెక్టర్‌కు కూడా వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. మరో రైతు బాలకోటయ్య మాట్లాడుతూ... తనకు లింగమనేని ఎస్టేట్ వద్ద 20 సెంట్లు భూమి ఉండేదని, ఆ భూమిలో లిల్లీలు, గులాబీలు పండించేవాడినని, అయితే సీఎం అధికారిక నివాసం వద్ద రోడ్డు నిర్మాణం కోసం ఆ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఆ భూమి ఇప్పుడు ఎక్కడ ఉందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. చంద్రబాబు పదవీ కాలం పూర్తయిన తర్వాత ఆ భూమిని స్వాదీనం చేసుకోవచ్చని అధికారులు అగ్రిమెంట్లో పేర్కొన్నారని.. తమకు న్యాయం చేయాలని ఆయన కోరారు. -
ఎమ్మెల్యే ఆర్కే ధర్నా
సాక్షి, అమరావతి : వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధర్నాకు దిగారు. తాడేపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఎమ్మెల్యే ఆర్కే ధర్నాకు దిగడంతో వైఎస్సార్సీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. టీడీపీ నేతలు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే.. తిరిగి తమ కార్యకర్తలపైనే కేసులుపెట్టడంపై మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ ఒత్తిడితోనే వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల మీద దాడులు చేసిన టీడీపీ నాయకులు మీద పోలీసులు ఎలాంటి కేసులు పెట్టలేదని అన్నారు. దెబ్బలు తిన్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు మీద తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తమ కార్యకర్తల మీద దాడి చేసిన టీడీపీ కార్యకర్తలపై మీద కేసు నమోదు చేయాలని డిమాండ్‌చేశారు. చంద్రబాబు, లోకేష్ మాటలు విని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. -
మళ్లీ పనిలో నిమగ్నమైన ఆర్కే
సాక్షి, మంగళగిరి : నిన్న మొన్నటి వరకూ ఎన్నికల ప్రచారం, పోలింగ్‌లో బిజీ బిజీగా గడిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) మళ్లీ తన దైనందిక జీవితంలో పడిపోయారు. స్వతహాగా వ్యవసాయంపై ఎంతో మక్కువ చూపే ఆయన... సామాన్య రైతు మాదిరిగా పొలం పనులు చేసుకుంటారు. పోలింగ్ ముగియడంతో ఆర్కే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుని... మళ్లీ యథావిధిగా తన పనుల్లో నిమగ్నం అయ్యారు. (రైతన్న ఎమ్మెల్యే ఆర్కే) మీరు చూడండి... ఆ దృశ్యాలు... -
వైఎస్సార్ సీపీ ర్యాలీ అనుమతుల్లోనూ కుట్ర
మంగళగిరి: గుంటూరు నార్త్‌జోన్ సబ్ డివిజన్ డీఎస్పీ జి.రామకృష్ణ పాలక పార్టీకి తొత్తులా వ్యవహరించడంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఎమ్మెల్యే ఆర్కే శుక్రవారం నామినేషన్ దాఖలు చేసేందుకు అనుమతి కోరగా డీఎస్పీ అనుమతించారు. అందులో సీతారామకోవెల నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా మిద్దె సెంటర్, గాలిగోపురం మీదుగా తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీకి అనుమతిచ్చారు. కూరగాయల మార్కెట్ సమీపంలోని వీటీజేఎం, ఐవీటీఆర్ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. అదే మార్గంలో అనుమతులు మంజూరు చేశారు. అయితే దీనివెనుక పార్టీ శ్రేణుల్లో గందరగోళం సృష్టించడంతో పాటు ఆ రూట్లో ర్యాలీ కొనసాగితే వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు నమోదు చేసి నామినేషన్ కార్యక్రమాన్ని అడ్డుకునే విధంగా కుట్ర పన్నారని పోలీసు సిబ్బందే చెబుతుండడం విశేషం. వాస్తవానికి సీతారామకోవెల నుంచి హుస్సేన్‌కట్ట మీదుగా గౌతమబుద్దారోడ్లోకి అనుమతి ఇవ్వాలి. డీఎస్పీ కుట్రను గమనించిన వైఎస్సార్ సీపీ శ్రేణులు డిగ్రీ కళాశాల వైపు వెళ్లకుండా హుస్సేన్‌కట్ట నుంచి గౌతమబుద్దారోడ్కు చేరుకుని యూటర్న్ తీసుకుని భారీ ర్యాలీగా వెళ్తుండగా.. సగంమంది కూడా గౌతమబుద్దారోడ్ ఎక్కకముందే ట్రాఫిక్‌ను వదిలి జనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గౌతమబుద్దారోడ్ నుంచి మిద్దె సెంటర్‌కు వెళ్లే సమయంలోనూ అలాగే జనం అంతా రాకుండానే వాహనాలను వదిలి ఇబ్బందులకు గురిచేశారు. మరో వైపు ర్యాలీ వస్తుందని తెలిసి పోలీసులు ఎక్కడా ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకోలేదు. అయితే టీడీపీ అభ్యర్థి లోకేష్ ర్యాలీకి మాత్రం డీఎస్పీ దగ్గరుండి ట్రాఫిక్‌ను పర్యవేక్షించడం పలు విమర్శలకు దారితీస్తోంది. -
మంగళగిరి లో లోకేష్ ఓడిపోవటం ఖాయం..
-
చేనేత కార్మికులతో వైఎస్ జగన్ ముఖాముఖి
సాక్షి, మంగళగిరి: రాష్ట్రంలోని ప్రతి చేనేత కార్మికులందరికీ సబ్సిడీ కింద నెలకు రెండు వేల రూపాయలు అందిస్తామని, 45 ఏళ్లు దాటగానే పెన్షన్ వర్తింపజేస్తామని, ఆయా కుటుంబాల ఉన్నతికి, పిల్లల చదువులకు తోడ్పాటు అందిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటిచ్చారు. 133వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా గుంటూరు జిల్లా మంగళవారం మంగళగిరిలో ఆయన చేనేత కార్మికులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా నేతన్నలకు చంద్రబాబు చేసిన మోసాలను వివరించిన ఆయన.. నవరత్నాల్లో భాగంగా రేపు రాబోయే ప్రభుత్వం చేనేత కార్మికులకు ఏమేం చెయ్యబోతున్నదో వివరించారు. నాలుగేళ్లు మోసపోయాం: ‘‘మంగళగిరి, వెంకటగిరి, ధర్మవరం తదితర నియోజకవర్గాల్లో చేనేత కార్మికుల పరిస్థితి దారుణంగా తయారైంది. గడిచిన నాలుగేళ్లలో ఒక్క ధర్మవరంలోనే ఇప్పటివరకు 65 మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. చనిపోయినవారికి ఎక్కడ పరిహారం ఇవ్వాల్సి వస్తుందోనని అసలేమీ జరగలేదన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటు. గత ఎన్నికల్లో వృత్తి కార్మికుల మాదిరి ఫొటోలు దిగి, అందరికీ అన్నీ చేస్తానన్న ఆయన మోసం తప్ప మరేదీ చెయ్యలేదు. చేనేత కార్మికుల రుణమాఫీ అని, ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1లక్ష రుణం అని, బడ్జెట్లో చేనేతలకు ఏటా రూ.1000 కోట్లు కేటాయిస్తానని, ఇళ్లు, మగ్గం షెడ్లు కట్టిస్తామని చెప్పిన చంద్రబాబు.. గడిచిన నాలుగేళ్లలో చేనేతలకు 180 కోట్ల రూపాయలకు మించి ఖర్చుచేయని పరిస్థితి. నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో మనకేదైనా మంచి జరిగిందా, జీవితాలు నిన్నటికంటే మెరుగయ్యాయా అని ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఈ దుర్మార్గ పాలనను అంతం చేయాలి’’ అని వైఎస్ జగన్ అన్నారు. మన ప్రభుత్వం వస్తే నేతన్నను ఆదుకుంటాం: వచ్చే ఎన్నికల్లో ప్రజల ఆశీర్వాదంతో ఏర్పడబోయే ప్రజా ప్రభుత్వంలో చేనేత కార్మికులను అన్ని రకాలుగా ఆదుకుంటామని, నాటి వైఎస్సార్ చేసిన మంచి పనులకు రెండింతలు ఎక్కువేచేసి, పేదల జీవితాల్లో వెలుగులు నింపుతామని వైఎస్ జగన్ తెలిపారు. ఈ మేరకు ఇదివరకే నవరత్నాల్లో ప్రకటించిన అంశాలను మరోసారి ఆయన గుర్తుచేశారు. చేనేత కార్పొరేషన్ ఏర్పాటు మొదలుకొని సబ్సిడీ కింద నెలకు రూ.2వలు అందజేత, 45 ఏళ్లు దాటిని వృత్తి కార్మికులందరికీ నెలకు రూ.2 వేల పెన్షన్, నేతన్నలకు ఇళ్లు కట్టించడంతోపాటు మగ్గం షెడ్ల ఏర్పాటు, వర్షాకాలంలో మగ్గం నీటమునిగితే ఆ కాలానికి గానూ భృతి చెల్లిస్తామని వైఎస్ జగన్ హమీ ఇచ్చారు. వీటితోపాటు అందరికీ వర్తించే ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, అవ్వాతాతలకు పెన్షన్ లాంటి పథకాలనూ వర్తింపజేస్తామని పేర్కొన్నారు. ముఖాముఖి సందర్భంగా పలువురు చేనేత కార్మికులు, మహిళలు జగన్‌తో తమ అభిప్రాయాలను పంచుకుని, సమస్యలను నివేదించారు. -
వైఎస్ జగన్ మద్దతిస్తే ఏం చేశావ్ బాబు?
సాక్షి, విజయవాడ : ‘చంద్రబాబు అనే వ్యక్తి ఒక సామాజిక నేరగాడు.. ఒక వెన్నుపోటు దారుడని ఏపీ ప్రజలు గుర్తించారని’ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. ఓటుకు కోట్ల కేసులో అడ్డంగా ఆడియో, వీడియో టేపుల్లో దొరికిపోయి.. నేటికీ ‘మనవాళ్లు బ్రీఫ్డ్మీ’ వాయిస్ తనది కాదని చెప్పలేకపోయిన వ్యక్తి చంద్రబాబు అని ఆర్కే ధ్వజమెత్తారు. విజయవాడలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆర్కే శుక్రవారం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి విషయంలోనూ ఏదో రకంగా దోచుకుని చంద్రబాబు ఈ నాలుగేళ్లలో సుమారు రూ. 5 లక్షల కోట్లు సంపాదించారని ఆర్కే ఆరోపించారు. నాలుగేళ్లుగా ఏపీని దోచేశారు.. వైఎస్ఆర్సీపీ నేతలను ఆర్థిక నేరగాళ్లు అని చంద్రబాబు వ్యాఖ్యానించడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు చుట్టూ ఉండే వారే అసలైన ఆర్థిక నేరగాళ్లన్నారు. సుజనా చౌదరి, గంటా శ్రీనివాసరావు, రాయపాటి బ్యాంక్‌లకు డబ్బులు ఎగ్గొట్టిన ఆర్థిక నేరగాళ్లు కాదా అని ఆర్కే ప్రశ్నించారు. రాష్ట్రాన్ని మొత్తం దోచేసిన చంద్రబాబు అతిపెద్ద ఆర్థిక నేరగాడంటూ ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులు, రాజధాని నిర్మాణం, మట్టి, ఇసుక ఇలా ప్రతి విషయంలో దోచుకుని చంద్రబాబు సుమారు రూ. 5 లక్షల కోట్లు సంపాదించారని ఆర్కే ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఏమైపోయినా పరవాలేదని, తాను, తన కుమారుడు నారా లోకేష్ బాగుంటే చాలని భావించే వ్యక్తి చంద్రబాబు అని ఆర్కే ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తన భవిష్యత్తుగా వైఎస్ జగన్.. ప్రత్యేక హోదా కోసం గల్లీ నుంచి ఢిల్లీ వరకు దీక్షలు, ధర్నాలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ నేతలు ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజలకు సంజీవని అని పోరాటాలు చేస్తూ ప్రజలకు అండగా ఉన్నారని చెప్పారు. నవ్యాంధ్రకు 15 ఏళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన వారు మాట నిలబెట్టుకోవాలని వైఎస్ జగన్ పోరాటం చేస్తున్నారన్నారు. ‘మేము అవిశ్వాసం పెడితే.. మీరు మద్దతు ఇవ్వండి.. ఒకవేళ మీరు నోటీసులిస్తే మేము మద్దతు ఇస్తామని’ వైఎస్ జగన్ మాటల్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. కానీ టీడీపీ ఆ మాట మర్చిపోయిందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తే తన భవిష్యత్తు అని నమ్మిన వైఎస్ జగన్.. సీఎం చంద్రబాబు దొంగ అని తెలిసినా అసెంబ్లీలో టీడీపీ పెట్టిన తీర్మానానికి రెండు సార్లు సభ్యులందరితో సంతకాలు చేయించి మద్దతు ఇచ్చారని చెప్పారు. తీర్మానాలు చేయించిన కాగితాలు కేంద్రానికి పంపించి ఉంటే ఏపీ ప్రజల బాధ వారికి తెలిసేదని, ఆ కాగితాలు ఉన్నాయా? లేక స్పీకర్‌తో చింపించి పడేశావా? అని సీఎం చంద్రబాబును ఎమ్మెల్యే ఆర్కే ప్రశ్నించారు. అక్రమ కేసులని కోర్టులు తేల్చుతున్నాయి.. వైఎస్ఆర్సీపీ నేతలపై పెట్టినవన్నీ అక్రమ కేసులని న్యాయస్థానాలు, ట్రిబ్యునల్స్ ఒక్కొక్కటిగా కొట్టేస్తున్నాయని ఆర్కే తెలిపారు. ఆర్థిక నేరగాళ్లు చంద్రబాబు చుట్టూ ఉన్నారు. బాబు పక్కనే ఉండే సుజనా చౌదరి మారిషస్ దేశ బ్యాంక్ నుంచి వేల కోట్లు అప్పు తీసుకొని ఎగనామం పెట్టాడన్నారు. అదే విధంగా రాయపాటి సాంబశివరావు, గంటా శ్రీనివాసరావులు ప్రజలు బ్యాంక్‌లలో దాచుకున్న సొత్తును అప్పుగా తీసుకొని తిరిగి చెల్లించలేదన్నారు. ఇలాంటి వారందరినీ పక్కన పెట్టుకున్న చంద్రబాబే అతిపెద్ద ఆర్థిక నేరగాడని ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జన్మభూమా? జాదూభూమా?
సాక్షి, హైదరాబాద్ : పదేపదే ప్రజలను మోసం చేస్తోన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మభూమి పేరుతో మరో మోసపూరిత కార్యక్రమానికి తెరలేపారని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. గతంలో ప్రజలు ఇచ్చిన అర్జీలను చెత్తబుట్టల్లో పారేసి, ఇప్పుడు కొత్తగా సాధించేదేమిటని ప్రశ్నించారు. జన్మభూమి కార్యక్రమం జాదూభూమిగా మారిందన్నారు. జన్మభూమి పేరుతో అధికారులు, స్కూల్ పిల్లలను ఇబ్బందిపెడుతున్నారని మండిపడ్డారు. శుక్రవారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ రెండు ఊర్ల సంగతేంటి? : ‘‘ఎవరి గ్రామాన్ని వాళ్లే అభివృద్ధి చేసుకోవాలని చంద్రబాబు అంటున్నారు. అయ్యా.. మరి మీ నారావారిపల్లె సంగతేంటి? అక్కడి స్కూల్ భవనం కూలడానికి సిద్ధంగా ఉంది. ఇక మీ తనయుడు లోకేశ్ బాబు దత్తత తీసుకున్న నిమ్మకూరు(ఎన్టీఆర్ స్వగ్రామం)లో వాటర్ ట్యాంక్ శిథిలావస్థకు చేరింది. కనీసం సొంత ఊళ్లను కూడా పట్టించుకోని మీరు.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారా? మీ అబద్ధాలను ప్రజలు నమ్మాలా? ఇప్పటికైనా ఆ రెండు ఊళ్లకు న్యాయం చేయండి. ఆ తర్వాత మిగతా గ్రామాల అభివృద్ధి గురించి మాట్లాడండి’’ అని ఆర్కే అన్నారు. -
ఆయన్ను తక్షణమే విధుల్లో చేర్చుకోవాలి
సాక్షి, అమరావతి: న్యాయ శాఖలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను నిబంధనలకు విరుద్ధంగా సస్పెండ్ చేయడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమని వైఎస్సార్సీపీ ఎమ్మల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసును 50 ఏళ్లకు తగ్గించే ఆలోచన, సర్వీసును 30 ఏళ్లకే పరిమితం చేయాలన్న ప్రతిపాదన లేదని బుకాయించిన సీఎం, ఆర్థిక మంత్రి ఇప్పుడు న్యాయశాఖ సెక్షన్ ఆఫీసర్‌ను ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు. అసలు జీవో ప్రతిపాదనే లేనప్పుడు రహస్య జీవో ముసాయిదా ప్రతులను లీక్ చేయడం ఎలా సాధ్యమో చెప్పాలన్నారు. సీఎం చంద్రబాబు ఉద్యోగుల హక్కులను కాలరాస్తూ భయభ్రాంతులకు గురి చేయడం ద్వారా వారిని తన చెప్పుచేతల్లో పెట్టుకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉద్యోగులను కులాలు, మతాలు, ప్రాంతాలు వారీగా విడదీసి వేధిస్తున్నారనడానికి సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్ప సస్పెండే ఉదాహరణని అని చెప్పారు. ఉద్యోగుల పట్ల వ్యతిరేక వైఖరిని ప్రభుత్వం తక్షణమే మానుకోవాలన్నారు. లేకపోతే ఉద్యోగులకు ప్రతిపక్షం అండగా ఉంటుందని స్పష్టం చేశారు. వారి హక్కులు, భద్రత కోసం న్యాయస్థానాల్లో, ప్రజాస్వామిక విధానాల్లో పోరాటం చేయడానికి వెనుకాడబోమన్నారు. సెక్షన్ ఆఫీసర్ తిమ్మప్పను వెంటనే విధుల్లో చేర్చుకోవాలని ఆర్కే డిమాండ్ చేశారు. -
‘కృష్ణా’ అక్రమ నిర్మాణాలపై హైకోర్టు నోటీసులు
8 మంది అధికారులు సహా మొత్తం 57 మందికి నోటీసులు - సీఎం నివాసం ఉంటున్న భవన యజమాని లింగమనేనికి సైతం జారీ - ఆక్రమణలు తొలగించాలన్న ఎమ్మెల్యే ఆర్కే పిల్‌పై విచారణ ప్రారంభం - సాక్షాత్తు ముఖ్యమంత్రే అక్కడ నివాసం ఉన్నారని, అందుకే అధికారులు స్పందించడం లేదని ఆర్కే తరఫు న్యాయవాది వాదనలు - ప్రతివాదులు కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలన్న ధర్మాసనం సాక్షి, హైదరాబాద్: గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం ఉండవల్లి గ్రామంలోని కృష్ణా నది గట్లపై అక్రమ నిర్మాణాలను ఎందుకు కూల్చి వేయలేదని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఈ విషయమై ఆంధ్రప్రదేశ్‌లోని ఎనిమిది మంది అధికారులతో పాటు మరో 49 మందికి నోటీసులు జారీ చేసింది. నదికి అత్యంత సమీపంలో గట్లపై నిర్మాణాలన్నీ అక్రమమేనని, వాటిని కూల్చివేయాలని కోరుతూ మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన పిల్‌ను విచారణకు స్వీకరించిన ఉమ్మడి హైకోర్టు మంగళవారం విచారించింది. నది గట్లపై ఉన్న అతిథి గృహాలన్నీ అక్రమ నిర్మాణాలేనని 2015 మార్చిలో తాడేపల్లి తహసీల్దార్ నోటీసులు జారీ చేశారని, వీటిని కూల్చేస్తామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రకటించినా, ఆచరణలో అది జరగలేదని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదించారు. లింగమనేని రమేశ్‌కు చెందిన అతిథి గృహాన్ని నివాస భవనంగా సీఎం నారా చంద్రబాబునాయుడు ఎంచుకున్నారని, అందువల్లే అధికారులెవ్వరూ అక్రమ కట్టడాల జోలికి వెళ్లడం లేదన్నారు. అధికారులకు వినతిపత్రం సమర్పించినా ఫలితం లేకుండా పోయిందన్నారు. నదీ పరీవాహక ప్రాంతంలోగాని, నదుల గట్లపైగాని ఏవిధమైన నిర్మాణాలు చేయకూడదని సుప్రీంకోర్టు చెప్పిందని వివరిస్తూ.. కులు–మనాలిలో కమలనాథ్ నిర్మాణంపై తీర్పును ఆయన ప్రస్తావించారు. అక్రమ కట్టడాల వల్ల కృష్ణా జలాలు కలుషితం అవుతున్నాయని, దిగువ ప్రాంతాల్లోని గ్రామాలపై ఆ ప్రభావం చూపుతోందన్నారు. విజయవాడలోని దుర్గమ్మ ఆలయ భక్తులు స్నానమాచరించేందుకు కూడా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. వాదనల అనంతరం పిల్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు ప్రకటించిన ధర్మాసనం.. నీటి పారుదల శాఖ ముఖ్య కార్యదర్శి/ఈఎన్సీ, కృష్ణా, గుంటూరు జిల్లాల కలెక్టర్లు, కృష్ణా డెల్టా సెంట్రల్ డివిజన్ రివర్ కన్జర్వేటర్, తాడేపల్లి తహసీల్దార్.. తదితర ఎనిమిది మంది అధికారులతో పాటు మరో 49 మందికి వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. తమ వాదనలతో కౌంటర్ పిటిషన్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించిన ధర్మాసనం విచారణను అక్టోబర్ 10వ తేదీకి వాయిదా వేసింది. నోటీసులు జారీ అయిన 32 అతిథి గృహాల యజమానుల్లో లింగమనేని రమేశ్ (సీఎం నివాసం ఉండే అతిథి గృహ యజమాని), గోకరాజు గంగరాజు (నర్సాపురం బీజేపీ ఎంపీ) కూడా ఉన్నారు. -
సదావర్తి భూములపై ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
-
సదావర్తి భూములపై ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ
ఢిల్లీ : సదావర్తి సత్రం భూములపై చంద్రబాబు నాయుడు సర్కార్‌కు సుప్రీంకోర్టులోఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ తీరును న్యాయస్థానం పరోక్షంగా తప్పుబట్టింది. వేలం ఆపాలన్న పిటిషన్‌ను మంగళవారం తిరస్కరించింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ భూములను మరోసారి వేలం వేయాలని సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సదావర్తి భూముల వేలం ఆపాలన్న పిటిషనర్ మాదాల సంజీవరెడ్డి అభ్యర్థనపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మోసం జరుగుతుంటే కళ్లు మూసుకోలేమని ఉన్నత ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. అలాగే వేలంలో ప్రతివాదులు కూడా పాల్గొనాలని సూచిస్తూ, కేసు తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. కాగా, తమిళనాడులోని చంగల్పట్టు వద్ద సర్వే నంబర్ 59/1లో అమరావతి ప్రాంతంలో ఎన్నో దశాబ్దాలుగా సేవలందిస్తున్న సదావర్తి సత్రానికి చెందిన భూములున్న సంగతి తెలిసిందే. కాగా సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల అత్యంత విలువైన భూముల్లో 79 ఎకరాలకే వేలం నిర్వహిస్తున్న ఏపీ సర్కార్ తీరును వైఎస్ఆర్ సీపీ మంగళ గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా 4 ఎకరాలకు ఎందుకు మినహాయింపు ఇచ్చారో సర్కార్‌ను సంజాయిషీ కోరాలని ఆయన తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి నిన్న (సోమవారం) ఉమ్మడి హైకోర్టు ను అభ్యర్థించారు. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని, ఆ తర్వాత తాము ఏపీ సర్కార్ వివరణ కోరుతామని ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక సీజే జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ప్రకటించింది. ఈ లోగా వేలం ప్రక్రియను కొనసాగనివ్వాలని సూచించిన విషయం తెలిసిందే. -
ఆ భూములను 1% సేకరించే వీలుంది
భూసేకరణ ప్రక్రియపై స్టే విధించండి.. ఎమ్మెల్యే ఆర్కే పిటిషన్ సాక్షి, న్యూఢిల్లీ: భూసేకరణ చట్టం–2013లోని నిబంధనలకు విరుద్ధంగా తన నియోజకవర్గ పరిధిలోని నాలుగు గ్రామాల్లో వేలాది ఎకరాల్లో భూసేకరణ ప్రక్రియ ప్రభుత్వం చేపట్టిందని, ఈ ప్రక్రియపై స్టే విధించాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశంపై హైకోర్టుకు వెళ్లగా స్టే ఇవ్వలేదని, కేవలం నోటీసు జారీచేసిందని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ శుక్రవారం జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ అమితావరాయ్‌లతో కూడిన ధర్మాసనం వద్దకు వచ్చింది. తొలుత పిటిషనర్ తరపున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. దీనిపై జస్టిస్ అరుణ్ మిశ్రా స్పందిస్తూ ‘హైకోర్టులో జూలై 15న వస్తుందంటున్నారు కదా.. అక్కడే వాదనలు వినిపించండి. కేసులోని అంశాలపై మేం ఎలాంటి అభిప్రాయాలను వ్యక్తంచేయడం లేదు. అక్కడ విచారణ ముగిస్తే న్యాయం కోసం మళ్లీ రావొచ్చు..’ అని పేర్కొన్నారు. పిటిషనర్ తరపున మరో న్యాయవాది రమేశ్ అల్లంకి విచారణకు హాజరయ్యారు. -
‘సదావర్తి’లో సర్కారుకు షాక్
సర్కారు సవాల్‌కు సై అన్న ఎమ్మెల్యే ఆర్కేకు అనుకూలంగా హైకోర్టు ఆదేశాలు - అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే భూములు వారికే ఇస్తామంటూ సర్కారు సవాల్ - దీనికి హైకోర్టు సాక్షిగా సై అన్న ఎమ్మెల్యే ఆర్కే - రూ.5 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్థంగా ఉన్నారని, - ఆ వ్యక్తి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లిస్తారని వెల్లడి - పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం - మొత్తం డబ్బు జమ చేసేందుకు నాలుగు వారాల గడువు - వరుస పరిణామాలతో బిత్తరపోయిన బాబు సర్కార్ సాక్షి, హైదరాబాద్: సదావర్తి భూములను వేలంపాటల్లో దక్కించుకున్న మొత్తానికి ఎవరైనా అదనంగా రూ.5 కోట్లు చెల్లిస్తే వారికే కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం విసిరిన సవాల్‌కు వైఎస్సార్ సీపీ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టు వేదికగా సై అన్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ రూ.5 కోట్లతో కలిపి మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించడానికి ఆర్కేకు నాలుగు వారాల గడువిచ్చింది. దీంతో వరుస పరిణామాలతో రాష్ట్ర ప్రభుత్వం బిత్తరపోయింది. వేల కోట్ల రూపాయల విలువ చేసే సదావర్తి భూములను కావాల్సిన వారికి నామమాత్రపు ధరకు కట్టబెట్టిన చంద్రబాబు సర్కార్‌ను ఉమ్మడి హైకోర్టులో సోమవారం నాటి పరిణామాలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. రూ.5 కోట్లు తాను చెల్లించే పరిస్థితుల్లో లేకపోయినా, ఆ మొత్తాన్ని చెల్లించేందుకు వ్యక్తిని తీసుకొస్తానని రామకృష్ణారెడ్డి కోర్టుకు తెలిపారు. రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని హైకోర్టుకు నివేదించారు. ప్రభుత్వం ఏం జరుగుతోందో తెలుసుకునే లోపే ధర్మాసనం నాలుగు వారాల గడువు కూడాఇవ్వడంతో ప్రభుత్వం దిమ్మతిరిగింది. హైకోర్టులో జరిగిందిదీ.. తమిళనాడులో సదావర్తి సత్రానికి చెందిన 83 ఎకరాల భూమికి వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా మరో రూ.5 కోట్లు చెల్లించేందుకు ఒకరు సిద్ధంగా ఉన్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సోమవారం ఉమ్మడి హైకోర్టుకు నివేదించారు. అదనంగా చెల్లించాల్సిన రూ.5 కోట్లతో సహా మొత్తం రూ.27.44 కోట్లను నాలుగు వారాల్లో జమ చేస్తామని ఆయన తెలిపారు. అలా అయితే మొదట విడత కింద రూ.10 కోట్లను రెండు వారాల్లోపు, మిగిలిన రూ.17.44 కోట్లను ఆ తర్వాతి రెండు వారాల్లో చెల్లించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ తెల్లప్రోలు రజనీలతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సదావర్తి భూముల వేలం వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలు చోటు చేసుకున్నాయని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై పలుమార్లు విచారణ జరిపిన ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం, గత వారం విచారణ సమయంలో వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా రూ.5 కోట్లు ఇచ్చిన వారికి భూములు ఇచ్చేస్తామని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఆ అదనపు మొత్తాన్ని చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారా? అంటూ రామకృష్ణారెడ్డిని ప్రశ్నించింది. అంత స్థోమత లేకపోతే ఆ మొత్తాన్ని చెల్లించే వారిని తీసుకొచ్చినా ఫర్వాలేదని తెలిపింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, ఆళ్ల తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, వేలంలో వచ్చిన రూ.22.44 కోట్లకు అదనంగా రూ.5 కోట్లు చెల్లించేందుకు ఓ వ్యక్తి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. నాలుగు వారాల్లో మొత్తం డబ్బును జమ చేస్తామని వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) డి.రమేశ్ స్పందిస్తూ, రూ.5 కోట్లు జమ చేసేందుకు సిద్ధంగా ఉన్నారన్న వ్యక్తి రేపు ఆ మొత్తం జమ చేయకపోతే ఎలా అంటూ సందేహం వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, అనుకున్న సమయానికి డబ్బు జమ చేయకపోతే పిటిషనర్ రామకృష్ణారెడ్డికి రూ.కోటి జరిమానా విధించే అంశాన్ని పరిశీలిస్తామని వ్యాఖ్యానించింది. ‘మీరు (పొన్నవోలు సుధాకర్‌రెడ్డి) చెప్పిన వాదనలను రికార్డ్ చేస్తాం. ఒకవేళ రేపు డబ్బు కడతానన్న వారు ముందుకు రాకపోతే మిమ్మల్ని పట్టుకోవాల్సి ఉంటుంది.’ అని తెలిపింది. ముందు నుయ్యి.. వెనుక గొయ్యి.. కోర్టు సాక్షిగా అదనంగా ఐదు కోట్లు ఇస్తే 83 ఎకరాల భూమిని ఇచ్చేస్తామని సర్కారే చెప్పింది. ఇప్పుడు ఆ మాట నుంచి వెనక్కి వెళ్లలేదు. చెప్పినట్లు ఆ వ్యక్తి రూ.27.44 కోట్లు కడితే 83 ఎకరాలు అతనికి అప్పజెప్పాలి. ఇదే జరిగితే సొంత మనుషుల చేతిలో నుంచి వేల కోట్ల విలువైన భూములు జారిపోవడం ప్రభుత్వానికి కళ్ల ముందు కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వ పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్లుగా తయారైంది. -
సీబీఐతో విచారణ చేయించాలి
నీళ్ల లీకేజీ ఘటనలో స్పీకర్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఆర్కే సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ లీకేజీ ఘటనను తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. వర్షం పడిన రోజు అసెంబ్లీలోకి మీడియాను అనుమతించాలని ఎంత ప్రాధేయపడ్డా పట్టించుకోని స్పీకర్.. రెండ్రోజుల తర్వాత అసెంబ్లీని సుందరంగా తీర్చిదిద్ది అందరినీ అనుమతిస్తున్నామని చెప్పడంపై మండిపడ్డారు. గొట్టాలు కోసిన ప్రాంతానికి మీడియాను తీసుకెళ్లి సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని స్పీకర్ చెప్పడాన్ని తప్పుబట్టిన ఆర్కే.. గొట్టాల మీద కాదు సీఐడీ విచారణ.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న గొట్టంగాళ్ల అవినీతిని బయటకు తీసేందుకు సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వర్షం కురిసిన రోజే అసెంబ్లీలోని తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చాంబర్కి వెళ్లానని, ఊడిన సీలింగ్‌ను, నీటితో మునిగినట్లు ఉన్న చాంబర్‌ను చూసి ఆశ్చర్యమేసిందని ఆర్కే చెప్పారు. ఆ రోజు ప్రతిపక్ష ఎమ్మెల్యేలతో పాటు మీడియాను లోపలికి అనుమతించి ఉంటే అంతా చూపించేవాళ్లమన్నారు. స్పీకర్ కోడెల మీడియాను నేరుగా పైపులకు దగ్గరకు కాకుండా ప్రతిపక్ష నేత చాంబర్ వద్దకు.. అదే విధంగా ముఖ్యమంత్రి, మంత్రులు, స్పీకర్ చాంబర్లకు తీసుకెళ్లి ఉంటే పరిస్థితి తెలిసేదన్నారు. అప్పుడు స్పీకర్ ఎందుకు భయపడ్డారని ప్రశ్నించారు. -
ప్రభుత్వ వ్యాపారానికి భూములివ్వం
-
రాజన్న క్యాంటీన్: భోజనం@రూ.4
అమరావతి: అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తన సొంత ఖర్చుతో పేదలకు భోజనం పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కేను ఆయన అభినందించారు. ఆదివారం తన నియోజకవర్గం మంగళగిరిలో రాజన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. కేవలం రూ.4లతో సాంబారు అన్నం, పెరుగన్నం, కోడిగుడ్డుతో మీల్స్‌ను అందిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటిపండు, ఒడియాలను భోజనంలో ఇస్తారు. ప్రభుత్వం చేయలేని పనిని ఒక ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో చేయడం హర్షణీయమని ఉమ్మారెడ్డి అన్నారు. -
పంట పొలాల్లో.. సర్వే జెండాలు
తొలగించాలని పట్టుబట్టిన రైతులు చర్చలకు రావాలని కోరిన డిప్యూటీ కలెక్టర్ ఎమ్మెల్యే ఆర్కేతో మాట్లాడాలని చెప్పిన అన్నదాతలు చేసేదేంలేక జెండాలు తొలగించిన అధికారులు పెనుమాక (తాడేపల్లి రూరల్) : రాజధాని నిర్మాణానికి భూములు ఇవ్వని రైతుల పంటపొలాల్లో అనుమతి లేకుండా పెనుమాక సీఆర్డీఏ అధికారులు, సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణ కాంట్రాక్టర్లు సోమవారం సర్వే జెండాలు పాతారు. విషయం తెలుసుకున్న రైతులు పొలాల వద్దకు చేరుకుని అడ్డుకున్నారు. దాదాపుగా 15 ఎకరాల్లో పాతిన సర్వే జెండాలను సీఆర్డీఏ అధికారులే తొలగించాలని రైతులు పట్టుబట్టారు. సర్వేబృందం జెండాలు తొలగించకుండా సమాచారాన్ని పెనుమాక సీఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ గోవిందరాజులకు తెలియజేశారు. చర్చలకు రావాలంటూ ఆయన రైతులను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. జాయింట్ కలెక్టర్ వస్తున్నారు.. ఆమె చూశాక జెండాలు తీసేస్తామని చెప్పినప్పటికీ రైతులు ఏమాత్రం ఒప్పుకోలేదు. పూలింగ్‌కు ఇవ్వలేదని మీ దగ్గర ఆధారాలున్నాయా..! డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ భూములను మీరు పూలింగ్‌కు ఇవ్వలేదని ఏమైనా ఆధారాలున్నాయా.. అంటూ బెదిరింపులకు దిగారు. దీంతో ఆగ్రహించిన రైతులు పచ్చని పంటపొలాల్లో, పూలింగ్‌కు ఇవ్వని భూముల్లో రోడ్లు వేయమంటూ ఏమైనా పత్రాలు ఉన్నాయా.. అంటూ చూపించాలని రైతులు నిలదీశారు. పెనుమాకలో రైతులందరూ కోర్టును ఆశ్రయించారని, దానికి సంబంధించిన సమాచారం స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి వద్ద ఉందని, మీరేమైనా మాట్లాడాలనుకుంటే ఆయనతోనే మాట్లాడాలని రైతులు తేల్చి చెప్పారు. జెండాలు తీయకుంటే మిమ్మలను ఇక్కడ నుంచి కదలనిచ్చేదిలేదంటూ రైతులు ఆగ్రహించారు. జేసీ వచ్చే వరకూ ఆగాలంటూ అధికారులు సూచించారు. రైతులు మీ ఇంట్లోకి వచ్చి మేం కూర్చుంటే మీరు ఊరుకుంటారా.. పచ్చని పంట పొలాల్లోకి వచ్చి ఇలా జెండాలు పాతి సర్వేలు చేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. జెండాలు తొలగించకుంటే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుతో పాటు జెండాలు పాతిన వారిపై కోర్టును ఆశ్రయిస్తామంటూ రైతులు తేల్చి చెప్పారు. చివరకు చేసేదేంలేక జెండాలను అధికారులు తొలగించారు. అధికారులూ.. దోషులు కావొద్దు : ఎమ్మెల్యే ఆర్కే అడ్డగోలుగా వ్యవహరించి రైతులను భయభ్రాంతులకు గురి చేయొద్దు.. అలా చేస్తే కోర్టులో మీరు దోషులుగా నిలబడాల్సి వస్తుంది.. అని ఎమ్మెల్యే ఆర్కే అధికారులను హెచ్చరించారు. బహుళ పంటలు పండే ఉండవల్లి, పెనుమాక భూముల్లో రైతులు పంటలు పండించుకోవచ్చని చెప్పారు. సమస్య కోర్టులో ఉండగానే రైతుల పంటపొలాలు నాశనం చేస్తే సహించేది లేదని అధికారులను హెచ్చరించారు. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉండొచ్చు.. రేపు మరో ప్రభుత్వం రావొచ్చు. కానీ మీరు మాత్రం జీవితకాలం ప్రజలకు సేవలందిస్తూ ఉండాలి.. వారి అభిప్రాయానికి విరుద్ధంగా వెళ్లొద్దని అధికారులకు ఆయన సూచించారు. -
సుప్రీంలో సవాలు చేస్తాం: ఆర్కే
-
సుప్రీంలో సవాలు చేస్తాం: ఆర్కే
కేసులు కొట్టించేసుకోవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) అన్నారు. ఆడియోటేపుల్లో ఉన్నది చంద్రబాబు గొంతేనని తాము శాస్త్రీయంగా నిరూపించినా కేసును కొట్టేశారని, ఇక ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్తామని తెలిపారు. ఓటుకు కోట్లు కేసులో హైకోర్టు తీర్పు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసు విషయంలో లోకస్ స్టాండీ మీద కూడా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. ఇలాంటి కేసుల్లో ఇంతకుముందు పీవీ నరసింహారావు, జయలలిత లాంటి చాలామంది పెద్దలు క్వాష్ పిటిషన్లు దాఖలు చేయలేదని, ఎలాంటి తప్పు చేయలేదన్న నమ్మకం చంద్రబాబుకు ఉంటే ఆయన ఎందుకు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారని ప్రశ్నించారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు మీద విచారణ కోసం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్యే ఆర్కే తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకరరెడ్డి అన్నారు. ఓటుకు నోటు కేసులో ఒకప్పుడు పీవీ నరసింహారావు కూడా శిక్ష అనుభవించారని, కానీ ఇప్పుడు మాత్రం ఓటుకు నోటు ఇచ్చి కొన్నా అది అవినీతి కిందకు రాదని తీర్పులో ఉటంకించారని చెప్పారు. కేసు దాఖలు చేయడానికి ఆళ్ల రామకృష్ణారెడ్డికి లోకస్ స్టాండీ లేదని కోర్టు చెప్పిందని తెలిపారు. అవినీతి నిరోధక చట్టం కింద ఎవరైనా కోర్టు దృష్టికి తెచ్చి ప్రైవేటు కేసు దాఖలు చేయవచ్చని ఇంతకుముందు కొన్ని కేసుల్లో చెప్పారని అన్నారు. ఏసీబీ విచారణకు ఎలాంటి అడ్డంకి లేదని, రెండేళ్ల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేట్ చేయలేదు కాబట్టే తాము కేసు దాఖలుచేశామని ఆయన చెప్పారు. ఇప్పుడు కూడా తాము సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని, అక్కడ న్యాయం జరుగుతుందన్న నమ్మకం ఉందని అన్నారు. -
భూసేకరణ ప్రభుత్వం వల్ల కాదు
రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) భరోసా మంగళగిరి : రాజధాని నిర్మాణం కోసం భూ సమీకరణలో ఇవ్వని రైతుల భూములను ప్రభుత్వం ఎట్టి పరిస్థితులలో సేకరించలేదని, రైతులకు అండగా వైఎస్సార్ సీపీ ఉంటుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) స్పష్టం చేశారు. పట్టణంలోని తన కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ సమీకరణలో భూములు ఇవ్వని రైతులకు అండగా తాము కోర్టును ఆశ్రయించగా, కోర్టు రైతులకు అండగా నిలబడిందన్నారు. వారంతా వ్యవసాయం చేసుకుంటూ, వారి కుటుంబాలతో పాటు, ఆ భూములపై ఆధారపడిన ఎన్నో కుటుంబాలకు ఉపాధి చూపిస్తున్నారన్నారు. భూసమీకరణకు భూములు ఇచ్చిన రైతులు మాత్రం తమకే పనులు లేక ప్రభుత్వం చెప్పిన పరిహారం అందక కూలిపనులు వెతుక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టును ఆశ్రయించి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల భూములను సేకరించేందుకే సీఆర్డీఏ సిద్ధమవుతోందని, సీఆర్డీఏ అధికారులే తాము ఎవరినీ బలవంతం చేయట్లేదని, ఇష్టమైన వారు మాత్రమే ఇస్తున్నారని, ఇవ్వని వారి భూములు సేకరించబోమని కోర్టులో స్పష్టం చేశారన్నారు. కోర్టును ఆశ్రయించి వ్యవసాయం చేసుకుంటున్న రైతుల జోలికి వస్తే కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని గుర్తుంచుకోవాలని అధికారులకు సూచించారు. ఎన్విరాన్మెంట్ ప్రొటక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్ట్యూట్ (ఈపిటిఐఆర్) సంస్థ ముందుగా గ్రామాలలో రైతులకు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి సర్యే నిర్వహించకుండా సమావేశాలు ఏర్పాటు చేయడం రైతులను తప్పుదోవపట్టించడమేనని చెప్పారు. -
‘కార్పొరేట్’కు సర్కార్ రెడ్ కార్పెట్
మంగళగిరి: ప్రతిభా పురస్కారాల ఎంపికలో సర్కార్ కార్పొరేట్ విద్యాసంస్థలకు పెద్దపీట వేసి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులపై వివక్ష చూపిందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) విమర్శించారు. ఆదివారం ఆయన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ.. పదో తరగతిలో ప్రతిభ కనపరచిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా మరిన్ని మెరుగైన ఫలితాలు పొందవచ్చని చెబుతున్న ప్రభుత్వ పెద్దలు వారిని విస్మరించి ప్రై వేటు పాఠశాలల విద్యార్థులను ఎంపిక చేయడమేమిటని ప్రశ్నించారు. మంగళగిరి మండలంలో ఆరుగురు విద్యార్థులను ఎంపిక చేయగా వారిలో ఒక్కరు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థి అని వివరించారు. రాజధాని గ్రామాల్లో విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తామని చెప్పిన ప్రభుత్వం రెండున్నరేళ్లుగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఎంతోమంది విద్యార్థులు చదువును మధ్యలో ఆపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి రైతు కూలీలు, చేతివృత్తుల వారు పిల్లలను చదివించలేక కూలి పనులకు పంపుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం కార్పొరేట్ విద్యాసంస్థలకు గులాం చేయడం మానుకుని ప్రభుత్వ విద్యాసంస్థలను బలోపేతం చేయాలని ఆర్కే సూచించారు. -
చంపేస్తామంటూ ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ
-
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కేకు బెదిరింపు లేఖ
గుంటూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి సోమవారం ఆగంతకుల నుంచి బెదిరింపు లేఖ వచ్చింది. ఓటుకు కోట్లు కేసుపై సుప్రీంకోర్టుకు వెళితే చంపుతామని ఆ లేఖలో హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరిలోనే ఆర్కేను చంపేస్తామని బెదిరింపులతో పాటు, అసభ్య పదజాలంతో ఆ లేఖలో హెచ్చరించారు. తనకు వచ్చిన బెదిరింపు లేఖపై ఎమ్మెల్యే ఆర్కే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా ఓటుకు కోట్లు కేసులో పునర్విచారణ జరపాలని ఎమ్మెల్యే ఆర్కే ఏసీబీ కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే తనపై కేసు కొట్టేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా, దానిపై న్యాయస్థానం స్టే ఇచ్చింది. -
ఈవెంట్ మేనేజర్లుగా జిల్లా అధికారులు
* ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవట్లేదు * మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం తాడేపల్లి రూరల్: జిల్లా యంత్రాంగం ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈవెంటు మేనేజర్లుగా వ్యవహరిస్తోంది తప్ప, ప్రజల ప్రాణాలు పోతున్నా పట్టించుకోవడం లేదంటూ మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. సోమవారం తన కార్యాలయం నుంచి విడుదల చేసిన పత్రికా ప్రకటనలో ఆయన పై విధంగా పేర్కొన్నారు. పుష్కరాలకు ముందు నుంచి మంగళగిరి నియోజకవర్గంలో డెంగీ జ్వరాలు వచ్చి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, దుగ్గిరాల మండలానికి చెందిన 25 సంవత్సరాల యువకుడు డెంగీతో మరణించినట్టు ఈనెల 11వ తేదీనే జిల్లా యంత్రాంగానికి, వైద్య శాఖ అధికారులకు తెలియజేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయిందని పేర్కొన్నారు. పుష్కరాలలో ఇళ్లను కూల్చడం వంటి ఈవెంట్లు నిర్వహించి కాలయాపన చేశారు తప్ప ప్రజల ఆరోగ్య పరిస్థితిని మాత్రం పట్టించుకోలేదన్నారు. ఆ ఫలితమే తాడేపల్లి మునిసిపాలిటిలో ఓ చిన్నారి మృతికి కారణమైందని పేర్కొన్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారించి వారి ప్రాణాలు కాపాడాలని కోరారు. -
కోట్లు ఖర్చు చేసి మురికి నీటిలో స్నానాలు: ఆర్కే
గుంటూరు : పుష్కరాల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసి భక్తులను మురికి నీటిలో స్నానాలు చేయిస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. పుష్కరాల ప్రారంభ రోజైన శుక్రవారం సీతానగరంలోని పుష్కరఘాట్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. అరకొరగా వచ్చిన కొద్దిమంది భక్తులకు కూడా సౌకర్యాలు కల్పించటంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. లక్షలాదిగా భక్తులు తరలివస్తే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటో ప్రభుత్వం ఆలోచించాలన్నారు. లీడింగ్ చానల్ ఏర్పాటుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేసి, భక్తులు స్నానాలు చేసే ఘాట్‌లో మురికి నీరు తోడిపోస్తున్నారని విమర్శించారు. నీటిని తోడేందుకు ఏర్పాటుచేసిన మోటార్లు పనిచేస్తున్నాయో లేదో కూడా ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. స్నానం చేసిన అనంతరం శరీరంపై దద్దుర్లు, దురదలు వస్తున్నాయని పలువురు భక్తులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు. పుష్కరాల తొలి రోజే ఇలా ఉంటే, మిగిలిన 11 రోజుల్లో భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిధులు ఖర్చు చేసి ఘాట్లు నిర్మించినా.. నీళ్లు వదలడంలో అధికారులు చేతులెత్తేశారని విమర్శించారు. పుష్కరాల పేరుతో చేయించిన పనులు కాంట్రాక్టర్ల జేబులు నింపేందుకా? లేక భక్తుల కోసం చేసినవా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులతో ఏర్పాట్లపై మాట్లాడారు. ఆర్కే వెంట వైఎస్సార్సీపీ జిల్లా నాయకుడు ఈదురుమూడి డేవిడ్‌రాజు, పట్టణాధ్యక్షుడు వేణుగోపాలస్వామిరెడ్డి తదితరులున్నారు. -
పేదలకు అండగా ఉంటాం
ప్రభుత్వ అరాచకాలను అడ్డుకుంటాం మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే కేఎల్ రావు కాలనీ (తాడేపల్లిరూరల్) : నిరంతరం పేద ప్రజలకు వైఎస్సార్సీపీ అండదండగా ఉంటుందని, ప్రభుత్వం పేదలపై చేస్తున్న అరాచకాలను ఎప్పటికప్పుడు అడ్డుకుని అండగా నిలబడతుందని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కేఎల్ రావు కాలనీ వాసులకు భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో బాధితుల తరఫున కోర్టును ఆశ్రయించిన ఆర్కే సోమవారం కోర్టు ఇచ్చిన స్టేటస్ కో కాపీలను వారికి అందజేసేందుకు కాలనీకి వచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావలసిన ప్రత్యేక హోదా సాధించలేని చంద్రబాబునాయుడు తన ప్రతాపాన్ని పేదప్రజల గుడిసెలపై చూపిస్తున్నారని, ఆయనకు పేదలపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, బీజేపీ ప్రభుత్వంపై పోరాడి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. పేదల జోలికి వస్తే జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో బాబు చేసే కుట్రలను అడ్డుకుని, న్యాయపోరాటం చేస్తామని చెప్పారు. లేదంటే ప్రజల కోసం ప్రాణాలైనా అర్పిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సింగపూర్, జపాన్ కంపెనీలలో బినామీ అయిన నీ కొడుకును ఆర్థికంగా బలపరిచేందుకు పేదవాడి ప్రాణాలు పణంగా పెడితే భవిష్యత్తులో ప్రజలు నామరూపాలు లేకుండా చేస్తారని ఆర్కే వ్యాఖ్యానించారు. పేదల పక్షాన నిలబడే వైఎస్సార్ సీపీని అణగదొక్కేందుకే దివంగత నేత వైఎస్ విగ్రహాలు తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని, వైఎస్ ఎప్పుడూ పేదల ప్రజల గుండెల్లోనే ఉంటాడనే విషయం చంద్రబాబునాయుడు గమనించాలని ఆర్కే అన్నారు. -
మోదీతో మాట్లాడలేని అసమర్థత
ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: ముఖ్యమంత్రి చంద్రబాబు తన స్వార్థం కోసం రాష్ట్రంలోని ఐదుకోట్ల మంది ప్రజల జీవితాలను పణంగా పెడుతున్నాడని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి (ఆర్కే) మండిపడ్డారు. హోదా కోరుతూ ఈ నెల 2వతేదీన చేపట్టిన బంద్‌పై తన కార్యాలయంలో సోమవారం నాయకులతో సమాయత్త సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ఒటుకు నోటు కేసులో అడ్డంగా దొరికడంతో పాటు అవినీతిలో రాష్ట్రాన్ని నెంబర్‌వన్‌గా చేసిన ముఖ్యమంత్రి కేంద్రాన్ని నిలదీస్తే ఎక్కడ కేసులలో ఇరికిస్తారనే భయంతోనే ప్రత్యేకహోదాపై ప్రధాని నరేంద్రమోదీని కలవనని నాటకాలాడుతున్నారన్నారు. హోదా అనేది రాష్ట్రానికి సంజీవని కాదని చంద్రబాబు అన్న రోజునే ఆయన నైజం బయటపడిందన్నారు. హోదా సాధించకపోతే భవిష్యత్తుతరాలకు తీవ్రంగా నష్టపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలంతా ఏకమై ఉద్యమాలు చేసి హోదా సాధించకపోతే భవిష్యత్తు తరాలు క్షమించవని హెచ్చరించారు. -
దోచుకునేందుకే పుష్కర పనులు
ఎమ్మెల్యే ఆర్కే తాడేపల్లి రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, మంత్రులు, కాంట్రాక్టర్లు దోచుకునేందుకే కృష్ణా పుష్కర పనులు హడావుడిగా చేస్తున్నారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ నాయకులతో కలిసి పట్టణంలోని సీతానగరం ఘాట్‌ను పరిశీలించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పనుల్లో నాణ్యత కొరవడి నాసిరకంగా వున్నాయని విమర్శించారు. ప్రస్తుతం జరుగుతున్న పుష్కర పనులు చూస్తుంటే గోదావరి పుష్కరాల సమయంలో జరిగిన దురదృష్ట ఘటన పునరావృతమయ్యే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నామినేషన్లపై కోట్ల రూపాయల పనులు కాంట్రాక్టర్లకు.. తమ్ముళ్లకు అప్పగించిన ప్రభుత్వం వాటిని పర్యేక్షించకపోవడం దారుణమన్నారు. సీఎం చంద్రబాబు నివాసంపై నుంచి చూస్తే సీతానగరం పుష్కరఘాట్ కనిపిస్తుందని, కనీసం ఇంటి ముంగిట జరుగుతున్న పనులను పరిశీలించే తీరిక సీఎం చంద్రబాబుకు లేదని విమర్శించారు. -
భూములిచ్చిన రైతులతో సర్కారు చెలగాటం
► ఇళ్లు కూడా తొలగించి, ఊరి నుంచి పంపేసే యత్నం ► మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ధ్వజం ► బాధితులకు అండగా ఉంటామని భరోసా యర్రబాలెం (తాడేపల్లి రూరల్): రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులతో ఇక పనేముంది అన్నట్టు మన రాష్ట్ర మంత్రులు వ్యవహరిస్తున్నారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. యర్రబాలెం గ్రామంలో ఇళ్లు కోల్పోతున్న బాధితులతో ఆదివారం మాజీ సర్పంచ్ పలగాని తాతారావు నివాసంలో ఎమ్మెల్యే ఆర్కే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘భూములు ఇచ్చారు..వారి ఇళ్లను కూడా తొలగిస్తే రాజధాని ప్రాంతం నుంచి వెళ్లిపోతారన్న ఉద్దేశ్యంతోనే మీ నివాసాలను తొలగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాజధానిలో భూములు తీసుకునేంతవరకు అనయ్య, తమ్ముడు, బావ అంటూ... మీ ఇళ్ల చుట్టూ తిరిగిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇక మీకు కనిపించరు... ఎందుకంటే రాజధాని ప్రాంతంలో రైతుల భూములతో వారు వ్యాపారం చేయాలంటే మిమ్ముల్ని గ్రామాల్లో లేకుండా చేయాలి. అప్పుడు మాత్రమే వారు స్వేచ్ఛగా తిరగడానికి అవకాశం ఉంటుంది’ అన్నారు. భూములు తీసుకునేటప్పుడు గ్రామ కంఠాల జోలికి రానన్న మంత్రి నారాయణ, గ్రామంలో సగం ఇళ్లు పోతుంటే ఎందుకు మాట్లాడడంలేదని ఆర్కే ప్రశ్నించారు. ‘30 వంకర్లు ఉన్న రోడ్డును మలుపులు లేకుండా నిర్మాణం చేయాలనుకుంటున్నారు. ప్రత్యామ్నాయంగా ఎర్రబాలెం చెరువు దగ్గర నుంచి పొగాకు కంపెనీ వరకు పంట పొలాలను కలుపుకుంటూ 60 అడుగుల రోడ్డు ఉంది. దాని నిర్మాణం చేపడితే రైతులు తమ నివాసాలను కోల్పోకుండా సంతోషంగా ఉంటారు కదా!’ అన్నారు. మంత్రు లు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తే రైతులు ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో రాజధానిలోని 29 గ్రామాల్లో కనబడకుండా తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. నివాస గృహాలు కోల్పోతున్న వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో న్యాయం పోరాటం చేస్తామని ఆర్కే భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో మంగళగిరి, దుగ్గిరాల ఎంపీపీలు పచ్చల రత్నకుమారి, రజనీకాంత్, వైఎస్సార్సీపీ మంగళగిరి మండల అధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, యర్రబాలెం గ్రామ అధ్యక్షుడు సుధా బుజ్జి, ఎంపీటీసీ సభ్యులు సుధా హనుమాయమ్మ, పలగాని కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఎవరిని అడగాలి... 30 వంకర్లు ఉన్న రోడ్డును విస్తరణ చేస్తే గ్రామం సగం రోడ్లకే పోతు ంది. మార్కింగ్ ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే సీఆర్డీఏ కార్యాలయంలో అడగాలని సమాధానం ఇస్తున్నారు. రెవెన్యూ కార్యాలయంలో అడిగితే తమకు తెలియదని వ్యాఖ్యానిస్తున్నారు. మరి మేమెవరిని అడగాలి? - పలగాని కోటేశ్వరరావు మేమెక్కడ ఉండాలి... రాజధాని రోడ్ల పేరుతో పేదల ఇళ్లు తొలగిస్తే మేమెక్కడ నివాసం ఉండా లి? తిన్నా తినకపోయినా సొంత ఇంటిలో నివాసం ఉంటే అడిగే వారే ఉండరు. ఆ ఇల్లే నాకు జీవనోపాధి. దానిలో హోటల్ నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు నా గతేంకాను? - సూర్యనారాయణ -
ప్రతిపక్షంలో ఒక మాట.. అధికారంలో మరో మాటా?
చంద్రబాబుపై ఎమ్మెల్యే ఆర్కే ఆగ్రహం కెఎల్‌రావు కాలనీ (తాడేపల్లి రూరల్): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట.. అధికారంలో ఉంటే మరో మాట మాట్లాడుతూ అబద్ధాల బాబుగా చరిత్రలో మిగిలిపోతారని మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి విమర్శించారు. శనివారం కె.ఎల్.రావుకాలనీలో నివాసాలు కోల్పోతున్న బాధితులతో ఆయన సమావేశమయ్యారు. చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఒక్కరి ఇల్లు తొలగించినా ఖబడ్దార్ అంటూ సవాలు చేశారని, ఇదే కె.ఎల్.రావుకాలనీలో గతంలో పాదయాత్ర నిర్వహిస్తూ ఈ మాటల న్నారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆయనకు పేదలు కనిపించడం లేదని విమర్శించారు. రెండు రోజుల క్రితం ఇక్కడ ఆగిన ముఖ్యమంత్రి కె.ఎల్.రావు కాలనీలోని ఇళ్లను తొలగించాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అధికారులూ సర్వేలు చేపడుతున్నారని అన్నారు. ఆయన కుమారుడిని ఆజన్మ కుబేరుడిని చేయడానికే ఆయన ప్రయత్నమంతా అని ధ్వజమెత్తారు. కాలనీవాసుల జోలికి వస్తే పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో మునిసిపల్ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, వైఎస్ చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, తాడేపల్లి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలస్వామిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈదులమూడి డేవిడ్‌రాజు, సీపీఎం, సీపీఐ, కాంగ్రెస్ నాయకులు దొంతిరెడ్డి వెంకటరెడ్డి, కంచర్ల కాశయ్య, గుండిమెడ జేమ్స్, వైఎస్సార్సీపీ పట్టణ కార్యదర్శి ఎండీ గోరేబాబు, బీసీ సెల్ నాయకులు ఓలేటి రాము, మహిళా సంఘం నాయకురాలు సంపూర్ణ పార్వతి, యువజన నాయకులు మహేష్, ఎస్సీ, ఎస్టీ సెల్ కన్వీనర్లు ముదిగొండ ప్రకాష్, బాలసాని అనిల్, కౌన్సిలర్లు కేళి వెంకటేశ్వరరావు, తమ్మా ధనలక్ష్మి, సింకా గంగాధర్, స్థానిక నేతలు తమ్మా వెంకటరెడ్డి, సుదర్శన్, మధు పాల్గొన్నారు. -
మంగళగిరిలో రైతులకు ఆర్కే భరోసా
మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే భూసేకరణ విషయమై రైతులకు భరోసా కల్పించారు. మండలంలోని బేతపూడి గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని సేకరించలేదన్నారు. మూడు పంటలు పండే భూమిని సేకరించరాదని చట్టంలో మొదట్లోనే పేర్కొన్నారని వారికి చెప్పారు. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన రైతులకు సూచించారు. తాను అండగా ఉంటానంటూ ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అవసరమైతే కోర్టుకు వెళదామని ఆయన పేర్కొన్నారు. -
'బాబు పైత్యం పరాకాష్టకు చేరింది'
గుంటూరు: రాజధాని విరాళాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైత్యం పరాకాష్టకు చేరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని కోసం విరాళాలు సేకరించే విషయంలో ఆయన తీరు దారుణంగా ఉందని అన్నారు. చివరికి స్కూలు పిల్లల నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలని చూడటం ఆయన దౌర్భాగ్యం అని విమర్శించారు. స్కూళ్లలో అట్టడుగు వర్గాలకు చెందినవారి పిల్లలు కూడా ఉంటారని వారి నుంచి కూడా విరాళాలు సేకరించాలని ప్రయత్నించడం దుర్మార్గం అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు, మేధావులతో మాట్లాడి రాజధాని ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేయాలో చర్చించాలని ఆర్కే సూచించారు. -
రాజధాని పేరుతో బాబు నిలువుదోపిడీ
బలవంతపు భూసేకరణపై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి : రాజధాని గ్రామాల్లో బలవంతపు భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేయడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మండిపడ్డారు. రాజధాని నిర్మాణంలో భాగంగా భూ సమీకరణ పేరు తో రైతులను మభ్యపెట్టి బెదిరించారన్నారు. పోలీసులతో అక్రమంగా నిర్భందించి కేసులు బనాయించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆస్తులు తగల బెట్టించారన్నారు. ఇలా రైతులు, కౌలురైతులు, కూలీలను నిలువుదోపిడీ చేసిన ముఖ్యమంత్రి, మంత్రి నారాయణ, సీఆర్డీఏ కమిషనర్ల నిజస్వరూపం భూసేకరణ నోటిఫికేషన్ తో తేటతెల్లమైందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ భూసేకరణలో చట్టవిరుద్ధంగా వెళుతున్న గ్రామ స్థాయి ప్రజాప్రతినిధుల నుంచి ముఖ్యమంత్రి వరకు, సీఆర్డీఏలో అటెండర్ నుం చి కమిషనర్ వరకు అందరిని కోర్టుబోనులో నిలబెడతామని పేర్కొన్నారు. పచ్చటి భూములను చంద్రబాబు తనతో పాటు తన అనుయాయుల అక్రమ సంపాదన కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, సింగపూర్‌వారికి అప్పనంగా దోచిపెట్టడానికి భూసేకరణ పేరుతో మార్గం సుగమం చేసుకున్నారని విమర్శించారు. రైతును రాజుగా చూడాలని కలలు కని అధికారంలోకి రాగానే చేసి చూపిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ఆశయాలకు తూట్లు పొడిచిన చంద్రబాబు రాష్ట్ర చరిత్రలో రైతుద్రోహి,ైరె తుకూలీ హంతకుడిగా మిగిలిపోతారని దుయ్యబట్టారు. భూసేకరణపై బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ను నెగ్గించుకొనేందుకు వెనకడుగు వేసినా పట్టించుకోని చంద్రబాబు భూసేకరణకు వెళ్లారని, బీజేపీ చంద్రబాబును నిలువరించకుంటే బీజేపీ,టీడీపీ ప్రభుత్వాలకు కాంగ్రెస్ పార్టీకి పట్టిన గతే పట్టించేందుకు రాష్ర్టప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రజా రాజధాని కావాలని అందరూ కోరుకుంటున్నారని చంద్రబాబు మాత్రం తన రాజధాని, తన అక్రమాస్తులు కూడబెట్టుకొనే రాజధాని కోసం ఎందరినైనా బలిచేసేందుకు వెనుకాడడం లేదన్నారు. చంద్రబాబు అకృత్యాలను మానవతావాదులంతా ఖండించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. -
వారంతా తొత్తులే.. కోర్టుకు ఈడుస్తాం
మంగళగిరి: ప్రకాశం బ్యారేజీ భద్రతను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గాలికొదిలేసిందని మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే మండిపడ్డారు. 2002 నుంచే బ్యారేజీ భద్రత దృష్ట్యా భారీ వాహనాలు నిలిపివేయగా ఇప్పుడు మాత్రం టీడీపీ నేతలు ఆ విషయాన్ని పట్టించుకోకుండా అడ్డగోలుగా ప్రవర్తిస్తున్నారన్నారు. సోమవారం సాయంత్రం జరుగుతున్న మహా సంకల్ప సభకు టీడీపీ కార్యకర్తలు భారీ వాహనాలతో తరలి వచ్చారు. ఆ వాహనాలను ప్రకాశం బ్యారేజీ మీదుగా పంపించారు. దీంతో విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఇన్నాళ్లుగా భారీ వాహనాలకు నిషేధం విదించగా ఇప్పుడు సభ కోసమని ఎలా అనుమతిస్తారని నిలదీశారు. లారీలు, బస్సులు బ్యారేజీ మీద నుంచి పంపించడానికి వీలు లేదని చెప్పారు. టీడీపీ నేతలకు అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని, వారందరినీ కోర్టుకు ఈడుస్తామని చెప్పారు. -
'నక్కజిత్తుల బాబుని నమ్మే పరిస్థితి లేదు'
-
'రాజధాని గ్రామాల్లో సాగును అడ్డుకునే కుట్ర'
మంగళగిరి(గుంటూరు జిల్లా): రానున్న సీజన్లో వ్యవసాయ పనులకు రైతులను సమాయత్తం చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన సాగుకు సమాయత్తం’ కార్యక్రమంలో రాజధాని భూ సమీకరణ గ్రామాలను ఎందుకు విస్మరించారని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ప్రశ్నించారు. భూసమీకరణ నుంచి తమను మినహాయించాలంటూ కోర్టుకు వెళ్లిన రైతుల భూముల్లో వ్యవసాయ పనులకు అవరోధాలు సృష్టించవద్దని న్యాయస్థానం చెప్పినా ఖాతరు చేయకుండా అవరోధాలు సృష్టిస్తూ కోర్టు తీర్పును ధిక్కరిస్తున్నారని చెప్పారు. ఆయన శుక్రవారం మంగళగిరిలో విలేకరులతో మాట్లాడుతూ మండలాల వారీగా సాగుకు సమాయత్తం షెడ్యూల్ కార్యక్రమం వివరాలను విడుదల చేసిన ప్రభుత్వం మంగళగిరి, తాడేపల్లి మండలాల్లోని రాజధాని భూసమీకరణ గ్రామాలను ఉద్దేశపూర్వకంగానే చేర్చలేదని అనుమానం వ్యక్తం చేశారు. తొలుత రైతుల రుణాలు నిలిపివేస్తూ ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు జారీచేశారని, అనంతరం ఎరువుల సరఫరా నిలిపివేయడంతో పాటు పొలాల్లోని మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిపేస్తామనిబెదిరించడంతో ఆందోళన చెందిన రైతులు కోర్టును ఆశ్రయించారని తెలిపారు. కోర్టును ఆశ్రయించిన రైతుల వ్యవసాయ పనులకు విఘాతం కలిగించవద్దని తేల్చిచెప్పినా, రైతులను వ్యవసాయం చేసుకోనివ్వకుండా అడ్డుకునే కుట్రలో భాగంగానే సాగుకు సమాయత్తం కార్యక్రమంలో ఆ గ్రామాలను చేర్చలేదని చెప్పారు. ఈ కుట్రను కోర్టుకు తెలియజేస్తామన్నారు. విజయవాడలో రోటరీ క్లబ్ ఆఫ్ విజయవాడ ఈస్ట్ ఆధ్వర్యంలో నవ్యాంధ్ర రాజధాని నిర్మాణానికి భూసేకరణ ప్రక్రియలో రైతుల సమస్యలు’ అంశంపై శుక్రవారం జరిగిన చర్చాకార్యక్రమంలో ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ భూసేకరణ చేసేందుకు ప్రభుత్వం జారీ చేసిన 166 జీవోపై పిల్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. -
భూసేకరణపై వినూత్న నిరసన
ప్రకాశం బ్యారేజీపై కూరగాయలు పంచిన మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రైతులతో కలసి రాస్తారోకో,166 జీవో కాపీ దహనం ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ప్రతిఘటించి తీరతామని స్పష్టీకరణ న్యాయం కోసం రైతుల తరఫున కోర్టుకు వెళతామని పునరుద్ఘాటన తాడేపల్లి (గుంటూరు) : లక్షా 66 వేల జీవోలు తెచ్చినా ప్రతిఘటించి తీరతాం.. మూడు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం.. అన్నదాతలకు అండగా ఉంటాం.. భూ సమీకరణ, భూ సేకరణ.. ఏదైనా అడ్డుకుంటాం.. చట్టం కాని ఆర్డినెన్స్‌తో, 166 జీవోతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహించం.. వైఎస్సార్సీపీతో నడిచి వచ్చే రాజకీయ పార్టీలతో కలసి, రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం.. రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇచ్చిన భరోసా ఇది. భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆర్కే నేతృత్వంలో సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్కే కూరగాయలు పంచి తన నిరసన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట పొలాల నుంచి స్వచ్ఛందంగా తెచ్చిన కూరగాయలను భారీ స్థాయిలో పంచిపెట్టారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. 166 జీవో కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా భూ సమీకరణ, భూ సేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోందని విమర్శించారు. బహుళ పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోబోనివ్వమని చెప్పారు. భూసేకరణను తీవ్రంగా ప్రతిఘటించి తీరతామన్నారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో అన్నదాతలకు అండగా ఉంటామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నేతలు, ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ప్రాంతాల రైతులు, రైతుకూలీలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
అన్నదాతకు అండగా ఉంటాం
- మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే - ఆర్టినెన్స్లపై వినూత్న నిరసన - ప్రకాశం బ్యారేజీపై కూరగాయలు పంచిన వైనం - రాస్తారోకో, 166 జీవో కాపీ దహనం తాడేపల్లి : భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆర్కే నేతృత్వంలో సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆర్కే కూరగాయలు పంచి తన నిసరన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట పొలాల నుంచి స్వచ్ఛందంగా తెచ్చిన కూరగాయలను భారీ స్థాయిలో పంచిపెట్టారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. 166 జీవో కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా భూ సమీకరణ, భూ సేకరణ ప్రక్రియలు నిర్వహిస్తోందని విమర్శించారు. రైతాంగమే లేకుండా చేసేందుకు చట్టరూపం దాల్చని ఆర్డినెన్స్‌తో 166 జీవోను చంద్రబాబు తెచ్చారని మండిపడ్డారు. చంద్రబాబు లక్షా 66 వేల జీవోలు తెచ్చినా, తాము భయపడబోమని స్పష్టం చేశారు. భూసేకరణను ప్రతిఘటిస్తాం బహుళ పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోబోనివ్వమని, తీవ్రంగా ప్రతిఘటించి తీరతామని పేర్కొన్నారు. ఒకే ప్రాంతంలో రెండు చట్టాలను ఎలా అమలు చేస్తారని ప్రశ్నించారు. భూసేకరణను విరమించాల్సిందేనని హెచ్చరించారు. రైతులు, వ్యవసాయ కూలీలను పూర్తిగా నష్ట పరిచే చంద్రబాబు ఎత్తుగడలను ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. కేంద్రం హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్‌ను చంద్రబాబు ముందుగా ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారని, హైకోర్టులో దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాతలకు అండగా ఉంటామని ఆర్కే స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకుడు జక్కిరెడ్డి ప్రభాకర్, మంగళగిరి మండల పరిషత్ ఉపాధ్యక్షుడు మొసలి పకీరయ్య, సీపీఎం నేతలు, ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం రైతులు, రైతుకూలీలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
ఎన్ని జీవోలు తెచ్చినా..అడ్డుకుంటాం..
భూ సేకరణపై వినూత్న నిరసన ప్రకాశం బ్యారేజీపై కూరగాయలు పంచిన ఎమ్మెల్యే ఆర్కే రైతులతో కలసి రాస్తారోకో,166 జీవో కాపీ దహనం ప్రభుత్వ ఆర్డినెన్స్‌ను ప్రతిఘటించి తీరతామని స్పష్టీకరణ తాడేపల్లి రూరల్ : లక్షా 66 వేల జీవోలు తెచ్చినా ప్రతిఘటించి తీరతాం...మూడు పంటలు పండే భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటాం...అన్నదాతలకు అండగా ఉంటాం...భూ సమీకరణ, భూ సేకరణ...ఏదైనా అడ్డుకుంటాం...చట్టం కాని ఆర్డినెన్స్‌తో, 166 జీవోతో సీఎం చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే సహించం. వైఎస్సార్సీపీతో నడిచి వచ్చే రాజకీయ పార్టీలతో కలసి, రైతుల పక్షాన పోరాటాలు చేస్తాం...రాజధాని కోసం ప్రభుత్వం భూసేకరణ ఆర్డినెన్స్ ప్రయోగించిన నేపథ్యంలో ఆ ప్రాంత రైతులకు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) ఇచ్చిన భరోసా ఇది. భూ సేకరణ ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే ఆర్కే నేతృత్వంలో సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద శుక్రవారం రైతులు, కౌలు రైతులు, రైతు కూలీలు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు.ఈ సందర్భంగా ఆర్కే కూరగాయలు పంచి తన నిసరన వ్యక్తం చేశారు. రైతులు తమ పంట పొలాల నుంచి స్వచ్ఛందంగా తెచ్చిన కూరగాయలను భారీ స్థాయిలో పంచిపెట్టారు. అనంతరం ప్రకాశం బ్యారేజీ వద్ద రైతులతో కలిసి రాస్తారోకో చేశారు. 166 జీవో కాపీని దహనం చేశారు. ఈ సందర్భంగా ఆర్కే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పూర్తిగా రైతులను మోసం చేసే విధంగా భూ సమీకరణ, భూ సేకరణ ప్రక్రియలు నిర్వహిస్తుందని విమర్శించారు. రైతాంగమే లేకుండా చేసేందుకు చట్టరూపం దాల్చని ఆర్డినెన్స్‌తో 166 జీవోను చంద్రబాబు తెచ్చారని మండిపడ్డారు. లక్షా 66 వేల జీవోలు తెచ్చినా, తాము భయపడబోమని స్పష్టం చేశారు. బహుళ పంటలు పండే భూములను ఎట్టిపరిస్థితుల్లో తీసుకోబోనివ్వమని చెప్పారు. భూసేకరణను తీవ్రంగా ప్రతిఘటించి తీరతామని పేర్కొన్నారు. చంద్రబాబు అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ, రైతులు పండించిన కూరగాయలను ఉచితంగా పంచిపెడుతున్నామన్నారు. ఒకే ప్రాంతంలో రెండు చట్టాలను ఎలా అమలు చేస్తారని, భూసేకరణను విరమించుకుని తీరాలని చంద్రబాబును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రైతులు, వ్యవసాయ కూలీలను పూర్తిగా నష్ట పరిచే చంద్రబాబు ఎత్తుగడలను ముందుకు సాగనివ్వబోమని స్పష్టం చేశారు. కేంద్రం హడావుడిగా తెచ్చిన ఆర్డినెన్స్‌ను చంద్రబాబు ముందుగా ప్రయోగించేందుకు సిద్ధపడుతున్నారని, హైకోర్టులో దీనిపై న్యాయపోరాటం చేస్తామని వెల్లడించారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో నిత్యం అన్నదాతలకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆర్కే తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకులు జక్కిరెడ్డి ప్రభాకర్, జిల్లా నాయకులు బండారు సాయిబాబా, మొగిలి మధు, పాతూరు లలిత కుమారి, ఈదులమూడి డేవిడ్‌రాజు, దొంతిరెడ్డి వేమారెడ్డి, మున్నంగి గోపిరెడ్డి, తాడేపల్లి మునిసిపల్ చైర్పర్సన్ కొయ్యగూర మహాలక్ష్మి, వైస్‌చైర్మన్ దొంతిరెడ్డి రామకృష్ణారెడ్డి, దుగ్గిరాల జడ్పీటీసీ యేళ్ల జయలక్ష్మి, తాడేపల్లి, మంగళగిరి, దుగ్గిరాల ఎంపీపీలు కత్తిక రాజ్యలక్ష్మి, పచ్చల రత్మకుమారి, చల్లపల్లి భారతీదేవి, తాడేపల్లి పట్టణ, మండల పార్టీ కన్వీనర్లు భీమవరపు సాంబిరెడ్డి, పాటిబండ్ల కృష్ణమూర్తి, కొలనుకొండ సర్పంచ్ పి.ఏసుబాబు, మంగళగిరి నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, మునగాల మల్లేశ్వరరావు, పచ్చల శ్యామ్‌బాబు, తోట శ్రీనివాసరావు, మంగళగిరి మండల పరిషత్ ఉపాధ్యక్షులు మొసలి పకీరయ్య, సీపీఎం నాయకులు జొన్నా శివశంకర్, దొంతిరెడ్డి వెంకటరెడ్డి, భాస్కర్‌రెడ్డి, ఉండవల్లి, పెనుమాక, బేతపూడి, నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం తదితర ప్రాంతాల రైతులు, రైతుకూలీలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. -
భూతం
నేటి నుంచి రాజధాని గ్రామాల్లో భూసేకరణ - ప్రభుత్వంపై సర్వత్రా ఆగ్రహం - ప్రతిఘటించి తీరతామంటున్న రైతులు,కౌలు రైతులు, కూలీలు, విపక్షాలు - నేడు ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసన కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆర్కే పిలుపు - అన్ని వర్గాల ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని విజ్ఞప్తి మంగళగిరి/సాక్షి ప్రతినిధి, గుంటూరు : రాజధాని గ్రామాలపై భూ భూతం విరుచుకుపడుతోంది. ప్రభుత్వం ఆయా గ్రామాల్లో శుక్రవారం నుంచి భూసేకరణ చట్టం అమలుల్లోకి తెచ్చింది. రాజధాని భూ సమీకరణను వ్యతిరేకించిన రైతులపై కక్షకట్టిన ప్రభుత్వం ఎట్టకేలకు భూసేకరణకు నోటిఫికేషన్ ఇచ్చిందని రైతులు, రైతుకూలీలు, కౌలు రైతుల సహా విపక్షాలు మండిపడుతున్నాయి. శుక్రవారం నుంచి ఆందోళన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నాయి. భూసేకరణకు ఒప్పుకోబోమని అవసరమైతే ఆత్మహత్యలకైనా సిద్ధమని మండిపడుతున్నారు. ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యే ఆర్కే ప్రత్యక్షపోరాటానికి నడుం బిగించారు. దీనిపై ఆందోళన చేయడంతో పాటు కోర్టును ఆశ్రయించి రైతులకు న్యాయం జరిగేవరకు అండగా వుంటానని స్పష్టం చేశారు. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. దీనిలో భాగంగానే శుక్రవారం సాయంత్రం నాలుగు గంటలకు ప్రకాశం బ్యారేజీ వద్ద జరిగే నిరసన కార్యక్రమానికి రైతులు, కూలీలు, కౌలురైతులతో పాటు రైతు, కార్మిక సంఘాలు విపక్షాలు తరలిరావాలని ఆర్కే పిలుపునిచ్చారు. కలెక్టర్‌కు సర్వాధికారాలు నేటి నుంచి రాజధాని గ్రామాల్లో భూ సేకరణ ప్రారంభం కానుంది. భూ సమీకరణ విధానంలో రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం 33,800 ఎకరాలను సమీకరించింది. దీనికితోడు రాజధాని నిర్మాణానికి అదనంగా భూములు కావాలని పట్టణాభివృద్ధి సంస్థ రెవెన్యూ శాఖను కోరడంతో భూసేకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అనేక మంది రైతులు నష్టపరిహారం పెంచాలని, రాజధాని నిర్మాణ పనులు ప్రారంభమయ్యే వరకు సాగుకు అనుమతి ఇవ్వాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మంగళగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు భూ సేకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేయడంతోపాటు కోర్టులో కేసులు వేశారు. ఈ నేపథ్యంలోనే గురువారం సాయంత్రం రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు భూ సేకరణ చట్టం-2013 ప్రకారం నోటిఫికేషన్ విడుదల చేసింది. భూసేకరణకు సంబంధించి జిల్లా కలెక్టర్‌కు సర్వాధికారాలు ఇచ్చింది. శుక్రవారం నుంచి భూమిని సేకరించడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని ఉండవల్లి, పెనుమాక, నిడమర్రు, బేతపూడి, యర్రపాలెం, కురగల్లు, రాయపూడి, వెంకటపాలెం తదితర గ్రామాల్లోని వెయ్యి ఎకరాల్లోపు భూములను భూ సేకరణ విధానంలో సేకరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రైతుల పేర్లు, భూమి విస్తీర్ణం తదితర వివరాలను సీఆర్డిఏ కమిషనర్ శ్రీకాంత్ శుక్రవారం వెల్లడించనున్నారు. మూడు వేల ఎకరాలను సేకరించేందుకు ప్రభుత్వం భూములను గుర్తించినప్పటికీ గ్రామ కంఠాలు, డొంకలు, దారులు పోనూ రైతుల నుంచి నికరంగా వెయ్యి ఎకరాలను సేకరించే అవకాశం ఉందని జాయింట్ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గురువారం సాయంత్రం ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. తీవ్రస్థాయిలో వ్యతిరేకత ... రాష్ట్ర ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన భూ సేకరణ చట్టాన్ని రాజధాని గ్రామాల్లోని రైతులు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. భూ సమీకరణ విధానంలో తీసుకున్న భూములకు ఇప్పటి వరకు రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయిన ప్రభుత్వం భూ సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టి మరింత నష్టాన్ని కలిగించనుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న టీడీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. -
ప్రత్యేక హోదా తేలేకపోవడం సిగ్గుచేటు
మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ధ్వజం మంగళగిరి : రాష్ట్రాన్ని అన్యాయంగా అక్రమంగా విడగొట్టినప్పుడు సహకరించిన టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యేక హోదా సాధించడంలో విఫలమైనందుకు సిగ్గుపడి ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే)ధ్వజమెత్తారు. ప్రత్యేక హోదా ఐదు సంవత్సరాలు ఇస్తామంటే పదేళ్లు కావాలని రాజ్యసభలో పట్టుపట్టిన వెంకయ్యనాయుడు ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రప్రభుత్వం స్పష్టం చేస్తుంటే మౌనంగా ఉండడం ఏమిటని ఆర్కే ప్రశ్నించారు. తమ పార్టీ వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పలుమార్లు ఢిల్లీ వెళ్లిప్రత్యేక హోదా కోసం ప్రధాని,రాష్ట్రపతితో పాటు కేంద్రమంత్రులను కలసి వినతిపత్రాలు అందజేసి పోరాడారని ఈ సందర్భంగా ఆర్కే గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం ఎన్నికల హామీలు నెరవేర్చలేక రాజధాని నిర్మాణాన్ని అడ్డుపెట్టుకుని విదేశాలు తిరుగుతూ కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఇప్పుడు వెంకయ్యనాయుడుతో పాటు చంద్రబాబు మొద్దునిద్ర నటిస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేక విమానాల్లో విదేశాలు తిరగడం మాని ఢిల్లీ తిరిగి ప్రత్యేక హోదా సాధించాలనీ, రైతుల భూములు లాక్కుని విదేశాలకు అప్పగించి లబ్ధి పొందాలనే ఆలోచనలు మానుకోవాలని సూచన చేశారు. అలాగే రాష్ర్ట ప్రజలకు ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. వెంకయ్య నాయుడు, చంద్రబాబు ఇరువురు రాష్ట్రప్రజలను అబద్దాలతో మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందన్నారు. -
రాజీ లేని పోరు మా బాధ్యత
- టీడీపీ నేతల్లా వ్యవహరిస్తున్న అధికారులు - రైతు రుణమాఫీ దేశంలోనే అతి పెద్ద మోసం - వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ - ఆస్తులు పోగేయడంలో బాబును మించుతున్న మంత్రులు: ఎమ్మెల్యే ఆర్కే గుంటూరు సిటీ : ప్రభుత్వం ప్రజాకంటకంగా మారిన ప్రస్తుత నేపథ్యంలో ప్రజల పక్షాన రాజీ లేని పోరు చేయాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీపై ఉందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. అరండల్‌పేటలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన నియోజకవర్గాలవారీగా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కమిటీని పూర్తి స్థాయిలో నిర్మించుకున్నామని, నెలాఖరులోగా అన్ని స్థాయిల కమిటీల నిర్మాణం పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం ఇప్పటివరకు ప్రజోపయోగ పనులు చేపట్టిన దాఖలాలు లేవని మండిపడ్డారు. పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని ధ్వజమెత్తారు. అధికారులు టీడీపీ నేతల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు ఏమాత్రం విలువనీయడం లేదని, సర్పంచ్ల అధికారాలను సైతం పీకేస్తున్నారని అన్నారు. నేతలు, కార్యకర్తలపై ప్రభుత్వం ఖాకీలను ఉసిగొల్పుతోందని విమర్శించారు. రైతు రుణమాఫీ దేశంలోనే అతి పెద్ద మోసమని అభివర్ణించారు. ఇలాంటి మోసపూరిత వాగ్దానాలతోనే టీడీపీ గద్దెనెక్కిందన్నారు. ఈ నేపథ్యంలోనిత్యం జనంలోనే ఉంటున్న వై.ఎస్.జగన్మోహన్రెడ్డిని స్ఫూర్తిగా తీసుకుని పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పూర్తి సమన్వయంతో ప్రభుత్వ వ్యతిరేక పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారు: ఎమ్మెల్యే ఆర్కే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మంత్రులు, టీడీపీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి లేదని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఆరోపించారు. వారి తీరు కారణంగా అభివృద్ధి పనులు కుంటుపడ్డాయని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే అక్రమంగా ఆస్తులు కూడబెట్టడంలో మాత్రం వారంతా ఒకరితో మరొకరు పోటీ పడుతున్నారని అన్నారు. సీఎం చంద్రబాబును మించిపోయే రీతిలో మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రజాధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. బాధ్యత గల ప్రజాపక్షంగా వీటన్నింటికీ అడ్డుకట్ట వేస్తామని స్పష్టం చేశారు. తెనాలి నియోజకవర్గ ఇన్చార్జి అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా బలమైన ఉద్యమాలు నిర్మించాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేసుకుని సమరానికి సన్నద్ధమవ్వాలని కోరారు. తాడికొండ నియోజకవర్గ నేత కత్తెర సురేష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. టీడీపీ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటాలు చేసేందుకు పార్టీ సిద్ధంగా ఉందని చెప్పారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడు కావటి మనోహర్‌నాయుడు, పలు అనుబంధ విభాగాల అధ్యక్షులు పోలూరి వెంకటరెడ్డి, సయ్యద్ మాబు, బండారు సాయిబాబు, కొత్త చిన్నపరెడ్డి, మొగిలి మధుసూదనరావు, కోవూరి సునీల్‌కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మామిడి రాము, సంయుక్త కార్యదర్శి ఎస్.రఘురామిరెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిప్పారెడ్డి రామకృష్ణారెడ్డి, మైనారిటీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి, పార్టీ జిల్లా కార్యదర్శి అత్తోట జోసఫ్‌కుమార్, జిల్లా అధికార ప్రతినిధులు శిఖా బెనర్జీ, మండేపూడి పురుషోత్తం, గుంటూరు రూరల్ మండల జెడ్పీటీసీ సభ్యుడు కొలకలూరి కోటేశ్వరరావు, అంగడి శ్రీనివాసరావు, యనమల ప్రకాష్, రాష్ట్ర ఎస్సీ సెల్ సంయుక్త కార్యదర్శులు సుద్దపల్లి నాగరాజు, జంగా జయరాజు, ఎస్స్సీ సెల్ రాష్ట్ర కమిటీ సభ్యుడు దేవరాజ్, జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ తట్టుమళ్ళ అశోక్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
నిలిచారు..గెలిచారు
►రైతుల పక్షాన పోరాడిన వైఎస్సార్ సీపీ నేతలు ►రెండో పంటకు సుముఖత వ్యక్తం చేసిన సర్కారు ►రాజధాని ప్రాంత రైతుల్లో ఆనందం ►మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండతోనే సాధ్యమైందని స్పష్టీకరణ మంగళగిరి/తాడేపల్లి రూరల్ : రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో అంగీకారపత్రాలు ఇవ్వని వారు నిరభ్యంతరంగా రెండో పంట వేసుకోవచ్చని ప్రభుత్వం ప్రకటించడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొద్ది రోజుల క్రితం సీఆర్డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ రాజధాని భూ సమీకరణ గ్రామాల్లో రెండో పంటకు అనుమతి లేదన్నారు. దీంతో రాజధాని గ్రామాలతోపాటు అన్ని వైపుల నుంచి ప్రభుత్వంపై వ్యతి రేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే) నేతృత్వంలో వైఎస్సార్ సీపీ నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. రెండో పంట వేస్తే తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రధానంగా ఎమ్మెల్యే ఆర్కే వినూత్నరీతిలో నిరసనలు తెలుపుతూ రైతులకు అండగా నిలిచారు. ఓ రోజంతా కూలీగా పొలం పనులు చేశారు. ఉల్లిపాయల బస్తాలు మోశారు. లోడు లారీని నడిపారు. మరో రోజు భిక్షాటన చేశారు. ఇలా ఆందోళనలో రైతుల వెన్నంటి నిలిచారు. ఓ వైపు వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రైతుల ఆందోళన, మరో వైపు ఈ అంశం రాష్ట్రం దాటి దేశవ్యాప్త చర్చకు దారితీసింది. ఈ పరిస్థితులను గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు వెనకడుగు వేసింది. సమీకరణకు అంగీకార పత్రాలు ఇచ్చిన భూముల్లో మాత్రమే పంటలకు అనుమతి లేదని సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ మంగళవారం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ అండగా నిలవడంతోనే నేడు రెండో పంటకు మార్గం సుగమం అయిందని చెపుతున్న రైతుల మనోభావాలు వారి మాటల్లోనే.. రైతుల వెంట వైఎస్సార్ సీపీ నిలిచింది... రెండో పంట వేయకూడదని చెప్పడమే ప్రభుత్వం తప్పు. ప్రభుత్వంపై పోరాటంలో రైతుల తరఫున వైఎస్సార్ సీపీతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే నిలబడటం వలనే ప్రభుత్వం తన నిర్ణయం మార్చుకుంది. సమీకరణకు భూములు ఇచ్చిన వారు సైతం మళ్లీ ఆలోచించుకోవాలి. పంటలు లేకపోతే ఎలా బతుకుతారు. - బొమ్మారెడ్డి సాంబిరెడ్డి, రైతు, నిడమర్రు వైఎస్సార్ సీపీ పోరాట ఫలితమే... వైఎస్సార్ సీపీ పోరాటం కారణంగానే రైతుల్లో అవగాహన కలిగి రెండో పంటపై ఆందోళనకు దిగారు. భవిష్యత్తులో ఇదే విధంగా అండగా నిలబడి ఎమ్మెల్యే ఆర్కే మా భూములను కాపాడతారనే నమ్మకముంది. - తాడిశెట్టి శ్రీనివాసరావు, రైతు,నిడమర్రు. ఎమ్మెల్యే ఆర్కే ధైర్యం చెప్పారు... రాజధాని పేరుతో ప్రభుత్వం పంట పొలాలు లాక్కుంటే ఎలా బతకాలంటూ తీవ్ర ఆందోళన చెందుతున్న సమయంలో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పంట పొలాలలో పనిచేస్తున్న మాకు ధైర్యం చెప్పారు. మీ వెంట జగనన్న ఉన్నాడు. చివరి వరకు పోరాడాదామని భరోసా ఇచ్చారు. ఈ రోజు రైతులు మన భూముల్లో రెండో పంట వేసుకోవచ్చని చెప్పడం చాలా ఆనందంగా ఉంది. - మానెకొండ పద్మ, వ్యవసాయ కూలీ ఆర్కే చలవతోనే రెండవ పంటకు అవకాశం మొదటి నుంచి పెనుమాక, ఉండవల్లి రైతులు భూ సమీకరణకు వ్యతిరేకంగా వివిధ రూపాలలో ఆందోళన చేశారు.మా అందరికి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే అండగా ఉండి, ఉద్యమాన్ని వివిధ రూపాల్లో ముందుకు తీసుకెళ్ళి రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. అందువల్లే ఈ రోజు రెండవ పంటలు వేయడానికి ప్రభుత్వం ఒప్పుకుంది. - వెంకటరెడ్డి,రైతు,పెనుమాక ఎమ్మెల్యే ఆర్కేపై మాకు నమ్మకం ఉంది.. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే రైతుల తరఫున నిలిచి పోరాటం చేయడం వల్లే ఈ రోజు ప్రభుత్వం దిగివచ్చింది. చివరకు భిక్షమెత్తి నిరసన తెలపడంతో దిగిరాక తప్పలేదు. ఇదే విధంగా మాకు అండగా వుండి మా భూములను ఆర్కే కాపాడతాడనే నమ్మకముంది. - కూరాకుల గంగరాజు, రైతు -
'సుధారాణి కుటుంబాన్ని బెదిరిస్తున్నారు'
హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్డీఏ) బిల్లును అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ సర్కార్ దురాగతాలకు పాల్పడుతుందని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) విమర్శించారు. శనివారం వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. భూములు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్న రైతులు అభ్యంతర ఫారాలను ఇవ్వడానికి వెళ్తే గడువు ముగిసిపోయిందంటూ సర్కారు వేధింపులకు గురిచేస్తుందన్నారు. ఇందులో భాగంగానే రైతు బోయపాటి సుధారాణి ఇంటికి పోలీసులు, టీడీపీ నేతలు వెళ్లి బెదిరింపులకు దిగుతున్నారన్నారు. సుధారాణి కుటుంబం వారి బెదిరింపులకు భయపడి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిందని ఆయన తెలిపారు. అమాయక రైతులను పోలీసులు వేధిస్తున్నారని.. ప్రభుత్వం ఇలానే వ్యవహరిస్తే తీవ్ర ఉద్యమం తప్పదని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
'రైతులను భయపెడితే చూస్తూ ఊరుకోం'
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం కోసం రైతులనుంచి ఏపీ ప్రభుత్వం భూములు కోరిన నేపథ్యంలో విజయవాడలోని కృష్ణానదిలో రాజధాని ప్రాంత రైతులు శుక్రవారం వినూత్న నిరసనకు దిగారు. మోకళ్ల లోతు వరకూ నీళ్లలో నిలబడి నిరసన వ్యక్తం చేశారు. సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ నేపథ్యంలో రాజధాని ప్రాంతంలో రైతుల ఇళ్లు తీసుకుంటామని, నోటిఫై చేసిన ప్రతి సెంట్ భూమిని తీసుకుంటామని సీఆర్డీఏ కమిషనర్ అంటున్నారని ఆర్కే చెప్పారు. రోజురోజుకీ రైతులను సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్ భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. రెండో పంట వేయొద్దని చెప్పే అధికారం సీఆర్డీఏ కమిషనర్‌కు ఎక్కడదంటూ ధ్వజమెత్తారు. ఆయన అధికారా? రాజకీయ నేతా? అంటూ ప్రశ్నించారు. రైతులను సీఆర్డీఏ కమిషనర్ భయపడితే తాము చూస్తూ ఊరుకోమంటూ ఆర్కే స్పష్టం చేశారు. -
ఏ ఒక్కరినీ లక్ష్యంగా అడ్డుకోలేదు
- ఇసుక, మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని కోరా.. - ప్రకాశం బ్యారేజ్‌పై సెట్విన్ బస్సులు నడపాలి - ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: ఇసుక, మట్టి తోలకాల్లో తాను అక్రమ రవాణాను మాత్రమే అడ్డుకోవాలని అధికారులను కోరానని ఏ ఒక్కరిని లక్ష్యంగా చేయలేదని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. సోమవారం ఆయన ఫోన్లో సాక్షితో మాట్లాడుతూ ఇసుక, మట్టి చట్టప్రకారం చేసుకునేవారికి ఎలాంటి ఇబ్బంది వుండదని, అక్రమంగా వనరులను దోచుకునే వారిని మాత్రమే అడ్డుకుంటామన్నారు. బెదిరింపు లేఖలు వచ్చినంత మాత్రాన అక్రమాలను అడ్డుకోబోమని అనుకోవడం వారి అవివేకమన్నారు. అధికారులు తమ నిబంధలకు అనుగుణంగా అక్రమాలను అడ్డుకోవాలని సూచించారు. శాసనసభ సమావేశాల్లో సోమవారం జీరోఅవర్‌లో అవకాశం లభించడంతో .. సీతానగరం వద్ద ప్రకాశం బ్యారేజిపై గడ్డర్లను కిందకు ఏర్పాటుచేయడం వల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని సభ దృష్టికి తీసుకువెళ్లానని ఆర్కే పేర్కొన్నారు. గడ్డర్లు ఏర్పాటుతో అంబులెన్స్‌కూడా వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారన్నారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు, రైతులు కనకదుర్గవారధి మీదుగా విజయవాడ వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రకాశం బ్యారేజి వద్దఏర్పాటుచేసిన గడ్డర్లు ఎత్తుపెంచడంతో పాటు బ్యారేజిపై తిరిగేందుఉ కనీసం సెట్విన్ బస్సులు ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. దీనిపై సంబంధిత మంత్రి శిద్ధా రాఘవరావు స్పందిస్తూ సంబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేసి సమస్యను పరిష్కరిస్తానని చెప్పినట్లు ఆర్కే తెలిపారు. -
వైఎస్‌ను రైతులు మరువరు
ఎత్తిపోతల భవన శంకుస్థాపనలో ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి : దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని ఈ ప్రాంత రైతులు ఎన్నటికీ మరవరని ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి(ఆర్కే) అన్నారు. మండలంలోని నిడమర్రు గ్రామంలో ఎత్తిపోతల పథకానికి రూ.5 లక్షలతో నిర్మించనున్న నూతన భవన కార్యాలయానికి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2004లో రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన నిడమర్రు ఎత్తిపోతల పథకం వల్ల చుట్టుపక్కల గ్రామాల రైతులు మూడు వేల ఎకరాల్లో సాగుచేసుకుంటున్నారని చెప్పారు. రైతులు బాధలు తన కంటితో చూసిన వైఎస్సార్ ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఉచిత విద్యుత్ పథకం అమలు చేయడంతోపాటు రుణమాఫీ చేశారని గుర్తుచేశారు. నేడు రైతులు గిట్టుబాటు ధరల్లేక పెట్టుబడులు పెరిగిపోయి వ్యవసాయం చేసేందుకు ఇబ్బం దులు పడుతుంటే అమలుకు సాధ్యం కాని వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబు.. రుణమాఫీపై కాలయాపన చేస్తున్నారని విమర్శిం చారు. బ్యాంకుల నుంచి రైతులకు వస్తున్న నోటీసులకు ఏమని సమాధానం చెబుతారని ఆర్కే ప్రశ్నించారు. కార్యక్రమంలో సర్పంచ్ మండెపూడి మణెమ్మ, ఉపసర్పంచ్ గాదె సాగర్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి, కొదమగుండ్ల నాగరత్నం, ఎత్తిపోతల పథకం ఛైర్మన్ శివన్నారాయణరెడ్డి, సభ్యులు గాదె వీరాంజనేయరెడ్డి, గాదె సాంబిరెడ్డి, మర్రెడ్డి సంజీవరెడ్డి, మాజీ సర్పంచ్‌లు గాదె లక్ష్మారెడ్డి, నాయకులు భీమవరపు సాంబిరెడ్డి, కొల్లి శేషిరెడ్డి, కంఠం నరేంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు.