రాజన్న క్యాంటీన్‌: భోజనం@రూ.4 | Rajanna canteen inaugarated in mangalagiri | Sakshi
Sakshi News home page

రాజన్న క్యాంటీన్‌: భోజనం@రూ.4

Published Sun, May 14 2017 5:04 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM

రాజన్న క్యాంటీన్‌: భోజనం@రూ.4

రాజన్న క్యాంటీన్‌: భోజనం@రూ.4

అమరావతి: అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిందని వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తన సొంత ఖర్చుతో పేదలకు భోజనం పెడుతున్న వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆర్కేను ఆయన అభినందించారు.

ఆదివారం తన నియోజకవర్గం మంగళగిరిలో రాజన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ఆర్‌ రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. కేవలం రూ.4లతో సాంబారు అన్నం, పెరుగన్నం, కోడిగుడ్డుతో మీల్స్‌ను అందిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటిపండు, ఒడియాలను భోజనంలో ఇస్తారు. ప్రభుత్వం చేయలేని పనిని ఒక ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో చేయడం హర్షణీయమని ఉమ్మారెడ్డి అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement