Rajanna Canteen
-
భళా రాజన్న క్యాంటీన్
సాక్షి, పశ్చిమగోదావరి(తణుకు) : తణుకులో రాజన్న క్యాంటీన్ నిర్వహణపై పేదల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు చొరవతో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో ఈ క్యాంటీన్ నిర్వహిస్తున్నారు. రూ.ఐదుకే పేదల కడుపు నింపుతున్నారు. నిత్యం 250 మందికి నాణ్యమైన భోజనం పెడుతున్నారు. తొలుత ఎమ్మెల్యే కారుమూరి తన సొంత నిధులతో క్యాంటీన్ నిర్వహించడానికి ముందుకు వచ్చారు. అయితే ఆయనకు చేదోడువాదోడుగా నియోజకవర్గంలోని నాయకులు కూడా నిలిచారు. దీంతో రోజుకో దాత పేరుతో రాజన్న క్యాంటీన్ నిర్వహణ ప్రారంభించారు. రాబోయే రోజుల్లోనూ దీని నిర్వహణకు నిధులు సమకూరడంతో గతనెల 31 నుంచి ప్రారంభించిన క్యాంటీన్ విజయవంతంగా నడుస్తోంది. రాబోయే వంద రోజులకు సరిపడా నిధులను సమకూర్చిన వైఎస్సార్ సీపీ నాయకులు నిర్వహణ బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు. 18 మందితో కమిటీ తణుకు పట్టణంలో రాజన్న క్యాంటీన్ నిర్వహణకు 18 మంది పార్టీ నాయకులతో కమిటీని ఏర్పాటు చేశారు. నిత్యం 250 మందికి భోజనం అందించడానికి వీలుగా ప్రణాళికసిద్ధం చేశారు. మొదటి రోజు భోజనానికి అయ్యే ఖర్చును ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు భరించడంతో నియోజకవర్గంలోని కొందరు నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, దాతలు ముందుకు వచ్చారు. దీంతో సుమారు 100 రోజులకు సరిపడా నిధులు సమకూరాయి. ఇందుకు ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ప్రారంభించిన కమిటీకి గౌరవాధ్యక్షులుగా కారుమూరి వెంకట నాగేశ్వరరావు, అధ్యక్షులుగా నార్గన సత్యనారాయణ, ఉపాధ్యక్షులుగా మారిశెట్టి శంకర్, కలిశెట్టి శ్రీనివాసు, చిక్కాల మోహన్ వ్యవహరిస్తున్నారు. తణుకు నియోజకవర్గంలో ఎవరైనా దాతలు లేదా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకునే వారు పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే కమిటీని సంప్రదించాలని వారు కోరుతున్నారు. నాణ్యతతో కూడిన భోజనం అందించాలనే ఉద్దేశంతో పరిమితి లేకుండానే పేదలకు భోజనం వడ్డిస్తున్నారు. ప్రస్తుతం ఒక స్వీటు, మూడు రకాల కూరలు, సాంబారు, పెరుగుతో పేదలకు భోజనం అందజేస్తున్నారు. మరోవైపు దాతల పేర్లు ఆరోజు క్యాంటీన్లో ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. దాతల సహకారం అభినందనీయం పేదలకు అన్నం పెట్టేందుకు తణుకులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించాం. దాతల సహకారంతో దీనిని మొదలుపెట్టాం. రూ. 5కే భోజనం పెట్టేందుకు వైఎస్సార్ సీపీ నాయకులకు తోడు దాతలు ముందుకు రావడం అభినందనీయం. ప్రస్తుతం 250 మందికి భోజనం పెడుతున్నాం. రాబోయే రోజుల్లో ఈ సంఖ్యను పెంచుతాం. – కారుమూరి వెంకటనాగేశ్వరరావు, ఎమ్మెల్యే, తణుకు సంతోషంగా ఉంది... ఎలాంటి లాభాపేక్ష లేకుండా పేదల కడుపు నింపాలనే ఉద్దేశంతో ప్రారంభించిన రాజన్న క్యాంటీన్‌కు మంచి స్పందన వచ్చింది. ఇప్పటికే 100 రోజులకు సరిపడా నిధులు సమకూరాయి. దాతలు తమ పేరున భోజనం పెట్టడానికి ముందుకు వస్తున్నారు. నియోజకవర్గంలో ఎవరైనా పెళ్లిరోజు, పుట్టిన రోజు చేసుకుని పేదలకు అన్నం పెట్టాలని భావిస్తే రాజన్న క్యాంటీన్ ద్వారా అవకాశం కల్పిస్తున్నాం. – మారిశెట్టి శివశంకర్, కమిటీ ఉపాధ్యక్షులు, తణుకు నాణ్యతలో రాజీపడం... పేదలకు అన్నం పెట్టే క్రమంలో నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోం. పేదలకు ఉచితంగానే భోజనం అందించాలని భావిస్తున్నప్పటికీ నామమాత్రంగానే రూ.5 వసూలు చేస్తున్నాం. పరిమితి లేకుండా ఎంత భోజనం వడ్డించడానికి అయినా వెనుకాడటంలేదు. ఇలాంటి మంచి కార్యక్రమానికి మనసున్న దాతలు మరింత మంది ముందుకు రావాలి. – చిక్కాల మోహన్, కమిటీ సభ్యులు, తణుకు -
జగన్ ఖాతాలో గ్యారెంటీ
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తమిళనాడుకు సరిహద్దు నియోజకవర్గం నగరి. అందుకే ఇటు తెలుగు.. అటు తమిళ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవిస్తారు. నియోజకవర్గం ఏర్పడక ముందు తమిళనాడులోని తిరుత్తణి, నగరి కలిసి తిరుత్తణి తాలుకాలో ఉండేది. ఆ సమయంలో ఈ తాలుకాకు ఇద్దరు శాసనసభ్యులుండేవారు. నగరి అసెంబ్లీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నా ఇక్కడినుంచి గెలిచిన శాసన సభ్యుడు తమిళనాడు అసెంబ్లీకే వెళ్లేవారు. సరిహద్దు నియోజకవర్గాల్లో ఎదురయ్యే సమస్యలు అధికం కావటం.. పరిష్కారానికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండటంతో 1961లో పటాస్కర్ అవార్డుతో నగరి నియోజకవర్గం ఆవిర్భవించింది. దీంతో తొలిసారి నగరి నియోజకవర్గానికి 1962లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించారు. ప్రస్తుతం జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థిగా ఆర్కే రోజా, టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు కుమారుడు గాలి భానుప్రకాష్ బరిలో ఉన్నారు. పునర్విభజన తర్వాత.. 2009 పునర్విభజనకు ముందు నియోజకవర్గంలోని నగరి, పుత్తూరు రెండు అసెంబ్లీ సెగ్మెంట్లుగా ఉండేవి. పునర్విభజన తర్వాత నగరి, పుత్తూరు మునిసిపాలిటీగా ఏర్పడ్డాయి. అంతకుముందు నగరి, పుత్తూరు రెండు అసెంబ్లీ నియోజకవర్గాలుగా ఉండేవి. ప్రస్తుతం నగరి, పుత్తూరు, వడమాలపేట, విజయపురం, నిండ్ర మండలాలతో కలిపి నగరి నియోజకవర్గంగా ఉంది. అందుకే ఇక్కడి ప్రజలపై తమిళ సినీనటులు, అక్కడి నాయకుల ప్రభావం అధికంగా ఉంది. నగరి నియోజకవర్గ ప్రజలు చేనేత, నూలు వస్త్రాల తయారీ, మామిడి, చెరుకు సాగుపైన ఆధారపడి జీవనం సాగిస్తుంటారు. గత ఎన్నికల చరిత్ర 1962లో జరిగిన తొలి అసెంబ్లీ ఎన్నికల్లో నగరి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థి గోపాల్రాజు కాంగ్రెస్ అభ్యర్థి గోపాల్నాయుడిపై గెలుపొందారు. ఇప్పటివరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే 7 పర్యాయాలు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మూడుసార్లు టీడీపీ, ఒకసారి వైఎస్సార్సీపీ గెలుపొందారు. రెడ్డివారి చెంగారెడ్డి 8 దఫాలు పోటీచేసి ఐదుసార్లు విజయం సాధించారు. సినీ కళాకారులను ఆదరించిన నగరి నిర్మాత వీఎంసీ దొరస్వామిరాజు 1994 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీచేసి గెలవగా, రెండోసారి 1999లో ఓడిపోయారు. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళ సినీ రంగంలో హీరోయిన్గా వెలుగొందిన ఆర్కే రోజా 2004లో పరాజయం పాలయ్యారు. 2014లో విజయం సాధించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆర్కే రోజా టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడిపై సంచలన విజయం సాధించారు. టీడీపీకి సొంత ఇంటిలోనే వ్యతిరేకత నగరి అసెంబ్లీలో ప్రధానంగా వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్య పోటీ నెలకొని ఉంది. వైఎస్సార్సీపీ తరఫున అభ్యర్థిగా ఆర్కే రోజా మరోసారి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కుమారుడు గాలి భానుప్రకాష్ పోటీ చేస్తున్నారు. ఇతని అభ్యర్థిత్వం పట్ల కన్నతల్లి ఎమ్మెల్సీ గాలి సరస్వతమ్మ, సోదరుడు జగదీష్ వ్యతిరేకిస్తున్నారు. అదే విధంగా సొంత పార్టీలో అసంతృప్తులు, మరోవైపు జన్మభూమి కమిటీల దాష్టీకాలు, స్థానిక ప్రజాప్రతినిధులపై జనంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ప్రచారంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆర్కే రోజా దూసుకెళ్తుండగా, అసమ్మతిని చల్లార్చే పనిలో టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ తలమునకలై ఉన్నారు. వార్ వన్ సైడ్..! వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సినీ నటి, ఎమ్మెల్యే రోజా మరోసారి విజయపథాన దూసుకెళ్తున్నారు. ఐదేళ్లూ టీడీపీ ప్రభుత్వం నగరి నియోజకవర్గంపై వివక్ష చూపింది. అదే విధంగా మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ప్రభుత్వం తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. ఆమె అనుచరులు, కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. సొంత నిధులతో నియోజకవర్గంలో ఆమె పలు అభివృద్ధి పనులు చేపట్టారు. పేదలకు కడుపు నిండా భోజనం పెట్టాలనే లక్ష్యంతో ‘రాజన్న క్యాంటిన్’ ప్రారంభించి భోజనం అందిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలకు రూ.2లకే 20 లీటర్ల మినరల్ వాటర్ సరఫరా చేస్తూ పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓటర్ల వివరాలు మొత్తం 1,86,227 పురుషులు 91,720 మహిళలు 94,495 ఇతరులు: 12 – తిరుమల రవిరెడ్డి, సాక్షి ప్రతినిధి, తిరుపతి -
రాజన్న క్యాంటీన్ రూ.4కే భోజనం
-
రైల్వేకోడూరులో రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన కోరముట్ల
-
రాజన్న క్యాంటీన్లో నాలుగు రూపాయలకే భోజనం
-
మరోసారి అడ్డంగా బుక్కైన చంద్రబాబు
సాక్షి, అమరావతి : దేనినైనా మసిపూసి మారేడు కాయ చేయడంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ఎప్పుడూ ముందుంటారు. ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు రుజువైంది. బాబు చేసేది గోరంత చెప్పుకొనేది కొండంత. ఇందులో ఆయనకు ఉన్న అనుభవం ముందు ఎంతటి వారైనా దిగదుడుపే. కేంద్ర సంక్షేమ పథకాలను సైతం ప్రభుత్వం పేరు చెప్పుకొని ప్రచారం చేసుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడుది. ఇటీవల ప్రధాన మంత్రి సురక్షా భీమా యోజన పథకాన్ని చంద్రన్న భీమా పేరుతో ప్రమోట్ చేసుకోవాలని ప్రయత్నించిన చంద్రబాబు అడ్డంగా బుక్కైపోయారు. తాజాగా ప్రచార బాబు సోషల్ మీడియా వేదికగా మరోసారి దొరికిపోయారు. విషయం ఏంటంటే అన్న క్యాంటీన్ పేరుతో ఇటీవల చంద్రబాబు నాయుడు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టారు. అయితే ప్రారంభించిన రెండో రోజునే ఆహారం లేదంటూ కొన్ని చోట్ల క్యాంటీన్లను మూసివేశారు. మరికొన్ని చోట్ల ఆకలి తీర్చుకుందామని వచ్చిన పేదలపై తెలుగుదేశం నాయకులు జులుం చూపించారు. పట్టెడు మెతుకుల కోసం వచ్చిన వారిపై నిర్థాక్ష్యణ్యంగా దాడి చేసిన ఘటనలూ ఉన్నాయి. అయితే చేసిన గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకొనే చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేస్తూ ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. అయితే ఆయన చేసిన అసలు ఘనత బయటపడింది. వైఎస్సార్సీపీకి చెందిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నాలుగు రూపాయలకే భోజనం అంటూ రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు రూపాలయకే నాణ్యమైన భోజనం పేదలకు అందించాలనే లక్ష్యంతో ఆళ్ల ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఆ సందర్భంగా రాజన్న క్యాంటీన్ దగ్గర కడుపు నింపుకుంటున్న కొన్ని ఫొటోలను ఫేస్బుక్లో పోస్టు చేశారు. అయితే తెలుగుదేశం ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను ప్రమోట్ చేసుకోవడానికి ప్రచార మాధ్యమాల్లో ప్రకటనలు ఇచ్చారు. ఆ చిత్రంలో కొంత మంది పేదలు భోజనం చేస్తున్న ఫొటోలను కూడా పొందు పరిచారు. కానీ వాటిలో ఆళ్ల రామకృష్ణారెడ్డి పెట్టిన రాజన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్న ఫొటోలను ఉపయోగించుకున్నారు. దీన్ని గ్రహించిన సోషల్ మీడియా కార్యకర్తలు చంద్రబాబు పనితీరుపై విమర్శలు ఎక్కుపెట్టారు. ప్రచారం తప్ప పనిలేదని మండిపడుతున్నారు. చంద్రబాబు ప్రచార చిత్రాలను పరిశీలించండి పై చిత్రం 11-07-2018 రోజున ప్రచార మధ్యమాల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన. ఇందులో బ్లూకలర్‌లో ఉన్న వృత్తాన్ని పరిశీలించండి. ముగ్గురు వ్యక్తలు భోజనం చేస్తున్నారు. ఇప్పుడు కింద ఉన్న మరో చిత్రాన్ని పరీక్షించండి. ఈ ఫొటో 14-05-2017 రోజున మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజన్న క్యాంటీన్ ప్రారంభించిన రోజున ఫేస్బుక్లో చేసిన పోస్ట్. ఈ ఫొటోనే చంద్రబాబు ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ప్రచార చిత్రంగా వాడుకుంది. -
ఏడాదిగా.. కడుపు నిండుగా
తాడేపల్లిరూరల్: అన్నం, సాంబారు, కోడి గుడ్డు, పెరుగు, అరటి పండు, వడియాలు..ఆహా.. చెబుతుంటేనే నోరూరుతుంది కదూ.. వీటి ధర ఎంతో తెలుసా.. కేవలం 4 రూపాయలు. ఏంటి నమ్మకం కలగడం లేదా.. అయితే మంగళగిరి నియోజకవర్గంలో ఆకలి గొన్న పేగులను అడగండి. సంవత్సరం నుంచి తమ కడుపు నింపుతున్నాయని చెబుతాయి. ఈ ఏడాదిలో ఏనాడూ పస్తుల మాటే లేదని పొట్ట నిమురుకుంటూ ఆనందంతో పొంగిపోతాయి. కనీసం గుడ్డు కూడా రాని ధరకు తమకు నిండు కుండై కూడు పెడుతున్నాయని సంబరపడతాయి. అవును మరి.. వైఎస్సార్ సీసీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి.. సరిగ్గా ఏడాది క్రితం రాజన్న క్యాంటీన్ ఏర్పాటు చేశారు. నాటి నుంచి నేటి వరకు ప్రతి రోజు 500 నుంచి 600 మందికి పౌష్టికాహారం అందిస్తున్నారు. ఎన్నో ఎండిన డొక్కలకు మెతుకై కడుపు నింపుతున్నారు. ప్రతి రోజూ రూ.4లకు సాంబారు, పెరుగు అన్నం, అరటి పండు, కోడి గుడ్డు, ఒడియాలు ఇస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభయ్యే రాజన్న క్యాంటీన్ మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగుతుంది. ఉండవల్లిలో ప్రత్యేకమైన వంటశాలను ఏర్పాటు చేసి ఏడుగురు వంట మాస్టర్లుతో వండిస్తున్నారు. ఆహారాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాహనంలో మంగళగిరి తీసుకువెళ్లి నలుగురు వ్యక్తులతో పేదలకు అందిస్తున్నారు. ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గుంటూరు జిల్లాలో పలు చోట్ల తన సొంత పొలంలో పండించిన పంటను పూర్తిగా ఈ రాజన్న క్యాంటీన్‌కు ఉపయోగిస్తున్నారు. రాజన్న ప్రతి పేదవాడికీ పట్టెడన్నం పెట్టేందుకు కృషి చేశారని, ఆయన ఆశయంలో భాగం పంచుకునేందుకే రాజన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నానని ఎమ్మెల్యే ఆర్కే ఆనందంగా చెబుతున్నారు. -
అమ్మ క్యాంటీన్లలా.. రాజన్న క్యాంటీన్లు..!
దేవరపాలెం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : రానున్న కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న క్యాంటీన్లను తీసుకొస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు. 79వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దేవరపాలెంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు. సంక్షేమ పథకాల ఫలాలు ఆర్యవైశ్యులకు కూడా అందాలని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు. -
రాజన్న క్యాంటీన్ ప్రారంభం
- నాలుగు రూపాయలకే పేదలకు కడుపునిండా భోజనం - ప్రారంభించిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తాడేపల్లి రూరల్ (మంగళగిరి): పేద ప్రజలకు కడుపునిండా రుచికరమైన భోజనం పెట్టాలనే సంకల్పంతో మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆదివారం ‘రాజన్న’ మొబైల్ క్యాంటీన్లు ప్రారంభించారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో కేవలం నాలుగు రూపాయలకే పేదలకు భోజనాన్ని అందించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ.. 2004లో మే 14వ తేదీన మొదటిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నిరంతరం పేద ప్రజల కోసమే ఆలోచిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలుచేశారని చెప్పారు. ఆయన ఆలోచనలకు అనుగుణంగా రాజన్న క్యాంటీన్ పేరుతో భోజనం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. 365 రోజులూ ప్రతి పేదవాడికీ శ్రేష్టమైన భోజనం అందేలా తన సొంత నిధులతో ఈ ఏర్పాట్లు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ప్రతి గ్రామంలోనూ, పట్టణంలోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చెప్పి విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వం కనుక క్యాంటీన్లు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో మసీదు సెంటర్ వద్ద ప్రతి పేదవాడికీ ఒక్క రూపాయికే నాలుగు ఇడ్లీలు ఇచ్చే పథకం ప్రారంభిస్తానని ఆయన వెల్లడించారు. తమిళనాడు ప్రభుత్వం నిర్వహిస్తున్న క్యాంటీన్లు పరిశీలించడానికి కోట్లాది రూపాయలు వెచ్చించి కమిటీలను పంపించారని, ఇప్పటికి మూడేళ్లు గడిచినా పథకం రూపు దాల్చలేదన్నారు. -
రాజన్న క్యాంటీన్: భోజనం@రూ.4
అమరావతి: అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆ మాట మరిచిందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. తన సొంత ఖర్చుతో పేదలకు భోజనం పెడుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆర్కేను ఆయన అభినందించారు. ఆదివారం తన నియోజకవర్గం మంగళగిరిలో రాజన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే ఆర్ రామకృష్ణా రెడ్డి ప్రారంభించారు. కేవలం రూ.4లతో సాంబారు అన్నం, పెరుగన్నం, కోడిగుడ్డుతో మీల్స్‌ను అందిస్తున్నారు. వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మూడు రోజులు అరటిపండు, ఒడియాలను భోజనంలో ఇస్తారు. ప్రభుత్వం చేయలేని పనిని ఒక ఎమ్మెల్యే తన సొంత ఖర్చుతో చేయడం హర్షణీయమని ఉమ్మారెడ్డి అన్నారు. -
బాబుకు బుద్ది వచ్చేందుకే రాజన్న క్యాంటీన్లు
-
రాజన్న క్యాంటీన్లో రూ.4కే భోజనం
- నేడు మంగళగిరిలో ప్రారంభం - పేదల కోసం సొంత నిధులతో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే ఆర్కే మంగళగిరి: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రాజన్న క్యాంటీన్లో ఆదివారం నుంచి నాలుగు రూపాయలకే భోజనాన్ని అందించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పట్టణ కన్వీనర్ మునగాల మల్లేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. రాజన్న క్యాంటీన్ పేరుతో కేవలం నాలుగు రూపాయలకే అన్నం, కూర, పెరుగు, వారంలో నాలుగు రోజులు కోడిగుడ్డు, మిగిలిన మూడు రోజులు అరటి పండ్లు, వడియాలు, తాగునీటి ప్యాకెట్లు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజైన మే 14వ తేదీన రాజన్న క్యాంటీన్‌ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. గౌతమ బుద్ధారోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ఎమ్మెల్యే ఆర్కే ఈ క్యాంటీన్‌ను ప్రారంభిస్తారని వివరించారు. ఎమ్మెల్యే సొంత నిధులతో ఏర్పాటు చేస్తున్న క్యాంటీన్లో అందజేస్తున్న భోజనాన్ని పేదలు వినియోగించుకోవాలని కోరారు. నెలలో తొలి పదిరోజులు అంబేడ్కర్ విగ్రహం సెంటర్, మలి పది రోజులు పట్టణంలోని మిద్దె సెంటర్, మిగిలిన పది రోజులు తాడేపల్లి మండలం ఉండవల్లి సెంటర్లో భోజనం అందజేయనున్నట్లు వివరించారు.