దేవరపాలెం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా : రానున్న కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో రాజన్న క్యాంటీన్లను తీసుకొస్తామని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో పేర్కొన్నారు. 79వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా దేవరపాలెంలో ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడారు.
సంక్షేమ పథకాల ఫలాలు ఆర్యవైశ్యులకు కూడా అందాలని అన్నారు. నంద్యాల ఉప ఎన్నిక సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తామని పునరుద్ఘాటించారు.
Comments
Please login to add a commentAdd a comment