
సాక్షి, నెల్లూరు: ప్రతిపక్ష నాయకుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర నెల్లూరులోని ఉదయగిరి నియోజక వర్గంలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 87వ రోజు షెడ్యూల్ విడుదల అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. బుధవారం ఉదయం 8 గంటలకు కలిగిరి మండలం నుంచి పాదయాత్రను ప్రారంభిస్తారు.
అనంతరం కృష్ణారెడ్డి పాలెం, కుడుములదిన్నే పాడు, తెళ్లపాడు క్రాస్, మీదుగా చిన్న అన్నలూరుకు పాదయాత్ర చేరుకుంటుంది. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం తీసుకుంటారు. మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి మావిడాళ్ల పాలెం మీదుగా జంగాల పల్లికి పాదయాత్ర చేరుకుంటుంది. వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేస్తారు. దారిపొడవునా ప్రజలు రాజన్న బిడ్డకు ఘనంగా స్వాగతం పలుకుతున్నారు.