
సాక్షి, నెల్లూరు: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 88వ రోజు షెడ్యూల్ ఖరారు అయింది. ఈ మేరకు వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఉదయగిరి నియోజకవర్గం కొండాపూరం మండలంలోని జంగాలపల్లి శివారు నుంచి గురువారం ఉదయం 8 గంటలకు వైఎస్ జగన్ పాదయాత్ర ప్రారంభిస్తారు. ఆదిమూర్తిపురం, తూర్పు ఎర్రబల్లిక్రాస్, కొండాపురం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. పాదయాత్ర 11:30 గంటలకు రేనమాలకు చేరుకుంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు జననేత వైఎస్ జగన్ లంచ్ విరామం తీసుకుంటారు. 2:45 గంటలకు మళ్లీ పాదయాత్ర కొనసాగించి 3 గంటలకు రేనమాలలో వైఎస్ జగన్ మహిళలను కలుసుకుని వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. తూర్పుపాలెంక్రాస్ వద్ద 88వ రోజు పాదయాత్ర ముగుస్తుంది.
87వ రోజు ముగిసిన పాదయాత్ర
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 87వ రోజు ముగిసింది. బుధవారం ఉదయం ఆయన ఉదయగిరి నియోజకవర్గం కలిగిరి మండలం కలిగిరి శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. కలిగిరి శివారు, కృష్ణారెడ్డిపాలెం, కుడుముల దిన్నెపాడు, తాళ్లపాడు క్రాస్, చిన్న అన్నలూరు, కొండాపురం మండలం మామిడాల పాళెం, జంగాలపల్లి గ్రామాల్లో ప్రజలతో వైఎస్ జగన్ మమేకం అయ్యారు. నేడు 13.2 కిలోమీటర్లు నడిచిన వైఎస్ జగన్ జంగాలపల్లిలో బుధవారం పాదయాత్రను ముగించారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇప్పటివరకూ 1181.7 కిలోమీటర్లు నడిచారు.
Comments
Please login to add a commentAdd a comment