'బాబు పైత్యం పరాకాష్టకు చేరింది'
గుంటూరు: రాజధాని విరాళాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పైత్యం పరాకాష్టకు చేరిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆర్కే అన్నారు. రాజధాని కోసం విరాళాలు సేకరించే విషయంలో ఆయన తీరు దారుణంగా ఉందని అన్నారు.
చివరికి స్కూలు పిల్లల నుంచి కూడా డబ్బులు వసూలు చేయాలని చూడటం ఆయన దౌర్భాగ్యం అని విమర్శించారు. స్కూళ్లలో అట్టడుగు వర్గాలకు చెందినవారి పిల్లలు కూడా ఉంటారని వారి నుంచి కూడా విరాళాలు సేకరించాలని ప్రయత్నించడం దుర్మార్గం అని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలు, మేధావులతో మాట్లాడి రాజధాని ప్రాంతాన్ని ఎలా అభివృద్ది చేయాలో చర్చించాలని ఆర్కే సూచించారు.