భిక్షమెత్తిన డబ్బుతో బాబు విహారయాత్రలు: రోజా
హుండీల ద్వారా భిక్షమెత్తుతున్న డబ్బుతో చంద్రబాబు విహారయాత్రలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నాయకురాలు రోజా మండిపడ్డారు. ఎన్నికల హామీల నుంచి తప్పించుకోడానికి ప్రజల సొమ్మును ఫలహారంగా తింటూ విదేశాల్లో గడిపేస్తున్నారని విమర్శించారు.
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులకు సెటిల్మెంట్లపై ఉన్న శ్రద్ధ ప్రాజెక్టులపై లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు తొమ్మిదేళ్ల పాలనలో స్థూల ఉత్పత్తి 5.76 శాతం మాత్రమే ఉంటే.. వైఎస్ ఐదేళ్లలో స్థూల ఉత్పత్తి 9.56 శాతం ఉండేదని ఆయన చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడుగడుగునా చంద్రబాబును నిలదీయాలని అన్నారు.
చంద్రబాబు తీరుతో రైతులు శాశ్వత రుణగ్రహీతలుగా మిగిలిపోతారని సీనియర్ నాయకుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు చెప్పారు. ఆధునిక వ్యవసాయాన్ని అధ్యయనం చేయడానికి జపాన్ వెళ్లనక్కర్లేదని, బాపట్ల వ్యవసాయ కళాశాలలోనే తగినంత సమాచారం అందుబాటులో ఉందని ఆయన అన్నారు.