
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయో చెప్పాలన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేతినోప్పి పేరుతో కొత్త నాటకానికి సీఎం తెరతీశారని ఆరోపించారు. దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారని అన్నారు.
నాలుగేళ్లుగా బీజేపీతో మైత్రి కొనసాగిస్తూ దండం పెడతామంటారా, కోర్టుకు వెళ్తామంటారా అని నిలదీశారు. సీఎం పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమన్నారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు భిక్ష కాదు, విభజన హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి గురించి గతంలో బీజేపీ-టీడీపీ మైత్రిని ప్రశ్నిస్తే తమను అభివృద్ధి నిరోధకులుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మీరేం మాట్లాతున్నారో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. రైల్వే జోన్ గురించి కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment