Foreign Tours
-
అలలపై కలల విహారం
అలలపై తేలియాడుతూ ప్రయాణం.. గమ్యం చేరే వరకు ఎక్కడా బోర్ కొట్టకుండా ఆటలు, పాటలు, విందులు, వినోదాల్లాంటి బోలెడన్ని సరదాలు.. కళ్లు చెదిరే ఇంటీరియర్లతో అందమైన గదులు.. ప్రయాణ బడలిక తెలియనివ్వని పాన్పులు.. ఒకవేళ అలసటకు గురైతే స్పా, మసాజ్ లాంటి సర్వీసులు.. ఉన్న చోటే బోలెడంత షాపింగ్ చేసుకొనే అవకాశం.. ఇంకా ఈత కొలనులు.. జిమ్‌లు.. ఇలా ఒకటేమిటి ఇంద్రభవనం లాంటి సకల విలాసాలతో కూడిన నౌకల్లో విహారయాత్రలంటే ఎవరికి ఇష్టం ఉండదు.అందుకే దేశంలో లగ్జరీ క్రూజ్ టూరిజం సరికొత్త ట్రెండ్‌గా మారింది. పర్యాటకులను ఆనంద‘సాగరం’లో ముంచెత్తే అనుభూతులు పంచుతోంది. ఇంకేం.. జీవితాంతం గుర్తుండిపోయే సముద్రమంత లోతైన జ్ఞాపకాలు కావాలనుకుంటే ‘సీ’కేషన్కు సిద్ధమైపోండి. గెట్ సెట్ క్రూజ్!! దేశంలో క్రూజ్ పర్యాటకం క్రమంగా పుంజుకుంటోంది. డెస్టినేషన్ వెడ్డింగ్స్, ప్రైవేటు పార్టీలు, కంపెనీల గెట్ టు గెదర్ వంటి కార్యక్రమాలకు కూడా క్రూజ్‌లు వేదికలుగా మారుతున్నాయి. ప్రస్తుతం దేశంలో క్రూజ్ ప్రయాణికుల సంఖ్య 4.5 లక్షలు దాటింది. కార్డీలియా క్రూజెస్ అనే స్వదేశీ సంస్థ 2021 సెపె్టంబర్లో సుమారు 2 వేల మంది ప్రయాణికుల సామర్థ్యంగల ‘ఎంప్రెస్’నౌక ద్వారా భారత్‌లో తొలిసారిగా లగ్జరీ క్రూజ్ పర్యాటకానికి తెరతీసింది.బంగాళాఖాతం, అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాల్లో క్రూజ్ యాత్రలు నిర్వహిస్తోంది. పశ్చిమ తీరంలో ముంబై హోమ్ పోర్టుగా సెపె్టంబర్–జూన్ మధ్య గోవా, కొచ్చి, లక్షదీవులకు... జూన్–సెప్టెంబర్ మధ్య తూర్పు తీరంలో చెన్నై హోమ్ పోర్ట్‌గా క్రూజ్ ట్రిప్పులు తిప్పుతోంది. 2023 జూన్‌లో భారత్ నుంచి శ్రీలంకకు జర్నీతో విదేశీ క్రూజ్ సర్విసులను ప్రారంభించిన ఘనతను కూడా కార్డీలియా సొంతం చేసుకుంది.ఇప్పుడు ఏటా చెన్నై–శ్రీలంక మధ్య జూన్–సెపె్టంబర్ నెలల్లో కార్డీలియా ’ఎంప్రెస్‘విహారయాత్రలను నిర్వహిస్తోంది. గమ్యస్థానాల్లో వాటర్ అడ్వెంచర్లు, జంగిల్ సఫారీలు, ఆన్‌షోర్ సిటీ టూర్, అవుట్డోర్ పర్యటనలను కూడా అందిస్తోంది. దేశీయ గమ్యస్థానాలకు పర్యాటకుల ఆక్యుపెన్సీ 85 శాతం మేర ఉంటోందని.. వేసవి సెలవుల్లో టికెట్లు పూర్తిగా బుక్ అయిపోతున్నాయని కంపెనీ సీఈఓ జుర్గెన్ బైలోమ్ చెబుతున్నారు. కొత్త రూట్లు, గమ్యస్థానాలకు విస్తరణ నేపథ్యంలో భారతీయ క్రూజ్ ట్రాఫిక్ 25–30 శాతం పెరిగే అవకాశం ఉందన్నారు. కేంద్రం దన్ను.. దేశంలో సముద్ర క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 10 లక్షల మంది స్థాయికి చేర్చడంతోపాటు ఈ రంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఐదేళ్ల భారత్ క్రూజ్ మిషన్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా 10 సముద్ర క్రూజ్ టెర్మినల్స్, 100 రివర్ క్రూజ్ టెర్మినల్స్ నిర్మించాలనేది ప్రభుత్వ లక్ష్యం.ప్రపంచస్థాయి మౌలిక వసతులతోపాటు పర్యాటక ప్రదేశాలను మరింతగా అభివృద్ధి చేయనున్నారు. బడ్జెట్లో కూడా క్రూజ్ పరిశ్రమ వృద్ధికి ప్రోత్సాహకాలు ఇవ్వడం విశేషం. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో ఇప్పటికే రివర్ క్రూజ్ సర్విసులు ప్రారంభమయ్యాయి. కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి నదుల్లోనూ ఈ సర్విసులను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రివర్ క్రూజ్ పర్యాటకులను 2029 నాటికి ఏటా 15 లక్షలకు పెంచాలనేది మిషన్ లక్ష్యం.వైజాగ్ హాట్ డెస్టినేషన్... జూలైలో మళ్లీ క్రూజ్ రెడీ2022లో తొలిసారి కార్డీలియా క్రూజెస్ ‘ఎంప్రెస్’నౌక విశాఖ–చెన్నై మధ్య సముద్ర విహారంతో పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచింది. గతేడాది ‘ద వరల్డ్’అనే విదేశీ లగ్జరీ క్రూజ్ షిప్ గ్లోబల్ టూరిస్టులను విశాఖకు తీసుకొచ్చింది. ఇక్కడ సకల సౌకర్యాలతో నిర్మించిన అంతర్జాతీయ క్రూజ్ టెర్మినల్‌లో లంగరేసింది. ఈ ఏడాది మళ్లీ జూలైలో కార్డీలియా ఎంప్రెస్ నౌక వైజాగ్–పుదుచ్చేరి–చెన్నై మధ్య ట్రిప్పులకు రెడీ అవుతోంది.సుమారు రూ. 100 కోట్ల వ్యయంతో విశాఖ పోర్టులో నిర్మించిన ఇంటర్నేషనల్ క్రూజ్ టెర్మినల్ నుంచి నౌకల రాకపోకలు మొదలవడంతో క్రూజ్ పర్యటకానికి కూడా వైజాగ్ హాట్ డెస్టినేషన్‌గా నిలుస్తోంది. షిప్ ఆకారంలో నిర్మించిన ఈ టెర్మినల్‌లోని బెర్త్‌లో 2,500 మంది సామర్థ్యంతో కూడిన భారీ క్రూయిజ్లను లంగరేయొచ్చు. త్వరలో ఇక్కడి నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర దేశాలకు క్రూజ్ సర్వీసులు ప్రారంభించేందుకు పలు క్రూజ్ కంపెనీలతో సంప్రదింపులు జరుగుతున్నాయి.విదేశీ క్రూజ్‌ల క్యూఇటలీకి చెందిన కోస్టా క్రూజెస్ తొలిసారిగా 2023లో భారత్ పర్యాటకులకు అంతర్జాతీయ స్థాయి క్రూజ్ అనుభూతితోపాటు ఇటాలియన్ ఆతిథ్యాన్ని రుచి చూపించింది. ముంబై, కొచ్చి, గోవాతోపాటు లక్షదీవుల మధ్య మొత్తం 23 ట్రిప్పులు నిర్వహించింది. మొత్తం 14 అంతస్తులు (డెక్‌లు), 3,780 మంది ప్రయాణికుల సామర్థ్యంతో కోస్టా సెరీనా క్రూజ్ భారత సముద్ర జలాల్లో విహరించిన అతిపెద్ద నౌకగా రికార్డుకెక్కింది.ఆసియా పసిఫిక్ కార్యకలాపాల కోసం భారత్‌ను ప్రధాన కేంద్రంగా చేసుకోవడంపై దృష్టి పెడుతున్నామని కోస్టా క్రూజెస్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాబర్టో అల్బెర్టీ వెల్లడించారు. క్రూజ్ టూరిజానికి ప్రభుత్వ ప్రోత్సాహంతో మరిన్ని క్రూజ్ కంపెనీలు భారత్‌కు క్యూ కట్టనున్నాయి. వచ్చే ఏడాది నుంచి ‘రిసార్ట్ వరల్డ్ వన్’క్రూజ్ లైనర్ మన దేశంలో సెయిలింగ్‌కు సై అంటోంది. రాయల్ కరీబియన్, డిస్నీ తదితర దిగ్గజ క్రూజ్ లైనర్లు కూడా భారత మార్కెట్లోకి అడుగుపెట్టే ప్రణాళికల్లో ఉన్నాయి.ఇక అలలపై ఆగ్నేయాసియా చుట్టేయొచ్చు! భారత క్రూజ్ పరిశ్రమ ఇక అంతర్జాతీయంగానూ సత్తా చాటనుంది. కార్డీలియా తొలిసారిగా భారత్ నుంచి ఆగ్నేయాసియాలోని ప్రముఖ పర్యాటక దేశాలకు జూలైలో క్రూజ్ జర్నీ ప్రారంభిస్తోంది. ఇందుకోసం 2,500 మంది సామర్థ్యంగల రెండు కొత్త క్రూజ్లను కొననుంది. చెన్నై నుంచి మొదలయ్యే ఈ 10 రోజుల ట్రిప్‌లో థాయ్‌లాండ్ (ఫుకేట్), మలేసియా (కౌలాలంపూర్, లంకావీ)ల మీదుగా సింగపూర్ చేరుకోవచ్చు.అలాగే సింగపూర్ నుంచి మొదలై అవే డెస్టినేషన్లను కవర్ చేస్తూ చెన్నై చేరేలా టూర్లను ప్లాన్ చేశారు. ఇప్పటికే కార్డీలియా వెబ్సైట్ (www.cordeliacruises) తోపాటు ప్రముఖ ట్రావెల్ పోర్టల్స్‌లో బుకింగ్స్ మొదలయ్యాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రాలను చుట్టేయడంతోపాటు గమ్యస్థానాల్లో సిటీ టూర్స్, ఆన్‌షోర్ పర్యటనలతో ఒకే ట్రిప్‌లో మూడు దేశాలను కవర్ చేసే అవకాశం ఉంటుంది.ప్యాకేజీలు ఇలా... కార్డీలియా ‘ఎంప్రెస్షిప్లో మధ్యతరగతి కుటుంబం సైతం లగ్జరీ క్రూజ్ జర్నీ చేసేవిధంగా రకరకాల రూమ్‌లు, ఆఫర్లు, గ్రూప్ ప్యాకేజీలు ఉన్నాయి. ఉదాహరణకు చెన్నై–విశాఖ మధ్య ఇద్దరు పెద్దవాళ్లకు రెండు రాత్రులు, 3 పగళ్ల ప్యాకేజీ ధరలు (పన్నులన్నీ కలిపి) చూస్తే...అన్లిమిటెడ్ ఫుడ్, ఎంటర్టైన్మెంట్తో మూడు రోజులపాటు ఫైవ్ స్టార్ లగ్జరీ సముద్ర ప్రయాణ అనుభూతిని సొంతం చేసుకోవచ్చు. జర్నీ రూట్, ఎంత మంది, ఎన్ని రోజులు (3, 5 నైట్స్ ప్యాకేజీలు) అనేదాన్ని బట్టి రేట్లు మారతాయి. 12 ఏళ్ల లోపు పిల్లలకు షరతులకు లోబడి ఉచిత ప్రయాణ (పన్నులు కాకుండా) ఆఫర్ ఉంది. ధర ఎక్కువైనా మరింత లగ్జరీ, సౌకర్యాలు కోరుకునేవారికి సూట్, చైర్మన్ సూట్ కూడా ఉన్నాయి.విదేశీ టూర్ల విషయానికొస్తే... చెన్నై నుంచి శ్రీలంకకు (హంబన్‌టోట, ట్రింకోమలీ, జాఫ్నా), తిరిగి చెన్నై (5 నైట్స్, 6 డేస్ రౌండ్ ట్రిప్) జర్నికి ఇద్దరు పెద్దవాళ్లకు చార్జీ దాదాపు రూ. లక్ష పడుతుంది. అలాగే చెన్నై నుంచి సింగపూర్ (ఫుకెట్, లంకావీ, కౌలాలంపూర్ మీదుగా వన్‌వే ట్రిప్ – 10 నైట్స్, 11 డేస్) ట్రిప్‌కి చార్జీ రూ.2,21,745 అవుతుంది. పన్నులతో కలిపి, ఇంటీరియర్ స్టేట్‌రూమ్ ప్యాకేజీలు ఇవి.క్రూజ్ లెక్కలు ఇలా.. 3 కోట్లు: ప్రపంచవ్యాప్తంగా ఏటా క్రూజ్ జర్నీ చేస్తున్న పర్యాటకుల సంఖ్య (సుమారుగా) 30 బిలియన్ డాలర్లు: క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ45 బిలియన్ డాలర్లు: 2029 నాటికి క్రూజ్ జర్నీ మార్కెట్ విలువ అంచనా4.5 లక్షలు: దేశంలో ప్రస్తుతం క్రూజ్ ప్రయాణికుల సంఖ్య5.3 లక్షలు: ఇప్పటిదాకా కార్డీలియా ఎంప్రెస్‌లో విహరించిన పర్యాటకులు -
మోదీ విదేశీ పర్యటన.. విమానానికి బెదిరింపులు..
ముంబై: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఫోన్ చేసిన వ్యక్తిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా బెదిరింపు కాల్ రావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ సమాచారాన్ని భద్రత అధికారులకు చేరవేశారు. దీంతో, అలర్ట్ అయ్యారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన వ్యక్తని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించారు. ఇక, ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్, అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మోదీ.. ఫ్రాన్స్‌లో పర్యటించి ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ నేడు వాషింగ్టన్ చేరుకోనున్నారు. రేపు(గురువారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు. On 11th February, a call was received at Mumbai Police Control Room warning that terrorists may attack PM Modi's aircraft as he was leaving on an official visit abroad. Considering the serious nature of the information, the Police informed other agencies and began an…— ANI (@ANI) February 12, 2025 -
10న ఫ్రాన్స్‌కు.. 12న అమెరికాకు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)విదేశీ పర్యటన(foreign tour) ఖరారయ్యింది. ఆయన ఈ నెల 10 నుంచి 12వ తేదీ దాకా ఫ్రాన్స్‌లో(France)12, 13వ తేదీల్లో అమెరికాలో(America) పర్యటిస్తారు. భారత విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ శుక్రవారం ఈ విషయం వెల్లడించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మాక్రాన్‌తో కలిసి కృత్రిమ మేధ(ఏఐ) కార్యాచరణ సదస్సులో మోదీ పాల్గొంటారని చెప్పారు. అలాగే ఇండియా–ఫ్రాన్స్ సీఈఓల సదస్సుకు హాజరవుతారని అన్నారు. ఫ్రాన్స్‌లోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్పరిమెంటల్ రియాక్టర్‌ను మోదీ సందర్శిస్తారని వెల్లడించారు.అమెరికా పర్యటనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధానమంత్రి సమావేశమవుతారని పేర్కొన్నారు. మోదీ పర్యటనతో భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయని తెలియజేశారు. ఇరుదేశాల మధ్య పరస్పర సంబంధాలు, ద్వైపాక్షిక అంశాలు, కీలక రంగాల్లో భాగస్వామ్యంపై మోదీ, ట్రంప్ చర్చిస్తారని వివరించారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం కొలువుదీరిన మూడు వారాల్లోపే నరేంద్ర మోదీకి ఆహ్వానం అందిందని అన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా ట్రంప్ ప్రభుత్వం ఆయనను ఆహ్వానించిందని చెప్పారు. ఇండియాతో భాగస్వామ్యానికి అమెరికా ఇస్తున్న ప్రాధాన్యతకు ఇదొక ప్రతీక అని విక్రమ్ మిస్త్రీ వివరించారు. ట్రంప్‌ను ఒప్పిస్తారా? డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి పగ్గాలు చేపట్టిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారిగా అమెరికాలో అడుగుపెట్టబోతున్నారు. వారిద్దరి భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయ అక్రమ వలసదార్లను వెనక్కి పంపిస్తున్న సమయంలో మోదీ, ట్రంప్ సమావేశం కాబోతున్నారు. భారత్–అమెరికా మధ్య వ్యాపారం, వాణిజ్యం, రక్షణ, ప్రాంతీయ భద్రత వంటి కీలక అంశాలపై వారు విస్తృతంగా చర్చించబోతున్నట్లు సమాచారం. ఇరు దేశాల నడుమ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది. ఇంధన భద్రత, కృత్రిమ మేధ(ఐఏ) వంటి రంగాల్లో పరస్పరం సహకరించుకొనేలా నిర్ణయం తీసుకోవచ్చు. అక్రమ వలసదార్ల సమస్యను పరిష్కరించే విషయంలో ట్రంప్ ప్రభుత్వం చురుగ్గా పని చేస్తున్న సంగతి తెలిసిందే. మోదీతో భేటీలో ఈ అంశం ప్రస్తావనకు వచ్చే వీలుంది. భారతీయ అక్రమ వలసదార్లపై కఠినంగా వ్యవహరించకుండా మోదీ తన మిత్రుడైన ట్రంప్‌ను ఒప్పిస్తారా? అనేది వేచి చూడాలి. అమెరికాలో ఎలాన్ మస్క్ సహా ప్రముఖ వ్యాపారవేత్తలతో మోదీ సమావేశం కానున్నారు. ట్రంప్ ప్రియమిత్రుడు..మోదీ గొప్ప నాయకుడు ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన అతికొద్ది మంది ప్రపంచ దేశాల నేతల్లో మోదీ కూడా ఉన్నారు. గతవారం కూడా ఇరువురు నేతలు ఫోన్లో మాట్లాడుకున్నారు. వలసలు, భద్రత, వాణిజ్య సంబంధాలపై వారు చర్చించుకున్నారు. ట్రంప్, మోదీ మధ్య ఫలవంతమైన చర్చలు జరిగాయని వైట్‌హౌస్ ప్రకటించింది. ట్రంప్‌తో మోదీకి చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. ట్రంప్ తనకు ప్రియమిత్రుడు అని మోదీ చెబుతుంటారు. మోదీ గొప్ప నాయకుడు అని ట్రంప్ సైతం ప్రశంసించారు. అయితే, ఇండియాలో అమెరికా ఉత్పత్తులపై టారిఫ్‌లు అధికంగా విధిస్తున్నారని ట్రంప్ ఆక్షేపించారు. ఇండియాను టారిఫ్ కింగ్‌గా అభివరి్ణంచారు. గత వారం భారత పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై ట్రంప్ వ్యాఖ్యల ప్రభావం కనిపించింది. అమెరికా నుంచి దిగుమతి అయ్యే కొన్ని రకాల మోటార్ సైకిళ్లతోపాటు పలు ఉత్పత్తులపై టారిఫ్‌ను ప్రభుత్వం రద్దు చేసింది. మోదీ చివరిసారిగా 2024 సెప్టెంబర్‌లో అమెరికాలో పర్యటించారు. క్వాడ్ దేశాల అధినేతల సదస్సులో పాల్గొన్నారు. -
ఎంత ఖర్చయినా ఓకే.. ప్రపంచాన్ని చుట్టేద్దాం!
సాక్షి, అమరావతి: ప్రపంచ పర్యాటక రంగ పునర్నిర్మాణంలో భారతీయులు కీలక పాత్ర పోషిస్తున్నారు. విదేశీ గమ్యస్థానాలను అన్వేషించడంలో ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువ ఉత్సాహం కనబరుస్తున్నారు. ఎంత ఖర్చయినా.. ప్రపంచాన్ని చుట్టేసేందుకు అమితాసక్తిని ప్రదర్శిస్తున్నారు. దీంతో భారత పర్యాటకులను ఆకర్షించడానికి ప్రపంచ దేశాలు ప్రత్యేక ఆఫర్లు కూడా ప్రకటిస్తున్నాయి. వీసా లేకుండానే తమ దేశాల్లో పర్యటించే సౌలభ్యాన్ని కల్పిస్తున్నాయి. ఖర్చుకు వెనుకాడట్లేదు..కరోనా అనంతర పరిస్థితుల్లో భారతీయుల ఆలోచనల్లో మార్పు వచ్చిందని అంతర్జాతీయ టూరిస్ట్ ట్రావెల్స్ సంస్థలు చెబుతున్నాయి. విదేశాల్లో పర్యటించేందుకు.. కొత్త అనుభూతి పొందేందుకు భారతీయులు ఎంత ఖర్చు పెట్టేందుకైనా వెనుకాడట్లేదని పేర్కొంటున్నాయి. భారత పర్యాటకుడు ఒక్కో అంతర్జాతీయ పర్యటనకు సగటున రూ.2 లక్షల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిపాయి. ఈ ఖర్చు క్రమంగా పెరుగుతోందని వెల్లడించాయి.కాగా, 2023లో 2.82 లక్షల మంది విదేశాలకు ప్రయాణించడం ద్వారా రూ.2.60 లక్షల కోట్లు ఖర్చు చేశారని వరల్డ్ ట్రావెల్ అండ్ టూరిజం కౌన్సిల్ తెలిపింది. దేశంలో అవుట్‌బౌండ్ ట్రావెల్ మార్కెట్లో గణనీయమైన పెరుగుదల నమోదవుతోందని.. 2034 నాటికి రూ.4.78 లక్షల కోట్లకు పైగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. అలాగే భవిష్యత్‌లో అవుట్ బౌండ్ పర్యాటకులు 8 కోట్లకు చేరుకుంటారని.. ముఖ్యంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం దేశాలకు ప్రాధాన్యం పెరుగుతుందని భావిస్తోంది. ఇది భారత పర్యాటకుల విలాసవంతమైన జీవనశైలి అభివృద్ధిని సూచిస్తోందని, పెరుగుతున్న ఆదాయ మార్గాలు కూడా సరిహద్దుల దాటి ప్రయాణాలు చేసేలా ప్రోత్సహిస్తున్నాయని అభిప్రాయపడింది.మెరుగైన ఆతిథ్యం..భారత పర్యాటకులను ఆకర్షించేందుకు వివిధ దేశాలు ప్రత్యేక ప్రణాళికలు వేస్తున్నాయి. థాయిలాండ్, శ్రీలంక, దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఎంట్రీ ప్రోటోకాల్‌లను సరళీకృతం చేశాయి. యూఏఈ, టర్కీ తదితర దేశాలు భారతదేశంలో భారీగా ప్రమోషన్ కార్యక్రమాలు చేసుకుంటున్నాయి. అలాగే పలు దేశాలు అంతరాయం లేని కనెక్టివిటీ, అవాంతరాలు లేని వీసా ప్రక్రియలను అందజేస్తున్నాయి. యూరప్, ఉత్తర అమెరికాకు వీసాల కోసం ఎక్కువ నిరీక్షించాల్సి రావడంతో.. భారత పర్యాటకులు ఎక్కువగా మధ్యప్రాచ్యం, ఆగ్నేయాసియా దేశాలకు తరలి వెళ్తున్నారు.అలాగే భారత పర్యాటకుల కోసం హాస్పిటాలిటీ దిగ్గజ సంస్థలు కూడా తమ కార్యకలాపాలను విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అకార్, హిల్టన్, ఐహెచ్‌జీ వంటి హాస్పిటాలిటీ సంస్థలు తమ చైన్లను ప్రధాన నగరాల నుంచి టైర్ 2, 3 పట్టణాల్లోనూ ఏర్పాటు చేస్తున్నాయి. విమానయాన సంస్థలు కూడా దేశీయ, అంతర్జాతీయ సామర్థ్యాలను పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నాయి. -
‘సింగపూర్’ స్కిల్స్
ఒప్పందంతో లాభం ఇలా..⇒ ఐటీఈ పాఠాలను స్కిల్స్ వర్సిటీలో బోధిస్తారు. ⇒ టెన్త్ విద్యార్థులు మొదలుకుని చదువు పూర్తి చేసిన యువత, ఆసక్తి ఉన్న ఏ వయసు వారికైనా పరిశ్రమలు, ఐటీ సంస్థల సహకారంతో ఉద్యోగ నైపుణ్యాలపై సింగపూర్ సంస్థ శిక్షణనిస్తుంది. ⇒ ‘స్కిల్స్ ఫర్ ఫ్యూచర్, స్కిల్స్ ఫర్ లైఫ్’అనే నినాదంతో పనిచేస్తున్న ఐటీఈకి 5 వేల పరిశ్రమలతో భాగస్వామ్య ఒప్పందాలు ఉండగా, ప్రస్తుతం 28 వేల మంది శిక్షణ పొందుతున్నారు. ⇒ ప్రస్తుత ఒప్పందంతో స్కిల్స్ వర్సిటీలో వంద ఫుల్ టైమ్ కోర్సులకు ఆన్‌లైన్‌తో పాటు క్యాంపస్ శిక్షణ దొరుకుతుంది. పరిశ్రమలకు అవసరమయ్యే నైపుణ్యాలకు ఇక్కడ శిక్షణ ఇస్తారు. సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యటనలో భాగంగా సింగపూర్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం కీలక ఒప్పందం చేసుకుంది. నైపుణ్య అభివృద్ధిలో పరస్పర సహకారం, శిక్షణకు సంబంధించి.. సింగపూర్ ప్రభుత్వ విద్యాసంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఐటీఈ), రాష్ట్రానికి చెందిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఈ పరస్పర అవగాహన (ఎంఓయూ) కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా సింగపూర్ ఐటీఈ పాఠ్యాంశాలను స్కిల్స్ యూనివర్సిటీలో బోధించనున్నారు. శుక్రవారం సింగపూర్‌కు చేరుకున్న రేవంత్‌రెడ్డి( Revanth Reddy) నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్ టీమ్’కు అక్కడి ప్రవాస తెలంగాణ వాసులు స్వాగతం పలికారు. అనంతరం సీఎంతో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్‌బాబు, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి, స్కిల్స్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ వీఎల్విఎస్ఎస్ సుబ్బారావుతో కూడిన ప్రతినిధి బృందం ఐటీఈ ప్రాంగణాన్ని సందర్శించింది. కోర్సులు, సదుపాయాల పరిశీలన ఐటీఈ నిర్వహిస్తున్న నైపుణ్యాభివృద్ధి కోర్సులు, అధునాతన సదుపాయాలను రాష్ట్ర బృందం పరిశీలించింది. అక్కడ శిక్షణ ఇస్తున్న సుమారు 20 రంగాలకు చెందిన నిపుణులు, సంస్థ సిబ్బందితో మాట్లాడారు. ఈ నేపథ్యంలో తమ రాష్ట్రంలోని స్కిల్స్ యూనివర్సిటీకి సహకరించాలని ఐటీఈ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి కోరారు. వర్సిటీ ద్వారా వివిధ రంగాల్లో యువతకు ఉపాధి కల్పిం చేందుకు మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా నిర్వహిస్తున్న కోర్సులను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. చర్చల అనంతరం ఐటీఈ, స్కిల్స్ యూనివర్సిటీల మధ్య ఎంఓయూ కుదిరింది. ఒప్పంద పత్రాలపై స్కిల్స్ వర్సిటీ వీసీ సుబ్బారావు, ఐటీఈ అకడమిక్, అడ్మిన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ పర్వేందర్ సింగ్, ఐటీ ఎడ్యుకేషన్ సర్విసెస్ డిప్యూటీ డైరెక్టర్ ఫాబియన్ చియాంగ్ సంతకాలు చేశారు. సింగపూర్ విదేశాంగ మంత్రితో భేటీ ఐటీఈతో భాగస్వామ్యం.. మౌలిక సదుపాయాల అభివృద్ధి, పునరుత్పాదక వనరులు, పర్యాటకం, విద్య, నైపుణ్యాభివృద్ధి వంటి కీలక రంగాల్లో దీర్ఘకాలిక సహకారానికి మార్గం సుగమం చేస్తుందని సీఎం రేవంత్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కాగా ఐటీఈ ప్రతినిధి బృందం త్వరలో హైదరాబాద్‌ను సందర్శిస్తుందని అధికారులు ప్రకటించారు. పర్యటనలో భాగంగా సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో సీఎం రేవంత్‌రెడ్డి( Revanth Reddy), మంత్రి శ్రీధర్‌బాబు బృందం భేటీ అయ్యింది. -
సీఎం రేవంత్ విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు గ్రీన్ సిగ్నల్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు తెలంగాణ ఏసీబీ కోర్టు అనుమతి ఇచ్చింది. జనవరి 13 నుంచి 23వ తేదీ వరకు సీఎం విదేశీ పర్యటనకు వెళ్లేందుకు కోర్టు అనుమతించింది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి తన పాస్‌పోర్టును ఏసీబీ కోర్టుకు అప్పగించిన విషయం తెలిసిందే. బ్రిస్బేన్, దావోస్, ఆస్ట్రేలియా, సింగపూర్, స్విట్జర్లాండ్ పర్యటనలకు వెళ్లాల్సి ఉందని, ఈ నేపథ్యంలో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని ఏసీబీ కోర్టును రేవంత్ రెడ్డి అభ్యర్థించారు. ఇందుకు ఆరు నెలల పాటు తన పాస్‌పోర్టు ఇవ్వాలని కోర్టును రేవంత్ రెడ్డి కోరారు. రేవంత్ రెడ్డి అభ్యర్థనను అంగీకరించిన కోర్టు.. జులై 6వ తేదీలోగా పాస్‌పోర్టును తిరిగి అప్పగించాలని ఆదేశించింది. -
సీఎం రేవంత్ విదేశీ పర్యటన
-
Nara Lokesh: గుట్టుచప్పుడు కాకుండా మూడోసారి..!
విజయవాడ, సాక్షి: నారా లోకేష్ బాబు మరోసారి విదేశీ టూర్‌కు చెక్కేశారు. అదీ అత్యంత గోప్యంగా..! రెండ్రోజుల కిందటే ఆయన దేశం వదిలి వెళ్లారని, అందుకే కేబినెట్ సమావేశాన్ని సైతం చంద్రబాబు అర్దంతరంగా వాయిదా వేశారని తెలుస్తోంది. అయితే లోకేశ్ ఎక్కడికి వెళ్లారు? ఆంధ్ర ప్రదేశ్ మంత్రి పర్యటన అంత గోప్యంగా జరగాల్సిన అవసరం ఏమిటన్న ప్రశ్నలకు మాత్రం టీడీపీ వర్గాల నుంచి సమాధానం వినిపించడం లేదు. కాకపోతే ఆ పార్టీ కార్యకర్తలు, నేతల మధ్య చర్చలు మాత్రం చాలా జోరుగా సాగుతున్నాయి.చంద్రబాబు తనయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ ఏడాదిలో విదేశాలకు వెళ్లడం ఇది మూడోసారి. జనవరిలో సంక్రాంతి తర్వాత ఆయన చాలారోజులపాటు మీడియాకు కనిపించలేదు. చివరకు.. పుట్టినరోజు కూడా ఆయన హడావిడి లేకపోవడంతో ‘ఏం జరిగిందా?’ అని టీడీపీ కేడర్ గుసగుసలాడుకుంది. సరిగ్గా.. ఆ టైంలోనే అమెరికాలో ఆయన ఏకంగా అరెస్ట్ అయ్యారంటూ కొన్ని వదంతులు వినిపించాయి. ఆసక్తికరంగా ఈ వదంతులను అటు చినబాబు కానీ ఇటు టీడీపీ కానీ ఖండించలేదు. ఆ తర్వాత కూడా కొంత కాలం తరువాత కానీ అంటే ఎన్నికల ప్రచార సమయంలో కానీ ఆయన తెరపైకి వచ్చారు.ఇక రెండోసారి.. ఎన్నికలయ్యాక నారావారి ఫ్యామిలీ ఫారిన్ టూర్ పేరిట ఎటో వెళ్లింది. అటు చంద్రబాబు, ఇటు లోకేష్ ఇద్దరూ స్వల్ప వ్యవధి తేడాతోో విదేశాలకు వెళ్లినట్లు సమాచారం. అయితే చంద్రబాబు ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లారని టీడీపీ నేతలు ప్రచారం చేసినప్పటికీ.. అక్కడి పార్టీ ప్రతినిధులు మాత్రం ఆయన రాక గురించి సమాచారం లేదనే చెప్పారు. మరోవైపు.. లోకేష్ ఎక్కడికి వెళ్లారనే దానిపై కూడా కచ్చితమైన సమాచారం లేకుండా పోయింది. కట్ చేస్తే.. అధికారంలో ఉన్నా.. లేకపోయినా.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనల గురించి పక్కా సమాచారం ఉంటుంది. వైఎస్సార్సీపీ సైతం ఆ వివరాలను ఫొటోలు, వీడియోలతో సహా వీలైతే పత్రికా ప్రకటన లేదంటే సోషల్ మీడియా వేదికగా ప్రకటిస్తుంది. అయినా కూడా టీడీపీ అనుకూల మీడియా ఆ పర్యటనల గురించి ‘అతి’ కథనాలు వండి వార్చేవి. కానీ, చంద్రబాబు అండ్ లోకేష్ పర్యటనల విషయంలో మాత్రం విపరీతమైన గోప్యత ప్రదర్శిస్తూ వస్తున్నాయి. అయితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలను రిగ్గింగ్ చేసి నెగ్గారనే ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. ఈ క్రమంలో మంత్రి పదవి చేపట్టిన నెలన్నరలొనే మళ్ళీ లోకేష్ విదేశీ పర్యటనకు వెళ్లారు. దీంతో.. ఈ రహస్య పర్యటనలను వైఎస్సార్సీపీ ఆయుధంగా చేసుకునే అవకాశం లేకపోలేదు. ఇందుకోసమైనా.. వ్యక్తిగతమైనప్పటికీ లోకేష్ విదేశీ పర్యటనల కనీస వివరాలు వెల్లడించాలని టీడీపీ కీలక నేతలు అధినేత చంద్రబాబును కోరాలని భావిస్తున్నారట. ఒకవేళ లోకేష్ ఫారిన్ టూర్ రాష్ట్ర అభివృద్ధి కోసమో లేదంటే ఒప్పందాలు కోసమో అయ్యి ఉంటే అది ఆయనకు మైలేజ్.. పార్టీకి మంచి చేస్తుంది కదా చెప్పే ప్రయత్నం చేస్తున్నారట. కనీసం సోషల్ మీడియా వేదికగా అయినా లోకేష్ తన టూర్‌పై క్లారిటీ ఇస్తే బాగుంటుందని ఆశిస్తున్నారు వాళ్లు. -
మూడోటర్ము.. మోదీ తొలి విదేశీ టూర్ ఇటలీకి..!
న్యూఢిల్లీ: ప్రధానిగా మూడోసారి ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైనట్లు సమాచారం. జూన్ 13 నుంచి 15 వరకు జరిగే జీ7 సమావేశాల కోసం మోదీ ఇటలీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ‘జీ7 సమావేశాలకు రావాల్సిందిగా ఇటలీ ప్రధాని మంత్రి జార్జియా మెలోని గురువారం(జూన్6) ఫోన్లో మోదీని ఆహ్వానించారు. ఈ ఆహ్వానానికి మోదీ ఓకే అన్నారు. తనను ఆహ్వానించినందుకు మెలోనికి మోదీ కృతజ్ఞతలు చెప్పారు’అని భారత విదేశీ వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రపంచ ఆర్థికవ్యవస్థ ప్రస్తుత స్థితిగతులు, అంతర్జాతీయ వాణిజ్యం, వాతావరణమార్పులు, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల ప్రభావం తదితర అంశాలపై జీ7 సదస్సులో చర్చించనున్నారు. కెనడా, ఫ్రాన్స్,జర్మనీ, ఇటలీ,జపాన్, యూకే,అమెరికా జీ7 కూటమిలో సభ్య దేశాలుగా ఉన్నాయి. జీ7 సదస్సు సైడ్‌లైన్స్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. -
తండ్రీ కొడుకుల రహస్య విదేశీ పర్యటన
-
ముగిసిన సీఎం జగన్ విదేశీ పర్యటన
కృష్ణా, సాక్షి: ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర సీఎం జగన్‌కు ఘన స్వాగతం లభించింది. ఎంపీలు విజయసాయిరెడ్డి నేతృత్వంలో పలువురు ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు సీఎం జగన్‌కు స్వాగతం పలికారు. పార్టీ కేడర్ పెద్ద ఎత్తున తరలివచ్చింది. అక్కడి నుంచి నేరుగా ఆయన తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు. 👉ఫొటో గ్యాలరీ కోసం క్లిక్ చేయండిఏపీ ఎన్నికలు పూర్తయిన తర్వాత మే నెల 17వ తేదీన సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. లండన్, స్విట్జర్లాండ్ దేశాల్లో కుటుంబసమేతంగా ఆయన పర్యటించారు. పదిహేను రోజుల తర్వాత తిరిగి ఇవాళ స్వదేశానికి విచ్చేశారు. జూన్ 4వ తేదీన ఏపీకి జడ్జిమెంట్ డే. ఈ నేపథ్యంలో నేడో, రేపో ఓట్ల లెక్కింపు రోజు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైఎస్సార్సీపీ శ్రేణులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. -
రహస్యంగా 12 రోజుల టూర్..అసలు నిజం ఇదేనా ?
-
టీడీపీ సైలెన్స్.. దేనికి సంకేతం?
ఎన్టీఆర్, సాక్షి: తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎక్కడ?. విదేశీ పర్యటన పేరుతో ఆయన ఎక్కడికి వెళ్లారసలు?. ఎన్నికల ఫలితాల వేళ ఉన్నపళంగా ఎక్కడికి వెళ్లారు?. ఏపీ రాజకీయ వర్గాల్లో.. ఆఖరికి టీడీపీ శ్రేణుల్లోనూ దీనిపైనే చర్చ నడుస్తోంది.నారా చంద్రబాబు నాయుడు.. విదేశీ యాత్రకు విశ్రాంతి కోసం వెళ్లారు!. కాదు కాదు.. 74 ఏళ్ల చంద్రబాబు వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లారు. ఎన్నికల ఫలితాల ముందర కుటుంబ సభ్యులతో సరదాగా గడిపేందుకే ఆయన విదేశాలకు వెళ్లారు. ఇలా.. ఎవరికి తోచిన ప్రకటనలు వాళ్లు చేస్తున్నారే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లారు అనేదానిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఆఖరికి ఆయన పార్టీ కూడా!. ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత విదేశీ పర్యటన కోసం హైదరాబాద్ నుంచి తొలుత దుబాయ్‌కు వెళ్లారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారు అనేదానిపై గోప్యతను ప్రదర్శిస్తోంది తెలుగు దేశం పార్టీ. ఇక.. చంద్రబాబు ఏం చేసినా బాకా ఊదే ఎల్లో పత్రికలు సైతం ఆయన ఫారిన్ టూర్‌పై వేర్వేరు కథనాలు ఇవ్వడం గమనార్హం. చంద్రబాబు పర్యటనకు వెళ్లే ముందే ఆయన తనయుడు నారా లోకేష్ విదేశాలకు వెళ్లారు. ఆయన కూడా ఎక్కడికి వెళ్లారనేదానిపై స్పష్టత కొరవడింది. ఇక చంద్రబాబు విశ్రాంతి కోసం అమెరికా వెళ్తున్నారంటూ లీకులు ఇచ్చాయి టీడీపీ శ్రేణులు. అయితే.. చంద్రబాబు అసలు అమెరికాకే రాలేదంటూ టీడీపీ ఎన్నారై నేత కోమటి జయరాం ప్రకటన చేయడంతో ఒక్కసారిగా గాలి తీసేసినట్లయ్యింది.చెప్పాల్సిన అవసరం ఉందిఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్ష ప్రధాన నేతలుగా బాధ్యతాయుతమైన పదవుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి,నారా చంద్రబాబు నాయుడు ఉన్నారు. వాళ్లిద్దరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నా పార్టీలు ప్రకటనలు చేస్తుంటాయి. అలాగే ఏ పర్యటనలకు వెళ్లినా.. అధికారికంగా వెల్లడించాల్సిన అవసరం ఆ పార్టీల బాధ్యత కూడా. అందుకే వైఎస్సార్సీపీ సీఎం జగన్ కుటుంబ సమేతంగా లండన్ పర్యటనకు వెళ్లగానే.. అక్కడ ల్యాండ్ అయిన దృశ్యాలను మీడియా, సోషల్ మీడియా మాధ్యమంగా విడుదల చేసింది. మరి ఇదే పని చంద్రబాబు విషయంలో టీడీపీ ఎందుకు చేయలేకపోతోంది. సాధారణంగానే చంద్రబాబు విదేశీ పర్యటనను ఏదో రాష్ట్రానికి ఉద్దరించే పనిగా చూపించే ఎల్లో మీడియా.. ఈసారి ఆ బిల్డప్‌లను ఎందుకు ఇవ్వలేకపోతోంది. ఈ లెక్కన.. చంద్రబాబు విదేశీ పర్యటనపై వైఎస్సార్సీపీ ఆరా తీయడంలో.. సారీ నిలదీయడంలో తప్పేముంది?. -
పవన్ ఏ దేశానికి వెళ్లారు?
సాక్షి, అమరావతి : ఎన్నికల పోలింగ్ అనంతరం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు విదేశాలకు వెళ్లిపోయారు. ఆయన ఎక్కడకు వెళ్లారన్నది స్పష్టత లేకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. తాజాగా చంద్రబాబుకు దత్తపుత్రుడిగా పేరుపడ్డ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా రాష్ట్రంలో, హైదరాబాద్‌లో ఎక్కడా కనిపించకపోవడం ప్రజలతోపాటు సొంత పార్టీలోనూ చర్చకు దారితీసింది. ఆయన ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారంటూ పార్టీ వర్గాలు చెబుతున్నప్పటికీ, ఎక్కడకు వెళ్లారన్నదీ వారికీ తెలియక సతమతమవుతున్నారు. ఈ నెల 13న మంగళగిరిలోని ఓటు వేసిన పవన్ మరుసటి రోజు 14వ తేదీన ఉత్తరప్రదేశ్‌లో వారణాసి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రధాని నరేంద్ర మోదీ నామినేషన్ దాఖలు చేసే కార్యక్రమానికి హాజరయ్యారు. ఆ తర్వాత వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. అప్పటి నుంచి మంగళగిరి రాష్ట్ర పార్టీ కార్యాలయంలో గానీ, హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో గానీ పార్టీ నాయకులెవరికీ అందుబాటులోకి రాలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రష్యా లేదా దుబాయ్ వెళ్లి ఉంటారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. చంద్రబాబు తరహాలోనే పవన్ కూడా తన విదేశీ పర్యటనపై గోప్యత పాటించడంతో రాజకీయవర్గాల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.నాగబాబు ‘ఎక్స్’ ట్వీట్ పెను దుమారం రేపినా..పోలింగ్ అనంతరం పవన్ సోదరుడు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు సోషల్ మీడియా ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన ఓ ట్వీట్ మెగా కుటుంబంలో, జనసేన పార్టీలో పెద్ద దుమారాన్నే రేపింది. దీనిపైనా పవన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. పోలింగ్ ముగిసిన వెంటనే నాగబాబు ఎక్స్‌లో ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయి వాడే. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే..’ అంటూ ట్వీట్ చేశారు. మెగా – అల్లు ఉమ్మడి కుటుంబానికి చెందిన హీరో అల్లు అర్జున్ నంద్యాల వెళ్లి తన మిత్రుడు, అక్కడి వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పా రవి కిషోర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడంతో ఆయన్ని ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ పెద్ద దుమారం రేగింది.ఆ ట్వీట్‌పై అల్లు అర్జున్ అభిమానులు సోషల్ మీడియా వేదికగానే నాగబాబుపై తీవ్రంగా ప్రతిస్పందించారు. దీంతో నాగబాబు తన ఎక్స్ అకౌంట్‌ను ఒక రోజు బ్లాక్ చేసి, రెండో రోజు ఆ ట్వీట్‌ను డిలీట్ (తొలగించానంటూ) చేశానంటూ ప్రకటించారు. ఈ వ్యవహారంపై పవన్ స్పందించకపోవడంపై పార్టీలో పెద్ద చర్చే జరిగింది. -
మీడియాకు థ్యాంక్స్ చెప్పిన కేరళ గవర్నర్.. ఎందుకంటే?
కొచ్చి: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మూడు వారాల పాటు విదేశీ పర్యటనకు బయలుదేరినట్లు మీడియా ద్వారా తనకు తెలిసిందని గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ అన్నారు. సీఎం పర్యటన గురించి తనకు తెలియజేయకపోవడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశారు.సీఎం పినరయి విజయన్.. ఆయన కుటుంబసభ్యుల విదేశీ పర్యటనపై గవర్నర్ స్పందన ఏంటని అడిగినప్పుడు నాకు తెలియదు, తెలియజేసినందుకు మీడియాకు చాలా ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి పర్యటల గురించి తనకు గతం నుంచి వెల్లడించడం లేదని రాష్ట్రపతికి ఇదివరకే లేఖ రాశానని ఖాన్ చెప్పారు. అయితే పినరయి విజయన్ పర్యటన గురించి తనకు తెలియదని స్పష్టం చేశారు.సీఎం.. ఆయన కుటుంబసభ్యులు మే 6న విదేశాలకు వెళ్లారు. కేరళలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం తర్వాత విజయన్ విరామం తీసుకోవాలనున్నారు. అందుకే తన కుటుంబంతో విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి ఎంవీ గోవిందన్ తెలిపారు. -
ఆతిథ్య రంగం జోరు..
ముంబై: ఆతిథ్య రంగం ఆదాయం వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2024–25) 11–13 శాతం మేర వృద్ధి చెందనుంది. దేశీయంగా పర్యాటకానికి డిమాండ్ స్థిరంగా కొనసాగనుండటంతో పాటు విదేశీ పర్యాటకుల సంఖ్య కూడా పెరగనుండటం ఇందుకు తోడ్పడనుంది. క్రిసిల్ రేటింగ్స్ ఒక నివేదికలో ఈ విషయాలు వెల్లడించింది. ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో పరిశ్రమ ఆదాయ వృద్ధి 15–17 శాతం స్థాయిలో ఉండగలదని పేర్కొంది. డిమాండ్ పటిష్టంగా ఉండటం, కొత్తగా హోటల్స్ లభ్యత ఒక మోస్తరుగానే పెరుగుతుండటంతో సమీపకాలంలో పరిశ్రమ లాభదాయకత ప్రస్తుత, వచ్చే ఆరి్థక సంవత్సరాల్లో మెరుగ్గా ఉండనుందని నివేదిక వివరించింది. గదుల అద్దె రేట్లు (ఏఆర్ఆర్) సగటున ఈ ఆరి్థక సంవత్సరం 10–12 శాతం మేర, వచ్చే ఆర్థిక సంవత్సరం 5–7 శాతం మేర పెరగవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. ఆక్యుపెన్సీ ఆరోగ్యకరంగా 73–74 శాతం స్థాయిలో కొనసాగవచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, విదేశీ టూరిస్టుల రాక ఈ ఆరి్థక సంవత్సరమూ పెరగనున్నప్పటికీ కోవిడ్ పూర్వ స్థాయితో పోలిస్తే 10 శాతం తక్కువగానే నమోదు కావచ్చని చెప్పారు. అయితే, వచ్చే ఏడాది ఇది పుంజుకోగలదన్నారు. ఆచితూచి పెట్టుబడులు.. డిమాండ్ పుంజుకోవడం పరిశ్రమ సెంటిమెంటు మెరుగుపడేందుకు ఊతమిస్తున్నప్పటికీ కొత్తగా పెట్టుబడులు పెట్టేటప్పుడు పరిశ్రమ ఆచితూచి వ్యవహరిస్తోందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ నితిన్ కన్సల్ తెలిపారు. ‘స్థల సేకరణ వ్యయాలు అధికంగా ఉండటం, నిర్మాణ వ్యయాలు పెరిగిపోవడం, పరిశ్రమ సైక్లికల్ స్వభావం కారణంగా లాభాలకు మళ్లాలంటే సుదీర్ఘ సమయం పట్టనుండటం వంటి అంశాల వల్ల కొత్తగా పెట్టుబడి వ్యయాలు చేయాలంటే ఆచి తూచి వ్యవహరిస్తున్నారు. కాబట్టి బ్రాండ్లు తమ ముందస్తు పెట్టుబడి వ్యయాలను తగ్గించుకునేందుకు మేనేజ్మెంట్ కాంట్రాక్టుల ద్వారా గదులను పెంచుకోవడాన్ని కొనసాగించే అవకాశం ఉంది‘ అని కన్సల్ పేర్కొన్నారు. ఏఆర్ఆర్పరమైన ఆదాయ వృద్ధితో సమానంగా నిర్వహణ వ్యయాలు పెరగకపోవడం వల్ల లాభదాయకత మెరుగుపడగలదని ఆయన చెప్పారు. హోటళ్లు ఖర్చులను తగ్గించుకునే క్రమంలో గత రెండేళ్లుగా సిబ్బందిని, ఫుడ్.. బెవరేజ్‌ల వ్యయాలను క్రమబదీ్ధకరించుకుంటూ పలు చర్యలు తీసుకోవడం కూడా పరిశ్రమకు సానుకూలాంశమని కన్సల్ వివరించారు. -
వీసా లేకున్నా ఇరాన్ వెళ్లొచ్చు
టెహ్రాన్: ఇరాన్ సందర్శించాలనుకునే భారతీయులకు శుభవార్త. ఇరాన్‌కు వెళ్లేందుకు ఇక వీసా అవసరమే లేదు. విదేశీ పర్యాటకులు, సందర్శకులకు ఆకర్షించేందుకు ఇరాన్ ప్రభుత్వం భారత్ సహా 33 దేశాల వారికి వీసా లేని ప్రయాణాలకు అనుమతులివ్వనున్నట్లు ప్రకటించింది. ఇరాన్ మంత్రివర్గం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆదేశ పర్యాటక మంత్రి ఎజ్జతొల్లా జర్ఘామి ఇటీవల ఈ విషయాన్ని స్వయంగా ప్రకటించారు. ఇరాన్ వ్యతిరేక ప్రచారానికి చెక్ పెట్టేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందన్నారు. ఇరాన్ వీసా ఫ్రీ వెసులుబాటు ప్రకటించిన దేశాల్లో భారత్‌తోపాటు రష్యా, యూఏఈ, బహ్రెయిన్, సౌదీ, ఖతార్, కువాయిట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్ తదితరాలున్నాయి. మార్చి 21తో ప్రారంభమైన ఈ ఏడాది మొదటి 8 నెలల్లోనే ఇరాన్‌ను సందర్శించిన విదేశీయుల సంఖ్య 44 లక్షలుగా ఉంది. ఇది గత ఏడాదితో పోలిస్తే 48.5% ఎక్కువ. భారతీయులు ఇకపై తమ దేశానికి వీసాతో పనిలేకుండా రావొచ్చంటూ ఇటీవలే మలేసియా, శ్రీలంక, వియత్నాం దేశాలు ప్రకటించిన విషయం తెలిసిందే. -
Alex Baty: బ్రిటన్‌లో పాపం పసివాడు!
అనగనగా అలెక్స్ బాటీ. ఓ 11 ఏళ్ల పాల బుగ్గల పసివాడు. సొంతూరు బ్రిటన్‌లోని గ్రేటర్ మాంచెస్టర్. తల్లి, తాతయ్య విదేశీ యాత్రకు వెళ్దామంటే సంబరంగా వాళ్లతో కలిసి స్పెయిన్ బయల్దేరాడు. ఆ యాత్ర ఏకంగా ఆరేళ్లకు పైగా సాగుతుందని అప్పుడతనికి తెలియదు పాపం! ఎందుకంటే అప్పట్నుంచీ అతను బ్రిటన్ తిరిగి రానే లేదు. సరికదా, ఆచూకీ కూడా తెలియకుండా పోయాడు! అతనే కాదు, నాటినుంచీ అతని తల్లి, తాతయ్య కూడా నేటికీ పత్తా లేరు!! ఈ ఉదంతం అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బ్రిటన్ పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు కూడా చేశారు. అలెక్స్ కోసం యూరప్ అంతటా వెదికీ వెదికీ అలసిపోయారు. ఇక తమవల్ల కాదంటూ చేతులెత్తేశారు. అదుగో, అలాంటి స్థితిలో మూడు రోజుల క్రితం అనుకోకుండా ఫ్రాన్స్‌లో దొరికాడు అలెక్స్. ఈ లాస్ట్ అండ్ ఫౌండ్ స్టోరీ ఇప్పుడు బ్రిటన్ అంతటా టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది! ఇలా దొరికాడు... వాయవ్య ఫ్రాన్స్‌లోని టౌలోస్ అనే కొండ ప్రాంతంలో గత బుధవారం అర్ధరాత్రి దాటాక ఓ 17 ఏళ్ల కుర్రాడు హోరు వానలో తడుస్తూ, హైవే పక్కగా పేవ్‌మెంట్‌పై ఒంటరిగా నడుస్తూ పోతున్నాడు. అటుగా వెళ్తున్న ఫాబియన్ అసిడినీ అనే ఓ ట్రక్ డ్రైవర్ కంటపడ్డాడు. అది మారుమూల ప్రాంతం, పైగా ఎవరూ బయట తిరగని వేళ కావడంతో అనుమానం వచి్చన ఆ డ్రైవర్ మనవాణ్ని దగ్గరికి తీశాడు. తొలుత బెదురు చూపులతో మారుపేరు చెప్పినా, అనునయించి అడిగేసరికి అసలు పేరు, తాను తప్పిపోయిన వృత్తాంతంమొత్తం చెప్పుకొచ్చాడు. ‘కొన్నేళ్ల కింద మా అమ్మే నన్ను కిడ్నాప్ చేసింది’ అంటూ ముక్తాయించాడు. దాంతో బిత్తరపోయిన అసిడినీ వెంటనే అతన్ని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పజెప్పాడు. వాళ్లు బ్రిటన్‌కు సమాచారమివ్వడం, ఫొటో చూసిన నానమ్మ అలెక్స్‌ను గుర్తు పట్టడం, ఇద్దరూ వీడియో కాల్లో మాట్లాడుకుని ఆనందబాష్పాలు రాల్చడం చకచకా జరిగిపోయాయి. ఏం జరిగిందంటే... అలెక్స్ అమ్మానాన్నలు చాన్నాళ్ల క్రితమే విడిపోయారు. అలెక్స్ కోరిక మేరకు కోర్టు అతన్ని నానమ్మ సంరక్షణలో ఉంచింది. ఆమె అనుమతి లేకుండానే 11 ఏళ్ల అలెక్స్‌ను తల్లి, తాతయ్య కలిసి విహారయాత్ర పేరిట 2017లో స్పెయిన్ తీసుకెళ్లారు. అప్పటినుంచీ ముగ్గురూ అయిపు లేకుండా పోయారు. పెద్దవాళ్లిద్దరూ అప్పటికి కొంతకాలంగా ఆధ్యాతి్మక బాట పట్టినట్టు దర్యాప్తులో తేలింది. తమతో పాటు అలెక్స్ కూడా ఆ ప్రత్యామ్నాయ జీవనం గడపాలనే ఉద్దేశంతో అతన్ని తీసుకుని స్పెయిన్‌లో ఓ ఆరామం వంటి ప్రదేశానికి వెళ్లినట్టు పోలీసులు ముక్తాయించారు. తాము తొలుత ఓ విలాసవంతమైన ఇంట్లో ఒక రకమైన ఆధ్యాతి్మక సమూహంతో కలిసి కొన్నేళ్ల పాటు గడిపామన్న అలెక్స్ తాజా వాంగ్మూలం కూడా దీన్ని ధ్రువీకరించింది. తర్వాత అమ్మ, తాతయ్య ఇద్దరూ అలెక్స్‌ను తీసుకుని 2021లో ఫ్రాన్స్‌లో ప్రత్యామ్నాయ జీవన శైలికి పేరున్న పైరెనీస్ ప్రాంతానికి మారినట్టు భావిస్తున్నారు. అలెక్స్ దొరికిన చోటు కూడా అక్కడికి కొద్ది దూరంలోనే ఉంది. ఆ జీవన విధానం తనకు నచ్చక నానమ్మ చెంతకు చేరేందుకు తప్పించుకుని వచ్చేశానని అలెక్స్ చెప్పుకొచ్చాడు. అతన్ని ఒకట్రెండు రోజుల్లో నానమ్మ దగ్గరికి చేర్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అతని అమ్మ, తాతయ్యలపై కిడ్నాపింగ్ కేసు ఇప్పటికీ పెండింగ్‌లోనే ఉండటం విశేషం! తాజా వివరాల ఆధారంగా వారిని తెరపైకి తీసుకొచ్చే పనిలో పడ్డారు బ్రిటన్ పోలీసులు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అమెరికా సంస్కృతికి ఎలా ఉంది?
అనంతపురం ఎడ్యుకేషన్: మన సంస్కృతికి, అమెరికా సంస్కృతికి ఏమైనా తేడాలు గమనించారా? అంటూ ఇటీవల ప్రభుత్వం తరఫున అమెరికా పర్యటనకు వెళ్లొచ్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను రాప్తాడు కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని సౌమ్య ప్రశ్నించింది. ఇంగ్లిష్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసిన పది మంది ప్రభుత్వ పాఠశాలల పదో తరగతి విద్యార్థులను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అమెరికా పర్యటనకు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పర్యటన ముగించుకుని తిరిగొచ్చిన వారితో అక్కడి అనుభవాలను ఇతర విద్యార్థులతో పంచుకునేలా మంగళవారం అన్ని జిల్లాల విద్యార్థులతో వీడియో కాన్ఫరెన్స్ ఏర్పా టు చేశారు. ప్రతి జిల్లా నుంచి ఒక విద్యార్థిని ఎంపిక చేశారు. ఇందులో భాగంగా అనంతపురం నుంచి రాప్తాడు కేజీబీవీ 9వ తరగతి విద్యార్థిని ఆర్.సౌమ్య పాల్గొంది. డీఈఓ చాంబరులో డీఈఓ నాగరాజు, సమగ్రశిక్ష ఏఎంఓ చంద్రశేఖర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. అమెరికా దేశంలో ఐక్యరాజ్య సమితి కార్యాలయం, లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ, వైట్‌హౌస్, వరల్డ్‌బ్యాంక్ తదితర కార్యాలయాలను సందర్శించి వచ్చినట్లు విద్యార్థులు పేర్కొన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చిన విద్యార్థుల తో ఇంట్రాక్ట్ అయినట్లు వెల్లడించారు. జిల్లా విద్యార్థిని అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ... అక్కడి దేశస్తులు తమ ను బాగా రిసీవ్ చేసుకున్నారన్నారు. అక్కడ తమ అనుభవాలను పంచుకున్నారు. డీఈఓ నాగరాజు మాట్లా డుతూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపే ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయన్నారు. సర్టిఫికెట్ల పరిశీలన తొలిరోజు ప్రశాంతం అనంతపురం ఎడ్యుకేషన్: సమగ్ర శిక్ష సహిత విద్య విభాగంలో ఖాళీగా ఉన్న రిసోర్స్ పర్సన్ పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన తొలిరోజు మంగళవారం ప్రశాంతంగా జరిగింది. సమగ్రశిక్ష జిల్లా కార్యాలయంలో ఈ ప్రక్రియ సాగింది. రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన జాబితా మేరకు తొలిరోజు ఎంఆర్ అభ్యర్థుల సర్టిఫికెట్లను ఎంఈఓలు, హెచ్ఎంల బృందాలు పరిశీలించాయి. మొత్తం 144 మంది అభ్యర్థులకు గాను 120 మంది హాజరయ్యారు. సర్టిఫికెట్ల పరిశీలన ప్రక్రియను సమగ్రశిక్ష ఏపీసీ, డీఈఓ నాగరాజు, ఐఈడీ కోఆర్డినేటర్ షమా పరిశీలించారు. రెండరోజు బుధవారం వీఐ/హెచ్ఐ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుందని డీఈఓ తెలిపారు. దరఖాస్తు సమయంలో సమర్పించిన సర్టిఫికెట్లు రెండుసెట్లు గెజిటెడ్ అధికారి ధ్రువీకరణతో పాటు ఆన్లైన్ దరఖాస్తు కాపీ తీసుకురావాలని సూచించారు. -
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా.. భారత్ పాస్పోర్టుతో 57 దేశాలకు..
విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా?.. అయితే ఎలాంటి వీసా లేకుండా కేవలం భారత పాస్పోర్టుతో 57 దేశాలకు వెళ్లిపోవచ్చు. తాజాగా లండన్‌కు చెందిన హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకుల్లో భారత్ 80వ స్థానంలో నిలిచింది. మనతోపాటు సెనెగల్, టోగోలకు కూడా 80వ ర్యాంక్ లభించింది. సాక్షి, అమరావతి: గత ఐదేళ్లుగా భారత్ ర్యాంకు మెరుగుపడుతుండటం విశేషం. 2022లో భారత్ 87వ స్థానంలో నిలిచింది. కాగా ఈ ఏడాది అగ్రస్థానంలో సింగపూర్ నిలిచింది. ఈ దేశానికి చెందిన పాస్పోర్టుతో 192 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. ఈ క్రమంలో సింగపూర్ గతేడాది ర్యాంకుల్లో ముందున్న జపాన్ను అధిగమించింది. ఇక జర్మనీ, ఇటలీ, స్పెయిన్లు రెండో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో వీసా లేకుండా 190 దేశాలకు వెళ్లొచ్చు. జపాన్, ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, లక్సెంబర్గ్, దక్షిణ కొరియా, స్వీడన్ మూడో స్థానం దక్కించుకున్నాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 189 దేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బ్రిటన్ నాలుగో స్థానాన్ని కైవసం చేసుకుంది. వీసా లేకుండా వెళ్లగలిగే దేశాలు బార్బడోస్, భూటాన్, బొలీవియా, బ్రిటిష్ వర్జిన్ దీవులు, బురుండి, కంబోడియా, కుకు దీవులు, కేప్ వెర్డే దీవులు, కొమొరో దీవులు, జిబౌటి, డొమినికా, ఎల్ సాల్వడార్, ఫిజీ, గబాన్, గ్రెనడా, గినియా–బిస్సావు, హైతీ, ఇండోనేషియా, ఇరాన్, జమైకా, జోర్డాన్, కజకిస్థాన్, లావోస్, మకావు, మడగాస్కర్, మాల్దీవులు, మార్షల్ దీవులు, మౌరిటానియా, మారిషస్, మైక్రోనేషియా, మోంట్సెరాట్, మొజాంబిక్, మయన్మార్, నేపాల్, నియు, ఒమన్, పలావు దీవులు, ఖతార్, రువాండా, సమోవా, సెనెగల్, సీషెల్స్ దీవులు, సియర్రా లియోన్, సోమాలియా, శ్రీలంక, సెయింట్ కిట్స్ అండ్ నెవిస్, సెయింట్ లూసియా, సెయింట్ విన్సెంట్, టాంజానియా, థాయిలాండ్, తైమూర్–లెస్టే, టోగో, ట్రినిడాడ్ అండ్ టొబాగో, ట్యునీషియా, తువాలు, వనటు, జింబాబ్వే. ► దాదాపు పదేళ్ల క్రితం వరకు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న అమెరికా ఎనిమిదో స్థానానికి పడిపోయింది. ఈ మేరకు ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (ఐఏటీఏ) డేటా ఆధారంగా తాజాగా వీసా లేకుండా ప్రయాణించే దేశాలకు హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకులను ప్రకటించింది. చెత్త పాస్‌పోర్టు గల దేశాల్లో పాకిస్థాన్ హెన్లీ పాస్‌పోర్టు ఇండెక్స్ ర్యాంకింగ్స్‌లో పాకిస్థాన్ నాలుగో చెత్త పాస్‌పోర్ట్ కలిగిన దేశంగా నిలిచింది. పాక్ పాస్పోర్టుతో వీసా లేకుండా కేవలం 33 దేశాలకు వెళ్లడానికి మాత్రమే వీలుంది. ఇక ఆఫ్ఘనిస్థాన్, ఉత్తర కొరియా, పపువా న్యూ గినియా, తుర్కిమెనిస్థాన్ దేశాలకు జీరో ర్యాంక్ లభించింది. అంటే ఈ దేశాల ప్రజలు వీసా లేకుండా పాస్పోర్టుతో ఏ దేశంలోకి ప్రవేశించలేరు. ఇది కూడా చదవండి: గవర్నర్‌కు డీఎంకే ఫైల్స్–2 -
Gurdeep Kaur Chawla: ప్రధాని విదేశానికి వెళ్తే.. ఈమె ఉండాల్సిందే
దేశ నేతలు ఇతర దేశాల నేతలతో సరిగా మాట్లాడాలి. వారు చెప్పేది సరిగా వినాలి. దౌత్య సంబంధాలు సఫలం కావాలంటే సంభాషణే కీలకం. కాని అన్ని భాషలు అందరు నేతలకూ రావాలని లేదు. అందుకే దుబాసీలను ఎంచుకుంటారు. ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల్లో తరచు కనిపిస్తున్న దుబాసి గుర్దీప్ కౌర్ చావ్లా. ఇటీవల మోదీ అమెరికా పర్యటనలో ఆమె కీలక పాత్ర పోషించింది. అది వేదిక మీద ఎవరో ఒక నాయకుడు చేస్తున్న రాజకీయ ప్రసంగాన్ని అనువాదం చేయడం కాదు. లేదా ఒక కథనో వ్యాసాన్నో అనువాదం చేయడం కాదు. అగ్రనేతలు చర్చలు చేసుకుంటున్నప్పుడు ఆ సంభాషణను అనువాదం చేయడం. దుబాసీగా ఉండటం. ‘ఆ పని చాలా కష్టం’ అంటారు గుర్దీప్ కౌర్ చావ్లా. అమెరికాలో స్థిరపడిన ఈ పంజాబీ భారతీయురాలు గత 26 ఏళ్లుగా దౌత్యరంగంలో దుబాసీగా సేవను అందిస్తున్నారు. ‘డిప్లమాటిక్ ఇంటర్ప్రెటర్’గా అంతర్జాతీయ గుర్తింపు పొందారు గుర్దీప్ కౌర్. So good to see Gurdeep Kaur Chawla (interpreter) at the historic meeting between President Biden and Prime Minister Modi. Gurdeep is simply brilliant!#Politics #India #Historic pic.twitter.com/DuelcjJNUB — Dr. Jagdish N. Sheth (@JagSheth) June 27, 2023 ఢిల్లీలో చదువుకుని గుర్దీప్ కౌర్ ఢిల్లీలో ఎం.ఏ. ఇంగ్లిష్ చదవి, ఆ తర్వాత పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ చేసి, పీహెచ్డీ చేశాక పార్లమెంట్లో అనువాదకురాలిగా కెరీర్‌ను ప్రారంభించారు. ఇంగ్లిష్, హిందీ, పంజాబీ, ఉర్దూ భాషల్లో గొప్ప ప్రవేశం ఉండటంతో దుబాసీగా ఆమె సేవలను పార్లమెంట్ భవన్ ఉపయోగించుకునేది. అయితే భర్త ఉద్యోగరీత్యా 1996లో అమెరికా వెళ్లిన గుర్దీప్ అక్కడ కూడా దౌత్యపరమైన దుబాసీగా కావాల్సిన అనుభవం కోసం ‘జ్యుడిషియల్ కౌన్సిల్ ఆఫ్ కాలిఫోర్నియా’లో పని చేశారు. ‘దౌత్యరంగానికి అవసరమైన మేలిమి ఇంటర్ప్రెటర్ల కొరతను ఆ రోజుల్లోనే నేను గమనించాను. అలాంటివారిని తయారు చేయడానికి ‘ఇండియన్ లాంగ్వేజస్ సర్వీసెస్’ అనే సంస్థను స్థాపించి దుబాసీలను తయారు చేస్తున్నాను. భారతీయ నేతల కోసమే కాదు ప్రపంచ నేతల కోసం కూడా అరబిక్, స్పానిష్, చైనీస్ తదితర భాషలలో నిపుణులైన దుబాసీలను మేము ఏర్పాటు చేస్తాం’ అంటారు గుర్దీప్ కౌర్. We are proud of Pacific Council member Dr. Gurdeep Kaur Chawla, who is interpreting bilateral talks during the #ASEAN summit in #Singapore. pic.twitter.com/PqyFBbRYP4 — Pacific Council (@PacCouncil) November 15, 2018 ప్రధానులకు దుబాసీ అమెరికా పర్యటనకు వచ్చే భారతీయ ప్రధానులకు గుర్దీప్ దుబాసీగా పని చేసి ప్రశంసలు అందుకున్నారు. వి.పి.సింగ్, చంద్రశేఖర్, పి.వి.నరసింహారావు, వాజ్‌పేయి, గుజ్రాల్, మన్మోహన్ సింగ్ వీరందరూ అమెరికా వచ్చినప్పుడు వారి అధికారిక దుబాసీగా గుర్దీప్ పని చేశారు. ఇప్పుడు నరేంద్ర మోదీ కోసం పని చేస్తున్నారు. అయితే ట్రంప్ హయాంలో మోదీ అమెరికా వచ్చినప్పుడు ట్రంప్‌కు కూడా దుబాసీగా గుర్దీప్ పని చేశారు. అంటే ట్రంప్ మాట్లాడేది హిందీలో అనువాదం చేసి మోదీకి తెలిపారు. ఒబామాకు కూడా గుర్దీప్ పని చేశారు. సవాళ్లతో నిండిన పని ‘అగ్రనేతలు పాల్గొనే దౌత్య సంబంధ సమావేశాలలో దుబాసీగా పని చేయడం చాలా సవాలు. నేతలు మాట్లాడేది ఒక మాట తక్కువ కాకూడదు ఒక మాట ఎక్కువ కాకూడదు. ముఖ్యంగా మన భావాలు, పెడర్థాలు కలపకూడదు. నేను ఒక నేతకు దుబాసీగా పని చేయాలని అనుకున్న వెంటనే ఆ నేత వాడే పదసముదాయం, ఉచ్చారణ, యాస, వ్యక్తీకరణ మొత్తం స్టడీ చేస్తాను. రెండు దేశాల మధ్య ఉండే దౌత్య పరమైన సంబంధాల అవగాహన ఉండాలి. ఇరుదేశాల మధ్య వాణిజ్యం, సాంస్కృతిక అంతరం, అధికారిక సంబంధాల మధ్య ఉండే సవాళ్లు... వీటన్నింటిని తెలుసుకుని ఆ అగ్రనేత ఏం మాట్లాడబోతాడో ఊహించి సిద్ధంగా ఉండాలి. ఇంత హోమ్‌వర్క్ లేకపోతే తక్షణ అనువాదం సాధ్యం కాదు’ అంటుంది గుర్దీప్ కౌర్. ఐక్యరాజ్యసమితి, ఐ.ఎం.ఎఫ్, వరల్డ్ బ్యాంక్, యూ.ఎస్. ఇండియా బిజినెస్ కౌన్సిల్, డబ్లు్య.హెచ్.ఓ తదితర సంస్థలకు గుర్దీప్ కౌర్ వ్యక్తిగతంగా తన సంస్థ తరఫున సేవలు అందిస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇరు దేశాలు ఏవైనా మాట్లాడుకోవాలంటే గుర్దీప్ కౌర్ సేవలు తప్పనిసరి అనే స్థితిలో ఆమె తన సేవలను విస్తరించారు. భాష తెలియడం వల్ల వచ్చిన విజయం ఇది. భాషల మీద పట్టు సాధించి ఇటువైపు కెరీర్ మలుచుకోవాలనుకునేవారికి గుర్దీప్ గొప్ప స్ఫూర్తి. Super proud of our colleague, Dr Gurdeep Kaur Chawla @ Imagindia Institute - she is sitting to the right of US Secy State Pompeo, as he meets Prime Minister Modi today morning in Delhi. pic.twitter.com/lCLz1DcLCa — Imagindia (@Imagindia) June 26, 2019 -
విదేశీ గడ్డపై స్వదేశాన్ని విమర్శించడం తగదు: అమిత్ షా
పటన్: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సమయంలో దేశాన్ని విమర్శించడం, అంతర్గత రాజకీయాలను గురించి మాట్లాడటాన్ని హోం మంత్రి అమిత్ షా తప్పుపట్టారు. ఇటువంటి వాటిపై రాహుల్ తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని, దేశ ప్రజలు గమనిస్తున్నారని తెలుసుకోవాలని హితవు పలికారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం 9 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గుజరాత్‌లోని పటన్ జిల్లా సిద్ధ్‌పూర్‌లో శనివారం జరిగిన ర్యాలీలో అమిత్ షా ప్రసంగించారు. ‘దేశభక్తి ఉన్న ఎవరైనా భారత రాజకీయాల గురించి భారత్‌లోనే మాట్లాడాలి. ఏ రాజకీయ పార్టీ నేత అయినా సరే విదేశాల్లో ఉండగా దేశాన్ని విమర్శించడం, దేశ రాజకీయాలపై చర్చించడం సరికాదు. రాహుల్ బాబా.. దేశ ప్రజలు ఈ విషయాన్ని నిశితంగా గమనిస్తున్నారన్న విషయాన్ని గుర్తుంచుకోండి’అని ఆయన పేర్కొన్నారు. ‘వేసవి తీవ్రత నుంచి తప్పించుకునేందుకు రాహుల్ బాబా విదేశాలకు విహారయాత్రకు వెళ్తున్నారు. అక్కడున్న సమయంలోనూ దేశాన్ని విమర్శిస్తున్నారు. ఇది సరికాదన్న విషయాన్ని తన పూర్వీకుల నుంచి నేర్చుకోవాలని రాహుల్‌కు సలహా ఇస్తున్నా’అని అమిత్ షా వ్యాఖ్యానించారు. రాహుల్ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా మోదీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. మోదీ ప్రభుత్వ హయాంలో దేశంలో పెను మార్పులు చోటుచేసుకున్నా కాంగ్రెస్ మాత్రం భారత్ వ్యతిరేక వ్యాఖ్యలు ఆపలేదని విమర్శించారు. -
సమ్మర్లో ఫారిన్ షూటింగ్ అంటున్న స్టార్ హీరోలు
సమ్మర్లో కూల్‌గా ఉండే లొకేషన్స్‌ని ఎంచుకుని, వెకేషన్‌కి వెళుతుంటారు కొందరు స్టార్స్. కొందరిని షూటింగే చల్లని ప్రాంతాలకు తీసుకెళుతుంది. అలా ‘కేరాఫ్ ఫారిన్’ అంటూ షూటింగ్స్‌కి, వెకేషన్‌కి విదేశాలు వెళ్లిన స్టార్స్ గురించి తెలుసుకుందాం. ► రెండు వారాలుగా ఫారిన్లోనే ఉంటున్నారు ఇండియన్. హీరో కమల్‌హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్లో 1996లో వచ్చిన ‘ఇండియన్’ (‘భారతీయుడు’) సినిమాకు సీక్వెల్‌గా ‘ఇండియన్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల తైవాన్‌లో జరిగిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం సౌతాఫ్రికాలో జరుగుతోంది. కమల్‌పై ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు శంకర్. ఈ వారం కూడా ‘ఇండియన్ 2’ టీమ్ సౌతాఫ్రికాలోనే ఉంటుందని తెలిసింది. కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రకుల్‌ప్రీత్ సింగ్, బాబీ సింహా కీలక పాత్రలు చేస్తున్నారు. ► ఇటలీలో ఫైట్స్ చేశారు ప్రభాస్. ‘కేజీఎఫ్’ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగ ‘సలార్’ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత నెలలో ఇటలీ లొకేషన్స్‌లో జరిగింది. ముఖ్యంగా ప్రభాస్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. కాగా ‘సలార్’ సినిమా యూనిట్ మరోసారి ఫారిన్ వెళ్లనుందని సమాచారం. బుడాపెస్ట్ లొకేషన్స్‌లో ‘సలార్’ షూటింగ్‌ను ప్లాన్ చేశారు. శ్రుతీహాసన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రాన్ని విజయ్ కిరగందూర్ నిర్మిస్తున్నారు. ‘సలార్’ చిత్రం సెప్టెంబరు 28న విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘రాజా డీలక్స్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చిత్రీకరణలో ప్రభాస్ పాల్గొంటున్నారని తెలిసింది. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి కాగానే ‘సలార్’ కోసం ప్రభాస్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కుతారని ఫిల్మ్‌నగర్ సమాచారం. ► లండన్‌లో ప్రేమ పాఠాలు నేర్చుకుంటున్నారు శర్వానంద్. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో శర్వానంద్, కృతీ శెట్టి జంటగా ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్‌లో ప్రారంభమైన ఈ సినిమా షూటింగ్ ఇంకా కొనసాగుతోంది. గత వారం శర్వానంద్, కృతీపై కీలక సన్నివేశాలు, ఓ పాట చిత్రీకరించారు. ► బాలీవుడ్ ‘బడే మియా చోటే మియా’ లండన్‌కు షిఫ్ట్ అయ్యారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వంలోరూపొందుతున్న సినిమా ‘బడే మియా చోటే మియా’. ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను స్కాట్లాండ్లో చిత్రీకరించారు. అట్నుంచి అటు లండన్ వెళ్లారు. మరో పది రోజులపాటు లండన్ షెడ్యూల్ జరుగుతుందట. అలాగే మరో బాలీవుడ్ మూవీ ‘యానిమల్’ షూటింగ్ కూడా లండన్‌లో జరిగింది. ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణ్‌బీర్ కపూర్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మికా మందన్నా హీరోయిన్.ఈ చిత్రాలతో పాటు మరికొన్ని చిత్రాలు ఫారిన్ లొకేషన్స్‌లో షూటింగ్స్‌ను ప్లాన్ చేశాయి. -
ట్రావెల్ నౌ, పే లేటర్..ఎగిరిపోతే ఎంత బావుంటుంది: ప్రతి నెలా బిలియన్ డాలర్లు
న్యూఢిల్లీ: భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం భారీగా ఖర్చు చేస్తున్నారు. ప్రతి నెలా బిలియన్ డాలర్లను (రూ.8,200 కోట్లు) ఇందు కోసం వెచ్చిస్తున్నట్టు ఆర్బీఐ అవుట్‌వర్డ్ రెమిటెన్స్ డేటా స్పష్టం చేస్తోంది. కరోనా ముందు నాటితో పోలిస్తే ఇది ఎంతో అధికం కావడం గమనార్హం. 2022-23 ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు తొమ్మిది నెలల్లో లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద వ్యక్తులు ప్రయాణాల కోసం 9.95 బిలియన్ డాలర్లను ఖర్చు చేశారు. అంతక్రితం ఏడాది ఇదే తొమ్మిది నెలల్లో ఇలా వెచ్చించిన మొత్తం 4.16 బిలియన్ డాలర్లుగానే ఉంది. ఇక కరోనా ముందు 2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో విదేశీ ప్రయాణాల కోసం చేసిన అవుట్‌వర్డ్ రెమిటెన్స్‌లు 5.4 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇక 2021-22 పూర్తి ఆర్థిక సంవత్సరంలో అవుట్‌వర్డ్ రెమిటెన్స్‌లు 7 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇప్పుడు ప్రయాణించి.. తర్వాత చెల్లించు ‘‘భారతీయులు వారి కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలసి వియత్నాం, థాయిలాండ్, యూరప్, దుబాయ్, బాలి తదితర ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు’’అని వీ3ఆన్లైన్ పార్ట్నర్ సపన్ గుప్తా తెలిపారు. ప్రయాణ చార్జీలు అందుబాటులో ఉండడంతో పరిశ్రమ పెద్ద బూమ్‌ను చూస్తున్నట్టు సంకాష్ సహ వ్యవస్థాపకుడు ఆకాశ్ దహియా పేర్కొన్నారు. ‘‘మా కస్టమర్లలో 5 శాతం మంది అంతర్జాతీయ ప్రయాణాలను ఎంపిక చేసుకుంటున్నారు. యూరప్, బాలి, వియత్నాం, దుబాయి ప్రాంతాలకు భారతీయుల నుంచి డిమాండ్ ఉంది’’అని చెప్పారు. ‘ఇప్పుడు ప్రయాణించు-తర్వాత చెల్లించు’ అనే కాన్సెప్ట్‌కు పర్యాటకులు ఆకర్షితులవుతున్నట్టు దహియా తెలిపారు. నెలవారీ చెల్లింపులపైనా విదేశాలను చూసి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
వామ్మో.. భారతీయులు ప్రయాణాలపై నెలకు ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా!
ప్రజలు తీరిక సమయాల్లో విహారయాత్రకు ప్లాన్ చేసుకుని పర్యాటక ప్రాంతాలలో తిరుగుతూ ఉంటారు. తమకు ఇష్టమైన ప్రదేశానికి వెళ్లి చిల్ అవుతూ అందులో ఉన్న మజాని ఆశ్వాదిస్తూ ఉంటారు. ఈ క్రమంలో మనదేశంలో ఉన్న పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలలో కూడా చుట్టేసి వస్తుంటారు. ఇలా విదేశీ ట్రిప్‌ల కోసం భారతీయులు ప్రతి నెలా దాదాపు 1 బిలియన్ డాలర్లను ఖర్చు పెడుతున్నారు. ఈ ఖర్చు కోవిడ్‌కు ముందు ఉన్న స్థాయిల కంటే చాలా ఎక్కువ అని రిజర్వ్ బ్యాంక్ విదేశీ చెల్లింపులపై డేటా వెల్లడించింది. 2022-23 ఏప్రిల్-డిసెంబర్ కాలంలో ప్రయాణాల కోసం లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (LRS) ద్వారా భారతీయులు జరిపిన చెల్లింపులు 9.95 బిలియన్ డాలర్లుగా ఉంది. RBI డేటా ప్రకారం, 2021-22లో ప్రయాణానికి సంబంధించిన ఖర్చు 4.16 బిలియన్ డాలర్లు కాగా, 2019-20కి ముందు కోవిడ్ సంవత్సరంలో 5.4 బిలియన్ డాలర్లుగా ఉంది. భారతీయులు తమ కుటుంబాలు లేదా స్నేహితులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ట్రిప్‌లకు వెళ్తుంటారు. వియత్నాం, థాయిలాండ్, యూరప్, బాలి భారతీయులు ఇష్టపడే కొన్ని ప్రధాన గమ్యస్థానాలుగా చెప్పచ్చు. యూరప్, ఇండోనేషియా, వియత్నాం, థాయిలాండ్, దుబాయ్ కూడా ఆ జాబితాలో ఉన్నాయి. సరసమైన ప్రయాణాల పెరుగుదల, సాంకేతిక పురోగతితో, ట్రావెల్ పరిశ్రమ అంతర్జాతీయ గమ్యస్థానాలలో భారీగా వృద్ధి వైపు పరుగెడుతోంది. ముఖ్యంగా ఇప్పుడే ప్రయాణం చేసి తరువాత చెల్లించండి అనే విధానం టూరిస్టులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉండగా, వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి విదేశీ టూర్ ప్యాకేజీలపై టీసీఎస్ రేటును ప్రస్తుత 5 శాతం నుంచి 20 శాతానికి పెంచాలని కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన భారతీయుల విదేశీ ప్రయాణాలపై ప్రభావం చూపుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆర్బీఐ డేటా ప్రకారం, ప్రధానంగా కోవిడ్-19 వ్యాప్తి తరువాత పరిమితుల కారణంగా 2020-21లో బయటి ప్రయాణాలపై ఖర్చు 3.23 బిలియన్ డాలర్లకు పడిపోయింది. 2019-20, 2018-19లో ప్రయాణానికి సంబంధించిన బాహ్య చెల్లింపులు వరుసగా 6.95 బిలియన్ డాలర్లు, 4.8 బిలియన్ డాలర్లుగా ఉంది. చదవండి పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే.. -
..పన్లో పని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా మీరే తీసేసుకోండి సార్!
..పన్లో పని విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా మీరే తీసేసుకోండి సార్! -
ఎయిర్‌పోర్టులో తారక్, మళ్లీ ఫ్యామిలీతో విదేశాలకు! నిరాశలో ప్యాన్స్
జూనియర్ ఎన్టీఆర్ సెట్లో ఎప్పుడెప్పుడు అడుగుపెడతాడా అని ఫ్యాన్స్ అంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది మార్చిలో ఆర్ఆర్ఆర్ మూవీతో అలరించిన తారక్ నెక్ట్స్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఎన్టీఆర్ 30వ చిత్రంగా తెరకెక్కబోయే ఈ సినిమాను ప్రకటించి నెలలు గుడుస్తున్నా ఇప్పటికీ సెట్స్‌పై రాలేదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఏకంగా నాలుగేళ్లు కేటాయించిన తారక్ మూవీ విడుదల అనంతరం కాస్తా విరామం తీసుకున్నాడు. ఈ నేపథ్యంలో కుటుంబంతో కలిసి విదేశాలు చూట్టేస్తున్నాడు. ఇక రీసెంట్గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లో భాగంగా ఫ్యామిలీతో జపాన్ వెళ్లిన ఎన్టీఆర్ ఇటివలె ఇండియాకు తిరిగి వచ్చాడు. ఇక ఇప్పుడైన షూటింగ్ స్టార్ట్ చేస్తాడు అనుకుంటే మళ్లీ ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ ప్లాన్ చేశాడు. తాజాగా భార్య లక్ష్మి ప్రణతి, తనయులు అభయ్ రాం, భార్గవ్ రాంలతో ఎయిర్‌పోర్ట్‌లో దర్శనం ఇచ్చాడు. దాదాపు నెల రోజుల వరకు ఈ వెకేషన్లో ఉండనున్నాడని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో ఇప్పట్లో తారక్-కొరటాల మూవీ సెట్స్‌పైకి వచ్చేలా లేదంటూ ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఆర్ఆర్ఆర్ సినిమా అనంతరం భార్యతో కలిసి విదేశాలు చూట్టేసిన చరణ్ ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ వెంటనే శంకర్‌తో ఆర్సీ 15 మూవీ సెట్లో అడుగు పెట్టడమే కాకుండా తన మరో ప్రాజెక్ట్‌ను కూడా లైన్లో పెట్టాడు. కానీ తారక్ మాత్రం కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో చిత్రాలు ప్రకటించిన ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్స్ సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రావడం లేదు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడా? అని నందమూరి అభిమానులంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: కాంతారపై సంచలన వ్యాఖ్యలు, కేసు నమోదు.. నటుడికి షాకిచ్చిన కోర్టు హీరోయిన్గా పరిచయం కాబోతున్న అజిత్ రీల్ కూతురు బేబీ అనిఖా -
ఐదేళ్లలో 36 సార్లు విదేశీ పర్యటనకు ప్రధాని మోదీ.. ఖర్చు ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు సందర్భాల్లో విదేశాల్లో అధికారిక పర్యటనలు చేపట్టారు. తాజాగా గడిచిన ఐదేళ్లలో ప్రధాని మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను పార్లమెంట్లో వెల్లడించింది కేంద్ర ప్రభుత్వం. ప్రధాని మోదీ విదేశీ పర్యటనల ఖర్చు వివరాలను బహిర్గతం చేయాలని సీపీఎం ఎంపీ ఎలమారమ్ కరీమ్ అడిగిన ప్రశ్నకు.. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీ మురళీధరన్ రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు. గత ఐదేళ్లలో ప్రధాని విదేశీ పర్యటనల కోసం రూ.239 కోట్లుకుపైగా ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ‘అంతర్జాతీయంగా వివిధ దేశాలతో సన్నిహత సంబంధాలను పెంపొందించుకోవటం, స్థానిక, అంతర్జాతీయ స్థాయిలో భారత కార్యకలాపాలను విస్తరించటమే ప్రధాని విదేశీ పర్యటనల లక్ష్యం. దేశ ప్రయోజనాలతో పాటు విదేశాఘ విధాన లక్ష్యాలను చేరుకునేందుకు ఈ పర్యటనలు ఎంతో ముఖ్యం.’ అని పేర్కొన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్. మోదీ విదేశీ పర్యటన వివరాలు.. ► ఇటీవల జీ20 సమ్మిట్ కోసం పీఎం మోదీ ఇండోనేసియాకు వెళ్లారు. దాని ఖర్చు రూ.32,09,760గా కేంద్ర మంత్రి వెల్లడించారు. అంతకు ముందు సెప్టెంబర్ 26-28 మధ్య జపాన్ పర్యటనకు వెళ్లగా అప్పడు రూ.23,86,536 అయింది. ► 2022 తొలినాళ్లలో యూరప్ పర్యటనకు రూ.2,15,61,304, 2019 సెప్టెంబర్ 21-28 మధ్య అమెరికా వెళ్లగా రూ.23,27,09,000 అయింది. ► గడిచిన ఐదేళ్లలో 36 విదేశీ పర్యటనలు చేయగా అందులో 31 పర్యటనలకు బడ్జెట్ నుంచి కేంద్రం ఖర్చు చేసింది. ► 2017లో తొలుత ఫిలిప్పైన్స్‌లో పర్యటించారు. 2021లో బంగ్లాదేశ్, అమెరికా, బ్రిటన్, ఇటలీకి వెళ్లారు. మొత్తంగా ఐదేళ్లలో రూ.239 కోట్లు ఖర్చు కాగా.. అందులో అమెరికా వెళ్లినప్పుడు అత్యధికంగా రూ.23 కోట్లు ఖర్చు అయింది. ఇదీ చదవండి: సోనియాకు ప్రధాని మోదీ జన్మదిన శుభాకాంక్షలు -
Pooja Hegde: మేడం సార్.. మేడం అంతే!
సాధారణంగా హీరో హీరోయిన్లకు సమ్మర్ వెకేషన్‌గా మారుతుంది. అయితే అందుకు భిన్నంగా ఇప్పుడు మన అందాల భామలు వానాకాలంలో ఫారిన్ ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అగ్రనటి నయనతార పెళ్లికి ముందు తన ప్రేమికుడు విఘ్నేష్ శివన్‌తో కలిసి తరచూ విదేశాలను చుట్టి వచ్చే వారు. తాజాగా నటి ఐశ్వర్య రాజేష్, పూజా హెగ్డే వంటి వాళ్లు విదేశాల్లో విహారయాత్ర చేస్తూ ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తున్నారు. ఇక పూజా హెగ్డే విషయానికి వస్తే టాలీవుడ్లో అత్యధిక డిమాండ్ చేస్తున్న టాప్ హీరోయిన్గా వెలిగిపోతోంది. ఈ అమ్మడు ఇటీవల తెలుగులో నటించిన రాధేశ్యామ్ చిత్రం నిరాశపరిచినా తగ్గేదేలే అంటూ అవకాశాలను దక్కించుకుంటోంది. 2010లో మోడలింగ్ రంగంలోకి ఎంటర్ అయిన ఈ ఉత్తరాది భామ మిస్ యూనివర్స్ ఇండియా అందాల పోటీలో సెకండ్ రన్నర్‌గా నిలిచింది. ఆ తరువాత 2012లో ముఖముడి చిత్రం ద్వారా కోలీవుడ్‌కు కథానాయకిగా ఎంట్రీ ఇచ్చింది. అలా నటిగా దశాబ్ద కాలాన్ని పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఈ బ్యూటీ తాజాగా సినిమాలకు గ్యాప్ రావడంతో నెల రోజుల పాటు విహారయాత్రకు బయలుదేరింది. ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. విదేశాల్లో ఎంజాయ్ చేస్తున్న పూజా హెగ్డే తొలుత థాయ్‌ల్యాండ్‌కు వెళ్లి బ్యాంకాక్ లోని సుందరమైన ప్రదేశాలు చుట్టి వచ్చింది. తర్వాత ఇంగ్లాండ్‌కు వెళ్లింది. ఆపై అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఎంటర్ అయి తన సోదరి, కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేసింది. ప్రస్తుతం మాన్హట్టాన్ దీవుల్లో సందడి చేస్తోంది. ఆ గ్లామరస్ ఫొటోలను చూస్తూ యమా ఖుషి అవుతున్న నెటిజన్లు మేడం సార్.. మేడం అంతే అంటూ కామెంట్స్ స్తున్నారు. చదవండి: (Trisha-Vijay: విజయ్ ఎప్పుడూ ప్రత్యేకమే!) -
ప్రయాణ బీమా.. టూరుకు ధీమా!
అన్ని సమయాల్లోనూ బీమా రక్షణ ఉంటేనే నిశ్చింత. విదేశీ ప్రయాణం కూడా ఇందుకు మినహాయింపేమీ కాదు. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్‌ను అందరూ తీసుకోరు. కానీ, ప్రతి ప్రయాణికుడు తప్పకుండా తీసుకోవాల్సిన ప్లాన్ ఇది. ఊహించని అత్యవసర పరిస్థితుల్లో మనల్ని ఆదుకునే రక్షణ కవచంలా ఇది పనిచేస్తుంది. ట్రావెల్ ఇన్సూరెన్స్ అన్నది పూర్తి అధ్యయనం తర్వాతే తీసుకోవాలి. ఏదో ఒకటి తీసుకుంటే అవసరంలో ఆదుకోకపోవచ్చు. ఆదుకున్నా, సంపూర్ణంగా ఉండకపోవచ్చు. విదేశాలకు వెళుతున్న వారు, అసలు ఎటువంటి రిస్క్‌లను ఎదుర్కోవాల్సి వస్తుందో అవగాహన కలిగి ఉండాలి. ఆ రిస్క్‌లు అన్నింటికీ ప్లాన్‌లో కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వ్యక్తిగత ఆరోగ్య చరిత్రను నిజాయితీగా వెల్లడించాలి. ఈ అంశాల పరంగా జాగ్రత్తగా, నిజాయితీగా వ్యవహరించినప్పుడు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ ఎంతో ఉపయోగకరం అవుతుంది. ప్రయాణ సమయంలో లగేజీ పోవచ్చు. ప్రమాదం జరగొచ్చు. ఆస్పత్రిలో చేరాల్సి రావచ్చు. దాడికి గురికావచ్చు. ఏ రూపంలో రిస్క్ ఎదురవుతుందో ఊహించడం కష్టం. అందుకుని తీసుకునే ప్లాన్‌లో కవరేజీ సమగ్రంగా ఉండేలా జాగ్రత్త పడాలి. రిస్క్‌లకు కవరేజీ ఇచ్చేదే బీమా పాలసీ. రిస్క్‌లు అన్నవి తెలియకుండా వస్తాయి. కానీ, రిస్క్‌కు దారితీసే అంశాలపై ఎవరికైనా అవగాహన ఉంటుంది. ఈ రిస్క్ అంశాలనేవి పాలసీ దారఖాస్తు పత్రంలో వెల్లడించడం వల్ల, వీటికి కవరేజీ ఇస్తూ, ప్రీమియం సహేతుకంగా నిర్ణయించేందుకు బీమా సంస్థకు అవకాశం ఉంటుంది. కనుక వీటిని దాచకూడదు. ఇందులో ప్రధానమైనది ముందు నుంచి ఉన్న వ్యాధులు. మెడికల్ కవరేజీ ఉన్న ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్.. విదేశీ పర్యటన సమయంలో ఏదైనీ కారణంతో అత్యవసరంగా ప్రయాణికుడు ఆస్పత్రిలో చేరాల్సి వస్తే కవరేజీ ఇస్తుంది. ముందు నుంచి ఉన్న వ్యాధులను వెల్లడించలేదని అనుకుందాం. అప్పుడు ముందు నుంచి ఉన్న వ్యాధి వల్ల హాస్పిటల్లో చేరినట్టు వైద్యుడు నిర్ధారిస్తే కవరేజీ సమస్యాత్మకంగా మారొచ్చు. వైద్యుల నోట్ ఆధారంగా సదరు క్లెయిమ్‌ను బీమా కంపెనీ తిరస్కరిస్తుంది. అదే ముందస్తు వ్యాధులను (ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్/పీఈడీ) వెల్లడించి, వాటికి కూడా పాలసీలో కవరేజీ ఉంటే ఈ సమస్య ఎదురుకాదు. పీఈడీలను వెల్లడించడం వల్ల ప్రీమియం కొంచెం పెరుగుతుంది అంతే. పీఈడీని పాలసీలో చేర్చకపోతే వైద్య వ్యయాలు భారీగా ఉండే అభివృద్ధి చెందిన దేశాల్లో ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎవరైనా కానీ, తమకు అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యల గురించి అవగాహన కలిగి ఉంటారు. కానీ, వాటి కారణంగా ఆస్పత్రిలో చేరాల్సి వస్తుందని ఎవరికీ తెలియదు. అందుకే తెలిసిన వివరాలను పూర్తిగా వెల్లడించాల్సిందే. సాహస క్రీడలకూ ఇదే వర్తిస్తుంది. సాహస క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లేవారు వాటికి సంబంధించిన పాలసీలను ఎంపిక చేసుకోవాలి. 70 ఏళ్లకు పైన వయసులో విదేశాలకు వెళ్లొచ్చే వారు పెద్ద సంఖ్యలోనే ఉంటున్నారు. ఈ వయసులో ఉన్న వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ పరంగా పరిమితులు ఉన్నాయి. బీమా సంస్థలు 10,000–20,000 డాలర్లకే కవరేజీని పరిమితం చేస్తున్నాయి. వైద్య పరీక్షలు కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. కేవలం కొన్ని బీమా కంపెనీలే ఈ వయసు వారికి ట్రావెల్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తున్నాయి. టీపీఏ, నెట్వర్క్ ఆసుపత్రులు బీమా సంస్థలు స్వయంగా అందించే సేవలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ (టీపీఏ) రూపంలో అందించే సేవలకు కొంత వ్యత్యాసం ఉంటుంది. అందుకని పాలసీదారులు టీపీఏను ఎలా సంప్రదించాలన్నది ముందే తెలుసుకోవాలి. చికిత్స అవసరమైనప్పుడు ముందుగా సంప్రదించాల్సింది టీపీఏనే. క్లెయిమ్‌తోపాటు, బీమా సంస్థ అందించే సేవలకూ టీపీఏనే అనుసంధానకర్తగా ఉంటారు. టీపీఏ లేనప్పుడు నేరుగా బీమా కంపెనీలను సంప్రదించాలి. ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్లను ఆమోదించే నెట్వర్క్ హాస్పిటల్స్ పాత్ర కీలకం అని చెప్పుకోవాలి. విదేశానికి వెళ్లినప్పుడు వైద్య సాయం అవసరమైతే బీమా కార్డుతో నెట్వర్క్ ఆసుపత్రిని సంప్రదిస్తే చాలు. అయితే, అత్యవసరంగా వైద్యం కావాల్సి వస్తే నెట్వర్క్ హాస్పిటల్ ఎక్కడ ఉందో వెతుక్కుంటూ వెళ్లడం సాధ్యపడకపోవచ్చు. అయినా కానీ, దీనికి ప్రాధాన్యం ఎక్కువే. ఎందుకంటే నగదు చెల్లించాల్సిన అవసరం లేకుండా ఖరీదైన వైద్యం పొందొచ్చు. ముందుగా డబ్బులు చెల్లించి క్లెయిమ్‌కు దరఖాస్తు చేసుకోవడం కంటే, నగదు రహిత బీమా కవరేజీ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో చిన్న పాటి వైద్యం కోసం ఆస్పత్రిలో చేరాల్సి వచ్చినా బిల్లు 10,000–20,000 డాలర్లు అవుతోంది. కనుక ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకునే వారు ముందుగానే తగిన కసరత్తు చేయాల్సిన అవసరం ఉంది. ఆన్లైన్లో ఎన్నో వేదికలు ఈ విషయంలో తగిన సమాచారాన్ని అందిస్తున్నాయి. టీపీఏ సేవల తీరు, నెట్వర్క్ హాస్పిటల్స్ సమాచారం కూడా తెలుసుకోవచ్చు. ఊహించని అవరోధాలు.. ప్రయాణ సమయంలో ఎన్నో ఊహించని రిస్క్‌లు ఎదురవుతుంటాయి. అందుకని పాలసీ తీసుకోవడానికి ముందే అన్ని రిస్క్‌లను అధ్యయనం చేసి, ఎక్కువ వాటికి కవరేజీ ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. యుద్ధం, వాతావరణం, దాడుల వల్ల విదేశీ ట్రిప్‌కు ఆటంకాలు ఏర్పడవచ్చని భావిస్తే.. ఫ్లయిట్ రద్ధు అయితే ఎక్కువ పరిహారాన్ని ఇచ్చే ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాలి. ఫ్లయిట్ రద్ధయితే ఇచ్చే పరిహారం 5 లక్షల డాలర్ల ప్లాన్‌లో 1,000–2,000 డాలర్ల వరకు ఉంటుంది. ఒకవేళ విదేశాలకు వెళ్లిన తర్వాత పర్యటనను పొడిగించుకోవాలని భావిస్తే టీపీఏను ఎలక్ట్రానిక్ రూపంలో సంప్రదించాల్సి ఉంటుంది. అదనపు ప్రీమియం చెల్లించడం ద్వారా ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్లాన్ గడువును పొడిగించుకునేందుకు బీమా సంస్థలు అనుమతిస్తాయి. కొన్ని అనుకోని పరిణామాలు.. ఉదాహరణకు యుద్ధం, అంటువ్యాధులు తదితర పరిస్థితుల్లో బీమా సంస్థలే ఇన్సూరెన్స్ ప్లాన్‌ను ఏడు రోజుల వరకు ఆటోమేటిక్‌గా పొడిగిస్తుంటాయి. ప్రయాణంలో సొంతంగా కారు నడపేది ఉంటే, అప్పుడు తీసుకునే ట్రావెల్ ప్లాన్ థర్డ్ పార్టీ లయబిలిటీతో ఉండేలా జాగ్రత్త పడాలి. బ్యాగేజీకి కూడా కవరేజీ ఉంటుంది. ప్రయాణించే సమయంలోనే కాకుండా, ట్రిప్ మొత్తంలో బ్యాగేజీకి ఈ కవరేజీ వర్తిస్తుంది. కాకపోతే బ్యాగేజీ రక్షణకు తనవైపు నుంచి తగినన్ని చర్యలు తీసుకున్నట్టు పాలసీదారు నిరూపించుకోవాలి. అప్పుడే పోయిన బ్యాగేజీకి నష్ట పరిహారాన్ని అందుకోగలరు. అందుకని ప్లాన్ తీసుకునే వారు తప్పనిసరిగా నియమ, నిబంధనలతో కూడిన డాక్యుమెంట్‌ను చదవాలి. అప్పుడే వేటికి కవరేజీ లభిస్తుంది, పరిమితులు ఏవైనా ఉన్నాయా? షరతుల గురించి పూర్తిగా తెలుసుకోవచ్చు. -
పతి.. సతి.. ఒక పాస్‌పోర్ట్!
ముంబై: ప్రియురాలితో ఫారిన్ టూర్‌కు వెళ్లి వచ్చిన ఓ వ్యక్తి ఆ విషయం భార్యకు తెలియకుండా చేయాలనే ప్రయత్నంలో చేసిన పొరపాటుతో కటకటాలపాలయ్యాడు. పుణెకి చెందిన సందర్శి యాదవ్(32) ఓ బహుళ జాతి సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. ఆఫీసు పని మీద ఫారిన్ వెళ్లున్నట్లు భార్యను నమ్మించి, ప్రియురాలితో కలిసి మాల్దీవులకు చెక్కేశాడు. ఆ సమయంలో భార్యకు వాట్సాప్ ద్వారా మాత్రమే ఫోన్ చేశాడు. టూర్ విషయం భార్యకు తెలియరాదనే ఉద్దేశంతో పాస్‌పోర్టులోని మాల్దీవుల టూర్ వీసా స్టాంప్ పేజీలను చించేశాడు. గురువారం రాత్రి ముంబైకి వచ్చాక ఇమిగ్రేషన్ అధికారుల తనిఖీల్లో అతడి నిర్వాకం బయటపడింది. పాస్‌పోర్టు పత్రాలను చించివేయడం నేరమనే విషయం తనకు తెలీదని ఒప్పుకున్నాడు. ముంబై పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. చదవండి: (ఆమ్నెస్టీపై ఈడీ మనీ ల్యాండరింగ్ కేసు) -
టూర్లకు డిమాండ్.. హైదరాబాద్ నుంచి పారిస్, లండన్, స్విట్జర్లాండ్‌కు
సాక్షి, హైదరాబాద్: వేసవి టూర్లకు డిమాండ్ పెరిగింది. సాధారణంగా వేసవి సెలవుల్లో దుబాయ్, శ్రీలంక, థాయ్‌లాండ్ వంటి దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపే నగరవాసులు ఈ ఏడాది యూరప్‌కు ఎక్కువగా తరలి వెళ్తున్నారు. గత రెండు నెలలుగా హైదరాబాద్ నుంచి యూరప్ దేశాలకు వెళ్తున్న పర్యాటకుల సంఖ్య పెరిగినట్లు పర్యాటక సంస్థల నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. రెండేళ్లుగా కోవిడ్ కారణంగా నిలిచిపోయిన అంతర్జాతీయ రాకపోకలు ఈ సారి గణనీయంగా పెరిగాయి. హైదరాబాద్ నుంచి పలు దేశాలకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో నగరవాసులకు ఊరట లభించింది. వివిధ దేశాలకు వెళ్లే పర్యాటకుల రద్దీ పెరగడంతో టూర్ ఆపరేటర్లు, పర్యాటకసంస్థలు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్ నుంచి లండన్‌కు వెళ్తున్న పర్యాటకులు అక్కడి నుంచి పారిస్, స్విట్జర్లాండ్, వెనీస్, ఆస్ట్రియా, ఇటలీ, జర్మనీ, తదితర దేశాలను సందర్శిస్తున్నారు. ఒకే పాస్‌పోర్టుపైన ఎక్కువ దేశాల్లో పర్యటించేందుకు అవకాశం లభించడం వల్ల కూడా నగరవాసులు యూరప్‌కే ప్రాధాన్యతనిస్తున్నారు. అద్భుతమైన పర్యాటక నగరంగా పేరొందిన పారిస్‌కు ఈ ఏడాది అనూహ్యమైన డిమాండ్ ఉన్నట్లు టూర్ ఆపరేట్లు చెబుతున్నారు. మరోవైపు ఇటలీలోని పురాతన నగరాలు, చారిత్రక కట్టడాలను సందర్శించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ‘పర్యాటకుల డిమాండ్ పెరగడంతో వీసాలు లభించడం కూడా కష్టంగా మారింది. కనీసం నెల రోజులు ముందే స్లాట్ బుక్ చేసుకొవలసి వస్తుంది.’ అని ప్రముఖ సంస్థకు చెందిన నిర్వాహకులు ఒకరు తెలిపారు. చదవండి: Photo Feature: సినిమా చూపిస్త మామా! చార్జీలకు రెక్కలు... రెండేళ్ల నష్టాలను పూడ్చుకొనేందుకు ఎయిర్‌లైన్స్ బారులు తీరాయి. కోవిడ్ నిబంధనల సడలింపుతో మొదట పరిమితంగా సర్వీసులను ఏర్పాటు చేసిన సంస్థలు క్రమంగా వివిధ ప్రాంతాల నుంచి విమాన సర్వీసులను పెంచాయి. ప్రయాణికుల రద్దీ పెరగడంతో విమాన చార్జీలకు సైతం రెక్కలొచ్చాయి. యూరప్ దేశాలకు సర్వీసులను నడుపుతున్న పలు ఎయిర్‌లైన్స్ 20 శాతం నుంచి 22 శాతం వరకు చార్జీలు పెంచాయి.అలాగే హోటళ్లు, స్థానిక రవాణా చార్జీలు కూడా కోవిడ్ అనంతరం పెరిగాయి. దీంతో నగరానికి చెందిన టూర్ ఆపరేటర్లు సైతం ప్యాకేజీ చార్జీలను అమాంతంగా పెంచారు. గతంలో రూ.60 వేల నుంచి రూ.70 వేల వరకు ప్యాకేజీ ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1.5 లక్షల వరకు పెరిగింది. కోవిడ్ అనంతరం అన్ని ధరలు పెరగడమే ఇందుకు కారణమని ప్రముఖ పర్యాటక సంస్థ నిర్వాహకులు అన్సారీ పేర్కొన్నారు. నకిలీ ఏజెంట్లను నమ్మొద్దు టూర్ ప్యాకేజీల ఎంపిక సమయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆన్లైన్లో కనిపించే ప్యాకేజీలను నమ్మరాదు. తెలిసిన సంస్థల వద్దకు స్వయంగా వెళ్లి అన్ని వివరాలు తెలుసుకొని సంతృప్తి చెందిన తరువాత మాత్రమే ప్యాకేజీలు బుక్ చేసుకోవాలి. – వాల్మీకి హరికిషన్, ప్రముఖ టూర్ ఆపరేటర్ -
Sakshi Cartoon: మోదీ విదేశీ పర్యటన
మోదీ విదేశీ పర్యటన -
2 నుంచి ప్రధాని మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్‌లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అవుతారు. -
58 దేశాలు, రూ. 517 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2015 నుండి ఇప్పటివరకూ మొత్తం 58 దేశాలను సందర్శించారు. ఈ మొత్తం వ్యయం 517 కోట్ల రూపాయలని మంగళవారం రాజ్యసభలో లేవనెత్తిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంలో కేంద్రం తెలిపింది. విపక్ష సభ్యుల కోరిక మేరకు మోదీ విదేశీ పర్యటనలు, ఖర్చుల వివరాలను కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ పార్లమెంటు ముందుంచారు. ప్రధాని మోదీ అత్యధికంగా అమెరికా, రష్యా, చైనా దేశాలను ఐదు సార్లు పర్యటించినట్లు మురళీధరన్ తెలిపారు. ప్రధానమంత్రి సందర్శించిన ఇతర దేశాలలో సింగపూర్, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ శ్రీలంక ఉన్నాయని చెప్పారు. దీంతోపాటు ఒకసారి చైనాలో పర్యటించారు. ఈ నెల ప్రారంభంలో థాయ్‌లాండ్‌ను కూడా మోదీ సందర్శించారు. అయితే కరోనా, ప్రపంచవ్యాప్త లాక్ డౌన్ నేపథ్యంలో ఈ ఏడాది మోదీ విదేశీ పర్యటనకు వెళ్లలేదని వివరించారు. చివరిగా గతేడాది నవంబర్‌లో బ్రిక్స్ సమ్మిట్‌లో పాల్గొనేందుకు బ్రెజిల్ వెళ్లినట్లు ఆయన చెప్పారు. వాణిజ్య, సాంకేతిక, రక్షణ, ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడానికి ఈ విదేశీ పర్యటనలు సహాయపడ్డాయన్నారు. తద్వారా ద్వైపాక్షిక, ప్రాంతీయ, ప్రపంచ సమస్యలపై భారతదేశ దృక్పథాలపై ఇతర దేశాలలో అవగాహనను పెంచిందని మురళీధరన్ చెప్పారు. (ఐరాసను సంస్కరించాల్సిన తరుణమిదే!) కాగా 2014 నుంచి డిసెంబర్ 2018 వరకు మోదీ విదేశీ పర్యటనలకు రూ. 2 వేల కోట్లకు పైగా ఖర్చు అయినట్లు 2018 డిసెంబర్లో కేంద్రం వెల్లడించిన సంగతి తెలిసిందే. అప్పటి విదేశాంగ శాఖ మంత్రి వికె సింగ్ ప్రకటించిన డేటా ప్రకారం జూన్ 15, 2014, డిసెంబర్ 2018 మధ్య కాలంలో ప్రధానమంత్రి విమానాల నిర్వహణ ఖర్చు 1,583.18 కోట్లు, చార్టర్డ్ విమానాల కోసం 429.25 కోట్లు ఖర్చు చేశారు. హాట్‌లైన్ వసతుల కోసం మొత్తం ఖర్చు 9.11 కోట్లుగా ప్రకటించారు. మోదీ విదేశీ పర్యటనలపై ప్రతిపక్ష పార్టీల విసుర్లు, ప్రధానంగా గత ఏడాది ఏప్రిల్, మే నెలల్లో జరిగిన జాతీయ ఎన్నికలకు ముందు, వ్యవసాయ రంగంలో సంక్షోభ సమయంలో విదేశీ పర్యటనలు అవసరమా అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధానిపై విమర్శలు గుప్పించారు. -
మోదీ విదేశీ పర్యటన ఖర్చులు దండగ
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరిపిన విదేశీ పర్యటనల వల్ల దేశ ప్రజలకు ఏం ఒరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్ర శ్నించారు. సరిహద్దుల్లో ఉన్న మిత్ర దేశాలు శత్రువులుగా మారడం తప్ప మోదీ పాలనలో సాధిం చిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన ‘అమరవీరులకు కాంగ్రెస్ సలాం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇటీవల చైనా సరిహ ద్దులో అసువులు బాసిన వీర జవాన్లకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. విదేశాంగ విధానాలను అమలు చేయడంలో మోదీ నేతృ త్వంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు. అసలు కేంద్రానికి స్పష్టమైన వైఖరి లేకుండా పోవడం దురదృష్టకరమన్నారు. కా ర్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొ న్నం ప్రభాకర్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ‘అమరవీరులకు కాంగ్రెస్ స లాం’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహం గా పాల్గొన్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, టీపీసీసీ నేతలు, డీసీసీ అధ్యక్షులు తమ తమ ని వాసాలు, వారి ప్రాంతాల్లో మౌనదీక్షలో పాల్గొని అమర జవాన్లకు నివాళి అర్పించారు. కాగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డితో కలసి దీక్ష చేశారు. -
కరోనా ఎఫెక్ట్ : ప్రధాని బ్రసెల్స్ పర్యటన రద్దు
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ పలు దేశాలకు వ్యాపించిన క్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ అధికారిక విదేశీ పర్యటన రద్దయింది. మార్చి 13న ఇండియా-ఈయూ సమ్మిట్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేపట్టాల్సిన బ్రసెల్స్ పర్యటన రద్దయింది. సభ్య దేశాలతో సంప్రదింపుల అనంతరం తదుపరి తేదీలను వెల్లడిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ గురువారం వెల్లడించారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ ఏడాది మార్చి 13న బ్రసెల్స్‌లోని ఈయూ కార్యాలయంలో ఇండియా-ఈయూ సదస్సు జరగాల్సి ఉంది. బ్రసెల్స్‌లో బుధవారం పది కరోనా వైరస్ కేసులు కొత్తగా వెలుగుచూడటంతో బెల్జియంలో కరోనా కేసుల సంఖ్య 23కు చేరుకుంది. ఈయూ, భారత్‌ల మధ్య సన్నిహిత సహకార బంధాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని, త్వరలోనే ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడుతుందని ఆశిస్తున్నామని రవీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా ప్రధాని మోదీ బంగ్లాదేశ్ పర్యటన షెడ్యూల్‌కు అనుగుణంగా జరుగుతుందని, మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. చదవండి : మోదీ విదేశీ పర్యటనల ఖర్చు ఎంతో తెలుసా? -
ఆ మూడు దేశాలకు ‘బాబోయ్ మేం రాబోమంటూ’ ..
సాక్షి, సిటీబ్యూరో: రూ.20 వేలుంటే చాలు ఎంచక్కా ఏ బ్యాంకాకో, సింగపూర్‌కో ఝామ్మంటూ వెళ్లిపోవచ్చు. హాయిగా ఆ దేశాల్లో విహరించి తిరిగి సిటీకి వచ్చేయొచ్చు. విదేశాలకు వెళ్లాలంటే ఇప్పుడు రూ.లక్షలు ఉండాల్సిన అవసరం లేదు. ప్రత్యేకించి మలేసియా, సింగపూర్, థాయ్‌లాండ్‌లకు కొద్దిపాటు చార్జీలతోనే వెళ్లిరావచ్చు. అంతేకాదు, కొన్ని ఎయిర్‌లెన్స్ ప్రయాణికులు చెల్లించిన చార్జీలపైన క్యాష్‌బ్యాక్ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి. పర్యాటకులను ఆకట్టుకొనేందుకు, విదేశీటూర్లకు తీసుకెళ్లేందుకు ట్రావెల్ ఏజెన్సీలు పడిగాపులు కాస్తున్నాయి. కానీ హైదరాబాద్ నగర పర్యాటకులు మాత్రం ముందుకు రావడం లేదు. ఆ మూడు దేశాలకు వెళ్లేందుకు ‘బాబోయ్ మేం రాబోమంటూ’ వెనుకడుగు వేస్తున్నారు. దీంతో అంతర్జాతీయ టూరిస్టు సంస్థలు సైతం ప్యాకేజీలను విరమించుకుంటున్నాయి. గత రెండు నెలలుగా ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రభావంతో హైదరాబాద్ నుంచి విదేశీ ప్రయాణాలు తగ్గుముఖం పట్టాయి. చైనా, హాంకాంగ్‌లకు రాకపోకలు పూర్తిగా స్తంభించిపోగా పర్యాటకులు ఎక్కువగా వెళ్లే మలేసియా, సింగపూర్, బ్యాంకాక్‌లకు మాత్రం చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఉద్యోగ, వ్యాపార అవసరాల దృష్ట్యా తప్పనిసరిగా వెళ్లవలసిన ప్రయాణికులు మినహా సాధారణ సందర్శకులు మాత్రం ససేమిరా అంటున్నారు. దీంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి సాధారణంగా ప్రతి రోజు సుమారు 10 వేల మందికి పైగా విదేశాలకు రాకపోకలు సాగిస్తుండగా ఇప్పుడు ఆ సంఖ్య 6000 నుంచి 7000 వరకు పడిపోయినట్లు అధికారవర్గాలు అంచనా వేస్తున్నాయి. చార్జీలు తగ్గుముఖం హైదరాబాద్ నుంచి పర్యాటకులు ఎక్కువగా వెళ్లే బ్యాంకాక్‌కు రాను, పోను చార్జీలు కలిపి గతంలో రూ.26000 నుంచి రూ.30,000 వరకు ఉంటే ఇప్పుడు సుమారు రూ.20 వేలయింది. ఒకప్పుడు హైదరాబాద్ నుంచి గోవాకు వెళ్లే పర్యాటకులు ఇప్పుడు బ్యాంకాక్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. పర్యాటక ప్రదేశాలు, అందమైన గార్డెన్లతో పాటు వినోదానికి అత్యధిక ప్రాధాన్యతనిచ్చే బ్యాంకాక్‌కు ఎక్కువ సంఖ్యలో వెళ్తారు. కానీ రెండు నెలల క్రితం చైనాలో మొదలైన కరోనా క్రమంగా పలు దేశాలకు విస్తరించడం, ప్రత్యేకించి ఎక్కువ దేశాల నుంచి పర్యాటకులు వచ్చే బ్యాంకాక్‌కు ప్రమాదం పొంచి ఉండడంతో నగరవాసులు బ్యాంకాక్ టూర్‌ను రద్దు చేసుకుంటున్నారు. ఉన్నపళంగా పర్యాటకుల సంఖ్య తగ్గిపోవడంతో థాయ్ ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఏసియా వంటి విమాన సంస్థలు చార్జీలను బాగా తగ్గించాయి. అంతేకాకుండా క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు బ్యాంకాక్‌తో పాటు ఎక్కువ మంది సింగపూర్, మలేసియాకు సైతం వెళ్తారు. అందమైన సింగపూర్‌ను తిలకించడం ఒక గొప్ప అనుభూతిగా భావిస్తారు. ఇప్పుడు ఈ రెండు దేశాలకు కూడా ప్రయాణాలు చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. దీంతో ఎయిర్‌లైన్స్ చార్జీలను తగ్గించాయి. సింగపూర్‌కు సైతం హైదరాబాద్ నుంచి వెళ్లి, తిరిగి చేరుకొనేందుకు ప్రస్తుత చార్జీ రూ.20 వేలే కావడం గమనార్హం. ప్రయాణీకుల రద్దీ, డిమాండ్ భారీగా ఉండే రోజుల్లో మలేషియా ట్రిప్పు రూ.35 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. ఇప్పుడు రూ.23 వేలకు తగ్గిపోయింది. అయినప్పటికీ నగరవాసులు అటు వైపు వెళ్లేందుకు సాహసించడం లేదు. వేచిచూస్తున్నారు.. ‘విదేశాలకు వెళ్లేందుకు ఎవరైనా ఆ సక్తి చూపుతారు. కానీ ఇప్పుడు చా లా మంది వేచి చూసే ధోరణిలో ఉన్నారు. కరోనా భయం ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది. దీంతో ప్యాకేజీలను ఏర్పాటు చేయలేకపోతున్నాం.’ అని ప్రముఖ అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీ ప్రతినిధి ఒకరు తెలిపారు. కోట్లాది రూపాయల ఆదాయం కోల్పోవలసి వస్తున్నప్పటికీ టూరిస్టుల విముఖత కారణంగా ఎలాంటి ప్యాకేజీలు ప్రకటించలేకపోతున్నట్లు పేర్కొన్నారు. ‘‘ఏడాదికి ఒకసారి బ్యాంకాక్‌కు వెళ్లడం అలవాటు.కానీ ఇప్పుడు ఆ దేశానికి వెళ్లాలంటే భయమేస్తుంది. ఎందుకంటే ఒకవైపు చైనాలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ ఆ దేశానికి చెందిన టూరిస్టులపైన థాయ్‌లాండ్æ ఎలాంటి నిషేధం విధించలేదు. దీంతో ఇతర దేశాలకు చెందిన పర్యాటకులు వెళ్లేందుకు సాహసించడం లేదు.’’ అని రమేష్ అనే పర్యాటకుడు తెలిపారు. ప్యాకేజీలు విరమించుకున్న ఐఆర్సీటీసీ హైదరాబాద్ నుంచి సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్‌లకు క్రమం తప్పకుండా ప్యాకేజీలను ప్రకటించే ఐఆర్సీటీసీ ఈ సారి ఎలాంటి ప్యాకేజీలను విడుదల చేయలేదు. సమ్మర్ టూర్లను వాయిదా వేసుకుంది. ఈ మూడు దేశాలకు బదులు త్వరలో యురోప్ టూర్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు ఐఆర్సీటీసీ డిఫ్యూటీ జనరల్ మేనేజర్ సంజీవయ్య తెలిపారు. -
ఎంపీల విదేశీ పర్యటనలపై చట్టం తేవాలి
న్యూఢిల్లీ: ఎంపీలు విదేశీ పర్యటనలు చేసినప్పుడు దానికి సంబంధించిన వివరాలతో పాటు ఖర్చుల వివరాలు తప్పనిసరిగా వెల్లడించేలా చట్టాన్ని తీసుకురావాలని బీజేపీ ఎంపీ కోరారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ రహస్య విదేశీ పర్యటనల నేపథ్యంలో ఆ పార్టీ లక్ష్యంగా ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రజా ప్రాతినిధ్య (సవరణ) బిల్లుకు సంబంధించిన ఓ ప్రైవేట్ మెంబర్స్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ‘విదేశీ ప్రభుత్వాలు, సంస్థల నుంచి స్వీకరించిన ఏ రకమైన ఆతిథ్యం అయినా సరే దాని వివరాలు రాజ్యసభ చైర్మన్‌కు గానీ, లోక్‌సభ స్పీకర్‌కు గానీ వెల్లడించాలి’అని బిల్లు తెలిపింది. కాగా, ఎంపీలు విదేశీ పర్యటనల వివరాలు తెలపాలని 2017లోనే మార్గదర్శకాలు జారీ అయ్యాయని, 2019 జూలైలోనూ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ దీన్ని పునరుద్ఘాటించిందని జీవీఎల్ పేర్కొన్నారు. -
మోదీ విడిది, స్నానం విమానాశ్రయంలోనే
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్రమోదీ చాలావరకు విదేశీ పర్యటనల ఖర్చు తగ్గించారని హోం మంత్రి అమిత్ షా వెల్లడించారు. ప్రధాని మోదీ విపరీతంగా ఖర్చు పెడుతున్నారన్న ప్రతిపక్షాల ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. నిన్న లోక్‌సభలో ఎస్పీజీ చట్ట సవరణ బిల్లుపై మాట్లాడిన సందర్భంలో అమిత్ షా ఈ విషయాన్ని ప్రస్తావించారు. విదేశీ పర్యటనలకు వెళ్లే సందర్భంలో విమానం ఆలస్యమైనా, సాంకేతిక ఇబ్బందులు ఎదురైనా మోదీ హోటళ్లలో ఉండేందుకు ఇష్టపడేవారు కాదన్నారు. గతంలో విదేశీ పర్యటనకు ఆటంకం ఏర్పడితే ప్రధాని సహా అధికారులు ఫైవ్ స్టార్ హోటళ్లలోనే బస చేసేవారు. దీనివల్ల ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోయేవి. కానీ మోదీ అందుకు విరుద్ధంగా ఫైవ్‌స్టార్ హోటళ్లలో బస చేయకూడదని నిర్ణయించుకున్నారు. లగ్జరీ హోటళ్లను ఆశ్రయించకుండా ఎయిర్‌పోర్టులోని టర్మినల్‌లోనే బస చేసి, అక్కడే స్నానం చేసేవారని చెప్పుకొచ్చారు. ‘వ్యక్తిగతంగా మోదీ చాలా నిబద్ధత గల వ్యక్తి. తను పర్యటనకు వెళ్లినప్పుడు 20 శాతం కన్నా తక్కువ సిబ్బందిని మాత్రమే తన వెంట తీసుకెళతారు. సాధారణంగా అధికారులు సమావేశాలకు వెళ్లినప్పుడు చాలామటుకు ప్రత్యేక కార్లలోనే ప్రయాణిస్తారు. కానీ మోదీ అందుకు భిన్నంగా కార్లలో ప్రయాణించడానికి సుముఖత చూపరు. బస్సులో లేదా ఏదైనా పెద్ద వాహనంలో వెళతారు. ఇలా చాలావరకు మోదీ విదేశీ ప్రయాణ ఖర్చులను తగ్గించేవారని అమిత్ షా పేర్కొన్నారు. -
మోదీ విదేశీ ప్రయాణ ఖర్చు వందల కోట్లా?
న్యూఢిల్లీ: గత మూడేళ్లలో ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ ప్రయాణాలకు ప్రత్యేక విమానాల కోసం రూ.255 కోట్లు వెచ్చించినట్లు ప్రభుత్వం తెలిపింది. గురువారం విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్ రాజ్యసభలో ఈ మేరకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2016–19 సంవత్సరాల మధ్య ప్రధాని చార్టెర్డ్ విమానాల ఖర్చు సుమారు రూ.255 కోట్లని వెల్లడించారు. 2019–20 ఆర్థిక సంవత్సరానికైన∙ఖర్చు అందాల్సి ఉందన్నారు. వీటితోపాటు 2016–18 సంవత్సరాల మధ్య ప్రధాని విదేశీ నేతలతో హాట్‌లైన్ సంభాషణలకైన ఖర్చు సుమారు రూ.3 కోట్లని తెలిపారు. నాలుగు నెలల వ్యవధిలో ప్రధాని మోదీ ఏడుసార్లు విదేశీయానం చేసి 9 దేశాలు చుట్టివచ్చినట్టు మురళీధరన్ విడుదల చేసిన వివరాల ప్రకారం తెలుస్తోంది. ఆగస్టు నుంచి నవంబవర్ వరకు.. భూటాన్, ఫ్రాన్స్, యూఏఈ, బహ్రెయిన్, రష్యా, అమెరికా, సౌదీ అరేబియా, థాయ్‌లాండ్, బ్రెజిల్ దేశాల్లో ప్రధాని మోదీ పర్యటించారు. సెప్టెంబర్‌లో అమెరికాలో జరిగిన హౌడీ మోదీ కార్యక్రమానికి భారత ప్రభుత్వం నిధులు సమకూర్చలేదని మంత్రి మురళీధరన్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన టెక్సస్ ఇండియా ఫోరంతో ఎటువంటి భాగస్వామ్యం లేదని స్పష్టం చేశారు. (చదవండి: మంత్రులపై ప్రధాని అసంతృప్తి) -
స్పీకర్ తమ్మినేని సీతారాం విదేశీ పర్యటన
సాక్షి, అమరావతి : విదేశీ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం ఉగాండాలో పర్యటించనున్నారు. ఈ నెల 24 నుంచి 7వ తేదీ వరకు ఆ దేశంలో జరిగే 64వ కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్‌కు స్పీకర్ హాజరుకానున్నారు. ఈ సమావేశంలో యువత, నిరుద్యోగిత, ప్రభుత్వ పాత్ర అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. ఆంధ్రప్రదేశ్ యువతకు ఉద్యోగాల కల్పన అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించనున్నారు. అనంతరం స్విట్జర్లాండ్, పారిస్‌లోనూ స్పీకర్ పర్యటించనున్నారు. -
రాష్ట్రపతి విమానానికి పాక్ అనుమతి నో
ఇస్లామాబాద్: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విమానం తమ గగనతలం మీదుగా వెళ్లేందుకు పాక్ అనుమతి నిరాకరించింది. గగనతలాన్ని వాడుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ భారత్ చేసిన విజ్ఞప్తిని తిరస్కరించినట్లు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి తెలిపారు. కశ్మీర్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై పాక్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. తమ గగనతలం మీదుగా భారత విమానాల రాకపోకలపై నిషేధం విధిస్తామని దాదాపు నెల క్రితమే పాక్ ప్రకటించినా ఈ విషయమై అధికారింగా ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు. తాజాగా, రాష్ట్రపతి కోవింద్ విమానానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిస్తూ.. ప్రముఖ వ్యక్తులు ప్రయాణించే విమానాలను ఏ దేశమైనా సాధారణంగా అనుమతిస్తుంది. పాక్ నిర్ణయాన్ని ఖండిస్తున్నాం’అని పేర్కొన్నారు. భారత రాష్ట్రపతి కోవింద్ సోమవారం నుంచి ఐస్లాండ్, స్విట్జర్లాండ్, స్లొవేనియా దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ఉగ్రవాదంతో దేశం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించనున్నారు. -
మోదీ తొలి అధికారిక పర్యటన ఖరారు
సాక్షి, న్యూఢిల్లీ : ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రిగా రెండోసారి ప్రమణా స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ తొలి అధికారిక విదేశీ పర్యటన ఖరారు అయింది. ఆయన జూన్ 7-8 తేదీల్లో దక్షిణాసియా దేశం మాల్దీవుల పర్యటనకు వెళ్లనున్నారు. కాగా జూన్ తొలివారంలో భారత ప్రధాని మాల్దీవుల రాజధాని మాలే రానున్నారని ఆ దేశ మీడియాలో కథనాలు వచ్చాయి. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంమే లక్ష్యంగా ఈ పర్యటన ఉంటుందని విదేశాంగ శాఖ అధికారులు చెబుతున్నారు. 2014లో తొలిసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం మోదీ భూటాన్‌లో పర్యటించారు. ఇప్పుడు ఆయన మాల్దీవులు వెళ్తున్నారు. 30వ తేదీ సాయంత్రం 7 గంటలకు దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. -
ప్రధాని విదేశీ పర్యటనలపై దాపరికమా?
విదేశీ యాత్రలకు వెళ్లండి. ఒప్పందాలపైన సంతకాలు చేయండి, మీతోపాటు అనేక మంది అధికారులను కూడా తీసుకు వెళ్లండి. వాణిజ్య ఒప్పందాలకోసం అవసరమైతే మన దేశంలో పారిశ్రామికవేత్తలను, పెద్ద వాణిజ్యసంస్థల ప్రతినిధులను కూడా తీసుకు వెళ్లండి. కావాలంటే ప్రత్యేక విమానాల్లో వెళ్లండి. పాలనకు అనుకూలమైన ఏ విధానాన్నయినా అనుసరించి విదేశీయాత్రలుచేసే అధికారం, అవసరం, అవకాశం ప్రధాన మంత్రికి, ఇతర మంత్రులకు ఉంది. అయితే మీ వెంట ఎవరు వచ్చారో, ఎందుకు వచ్చారో, వెళ్లి ఏం సాధించారో చెప్పండి. పరిపాలనలో పారదర్శకత అంటే మీరు చేసినవి చెప్పడం. అంతే. ఇందులో దాపరికం అవసరమైతే ఏ మేరకు అవసరమో కూడా చెప్పవలసి ఉంటుంది.పాలకులు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తారు. వారికి ఆ అధికారాన్ని ప్రజలే ఇస్తారు. ప్రజలపైన ప్రజల సొమ్ము పైన పెత్తనం ఇస్తున్నారు కనుకనే తమకు ఆ అధికారాన్ని ఇచ్చిన ప్రజలకు తాము చేసిన పనులేమిటో చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య సూత్రం. మన ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధికారం చేపట్టిన మొదటి రెండేళ్లలో అనేక పర్యటనలు చేపట్టారు. ఈ ప్రయాణాలకు మొత్తం రూ. 2,021లు ఖర్చయిందని విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ సాధికారికంగా వెల్లడించారు. చాలా సంతోషం. ప్రధాని సందర్శించిన పది ప్రముఖ దేశాల నుంచి మనకు బోలెడంత విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని కూడా మంత్రి గారు వివరించారు. 2017లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు 43,478 మిలియన్ల డాలర్లమేరకు వచ్చాయి. 2014లో 30,930 మిలియన్ డాలర్లు వచ్చాయి. 2009 నుంచి 2014 వరకు ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ యానాలకు రూ 1,346 కోట్లు ఖర్చుచేశారు. మోదీగారి విదేశీయాత్రా వ్యయంలో విమానాల నిర్వహణ ఖర్చు 1583 కోట్లు, ప్రత్యేక (చార్టర్డ్) విమానాలకు 429 కోట్లు, హాట్ లైన్ ఖర్చు 9.11 కోట్లు అని మంత్రి వివరించారు. 48 విదేశీ పర్యటనలు చేసిన ప్రధాని మోదీ మొత్తం 55 దేశాలను సందర్శించారు. కొన్ని దేశాలకు పదేపదే వెళ్లారు. అయితే ఈ లెక్కలో 2017 నుంచి ఇప్పటివరకు హాట్ లైన్ సౌకర్యాల ఖర్చు చేర్చలేదట. వీరి పర్యటనలన్నీ అధికారికమైనవి. వ్యక్తిగత పర్యటనలు కావు. కనుక ఈ పర్యటనల వివరాలను వ్యక్తిగత వివరాలు అనుకోవడానికి వీల్లేదు. ఆ కారణంగా ఈ సమాచారాన్ని ప్రజలకు నిరాకరించే వీలు కూడా లేదు. కేంద్ర సమాచార కమిషన్ ఎన్నో సందర్భాలలో తీర్పులిస్తూ దేశ ప్రముఖులు విదేశాలకు వెళ్లినప్పుడు, లేదా దేశంలోనే తిరిగినప్పుడు వాటిని ప్రభుత్వ శాఖలు ఏదో ఒక హెడ్ కింద జమ కట్టవలసి ఉంటుందనీ, కనుక ఐఏఎఫ్ ఎయిర్ క్రాఫ్ట్ ద్వారా వెళ్లిన ప్రయాణాలకు చెందిన విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు ఇవ్వాలని పేర్కొన్నది. కమోడర్ లోకేశ్ కె బత్ర, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారిని ప్రధాని విదేశాలకు ఐఏఎఫ్ వారు ఎంత ఖర్చులుపెట్టుకున్నారు అని అడిగారు. ఆ వివరాల్లో దాచడానికి ఏమీ లేదని కమిషన్ నిర్దేశించింది. ప్రధాని వెంట వెళ్లిన ఎస్పీజీ సభ్యుల పేర్లు తదితర వివరాలు అడగడం అనవసరం. వారి పేర్లు తెలుసుకోవడం అంతకన్నా అనవసరం. భద్రతకోసం తీసుకున్న చర్యలు వచ్చిన వారి వివరాలు తీసి వేసి, మిగిలిన సమాచారం ఇవ్వడంలో ఇబ్బందేమీ ఉండటానికి వీల్లేదని 2012లో సుభాష్ చంద్ర అగ్రవాల్ కేసులో సీఐసీ వివరించింది. నీరజ్ శర్మ ప్రధాని కార్యాలయం పీఐఓకు చేసుకున్న దరఖాస్తులో ప్రధాని వెంట వెళ్లిన ప్రయివేటు వ్యక్తుల పేర్లు చెప్పాలని కోరారు. సెక్యూరిటీ అంశాలతో సంబంధంలేని ప్రయివేటు వ్యక్తుల పేర్లు చెప్పడానికి ఏ ఇబ్బందీ ఉండే అవకాశం లేదని, కనుక 2014 నుంచి 2017 వరకు ప్రధాని వెంట విదేశాలకు వెళ్లిన ప్రయివేటు వ్యక్తుల సమాచారం ఇవ్వాలని సీఐసీ ఆదేశించింది.సమాచార హక్కు చట్టం కింద అడిగితే పౌరులకు అసంపూర్ణ సమాచారం అందింది. విశేషమేమంటే 2018 డిసెంబర్ 12న రాజ్యసభకు జవాబు ఇవ్వవలసిన విదేశీ మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు. ప్రధాని వెంట వచ్చిన మీడియా సభ్యుల పేర్లు మాత్రం ఇచ్చింది. కానీ అధికారులు, అనధికారుల పేర్లు ఇవ్వలేదు. అంతేకాదు ప్రధాని వెంట వెళ్లిన ఒక మంత్రి పేరు అడిగితే ప్రభుత్వం ఆ ప్రశ్నకు జవాబు రాయవలసిన చోట ఏమీ రాయకుండా వదిలేసింది. చాలా సెన్సిటివ్ సమాచారం కనుక ఇవ్వలేమన్నారు. ఖర్చులు, పత్రికల వారి వివరాలిచ్చి, వెంట వచ్చిన అధికార, అనధికారుల సంగతి చెప్పకపోవడం ఎంత అన్యాయం? వ్యాసకర్త: మాడభూషి శ్రీధర్, బెన్నెట్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మాజీ కేంద్ర సమాచార కమిషనర్ ఈ మెయిల్: madabhushi.sridhar@gmail.com -
ప్రధాని మోదీ విదేశీయానం ఖర్చు 2 వేల కోట్లు
న్యూఢిల్లీ: 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విదేశీయా నానికి రూ.2,021 కోట్లు ఖర్చయినట్లు ప్రభుత్వం తెలిపింది. విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ శుక్రవారం రాజ్యసభలో ఈ విషయం వెల్లడించారు. ఇప్పటి వరకు 48 విదేశీ పర్యటనల్లో 55 దేశాలను ప్రధాని సందర్శించారని వివరించారు. ప్రధాని పర్యటనల కారణంగా భారత్‌కు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు) గణనీయంగా పెరిగాయని తెలిపారు. 2014–18 సంవత్సరాల మధ్య ప్రధాని మోదీ పర్యటించిన దేశాల్లో ఎఫ్‌డీఐలు అత్యధికంగా వచ్చే మొదటి పది దేశాలు కూడా ఉన్నాయన్నారు. 2014లో 30,930.5 మిలియన్ డాలర్లుగా ఉన్న ఎఫ్‌డీఐలు పర్యటనల ఫలితంగా 2017 నాటికి 43,478.27 మిలియన్ డాలర్లకు చేరాయని తెలిపారు. యూపీఏ–2 హయాంలో ప్రధాని మన్మోహన్ సింగ్ విదేశీ పర్యటనల ఖర్చు 2009–14 సంవత్సరాల మధ్య రూ.1,346 కోట్లని వీకే సింగ్ పేర్కొన్నారు. -
రూటు మార్చిన టూరిస్ట్...!
డాలర్‌తో రూపాయి మారకం విలువ కనిష్టస్థాయికి పడిపోయింది... ఇక హాలిడే ట్రిప్‌లు, విదేశీ టూర్లు లేనట్టే... అని అనుకుంటున్నారా? అదేం లేదు రూపాయి దారి రూపాయిదే...ఫారిన్ టూర్ల దారి ఫారిన్ టూర్లదేనని భారతీయ టూరిస్టులంటున్నారు.రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా దిగజారినా ఇండియన్ల విదేశీ పర్యటనల జోరు ఏ మాత్రం తగ్గడంలేదు. అయితే అంతకు ముందు ఏదైనా ఫారిన్ ట్రిప్ అనగానే యూఎస్, యూకేతో పాటు వివిధ ఐరోపా దేశాల్లో వాలిపోయే వారు కాస్తా ఇప్పుడు పుకెట్, బాలి, సింగపూర్, ఇస్తాంబుల్... ఇంకా దక్షిణాఫ్రికా, తదితర దేశాల బాటపడుతున్నారు. అసలే ఇప్పుడు హాలిడే సీజన్ కావడంతో ఈ పర్యాటక ప్రాంతాలన్నీ భారత్‌తో పాటు ఇతర దేశాల టూరిస్ట్‌లతో కళకళలాడుతున్నాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ దిగజారినా అదే సమయంలో ప్రపంచంలోని కొన్ని దేశాల్లోనూ ఆర్థికసంక్షోభం కారణంగా కరెన్సీ విలువ పడిపోయింది. ఈ కారణంగా ఐరోపాతో సహా అమెరికా తదితర పాశ్చాత్య దేశాలకు బదులు టర్కీ, ఈజిప్ట్, దక్షిణాఫ్రికా వంటి దేశాలకు భారత టూరిస్ట్‌ల తాకిడి ఒక్కసారిగా పెరిగినట్టు వివిధ ట్రావెల్సంస్థలు వెల్లడించాయి. దాదాపు 15 నుంచి 20 శాతం మంది యూఎస్, యూకే, ఐరోపా దేశాల స్థానంలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌తో పాటు ఆసియాలోని వివిధ దేశాలను ఎంచుకుంటున్నారు. దాదాపు రెండునెలల్లోనే డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ రూ. 69.04 నుంచి గురువారం ( ఈనెల 12న)రూ.73.89కు ( 7 శాతానికి పైగా క్షీణత) చేరుకుంది. ఈ ట్రెండ్ ఇంకా కొనసాగే సూచనలే కనిపిస్తుండడంతో సింగపూర్,మలేషియా, థాయ్‌లాండ్, దుబాయ్, అబుదాబీ, హాంకాంగ్– మకావ్, వియత్నాం, కాంబోడియా ఫేవరేట్ టూరిస్ట్ ప్లేస్‌లుగా మారిపోయాయని ఈ సంస్థలు తెలిపాయి. వివిధ దేశాల కరెన్సీ విలువలో క్షీణతతో పాటు ఆయా దేశాల విమానచార్జీలు కూడా కొంత మేర తగ్గడం కూడా ఈ పర్యటనలు పెరగడానికి కారణమని అంచనా వేస్తున్నాయి. పుకెట్ ఫ్లయిట్ చార్జీలు 23 శాతం, కొలంబో విమానచార్జీ 6 శాతం మేర తగ్గడంతో ఈ దేశాలకు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నవారు పదిశాతం వరకు పెరిగినట్టుగా ఇక్సిగో ట్రావెల్సంస్థ సీఈఓ ఆలోక్ బాజ్‌పేయి చెబుతున్నారు. ‘విదేశీ పర్యటనలపై రూపాయి విలువ దిగజారిన ప్రభావవేమి అంతగా కనిపించడం లేదు. హాలిడే ట్రిప్‌ల కోసం ఒకటి,రెండు నెలల ముందుగానే ప్రణాళికలు వేస్తుంటారు కాబట్టి ప్రస్తుత పండుగ సీజన్లో భారతీయుల విదేశీ పర్యటనలు తగ్గినట్టు కనిపించడం లేదు’ అని ఎస్ఓటీసీ సంస్థ ప్రతినిధి డానియల్ డిసౌజా స్పష్టంచేశారు. భారత రూపాయితో పాటు టర్కీ లిర, ఇండోనేషియా రుపాయ, ఇతర దేశాల్లోనూ కరెన్సీ విలువ కూడా దిగజారింది. భారత్‌తో ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, తదితర కారణాలతో శ్రీలంక, టర్కీ, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, ఇతర దేశాలకు ఇండియన్ టూరిస్ట్‌లు క్యూ కడుతున్నారు.ఈ దేశాల్లోని కరెన్సీల కంటే ఇండియన్ రూపీ బలంగా ఉండడంతో యూఎస్, ఐరోపా దేశాలతో పోల్చితే ఫారిన్టూర్లకు అవుతున్న ఖర్చు కూడా తక్కువగా ఉండడం కూడా ఓ కారణంగా అంచనా వేస్తున్నారు. -
సీఎం అయ్యాక 2నెలలకుపైగా విదేశాల్లోనే బాబు..
రూ.728 కోట్లతో ఏపీలో సోలార్ బ్యాటరీల తయారీ ప్రాజెక్టు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది.డ్రోన్ల తయారీ, పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నాం. రాష్ట్రాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రంగా మారుస్తాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రంగా చేస్తాం. ఏపీలో సముద్ర పరిశోధన, సాంకేతిక విభాగం ఏర్పాటు కోసం ‘డోయర్’ సంస్థ ముందుకొ చ్చింది. మెరైన్ టెక్నాలజీలో రూ.200 కోట్ల పెట్టుబడికి సంసిద్ధత తెలిపింది...! తాజాగా అమెరికా పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు చేసిన ప్రకటనలు ఇవీ! రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు రప్పిస్తామంటూ గత నాలుగున్నరేళ్లలో ఆయన 23 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. పలు ఒప్పందాలు చేసుకున్నారు.మరి అవి నిజంగా కార్యరూపం దాల్చాయా? సాక్షి, అమరావతి: కాలు కదిపితే ప్రత్యేక విమానాలు.. నాలుగున్నరేళ్లలో 13 దేశాల్లో పర్యటనలు... 23 సార్లు విదేశీ యాత్రలు.. ఏపీని రెండో రాజధానిగా చేసుకోవాలంటూ ఆయా దేశాలకు సూచనలు.. రాష్ట్రానికి ఒరిగింది మాత్రం శూన్యం! ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటనల ఫలితం ఇదీ! అధికారం చేపట్టిన తరువాత ఆయన దాదాపు 68 రోజుల పాటు విదేశాల్లోనే గడపడం గమనార్హం. రెండు మూడు నెలలకోసారి తన బృందంతో కలిసి విదేశీ పర్యటనలకు వెళ్లి వస్తున్నారు. సింగపూర్, జపాన్, చైనా, లండన్, అమెరికా, దుబాయ్, స్విట్జర్లాండ్‌కు చంద్రబాబు పలుసార్లు వెళ్లారు. ఏ దేశానికి వెళితే రాష్ట్రా న్ని అక్కడి మాదిరిగా మార్చేస్తామని ప్రకటించడం రివాజుగా మారింది. ఏపీకి రూ. వేల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తున్నాయంటూ పలు ఒప్పందాలు చేసుకున్నారు. బుల్లెట్ రైళ్లు, అమరావతిలో లండన్ ఐ ఏర్పాటు చేస్తామన్నారు. అయితే ఈ పర్యటనల ద్వారా రాష్ట్రానికి ఒక్కటి కూడా రాలేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. అదే సంస్థతో పదేపదే చర్చలు.. సీఎం చంద్రబాబు వరుసగా నాలుగేళ్ల నుంచి దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో పాల్గొంటూ ఎంత హడావుడి చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోయింది. గత నెలలో దావోస్ సదస్సులో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం సౌదీ అరామ్కో సంస్థతో చర్చలు జరిపారు. 2017లో జరిగిన సదస్సులోనూ చంద్రబాబు ఇదే అంశంపై అదే సంస్థతో చర్చలు జరిపి ఓ బృందాన్ని రప్పించారు. అయితే అవేమీ ఫలప్రదం కాలేదు. 2012 లోనూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంస్థ ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. అది మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అదే సంస్థతో రెండేళ్లుగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. సింగపూర్ కంపెనీలకు సర్వాధికారాలు రాజధాని మాస్టర్ ప్లాన్ పేరుతో చంద్రబాబు అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే సింగపూర్ వెళ్లి ఒప్పందాలు చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు వెళ్లినా మాస్టర్‌ప్లాన్ తయారీ మినహా అక్కడి నుంచి వచ్చిన పెట్టుబడులు శూన్యం. సింగపూర్‌లోని సెంటోసా టూరిజం స్పాట్‌లా విజయవాడ భవానీ ద్వీపాన్ని మార్చేస్తామని ప్రకటించినా అడుగు ముందుకు వేయలేదు. పెట్టుబడులు తేకపోగా తీవ్ర నష్టం కలిగేలా రాజధాని స్టార్టప్ ఏరియాను సింగపూర్ కంపెనీలకు అప్పగించారు. షాంఘై, టోక్యోలా రాజధాని చంద్రబాబు జపాన్‌కు వెళ్లి ఏమీ సాధించకపోగా మన విద్యాలయాల్లో జపాన్ భాష ప్రవేశపెడతామని ప్రకటించారు. చైనా పర్యటనకు వెళ్లి షాంఘైలా అమరావతిని నిర్మిస్తామన్నారు. జపాన్ వెళ్లినప్పుడు టోక్యోలాంటి రాజధాని కడతామన్నారు. అమెరికా పర్యటన సందర్భంగా విశాఖపట్నానికి టెంపుల్టన్ సంస్థను తెస్తామని, రాష్ట్రంలో ఏరో సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తాజాగా చంద్రబాబు ఐరాస ఆహ్వానం మేరకు వెళ్లారని చెబుతున్నా అది ఓ ప్రైవేట్ ఏజెన్సీ కార్యక్రమమేనని ఆరోపణలు వచ్చాయి. విదేశీ పర్యటనల పేరుతో ఆయన వ్యక్తిగత పనులు చక్కబెట్టుకుంటున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2015 జనవరి 20 దావోస్ స్పెయిన్ బుల్లెట్ రైలుపై అధ్యయనం చేస్తున్నాం. 100 రకాలైన డ్వాక్రా ఉత్పత్తులను విక్రయించేందుకు వాల్‌మార్ట్ ముందుకొచ్చింది. కోనసీమ కొబ్బరినీళ్లను పెప్సికో ప్యాకింగ్ చేసి విక్రయిస్తుంది. ఎయిర్‌బస్ రాష్ట్రంలో సి–295 విమానాల తయారీకి సంసిద్ధత వ్యక్తం చేసింది. 2015 ఏప్రిల్ 12 చైనా షాంఘైలా అమరావతిని తయారు చేస్తాం. చైనా సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్‌లో మౌలిక వసతులు, పారిశ్రామిక అభివద్ధిలో పాలు పంచుకుంటుంది. రైల్వే, రహదారులు, జాతీయ రహదారులు, విమానాశ్రయాలు, రియల్ ఎస్టేట్, పారిశ్రామిక మండళ్ల అభివృద్ధితోపాటు మరికొన్ని రంగాల్లో సహకరించుకుంటాం. ఏపీ రైల్వే స్టేషన్లను బీజింగ్ రైల్వే స్టేషన్ల మాదిరిగా చేస్తాం. 2015 జులై 5 జపాన్ టోక్యోలా అమరావతిని నిర్మిస్తా. విశాఖలో మిత్సుబిషి అధ్యయనం కేంద్రం ఏర్పాటుకు ముందుకొచ్చింది. 2015 సెప్టెంబర్ 20 సింగపూర్ విశ్వనగరంగా అమరావతిని తీర్చిదిద్దుతాం. తుళ్లూరును సింగపూర్‌లా మార్చేస్తాం. అమరావతి నిర్మాణంపై మలేషియా కంపెనీ ఇస్కాండర్ ఆసక్తి చూపింది. 2016 జనవరి 22 దావోస్ ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ ఏర్పాటుకు లాక్‌హీడ్ ముందుకొచ్చింది. రూ.2 వేల కోట్లతో రాష్ట్రంలో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటుకు ఓ సంస్థ సిద్ధమైంది. విశాఖ, రాజమండ్రిలో సోలార్ ప్యానళ్ల తయారీ కేంద్రం ఏర్పాటు కానుంది. విశాఖలో ఇన్ఫోసిస్ భారీ క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. 2018 ఫిబ్రవరి దుబాయ్ రాష్ట్రంలో ఫోనిక్స్ ఆధ్వర్యంలో అతి పెద్ద రైస్ మిల్లు 2018 ఏప్రిల్ 13 సింగపూర్ పర్యటన 2016 మార్చి 11 లండన్ అమరావతిలో ’లండన్ ఐ’ ఏర్పాటు చేస్తాం. అమరావతిలో బ్రిటన్‌కు చెందిన కింగ్స్ కాలేజీ హాస్పిటల్ వెయ్యి పడకల ఆస్పత్రిని ఏర్పాటు చేస్తుంది. పెట్టుబడులను ఆకర్షించేందుకు లండన్ బకింగ్‌హామ్ ప్యాలెస్ వద్ద ప్రత్యేకంగా కార్యాలయం ఏర్పాటు చేస్తున్నాం. 2016 జూన్ 27 చైనా రాష్ట్రానికి బుల్లెట్ రైలు రప్పిస్తాం. టియాంజిన్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో రూ.53,000 కోట్ల విలువైన ఒప్పందాలు కుదిరాయి. కృష్ణపట్నం సమీపంలో రూ.10,183 కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం రానుంది. దొనకొండలో రూ.43,120 కోట్లతో 10 వేల ఎకరాల్లో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఒప్పందం కుదిరింది. దీనిద్వారా 55 వేల మందికి ఉపాధి కల్పిస్తాం. 2016 జులై 9 కజకిస్తాన్ ప్రధాని మోదీ సూచనల మేరకు కజకిస్తాన్‌ను సందర్శిస్తున్నా. అమరావతితో ఈ ప్రాంతానికి సారూప్యం ఉంది. ఆస్తానా నిర్మాణం మాకు ఆదర్శం. ఏపీకి గుర్తింపు తెచ్చేందుకే విదేశీ పర్యటనలు చేస్తున్నా. 2016 జులై 11 రష్యా ఏపీలో మెరైన్ వర్సిటీ ఏర్పా టుకు ఒప్పందం కుదిరింది. 2017 మే 6 అమెరికా విశాఖకు టెంపుల్టన్ సంస్థను తెస్తాం. 2017 అక్టోబర్ అమెరికా, లండన్, దుబాయ్ అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, అయోవా, న్యూయార్క్‌లను సందర్శించా. 70 ఐటీ కంపెనీలు ఏపీకి వచ్చేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. వీటితో 8 వేల మందికి ఉద్యోగాలొస్తాయి. ఏపీలో 550 కోట్ల డాలర్ల వ్యయంతో ఏరోసిటీ ఏర్పాటుతో 20,000 ఉద్యోగాలు రానున్నాయి. ఏపీలో పెట్రో కెమికల్ కాంప్లెక్స్, ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు అల్ అర్ఫాజ్ గ్రూప్ సిద్ధమైంది. పలు విదేశీ పర్యటనల సమయంలో చంద్రబాబు ఏం చెప్పారంటే 2014 నవంబర్ 14 సింగపూర్ టూరిస్ట్ హబ్‌గా ఏపీని మార్చి జిల్లాకో విమానాశ్రయం నిర్మిస్తాం. రాష్ట్రాన్ని పారిశ్రామిక కూడలిగా మారుస్తాం. 2014 నవంబర్ 24 జపాన్ రాష్ట్రంలో వ్యవసాయ దిగుబడులు పెంచే అత్యాధునిక విధానాలు, సాంకేతిక నైపుణ్యానికి సంబంధించి ఈ పర్యటనలో ఒప్పందాలు జరిగాయి. శ్రీకాకుళం జిల్లాలో 4,000 మెగావాట్ల విద్యుత్ కర్మాగారం నిర్మిస్తాం. ఏపీ ప్రభుత్వం–సుమిటోమో సంస్థ ఉమ్మడి అధ్యయన బృందాన్ని ఏర్పాటు చేసి కొత్త అవకాశాలను గుర్తిస్తాయి. ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేస్తాం. వ్యవసాయ ఉత్పాదకతను పెంచి ఆధునిక యంత్రాలు, సాగు పద్ధతులను తెస్తాం. సుమిటోమో సహకారాలతో ప్రపంచస్థాయి రాజధాని నిర్మిస్తాం. -
ఎక్కే విమానం, దిగే విమానం
విదేశీ ప్రయాణం అంటే భారతీయులకు తెగ మోజులా ఉంది. ఎక్కే విమానం దిగే విమానంగా తెగ తిరిగేస్తున్నారు. గత ఐదేళ్లలోనే భారతీయులు విదేశీ ప్రయాణాలకు పెడుతున్న ఖర్చు భారీగా పెరిగింది. ఏకంగా 253 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర దేశాల్లో పర్యాటక ప్రాంతాలను చూడాలన్న ఆసక్తి.. అత్యున్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లడం.. గత కొంత కాలంగా బాగా పెరిగిపోయింది. దీంతో విదేశీయానాలు పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం రూ.112 కోట్లు ఖర్చు పెడితే, 2018 సంవత్సరం వచ్చేసరికి ఆ ఖర్చు రూ.28 వేల కోట్లకు పెరిగిపోయింది. ఇది ఏకంగా 253 రెట్లు ఎక్కువ. విదేశాల్లో చదువుల కోసం 2014లో రూ.3 వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది వచ్చేసరికి ఆ ఖర్చు రూ.14 వేల కోట్లకు పెరిగింది. 2017లో భారత్ నుంచి పలు దేశాలకు 2.3 కోట్ల మంది ప్రయాణికులు వెళ్లారు. విదేశీ ప్రయాణాలకు భారతీయులు పెడుతున్న ఖర్చు భారత వాణిజ్య లోటుపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. ఎందుకిలా? లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లోకి వచ్చాక భారతీయులు విదేశాలకు వెళుతున్నారు. ఈ పథకం ద్వారా ప్రతి పౌరుడు 2013–14లో వంద కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేయొచ్చన్న పరిమితులు ఉండేవి. దాన్ని ఇప్పుడు ఏకంగా 25,000 డాలర్లకు పెంచేశారు. విదేశాల్లో క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని వాడుకునే సదుపాయం కూడా ఉంది. ఇవన్నీ కూడా విదేశీ ప్రయాణాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ‘2017 వరకు రూపాయి విలువలో పెద్దగా హెచ్చు తగ్గుల్లేవు. బ్యాంకుల్లో ఫైనాన్స్ కూడా సులభమైపోయింది. ప్రయాణాల కోసం ప్రత్యేకంగా లోన్ సౌకర్యం లేకపోయినా పర్సనల్ లోన్స్ పెట్టుకొని మరీ విదేశాలు చుట్టేసి వస్తున్నారు’ అని ముంబైకి చెందిన ఓ బ్యాంకు అధికారి తెలిపారు. విదేశాల్లో పెట్టుబడులు, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి మాత్రం తగ్గిపోతున్నాయి. ఎందుకంటే విదేశాల్లో భారతీయులు మనీ ఇన్వెస్ట్ చేయడం, విదేశాల్లో జరిగే లావాదేవీలపై ఆర్బీఐ ఒక కన్నేసి ఉంచుతోంది. – సాక్షి, హైదరాబాద్ -
ఎక్కే విమానం.. దిగే విమానం
విదేశీ ప్రయాణం అంటే భారతీయులకు తగని మోజులా ఉంది. ఎక్కే విమానం దిగే విమానంగా తెగ తిరిగేస్తున్నారు. గత అయిదేళ్లలోనే భారతీయులు విదేశీ ప్రయాణాలకు పెడుతున్న ఖర్చు భారీగా పెరిగింది. ఏకంగా 253 రెట్లు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ఇతర దేశాల్లో పర్యాటక ప్రాంతాలను చూడాలన్న ఆసక్తి, అత్యున్నత చదువులకోసం విదేశాలకు వెళ్లడం గత కొంత కాలంగా బాగా పెరిగిపోయింది. దీంతో విదేశీయానాలు పెరిగిపోయాయని కేంద్ర ప్రభుత్వ అధికారిక గణాంకాలే వెల్లడిస్తున్నాయి. 2014 ఆర్థిక సంవత్సరంలో భారతీయులు విదేశీ ప్రయాణాల కోసం 112 కోట్లు ఖర్చు పెడితే, 2018 సంవత్సరం వచ్చేసరికి ఆ ఖర్చు 28 వేల కోట్లకు పెరిగిపోయింది. ఇది ఏకంగా 253 రెట్లు ఎక్కువ. ఇక విదేశాల్లో చదువుల విషయానికి వచ్చేసరికి 2014లో 3వేల కోట్లు ఖర్చు చేస్తే, ఈ ఏడాది వచ్చేసరికి ఆ ఖర్చు 14 వేల కోట్లకు పెరిగింది. 2017లో భారత్ నుంచి వివిధ దేశాలకు 2.3 కోట్ల మంది ప్రయాణికులు తరలివెళ్లారు. విదేశీ ప్రయాణాలకు భారతీయులు పెడుతున్న ఖర్చు ఏ స్థాయిలో జరుగుతోందని అంటే, భారత దేశ వాణిజ్య లోటుపై కూడా ప్రభావాన్ని చూపిస్తోంది. చమురు, ఎలక్ట్రానిక్ పరికరాల దిగుమతులపై పడుతున్న వాణిజ్య లోటుతో, ఈ విదేశీ ప్రయాణాల కారణంగా పడుతున్న ప్రభావం ఇంచుమించు సరిసమానంగా ఉంటోంది. ఎందుకీ ప్రయాణాలు ? లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) అమల్లోకి వచ్చిన తర్వాత భారతీయులు విదేశాలకు రెక్కలు కట్టుకొని వెళ్లిపోతున్నారు. ఈ పథకం ద్వారా ప్రతీ పౌరుడు 2013–14లో వంద కోట్ల డాలర్ల వరకు ఖర్చు చేయవచ్చునన్న పరిమితులు ఉండేవి. దానిని ఇప్పుడు ఏకంగా 2,50,00 డాలర్లకు పెంచేశారు. అంతేకాకుండా విదేశాల్లో క్రెడిట్ కార్డు సౌకర్యాన్ని వాడుకునే సదుపాయం కూడా ఉంది. ఇవన్నీ కూడా విదేశీ ప్రయాణాలు పెరిగిపోవడానికి కారణమవుతున్నాయి. ‘2017 వరకు రూపాయి విలువలో పెద్దగా హెచ్చుతగ్గుల్లేవు. అంతేకాకుండా బ్యాంకుల్లో ఫైనాన్స్ కూడా సులభమైపోయింది. ప్రయాణాల కోసం ప్రత్యేకంగా లోన్ సౌకర్యం లేకపోయినప్పటికీ పర్సనల్ లోన్స్ పెట్టుకొని మరీ విదేశాలు చుట్టేసి వస్తున్నారు‘ అని ముంబైకి చెందిన ఒక బ్యాంకు అధికారి వెల్లడించారు. అయితే విదేశాల్లో పెట్టుబడులు, ఆస్తులు సమకూర్చుకోవడం వంటివి మాత్రం తగ్గిపోతున్నాయి. ఎందుకంటే విదేశాల్లో భారతీయులు మనీ ఇన్వెస్ట్ చేయడం, విదేశాల్లో జరిగే లావాదేవీలపై ఆర్బీఐ ఒక కన్నేసి ఉంచుతోంది. దీంతో విదేశాలకు వెళ్లి చూసి వచ్చేస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. -
విదేశాలకు మోదీతో ఎవరెవరు వెళ్లారు?
న్యూఢిల్లీ: విదేశీ పర్యటనల్లో ప్రధాని మోదీతో పాటు ప్రయాణించిన ప్రైవేటు వ్యక్తుల పేర్లను వెల్లడించాలని విదేశీ వ్యవహారాల శాఖను కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) ఆదేశించింది. 2015–16, 2016–17 వార్షిక సంవత్సరాల్లో మోదీ విదేశీ పర్యటనలకు అయిన ఖర్చులు, మోదీతో ప్రయాణించిన ప్రైవేటు వ్యక్తుల వివరాలను ఇవ్వాలని సంబంధిత మంత్రిత్వ శాఖకు కరాబీ దాస్ అనే వ్యక్తి గతేడాది అక్టోబర్‌లో దరఖాస్తు చేసుకున్నారు. శాఖ నుంచి సంతృప్తికర సమాధానం రాకపోవడంతో సీఐసీని ఆశ్రయించారు. సమాచారం ఇవ్వాలంటే రూ.224 చెల్లించాలని ఆ శాఖ డిమాండ్ చేసిందని, ఆ విధంగానే కరాబీ చెల్లించాడని అయితే ప్రధాని విదేశీ పర్యటనల తేదీలు, దేశాల వివరాలు, చార్టర్డ్ విమానాలకయ్యే ఖర్చుల వివరాలు తప్ప మరేమీ ఇవ్వలేదని కరాబీ తరఫున ఆర్టీఐ కార్యకర్త సుభాష్ అగర్వాల్ కేంద్ర సమాచార కమిషనర్ ఆర్కే మాథూర్‌కు వివరించారు. -
దక్షిణాసియాలో మనమే టాప్
ఐక్యరాజ్యసమితి: 2017లో ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం జోరందుకుందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. గతేడాది రికార్డు స్థాయిలో 132.3 కోట్ల మంది పర్యాటకులు వివిధ దేశాల్లో పర్యటించినట్లు పేర్కొంది. 2016తో పోలిస్తే.. ఈ సంఖ్య 8.4 కోట్లు అదనం. కాగా, దక్షిణాసియా ప్రాంతంలో పర్యాటకులను ఆకర్షించిన జాబితాలో భారత్ మొదటి స్థానంలో ఉంది. భారత్‌లో పర్యాటకం సానుకూల వృద్ధితో ముందుకెళ్తోందని నివేదిక పేర్కొంది. సరళీకృతమైన వీసా విధానాల కారణంగా భారత్‌కు పర్యాటకుల సంఖ్య పెరుగుతోందని వెల్లడించింది. 2017లో దక్షిణాసియాలో 2.6కోట్ల మంది విదేశీయులు పర్యటించగా అందులో 1.54 కోట్ల మంది భారత్‌కు వచ్చిన వారే. 2016లో భారత్‌లో విదేశీ పర్యాటకుల సంఖ్య 1.45కోట్లు కాగా.. వీరి ద్వారా దాదాపు రూ. 1.6లక్షల కోట్ల లాభం వచ్చింది. అదే 2017లో 1.54కోట్ల మంది ద్వారా దాదాపు రూ. 1.94లక్షల కోట్ల లబ్ధి జరిగిందని నివేదిక తెలిపింది. అటు ప్రపంచవ్యాప్తంగానూ పర్యాటక రంగం జోరందుకుంది. యూరప్, ఆఫ్రికా దేశాల్లో పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగినట్లు తాజా నివేదిక వెల్లడించింది. యూరప్‌లో 8%, ఆఫ్రికాలో 9% పెరుగుదల కనిపించింది. ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) లెక్కల ప్రకారం 2017లో పర్యాటకం ద్వారా ఆయా దేశాలకు రూ.1.3 ట్రిలియర్ డాలర్ల (రూ.92.3 లక్షల కోట్లు) లాభం జరిగిందన్నారు. ఇది గతేడాదితో పోలిస్తే ఐదుశాతం పెరుగుదలని పేర్కొంది. కాగా టాప్–10 పర్యాటక కేంద్రాల్లో చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, అమెరికాలున్నాయి. -
కోర్టు ఆదేశాలు : సల్మాన్ ఆశలు ఆవిరి!
జోధ్‌పూర్ : కృష్ణజింకలను వేటాడిన కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్‌ను రాజస్థాన్ జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు హెచ్చరించింది. ఏ పని నిమిత్తమైనా సరే విదేశాలకు వెళ్లాలంటే కండలవీరుడు సల్మాన్ కచ్చితంగా కోర్టు అనుమతి తీసుకోవాలని కోర్టు సూచించింది. విదేశాలకు వెళ్లాల్సినప్పుడు కచ్చితంగా అనుమతి అనే నిబంధన నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ సల్మాన్ తన లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. శనివారం, ఆ పిటిషన్ విచారణకు రాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ నిందితుడు సల్మాన్ అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లకూడదని కోర్టు తీర్పిచ్చింది. దీంతో పర్మిషన్ లేకుండా విదేశాలకు వెళ్లాలనుకున్న సల్మాన్ ఆశలు ఆవిరయ్యాయి. ఆగస్ట్ 10 నుంచి 26 తేదీల మధ్య విదేశాల్లో పర్యటించాల్సి ఉందని సల్మాన్ తన పిటిషన్లో పేర్కొన్నాడు. షూటింగ్ పూర్తి చేసుకునేందుకు సల్మాన్ అబుదాబి, మాల్టాలకు వెళ్లాల్సి ఉందని నటుడి లాయర్ కోర్టుకు విన్నవించారు. భరత్ మూవీ షూటింగ్ పనుల్లో సల్మాన్ బిజీగా ఉన్నాడు. కానీ అనుమతి ఉంటేనే విదేశాలకు వెళ్లాలని జోధ్‌పూర్ కోర్టు తెలిపింది. ఈ ఏప్రిల్‌లో జోధ్‌పూర్ సెషన్స్ కోర్టు జడ్జి తీర్పు ప్రకారం.. రూ. 50 వేల వ్యక్తిగత పూచీకత్తు, అదే మొత్తానికి మరో ఇద్దరి పూచీకత్తులు సమర్పించిన అనంతరం సల్మాన్ బెయిల్‌పై విడుదలయ్యారు. (సెల్లో సల్మాన్.. ఖైదీ నెంబర్ 106) కాగా, కృష్ణజింకలను వేటాడిన కేసులో ఈ ఏడాది ఏప్రిల్ 5న సల్మాన్ ఖాన్‌కు జోధ్‌పూర్ కోర్టు ఐదేళ్ల శిక్ష విధించింది. 1998 అక్టోబర్ 1న ‘హమ్ సాథ్ సాథ్ హై’ చిత్రీకరణ సమయంలో రాజస్థాన్ అడవుల్లో సల్మాన్ రెండు కృష్ణ జింకలను వేటాడి చంపినట్లు నమోదైన కేసులో దోషిగా రుజువైంది. రెండు రోజుల పాటు జోధ్‌పూర్ జైల్లో గడిపిని సల్మాన్ బెయిల్ రాగానే ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లిపోయారు. కాగా, ఈ కేసులో సల్మాన్‌తో పాటు ఆరోపణలు ఎదుర్కొన్న బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సోనాలీ బ్రిందే, టబు, నీలం, జోధ్‌పూర్ వాసి దుష్యంత్ సింగ్‌లను కోర్టు నిర్దోషులుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన విషయం విదితమే. -
492 రోజులు మోదీ ప్రయాణంలోనే
సాక్షి, న్యూఢిల్లీ : ఎక్కువగా విదేశాల్లో పర్యటించే ప్రపంచ దేశాధినేతల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రథమ స్థానంలో ఉంటారనడం జోక్ కాదు, నిజమన్నది మనకందరికి తెల్సిందే. ఆయన గత వారం దక్షిణాఫ్రికా, ఉగాండ, రువాండ దేశాల్లో ఐదు రోజులు పర్యటించారు. దీంతో ఆయన దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి 84 అంతర్జాతీయ పర్యటనలకు వెళ్లారు. 2014, మే నెలలో ఆయన ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెల్సిందే. నరేంద్ర మోదీ తన ఆఫ్రికా పర్యటన ముగింపుతో ఢిల్లీ విడిచి దేశ విదేశాల్లో 492 రోజులు ప్రయాణంలో గడిపారు. అంటే ఆయన ఇప్పటి వరకు ప్రధానిగా పనిచేసిన కాలంలో 32 శాతం కాలాన్ని ప్రయాణంలోనే గడిపారు. ఈ విషయం పీఎంవో వెబ్‌సైట్‌లోని ఆయన ప్రయాణాల జాబితాను పరిశీలిస్తే అర్థం అవుతోంది. మోదీకి ముందు ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ మొదటి టెర్మ్‌లో 368 రోజులు, రెండో టెర్మ్‌లో 284 రోజులు ప్రయాణంలోనే గడిపారు. అప్పుడు ఎక్కువగా విదేశాల్లో ఉండే ప్రధాన మంత్రిగా మన్మోహన్ సింగ్‌ను సుష్మా స్వరాజ్ సహా పలువురు బీజేపీ నాయకులు విమర్శించారు. ఇప్పుడు మోదీ తిరుగుతుంటే ఆయన్ని విమర్శించే ధైర్యం బీజేపీ నాయకులకు ఎలాగూ లేదు కనుక ఆ బాధ్యతను ఇప్పుడు సోషల్ మీడియా తీసుకుంది. ‘ఉత్తమ ప్రపంచ పర్యాటకుడు’ అవార్డు ఇవ్వాల్సి వస్తే మోదీకి ఇవ్వాలంటూ సోషల్ మీడియాలో జోకులు కూడా వచ్చాయి. మోదీకి మరో పది నెలలపాటు పదవీకాలం ఉండడంతో ఈలోగా ఆయన మరెన్ని దీశాలు తిరుగుతారో ఆయనకే తెలియాలి. మన్మోహన్ సింగ్ తన పదేళ్ల కాలంలో 15 రోజుల పాటు ప్రధాని కార్యాలయానికి దూరంగా ఉన్నది కేవలం రెండుసార్లు. అదే ఇప్పటికే ఐదుసార్లు దూరంగా ఉన్నారు. మోదీ ఇప్పటి వరకు నెల మొత్తం ప్రధాని కార్యాలయానికి అందుబాటులో, అంటే ఢిల్లీలో ఉన్నది ఒక్కటి కూడా లేదు. మోదీ ఎక్కువగా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానే దేశీయంగా పర్యటించారు. మోదీ తన ప్రయాణ కాలంలో 101 రోజులు అనధికార పనిమీద, 12 రోజులపాటు అధికార, అనధికార పనిమీద పర్యటించినట్లు పీఎంవో వెబ్సైట్ తెలియజేస్తోంది. మన్మోహన్ సింగ్ ప్రధానిగా తన తొలి పర్యాయంలో 51 రోజలు, రెండో పర్యాయంలో 24 రోజులు అనధికార పనులపై ప్రయాణించారు. ఆయన పదేళ్ల కాలంలో పర్యటించిన దానికన్నా మోదీ ఇప్పటికే ఎక్కువ అనధికార పర్యటనలు చేశారు. ప్రధానిది అధికార పర్యటన అయినా, అనధికార పర్యటన అయినా ఖర్చులో భారీ తేడా ఏమీ ఉండదు. అనధికార పర్యటనలో అధికారిక సమావేశాలు ఉండవు. ప్రోటోకాల్ అధికారులు ఉండరు. మోదీ 84 విదేశీ పర్యటనలకు మొత్తం 1,484 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. -
ఎల్‌టీసీతో ఇక విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ) సదుపాయాన్ని ఇకపై విదేశీ పర్యటనలకు కూడా వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను సిబ్బంది, శిక్షణా మంత్రిత్వ శాఖ ఖరారు చేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలని హోం, పర్యాటక, పౌర విమానయాన తదితర మంత్రిత్వ శాఖలను కోరింది. విదేశాంగ శాఖ రూపొందించిన ఈ ప్రణాళికలో భాగంగా కజకిస్తాన్, తుర్క్మెనిస్తాన్, ఉబ్జెకిస్తాన్, కిర్గిస్తాన్, తజికిస్తాన్ దేశాల్లో పర్యటించే ఉద్యోగులు ఎల్టీసీ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు. వ్యూహాత్మకంగా కీలకమైన తూర్పు ఆసియాలో భారత పర్యాటకుల సంఖ్యను పెంచే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఎల్టీసీ కింద సెలవు ఇవ్వడంతో పాటు విమాన ప్రయాణ చార్జీలను ప్రభుత్వం రీయింబర్స్ చేస్తుంది. సార్క్ దేశాల్లో పర్యటించే ఉద్యోగులకు ఎల్టీసీని వర్తింపజేసే ప్రతిపాదనను కేంద్రం మార్చిలో వాయిదావేసిన సంగతి తెలిసిందే. -
‘అవిశ్వాసం’ పేరుతో మలేషియా టూర్‌కు సిద్ధం
స్థానిక సంస్థల అధ్యక్షులను అవిశ్వాస భయం వెంటాడుతోంది. నాలుగేళ్ల కాలపరిమితి ముగియడంతో ఇదే అదనుగా సభ్యులు.. అధ్యక్షుల ముందు పలు డిమాండ్లు పెడుతున్నారు. వారి గొంతెమ్మ కోరికలను తీర్చేందుకు పాలకపక్షం కూడా రెడీ అవుతోంది. ఇప్పటికే పలు మండలాల్లో అవిశ్వాస తీర్మా నం నోటీసు ఇవ్వడమే తరువాయి.. ఎంపీటీసీ సభ్యులు క్యాంపులుగా విడిపోయి పుణ్యక్షేత్రాలు, తీర్థయాత్రలకు బయలుదేరారు. తాజాగా జెడ్పీటీసీ సభ్యులు కూడా వీరి బాటలో విదేశీయాత్రకు సూటు, బూటు సిద్ధం చేసుకుంటున్నట్లు ప్రచారం.. అవిశ్వాసం మాట దేవుడెరుగు.. ఒక్క ఝలక్ ఇచ్చి పని చక్కబెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డి సతీమణి సునీత ప్రాతినిథ్యం వహిస్తున్నారు. యాలాల జెడ్పీటీసీగా టీఆర్ఎస్ తరుఫున గెలుపొందిన ఆమె అనూహ్య పరిణామాల నడుమ జడ్పీ పీఠాన్ని అధిరోహించారు. తగినంత సంఖ్యాబలం లేనప్పటికీ, టీడీపీ సభ్యుల మద్దతు కూడగట్టుకోవడం.. విపక్ష కాం గ్రెస్ పార్టీలో చీలిక తీసుకురావడం ద్వారా సునాయాసంగా విజయం సాధించారు. అనంతరం జరిగిన సమీకరణల నేపథ్యంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సభ్యులు కూడా గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ నేపథ్యంలో గత నాలుగేళ్లుగా జిల్లా పరిషత్ పాలన సజావుగా సాగుతోంది. అయితే, తాజాగా చోటుచేసుకున్న పరిణామల నేపథ్యంలో గతంలో అండగా నిలిచిన జెడ్పీటీసీలు తమ మాట చెల్లుబాటు కావడంలేదనే ప్రస్తుతం అసమ్మతి స్వరం వినిపిస్తున్నట్లు పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే నాలుగేళ్ల కాలపరిమితి పూర్తి కావడం.. అవిశ్వాసం నోటీసు ఇచ్చేందుకు అవకాశం లభించడంతో కొందరు సభ్యులు చైర్‌పర్సన్‌పై ఈ దిశగాయోచిస్తున్నట్లు లీకులు వదిలారు. వాస్తవానికి అవిశ్వాసం ప్రకటించినా నెగ్గే పరిస్థితి లేనప్పటికీ, లీకుల ద్వారా ఎంతో కొంత వెనుకేసుకోవాలనే ఆలోచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో శిబిరాలు నిర్వహించిన అనుభవం..ఆర్థికంగా అదుకున్నారనే పేరు మంత్రి మహేందర్‌రెడ్డికి ఉండడంతో ఈ ఎత్తుగడ వేసినట్లు తెలు స్తోంది. ఈ క్రమంలోనే కొందరు సభ్యులు అవిశ్వాసం జోలికి వెళ్లకుండా విదేశీ టూర్‌కు వెళితే బాగుంటుందనే ప్రతిపాదన తెచ్చారు. మరో 11 నెలల్లో పదవీకాలం ముగిస్తున్నందున అనవసరపు ఖర్చేందుకు అని భావించి విదేశీయానమే బెటరనే నిర్ణయానికి వచ్చారు. పార్టీకతీతంగా ఈ ప్రతిపాదనకు ఓకే చేసిన సభ్యులు సింగపూర్, మలేషియా లేదా కొరియా పర్యటనకు వెళ్లే అం శాన్ని పరిశీలిస్తున్నారు. వచ్చే నెల 16న విదేశాలకేగాలని సూత్రప్రాయంగా నిర్ణయించిన సభ్యులు.. ఎక్కడి వెళ్లాలి? ఎన్నిరోజుల షెడ్యూల్ అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. -
నాలుగేళ్లుగా విదేశీ పర్యటనల్లో బిజీగా చంద్రబాబు
-
41 పర్యటనలు.. ఖర్చు రూ.355 కోట్లు..!!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలకు ఇప్పటివరకూ ఎంత ఖర్చు చేశారో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. 2014లో ప్రధాని పగ్గాలు చేపట్టినప్పటి నుంచి నాలుగేళ్లలో ప్రధాని 50 దేశాలకు పైగా 41 విదేశీ పర్యటనలు చేశారు. ఈ పర్యటనలకు రూ 355 కోట్లుపైగా ప్రభుత్వ ఖజానా నుంచి వెచ్చించినట్టు ఆర్టీఐ కింద ప్రభుత్వం ఇచ్చిన సమాచారంతో వెల్లడైంది. బెంగళూర్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఈ వివరాలు వెలుగుచూశాయి. ప్రధాని మోదీ ఇప్పటివరకూ తన 48 నెలల పదవీకాలంలో165 రోజుల పాటు విదేశీ పర్యటనల్లో గడిపినట్టు వెల్లడైంది. మరోవైపు గత 48 నెలల్లో ప్రధాని విదేశీ పర్యటన వివరాలతో కూడిన జాబితాను ప్రదాని కార్యాలయ వెబ్సైట్ పొందుపరించింది. ఈ పర్యటనల్లో 30 సార్లు ప్రధాని ఉపయోగించిన చార్టర్డ్ విమానాల బిల్లులను ఇందులో చూపగా, 12 ఈ తరహా పర్యటనల బిల్లులను ఇంకా పొందుపరచలేదు. మోదీ విదేశీ పర్యటనల్లో ఫ్రాన్స్, జర్మనీ, కెనడా దేశాల పర్యటనకు అత్యధికంగా రూ 31.25 కోట్లు ఖర్చు కాగా, భూటాన్ పర్యటనకు కేవలం రూ 2.45 కోట్లు ఖర్చయినట్టు వెల్లడించారు. -
కశ్మీర్, మోదీ విదేశీ టూర్లపై థాకరే సెటైర్లు
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీ సర్కార్‌పై శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి ధ్వజమెత్తారు. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ అబద్ధాలు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందటూ తీవ్ర విమర్శలకు దిగారు. ఎన్నికల్లో విజయం సాధించేందుకు తప్పుడు వాగ్దానాలు చేసిందని దుయ్యబట్టారు. గురుగావ్‌లో శివసేన 52వ ఆవిర్భావ దినోత్సం సందర్భంగా శివసేన కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన థాకరే మంగళవారం ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ విదేశీ టూర్లపై కూడా థాకరే సెటైర్లు వేశారు. త్వరలోనే ప్రధాని ఇతర గ్రహాల పర్యటనకు కూడా వెళ్లనున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. జమ్మూ కశ్మీర్లో పీడీపీ ప్రభత్వానికి మద్దతు ఉపసంహరణపై థాకరే విమర్శలు గుప్పించారు. 600 మంది జవాన్లు ప్రాణత్యాగం, మూడు సంవత్సరాల సమయం గడిచిన తరువాత గానీ అక్కడి ప్రభుత్వం వేస్ట్ అని అర్థం కాలేదా అంటూ మండిపడ్డారు. పీడీపీతో తెగతెంపులు చేసుకున్నారు. మరిక పాకిస్థాన్‌పై కూడా ఒత్తిడి తీసుకురండి..అప్పుడు బీజేపీని స్వాగతిస్తామని పేర్కొన్నారు. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేనపుడు, రంజాన్ రోజు కాల్పుల విరమణ ఎందుకు ప్రకటించిందని ఆయన ప్రశ్నించారు. గణపతి పండుగ లేదా దసరా సమయంలో పాకిస్తాన్ ఇదే విధానాన్ని అనుసరిస్తుందా అంటూ రంజాన్ మాసంలో కశ్మీర్లో కాల్పుల విరమణ నిర్ణయాన్ని థాకరే తప్పు బట్టారు. -
13 దేశాలు.. 21 టూర్లు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పెట్టుబడుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాలుగేళ్లుగా చేస్తున్న విదేశీ పర్యటనలు చర్చనీయాంశంగా మారాయి. వెళ్లిన ప్రతీచోటు నుంచి వెల్లువలా రూ.వేల కోట్ల పెట్టుబడులు.. లక్షల ఉద్యోగాలు వచ్చేస్తున్నట్లు ఆయన చేస్తున్న ప్రకటనలు ఎక్కడా వాస్తవ రూపం దాల్చడంలేదు. 2014 జూన్‌లో అధికారం చేపట్టిన నాటి నుంచి ఇప్పటివరకు ఆయన మొత్తం 13 దేశాల్లో పర్యటనలు చేశారు. వీటిలో సింగపూర్, జపాన్, చైనా, లండన్, అమెరికా, దుబాయ్, స్విట్జర్లాండ్ దేశాల్లో ఎక్కువసార్లు పర్యటించారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశంలా రాష్ట్రాన్ని మార్చేస్తామని చెప్పడం తప్ప చేసింది ఏమీలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది రూపాయల ఖర్చుతో చేస్తున్న విదేశీ పర్యటనలవల్ల ఇప్పటివరకు సాధించిందేమిటన్న దానిపై ఇప్పుడు అధికార వర్గాల్లో పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సుకు వరుసగా నాలుగేళ్ల నుంచి హాజరవుతున్నా ఎటువంటి ఫలితం కనిపించడంలేదు. ఆయన జరుపుతున్న పర్యటనల్లో ఎక్కువగా ఉపయోగంలేని సదస్సులు, సమావేశాలే జరుగుతున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇందుకు గత జనవరిలో జరిగిన దావోస్ సదస్సులో.. రాష్ట్రంలో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటు కోసం సౌదీ అరామ్కో సంస్థతో జరిగిన చర్చలను ఉదహరిస్తున్నారు. అంతేకాక.. - 2017లో జరిగిన దావోస్ సదస్సులోనూ ఇదే అంశంపై అదే సంస్థతో చంద్రబాబు చర్చలు జరిపి ఆ దేశ బృందాన్ని ఇక్కడికి రప్పించారు. కానీ, అవేమీ ఫలప్రదం కాలేదు. మరోవైపు.. ఈ సంస్థ 2012లోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆయిల్ రిఫైనరీ ఏర్పాటుకు కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ, మధ్యలోనే ఆగిపోయింది. ఇప్పుడు చంద్రబాబు అదే సంస్థతో రెండేళ్లుగా చర్చలు జరుపుతున్నారు. - సీఎం చంద్రబాబు అధికారం చేపట్టిన కొద్ది నెలల్లోనే రాజధాని మాస్టర్ ప్లాన్ కోసం సింగపూర్ వెళ్లి ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత మరో రెండుసార్లు అక్కడికెళ్లినా పెట్టుబడులు శూన్యం. సింగపూర్‌లోని సెంటోసా టూరిజం స్పాట్‌లా విజయవాడలోని భవానీ ద్వీపాన్ని మార్చేస్తామని ఆ దేశం వెళ్లినప్పుడు ప్రణాళికలు రూపొందించినా ఇప్పటివరకూ దానిపై అడుగు ముందుకుపడలేదు. అక్కడి నుంచి పెట్టుబడులు తేకపోగా రాజధాని స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును ప్రభుత్వానికి తీవ్ర నష్టం కలిగే రీతిలో ఆ దేశ కంపెనీలకు అప్పగించడంపై దుమారం రేగింది. - జపాన్‌కు వెళ్లి ఏమీ సాధించకపోగా మన విద్యాలయాల్లో జపాన్ భాషను ప్రవేశపెడతామని ప్రకటించారు. చైనా పర్యటనకు వెళ్లి షాంఘైలా అమరావతి నిర్మిస్తామని, జపాన్ వెళ్లినప్పుడు టోక్యోలాంటి రాజధాని నిర్మిస్తామని ప్రకటనలు చేశారు. - అమెరికా పర్యటనకు వెళ్లి విశాఖపట్నానికి టెంపుల్టన్ సంస్థను తీసుకొస్తామని, రాష్ట్రంలో ఏరో సిటీ నిర్మిస్తామని చెప్పారు. - గత ఏడాది అక్టోబర్‌లో దుబాయ్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు మళ్లీ మొన్న ఫిబ్రవరిలో వెళ్లారు. భాగస్వామ్య సదస్సు ద్వారా పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు ఈ పర్యటనకు వెళ్లినట్లు చెప్పారు. కానీ, అబుదాబికి చెందిన పారిశ్రామికవేత్త బీఆర్ శెట్టితో లావాదేవీల నేపథ్యంలోనే ఆయన ఈ పర్యటన జరిపినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గత జనవరిలో దావోస్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు ఆయన మధ్యలో అబుదాబిలో ఆగడంపై విమర్శలు వెల్లువెత్తాయి. గత ఏడాది అక్టోబరులో జరిగిన దుబాయ్ పర్యటనలో చంద్రబాబు కార్యక్రమాలన్నీ బీఆర్ శెట్టి పర్యవేక్షించారు. దుబాయి నుంచి రాజధాని డిజైన్లపై చర్చించేందుకు లండన్ వెళ్లిన చంద్రబాబు బీఆర్ శెట్టిని కూడా తీసుకెళ్లడం గమనార్హం. ఖజానాకు రూ.100 కోట్ల భారం నాలుగేళ్లలో చంద్రబాబు జరిపిన విదేశీ పర్యటనలవల్ల రాష్ట్రానికి ఒనగూరిన ప్రయోజనం ఏమీ లేకపోయినా ఖజానాకు బాగా చమురు వదిలింది. దేశంలో ఏ సీఎం వ్యవహరించని విధంగా చంద్రబాబు ప్రత్యేక విమనాల్లో, హెలికాప్టర్లలో ప్రయాణం చేస్తున్నారు. చంద్రబాబు ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లకు గత నాలుగేళ్లలో రూ.100 కోట్లు వెచ్చించారు. గన్నవరం విమనాశ్రయంలో బాబు ప్రత్యేక విమానం, హెలికాప్టర్ పార్కింగ్ చేసి ఉంటుంది. పార్కింగ్ చేసి ఉంచినందుకు కూడా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బులు చెల్లించాల్సి వస్తోందని.. అలాగే పైలట్లకు స్టార్ హోటల్స్‌లో బస ఏర్పాటుచేయాల్సి వస్తోందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రెగ్యులర్ ఫ్లైట్లున్నా ప్రత్యేక చార్టెడ్ విమానాల్లో తిరగడాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి పదవీ విరమణ చేసిన అజేయ్ కల్లాం తాను రాసిన మేలుకొలుపు పుస్తకంలో తప్పుబట్టారంటే సీఎం ఎలా దుబారా చేశారో తేటతెల్లం అవుతోంది. ఇక సీఆర్డీఏ అధికారులు సహా ఇతర అధికార యంత్రాంగం విదేశీ యాత్రలు కూడా అదే స్థాయిలో పెరిగిపోయాయి. దీంతో రాష్ట్రానికి ప్రయోజనం కలిగితే తప్ప విదేశీ యాత్రలకు అనుమతించేదిలేదని సీఎస్ స్పష్టం చేయాల్సి వచ్చింది. అందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం విదేశీ యాత్రల కోసం ప్రత్యేకంగా ఆర్థికాభివృద్ధి మండలిని ఏర్పాటుచేశారు. విదేశీ పర్యటనలు, రోడ్ షోల నిర్వహణకు బడ్జెట్లో రూ.62కోట్లను కేటాయించారు. -
ఆస్పత్రికి సోనియా; బీజేపీకి రాహుల్ చురక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ ఈసారి అమ్మ సెంటిమెంట్‌తో కొట్టారు. విమర్శించడానికి అంతలా కష్టపడొద్దంటూ బీజేపీకి చురక అంటించారు. గతంలో సర్జరీ చేయించుకున్న సోనియా గాంధీ.. వార్షిక వైద్యపరీక్షల కోసం మరోసారి విదేశాలకు వెళ్లనున్నారు. ఈ సారి ఆమెను తనయుడే తోడ్కొనిపోనున్నారు. ఈ విషయాన్ని స్వయంగా రాహుల్ గాంధీనే వెల్లడించారు. ‘‘వార్షిక వైద్యపరీక్షల కోసం అమ్మను ఆస్పత్రికి తీసుకెళుతున్నాను. కాబట్టి కొన్ని రోజులు అందుబాటులో ఉండను. ఈ సందర్భంగా.. బీజేపీ ట్రోలింగ్ ఆర్మీకి నాదొక సూచన. నన్ను విమర్శించడానికి అంతగా కసరత్తు చేయాల్సిన అవసరంలేదు. అతి త్వరలోనే తిరిగొస్తాను’’ అని రాహుల్ రాసుకొచ్చారు. గతంలో చెప్పాపెట్టకుండా విదేశాలకు వెళ్లిపోవడం, ఎక్కడున్నారో కనీస సమాచారం ఇవ్వకుండా రోజులకు రోజులు గడపడం లాంటివి రాహుల్ అలవాట్లుగా ఉండటం, ఆయా సందర్భాల్లో బీజేపీ పెద్ద ఎత్తున విమర్శల దాడి చేయడం తెలిసిందే. గత అనుభవాల దృష్ట్యా ఈ సారి రాహుల్ తన విదేశీ పర్యటన వివరాలను ముందే వెల్లడించారు. మాందసౌర్ కాల్పులకు ఏడాది: తల్లి సోనియాను తీసుకుని రాహుల్ ఒకటి రెండు రోజుల్లోనే విదేశాలకు బయలుదేరి వెళతారని, వారం రోజుల తర్వాత ఢిల్లీకి తిరిగొస్తారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. కర్ణాటకలో కేబినెట్ విస్తరణకు సంబంధించి రాహుల్ ఇప్పటికే నిర్ణయాలు తీసుకున్నారని, విదేశాల నుంచి వచ్చిన వెంటనే రాహుల్ మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తారని, మాంద్సౌర్ రైతులపై కాల్పుల ఘటన జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా జూన్6న రైతు కుటుంబాలను రాహుల్ కలవనున్నారు. Will be out of India for a few days, accompanying Sonia ji to her annual medical check up. To my friends in the BJP social media troll army: don’t get too worked up...I'll be back soon! — Rahul Gandhi (@RahulGandhi) 27 May 2018 -
నేడో రేపో మంత్రివర్గ కూర్పు
న్యూఢిల్లీ: కర్ణాటకలో జేడీఎస్–కాంగ్రెస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకంపై ఉత్కంఠకు తెరపడనుంది. సోమ లేదా మంగళవారానికి మంత్రిత్వ శాఖల కేటాయింపులపై నిర్ణయం వెలువడుతుందని కర్ణాటక కాంగ్రెస్ ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ ఆదివారం చెప్పారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వైద్య చికిత్స నిమిత్తం, ఆమె కొడుకు, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో కలసి విదేశాలకు వెళ్లారు. వారు తిరిగి రావడానికి కనీసం వారం పడుతుందనీ, అప్పటివరకు కర్ణాటకలో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని తొలుత ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై కేసీ వేణుగోపాల్ స్పందిస్తూ, సోనియా, రాహుల్‌ల విదేశీ పర్యటన మంత్రివర్గ కూర్పుకు ఆటంకం కాబోదని స్పష్టం చేశారు. ఫోన్లో సంప్రదించడానికి రాహుల్ ఎప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. సంకీర్ణ ప్రభుత్వంలోని కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య మంత్రిత్వ శాఖల పంపకం ఇంకా పూర్తికాకపోవడం తెలిసిందే. రాష్ట్ర నేతలతో సంప్రదించి మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలన్న దానిపై నిర్ణయం తీసుకున్న అనంతరం తుది ఆమోదం కోసం ఆ జాబితాను అధిష్టానానికి పంపుతామని వేణుగోపాల్ చెప్పారు. ఆర్థిక, హోం, ప్రజా పనులు, విద్యుత్తు, నీటిపారుదల, పట్టణాభివృద్ధి తదితర కీలక మంత్రిత్వ శాఖల పంపకాలపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య విభేదాలు తలెత్తడం తెలిసిందే. ముఖ్యమంత్రిగా జేడీఎస్‌కు చెందిన కుమారస్వామి, ఉప ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ నేత పరమేశ్వర ఇప్పటికే ప్రమాణం చేశారు. ఒప్పందం ప్రకారం ఇంకా కాంగ్రెస్‌కు 21, జేడీఎస్‌కు 11 మంత్రిపదవులు దక్కాల్సి ఉంది. యడ్యూరప్ప, శ్రీరాములు రాజీనామాలను ఆమోదించారా? బీజేపీకి చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాముల రాజీనామాలపై స్పష్టత ఇవ్వాలని కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ లోక్‌సభ సెక్రటేరియట్‌ను కోరారు. కర్ణాటకకు చెందిన ఎంపీలు బీఎస్ యడ్యూరప్ప, బి.శ్రీరాములు ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అసెంబ్లీకి ఎన్నికయ్యారు. దీంతో వారిద్దరూ లోక్‌సభకు రాజీనామాలు సమర్పించినట్లు ప్రకటించారు. వారి రాజీనామాలను వెంటనే ఆమోదించినట్లు ప్రకటించిన లోక్‌సభ సెక్రటేరియట్.. వెబ్సైట్ లో మాత్రం ఆ స్థానాలను ఖాళీగా చూపడం లేదని అహ్మద్ పటేల్ చెప్పారు. ఈనెల 17వ తేదీన ఆ ఇద్దరూ రాజీనామా చేయగా 27 వరకు వారిని ఎంపీలుగానే వెబ్సైట్ చూపుతోందనీ, దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. -
సోనియా నిజమైన ఇండియన్
సాక్షి, బెంగళూరు: తన తల్లి సోనియాగాంధీ విదేశీయతను ప్రధాని మోదీ ప్రస్తావించడాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తప్పుపట్టారు. దేశంలో తాను చూసిన చాలామంది భారతీయుల కంటే సోనియా నిజమైన భారతీయురాలన్నారు. మోదీ తనలో ముప్పును చూస్తున్నారని, ప్రధాని కావాలన్న తన ఆకాంక్షపై ఆయన చేస్తున్న విమర్శలు విషయాన్ని పక్కదారి పట్టించేందుకేనని తప్పుపట్టారు. ‘నా తల్లి ఇటలీలో జన్మించినా భారత్‌లోనే ఎక్కువ కాలం జీవించింది. దేశం కోసం జీవితాన్ని త్యాగం చేసింది. తనను, తన తల్లిని ఇటలీ వాళ్లు అని సంభోధించడం ప్రధాని స్థాయి వ్యక్తికి సరికాదు. మోదీ చేసే అలాంటి వ్యాఖ్యలు ఆయన స్వభావాన్ని తెలియచేస్తాయి’ అని అన్నారు. గురువారం బెంగళూరులోని ఒక ప్రైవేటు హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రత్యర్థి పార్టీలు ఎన్ని విమర్శలు చేసినా తమ సంకల్పాన్ని దెబ్బతీయలేరని చెప్పారు. ఎవరు కావాలి? ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి బాట పట్టించిన సిద్దరామయ్య కావాలో.. లేక జైలుకెళ్లి వచ్చిన యడ్యూరప్ప కావాలో ప్రజలకు బాగా తెలుసునని రాహుల్ అన్నారు. అవినీతి గురించి తరచూ మాట్లాడే ప్రధాని మోదీ అవినీతి ఆరోపణలతో జైలుకెళ్లిన యడ్యూరప్పను పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారని∙ప్రశ్నించారు. దళితుల పక్షాన నిలిచిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీనేనని, దళితుడైన రోహిత్ వేముల మృతిపై దేశమంతా ఏకరువు పెడుతుంటే ప్రధాని మోదీ ఒక్క మాట అయినా మాట్లాడారా? అని ప్రశ్నించారు. నాలుగేళ్లుగా దేశంలో చేసిన అభివృద్ధి గురించి 15 నిమిషాలు తన మాతృభాషలో మోదీ చెప్పగలరా? అని నిలదీశారు. దేశం మొత్తం మీద దళితులకు కేటాయించిన నిధుల్లో సగం ఒక్క కర్ణాటక ప్రభుత్వమే కేటాయించిందన్నారు. అన్ని మతాలను గౌరవిస్తా ఎంతో చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడిగా తాను అన్ని మతాలను, విశ్వాసాలను గౌరవిస్తానని చెప్పారు. కొన్ని పార్టీల తరహాలో మత ఘర్షణలు, విద్వేషాల్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పాకులాడబోనని రాహుల్ స్పష్టం చేశారు. మోదీ అవలంబిస్తున్న విదేశాంగ విధానాలు దేశాన్ని ఆత్మ రక్షణలో పడేయడం ఖాయమని ఆయన విమర్శించారు. యూపీఏ కంటే ఎన్డీయే హయాంలోనే పెట్రోల్ ధరలు భారీ పెరిగాయన్నారు. కన్నడ ప్రజల భాష, ఆహారం, అలవాట్లపై ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తోందని ఆరోపించారు. కన్నడిగుల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ గౌరవిస్తుందన్నారు. బెంగళూరును సిలికాన్ వ్యాలీగా మార్చడంలో కాంగ్రెస్ పార్టీ కృషి ప్రజలకు బాగా తెలుసని చెప్పారు. కర్ణాటకలో నిరుద్యోగం అనే మాట వినపడకుండా చేస్తామని రాహుల్‌గాంధీ హామీనిచ్చారు. మోదీ వైఫల్యాలనుప్రజలు గమనించారు: సిద్దరామయ్య సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్రంలో ముందుకు వెళ్తున్నామని.. రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో ప్రధాని మోదీ వైఫల్యాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, బీజేపీని ఓటమి భయం వెంటాడుతోందని చెప్పారు. ప్రధాని స్థాయి వ్యక్తి సరైన ఆధారాలతో ఆరోపణలు చేస్తే బాగుంటుందని అన్నారు. అమిత్ షావి వట్టి మాటలేనని.. చేతల్లో ఏమీ ఉండదని విమర్శించారు. నాలుగేళ్లలో దేశానికి ఏమీ చేశారో చెప్పకుండా కేవలం రాహుల్ గాంధీని విమర్శించడమే మోదీ పనిగా పెట్టుకున్నారని ఆయన తప్పుపట్టారు. -
అత్యాచారాలపై రాజకీయాలు చేయడం తగదు
-
రేపట్నుంచి చంద్రబాబు విదేశీ పర్యటన
-
బికినీలు.. ఇండియాలో జాన్తా నై!
సాక్షి, న్యూఢిల్లీ : విదేశీ పర్యాటకులపై కేంద్ర పర్యాటక శాఖా మంత్రి కేజే ఆల్ఫోన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫారిన్ టూరిస్ట్‌లు తమ దేశంలో తిరిగినట్లు.. భారత్‌లో తిరిగితే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన సున్నితంగా హెచ్చరించారు. తాజాగా ఓ ప్రముఖ జాతీయ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... ‘విదేశాల్లో రోడ్ల మీద విదేశీయులు బికినీలేస్కుని తిరుగుతారు. కానీ, ఇండియా విషయానికొస్తే ఇక్కడ అలా తిరగటం కుదరదు. ఉదాహరణకు లాటిన్ అమెరికాలో రోడ్లపైనే మహిళలు బికినీలతో దర్శనమిస్తుంటారు. అఫ్ కోర్స్.. మన దగ్గర గోవా బీచ్‌లో అలాంటి స్వేచ్ఛ ఉంది. కానీ, వీధుల్లో మాత్రం అలా తిరిగేందుకు ఒప్పుకోం. ఎందుకంటే ఈ దేశంలో కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు ఉన్నాయి. వాటిని గౌరవించాల్సిన అవసరం ఉంది. విదేశీయులతోపాటు మనవాళ్లు కూడా దానికి భంగం కలిగించకూడదు’ అని ఆల్ఫోన్స్ వ్యాఖ్యానించారు. అలాగని చీరలు కట్టుకునే ఇక్కడికి రావాలని విదేశీయులకు తాను చెప్పటం లేదని.. ఇక్కడి సంప్రదాయాలకు తగ్గట్లుగా మెదిలితే చాలని, మన ప్రజలు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు.. వాళ్లు కూడా కోరుకునేది ఇదేనని ఆయన తెలిపారు. కాగా, గతంలోనూ విదేశీ పర్యాటకులను ఉద్దేశించి ఆయన ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ‘బీఫ్‌ను తమ దేశంలోనే తిని.. ఇండియాకు రావాలంటూ’ విదేశీ పర్యాటకులకు ఆయన సలహా ఇచ్చారు. -
కార్డు లిమిట్ 13 వేలు.. ఖర్చు 9 కోట్లు
న్యూఢిల్లీ: 200 డాలర్ల(రూ.13 వేలు) పరిమితితో ఎస్బీఐ జారీచేసిన విదేశీ ట్రావెల్ కార్డుల్లో మార్పులు చేసి ముంబైకి చెందిన ఒక వ్యక్తి రూ. 9.1 కోట్ల మేర ఖర్చు చేసిన సంఘటన బ్యాంకు ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. యలమంచిలి సాఫ్ట్వేర్ ఎక్స్‌పోర్ట్స్ తరఫున ముంబైలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఎన్నారై బ్రాంచ్ 2016లో ఫారిన్ ట్రావెల్ కార్డుల్ని జారీచేసింది. సందీప్ కుమార్ అనే వ్యక్తికి జారీచేసిన మూడు కార్డుల బ్యాలెన్స్‌లో మార్పులు చేసి నాలుగు బ్రిటిష్ ఈ కామర్స్ వెబ్సైట్లలో రూ. 9.1 కోట్ల మేర షాషింగ్ చేసిన విషయాన్ని యలమంచిలి కంపెనీ బ్యాంకు దృష్టికి తీసుకెళ్లింది. మూడు నెలల వ్యవధిలో మొత్తం 374 లావాదేవీలు జరిగినట్లు బ్యాంకు అధికారులు గుర్తించారు. ఒరకిల్ డేటాబేస్ ద్వారా బ్యాలెన్స్‌లో మార్పులు చేసి ఈ మోసానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ మోసంపై ఎస్బీఐ ఫిర్యాదు మేరకు సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. -
సాగర తీరంలో ఆకట్టుకున్న ఫ్రెంచ్ షో
హైదరాబాద్: దేశంలోనే తొలిసారి రాజధాని వేదికగా నిర్వహించిన ఫ్రెంచ్ ఏరియల్ షో నగరవాసులను మంత్ర ముగ్ధులను చేసింది. భారీ క్రేన్ సాయంతో 50 అడుగుల ఎత్తులో గాలిలో తేలియాడుతూ.. మరోపక్క మనసుకు పులకరించే సంగీతం మధ్యన సాగిన విన్యాసాలను కేరింతలు, చప్పట్లతో సందర్శకులు స్వాగతించారు. ‘మన్సూర్ ఇండియా కల్చరల్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం సందర్శకులను అమితంగా ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా హైదరాబాద్, చెన్నై, ఢిల్లీ నగరాల్లో నిర్వహిస్తున్న ఫ్రెంచ్ ఏరియల్ షో తొలి ప్రదర్శనను నెక్లెస్ రోడ్డు పీపుల్స్ ప్లాజాలో మంగళవారం రాత్రి నిర్వహించారు. ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో 18 మంది కళాకారుల సంగీతం, నృత్యం, క్రాఫ్ట్, ఆర్కెస్ట్రా, సర్కస్ తదితర ప్రదర్శనలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. 18 మందిలో ఆరుగురు యువతులు ఉండటం విశేషం. దేశంలోనే తొలి ఫ్రెంచ్ ఏరియల్ షోను నగరంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పర్యాటక, సాంస్కృతిక మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ఈ కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్రాన్సిస్ డైరెక్టర్ ఎమిలిన్ పాల్గొన్నారు. -
ఇటలీలో కాల్పులు.. ఆరుగురికి గాయాలు
మిలాన్: ఇటలీలోని మాసెరాటా పట్టణంలో శనివారం ఓ దుండగుడు కారులో ప్రయాణిస్తూ విదేశీ పర్యాటకులపై కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. గాయపడిన వారంతా విదేశీయులేనని వెల్లడించారు. దాడి చేసిన 28 ఏళ్ల వ్యక్తి ఇటలీ దేశస్తుడని తెలిపారు. అతనికి నేర చరిత్ర లేదని వెల్లడించారు. సుమారు రెండు గంటల పాటు తన కారులో ప్రయాణిస్తూ విచ్చలవిడిగా కాల్పులు జరిపిన తరువాత దుండగుడు ఓ చోట వాహనాన్ని వదిలేసి పారిపోయాడు. అనంతరం దానికి కొంచెం దూరంలోనే పోలీసులకు చిక్కాడు. బాధితులంతా నల్లజాతి వారేనని, ఈ ఘటనకు ఇటీవల జరిగిన ఇటలీ యువతి హత్యకు సంబంధం ఉండొచ్చని వారు భావిస్తున్నారు. 18 ఏళ్ల పమేలా మాస్ట్రోపిట్రో అనే యువతిని కూడా చంపి ఆమె మృత దేహాన్ని ముక్కలు చేసి రెండు సూట్‌కేసుల్లో కుక్కిన విషయం గత బుధవారం వెలుగుచూసింది. ఈ కేసులో నైజీరియా పౌరుడిని నిందితుడిగా చేర్చారు. -
ఆ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే ఉద్యోగులకు భారతీయ రైల్వేలు సరికొత్త అనుభూతిని అందించనున్నాయి. సీనియర్ అధికారులు మినహా గ్యాంగ్మెన్లు, ట్రక్మెన్ సహా ఇతర ఎన్జీవో ఉద్యోగులకు విదేశాలను చుట్టివచ్చే ప్లెజర్ ట్రిప్‌ను ఆఫర్ చేస్తున్నట్టు సంస్థ పేర్కొంది. 100 మంది సిబ్బందితో ఈనెల28న సింగపూర్, మలేషియాలకు తొలి బ్యాచ్ విమానంలో తరలివెళ్లింది. విదేశీ పర్యటనకు ప్రయాణ ఖర్చులో 25 శాతం ఖర్చును ఉద్యోగులు భరించాల్సి ఉండగా, 75 శాతం సిబ్బంది ప్రయోజనాల నిధి (ఎస్బీఎఫ్)నుంచి వాడుకోవచ్చని దక్షిణ మధ్య రైల్వే ఎస్సీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ ఉమాశంకర్ కుమార్ పేర్కొన్నారు. దిగువశ్రేణి క్యాడర్లు, రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న సిబ్బందికే విదేశీ పర్యటనల అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. సంస్థలోని నాన్ గెజిటెడ్ సిబ్బందికి దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ ఓవర్సీస్ క్యాంప్‌ను నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. రైల్వే సిబ్బంది తమ విదేశీ ప్రయాణంలో భాగంగా యూనివర్సల్ స్టూడియోస్, సింగపూర్‌లో సెంటోస, నైట్‌సఫారి, కౌలాలంపూర్ నగర టూర్, మలేషియాలో పెట్రోనాస్ టవర్స్, బటూ కేవ్స్, జెంటింగ్ హైల్యాండ్స్‌ను సందర్శిస్తుంది. -
హంపీలో సాంస్కృతిక నడక
హొసపేటె: విదేశీ పర్యాటకులు హంపీలో ఆదివారం హెరిటేజ్ వాక్ కార్యక్రమం చేపట్టారు. గో హెరిటేజ్ వాక్ అనే సంస్థ ఆధ్వర్యంలో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, అమెరికా, న్యూజీలాండ్ తదితర దేశాల నుంచి వచ్చిన సుమారు 15 మంది పర్యాటకులు, బెంగళూరు, హుబ్లీ తదితర ప్రాంతాలకు చెందిన స్వదేశీ సందర్శకులతో కలిసి హెరిటేజ్ వాక్‌లో పాల్గొన్నారు. హంపీలోని ఎదురు బసవణ్ణ మంటపంవద్ద ప్రారంభమైన నడక ప్రారంభించి విజయ విఠల దేవస్థానం, మహానవమి దిబ్బ, జలమంటపం, గజ్జల మంటపం, ఉగ్ర నరసింహ, లోటస్ మహల్, గజశాల తదితర పురాతన స్మారకాల మీదుగా 21 కి.మీ.ల మేర వరకు కొనసాగించారు. ఈసందర్భంగా ఇంగ్లండ్‌కు చెందిన జోనస్ ఎలిజబెత్ మాట్లాడుతూ పర్యాటక కేంద్రమైన హంపీలో హెరిటేజ్ వాక్ చేపట్టడం ద్వారా పురాతన స్మారకాల సంరక్షణపై అవగాహన కల్పించామన్నారు. -
చంద్రబాబు కొత్త నాటకానికి తెరతీశారు
-
‘బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణం’
సాక్షి, విశాఖపట్నం: సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనలపై శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. నాలుగేళ్లలో రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు, పెట్టుబడులు వచ్చాయో చెప్పాలన్నారు. తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి చేతినోప్పి పేరుతో కొత్త నాటకానికి సీఎం తెరతీశారని ఆరోపించారు. దోచుకున్నది దాచుకోవడానికే చంద్రబాబు విదేశాలకు వెళ్తున్నారని అన్నారు. నాలుగేళ్లుగా బీజేపీతో మైత్రి కొనసాగిస్తూ దండం పెడతామంటారా, కోర్టుకు వెళ్తామంటారా అని నిలదీశారు. సీఎం పదవిలో ఉండి బాధ్యతారహితంగా మాట్లాడటం దారుణమన్నారు. ప్రత్యేకహోదా, విశాఖ రైల్వేజోన్, దుగరాజపట్నం పోర్టు భిక్ష కాదు, విభజన హక్కు అని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి గురించి గతంలో బీజేపీ-టీడీపీ మైత్రిని ప్రశ్నిస్తే తమను అభివృద్ధి నిరోధకులుగా పేర్కొన్నారని గుర్తు చేశారు. ఇప్పుడు మీరేం మాట్లాతున్నారో అర్థమవుతుందా అని ప్రశ్నించారు. రైల్వే జోన్ గురించి కేంద్రమంత్రి సుజనా చౌదరి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బొత్స సత్యనారాయణ అన్నారు. -
‘అందుకే సీఎం కుర్చీలో బాలకృష్ణ’
సాక్షి, అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దావోస్ పర్యటన వల్ల రాష్ట్రానికి ఎన్నికోట్ల పెట్టుబడులు వచ్చాయో సమాధానం చెప్పాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయనిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రానికి పెట్టుబడులు ఏమోగానీ దోచుకున్నది.. దాచుకోవడానికి చంద్రబాబు విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. బాబు హయాంలో గిరిజనులు, దళితులు, మహిళలపై దాడులు అధికమయ్యాయన్నారు. మరోవైపు ఇరు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ రాజ్యాంగాన్ని గౌరవించడం లేదన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులను పొగడటమే పనిగా పెట్టుకున్నారని రఘువీరా ఆరోపించారు. ఇరు రాష్ట్రాలను పక్షపాతం లేకుండా చూసే బాధ్యత గవర్నర్‌పై ఉందని అన్నారు. బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు.. కాగా, విజయవాడలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బాలకృష్ణ.. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని సమీక్ష నిర్వహించిన అంశంపై రఘువీరా స్పందించారు. 'తన తండ్రి ఎన్టీఆర్ కుర్చీని చంద్రబాబు లాక్కున్నారని బాలకృష్ణ మనస్సులో ఉండి ఉండొచ్చు.. అందుకే సీఎం రాష్ట్రంలో లేనప్పుడు ఆ కుర్చీలో కూర్చున్నాడు. సీఎం సీట్లో కూర్చుని బాలకృష్ణ మోజు తీర్చుకున్నాడు' అని వ్యాఖ్యానించారు. -
విదేశీ పర్యటనకు మంత్రి అఖిల
కర్నూలు(అగ్రికల్చర్): రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. అధికారికంగా ఈ నెల 15 నుంచి 22 వరకు స్పెయిన్ దేశంలోని మ్యాడ్రిడ్‌లో మంత్రి పర్యటించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ధి చేయాలనే దానిని అక్కడ మంత్రి అధ్యయనం చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. -
విదేశీ పర్యటనలకు నారా లోకేష్
సాక్షి, అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు తనయుడు, మంత్రి నారా లోకేష్ దాదాపు 10 రోజులపాటు విదేశాలలో పర్యటించనున్నారు. రేపటి (డిసెంబర్ 13) నుంచి ఈ నెల 22వ తేదీ వరకూ మంత్రి లోకేష్ విదేశీ పర్యటన ఖరారైరనట్లు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి 16 వరకు అమెరికాలో అధికారిక పర్యటనకు వెళ్లనున్న లోకేష్... ఈ 17వ తేదీ నుంచి 22 వరకూ వ్యక్తిగత పర్యటన కోసం మాల్దీవులు వెళ్లనున్నారని సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అమెరికాకు విదేశీ పర్యాటకుల తగ్గుముఖం
వాషింగ్టన్: వీసా నిబంధనలు కఠినతరం చేయడం, ట్రావెల్ బ్యాన్ కారణంగా ఈ ఏడాది జూన్ వరకు అమెరికాకు వచ్చిన విదేశీ పర్యాటకుల సంఖ్య గణనీయంగా తగ్గింది. వ్యాపార పనుల మీద వచ్చే వారి సంఖ్య దీని కన్నా మరింత పడిపోయిందని అమెరికా ట్రావెల్ అండ్ టూరిజం కార్యాలయం తన నెలవారీ నివేదికలో వెల్లడించింది. అందులోని వివరాలు... గతేడాది తొలి ఆరు నెలల కాలంతో పోలిస్తే అమెరికాలో పర్యటించిన వారి సంఖ్య నాలుగు శాతం పడిపోయింది. మెక్సికో పర్యాటకుల సంఖ్యలో 9 శాతం, బ్రిటన్ పర్యాటకుల సంఖ్యలో ఆరు శాతం తగ్గుదల నమోదైంది. వ్యాపారాల నిమిత్తం వచ్చే వారి సంఖ్య 9 శాతం పడిపోయింది. అధ్యక్షుడు ట్రంప్ ప్రయాణ నిషేధ ఉత్తర్వుల ఫలితంగా మధ్య ప్రాచ్య దేశాల నుంచి వచ్చే పర్యాటకుల సంఖ్య 30 శాతం పడిపోయింది. ఆఫ్రికా పర్యాటకుల సంఖ్య 27 శాతం తగ్గింది. ఉత్తర అమెరికా, కరీబియన్, తూర్పు ఐరోపాల నుంచి తగ్గిన పర్యాటకుల శాతం రెండంకెలకు చేరడం గమనార్హం. భారత్, వెనెజులా, అర్జెంటీనా, బ్రెజిల్ తదితర దేశాల పర్యాటకుల్లో 10 శాతానికి పైగా తగ్గిపోయారు. విచిత్రంగా అమెరికాతో యుద్ధానికి కాలు దువ్వుతున్న ఉ.కొరియా నుంచి పర్యాటకులు 18 శాతం పెరిగారు. -
ఎగిరిపోతే..ఎంత బాగుంటుందో!
వీకెండ్ వచ్చింది.. ఎంజాయ్ చేయాలి. ఐదురోజులు పండగ సెలవులొచ్చాయి.. ఎక్కడికైనా సరదాగా వెళ్లాలి. సిటీలో తిరిగితిరిగీ విసుగొచ్చేసింది.. అందుకే దూరంగా ఎగిరిపోవాలి.. ఆనందంగా విహరించి రావాలి. ఈ ఆలోచన వచ్చిందే తడవు సిటీవాసులు ఆచరణలో పెడుతున్నారు. ఆన్లైన్లో చూస్తున్నారు.. ఫ్లైట్ టికెట్ బుక్ చేస్తున్నారు.. అప్పటికప్పుడే ‘రెక్కలు’ çకట్టుకుపోతున్నారు. రెండు రోజులు సెలవుదొరికినా సరే సింగపూర్, మలేసియా, దుబాయ్ వంటి దేశాల్లో వాలిపోతున్నారు. విమానయాన సంస్థలు, ట్రావెల్ ఏజెన్సీలు అందిస్తున్న ఆకర్షణీయమైన ఆఫర్లతో దిగువ మధ్య తరగతివారు సైతం పక్క రాష్ట్రాలకు విమానంలో వెళ్లొస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, సిటీబ్యూరో: నగరవాసుల పర్యాటక దృక్పథంలో సరికొత్త మార్పులు వచ్చేశాయి. రోజు రోజుకు దిగివస్తున్న ఫ్లైట్ చార్జీలతో మధ్యతరగతి ప్రజలు అంతర్జాతీయ ప్రయాణాలకు ఆసక్తి చూపుతున్నారు. నాలుగు రోజులు సెలవులొస్తే చాలు ఏ మలేషియా ట్రిప్పుకో, సింగపూర్ టూర్‌కో సన్నద్ధమవుతున్నారు. నగరవాసుల అభిరుచికి తగ్గట్లుగానే ట్రావెలింగ్ సంస్థలు సైతంఆకర్షణీయమైన ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. ప్రభుత్వరంగ సంస్థ అయిన ఐఆర్సీటీసీ, అంతర్జాతీయ ట్రావెల్ ఆర్గనైజర్ కాక్స్ అండ్ కింగ్స్ వంటి సంస్థలు ఈ వింటర్లో ప్రయాణికులను ఆకట్టుకొనేందుకు చక్కటి ప్యాకేజీలతో ముందుకు వస్తున్నాయి. మరోవైపు శని, ఆదివారాలు వంటి వీకెండ్స్‌లో ఎక్కువ శాతం మంది ఊటీ, కొడైకెనాల్, కూర్గ్, పంచాగ్ని వంటి పొరుగు రాష్ట్రాల్లోనిప్రాంతాలను ఎంపిక చేసుకుంటున్నారు. గతేడాది కంటే ఈ సంవత్సరం సిటీ నుంచి అంతర్జాతీయ పర్యాటక ప్రయాణాలు 20 శాతం వరకు, దేశీయ పర్యాటక ప్రయాణాలు 18 శాతం పెరిగినట్లు కాక్స్ అండ్ కింగ్స్‌లో సర్వేలో వెల్లడైంది. ఆ ఐదు దేశాలకే ఎక్కువ డిమాండ్... వ్యాపారం, ఉద్యోగం, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్ నుంచి ఎక్కువ శాతం అమెరికా, యూరోప్ దేశాలకు వెళ్తుండగా సందర్శనీయ స్థలాల కోసం ఎక్కువ మంది దుబాయ్, సింగపూర్, థాయ్‌లాండ్, మలేషియా, ఆస్ట్రేలియాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వింటర్ హాలిడేస్‌లో ఈ ఐదు దేశాలకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ట్రావెలింగ్ ఏజెన్సీలు పేర్కొంటున్నాయి. ఐఆర్సీటీసీ రూపొందించే ప్యాకేజీల్లోనూ దుబాయ్, అబుదాబి వంటి దేశాలకే ఎక్కువ ప్రాధాన్యం ఉండడం గమనార్హం. ఈ ఐదు దేశాల తరువాత ఇండోనేషియా, దక్షిణాఫ్రికా వంటి దేశాలను సైతం పర్యాటకంగా ఎంపిక చేసుకుంటున్నారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు సుమారు 40 వేల మంది ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుండగా వారిలో ఎక్కువ శాతం ఈ ఐదు దేశాలకు వెళ్లే వాళ్లు ఉండడం విశేషం. వింటర్ హాలిడేస్‌లో ఈ సంఖ్య మరో 10 వేలు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా. డొమెస్టిక్ టూర్స్... అంతర్జాతీయ ప్రయాణాలతో పాటు జాతీయ స్థాయి సందర్శన ప్రాంతాలకు సైతం ఫ్లైట్ ప్యాకేజీలకు డిమాండ్ బాగా పెరిగింది. కేరళ, అండమాన్, గోవా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ తదితర రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలకు ఎక్కువ శాతం తరలి వెళ్తున్నారు. మహారాష్ట్రలోని పంచాగ్ని, కర్ణాటకలోని కూర్గ్, తమిళనాడలోని ఊటి, కొడైకెనాల్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు కాక్స్ అండ్ కింగ్స్ వెల్లడించింది. ఇక ప్రయాణికుల అభిరుచికి తగిన విధంగానే ట్రావెలింగ్ ఏజెన్సీలు ప్యాకేజీలను సిద్ధం చేస్తున్నాయి. విమానప్రయాణంతో పాటు, రోడ్డు రవాణా, భోజనం, వసతి, సైట్‌సీయింగ్, తదితర అన్ని సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాయి. యూరోప్ దేశాలకు రూ.లక్ష లోపే గ్రూపు ప్యాకేజీలను అందజేస్తున్నాయి. ఐఆర్సీటీసీ ప్యాకేజీలు.. రైల్వే అనుబంధ ప్రభుత్వ రంగ సంస్థ ఐఆర్సీటీసీ విమాన ప్రయాణాలను సైతం అందిస్తోంది. ‘పర్యాటక్ పర్వ్–2017’ లో భాగంగా డొమెస్టిక్, ఇంటర్నేషనల్ ప్యాకేజీలను సిద్ధం చేసింది. వచ్చే జనవరి 26 నుంచి 4 రోజుల పాటు కొనసాగే దుబాయ్ టూర్లో భాగంగా ఒక ప్రయాణికుడికి రూ.59,814 ప్యాకేజీలో ఫ్లైట్ టిక్కెట్, వసతి, రోడ్డు రవాణా తదితర అన్ని సదుపాయాలను కల్పిస్తోంది. వింటర్ టూర్లో భాగంగా వచ్చే నవంబర్ 17 నుంచి జనవరి 12వ తేదీ వరకు దశలవారీగా శబరి, కొచ్చిన్, గురువాయూర్ తదితర ప్రాంతాలకు ప్యాకేజీలను సిద్ధం చేసింది. ఒక ప్రయాణికుడికి రూ.15,885 ప్యాకేజీలో అన్ని వసతులు కల్పిస్తారు. వచ్చే ఫిబ్రవరి 23వ తేదీ నుంచి 4 రోజుల పాటు కొనసాగే సౌత్ గోవా టూర్ చార్జీ రూ.రూ.16,854 మాత్రమే. అహ్మదాబాద్, జూనాగఢ్, సాసన్గిర్ తదితర ప్రాంతాల సందర్శన కోసం మరో ప్యాకేజీని సిద్ధం చేశారు. ఇంలాంటి ప్యాకేజీలు మరెన్నో ఐఆర్సీటీసీ సిద్ధం చేసింది. తరుచూ వెళ్తుంటా.. ఫ్లైట్ చార్జీలు ఇపుడు చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. దీంతో పాటు ఐఆర్సీటీసీ వంటి సంస్థలు మంచి ప్యాకేజీలు అందజేస్తున్నాయి. ఇంటర్నేషనల్ ట్రావెల్ ఏజెన్సీలు కూడా అందుబాటులో ఉండడంతో నేను కుటుంబంతో సహా రెగ్యులర్‌గా సింగపూర్, మలేషియా, దుబాయ్, గోవా, కొడైకెనాల్ ప్రాంతాలకు వెళ్తాను. – ప్రదీప్‌రెడ్డి ఫ్లైట్ జర్నీ ఈజీ అయింది.. ఒకప్పటితో పోల్చుకొంటే ఇప్పుడు ఫ్లైట్ జర్నీ చాలా ఈజీ అయింది. గంటల తరబడి రైళ్లలో ప్రయాణం చేయడం కంటే ఫ్లైట్‌లో వెళ్లడం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. గోవా, విశాఖ,ఊటీ, కొడైకెనాల్ వంటి ప్రాంతాలకు ట్రైన్ కంటే ఫ్లైట్ బెటర్. – నాగలక్ష్మి, లెక్చరర్ ఐఆర్సీటీసీ ప్యాకేజీలకు బీమా కూడా ఉంది పర్యాటకులకు అన్ని సదుపాయాలతో ప్యాకేజీలను అందజేస్తున్నాం. ఫ్లైట్ టిక్కెట్లతో పాటు, భోజనం, వసతి, రోడ్డు రవాణా, గైడ్స్ వంటి అన్ని సదుపాయాలు ఐఆర్సీటీసి అందజేస్తోంది. పైగా ప్రయాణికులకు బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నాం. – సంజీవయ్య, డిప్యూటీ జనరల్ మేనేజర్, ఐఆర్సీటీసీ -
శివుడే భిక్షం ఎత్తుకోమన్నాడు...
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘నాతో సెల్ఫీకి రూ.10 రేటు పెట్టాను, డబ్బులు చెల్లించి మరీ సెల్ఫీ దిగుతున్నారు’ అని రష్యన్ పర్యాటకుడు ఈవ్జెనీ బేర్టినీ కోవ్ చెప్పాడు. ఈ నెల 9న కాంచీపురం పర్యటనకు వచ్చిన కోవ్ తన ఖర్చులకు తెచ్చుకున్న డబ్బులు అయిపోవడంతో కోపంతో ఏటీఎం కార్డును చించేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి డబ్బుల కోసం కాంచీపురంలోని ఓ ఆలయం మెట్ల వద్ద కోవ్ భిక్షమెత్తుకుంటు న్నాడు. పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చి ఖర్చులతో చెన్నైలో రష్యా రాయబార కార్యాలయానికి పంపినా వెనక్కి వచ్చి టీ నగర్‌లోని వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద యాచిస్తున్నాడు. చెన్నై నార్త్ ఉస్మాన్‌రోడ్డులోని మరో ఆలయం వద్ద ఆదివారం భిక్షమెత్తుకుంటున్న కోవ్ని స్థానికులు పలకరించగా.. ఆలయాల వద్ద భిక్షం అడగ్గానే డబ్బులేస్తున్నారని అన్నాడు. భారత్‌కు వచ్చేటప్పుడు తన వద్ద రూ.4 వేలు ఉండేవని, కానీ ఇప్పుడు తన దగ్గర భారీగా సొమ్ము చేరిందని తెలిపాడు. అంతేకాకుండా తాను శివ భక్తుడిని అని, ఆయనే తనను భిక్షం ఎత్తుకోమని ఆదేశించినట్లు చెప్పుకొచ్చాడు. అందుకే భారత్‌లోని ఆలయాలన్నీ తిరుగుతూ భిక్షమెత్తుకోవాలని తాను తీర్మానించుకున్నట్లు వెల్లడించాడు. -
‘బిచ్చమెత్తుకోవటం భలే బాగుంది’
సాక్షి, చెన్నై: ‘దర్జాగా తిరిగితే సరదా ఏముంది...బిక్షమెత్తుకోవడంలోనే మజా ఉంది’ అని భావిస్తున్నాడు రష్యాకు చెందిన ఒక పర్యాటకుడు. ఖర్చుకు కనీస డబ్బులు లేని స్థితిలో బిక్షమెత్తుకుంటున్న అతడికి విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ స్నేహహస్తం అందించినా నిరాకరించి చెన్నైలో బిక్షమెత్తుకుంటా అంటూ నగరంలో తిరుగుతున్నాడు. వివరాలివీ.. రష్యా దేశానికి చెందిన ఈవ్జెనీ బేర్టినీ కోవ్ అనే వ్యక్తి ఈనెల 9వ తేదీన కాంచీపురం పర్యాటనకు వచ్చాడు. ఖర్చుల కోసం ఏటీఎం వద్దకు వెళ్లగా అతని కార్డు నుంచి సొమ్మురాలేదు. దీంతో విరక్తి చెందిన అతను ఎటీఎం కార్డును విరగొట్టాడు. ఖర్చులకు మరో మార్గం లేకపోవడంతో కాంచీపురంలోని ఒక ఆలయం మెట్ల వద్ద తన టోపీని జోలెగా పడుతూ ఈనెల 10వ తేదీన బిచ్చమెత్తుతూ కూర్చున్నాడు. అదే ఆలయం వద్దనున్న బిచ్చగాళ్లు తమ వరుసలో ఎర్రగా బుర్రగా ఉన్న రష్యా బిక్షగాడిని చూసి ఎంతో మర్యాదగా వ్యవహరించసాగారు. ఆలయానికి వచ్చిన భక్తులు సైతం అయ్యో పాపం అంటూ దండిగా డబ్బులు వేయడం ప్రారంభించారు. ఇంతలో ఈ సమాచారం పోలీసులకు అందడంతో అతడికి కౌన్సెలింగ్ చేసి చెన్నైలో రష్యా రాయబార కార్యాలయానికి కబురంపారు. పోలీసుల సహకారంతో చెన్నైకి చేరుకున్న కోవ్, టీ నగర్ పరిసరాలు తిరిగి, అక్కడి ఆలయంలో స్వామిని దర్శించుకున్నాడు. తనను పలుకరించిన వారితో అతను మాట్లాడుతూ, రష్యా–ఉగ్రెయిన్ మధ్య సైనికపోరు కారణంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని, ఈ కారణంగా తాను పర్యాటక వీసాలో భారత్‌కు చేరుకున్నట్లు తెలిపాడు. భారత్‌కు వచ్చిన సమయంలో తన వద్ద కేవలం రూ.4 వేలు మాత్రమే ఉన్నాయని, ఈ డబ్బు కూడా ఖర్చయిపోవడంతో దిక్కుతోచక కాంచీపురంలో బిక్షమెత్తినట్లు తెలిపాడు. ఈ విషయం పత్రికల్లో రావడంతో కొందరు డబ్బు సహాయం చేశారని చెప్పాడు. రష్యాకు ఎప్పుడెళతావు అని ప్రశ్నించగా, చెన్నైలోనే ఉంటూ బిచ్చమెత్తుకుంటాను, ఇదే బాగుందని తెలిపాడు. ఈ విషయంపై రష్యా రాయబార కార్యాలయంలో వివరణ కోరగా, నిబంధనల ప్రకారం ఎవరైనా సాయం కోరినప్పుడే తాము స్పందించాలని, అతని నుంచి ఎటువంటి అభ్యర్దన రాలేదని తెలిపారు. రష్యా పర్యాటకుని భారత్ వీసా నవంబరు 22వ తేదీతో ముగియనుంది. రష్యా యువకుడు బిక్షమెత్తుకుంటున్న సమాచారం తెలుసుకున్న భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ట్విట్టర్ ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. ‘ఈవ్ జెనీ..మీ రష్యా మాకు మిత్రదేశం, చెన్నైలోని విదేశాంగశాఖ అధికారులు నీకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించేందుకు సిద్దంగా ఉన్నారు’ అని తన ట్విటర్ ద్వారా ఈనెల 11వ తేదీన సందేశం పంపారు. అయితే సుష్మాస్వరాజ్ సహకారంపై రష్యా యువకుడు స్పందించిన దాఖలాలు లేవు. -
ఏటీఎం కార్డు లాక్ కావటంతో.. బిచ్చగాడిగా..
సాక్షి, చెన్నై: భారతదేశంలో పర్యటించటానికి వచ్చిన రష్యా యువకుడు విధి వక్రించి బిచ్చగాడిగా మారాడు. అధికారులు అతడి విషయం తెలుసుకుని రష్యా రాయబార కార్యాలయం అధికారులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన బెర్నకోల్(25) భారత దేశంలోని ఆలయాలను చూడడానికి సెప్టెంబర్ 8న భారత్‌కు వచ్చాడు. రైలులో సోమవారం రాత్రి 8.15 గంటలకు కాంచీపురం చేరుకున్నాడు. చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు కావడంతో మనీ తీయడానికి ఏటీఎంలో ప్రయత్నించాడు. ఏటీఎం పాస్వర్డ్ తప్పుగా ఎంటర్ చేయడంతో కార్డు లాక్ అయిపోయింది. చేతిలో పైసా లేకపోవడంతో విరక్తి చెందిన అతడు కార్డును విరిచేశాడు. డబ్బు కోసం ఏం చేయాలో తెలియక రాత్రంతా కాంచీపురంలోని వీధుల వెంట తిరిగాడు. మంగళవారం ఉదయం కుమరకోట్టం ప్రాంతంలో గల మురుగన్ ఆలయం పరిసరాల్లో భిక్షమెత్తుకోవటం మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకుని శివకంచి పోలీసులు అతడిని మంగళవారం రైలులో చెన్నైకు తీసుకు వచ్చి దౌత్య కార్యాలయ అధికారులకు అప్పగించారు. -
పర్యాటక రంగంతో ఆర్థికాభివృద్ధి
హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి పర్యాటక రంగం ఎంతో దోహదపడుతోందని, అందుకే ఆ రంగం అభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ అన్నారు. హైదరాబాద్‌లోని గోల్కొండ, చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియంతో పాటు వరంగల్‌లోని వెయ్యి స్తంభాల గుడి, కుంటాల జలపాతం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్నాయని చెప్పారు. ఏటా 2.5 లక్షల మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి వస్తున్నారని, 2020 నాటికి విదేశీ పర్యాటకుల సంఖ్య పది లక్షలకు పెంచేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని చెప్పారు. శుక్రవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో 78వ ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి పర్యాటక రంగ సదస్సు హైదరాబాద్‌లో జరగడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. హైదరాబాద్ బిర్యానీ అందరికీ ఇష్టమని, తెలంగాణ సంస్కృతికి చిహ్నంగా నిలిచే బతుకమ్మ, బోనాలు గురించి ప్రపంచానికి తెలియజేసేందుకు ఈ సదస్సు వీలు కల్పించిందన్నారు. రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి బి.వెంకటేశం మాట్లాడుతూ.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కోహినూర్ వజ్రం పుట్టినిల్లు హైదరాబాద్ అని అన్నారు. 30 శాతం ఫార్మా డ్రగ్స్ హైదరాబాద్‌లోనే తయారవుతాయని చెప్పారు. విజిట్ ఫర్ ఆల్ రీజన్ ఆల్ సీజన్ అనే నినాదంతో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు. ప్రొఫెసర్ హిమాన్షు రాయ్ మాట్లాడుతూ.. వ్యాపారమంటే ప్రతి ఒక్కరికీ భయం ఉంటుందని, నష్టాన్ని ఊహించుకుని ఊరుకోలేమని, సక్సెస్ అనేది మన నెట్‌వర్కింగ్‌పై ఆధారపడి ఉంటుందని అన్నారు. పరస్పర సహాయ సహకారాలు ఎస్‌కేఏఎల్ వరల్డ్ ప్రెసిడెంట్ డేవిడ్ ఫిషర్ మాట్లాడుతూ.. ఈ సదస్సు నాలుగు రోజుల పాటు జరుగుతుందన్నారు. ట్విన్నింగ్ ప్రోగ్రామ్ ద్వారా ట్రావెల్, టూరిజంలో ఎస్‌కేఏఎల్ క్లబ్‌లు సహాయ సహకారాలు అందించుకుంటాయని, ఇండో–యూఎస్ టూరిజం మరింత అభివృద్ధి చెందేందుకు వీలుంటుందని చెప్పారు. విశ్వనగరాలతో పోటీపడి హైదరాబాద్ ఈ సదస్సుకు ఎంపికయ్యిందన్నారు. భారత్‌కు ఎనిమిదిసార్లు వచ్చానని, హైదరాబాద్‌కు మూడుసార్లు వచ్చానని, హైదరాబాద్‌లో ముత్యాలు కొనుగోలు చేశానని చెప్పారు. హైదరాబాద్‌ను తనæ పుట్టినిల్లుగా ఆయన అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ సుసన్న సరి, డైరెక్టర్లు లావొన్నె విట్మన్, జాసన్ శామ్యూల్, ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ప్రెసిడెంట్ విలియం ర్యాన్, ఎస్‌కేఏఎల్ ఇండియా ప్రెసిడెంట్ మారియో, ఎస్‌కేఏఎల్ ఇంటర్నేషనల్ హైదరాబాద్ చాప్టర్ ప్రెసిడెంట్ విజయ్ మోహన్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. ఇది అతి పెద్ద కార్యక్రమం.. ఇండియాకు చెందిన 9 ఎస్‌కేఏఎల్ క్లబ్‌లు.. అమెరికాకు చెందిన 13 ఎస్‌కేఏఎల్ క్లబ్‌లతో జత కట్టాయని, ఎస్‌కేఏఎల్ చరిత్రలోనే ఇది అతి పెద్ద కార్యక్రమం అని అమెరికా కాన్సులేట్ జనరల్ క్యాథరిన్ బీ హడ్డా అభివర్ణించారు. ఈ ఏడాదిని ఇండో–యూఎస్ ట్రావెలింగ్ టూరిజం ఇయర్‌గా ఎస్‌కేఏఎల్ ప్రకటించిందన్నా రు. భారత్–అమెరికా మధ్య వ్యాపార సంబంధాలు మెరుగుపడ్డాయని, గతం లో ఏడాదికి 20 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగితే.. గతేడాది ఏకంగా 115 బిలియన్ డాలర్ల వ్యాపారం జరిగిందన్నారు. 2009 నుంచి పోల్చి చూస్తే అమెరికా వెళ్లే భారతీయుల సంఖ్య రెండింతలైందని, 2015లో 10 లక్షల మంది భారతీయులు నాన్ ఇమిగ్రేటెడ్ వీసాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. -
ఆకర్షణ.. ఆవిరేనా!
అపారమైన ప్రకృతి సౌందర్యంతో అలరారే పర్వత ప్రాంతాలు, విశాలమైన సముద్ర తీరం, అందమైన కాఫీ తోటలు, వీటన్నింటినీ మించి ఘనమైన వారసత్వ సంపదైన మైసూరు, హంపీ, హళేబీడు, బాదామి వంటి గతించిన సామాజ్ర కట్టడాలతో కన్నడనాడు పర్యాటకులకు స్వర్గమే. ప్రపంచమే కుగ్రామమైన నేటి రోజుల్లో రాష్ట్రానికి విదేశీ పర్యాటకులు వెల్లువెత్తాలి. అయితే ఇందుకు భిన్నంగా జరుగుతోంది. సాక్షి, బెంగళూరు: రాష్ట్ర పర్యాటక స్థలాలపై విదేశీయులు ఆసక్తి తగ్గుతోందా అంటే మూడేళ్ల గణాంకాలను అనుసరించి అవుననే సమాధానం చెప్పాల్సి వస్తోంది. ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరే ప్రధాన కారణమనే విమర్శలు ఉన్నాయి. రాష్ట్రంలో పర్యాటక శాఖ గుర్తించిన 352 ప్రాంతాలు పర్యాటకానికి అనుకూలంగా ఉంటాయి. అయితే విదేశీయులు ఎక్కువగా టెంపుల్, జంగిల్ టూరిజానికి ఎక్కువగా ఆసక్తి చూపుతారు. రాష్ట్రంలో ముఖ్యంగా 13 వైల్డ్‌లైఫ్ టూరిజం ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో బన్నేరుఘట్ట నేషనల్ పార్కుకు దగ్గరగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది. మిగిలిన ఏ వైల్డ్‌లైఫ్ పార్క్‌కు సమీపంగా విమానయాన సర్వీసులు లేవు. విదేశీయులు రోడ్డు మార్గం కంటే విమానయాన సేవల ద్వారా తాము చూడదలుచుకున్న ప్రాంతాలకు వెళ్లడానికి మాత్రమే విమానయాన సేవలు అందుబాటులో ఉన్నాయి. తప్ప మిగిలిన ఏ ప్రాంతాలనికి విమానయాన సేవలు అందుబాటులో లేవు. దీంతో విదేశాల నుంచి ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య తగ్గిపోతోందని పర్యాటక శాఖ అధికారులే చెబుతున్నారు. వసతుల కొరత.. భాషా సమస్య విదేశీయులు ఉండటానికి అనుగుణంగా హోటల్స్ సౌకర్యాలు ఉండటం లేదని తెలుస్తోంది. త్రీ స్టార్ హోటల్స్ అని చెప్పుకునే చాలావాటిలో కనీస వసతులు కూడా సక్రమంగా లేవన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక పర్యాటక ప్రాంతానికి, సదరు హోటల్స్ ఉన్న ప్రాంతానికి మధ్య సరైన వాహన వ్యవస్థ లేకపోవడం వల్ల విదేశీ పర్యాటకులకు ఇబ్బందిగా మరింది. హంపీని ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ విదేశీ పర్యాటకుల ఎక్కువగా వస్తుంటారు. అయితే వారికి సరైన సదుపాయాలు మాత్రం ఉండటం లేదని విమర్శలు ఉన్నాయి. కొడగు ప్రాంతంలో హోంస్టేలు ఉన్నా కూడా అందులో దేశీయ ఆహారం మాత్రమే లభిస్తోందని.. ఆ వంటకాలను విదేశీయులు తినలేకపోతున్నారని పర్యాటకశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రముఖంగా భాషా సమస్య కూడా విదేశీయుల సంఖ్య తగ్గడానికి కారణమని తెలుస్తోంది. రాష్ట్రంలో ఉన్న గైడ్లకు ఇంగ్లీషు, జర్మనీ వంటి ఒకటి రెండు భాషలు తప్ప మరే ఇతర భాషలు కూడా రావడం లేదు. దీంతో చైనా, ఆఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చే పర్యాటకులు ఇక్కడి విశేషాలు తెలుసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పర్యాటక మంత్రి ఖర్గె ఏమంటున్నారు..? ఈ విషయమై రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి ప్రియాంక ఖర్గే మాట్లాడుతూ...‘విదేశీ పర్యాటకులను ఆకర్షించే చర్యల్లో భాగంగా పర్యాటక మిత్ర పేరుతో స్థానిక యువతకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నాం. వీరికి కనీసం ఇంగ్లీషు కాక మరో మూడు భాషల్లో స్థానిక పర్యాటక ప్రాంతం గురించి ఇతరులకు చెప్పేలా ఆ శిక్షణ ఉంది. ఇక ఉడాన్ పథకంలో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా విమానసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ చర్య పర్యాటక రంగానికి కూడా మేలు చేకూరుస్తుందని భావిస్తున్నాం’ అని పేర్కొన్నారు. -
మెడికల్ లీవ్ కోసం సంతకం ఫోర్జరీ
వ్యవసాయ శాఖ ఏడీ మాధవిపై కేసు నమోదు కొవ్వూరు : తన సంతకం ఫోర్జరీ చేసి మెడికల్ లీవ్ సర్టిఫికెట్స్ సృష్టించుకున్నట్టు కొవ్వూరు ప్రభుత్వాసుపత్రి ఇన్చార్జ్ సూపరింటెండెంట్ పి.సుధీర్ ఇచ్చిన ఫిర్యాదుపై పట్టణ పోలీసులు వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పి.మాధవిపై శుక్రవారం కేసు నమోదు చేశారు. మాధవి ప్రస్తుతం నిడదవోలులోని బైలాజికల్ ల్యాబ్‌లో ఏడీగా పనిచేస్తున్నారు. 23, 21 రోజుల సెలవుకు సంబంధించిన మెడికల్ లీవ్‌తో పాటు ఆర్యోగపరమైన సమస్యలున్నట్టు నాలుగు ధ్రువీకరణ పత్రాలతో ఒక వ్యక్తి తన వద్దకు వచ్చి జిరాక్స్ పేపర్లపై అటిస్టేషన్ చేయాలని కోరాడన్నారు. దీంతో ఆ పత్రాలు పరిశీలించి అవాక్కయ్యాయని సుధీర్ తెలిపారు. ఆ వ్యక్తిని నిలదీసి వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులుగా పనిచేస్తున్న పి.మాధవితో ఫోన్లో మాట్లాడిన అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సుధీర్ తెలిపారు. తన సంతకంతో పాటు సీల్ పోర్జరీ చేసినట్టు గుర్తించానన్నారు. ఈ ఫిర్యాదు మేరకు మాధవిపై కేసు నమోదు చేసినట్టు పట్టణ సీఐ పి.ప్రసాదరావు తెలిపారు. -
ఆరేళ్లలో 21 విదేశీ ట్రిప్‌లు...
సాక్షి, ముంబయి : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐటీ అధికారి వివేక్ బాత్రా విలాసవంత జీవితం విస్తుగొలుపుతుంది. ఆరేళ్లలో ఆయన తనే భార్యతో కలిసి 21 సార్లు విదేశాలను చుట్టివచ్చారు. వీరు కేవలం ఆరు నెలల వ్యవధిలో ఎనిమిది సార్లు అమెరికాను సందర్శంచారు. ఐటీ అధికారి వివేక్ బాత్రా అక్రమంగా ఆర్జించిన సొమ్మును స్టాక్ మార్కెట్లలో లిస్టయిన డొల్ల కంపెనీలకు తరలించేవారని సీబీఐ వెల్లడించింది. బాత్రా దంపతుల విలాసవంత లైఫ్‌స్టైల్ పైనా సీబీఐ దృష్టి సారించింది. మహాలక్ష్మి రేస్‌కోర్సులో జరిగిన ఓ చిన్న పార్టీలో కేవలం డ్రింక్స్ కోసమే వీరు రూ 50,000 వెచ్చించారని తెలిసింది. దంపతులిద్దరూ తరచూ నగరంలోని సెలబ్రిటీ పార్టీల్లో దర్శనమిస్తుంటారు. ముంబయిలో ఆదాయపన్ను అదనపు కమిషనర్‌గా పనిచేస్తున్న బాత్రాపై గతనెలలో సీబీఐ ఆదాయాన్ని మించి ఆస్తులు కలిగిఉన్నారని కేసు నమోదు చేసింది. బాత్రా దంపతులు 2008 నుంచి 2017 మధ్య రూ 6.79 కోట్ల విలువైన ఆస్తులను అక్రమంగా కూడబెట్టారని సీబీఐ ఆరోపిస్తోంది. ఈ కేసులో బాత్రా సీఏ, రెండు కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లపైనా కేసులు నమోదయ్యాయి. 2005లోనూ బాత్రాపై సీబీఐ అభియోగాలు మోపింది. అప్పట్లో సీబీఐ ఆరోపణలను ఆయన న్యాయస్ధానాల్లో సవాల్ చేశారు. -
95గంటల టూర్.. 33గంటలు ఫ్లైట్‌లో మోదీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ అంకితభావం చూస్తే మీరు అవాక్కవ్వాల్సిందే. ఆయన పెట్టుకున్న షెడ్యూల్కోసం తప్ప ఒక్క నిమిషాన్ని కూడా వృధా చేయడం తనకు అస్సలు ఇష్టం ఉండదని ఆయన మరోసారి నిరూపించారు. విజయవంతంగా మూడు విదేశాంగ పర్యటనలు ముగించుకొని ప్రధాని నరేంద్రమోదీ బుధవారం ఉదయం ఢిల్లీలో అడుగుపెట్టారు. భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ వెళ్లే సమయంలో ఎంత హుషారుగా ఉన్నారో అంతకుమించిన ఆనందంతో కనిపించారు. ఈ నాలుగు రోజుల పర్యటనలో ఆయన ఎక్కడ కూడా పూర్తిస్థాయిలో విశ్రాంతి తీసుకోలేదు. మరుసటి రోజు ఏదైనా ప్రోగ్రాం ఉంటే తప్ప ఆయన బస చేయలేదు. పోర్చుగల్, నెదర్లాండ్‌లో ఒక్కోరోజులోనే తన పర్యటనను పూర్తి చేసిన మోదీ అమెరికాలో మాత్రం రెండు రోజులు పర్యటించారు. మొత్తం 95గంటలపాటు సాగిన ఆయన టూర్లో 33గంటలు ఎయిర్ ఇండియా బోయింగ్ విమానంలో ప్రయాణించారు. పోర్చుగల్, అమెరికా, నెదర్లాండ్‌లో కలిపి వరుసగా 33 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జూన్ 24న ఉదయం 7గంటలకు ఢిల్లీ నుంచి బయల్దేరి లిస్బాన్ పదిగంటల్లో వెళ్లిన మోదీ అక్కడ కనీసం హోటల్ కూడా తీసుకోకుండా అక్కడి ఎయిర్‌పోర్ట్‌లోనే వీవీఐపీ లాంజ్‌లో విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత నేరుగా పోర్చుగల్ విదేశాంగ కార్యాలయానికి వెళ్లి కలిశారు. అనంతరం చంపాలిమౌడ్ ఫౌండేషన్ వద్దకు వెళ్లి అక్కడి భారతీయులను కలిసి అక్కడి నుంచి నేరుగా సాయంత్రం 6గంటలలోపు తిరిగి వాషింగ్టన్ బయల్దేరేందుకు లిస్బాన్ ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. అక్కడి నుంచి ఎనిమిదిగంటలపాటు ప్రయాణించి భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 4గంటలలోగా వాషింగ్టన్ చేరుకున్నారు. మొత్తం ఆయనతో కలిసి ప్రయాణీంచిన భారతీయ బృందం 50మంది విల్లార్డ్ కాంటినెంటల్ హోటల్లో దిగగా.. మోదీ రెండు రోజుల్లో అమెరికాలో 17 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అమెరికా సీఈవోలతో సమావేశం, ట్రంప్‌తో భేటీ తదితర కార్యక్రమాలు ఇందులో అత్యంత ముఖ్యమైనవి. అయితే, సోమవారం రాత్రి 9గంటలకు తన అమెరికా పర్యటన పూర్తికావడంతో ఆ రాత్రి అక్కడే ఉండకుండా ఆ సమయంలోనే నేరుగా నెదర్లాండ్ పర్యటన ప్రారంభించారు. నేరుగా అక్కడికి వెళ్లిన ఆయన మొత్తం ఏడు కార్యక్రమాల్లో పాలుపంచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి డచ్ కాలమానం ప్రకారం రాత్రి ఏడుగంటలకు బయల్దేరిన ప్రధాని మోదీ బుధవారం 6గంటల వరకు భారత్‌కు చేరుకున్నారు. ఈ విధంగా తన టూర్లో ఏ మాత్రం విశ్రాంతి తీసుకోకుండా మోదీ తన పర్యటనను విజయవంతంగా ముగించారు. -
అమ్మమ్మ ఇంటికి రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: ఐఏసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి హాలిడేస్‌కు వెళ్లబోతున్నారు. ఈసారి ఆయన ఇటలీ వెళుతున్నారు. త్వరలో తన అమ్మమ్మ ఇంటికి వెళ్లబోతున్నానట్లు రాహుల్ గాంధీ ట్విట్టర్ ద్వారా తన పర్యటన వివరాలు తెలిపారు. తల్లి సోనియాగాంధీ తరఫు బంధువులతో రాహుల్ కొన్నిరోజులు గడపనున్నారు. కాగా గతంలో రహస్యంగా సాగిన రాహుల్ విదేశీ పర్యటనలపై అనేక ఊహాగానాలు వెల్లువెత్తడంతో ఈసారి ఆయన ట్విట్టర్ ద్వారా ముందుగానే ఆ విషయాన్ని వెల్లడించారు. Will be travelling to meet my grandmother & family for a few days. Looking forward to spending some time with them! — Office of RG (@OfficeOfRG) 13 June 2017 -
సమ్మర్.. విహారం గ్రేటర్
వేసవి సెలవుల్లో దేశ, విదేశాలను చుట్టొచ్చిన హైదరాబాదీలు - గతేడాది కంటే ఈ సీజన్లో 33 శాతం అధికం - యాత్రా డాట్‌కామ్ సర్వేలో వెల్లడి - మార్చి–మే మధ్య 1.58 లక్షల మంది విదేశీ పర్యటనలు - మరో 4.35 లక్షల మంది దేశీయ విమానాల్లో రాకపోకలు సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల్లో విదేశీ, స్వదేశీ పర్యటనలతో ‘గ్రేటర్’వాసులు ఆహ్లాదంగా గడిపారు. గతేడాది కంటే ఈ ఏడాది దాదాపు 33 శాతం అధికంగా దేశ, విదేశాలకు విమాన ప్రయాణాల చేశారు. యాత్రా డాట్‌కామ్ తాజాగా చేసిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలానికిగాను ఈ సర్వే చేశారు. దేశంలోని పర్యాటక స్థలాలను విమానాల్లో చుట్టొచ్చిన వారి సంఖ్య 50 శాతం పెరగగా.. విదేశీ పర్యటనలు చేసినవారి సంఖ్య 33 శాతం పెరిగినట్లు అందులో వెల్లడైంది. పర్యాటక ప్యాకేజీలు మధ్య తరగతి, ఎగువ మధ్య తరగతి వర్గాలకు అందుబాటులోకి రావడంతో ఇలా పర్యటనలు పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. యాత్ర ఏదైనా.. విమాన ప్రయాణమే! గ్రేటర్ నగరానికి ఆణిముత్యంలా ఉన్న రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నిత్యం 400 దేశీయ, అంతర్జాతీయ విమాన సర్వీసులు నడుస్తున్నాయి. వాటిలో సుమారు 40 వేల మంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అయితే ఈ వేసవి సెలవుల్లో దేశ, విదేశాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగింది. దేశంలోని బెంగళూరు, ఢిల్లీ, గోవా, కేరళ, ముంబై, విశాఖపట్నం, చెన్నై, హిమాచల్‌ప్రదేశ్ వంటి పర్యాటక స్థలాలకు వెళ్లేందుకు సుమారు 4.35 లక్షల మంది విమానాలనే ఎంచుకున్నట్లు సర్వేలో గుర్తించారు. ఇక సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్, కౌలాలంపూర్, లండన్, ఆమ్స్టర్డ్యామ్ వంటి అంతర్జాతీయ నగరాలకు సుమారు 1.58 లక్షల మంది వెళ్లినట్లు అంచనా వేశారు. ఈ నగరాలకు భలే డిమాండ్ హైదరాబాద్ నుంచి విదేశాల పర్యటనకు వెళ్లేవారిని పరిశీలిస్తే.. అత్యధికులు సింగపూర్, దుబాయ్, బ్యాంకాక్ నగరాలకు వెళ్లినట్లు తెలిసింది. తర్వాత కౌలాలంపూర్, లండన్, ఆమ్స్టర్డ్యామ్ నగరాలకు పర్యటన చేసినట్లు తేల్చారు. మన దేశంలో గోవా, కేరళ, ఊటీ, కొడైకెనాల్, కులు, మనాలీ వంటి ప్రదేశాలను చుట్టివచ్చేందుకు గ్రేటర్ వాసులు మక్కువ చూపుతున్నారని చెబుతున్నారు. మధ్య తరగతిలో భలే క్రేజీ కాస్మొపాలిటన్ నగరంగా మారిన గ్రేటర్లో మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వర్గాలతోపాటు ఐటీ, బీపీఓ, కేపీఓ, రియల్టీ, సేవా రంగాల్లో పనిచేస్తున్నవారు ఇటీవలికాలంలో విమాన ప్రయాణాలంటే మక్కువ చూపుతున్నారు. వారి అభిరుచికి, బడ్జెట్‌కు తగినట్లుగా కాక్స్‌అండ్ కింగ్స్, థామస్ కుక్, యాత్రా డాట్‌కామ్, సదరన్ ట్రావెల్స్, బుకింగ్ డాట్‌కామ్ వంటి టూరిస్టు ఆపరేటర్లు, ఆన్లైన్ బుకింగ్ ఏజెన్సీలు టూర్ ప్యాకేజీలను అందిస్తున్నాయి. దీంతో విమానాల్లో పర్యాటక, దర్శనీయ స్థలాలకు వెళ్లేవారి సంఖ్య బాగా పెరుగుతోంది. -
57 విదేశీ పర్యటనలు
ప్రధాని పదవిని చేపట్టాక మోదీ మొత్తం 57 విదేశీ పర్యటనలు చేశారు. అమెరికాకు ఏకంగా నాలుగుసార్లు వెళ్లారు. నేపాల్, జపాన్, రష్యా, ఆఫ్గనిస్థాన్, చైనాలకు రెండేసిమార్లు వెళ్లారు. బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియాల్లోనూ పర్యటించారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయనతో మోదీ మంచి స్నేహబంధం ఏర్పడింది. ఈ నెల 29 నుంచి మరో నాలుగుదేశాల పర్యటనకు వెళ్లనున్నారు. జర్మనీ, స్పెయిన్, రష్యా, ఫ్రాన్స్‌లకు మోదీ వెళ్లనున్నారు. ⇒ క్షిపణి సాంకేతికత నియంత్రణ సంస్థ (ఎంటీసీఆర్)లో భారత్ 35వ సభ్యదేశంగా 2016 జూన్‌లో చేరింది. అమెరికా, ఫ్రాన్స్‌ల మద్దతుతో భారత్ ఇందులో సభ్యదేశమైంది. ⇒ జీశాట్–9 ఉపగ్రహ ప్రయోగం ద్వారా సార్క్ సభ్యదేశాలతో సంబంధాలు బలపడ్డాయి. పాకిస్థాన్ ఈ ఉపగ్రహాన్ని ఉపయోగించుకోబోమని చెప్పింది. ⇒ బంగ్లాదేశ్‌తో భూమి బదలాయింపుతో ఒప్పందంతో దశాబ్దాల సరిహద్దు వివాదం ముగిసింది. తమ భూభాగంలో ఉన్న 111 గ్రామాలు లేదా ఆవాసాలను భారత్... బంగ్లాదేశ్‌కు బదలాయింది. బదులుగా బంగ్లాదేశ్ తమ ఆధీనంలోని 53 గ్రామాలకు భారత్‌కు ఇచ్చింది. ⇒ సల్మా డ్యామ్‌ను నిర్మాణంలో పాలుపంచుకోవడం ద్వారా ఆఫ్గనిస్థాన్‌లో సంబంధాలు బలోపేతమయ్యాయి. ⇒ చైనా జలాంతర్గామిని శ్రీలంకకు సమీపంలో నిలిపేందుకు అనుమతి నిరాకరించాలని చెప్పి లంకను ఒప్పించింది. భారత్ ఆందోళనను గౌరవించాలని చెప్పి కొలంబోను ఒప్పించింది. ⇒ 2015లో భారత్– ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్‌లో ఏకంగా 58 ఆఫ్రికా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. దీనిద్వారా ఆఫ్రికా దేశాలతో సంబంధాలు బలపడ్డాయి. ⇒ పాకిస్తాన్‌కు మిత్రదేశాలుగా పరిగణించే సౌదీ అరేబియా, యూఏఈలలో మోదీ పర్యటించి ఆరబ్ దేశాలతో సంబంధాలను మెరుగుపర్చారు. ⇒ భారత పౌర అణుఇంధన అవసరాల నిమిత్తం యురేనియంను మన దేశానికి ఎగుమతి చేసేలా ఆస్ట్రేలియాను ఒప్పించింది. పెరుగుతున్న చైనా ప్రాబల్యం దక్షిణాసియాలో చైనా ప్రాబల్యం పెరుగుతోంది. సిల్క్ రోడ్డు వంటి మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా చైనా క్రమేపి తమ ప్రాభవాన్ని పెంచుకుంటోంది. 2016లో బంగ్లాదేశ్‌లో పర్యటించిన చైనా అధ్యక్షుడు జిన్సింగ్ 24 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెడతామని (అప్పు, ఇతరత్రా సహాయం కూడా ఇందులో ఉంది) హామీ ఇచ్చారు. బంగ్లాదేశ్ త్రివిద దళాలు చైనా ఆయుధాలను వాడుతున్నాయి. నేపాల్‌కు భారత్ సహాయం తగ్గిపోయింది. మరోవైపు పాకిస్థాన్‌కు చైనా సహాయం పెరుగుతోంది. ఆ దేశ మౌలిక సదుపాయాల్లో చైనా భారీగా పెట్టుబడులు పెడుతోంది. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ 2014లో భారత్‌లో పర్యటించారు. అనంతరం 2015లో మోదీ చైనా పర్యటనకు వెళ్లారు. ఈ రెండు పర్యటన మూలంగా రాజకీయంగా, ఆర్థికంగా గానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. సరిహద్దు వివాదంపై చర్చలు స్తంభించాయి. పైగా అంతర్జాతీయ వేదికల్లో భారత్‌కు తరచుగా చైనా అడ్డుతగులుతోంది. అణుసరఫరా దేశాల బృందం (ఎన్ఎస్జీ)లో భారత్ చేరికను చైనా పదేపదే అడ్డుకుంటోంది. 48 దేశాల ఈ గ్రూపులో చేరితే పౌర అణుఇంధన అవసరాలు సులువుగా తీరుతాయి. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం (ఎన్పీటీ)పై భారత్ సంతకం చేయనందున... ఎన్ఎస్జీలో సభ్యత్వం ఎలా ఇస్తారని చైనా ప్రశ్నిస్తోంది. జూన్‌లో జరిగే సమావేశంలోనూ భారత్ ప్రయత్నాన్ని అడ్డుకుంటామని మంగళవారం సంకేతాలు ఇచ్చింది. అమెరికా, రష్యా, బ్రిటన్ తదితర దేశాలు భారత్‌కు మద్దతు ఇస్తున్నా... చైనా ‘నో’ చెబుతోంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి కూడా చైనా సుముఖంగా లేదు. ఆర్థికంగా, సైనికంగా బలమైన చైనాకు చెక్ పెట్టడానికి భారత్‌తో మిత్రుత్వం నెరుపుతోంది అమెరికా. జపాన్‌తో భారత్ సంబంధాలు బాగా ఉండటానికి కూడా చైనాను నిలువరించాలనే వ్యూహమే కారణం. చైనాను ఇరుకున పెట్టడానికి వచ్చిన ఏ అవకాశాన్నీ భారత్ కూడా వదులుకోవడం లేదు. చైనా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వన్ బెల్ట్– వన్ రోడ్’ ప్రాజెక్టుకు భారత్ ససేమిరా అంటోంది. ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అమెరికా ప్రతిపాదించిన ప్రత్యామ్నాయ సిల్క్ రోడ్డులో భారత్ కీలకం కానుంది. దక్షిణ చైనా సముద్రం ప్రాదేశిక జలాలపై ఆధిపత్యం కోసం చైనా చేస్తున్న ప్రయత్నాలను భారత్ వ్యతిరేకిస్తోంది. అలాగే ప్రవాసంలో ఉన్న టిబెట్ అథ్యాత్మిక నేత దలైలామాకు ఆశ్రయం కల్పిస్తోంది. పాక్‌తో నిత్యం తలనొప్పులే... మరోవైపు పాక్‌తో సంబంధాల్లోనూ ప్రతిష్టంభన నెలకొంది. 2015లో రష్యాలోని ఉఫాలో మోదీ, నవాజ్ షరీఫ్‌లు సమావేశమయ్యారు. తీవ్రవాదాన్ని రూపుమాపడానికి కలిసి పనిచేయాలని నిర్ణయించారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలనే అంగీకారానికి వచ్చారు. జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం 2015 డిసెంబరులో బ్యాంకాక్‌లో జరిగింది. 25న నవాజ్ షరీఫ్ జన్మదినాన్ని పురస్కరించుకొని... ఆయనకు శుభాకాంక్షలు చెప్పడానికి మోదీ ఆకస్మికంగా లాహోర్‌కు వెళ్లారు. సంబంధాలు బాగా మెరుగుపడ్డాయి... చర్చల్లో పురోగతి ఉంటుందని ఆశించిన సమయంలో 2016 జనవరి ఒకటో తేదీన పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై ఉగ్రదాడి జరిగింది. దాంతో తీవ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్‌పై ఆంక్షలు విధించాలని, అంతర్జాతీయ వేదికలపై పాక్‌ను ఏకాకిని చేయాలనే వైఖరిని మోదీ ప్రభుత్వం తీసుకుంది. అనంతరం 2016 సెప్టెంబరు 18న ఉడి సైనిక శిబిరంపై తీవ్రవాద దాడి జరిగింది. 19 సైనికులు చనిపోయారు. తర్వాత భారత సైన్యం నియంత్రణ రేఖను దాటి పీవోకేలోకి చొచ్చుకెళ్లి తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేసింది (సర్జికల్ స్ట్రయిక్స్). పాక్ సైనికులు కూడా చనిపోయారు. ఇస్లామాబాద్‌లో జరగాల్సిన సార్క్ 19వ సమావేశం భారత్ బహిష్కరణతో రద్దయింది.తీవ్రవాదులను సరిహద్దులు దాటించి భారత్‌లోకి పంపడం, సరిహద్దుల్లో ఉల్లంఘనలకు పాల్పడి కాల్పులకు తెగబడటం... లాంటి వాటితో ఇరుదేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. గూఢచర్యం అభియోగాలపై పాక్ మిలటరీ కోర్టు భారత్ మాజీ నావికాదళ అధికారి కులభూషణ్ జాదవ్‌కు మరణశిక్ష విధించడంతో ఈ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. కులభూషణ్ మరణశిక్షను అంతర్జాతీయ న్యాయస్థానంలో సవాల్ చేసి... ఉరిశిక్షపై ‘స్టే’ను పొందడం భారత్ సాధించిన విజయంగా చెప్పొచ్చు. అలాగే పాక్ తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని అంతర్జాతీయ వేదికలపై భారత్ ఎప్పటికప్పుడు ప్రస్తావిస్తోంది. దీని ఫలితంగానే అమెరికా వైఖరి మారింది. ట్రంప్ సర్కారు తాజా బడ్జెట్లో పాక్‌కు చేసే ఆర్థిక సహాయాన్ని రుణంగా మార్చింది. (మరిన్ని వివరాలకు చదవండి ) (ఇండియా ఫస్ట్) (మోదీ ప్రజల ప్రధానే..!) (కొంచెం మోదం! కొంచెం ఖేదం!!) (మోదీ మ్యానియా) – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
బాబుగారి ‘విదేశీ’ విన్యాసాలు!
‘ఆంధ్రప్రదేశ్‌కు మైక్రోసాఫ్ట్, ఆపిల్! రాజధానికి సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా మాస్టర్‌ప్లాన్ రూపకల్పన!! డ్వాక్రాకు ‘వాల్‌మార్ట్’ సొబగులు... కోనసీమ కొబ్బరి నీళ్లకు ‘పెప్పికో’ హంగులు!!! 43వేల కోట్లతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు... రూ.10 వేల కోట్లతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం.. బంగారం రిఫైనరీ కేంద్రం ఏర్పాటుకు ఇండానీ గ్లోబల్ ఆసక్తి.. ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అన్‌స్టీల్ సంసిద్ధత సింగపూర్, న్యూయార్క్, లండన్, బీజింగ్, టోక్యో...... తరహాలో అమరావతి నిర్మాణం’ విదేశీ పర్యటనలకు ముందు, ముగిసిన అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటనలివి. అయితే వీటిలో ఏ ఒక్కటీ ఇప్పటివరకూ కార్యరూపం దాల్చలేదు. కోట్ల రూపాయల ప్రజాధనంతో గత మూడేళ్లలో 12 సార్లు విదేశీ పర్యటనలు చేసిన చంద్రబాబు.. వివిధ కంపెనీలతో లెక్కలేనన్ని అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రూ.వేల కోట్ల పెట్టుబడులు రానున్నాయని,లక్షల్లో ఉద్యోగాలు వస్తాయని ప్రకటించారు. అయితే అవి ఎంతవరకూ కార్యరూపం దాల్చాయి అంటే ప్రభుత్వమే సమాధానం చెప్పలేని పరిస్థితి! సాక్షి, అమరావతి : రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టి దాదాపు మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో ఆయన 12 సార్లు విదేశాల్లో పర్యటించారు. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొస్తానంటూ సగటున మూడు నెలలకోసారి తన బృందాన్ని వెంటేసుకుని ప్రత్యేక విమానాల్లో విదేశాలను చుట్టి వస్తున్నారు. దావోస్‌లో జరిగే ప్రపంచ ఆర్థిక సదస్సుకు ప్రతియేటా వెళ్లి వస్తున్నారు. ఆయా దేశాల్లో అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో సమావేశమయ్యారు. లెక్కలేనన్ని అవగాహనా ఒప్పందాలు(ఎంఓయూ) కుదుర్చుకున్నారు. అయితే ఒప్పందాలు కాగితాలపై కనిపిస్తున్నాయే తప్ప, ఒక్కటంటే ఒక్కటీ కార్యరూపం దాల్చకపోవడం గమనార్హం. మరోవైపు ఏ దేశ పర్యటనకు వెళ్లినా ఆయా దేశాల రాజధానులుగా అమరావతిని మారుస్తానని చంద్రబాబు ప్రకటిస్తుండటం మరో విశేషం. 1.25 లక్షల మందికి ఉద్యోగాలట! సీఎం చంద్రబాబు తాజాగా అమెరికాలో ఏడు రోజులపాటు పర్యటించారు. 15 నగరాలను సందర్శించారు. 30కి పైగా సమావేశాల్లో పాల్గొన్నారు. 90కిపైగా కంపెనీల ప్రతినిధులు, పలువురు ప్రముఖులతో భేటీ అయ్యారు. అమెరికాలోని మూడు రాష్ట్రాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నారు. డెల్, యాపిల్, సిస్కో, గూగుల్, క్వాల్కమ్, మోసెర్, జోహో, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఏపీలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించానని చంద్రబాబు వెల్ల్లడించారు. ఈ పర్యటన వల్ల రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు, పరిశ్రమలు వస్తాయని, తద్వారా కనీసం 1.25 లక్షల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని ముఖ్యమంత్రి ట్వీటర్లో పేర్కొన్నారు. అద్భుతాలు కానరావేమి? విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చిన ప్రతిసారీ రాష్ట్రంలో ఇక అద్భుతాలే జరగబోతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించడం పరిపాటిగా మారింది. అనుకూల మీడియా ఆయనకు వంతపాడుతోంది. ఆయన చేస్తున్న విదేశీ పర్యటనలను ఆకాశానికెత్తేస్తోంది. ఒప్పందాలు, పెట్టుబడులు, పరిశ్రమల రాకతో రాష్ట్రంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి జరిగిపోతోందంటూ ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోంది. నిజానికి ఈ మూడేళ్లలో ఒక్క అద్భుతాన్నైనా చూసే భాగ్యం రాష్ట్ర ప్రజలకు ఇంకా దక్కలేదు. ఆంధ్రప్రదేశ్‌ను పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా తీర్చిదిద్దుతున్నామని, సంస్థల స్థాపనకు అవసరమైన ప్రోత్సాహకాలు అందజేస్తామని చంద్రబాబు ప్రతి విదేశీ పర్యటనలో చెబుతున్నారు. అయినా పరిశ్రమలు ఇటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఏపీలో పరిశ్రమల స్థాపనకు ఎవరూ ముందుకొచ్చే సాహసం చేయలేకపోతున్నారు. ‘పరిశీలన’ తప్ప ప్రతిపాదనేది? సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనల్లో కుదుర్చుకున్న ఒప్పందాల్లో 99 శాతం ఆచరణలోకి రాలేదని, అంతా డొల్లేనని సాక్షాత్తూ అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనల్లో చేసుకున్న ఒప్పందాలపై తదుపరి చర్యల కోసం రాష్ట్ర ఆర్థికాభివృద్ధి మండలి ఆయా కంపెనీల ప్రతినిధులతో ఈ–మెయిళ్ల ద్వారా సంప్రదింపులు జరుపుతోందని అధికారులు తెలిపారు. ముఖ్యమంత్రి విదేశీ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలకు సంబంధించి ఆర్థికాభివృద్ధి మండలి ఇప్పటిదాకా 870 మెయిళ్లను పంపించిందని, వాటిని 400 మంది చూసినప్పటికీ అందులో కేవలం 60 మందే స్పందించారని చెప్పారు. స్పందించిన 60 మంది కూడా ‘పరిశీలిస్తున్నాం’ అని సమాధానం చెబుతున్నారే తప్ప నిర్దిష్టంగా ఎలాంటి ప్రతిపాదనలు చేయడం లేదని అధికార వర్గాలు వెల్లడించాయి. చంద్రబాబు విదేశీ పర్యటనలు... సింగపూర్ (నాలుగు సార్లు) 2014 నవంబర్ 11 నుంచి 14 వరకు సింగపూర్‌లో పర్యటించారు. సీఎంగా చంద్రబాబు తొలి విదేశీ పర్యటన ఇదే. రాజధాని మాస్టర్ ప్లాన్‌ను సింగపూర్ ప్రభుత్వం ఉచితంగా రూపొందిస్తుందని చెప్పారు. అనంతరం మరో మూడుసార్లు చంద్రబాబు సింగపూర్ పర్యటనకు వెళ్లారు. రాజధాని ప్రాంతంలో రైతుల నుంచి తీసుకున్న 1,691 ఎకరాలను సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి అప్పగించేలా ఆ పర్యటనల్లో ‘అవగాహన’ కుదుర్చుకున్నారు. జరిగిందిదీ.. సింగపూర్ ప్రభుత్వం సుర్బానా అనే కంపెనీకి మాస్టర్ ప్లాన్ రూపకల్పన బాధ్యతను అప్పగించింది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.15 కోట్లు చెల్లించింది. ప్రపంచ ఆర్థిక సదస్సు (3 సార్లు) 2015 జనవరిలో దావోస్‌లో ప్రపంచ ఆర్థిక సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. పలు కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. డ్వాక్రా ఉత్పత్తులకు వాల్‌మార్ట్ సొబగులు, కోనసీమ కొబ్బరి నీళ్లకు పెప్సికో హంగులు, విప్రో సాయంతో డిజిటల్ నగరంగా విశాఖ అంటూ ఊదరగొట్టారు. బిల్‌గేట్స్‌తో సమావేశమైన బాబు ఏపీకి మైక్రోసాఫ్ట్ సంస్థ వచ్చేస్తోందని ప్రకటించారు. 2016 జనవరిలోనూ ఈ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. రూ.2 వేల కోట్లతో మెగా టెక్స్టైల్ పార్కు ఏర్పాటు, విశాఖపట్నం, రాజమండ్రిలో సౌరఫలకాల ఉత్పత్తి కేంద్రం, బంగారం రిఫైనరీ కేంద్రం ఏర్పాటుకు ఇండానీ గ్లోబల్ సంస్థ ఆసక్తి కనపరిచినట్లు ప్రకటించారు. 2017 జనవరిలోనూ దావోస్ సదస్సుకు సీఎం హాజరయ్యారు. ఏపీకి చమురు శుద్ధి కర్మాగారం వస్తోందని చెప్పారు. ప్రస్తుత స్థితి: ఇప్పటికీ ఒక్క సంస్థా రాలేదు. జపాన్ (రెండు సార్లు) 2014 నవంబర్ 25 నుంచి 29 వరకు జపాన్‌లో ముఖ్యమంత్రి పర్యటించారు. ఏపీలో టోక్యో, క్యోటో నగరాలను నిర్మి స్తామని జపాన్ కంపెనీలు ప్రకటించాయి. 15 పారిశ్రామిక కేం ద్రాలు ఏర్పాటు చేయడానికి భూములు కేటాయించామని చంద్రబాబు తెలిపారు. పలు ప్రైవేట్ కంపెనీలతో పెట్టుబడులకు సంబంధించి ఆరు కీలక ఒప్పందాలను చేసుకున్నారు. ప్రస్తుత స్థితి వీటిలో ఏవీ కార్యరూపం దాల్చలేదు. 2015 జూలై 7 నుంచి 10 వరకు రెండోసారి జపాన్‌లో చంద్రబాబు పర్యటించారు. ఫ్యూజీ ఎలక్ట్రానిక్స్. జైకా, సుమితోమో, మిత్సుబి కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఏపీలో సౌర విద్యుత్ కేంద్రం ఏర్పాటుకు సాఫ్ట్‌బ్యాంకు ముందుకొచ్చిందని చెప్పారు. అమరావతిలో మిజుహో బ్యాంకు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లS్లడించారు. జపాన్‌కు చెందిన నేషనల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్‌తో ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత స్థితి 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్ యూనిట్ ఏర్పాటు చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్న సాఫ్ట్ బ్యాంకు కేవలం 350 మెగావాట్ల విద్యుత్ యూనిట్‌ను ఏర్పాటు చేసింది. ఇంకా ఆ యూనిట్ ఉత్పత్తిలోకి రాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. బ్రిటన్ 2016 మార్చి 10 నుంచి 14 వరకు ముఖ్యమంత్రి లండన్‌లో పర్యటించారు. 22 అగ్రశ్రేణి కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపారు. లండన్ తరహాలో ఏపీలో ఫైనాన్షి యల్ డిస్ట్రిక్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు లండన్‌లో అమరావతి కార్యాలయాన్ని నెలకొల్పుతామన్నారు. బ్రిటన్‌లోని అతిపెద్ద బోధనాసుపత్రుల్లో ఒకటైన కింగ్స్ కాలేజీ హాస్పిటల్ ఏపీ రాజధాని అమరావతిలో తక్షణమే 1,000 పడకల ఆసుపత్రిని నెలకొల్పేందుకు అంగీకరించిందని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం 11 ఆసుపత్రులను ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రస్తుత స్థితి: ఏవీ కార్యరూపం దాల్చలేదు. చైనా 2016 జూన్ 26 నుంచి 29 వరకు చైనాలో పర్యటించారు. మొత్తం 29 ఎంఓయూలు చేసుకున్నారు. కృష్ణపట్నంలో రూ. 10,183 కోట్ల పెట్టుబడులతో గ్యాస్ ఆధారిత ఎరువుల కర్మాగారం ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో రూ.43,120 కోట్ల పెట్టుబడులతో అంతర్జాతీయ పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లాలో రూ.3,000 కోట్లతో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. ప్రస్తుత స్థితి: ఈ ఒప్పందాల్లో ఇప్పటిదాకా ఒక్కటి కూడా ముందడుగు పడలేదు. రష్యా 2016 జూలై 9 నుంచి 14 వరకు రష్యాలో పర్యటించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి రష్యా, కజికిస్తాన్‌తో రెండు ఎంఓయూలు చేసుకున్నారు. ప్రస్తుత స్థితి: ఏవీ కార్యరూపం దాల్చలేదు. అమెరికా 2017 మే 4 నుంచి 11 వరకు అమెరికాలో పర్యటించారు. ఈ పర్యటనలో వేలాది ఉద్యోగావకాశాలు లభించే మూడు ఎంఓయూలు చేసుకున్నట్లు సీఎం కార్యాలయం పేర్కొంది. ఆపిల్ కంపెనీ సీఈఓతో సమావేశమైన ముఖ్యమంత్రి ఏపీలో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా కోరారని, అలాగే బెల్ హెలికాప్టర్ తయారీ యూనిట్‌ను రాష్ట్రంలో నెలకొల్పాలని చంద్రబాబు కోరినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. అమెరికా పర్యటనలో ప్రవాసాంధ్రులతో పలు సమావేశాలను సీఎం నిర్వహించారు. 28 ఐటీ సంస్థలు రాష్ట్రానికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిపారు. -
ఆలయంలో మద్యం సీసాలతో ఫారిన్ జంట
హంపీ: హిందువులు పరమ పవిత్రంగా భావించే ఆలయంలో ఓ విదేశీ పర్యాటకుడు మద్యం సీసాతో ప్రవేశించడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఆలయం మొత్తం ఉద్రిక్త పరిస్థితిని నెలకొల్పింది. ప్రవేశ ద్వారం వద్దే అతడిని అడ్డుకొని వెనక్కి పంపించినా ఖాతరు చేయకుండా మళ్లీ ప్రవేశించడంతో పలువురు ఆలయ ధర్మకర్తలకు, కార్యకర్తలకు, భక్తులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అతడిని వెంటనే శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన హంపీలోని విరుపాక్ష ఆలయంలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గుర్తు తెలియని ఆ టూరిస్టు హాలండ్ ప్రాంతానికి చెందినవాడని అంటున్నారు. యునెస్కో గుర్తింపు పొందిన ఈ ఆలయ ప్రాంగణంలో, ఆవరణంలో మద్యపానంపై నిషేధం ఉంది. అలాంటిది అతడు మాత్రం ఏకంగా ఆలయం లోపలికి మద్యంతో అడుగుపెట్టాడు. తొలుత మేం చెప్పగానే అతడు తన పార్టనర్‌తో కలిసి బయటకు వెళ్లినప్పటికీ ఐదు నిమిషాల తర్వాత వెనక్కు వచ్చారు. అయితే, ఎవరికీ కనిపించకుండా అతడి దుస్తుల వెనుక దాచుకొని మళ్లీ తెచ్చుకున్నాడు. దీంతో గట్టి వార్నింగ్ ఇచ్చి వెనక్కి పంపించాం’ అని సేవ్ హంపీ ఉద్యమకారుడు రచ్చయ్య తెలిపారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా చూడాలని, ఆ టూరిస్టుపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారీ ఆందోళనకు దిగారు. ప్రస్తుతానికి పోలీసులు ఆ టూరిస్టుకోసం ప్రయత్నిస్తున్నారు. -
వచ్చే మూడు నెలలు ప్రధాని మోదీ బిజీ
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే మూడు నెలలు విదేశీ పర్యటనలతో బిజీబిజీగా గడపనున్నారు. ముందుగా మే 12నుంచి 14 తేదీల్లో శ్రీలంకలోని కొలంబోలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో జరిగే బుద్ధపూర్ణిమ వేడుకల్లో మోదీ పాల్గొంటారు. ఈ వేడుకకు దాదాపు వంద దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. జూన్ మొదటివారంలో రష్యాలో జరిగే ‘సెయింట్‌పీటర్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదిక’ సదస్సులో పాల్గొంటారు. అటునుంచి జర్మనీ, స్పెయిన్ దేశాలకు వెళ్లి భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలపై ఆ దేశాధినేతలతో చర్చించనున్నారు. జూన్ 7 నుంచి 8తేదీలలో కజకిస్థాన్‌లోని అస్తానాలో షాంఘై సహకార సంస్థ నిర్వహించే సదస్సులో పాల్గొంటారు. అదే సమయంలో ఎస్సీవోలో సభ్యదేశాలైన రష్యా, చైనా, పాకిస్తాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీ అయ్యే అవకాశం ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాల పర్యటన తేదీలు ఖరారు కావాల్సిఉన్నాయని ఉన్నతాధికారులు చెప్పారు. మోదీ పర్యటనలు: శ్రీలంక: మే 12–14 రష్యా: జూన్ 1– 3 జర్మనీ, స్పెయిన్ (రష్యా పర్యటన అనంతరం) కజకిస్తాన్: జూన్ 7–8 జర్మనీ: జూలై 7–8. -
మోదీ విదేశీ పర్యటనలు ఎన్నో తెలుసా?
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ ప్రధానమంత్రి పీఠం అధిష్టించినప్పటినుంచి ఇప్పటివరకు 56 విదేశీ పర్యటనలు చేశారు. 2014 జూన్‌లో మొట్టమొదటిసారి ప్రధాని హోదాలో భూటాన్‌లో పర్యటించిన ఆయన.. అమెరికాను నాలుగు సార్లు, నేపాల్, రష్యా, అప్ఘానిస్తాన్, చైనా దేశాలను రెండు సార్లు చొప్పున సందర్శించారు. కేంద్ర మంత్రి వీకే సింగ్ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు జవాబుగా ఈ వివరాలు వెల్లడించారు. 2014 సెప్టెంబర్‌లో మొదటిసారి అమెరికా పర్యటనకు ప్రధాని వెళ్లారు. వాషింగ్టన్‌తో పాటు న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభలో ఆయన పాల్గొన్నారు. అనంతరం 2015 సెప్టెంబర్‌లో మళ్లీ న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సమావేశాలకు వెళ్లిన ప్రధాని.. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ అవ్వడంతో పాటు శాన్‌జోస్, కాలిఫోర్నియాలలో పర్యటించారు. అలాగే ఫార్చ్యూన్ టాప్ 500 సీఈవోలతో సమావేశమయ్యారు. 2016లో మూడోసారి అమెరికా పర్యటనకు వెళ్లి వాషింగ్టన్లో జరిగిన అణు భద్రతా సదస్సులో పాల్గొన్నారు. అదే ఏడాది జూన్‌లో ఒబామా ఆహ్వానం మేరకు మళ్లీ యూఎస్ వెళ్లిన మోదీ.. అక్కడ యూఎస్ కాంగ్రెస్‌లో ప్రసంగించారు. కాగా, 2014 ఆగస్టులో మోదీ నేపాల్‌లో పర్యటించారు. తద్వారా 17 ఏళ్ల తర్వాత పొరుగునే ఉన్న నేపాల్‌ను సందర్శించిన భారత ప్రధానిగా ఘనత వహించారు. జపాన్ను కూడా మోదీ రెండుసార్లు(2014, 2016) సందర్శించారు. ఈ రెండుసార్లూ కూడా అక్కడ జరిగిన వార్షిక ద్వైపాక్షిక సదస్సుల్లో ఆయన పాల్గొన్నారు. బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ 2015 జూలైలో మొదటిసారి రష్యాకు వెళ్లారు. అనంతరం అదే ఏడాది డిసెంబర్లో వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు మళ్లీ రష్యాను సందర్శించారు. అలాగే 2015 మేలో, 2016 సెప్టెంబర్‌లో ప్రధాని చైనాలో పర్యటించారు. అంతేకాకుండా మంగోలియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియాను ప్రధాని సందర్శించారు. -
ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారు. ఎక్కడికంటే
-
ఈ నెల 25న బెల్జియంకు ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. నాటో దేశాల సదస్సు నిమిత్తం ట్రంప్ వచ్చే నెల 25న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్కు వెళ్లనున్నట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి. నాటోతో బంధాన్ని బలోపేతం చేసుకోవడం, కూటమికి సంబంధించి కీలక అంశాలు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంపై ఈ సందర్భంగా ట్రంప్ చర్చిస్తారు. ఈ కార్యక్రమం తర్వాత ట్రంప్ జీ–20 సదస్సు కోసం జర్మనీకి కూడా వెళ్తారు. జీ–20 సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరుకానున్నారు. ఇప్పటికే మోదీని శ్వేతసౌధానికి ట్రంప్ ఆహ్వానించగా, ట్రంప్‌ను భారత్ పర్యటనకు మోదీ ఆహ్వానించారు. అయితే జీ–20 సదస్సులో ఇరు దేశాధినేతలు సమావేశమయ్యే అవకాశం ఉంది. ట్రంప్ గతంలో ఎన్నికల ప్రచార సమయంలో నాటోపై వ్యతిరేకత వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఇది అమెరికాకు అనవసరపు ఖర్చుతో కూడిన ఖర్చంటూ టంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. -
ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన ఇదే!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మే 25న బెల్జియంలోని బ్రసెల్స్ పర్యటనకు వెళుతారని వెట్హౌస్ ప్రకటించింది. ఇదే ట్రంప్ మొట్టమొదటి విదేశీ పర్యటన అయ్యే అవకాశముంది. అయితే, ఇది దౌత్యపర్యటన కాదు. బ్రసెల్స్‌లో జరగనున్న నాటో (నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్) దేశాధినేతల సమావేశంలో ట్రంప్ పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం గురించి నాటో జనరల్ సెక్రటరీ జెన్స్ స్టోల్టన్‌బర్గ్ మంగళవారం ప్రకటించారు. ఈ నేపథ్యంలో నాటోతో అమెరికాకు ఉన్న అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకునేందుకు, ఈ కూటమికి సంబంధించిన కీలకాంశాలను చర్చించేందుకు, ఉగ్రవాదంపై పోరాటం సహా పలు అంశాలలో నాటో ఉమ్మడి పోరాటం, బాధ్యతలను పెంపొందించేందుకు నాటో దేశాధినేతల సమావేశంలో పాల్గొనాలని ట్రంప్ నిర్ణయించినట్టు ఆయన ప్రెస్ సెక్రటరీ సీన్ స్పైసర్ తెలిపారు. నాటో చెల్లనికాసులాగా మారిపోయిందని, బ్రసెల్స్ జీవించడానికి వీలుకాని నరకంలా మారిందని అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ట్రంప్ విమర్శించిన సంగతి తెలిసిందే. -
విదేశీయులకు బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ : భారత్ లో అడుగుపెట్టే విదేశీయులకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ-వీసాతో భారత్ కు వచ్చే విదేశీయులకు ప్రీ-లోడెడ్ తో కూడిన ఉచిత సిమ్ కార్డులను అందించనున్నట్టు తెలిపింది. బీఎస్ఎన్ఎల్ అందించే ఈ సిమ్ కార్డులో రూ.50 టాక్ టైమ్, 50 ఎంబీ ఇంటర్నెట్ డేటాను ఉచితంగా అదించనుంది. ఈ సర్వీసులను పర్యాటక శాఖామంత్రి మహేష్ శర్మ లాంచ్ చేశారు. తొలుత ఈ సర్వీసులు ఢిల్లీలో ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో అందుబాటులోకి వస్తుండగా.. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న 15 అంతర్జాతీయ విమానాశ్రయాలకు అందుబాటులోకి తేనున్నారు. ఈ సిమ్ కార్డు 30 రోజులు వాలిడిటీ ఉంటుంది. 24 గంటల పాటు ప్రయాణికులకు హెల్ప్ లైన్ నెంబర్్ను అందుబాటులో ఉంచనుంది. రష్యన్, జర్మన్, జపనీస్ వంటి 12 భాషల్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ అందుబాటులో ఉండనుంది. ఈ-వీసాతో వచ్చే భారత్ కు వచ్చే ప్రయాణికులకు వెల్ కమ్ కిట్ తో పాటు ఉచిత సిమ్ కార్డులను ఇచ్చేందుకు ఎయిర్ పోర్టులో ఇండియన్ టూరిజం డెవలప్్మెంట్ కార్పొరేషన్ ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటుచేసింది. -
చైనాలో విదేశీయుల వేలిముద్రల సేకరణ
బీజింగ్: చైనాకు వచ్చిపోయే విదేశీయుల వేలిముద్రలను ఆ దేశం భద్రపరచనుంది. తమ దేశ భద్రత కోసం ఈ విధానాన్ని అమలు చేయడానికి నిర్ణయించినట్లు చైనా ప్రజా భద్రత మంత్రిత్వ శాఖ గురువారం తెలిసింది. శుక్రవారం నుంచి షెంజెన్ విమానాశ్రయంలో వేలి ముద్రలను నమోదు చేస్తారు. రానున్న కాలంలో అన్ని విమానాశ్రయాలు, సరిహద్దు ప్రదేశాల్లో దీనిని అమలు చేస్తారు. -
విదేశీ ఉద్యోగులు, విద్యార్థులపై ట్రంప్ బాంబ్!
► వీసా నిబంధనల సమీక్ష – అమలు తీరుపై తనిఖీలు – విద్యార్థులపై ‘పర్యవేక్షణ’ ► కొత్త నిబంధనలతో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌ను సిద్ధం చేసిన డొనాల్డ్ ట్రంప్ సర్కారు ► అమలైతే అమెరికాలో భారత ఉద్యోగులు, విద్యార్థులకు పెరగనున్న కష్టాలు ఏడు ముస్లిం దేశాల పౌరులు అమెరికాలో ప్రవేశించకుండా నిషేధిస్తూ ఇటీవలే కార్యనిర్వాహక ఉత్తర్వును జారీ చేసిన అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఉద్యోగాల కోసం, ఉన్నత విద్యాభ్యాసం కోసం కొత్తగా రాబోయే వారిపైనే కాదు.. ఇప్పటికే చట్టబద్ధంగా హెచ్-1బి, ఎల్-1, ఎఫ్-1 వీసాలపై వచ్చిన విదేశీయులపైనా భారీ బాంబు వేయనున్నట్లు తెలుస్తోంది. అమెరికాలో విదేశీ ఉద్యోగుల్లోనూ, విద్యార్థుల్లోనూ భారతీయులే భారీగా ఉన్నారు. సంబంధిత వీసా నిబంధనలను సమీక్షించటంతో పాటు.. ఆయా వీసాలపై వచ్చిన వారు చట్ట నిబంధనల ప్రకారమే నడుచుకుంటున్నారా? అనేది ప్రత్యక్షంగా తనిఖీ చేయాలని అంతర్గత భద్రత, కార్మికశాఖలను ఆదేశిస్తూ ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వును ట్రంప్ ప్రభుత్వం సిద్ధం చేసింది. ‘చట్టబద్ధమైన వలసలను పరిమితం చేయడం: విదేశీ కార్మిక వీసా పథకాన్ని బలోపేతం చేయడం ద్వారా అమెరికా ఉద్యోగాలు, కార్మికులకు రక్షణ కల్పించడం’ అనే శీర్షికతో ఉన్న ఈ ఉత్తర్వుపై ట్రంప్ సంతకం చేస్తే.. విదేశీ విద్యార్థులపై అమెరికా ‘పర్యవేక్షణ’ పెరుగుతుంది. ఎల్-1 వీసా దారులు పనిచేసే క్షేత్రాలను అమెరికా అంతర్గత భద్రత అధికారులు తనిఖీ చేసే వీలుంటుంది. హెచ్-1బీ వీసా గల వారి జీవిత భాగస్వాములు (భర్త లేదా భార్య) అమెరికాలో ఉద్యోగం చేసేందుకు అనుమతిస్తూ ఒబామా సర్కారు తీసుకున్న నిర్ణయం రద్దవుతుంది. అంతేకాదు.. అమెరికాలోని భారతీయ సంస్థలు, భారత ఉద్యోగులూ ఇక్కట్లలో పడతారు. ఇక హెచ్-1బి వీసా పొందడం చాలా చాలా కష్టమవుతుంది. చాలా ఖరీదు కూడా అవుతుంది. అంతేకాదు.. అమెరికాలో విద్యాభ్యాసం చేస్తున్న వారిలో చైనీయుల తర్వాత భారతీయులే అత్యధికులు. చదువు పూర్తయిన తరువాత ‘వర్క్ వీసా’ అవకాశాలు మెరుగుగా ఉండటంతో భారతీయులు అమెరికా విశ్వవిద్యాలయాలకు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మాథమాటిక్స్) విద్యార్థులు ఐచ్ఛిక ప్రాక్టికల్ శిక్షణ (ఓపీటీ)ను గరిష్టంగా మూడేళ్ల వరకూ పొడిగించుకునే అవకాశం ఉండటంతో.. దీనిని భారతీయ విద్యార్థులు గరిష్టంగా వినియోగించుకుంటారు. అయితే.. ఈ ఓపీటీ పొడిగింపు, కాల పరిధిని తగ్గించాలని ట్రంప్ సర్కారు భావిస్తోంది. అదే జరిగితే.. ప్రస్తుతం అమెరికాలో ఉన్న 1,65,918 మంది విద్యార్థుల భవిష్యత్ ఆశలు ఆవిరవుతాయి. - సాక్షి నాలెడ్జ్ సెంటర్ దీనికి సంబంధించిన మరిన్ని వార్తలకై చదవండి (అమెరికా దిక్కులు పిక్కటిల్లేలా..) (ఇది ముస్లింలపై నిషేధంకాదు: ట్రంప్) (ట్రంప్ ‘నిషేధం’: ఐసిస్ విజయోత్సవాలు) (ట్రంప్ చెప్పింది పచ్చి అబద్ధం!) (అమెరికాను సమర్థించిన సౌదీ, అబుదాబి) (ట్రంపోనమిక్స్ మనకు నష్టమా? లాభమా?) (ట్రంప్‌గారు మా దేశంపై నిషేధం విధించండి!) (ట్రంప్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన సీఈవో!) (వీసా హోల్డర్స్పై ట్రంప్ కొరడా) -
'చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం'
తాను చేస్తున్న విదేశీ పర్యటనలు, పెట్టుబడులపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రం విడుదల చేయాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. ఆయన ఇంతవరకు 13 సార్లు దావోస్ వెళ్లారని, కానీ ఎందుకు వెళ్లారో, ఎందుకు వస్తున్నారో అర్థం కావడం లేదని విమర్శించారు. చంద్రబాబుకు.. దావోస్‌కు ప్రత్యేక అనుబంధం ఉందని ఎద్దేవా చేశారు. స్విస్ బ్యాంకు లెక్కలు సరిచూసుకోడానికే ఆయన దావోస్ వెళ్తున్నారా అని ప్రశ్నించారు. ఏ దేశానికి వెళ్తే ఆ దేశం తరహాలో అమరావతి ఉంటుందని ఆయన చెబుతున్నారని విమర్శించారు. చంద్రబాబు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అబద్ధాలు చెబుతున్నారని, విదేశాల్లో ఇలాంటి అబద్ధాలు చెబితే 420 కేసు పెట్టి జైల్లోకి తోస్తారని ఆయన హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఆకాంక్షను చంద్రబాబు నీరుగార్చుతున్నారని, హోదా కోసం ప్రజలంతా ఉద్యమించాల్సిన సమయం వచ్చిందని అంబటి రాంబాబు చెప్పారు. అందరం కలిసి ప్రత్యేక హోదా సాధిద్దామని పిలుపునిచ్చారు. -
'పర్యటనలతో ఎన్ని ఉద్యోగాలొచ్చాయి'
విజయవాడ : ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే దావోస్ పర్యటనపై వస్తున్న ఆరోపణలపై శ్వేత పత్రం విడుదల చేయాలని కాంగ్రెస్‌పార్టీ డిమాండ్ చేసింది. ఇప్పటి వరకు ఏపీలో ఎంతమందికి ఉపాధి కల్పించారో చెప్పాలని పరిశ్రమల శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడుకు మాజీ స్పీకర్, పీసీసీ ఉపాధ్యక్షుడు నాదెండ్ల మనోహర్ లేఖ రాశారు. ప్రజలకు వాస్తవాలు చెప్పాల్సిన బాద్యత ప్రభుత్వం పై ఉందని లేఖలో పలు అంశాలను పేర్కొన్నారు. ► 2015లో కూడా దావోస్ పర్యటనలో భాగంగా బిల్ గేట్స్, సత్యనాదెళ్లను కలిసినట్టు తెలిపారు. ఏపీలో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు, హీరో మోటార్స్ కార్పొరేషన్, పెప్సీ, వాల్ మార్ట్, విప్రో లాంటి సంస్థలు త్వరలో రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో వస్తాయని ప్రకటించారు. ► చంద్రబాబు మూడవసారి కూడా దావోస్ పర్యటించిన సందర్భంగా అనేక మంది వ్యాపార దిగ్గజాలను కలిసి భారీ ఒప్పందాలను చేసుకున్నట్టు అధికార యంత్రాంగం పదే పదే ప్రకటనలు విడుదల చేస్తున్నారు. ► 2016 దావోస్ పర్యటనలో పాల్గొని రూ. 2000 కోట్ల పెట్టుబడితో ఘెర్జి టెక్స్ టైల్ మెగా పార్క్‌ను ఏపీలో స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. ► 'స్మార్ట్ సిటీ, స్మార్ట్ విలేజ్, స్మార్ట్ ఆంధ్రప్రదేశ్' ఇదేనా అభివృద్ధి మంత్రం అంటూ 2016లో మీరు స్విట్జర్లాండ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్టు తెలిపారు. ఆయా సంస్థల గురించి ఇప్పుడు ఎందుకు కృషి చేయడం లేదో ప్రజలకు వివరించాలి. ► పెట్టుబడులు ఆకర్షించడానికి మంత్రుల బృందం పర్యటనలకు అయిన ఖర్చులు, రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు, లభించిన ఉపాధి వివరాలు వెల్లడించాలి. ► 12 జవవరి 2016న రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో పార్ట్నర్షిప్ సమ్మిట్‌ను నిర్వహించింది. అప్పుడు జరిగిన ఒప్పందాల ద్వారా 4 లక్షల 78 వేల కోట్ల పెట్టబడులు రాష్ట్రానికి వస్తాయని, 6 లక్షల మందికి కొత్తగా ఉపాధి దొరుకుతుందని ఊదరగొట్టారు. కానీ, ఇప్పటి వరకు ఎంత మందికి ఉపాధి లభించిందో వాస్తవాలు తెలియజేయాలి. ► 40 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్వహించిన ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్ ద్వారా రాష్ట్ర ప్రజలలో ప్రత్యేకంగా యువతలో మీరు భారీ ప్రకటనల ద్వారా ఆశలను రేకెత్తించారు. ఆర్భాటాలతో ప్రచారం కోసం ప్రజాధనం వృధాచేస్తుందన్న అనుమానాలకు ప్రభుత్వం వాస్తవాలు వివరించాలని లేఖలో పేర్కొన్నారు. -
బిల్డప్ ఇస్తున్న బాబు: అంబటి
-
విమానాల్లో వచ్చారు.. భిక్షమెత్తారు!
హోసపేటె: అభివృద్ధి చెందిన దేశాల నుంచి విలాసంగా విమానాల్లో వచ్చారు. అయినా భిక్షమెత్తారు. 30 దేశాల నుంచి సుమారు 100 మందికి పైగా విదేశీయుల పర్యాటకుల బృందం కర్ణాటకలో ప్రపంచ ప్రసిద్ది గాంచిన పర్యాటక కేంద్రమైన బళ్లారి జిల్లాలోని హంపినీ వీక్షించేందుకు వచ్చింది. కొద్దిరోజులుగా వీరంతా విరుపాపురగడ్డ సమీపాన ఉన్న మైదానంలో టెంట్ వేసుకొని బస చేస్తున్నారు. అయితే పోలీసులు వారిని ఖాళీ చేయించారు. దీంతో హోసపేటె నగరానికి చేరుకొన్న ఈ దేశీయుల బృందం గురువారం సాయంత్రం ఆర్టీసీ బస్టాండు ముందు విన్యాసాలు ప్రదర్శిస్తు భిక్షాటన చేశారు. జనం తోచిన డబ్బును అందించారు. ఈ డబ్బును పేదలకు ఇస్తామని కొందరు, సొంతానికి వాడుకుంటామని మరికొందరు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో మనదేశ పర్యటనకు వచ్చిన విదేశీ పర్యాటకులు చిల్లరకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాజస్థాన్ లో పుష్కర్ ప్రాంతంలో నవంబర్ లో విదేశీ పర్యాటకులు తమకు వచ్చిన విద్యలు ప్రదర్శించి చిల్లర అర్థించారు. -
సంక్రాంతి సంబరాల్లో ఎంజాయ్ చేసిన విదేశీయులు
-
మళ్లీ మొదలైన బాబు విదేశీ పర్యటనలు
హైదరాబాద్, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రెండున్నరేళ్లలో అనేక దేశాల్లో పర్యటించి వచ్చిన చంద్రబాబు నాయుడు మరోసారి విదేశీ బాట పట్టనున్నారు. ఇప్పటికే చైనా, జపాన్, సింగపూర్, స్విట్జర్లాండ్ తదితర దేశాలను చుట్టొచ్చిన చంద్రబాబు ఈ నెలలో మరోసారి విదేశాలకు వెళుతున్నారు. ఈ నెల 7, 8 తేదీల్లో చంద్రబాబు నాయుడు శ్రీలంకలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడు, ఐఏఎస్ అధికారులు జి.సాయి ప్రసాద్, బి.రామాంజనేయులు, బి.రాజశేఖర్, మెప్మా డైరెక్టర్ తదితరులు చంద్రబాబు వెంట వెళ్తున్నారు. శ్రీలంక అధ్యక్షుడి ఆహ్వానం మేరకు ఈ పర్యటనకు వెళుతుండగా, ఇందుకయ్యే ఖర్చంతా ప్రభుత్వమే భరిస్తుందని గురువారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. శ్రీలంక నుంచి తిరిగి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ అనంతరం ఈ నెల ఈ నెల 16 నుంచి 21 వరకు స్విట్జర్లాండ్ కు పయనమవుతున్నారు. ప్రపంచ ఆర్థికసంస్థ ఆహ్వానం మేరకు స్విట్జర్లాండ్ లో పర్యటనకు వెళుతున్నారని ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పర్యటనలో మంత్రి యనమల రామకృష్ణుడుతో పాటు కమ్యూనికేషన్స్ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం ముఖ్యకార్యదర్శి జి.సాయిప్రసాద్, ఇంధనశాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యదర్శి సోల్మన్ అరోకియా, పరిశ్రమల శాఖ డైరెక్టర్ కార్తికేయ మిశ్రాలతో పాటు మరో అయిదురుగు చంద్రబాబు వెంట వెళతారు. ముఖ్యమంత్రి బాటలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా విదేశీ బాట పట్టనున్నారు. సీఎం ముఖ్య కార్యదర్శి సాయి గోపాల్, సాల్మన్ అరోకియా, కార్తికేయ మిశ్రా, కోన శ్రీధర్ లు ఈ నెల 9 నుంచి 12 వరకు దక్షిణ కొరియాలో పర్యటనకు వెళుతున్నారు. అక్కడి నుంచి తిరిగి రాగానే ఈ నెల 13, 14 రెండు రోజుల పాటు కువైట్ పర్యటనకు వెళుతున్నారు. అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శ్రీధర్ మినహా సాయి ప్రసాద్ తో పాటు సాల్మన్ అరోకియా, కార్తికేయ మిశ్రా కువైట్ సందర్శిస్తారు. వీరి పర్యటనకు అయ్యే ఖర్చు ఏపీఐఐసీ భరిస్తుందని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
న్యూ ఇయర్‌కి కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్
న్యూఢిల్లీ: కొత్త సంవత్సరం వేళ కేంద్ర ప్రభుత్వం బంపర్ బహుమతిని తీసుకొస్తుంది. అది స్వదేశీయులకు కాదండోయ్ విదేశీయులకు. విదేశాల నుంచి భారత్‌లోని పర్యాటక ప్రదేశాలను చూసేందుకు వచ్చే పర్యాటకులకు ఇక నుంచి సిమ్ కార్డులు అందజేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. కొత్త సంవత్సరం కానుకగా వారికి వీటిని అందించనుంది. మొత్తం పన్నెండు విమానాశ్రయాల్లో దాదాపు 161 దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఈ సిమ్ కార్డులను ఇవ్వనుంది. పంజిమ్, అహ్మదాబాద్, అమృత్ సర్, జైపూర్, బెంగళూరు, చెన్నై, ముంబయి, లక్నో, ఢిల్లీ, వారణాసి విమానాశ్రయాల్లో ఈ సర్వీసులను హోంశాఖ అందించనుంది. విదేశాల నుంచి వచ్చే టూరిస్టుల రక్షణ కోసమే ఈ సిమ్ కార్డులు ఇవ్వనున్నట్లు కేంద్రహోంశాఖ అధికారులు చెప్పారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీఎస్ఎన్ఎల్ సౌజ్యనంతో ఉచితంగా ఈ ప్రి-లోడెడ్ సిమ్ కార్డులను అందించే కార్యక్రమాన్ని ఈ వారంలో ప్రారంభించనున్నారు. ఈ వీసా ద్వారా వచ్చే వారికి ఈ సౌకర్యం అందిస్తారు. దీనిని తొలుత పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేసి అనంతరం పూర్తిస్థాయిలో అమలు చేయనున్నారు. -
ఫారినర్‌కు చేతిలో డబ్బు లేకున్నా..
భారతదేశం అంటేనే మంచి మర్యాదలకు పుట్టినిల్లు. అవతలి వాళ్ల జేబులో డబ్బును బట్టి కాక, మనసును చూసి మాట్లాడతారు. కేరళలో కూడా అదే పరిస్థితి. అక్కడ కూడా గౌరవ మర్యాదలకు ఏమాత్రం లోటుండదు. కేరళలో అందాలను చూసేందుకు మున్నార్ వచ్చిన ఓ విదేశీయుడు.. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నా, నయాపైసా డబ్బు తీసుకోకుండా రెస్టారెంటు వాళ్లు అతడికి భోజనం పెట్టారు. తాను 1989 నుంచి ఈ హోటల్ నడిపిస్తున్నానని యజమాని ఖాదర్ కుంజు చెప్పారు. తన దగ్గర చేతిలో డబ్బులు లేవని, క్రెడిట్ కార్డులు ఆమోదిస్తారా అని ముందే ఆ విదేశీయుడు అడిగాడని, అయితే తన వద్ద ఆ సౌకర్యం లేదని చెప్పానని అన్నారు. అయినా అతడు భోజనం చేసి, చేతులు కడుక్కున్నాక అక్కడినుంచి పారిపోయాడని.. తమ సిబ్బంది అతడిని పట్టుకుంటే డబ్బు లేకపోవడం వల్లే అతడలా చేశాడని తెలిసి వదిలేశానని కుంజు తెలిపారు. ఏటీఎంల వద్ద డ్రా చేసేందుకు ప్రయత్నించినా వాటిలో డబ్బు లేకపోవడం, మరోవైపు ఆకలిగా ఉండటం వల్లే అతడలా చేశాడన్నారు. చాలామంది విదేశీ పర్యాటకులు ఇలాగే చేస్తుంటారని కూడా కుంజు చెప్పారు. ఇంతకుముందు ఫ్రాన్సు నుంచి నలుగురు పురుషులు, నలుగురు మహిళలు కలిసి వచ్చారని, వాళ్లు కూడా బాగా ఆకలిగా ఉండి తినాలనుకున్నారు గానీ డబ్బులు లేవని, వాళ్ల వద్ద క్రెడిట్ కార్డులున్నా, తన వద్ద స్వైపింగ్ మిషన్ లేకపోవడంతో ముందు తినేసి.. తర్వాత ఉన్నప్పుడు ఇవ్వమని చెప్పానన్నారు. కొన్ని రోజుల తర్వాత మహిళలు వచ్చి వాళ్లు తిన్నదానికి డబ్బులు చెల్లించారు గానీ, మగవాళ్లు మాత్రం రాలేదని వివరించారు. -
10 నుంచి సీఎం దుబాయ్ పర్యటన
సీఎంతోపాటు మంత్రులు, అధికారులు కూడా.. సాక్షి, అమరావతి: ఈనెల 10 నుంచి 13వ తేదీ వరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దుబాయ్, అబుదాబీ, కువైట్ నగరాల్లో పర్యటించనున్నారు. ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, అధికారులు కూడా పర్యటనకు వెళ్లనున్నారు. మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణ, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎంవో అధికారులు జి.సారుుప్రసాద్, రాజమౌళి, ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ కార్యద్శి సాల్మన్ ఆరోఖ్యరాజ్, ఐటీ శాఖ కార్యదర్శి కె.విజయానంద్, ఆర్థిక మండలి సీఈవో జాస్తి కృష్ణ కిశోర్, ఆర్థిక మండలికి చెందిన ఇద్దరు కన్సల్టెంట్లు, సీఐఐ ప్రతినిధి ఈ పర్యటనకు వెళ్లనున్నారు. పోలవరం కాంక్రీట్ పనులకు 19న శంకుస్ధాపన: పోలవరం కాంక్రీట్ పనులకు ఈ నెల 19వ తేదీన శంకుస్థాపన చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణరుుంచారు. కార్యక్రమానికి కేంద్ర జలవనరులశాఖ మంత్రి ఉమాభారతి, ఇతర ప్రముఖులను ఆహ్వానించాలని ఆధికారులను ఆదేశించారు.సోమవారం వెలగపూడి సచివాల యంలోని తన కార్యాలయంలో పోలవరం పనులపై సీఎం సమీక్ష నిర్వహించారు. బ్యాంకర్లతో సీఎం టెలీకాన్ఫరెన్స: సోమ, మంగళ, బుధవారాల్లో బ్యాంకులు, ఏటీఎంల వద్ద రద్దీ అధికంగా ఉంటుందని.. రైతులు, చేతివృత్తులవారు, పెన్షనర్లు ఇబ్బందులు పడకుండా చూడాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. వారికి కనీస వసతులు కల్పించాలని సూచించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఆర్టీసీకీ ఓ కన్సల్టెన్సీ!: ఆర్థిక వ్యవహారాల్లో ఆరితేరిన ఒక సలహా సంప్రదింపుల సంస్థ (కన్సల్టెన్సీ)ను నియమించుకోవడం ద్వారా నష్టాల నుంచి బయటపడే మార్గాలు అన్వేషించాలని రోడ్డు రవాణా సంస్థకు సీఎం చంద్రబాబు సూచించారు. సంస్థకు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులను తొలగించడానికి రూ.1,050 కోట్ల హడ్కో రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చే అంశం పరిశీలిస్తామన్నారు సోమవారం రాత్రి రవాణా మంత్రి శిద్ధా రాఘవరావుతో కలసి ఆర్టీసీ పనితీరును ఆయన సమీక్షించారు. -
నోట్ల రద్దు: కన్నీళ్లు పెట్టిన విదేశీ మహిళ
పణజి: విదేశీ పర్యాటకులకూ నోట్ల కష్టాలు తప్పడం లేదు. పాత పెద్ద నోట్లను మార్చుకోలేక దిక్కుతోచని స్థితిలో పడిన విదేశీ వనితకు ఓ మంచి మనిషి సాయం చేశాడు. పాత నోట్లు తీసుకుని ఆమెకు కొత్త నోట్లు ఇచ్చాడు. నవంబర్ 10న గోవా విమానాశ్రయంలో చోటుచేసుకున్న ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సామాను ఎక్కువగా ఉండడంతో విదేశీ వనిత రూ.1600 చెల్లించాల్సి వచ్చింది. ఆమె దగ్గర రూ. 500, రూ. వెయ్యి నోట్లు మాత్రమే ఉండడంతో అవి తీసుకునేందుకు ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది తీసుకునేందుకు నిరాకరించారు. చిల్లర ఇవ్వాలని చాలా మందిని ఆమె అడిగినా ఎవరూ ఇవ్వలేదు. ఏం చేయాలో పాలుపోక ఆమె కన్నీళ్లు పెట్టుకుంది. విదేశీ మహిళ బాధను చూసిన ఓ వ్యక్తి ఆమెకు కొత్త రూ. 2 వేల నోటు ఇచ్చాడు. అయితే తర్జనభర్జన తర్వాత ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బంది ఈ నోటు తీసుకున్నారు. ఈ ఉదంతాన్ని బిహార్ డిప్యూటీ సీఎం తేజశ్వి యాదశ్ రాజకీయ సలహాదారు సంజయ్ యాదవ్ వెలుగులోకి తెచ్చారు. దేశ ప్రజలకే కాకుండా విదేశీయులు కూడా నోట్ల కష్టాలు ఎదుర్కొంటున్నారని తెలియజెప్పడానికే ఈ ఘటనను వెలుగులోకి తెచ్చినట్టు సంజయ్ తెలిపారు. పాత పెద్ద నోట్ల రద్దును స్వాగతిస్తున్నామని, అయితే ప్రజలు కష్టాలు పడకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అభిప్రాయపడ్డారు. -
ఎంపీ కవిత విదేశీ పర్యటన
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత బుధవారం సాయంత్రం విదేశీ పర్యటనకు బయలుదేరనున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆమె 13న కువాయిట్, 14న బహ్రెయిన్, 15న డెన్మార్క్ దేశాల్లో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటారు. అనంతరం కవిత తిరిగి స్వదేశం చేరుకుంటారు. -
వచ్చే 2 నెలలు బాబు విదేశాల్లో బిజీ బిజీ
వచ్చే నెలలో అమెరికా.. డిసెంబర్లో దక్షిణ కొరియాలో పర్యటన సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు వచ్చే రెండు నెలలు విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో భాగంగా విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొనేందుకు ఆయా దేశాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. వచ్చే నెల 13 నుంచి 20వ తేదీ వరకు అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ జరిగే వివిధ పారిశ్రామిక సదస్సుల్లో చంద్రబాబు పాల్గొంటారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే డిసెంబర్ మధ్యలో దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. -
వచ్చే 2 నెలలు బాబు విదేశాల్లో బిజీబిజీ
- వచ్చే నెల 13 నుంచి 20 వరకు అమెరికా పర్యటన - డిసెంబర్ మధ్యలో దక్షిణ కొరియాలో పర్యటన హైదరాబాద్ : ఇప్పటికే పలు దేశాల్లో పలుసార్లు పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వచ్చే రెండు నెలలు విదేశీ పర్యటనల్లో బిజీ బిజీగా గడపనున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టడంలో భాగంగా విదేశాల్లో జరిగే సదస్సుల్లో పాల్గొనేందుకు ఆయా దేశాల్లో ముఖ్యమంత్రి పర్యటించనున్నట్లు అధికార వర్గాలు మంగళవారం పేర్కొన్నాయి. వచ్చే నెల 13 నుంచి 20వ తేదీ వరకు అమెరికాలో సీఎం పర్యటించనున్నారు. అక్కడ జరిగే వివిధ పారిశ్రామిక సదస్సుల్లో చంద్రబాబు పాల్గొంటారని ఉన్నతస్థాయి వర్గాలు పేర్కొన్నాయి. అలాగే డిసెంబర్ మధ్యలో దక్షిణ కొరియాలో సీఎం పర్యటించనున్నారు. ఇప్పటికే రాజధాని పేరుతో సింగపూర్‌లో అనేకసార్లు పర్యటించారు. జపాన్, చైనా దేశాల్లోనూ ముఖ్యమంత్రి పర్యటించిన విషయం తెలిసిందే. -
2017లో భారత్‌కు పోప్
వాటికన్ సిటీ: పోప్ ఫ్రాన్సిస్ వచ్చే ఏడాది భారత్ లో పర్యటించనున్నారు. ఈమేరకు 2017 విదేశీ పర్యటనల షెడ్యూలును ఆదివారం ప్రకటించారు. పోర్చుగల్, బంగ్లాదేశ్, కొలంబియా, ఆఫ్రికాలూ జాబితాలో ఉన్నాయి. మే 13న పోర్చుగల్‌లోని మారియన్ చర్చిని సందర్శించడం ఖరారైంది. భారత్, బంగ్లాదేశ్ దేశాల పర్యటనలు కూడా దాదాపు ఖాయమయ్యాయి. -
ఎయిర్ ఏషియా డిస్కౌంట్ ఆఫర్
న్యూఢిల్లీ: బెంగళూరుకు చెందిన బడ్జెట్ ఎయిర్ లైన్ ఎయిర్ ఏషియా జాతీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణీకుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఇయర్ ఎండ్ సేల్స్ లో భాగంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణీకుల కోసం భారీ తగ్గింపు ధరలను సోమవారం ప్రకటించింది. అంతేకాదు విదేశాలను చుట్టి రావాలనుకునే విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏషియా భారీ డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. డొమెస్టిక్ గా బెంగళూరు, కొచీ, హైదరాబాద్, న్యూ ఢిల్లీ, గౌహతి, జైపూర్, పూనే, ఇంఫాల్ (అన్ని పన్నుల కలుపుకొని)రూ. 999 నుంచి ప్రారంభమయ్యే కనీస ధరలను ప్రకటించింది. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, సింగపూర్, బాలి, ఫుకెట్, మెల్బోర్న్, సిడ్నీ తదితర అంతర్జాతీయ కేంద్రాలకు రూ. 3,599 తక్కువ ధరల్లో టికెట్లను ఆఫర్ చేస్తోంది. నేడు (అక్టోబర్ 3),16 తేదీల్లో బుక్ చేసుకున్న ఈ విమాన టిక్కెట్ల ద్వారా అక్టోబర్ 4 నుంచి వచ్చే ఏడాది అంటే ఏప్రిల్ 27, 2017 మధ్య ప్రయాణించవచ్చిన ఒక ప్రకటన లోతెలిపింది. ఎయిర్ ఏషియా మలేషియా, ఎయిర్ ఏషియా థాయ్ లాండ్, ఇండోనేషియా, ఫిలప్పీన్స్, భారత్, మధ్య నడిచే విమానాలకు ఈ రేట్లు వర్తించనున్నాయని తెలిపింది. వినియోగదారులకు బెస్ట్ పాజిబుల్ డీల్స్ అందించడమే తమ లక్ష్యమని ఎయిర్ఏషియాచీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, అమర్ అబ్రోల్ చెప్పారు. ప్రస్తుతం బెంగళూరు, న్యూఢిల్లీ కేంద్రాల ద్వారా , చండీగఢ్, జైపూర్, గౌహతి, ఇంఫాల్, పూనే, గోవా, వైజాగ్, కొచీ, హైదరాబాద్ కవరింగ్ తో 11 గమ్యస్థానాలకు విమానాలను నడుపుతున్నామని తెలిపారు. -
బెలుం గుహల్లో విదేశీయుల బృందం
కొలిమిగుండ్ల: ప్రఖ్యాత బెలుం గుహలను శనివారం విదేశీయులు తిలకించారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ కార్యక్రమాల అమలు తీరును అధ్యయనం చేసేందుకు అల్జీరియా, సూడాన్, ఇథోఫియా, ఘనా, మారిషస్, నేపాల్, లిబియా, సిరియా,టాంజానియా తదితర.. 14 దేశాల నుంచి 28 మంది వచ్చారు. బెలుం గుహలో పలు ప్రదేశాలను తిలకించారు. వారి వెంట ఎన్ఐఆర్డీ అధికారి నరసింహులు, ఆర్‌డబ్లూఎస్ ఈఈ వెంకట రమణ, ఎస్ఈ వీరభద్రరావు, డీఈ ఉమామహేశ్వరరావు ఉన్నారు. -
రవి రుయా అభ్యర్థనను కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ : ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎస్సార్ గ్రూపు ప్రమోటర్ రవి రుయా విదేశీ పర్యటన అభ్యర్థనను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఇంతకుముందు కూడా ఓ వ్యక్తి తమ లాగే చెప్పి తన వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాడని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆ చేదు అనుభవంతో విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొంది. 2002లోని 2 జీ స్పెక్ట్రమ్ కేటాయింపుల కుంభకోణంలో రవి రుయా భాగమున్నట్టు ఆరోపణలు ఎదుర్కొటున్నారు. కెనడా, యూఎస్, సౌదీ అరేబియాలోని బిజినెస్ పనులపై ఆయన విదేశీ పర్యటన వెళ్లాల్సి ఉందని రవిరుయా తరుఫున లాయర్లు కోర్టుకు విన్నపించుకున్నారు. రవి బెయిల్ కండీషన్లను ఉల్లంఘించరని లాయర్లు వాదించారు. కానీ ఈ విషయాలపై సీబీఐ అభ్యంతరం వ్యక్తంచేసింది. ఒకవేళ రవిరుయాను విదేశీ పర్యటనకు అనుమతించాక, అతను అక్కడి నుంచి తిరిగి రాకపోతే ఎలా అని ప్రశ్నలు సంధించింది. ఆయన నాన్ రెసిడెంట్ ఇండియన్ కావడంతో రవి రుయాను తిరిగి భారత్‌కు తీసుకురావడం కష్టతరమవుతుందని సీబీఐ పేర్కొంది. సీబీఐ వాదనను కోర్టు అంగీకరించింది. ముందుకూడా ఇలానే జరిగిందని, ఓ వ్యక్తి ఇలానే వాగ్దానం చేసి నిలబెట్టుకోలేకపోయాయడని, ఆ చేదు అనుభవంతో విదేశీ పర్యటన అనుమతిని తిరస్కరిస్తున్నట్టు సుప్రీం పేర్కొంది. ఈ కేసులో రుయా ప్రస్తుతం బెయిల్‌పై బయట ఉన్నారు. రష్యా, యూకే, ఫ్రాన్స్‌కు వెళ్లడానికి గతేడాది ఆయనకు అనుమతించిన కోర్టు, ఈ ఏడాది తిరస్కరించింది. -
కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్లిన చంద్రబాబు
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి విదేశీ పర్యటనకు బయల్దేరి వెళ్లారు. ఈ నెల 5వ తేదీ వరకూ చంద్రబాబు వ్యక్తిగత పర్యటనలో ఉంటారు. అయితే సీఎం పర్యటన వివరాలను టీడీపీ వర్గాలు గోప్యంగా ఉంచాయి. చంద్రబాబు పర్యటనకు ఎక్కడికి వెళ్లారో కూడా తమకు తెలియదని టీడీపీ నేతలు చెబుతున్నారు. కాగా గతంలోనూ చంద్రబాబు దాదాపు 5 రోజులపాటు కుటుంబంతో ఎంజాయ్ చేశారు. అయితే ఆయన ఎక్కడకు వెళ్లారు.. ఏ దేశంలో పర్యటించారు.. ఎక్కడ విడిది చేశారనే ప్రశ్నలకు మాత్రం ఇప్పటికీ క్లారిటీ లేదు. సాధారణంగా చంద్రబాబు విదేశీ పర్యటనలకు వెళితే మీడియాలో బాగానే కవరేజ్ వచ్చేలా జాగ్రత్తలు తీసుకుంటారు. విదేశీ పర్యటనల సమయంలో ఛానల్స్, పత్రికలకు సమాచారం అందేలా జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే ఈ పర్యటనను కూడా చంద్రబాబు గోప్యంగా ఉంచారు. -
నేటి నుంచి మోదీ విదేశీ పర్యటన
-
మేయర్ విదేశీ పర్యటనలపై సీఎం ఆగ్రహం
హైదరాబాద్: హైదరాబాద్ నగర మేయర్ బొంతు రామ్మోహన్ విదేశీ పర్యటనలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం నగరంలో వైట్‌టాపింగ్ రోడ్లు, తదితర అంశాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం అధికారులు వెళ్లిపోయాక తరచూ విదేశీ పర్యటనలెందుకంటూ మేయర్‌కు సీఎం క్లాస్ తీసుకున్నారు. మన పనులు మనం చేసుకోవాలే కానీ విదేశాలకెందుకని ప్రశ్నించారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇక విదేశీ పర్యటనలు మానుకోవాలని సూచించారు. రెండు నెలల క్రితం ఫ్రాన్స్, నాలుగు రోజుల క్రితం ఆస్ట్రేలియాకు మేయర్ వెళ్లడాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. నగరంలోని ప్రజాసమస్యలతోపాటు తరచూ కూలిపోతున్న భవనాల విషయాన్ని సీఎం ప్రస్తావించారని తెలిసింది. -
'విదేశీ పర్యటనలతోనే బాబు కాలం వెళ్లదీస్తున్నారు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలతోనే కాలం వెళ్లదీస్తున్నారని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఇందిరాభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ..రాష్ట్రంలో బాబు ప్రజల బాగోగులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రాయలసీమకు నీరందించేందుకే పట్టిసీమ ప్రాజెక్టు చేపట్టామని సీఎం చంద్రబాబు, మంత్రి దేవినేని ఉమ లు కల్లబొల్లి మాటలు చెబుతున్నారని తులసిరెడ్డి అన్నారు. అధికారం చేపట్టి రెండేళ్లుయినా రాయలసీమకు చుక్క నీరు ఇవ్వలేదన్నారు. సీమకు నీరు ఇవ్వకపోతే ప్రజలను మోసం చేసిన వారిగా చరిత్రలో మిగిలిపోతారని చెప్పారు. నీటి కోసం సీమ రైతులు ఎదురుచూస్తున్నారని... ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. ఏపీలోని 45 రిజర్వాయర్లు బాబు హాయాంలో వట్టి కుండల్లా మారయని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని తులసిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కుక్కల బెడదతో ప్రజలు బయటకు రావడానికే భయపడుతున్నారన్నారు. ఆస్పత్రుల్లో పందులు, కుక్కులు, ఎలుకలు స్వైరవిహారం చేస్తూ పిల్లలను పీక్కుతింటున్నాయని, పుట్టిన పిల్లలను దొంగలు ఎత్తికెళ్లిపోతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. బాధిత కుటుంబాలను తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. -
చంద్రబాబు విదేశీ టూర్లు చేయడమే తప్ప...
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొయ్య ప్రసాద్‌రెడ్డి శనివారం విశాఖపట్నంలో నిప్పులు చెరిగారు. చంద్రబాబు విదేశీ టూర్లు చేయడమే తప్ప... రాష్ట్రానికి పైసా పెట్టుబడి కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. రాజధాని నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు రాబట్టుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. బ్యూటిపికేషన్ పేరుతో ఆలయాలను తొలగించడం చాలా దుర్మార్గమ ఆయన మండిపడ్డారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని కొయ్య ప్రసాద్‌రెడ్డి స్పష్టం చేశారు. -
విదేశీ పర్యాటకులను ఆకర్షించిన రాష్ట్రాలు
న్యూఢిల్లీ: గతేడాది భారతదేశంలో అత్యధిక విదేశీ యాత్రికులు సందర్శించిన రాష్ట్రాల జాబితాను పర్యావరణ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. 40,68,000 మందితో తమిళనాడు మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతి స్థానాల్లో వరుసగా మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలు నిలిచాయి. పశ్చిమబెంగాల్ ఒక ర్యాంకును మెరుగుపరుచుకొని అయిదో స్థానంలో నిలువగా, రాజస్థాన్ ఆరో స్థానంతో సరిపెట్టుకుంది. ఏడో స్థానంలో కేరళ, ఎనిమిదవ స్థానంలో బిహార్, తొమ్మిదవ స్థానంలో కర్ణాటక, గోవా పదవ స్థానంతో సరిపెట్టుకుంది. -
టూరిస్టులు ఎక్కువగా వెళ్లే రాష్ట్రమేదో తెలుసా?
దేశంలో పర్యాటక రంగం రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. 2014లో 128.82 కోట్లమంది దేశీయ పర్యాటకులు వివిధ రాష్ట్రాల్లో పర్యటించగా.. 11.63శాతం వృద్ధితో 2015లో వారిసంఖ్య 143.2 కోట్లకు చేరింది. 2015లో దేశీయ, విదేశీ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వివరాలను తాజాగా కేంద్ర పర్యాటక శాఖకు చెందిన మార్కెట్ రీసెర్చ్ డివిజన్ వెల్లడించింది. ఈ వివరాల ప్రకారం అత్యధికమంది దేశీయ ప్రర్యాటకులు సందర్శించిన టాప్ టెన్ రాష్ట్రాలు ఇవే క్రమసంఖ్య రాష్ట్రాలు సందర్శించిన పర్యాటకులు 1 తమిళనాడు 33.35 కోట్లమంది 2 ఉత్తరప్రదేశ్ 20.49 కోట్లమంది 3 ఆంధ్రప్రదేశ్ 12.16 కోట్లమంది 4 కర్ణాటక 11.99 కోట్లమంది 5 మహారాష్ట్ర 10.34 కోట్లమంది 6 తెలంగాణ 9.45 కోట్లమంది 7 మధ్యప్రదేశ్ 7.8 కోట్లమంది 8 పశ్చిమ బెంగాల్ 7.02 కోట్లమంది 9 గుజరాత్ 3.63 కోట్లమంది 10 రాజస్థాన్ 3.52 కోట్లమంది 2015లో దేశీయ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రాలు టాప్ టెన్ రాష్ట్రాల వాటా 83.62శాతం ఉండటం గమనార్హం. 2015లో అత్యధిక దేశీయ పర్యాటకులు సందర్శించిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ప్రథమస్థానంలో నిలువగా రెండోస్థానంలో తమిళనాడు, మూడోస్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచాయి. టాప్ టెన్‌లో తెలంగాణ ఆరోస్థానంలో నిలువగా.. గుజరాత్ మంచి వృద్ధిని సాధిస్తూ గతం కన్నా ఒక ర్యాంకుపైకి ఎగబాకి తొమ్మిదో స్థానాన్ని సాధించింది. దీంతో తొమ్మిదో స్థానంలోని మధ్యప్రదేశ్ పదో స్థానానికి పడిపోగా.. గత ఏడాది టాప్ టెన్‌లో ఉన్న జార్ఖండ్ 11 స్థానానికి పరిమితమైంది. ఇక విదేశీ పర్యాటకుల విషయానికొస్తే.. 2015లో 2.33 కోట్లమంది విదేశీయులు దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సందర్శించారు. 2014లో పర్యటించిన 2.23 కోట్లమందితో పోల్చుకుంటే 4.4శాతం వృద్ధి నమైదైంది. 2015లో అత్యధికంగా 46.8 లక్షలమంది విదేశీయులు తమిళనాడును సందర్శించగా.. ఆ తర్వాతి స్థానంలో 44.1 లక్షలమందితో మహారాష్ట్ర రెండో స్థానంలో ఉంది. విదేశీ పర్యాటకుల విషయలో టాప్ టెన్ జాబితాలో తమిళనాడు, మహారాష్ట్ర తర్వాత వరుసగా ఉత్తరప్రదేశ్ (31 లక్షలు), ఢిల్లీ (23లక్షలు), పశ్చిమ బెంగాల్ (14లక్షలు), రాజస్థాన్ (14లక్షలు), కేరళ (9.8లక్షలు), బిహార్ (9.2 లక్షలు), కర్ణాటక (6.4 లక్షలు), గోవా (5.4లక్షలు) ఉన్నాయి. -
నేడు సింగపూర్‌కు కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మూడు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి కేటీఆర్ బుధవారం సింగపూర్ బయలుదేరి వెళ్తున్నారు. అక్కడ జరిగే సౌతిండియన్ బిజినెస్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం మలేసియాకు చేరుకుని గురువారం, జూలై ఒకటిన అక్కడ వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. రెండు రోజుల పాటు జరిగే మలేసియా పర్యటనలో అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారులు, వ్యాపార, వాణిజ్య సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ భేటీ అవుతారు. తిరిగి జూలై రెండో తేదీన మంత్రి హైదరాబాద్‌కు తిరిగివస్తారు. కేటీఆర్ వెంట రాష్ట్ర పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ కూడా పర్యటనకు వెళుతున్నారు. -
సోషల్ మీడియాలో ఫొటోల హల్చల్
లండన్ విదేశీ పర్యటనలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత రెండేళ్లుగా అలుపు లేకుండా ప్రజాసమస్యలపై ఉద్యమాలు చేస్తూ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం యువభేరి సదస్సులు నిర్వహిస్తూ ఉన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.. ఇటీవలే కొద్ది విరామం తీసుకుని కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయన అక్కడ గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్ 16వ తేదీ గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా బయల్దేరి ఇంగ్లండ్ వెళ్లిన ఆయన.. మొత్తం 10 రోజుల పాటు విదేశీ పర్యటనలో ఉంటారని ఇంతకుముందు పార్టీ వర్గాలు తెలిపాయి. -
రాహుల్.. మళ్లీ ఫారిన్ టూర్!
తాను మళ్లీ విదేశాలకు వెళ్తున్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. 46వ పుట్టిన రోజు జరిగిన ఒక్కరోజు తర్వాత.. ఆయనీ విషయం వెల్లడించారు గానీ, ఎక్కడకు వెళ్తున్నదీ చెప్పలేదు. స్పల్పకాలిక పర్యటన కోసం దేశం వదిలి వెళ్తున్నానని, తనకు ఆదివారం నాడు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినవారు అందరికీ మరోసారి కృతజ్ఞతలని రాహుల్ ట్వీట్ చేశారు. మీ అందరి అభిమానానికి కృతజ్ఞడినన్నారు. ఆదివారం పుట్టినరోజు సందర్భంగా రాహుల్ గాంధీని పార్టీ ప్రధాన కార్యాలయంలో వందలాది మంది కార్యకర్తలు కలిశారు. ఇంతకుముందు రాహుల్ గాంధీ 2015 ఫిబ్రవరిలో ఎవరికీ చెప్పకుండా వేరే దేశం వెళ్లిపోయి, 60 రోజుల తర్వాత తిరిగి వచ్చారు. అప్పట్లో ఆయన బ్యాంకాక్ వెళ్లారంటూ కథనాలు వచ్చాయి. అసలు ఎందుకు వెళ్లారన్న విషయమై పలు అనుమానాలు చెలరేగాయి. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎలా పారిపోతారంటూ విమర్శలు వెల్లువెత్తాయి. మళ్లీ గత సంవత్సరం డిసెంబర్ నెలాఖరులో కొత్త సంవత్సరం వేడుకల కోసం మరోసారి వెళ్లారు. అయితే వేరే దేశం వెళ్తున్నట్లుగా ఆయన ట్విట్టర్లో చెప్పడం మాత్రం ఇదే మొదటిసారి. Traveling out of the country for a few days on a short visit.Thanks again to all who met &wished me y'day,truly grateful for your affection! — Office of RG (@OfficeOfRG) 20 June 2016 -
4 నుంచి మోదీ విదేశీ పర్యటన
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జూన్ 4న ఐదు దేశాల విదేశీ పర్యటనను ప్రారంభించనున్నారు. అఫ్గానిస్తాన్‌తో ప్రారంభించి ఖతార్, స్విట్జర్లాండ్ల్లో పర్యటించి, అనంతరం అమెరికా చేరుకుంటారు. అక్కడ యూఎస్ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తర్వాత అఫ్గానిస్తాన్‌లో రూ. 1,400 కోట్ల భారత్ నిధులతో నిర్మించిన సల్మా ఆనకట్టను మోదీ ప్రారంభిస్తారు. ఖతార్‌లో రెండు రోజులుంటారు. స్విట్జర్లాండ్‌లో ఆ దేశాధ్యక్షుడు జోహన్ ష్నీడర్ అమన్‌తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా.. స్విస్ బ్యాంకుల్లో దాగిన భారతీయుల నల్లధనాన్ని వెలికితీయడంలో అక్కడి ప్రభుత్వ సహకారం కోరనున్నారు. అక్కడి నుంచి బయల్దేరి జూన్ 7వ తేదీన అమెరికా చేరుకుంటారు. తిరుగుప్రయాణంలో మెక్సికోలో ఆగి, అక్కడి నాయకత్వంతో వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. -
నిబంధనలకు విరుద్ధంగా మంత్రుల యాత్రలు
సీఎం అనుమతి లేనిదే విదేశీ పర్యటనలకు వెళ్లొద్దని సర్కులర్ జారీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు నిబంధనలు పాటించకుండా విదేశీ పర్యటనలకు వెళ్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక నుంచి సీఎం, సాధారణ పరిపాలన శాఖ అనుమతి లేకుండా మంత్రులు, అధికారులు విదేశీ యాత్రలకు వెళ్లరాదని స్పష్టం చేస్తూ సాధారణ పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి శశిభూషణ్ కుమార్ శనివారం సర్క్యులర్ మెమో జారీ చేశారు. విదేశీ పర్యటనలకు ప్రస్తుత నిబంధనలు పాటించడంతోపాటు అదనంగా సాధారణ పరిపాలన శాఖ ద్వారా ముఖ్యమంత్రితో ఆమోదం తీసుకోవాలని అందులో స్పష్టం చేశారు. గత రెండేళ్లలో ఉన్నతాధికారులు 125 సార్లు విదేశీ పర్యటనలకు వెళ్లొచ్చారని, ఆ పర్యటనల వల్ల ప్రభుత్వానికి రూ.100 కోట్ల వ్యయం అయ్యిందే తప్ప ప్రయోజనం లేదని ‘సాక్షి’ ఇటీవల పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి విదేశీ పర్యటనలను నియంత్రించేందుకు సర్క్యులర్ మెమో జారీ చేసింది. -
కరువు ఉరుముతున్నా.. జాడ లేని ముఖ్యమంత్రి
- ప్రధానితో వివిధ రాష్ట్రాల సీఎంల భేటీలు, ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని విజ్ఞప్తులు - విదేశీ పర్యటనలో సీఎం చంద్రబాబు నాయుడు - వ్యాపార వ్యవహారాలు చక్కబెట్టుకోవడానికేనా? సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: దేశవ్యాప్తంగా తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. సహాయక చర్యలపై చర్చించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సమావేశమవుతున్నారు. ఆర్థిక సాయం అందజేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు మంగళవారం ప్రధానితో భేటీ అయ్యారు. తమ రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్లు సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా కరువు కరాళనృత్యం చేస్తుండటంతో ప్రజలకు తాగడానికి మంచినీరు కూడా అందుబాటులో లేదు. ఈ నేపథ్యంలో తక్షణమే రంగంలోకి దిగి, అధికారులకు దిశానిర్దేశం చేస్తూ సహాయక చర్యలను పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు జాడ మాత్రం కనిపించడంపోవడం పట్ల అధికార పార్టీ నేతలే విస్మయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రజలు కరువుతో అల్లాడుతుంటే ముఖ్యమంత్రి కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనలు, విహారాలతో తీరిక లేకుండా ఉండడమేంటని వారు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు విదేశీ పర్యటనకు ప్రాధాన్యం ఇవ్వడం టీడీపీ నేతల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు ఆదివారం రాత్రి సతీమణి భువనేశ్వరితో కలిసి విదేశాలకు పయనమయ్యారు. ఆయన ఎక్కడికి వెళ్లారనేదానిపై టీడీపీ నేతలకే స్పష్టత లేకపోవడం గమనార్హం. తమకున్న సమాచారం ప్రకారం.. సీఎంతొలుత థాయ్‌లాండ్‌కు వెళ్లి, అక్కడి నుంచి స్విట్జర్లాండ్‌కు వెళతారని పార్టీ ముఖ్యనేత ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. బాబు కన్నా రెండు రోజులు ముందు ఆయన తనయుడు లోకేశ్ కుటుంబ సమేతంగా విదేశాలకు వెళ్లారు. తండ్రీకొడుకులు కలిసి వ్యాపార కార్యకలాపాలను చక్కబెట్టుకోవడానికే విదేశీ పర్యటనలకు వెళ్లారనే చర్చ టీడీపీ నేతల మధ్య జరుగుతోంది. షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు 15వ తేదీన విజయవాడకు చేరుకోవాల్సి ఉంది. విదేశాల్లో పనులను చక్కబెట్టుకుని అంతకన్నా ఒకటి, రెండు రోజులు ముందు స్వదేశానికి తిరిగి చేరుకునే అవకాశాలు కూడా లేకపోలేదని పార్టీ నాయకులు అంటున్నారు. సొంత పార్టీలోని కీలక నేతలకు కూడా తెలియకుండా సీఎం ఎక్కడికి వెళ్లి ఉంటారనే విషయం రాష్ట్రంలో ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్‌లో ఇండిపెండెంట్ డెరైక్టర్ అయిన మోటపర్తి శివరామప్రసాద్‌కు అనుమానాస్పద కంపెనీలతో ఉన్న సంబంధాలను పనామా పేపర్స్ బయటపెట్టిన తరుణంలోనే చంద్రబాబు విదేశాల్లో పర్యటన కొనసాగిస్తుండడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
చలో ఫారిన్ టూర్!
♦ అన్ని వర్గాల్లోనూ పెరుగుతున్న భారతీయ టూరిస్టులు ♦ కొందరికి ఖర్చు లెక్కలేదు; పొదుపుతో మరికొందరు ♦ ఏటా 1.8 కోట్ల మంది టూరిజానికి; 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్తగా పెళ్లైన జంట. హనీమూన్‌కు భారత్ నుంచి ఆస్ట్రేలియా వెళ్లారు. సిడ్నీ, మెల్బోర్న్ వంటి నగరాలతో పాటు క్వీన్స్‌లాండ్‌లోని గ్రేట్ బారియర్ రీఫ్ వంటివన్నీ చుట్టేశారు. ఇంతకీ ఆ టూర్‌కు సదరు జంట ఖర్చుపెట్టిందెంతో తెలుసా? అక్షరాలా యాభై లక్షలు. మరో జంటను తీసుకుంటే... వారి ఆదాయం తక్కువ. కానీ వారూ కేరళలోని మున్నార్ వంటి పర్యాటక ప్రాంతాలకు వెళ్లొచ్చారు. పొదుపుగా... రైల్లో వెళ్లి అక్కడ చక్కగా వారం రోజులుండి వచ్చారు. ఖర్చు రూ.50వేలు మించలేదు. ఈ రెండు ఉదాహరణలూ చూశాక అనిపించేదొక్కటే. భారతీయులు పర్యటనలకు ఎంతైనా ఖర్చు పెడుతున్నారని మొదటి సంఘటన చెబితే... పర్యటనలకు వెళ్లే ఆర్థిక స్థోమత నిజంగా లేనప్పటికీ కొంచెం కొంచెం పొదుపు చేసుకుని కూడా వెళుతున్నారని తెలుస్తుంది. మొత్తమ్మీద ఈ రెండు సంఘటనలూ చెప్పేదొక్కటే. దేశంలో ఇపుడు పర్యటనలకు వెళ్లేవారి సంఖ్య పెరిగింది. ఒకప్పుడు విదేశాలకు విహార యాత్రలంటే నెలల ముందు నుంచి ప్రణాళిక వేసుకోవాల్సి వచ్చేది. దీంతో వెళ్లేవారు కూడా తక్కువే ఉండేవారు. ఇపుడంతా ఇన్స్టంట్. ఏదైనా కంపెనీ ఆఫర్ ఇచ్చినా, లేదా ప్రసార మాధ్యమాల్లో ఆకట్టుకునే ప్రకటన చూసినా వెంటనే క్రెడిట్ కార్డు స్వైప్ చేయటమో, బ్యాంకుల్ని సంప్రదించటమో చేస్తున్నారు. బ్యాంకులు కూడా ముందు పర్యటనకు వెళ్లి వచ్చేసి... ఆ తరువాత సదరు మొత్తాన్ని తీరిగ్గా ఈఎంఐలలో కట్టే ఆఫర్లు అందిస్తున్నాయి. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ గనక మరింత సరళతరమైతే విదేశీ టూర్లు ఇంకా పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. సేద తీరాల్సిందే...! విదేశీ టూర్లు ఒకప్పుడు సంపన్నులకే పరిమితమయ్యేవి. ఇప్పుడు మధ్యతరగతి వారూ ఆసక్తి కనబరుస్తున్నారు. ‘‘ఆదాయాలు పెరగటంతో పాటు టూర్ ప్యాకేజీలు కూడా అందుబాటు ధరల్లోకి వచ్చాయి. కంపెనీలు సైతం అన్ని వర్గాల వారినీ దృష్టిలో పెట్టుకుని ప్యాకేజీలు తయారు చేస్తున్నాయి. అందుకే విదేశీ ప్రయాణాలు పెరుగుతున్నాయి’’ అని ట్రావెల్ కంపెనీ థామస్ కుక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జతిందర్ పాల్ సింగ్ ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో చెప్పారు. వివిధ దేశాల్లోని దర్శనీయ ప్రాంతాలను సినిమాల్లో, ఇంటర్నెట్లో చూసి ఇట్టే ఆకర్షితులవుతున్నారని, ఒత్తిడి నుంచి కాసింత ఉపశమనం కోసం విహార యాత్రలు, సాహస యాత్రలు, షాపింగ్‌కు దేశాలను దాటుతున్నారని ఆయన చెప్పారు. మరో కొత్త పోకడను చూస్తే... గతంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలకు వెళ్లి... అక్కడ బాగా ప్రాచుర్యం ఉన్న ప్రాంతాలనే చూసేవారు. ఇప్పుడైతే ఆ ప్రదేశానికి సమీపంలో ఉన్న ఇతర ప్రాంతాలనూ చుట్టేసి వస్తున్నారు. అపార్ట్మెంట్, విల్లా, ఫామ్ హౌజ్ అద్దెకు తీసుకోవడం, గ్రామంలో బస చేయడం వంటివి పెరుగుతున్నాయి. సముద్ర ప్రయాణం చేస్తూ క్రూయిజర్‌లో సేద తీరటమూ ఈ మధ్య పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు తెలియజేశాయి. భారతీయుల కోసం.. భారత్ నుంచి విదేశాలకు వెళుతున్న వారిలో అత్యధికులు స్విట్జర్లాండ్, సింగపూర్, థాయ్‌లాండ్, లండన్, యూఎస్లనే ఎంచుకుంటున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఐదే టాప్-5 డెస్టినేషన్స్‌గా నిలుస్తున్నాయి కూడా. ఇక దుబాయి, సీషెల్స్, తూర్పు యూరప్, స్కాండినేవియా, వియత్నాం, కంబోడియా, చైనా, బాలి, మెక్సికో, కెనడా తదితర ప్రాంతాలకు ఇప్పుడిప్పుడే టూర్లు పెరుగుతున్నాయి. భారతీయులను ఆకట్టుకోవడానికి దుబాయిలో ప్రపంచంలోనే తొలి బాలీవుడ్ థీమ్ పార్క్ ఏర్పాటవుతోంది. అక్టోబరులో ఇది ప్రారంభం కానుంది. విహార యాత్రల కోసం భారత్ నుంచి ఏటా 1.8 కోట్ల మంది విదేశాలకు వెళ్తుండగా... 2020 నాటికి ఈ సంఖ్య 5 కోట్లకు చేరుకుంటుందన్న అంచనాలున్నాయి. వ్యవస్థీకృత సంస్థల ద్వారా 25 శాతం మంది టూర్లను ఎంచుకుంటుండగా మిగిలిన వారు స్థానిక ఆపరేటర్లను సంప్రదించటం, కొందరు ఇంటర్నెట్ సాయంతో సొంతగా టూర్లను ఎంచుకోవటం వంటివి చేస్తున్నారు. కొందరు విమాన టిక్కెట్లు తీసుకుని... తాము చేరాలనుకున్న దేశం చేరాక... అక్కడే స్థానిక టూర్ ఆపరేటర్‌ను ఎంచుకుంటున్నారు. కస్టమర్ల సంఖ్య పరంగా ఢిల్లీ, ముంబై, కోల్‌కత, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌లు టాప్ సిటీస్‌గా నిలుస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ‘‘ఈ-వీసా, వీసా ఆన్ అరైవల్ వంటివి యాత్రికులు పెరిగేందుకు దోహదం చేస్తున్నాయి. కాకపోతే వీసా చార్జీలు మరింత తగ్గాల్సి ఉంది. కొన్ని దేశాల వీసాల కోసం ఎంబసీల చుట్టూ తిరిగే ఓపిక లేక చాలా మంది ప్రయాణాలకు దూరంగా ఉంటున్నారు. ఎంబసీ స్థాయిలో వీసా ప్రక్రియ మరింత సరళతరమైతే విదేశాలకు వెళ్లే వారి సంఖ్య అధికమవుతుంది’’ అని ఓ ట్రావెల్ కంపెనీ అధిపతి అభిప్రాయపడ్డారు. వాయిదాల్లో చలో.. దేశంలోని టూర్ కంపెనీల్లో అగ్రస్థానంలో ఉన్న థామస్ కుక్ ద్వారా ఏటా లక్ష మంది విహార యాత్రలకు విదేశాలు చుట్టివస్తున్నట్లు జతిందర్ పాల్ సింగ్ చెప్పారు. ‘‘మేం నాలుగు కేటగిరీల్లో ప్యాకేజీలందిస్తున్నాం. అల్ట్రా లగ్జరీ విభాగంలో 3 శాతం మంది, ప్రీమియం 25 శాతం, వాల్యూ 35 శాతం, మిగిలినవారు బడ్జెట్ విభాగంలో వెళుతున్నారు’’ అని ఆయన చెప్పారు. ప్యాకేజీనిబట్టి ఒక జంటకు యూరప్ ట్రిప్‌కు వరుసగా రూ.4 లక్షలు, రూ.2.5 లక్షలు, రూ.1.5 లక్షలు, రూ.79 వేలు ఖర్చు అవుతుందని తెలియజేశారు. తాము వాయిదాల్లోనూ ప్యాకేజీలు అందిస్తున్నామని, దీనికి బాగా డిమాండ్ ఉందని తెలియజేశారు. -
ట్రావెల్ బీమా లేకుంటే కష్టం!
మొన్నటికి మొన్న... బెల్జియంలో పర్యాటకులు బాంబు దాడికి గురయ్యారు. నిజానికి ఈ సంఘటన ఎవ్వరి ఊహలకు కూడా అందలేదు. దీంతో కొందరికి విదేశంలో డబ్బుల్లేక చిక్కుకుపోయే పరిస్థితి తలెత్తింది. నిజానికి సరైన ప్రయాణ బీమా ఉంటే ఈ పరిస్థితి రాదు. స్నేహితులు, బంధువులు మన భావోద్వేగాలనైతే పంచుకుంటారు. కాకపోతే ఆర్థిక మద్దతు అందించాలంటే సరైన ప్రయాణ బీమాతోనే సాధ్యం. ఇపుడు చాలా కంపెనీలు ఉగ్రవాదుల దాడులకు కూడా కవరేజీ ఇస్తున్నాయి. కానీ అంతర్యుద్ధం వంటి వాటి విషయంలో మాత్రం కవరేజీ ఇవ్వటం లేదు. ట్రావెల్ బీమాతో ఎమర్జెన్సీ సమయాల్లో లభించే ప్రయోజనాలేంటో చూద్దాం... * హైజాక్ నుంచి వైద్య ఖర్చుల వరకూ కవరేజీ * ఆఖరి క్షణం అవస్థలకూ బీమాతో చెల్లుచీటీ హైజాక్ అలవెన్సు: బీమా ఉన్న వ్యక్తి విదేశీ ప్రయాణం చేస్తుండగా విమానం హైజాక్‌కు గురైందని అనుకుందాం. అలాంటి సమయాల్లో హైజాక్‌లో ఉన్న ప్రతి రోజుకూ అలవెన్స్ చెల్లిస్తారు. కాకపోతే ఈ మొత్తం బీమా పరిధికి లోబడి ఉండాలి. రాజకీయ నష్టం- తరలింపు: బీమా ఉన్న వ్యక్తి ఒక దేశాన్ని సందర్శించినపుడు... రాజకీయ అంశాల కారణంగా కొన్ని వర్గాలవారు తక్షణం దేశాన్ని విడిచి వెళ్లాలని అధికారులు ఆదేశించినపుడు పాలసీ వర్తిస్తుంది. పాలసీ దారుడిని సదరు దేశం నుంచి బహిష్కరించినా, అక్కడకు వచ్చే అర్హత లేదని ప్రకటించినా కవరేజీ ఉంటుంది. * భూకంపం, వరదలు, అంటువ్యాధుల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తే వాటి నుంచి తప్పించుకోవటానికి పాలసీ దారుడు ఆ దేశం విడిచి వెళ్లాల్సి వస్తే దానికి కవరేజీ ఉంటుంది. * ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుడు తన స్వదేశానికి తిరిగి రావటానికి అయ్యే ఖర్చును బీమా కంపెనీ భరిస్తుంది. లేనిపక్షంలో పాలసీదారుడిని వేరొక సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అయ్యే ఖర్చుకూ కవరేజీ ఉంటుంది. * ఒకవేళ పాలసీదారుడు తన దేశానికి రాలేని పక్షంలో విదేశంలో గరిష్ఠంగా 7 రోజుల పాటు వసతి ఖర్చుల్ని కూడా బీమా కంపెనీ భరిస్తుంది. ట్రిప్ ఆలస్యమైతే..: ప్రకృతి వైపరీత్యాలు, టైస్టుల దాడులు, మెడికల్ ఎమర్జెన్సీల వల్ల ట్రిప్ ఆలస్యమైతే వసతి, ఆహారం తదితరాలకు అయ్యే ఖర్చుల్ని బీమా కంపెనీ చెల్లిస్తుంది. యాత్రలకు వె ళ్లేవారెవ్వరూ అక్కడి పరిస్థితులనో, పరిణామాలనో ముందుగా ఊహించలేరు. కానీ బీమా కవరేజీని మాత్రం ముందే తీసుకోగలరు. అందుకే తగిన బీమా కవరేజీతో ఏ ప్రయాణాన్నయినా హాయిగా సాగించవచ్చనేది నా సలహా. అత్యవసర వైద్య పరిస్థితులు: విదేశాల్లో ఉన్నపుడు అస్వస్థతతోనో, ప్రమాదం వల్లో ఆసుపత్రిలో చేరితే వెంటనే క్లెయిమును నమోదు చేసి, బీమా కంపెనీ అనుమతి పొందాల్సి ఉంటుంది. తీవ్రమైన అనారోగ్యం పాలైతేనే. స్వదేశానికి తిరిగి వచ్చేదాకా చికిత్స చేయించుకోకుండా ఉండటం కష్టమని, అప్పటికప్పుడే చేయించుకోవాలనే పరిస్థితి ఉన్నపుడే క్లెయిమును ఆమోదిస్తారు. అప్పటికే ఉన్న వ్యాధుల వల్ల కాకుండా ఏదైనా ప్రమాదం వల్ల గాయం తగలడం,అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరడం వంటి సందర్భాల్లోనూ ఈ ప్రయోజనం పొందవచ్చు. ఎమర్జ్జెన్సీ క్యాష్ అడ్వాన్సు: పాలసీదారుడి లగేజీ లేదా డబ్బు చోరీకో లేక దోపిడీకో గురైన పక్షంలో... దేశంలో ఉండే పాలసీదారు బంధువులతో సమన్వయం జరిపి... తక్షణ సాయంగా అత్యవసర నగదు అందజేస్తారు. అయితే ఈ మొత్తం పాలసీ పరిమితులకు లోబడి ఉంటుంది. యాత్ర రద్దు, అంతరాయం, విమానం మిస్ అయినా...: అనివార్య కారణాల వల్ల పాలసీదారు యాత్రను రద్దు చేసుకున్నా, యాత్రకు అంతరాయం కలిగినా లేదా విమానం మిస్ అయినా కవరేజీ ఉంటుంది. ట్రిప్ ఖర్చులు, క్యాన్సిలేషన్ చార్జీలు కవర్ అవుతాయి. అయితే దీనికి కారణాలు పాలసీలో పేర్కొన్నవి అయి ఉండాలి. - అమిత్ భండారి ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ -
వారఫలాలు (20-03-2016 / 26-03-2016)
20 మార్చి నుంచి 26 మార్చి, 2016 వరకు మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.) ఆర్థిక లావాదేవీలు నిరాశ పరిచినా అవసరాలకు సొమ్ము అందు తుంది. ఆత్మీయులు, బంధువుల తోడ్పాటుతో సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఇంటిలో శుభకార్యాలు. వాహన యోగం. వ్యాపారాల్లో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు విదేశీ పర్యటనలు. ఎరుపు, నేరేడు రంగులు. తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దేవీస్తోత్రాలు పఠించండి. వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోిహ ణి, మృగశిర 1,2 పా.) కార్యక్రమాలు కొంత మందగిస్తాయి. రాబడి ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి మాట సహకారం అందుతుంది. చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. రాజకీయవర్గాలకు నిరుత్సాహం. ఆకుపచ్చ, లేత గులాబీ రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్ చాలీసా పఠించండి. మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.) ఆర్థిక ఇబ్బందులు. పనులు ముందుకు సాగవు. ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. బంధుమిత్రుల నుంచి మాట పడతారు. కష్టం మీది ఫలితం మరొకదిగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు శ్రమాధిక్యం. కళాకారులకు ఒత్తిడులు. పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. గులాబీ, పసుపు రంగులు. నవగ్రహ స్తోత్రాలు పఠించండి. కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష) మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. రాబడి సమకూరుతుంది. దీర్ఘకాలిక సమస్య పరిష్కారమవుతుంది. భూములు, వాహనాల కొనుగోలు యత్నాలు సఫలం. ఇంటా బయటా అనుకూలస్థితి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాలలో కొత్త పెట్టుబడులతో పాటు భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగులకు ఊహించని హోదాలు దక్కవచ్చు. పారిశ్రామిక వర్గాలకు ఆహ్వానాలు అందుతాయి. తెలుపు, నేరేడు రంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి. సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభం. రుణబాధల నుంచి విముక్తి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు. రాజకీయ వర్గాలు విదేశీ పర్యటనలు చేస్తారు. ఎరుపు, చాక్లెట్ రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. దుర్గామాతకు కుంకుమార్చన చేయండి. కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.) ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ. మిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి. భూములు, గృహం కొనుగోలు యత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు హోదాలు. కళారంగం వారికి నూతనోత్సాహం. నీలం, నేరేడు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. పంచముఖ ఆంజనేయస్వామి స్తోత్రాలు పఠించండి. తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.) పట్టింది బంగారమే. ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరం. సమస్యలు తీరతాయి. ఇంటి నిర్మాణయత్నాలు కార్యరూపం దాలుస్తాయి. అన్నింటా మీదే పైచేయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగులకు ఇంక్రి మెంట్లు. పారిశ్రామికవర్గాలకు ఆహ్వానాలు. నలుపు, చాక్లెట్ రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హయగ్రీవ స్తోత్రాలు పఠించండి. వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించండి. బంధుమిత్రులతో ఉత్తర ప్రత్యుత్తరాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఇంటి నిర్మాణ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వివాదాల నుంచి బయటపడతారు. ఎరుపు, లేత పసుపు రంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి. ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) ప్రారంభంలో చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగు పడుతుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. నిరుద్యోగులకు శుభ వార్తలు. ఒక సమాచారం ఊరటనిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకోని పదోన్నతులు. రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు. గులాబీ, లేత ఆకుపచ్చ రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి. మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.) ముఖ్యమైన కార్యక్రమాలు కొంత నెమ్మదిస్తాయి. బంధువులు, మిత్రులను కలుసుకుని సంతోషంగా గడుపుతారు. ఆదాయం కొంత తగ్గినా అవసరాలు తీరతాయి. విద్యార్థుల యత్నాలు అనుకూలిస్తాయి. గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలగుతాయి. ఉద్యోగులకు అదనపు విధులు. కళారంగం వారికి సన్మానాలు, అవార్డులు. నీలం, నేరేడు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. గణేశ్‌కు అర్చన చేయండి. కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.) పనుల్లో విజయం. ఆప్తులు, శ్రేయోభిలాషుల సలహాలు, సూచనలు అమలు చేస్తారు. సంఘంలో ఆదరణ లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు తథ్యం. ఉద్యోగులకు అనుకూల బదిలీలు. పారిశ్రామిక వర్గాలకు నూతనోత్సాహం. నలుపు, నేరేడు రంగులు, ఆంజనేయ దండకం పఠించండి. మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) కొత్త పనులకు శ్రీకారం. ఆదాయం సంతృప్తినిస్తుంది. కుటుంబ సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పరపతి పెరుగుతుంది. విద్యార్థుల కృషి ఫలించే సమయం. శ్రమకు తగ్గ ఫలితం దక్కుతుంది. వాహన, గృహ కొనుగోలు యత్నాలు కలసి వస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యో గులకు కోరుకున్న మార్పులు. రాజకీయవర్గాలకు ఆకస్మిక విదేశీ పర్య టనలు. పసుపు, లేత ఎరుపు రంగులు, ఆదిత్య హృదయం పఠించండి. సింహంభట్ల సుబ్బారావు జ్యోతిష్య పండితులు -
నవ్విన వారిముందే రియల్ హీరో అయ్యాడు!
ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా నిరాశ పడలేదు హజబ్బా. వెనక్కి తగ్గలేదు. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విదేశీ పర్యాటకులు ఒకటికి రెండు సార్లు అడిగినా హజబ్బా దగ్గర జవాబు లేదు. అతనికి అవమానంగా, బాధగా అనిపించింది. ‘‘నేను చదువుకొని ఉండి ఉంటే ఇలా జరిగేదా?’’ అనుకున్నాడు మనసులో. మంగుళూరు(కర్నాటక)కు పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న పాప్డు గ్రామంలో కమలాఫలాలు అమ్ముతాడు హజబ్బా. ఒకరోజు ఆ ఊరికి వచ్చిన విదేశీ పర్యాటకులు కమలా ఫలాల ధర గురించి హజబ్బాను అడిగారు. వారు దేని గురించి అడుగుతున్నారో హజబ్బాకు అర్థం కాలేదు. కాస్త అవమానంగా కూడా అనిపించింది. ఈలోపు ఎవరో వచ్చి- ‘‘ఈ పండ్ల ధరల గురించి అడుగు తున్నారు’’ అని చెప్పారు. ఈ సంఘటన హజబ్బాలో చాలా మార్పు తీసుకొచ్చింది. ‘పేదరికం కారణంగా నేను చదువుకోలేకపోయాను. కాస్తో కూస్తో చదువుకొని ఉంటే వాళ్లు మాట్లాడింది అర్థం చేసుకునేవాడిని కదా. నాలాంటి పరిస్థితి పేద పిల్లలెవరికీ రాకూడదు. వారి కోసం ఏదో ఒకటి చేయాలి’ అనుకున్నాడు. దానికోసం... ‘ఎలాగైనా సరే... నా ఊళ్లోని పేద పిల్లల కోసం ఒక బడి కట్టిస్తాను’ అనుకున్నాడు బలంగా. ఏ మంచి పనీ అవరోధాలు లేకుండా పూర్తి అవ్వదు అంటారు. హజబ్బాకి కూడా అలాంటి అవరోధాలే ఎదురయ్యాయి. పేద పిల్లల కోసం స్కూలు కట్టాలన్న అతని ఆలోచన విని కొందరు వెటకారంగా నవ్వారు. కొందరు ‘స్కూలు కట్టడం అంటే అంత తేలికను కున్నావా?’ అని వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. హజబ్బా భార్య మైమూన కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. ‘‘ముందు మన ముగ్గురు పిల్లల భవిష్యత్ గురించి ఆలో చించండి’’ అంది. అయితే భర్తలోని పట్టు దల, నిజాయితీ చూసి మనసు మార్చు కుంది. భర్తకు అండగా నిలబడింది. అయితే ఎవరి అండనూ కోరుకోలేదు హజబ్బా. అతని లక్ష్యం పట్ల అతనికి స్పష్టత ఉంది. అందుకే సాధన మొదలు పెట్టాడు. మొదట స్కూలు కోసం కొంత స్థలాన్ని కొనుగోలు చేశాడు. అయితే స్కూలు కట్టించడానికి తాను పొదుపు చేసిన డబ్బు సరిపోదని అర్థమైంది. దాంతో గడపా గడపా తిరుగుతూ తోచిన సహాయం చేయమని కోరేవాడు. ఈ క్రమంలో అతనికి కొన్ని చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఓసారి సహాయం కోసం ఒక సంపన్నుడి ఇంటికి వెళ్తే... ఒక్క పైసా సహాయం చేయకపోగా తన ఇంట్లో ఉన్న కుక్కను హజబ్బా మీదికి వదిలాడు. ఎవరు విసుక్కున్నా, చిరాకు పడినా, అదిలించినా, కోపగించుకున్నా నిరాశ పడలేదు హజబ్బా. తాను పొదుపు చేసిన, సేకరించిన డబ్బుతో ఊళ్లో ఒకటిన్నర ఎకరాల స్థలంలో ప్రాథమిక పాఠశాలను నిర్మించాడు. ఆ విషయం పదిమంది దృష్టిలో పడింది. స్థానిక దినపత్రికలో హజబ్బా మీద స్ఫూర్తిదాయక కథనం వచ్చింది. ఒక జాతీయ చానల్ వాళ్లు ‘రియల్ హీరోస్’ అవార్డును ఇచ్చారు. వాళ్లు ఇచ్చిన అయిదు లక్షల్ని కూడా స్కూలు కోసమే వెచ్చించాడు హజబ్బా. దీంతో మొదట నవ్విన వాళ్లందరికీ అతడి నిజాయితీ అందరికీ అర్థమైంది. హజబ్బా నిర్మించిన స్కూలు ఇప్పుడు సెకెండరీ స్కూల్‌గా మారింది. ‘‘స్కూలు కట్టించడం వరకే నా పని’’ అంటూ ఆ స్కూలును ప్రభుత్వపరం చేశాడు హజబ్బా. స్కూలుకు తన పేరు పెట్టాలనే ప్రతిపాదనను కూడా తిరస్క రించాడు. దాంతో అతడి ఔన్నత్యం మరింత వెలుగులోనికి వచ్చింది. అతడికి అభిమానులు ఏర్పడ్డారు. అరకొర సౌకర్యా లున్న ఇంట్లో నివసిస్తూ అనారోగ్యానికి గురవుతున్న హజబ్బాకు వాళ్లంతా మంచి ఇల్లు కట్టించారు. తన పేదరికం గురించి ఆలోచించకుండా పేదపిల్లల చదువుల గురించి ఆలోచిస్తున్న హజబ్బాపై జిల్లా, రాష్ర్ట స్థాయిలోనే కాదు జాతీయంగా కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే అవేమీ పట్టించుకోడు హజబ్బా. తన పని తాను చేసుకు పోతాడు. ప్రస్తుతం గ్రామంలో ప్రి-యూనివర్శిటీ నిర్మాణ పనుల్లో తలమునకలవుతున్నాడు. -
భారత్‌కు పెరిగిన విదేశీ పర్యాటకుల తాకిడి
గత ఏడాది జనవరితో పోల్చితే ఈ సంవత్సరం జనవరిలో విదేశీ టూరిస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాది జనవరిలో 7.91 లక్షల మంది విదేశీ పర్యాటకులు మన దేశాన్ని సందర్శించగా, ఈ సంఖ్య 2016 జనవరిలో 8.44 లక్షలకు పెరిగింది. విదేశీ పర్యటకుల సంఖ్య రికార్డు స్థాయిలో 6.8 వృద్ధిని సాధించింది. టూరిజం నుంచి వచ్చే విదేశీ మారక నిల్వలు(ఫారన్ ఎక్స్ఛేంజ్ ఎర్నింగ్స్) గత ఏడాది జనవరితో పోల్చితే ఈ ఏడాది 13 శాతం పెరిగాయని ప్రభుత్వం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. విదేశీ పర్యటకులలో జనవరి నెలలో టాప్ స్థానంలో నిలిచిన దేశాలు: 1) అమెరికా 2) బంగ్లాదేశ్ 3) యూకే 4) కెనడా 5) అస్ట్రేలియా 6)రష్యా 7)జర్మనీ 8)ఫ్రాన్స్ 9) శ్రీలంక 10)చైనా 11) మలేషియా 12) జపాన్ 13)కొరియా 14)నేపాల్ 15) అఫ్ఘనిస్తాన్ మన దేశంలో ఎక్కువగా విదేశీ పర్యటకులు అడుగుపెట్టిన ప్రాంతాలు: 1)ఢిల్లీ ఎయిర్ పోర్టు 2)ముంబై ఎయిర్ పోర్టు 3) చెన్నై ఎయిర్ పోర్టు 4)హరిదాస్ పూర్ లాండ్ చెక్ పోస్ట్ 5)బెంగళూరు ఎయిర్ పోర్టు 6) గోవా ఎయిర్ పోర్టు -
ఫారిన్ టూరిస్టులకు ఫ్రీ సిమ్ కార్డులు
భారతదేశంలో పర్యటించేందుకు వచ్చే విదేశీయులకు ప్రభుత్వం ఫ్రీ సిమ్ కార్డులను అందజేయనుంది. ఈ మేరకు పర్యాటక మంత్రిత్వశాఖ త్వరలో చర్యలు తీసుకోనుంది. విదేశీ టూరిస్టులను ఆకర్షించడమే కాకుండా వారికి సెక్యూరిటీని కల్పించడం కూడా ఈ ఆలోచన యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని ప్రభుత్వ అధికారులు వెల్లడిస్తున్నారు. పర్యాటక, హోమ్ , టెలికం, ఆర్థిక మంత్రిత్వ శాఖలు ప్రస్తుతం దీనిపై కసరత్తు మొదలుపెట్టాయి. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ సిమ్ కార్డులను విదేశీ పర్యాటకులకు ఉచితంగా మంజూరు చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం కాగా తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. దీనిపై ఓ ప్రభుత్వ అధికారి మాట్లాడుతూ.. అంతర్జాతీయ పర్యాటకులకు ఇక్కడ లోకల్ సిమ్ కార్డులు దొరకడం కాస్త కష్టమైన విషయమే, వారి సౌకర్యార్థమే కాకుండా భద్రతా కారణాల రీత్యా కూడా ప్రభుత్వం సిమ్ కార్డులను ఉచితంగా మంజూరు చేయాలనుకోవడం ఓ మంచి ఆలోచన అని అన్నారు. ఈ సిమ్ కార్డును ప్రభుత్వం అందజేసే టూరిస్ట్ కిట్‌తో పాటే పర్యాటకులకు అందించనున్నారు. సాధారణంగా టూరిస్ట్ కిట్లలో మ్యాప్‌లు, టూరిజం బుక్ లెట్లు, ఎమర్జెన్సీ నెంబర్లు, గమ్యానికి సంబంధించిన సమాచారం అంతా ఉంటుంది. వీటితోపాటే లోకల్ సిమ్ కార్డును కూడా అందించడం ద్వారా విదేశీయులు మరింత సౌకర్యవంతంగా,నిరంతరాయంగా తమ హాలిడేను కొనసాగించవచ్చని అధికారులు వెల్లడించారు. కాగా విదేశీ పర్యాటకులకు భారత ప్రభుత్వం సులువైన పద్ధతిలో వీసాలను మంజూరును మొదలుపెట్టింది. టూరిస్ట్ వీసా కోసం విదేశీ పర్యాటకులు ఆన్ లైన్లోనే అప్లై చేయవచ్చు. ప్రత్యక్షంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండానే దరఖాస్తు అప్రూవ్ అయిన తర్వాత ప్రభుత్వం పంపించే ఈ-మొయిల్ ప్రింట్ అవుట్ మీద భారత ఇమ్మిగ్రేషన్ అధికారులు వేసే స్టాంపుతో విదేశీయులు ఇండియాలో పర్యటించగలరు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ తరహా 'ఎలక్ట్రానిక్ టూరిస్ట్ వీసా' పద్ధతిని 2015 ఏప్రిల్ లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఇండియా 113 దేశాల పర్యాటకులకు ఈ సౌకర్యం కల్పిస్తుంది. మార్చి 31, 2016 వరకు 150 దేశాలకు ఈ సేవలు విస్తరించాలనే లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ పద్ధతి ప్రవేశపెట్టిన తర్వాత ఇండియాలో పర్యటించే విదేశీయుల సంఖ్య గణనీయంగా పెరిగింది. లెక్కల ప్రకారం యూకే పౌరులు అధికంగా భారతదేశాన్ని సందర్శిస్తుండగా ఆ తరువాతి స్థానాల్లో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. -
గోల్కొండ ఖ్యాతికి ‘మసక’
♦ సౌండ్ అండ్ లైట్ షోలో తరచూ సాంకేతిక సమస్యలు ♦ అర్ధంతరంగా నిలిచిపోతున్న ప్రదర్శనలు ♦ ఉత్సాహంగా వచ్చి ఉసూరుమంటున్న విదేశీ పర్యాటకులు సాక్షి, హైదరాబాద్: విదేశీ పర్యాటకులు ముచ్చటపడి వచ్చారు.. క్యూలో నిలబడి టికెట్ కొని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇంతలో అంతా చీకటి.. ఓ మూలన తళుక్కుమంటూ కాంతి విరజిమ్మింది..! ‘‘రండి.. రండి.. మీకు సాదర స్వాగతం.. ఈ రోజు ప్రపంచ ప్రసిద్ధి గల ఈ గోల్కొండ కథ చెబుతాను.. ఇక్కడి రాళ్లకు జీవమే వస్తే హృదయాన్ని హత్తుకునేలా ఎన్ని కమనీయ కథలు చెప్పేవో.. ’’ అంటూ హిందీ, ఇంగ్లిష్‌లో గంభీరంగా అమితాబ్ బచ్చన్ గొంతు..! అంతే అందరిలో తెలియని పులకింత. మరోపక్క ఎరుపు, నీలం, ఆకుపచ్చ, పసుపు రంగు లైట్ల కాంతి లయబద్ధంగా కదలాడుతుంటే ప్రేక్షకుల్లో తన్మయత్వం! ఇంతలో గర్ర్ర్మంటూ శబ్దం.. ఆ వెంటనే నిలిచిపోయిన మాటలు.. లైట్ల కాంతిలోనూ మసక... షో ఆగిపోయింది. ‘‘సారీ.. సాంకేతిక కారణాలతో ఈ షోను రద్దు చేస్తున్నాం. మీ టికెట్ డబ్బులు వాపసు చేస్తాం తీసుకోండి..’’ అంటూ సిబ్బంది సూచన. విదేశీ పర్యాటకుల్లో తీవ్ర అసంతృప్తి... ఉసూరుమంటూ నిష్ర్కమణ.. గోల్కొండ కోట వద్ద సౌండ్ అండ్ లైట్ షోలో పరిస్థితి ఇదీ! ప్రపంచవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద నిర్వహించే ఈ సౌండ్ అండ్ లైట్ షో అన్నింట్లోకెల్లా గోల్కొండ వద్ద ప్రదర్శించే షో ప్రత్యేకతే వేరు! దీన్ని అనుసరిస్తూ ఇతర ప్రాంతాల్లోనూ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటివరకు గొప్ప ఖ్యాతిని మూటగట్టుకున్న ఈ షో ఇప్పుడు సాంకేతిక లోపాలతో విదేశీ పర్యాటకుల ముందు మన పరువు తీస్తోంది. మధ్యలో నిలిచిపోతున్న షోలు కోట వద్ద ప్రతిరోజూ తొలుత గంటపాటు ఆంగ్లంలో, ఆ తర్వాత గంటపాటు హిందీ/తెలుగు భాషల్లో రెండు విడతలుగా సౌండ్ అండ్ లైట్ షో ప్రదర్శన 23 ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. పాతబడ్డ సౌండ్ అండ్ లైట్ షో వ్యవస్థ మొరాయిస్తోంది. దీంతో మధ్యలోనే ఆపేసి పర్యాటకులకు టికెట్ డబ్బులు తిరిగి చెల్లించి పంపుతున్నారు. పర్యాటకులను ఆకట్టుకుంటున్న ఆ షోను ఎలాగోలా నిర్వహించేందుకు పర్యాటకశాఖ అధికారులు నానా తిప్పలు పడాల్సి వస్తోంది. దీన్ని ఆధునీకరించేందుకు రూ.4 కోట్లతో ప్రతిపాదనలు పంపినా మోక్షం లభించటం లేదు. మరమ్మతు చేసినా మారని పరిస్థితి ఈజిప్టులో ఇలాంటి ప్రదర్శన గురించి 1988లో తెలుసుకున్న అప్పటి సీఎం ఎన్టీఆర్ ఆదేశం మేరకు 1993లో గోల్కొండలో ఈ ప్రదర్శన మొదలైంది. అప్పుడు ఏర్పాటు చేసిన లైట్లు, సౌం డింగ్ వ్యవస్థనే ఇప్పటివరకూ కొనసాగుతోంది. దీంతో అది దెబ్బతినడంతో కొద్దిరోజుల క్రితమే రూ.కోటితో మరమ్మతు చేయించా రు. అయినా తరచూ షో మొరాయిస్తోంది. పాతకాలం నాటి హాలోజన్ లైట్లను మార్చేసి ఎల్ఈడీ లైట్లను ఏర్పాటు చేయాలని, మంచి సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలని పర్యాటక శాఖ అధికారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
విదేశీ ప్రయాణం.. ట్రావెల్ కార్డుతో సులభం..
చైనా తత్వవేత్త లావోఝు చెప్పినట్లు... వేలమైళ్ల ప్రయాణమైనా ప్రారంభ మయ్యేది ఒక అడుగుతోనే. ఇప్పుడు జనం కూడా కొత్త విషయాలు తెలుసుకోవటానికి చాలా దూరం ప్రయాణాలు చేస్తున్నారు. కొందరేమో కొత్త ప్రదేశాలను చూడాలని, మరికొందరేమో బిజినెస్ వ్యవహారాల కోసం... ఇలా ఎన్నో కారణాల మీద ఇపుడు విదేశీ ప్రయాణాలు చేస్తున్నారు. టెక్నాలజీ పుణ ్యమా అని ప్రపంచం కుగ్రామంగా మారిపోయింది. బిజినెస్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు విదేశీ ప్రయాణం సులువైంది. టెక్నాలజీ, ట్రావెల్ అప్లికేషన్స్, సమాచార లభ్యత వంటివి విదేశీ ప్రయాణాన్ని సరళతరం చేశాయి. ఇలా ప్రయాణాన్ని ఈజీ చేసిన వాటిలో ‘ట్రావెల్ కార్డు’లు ముందున్నాయి. ట్రావెల్ కార్డులు అంటే? ట్రావెల్ కార్డు కూడా డెబిట్ కార్డులాంటిదే. మన మొబైల్ నంబర్‌ను ప్రీ-పెయిడ్ కార్డ్స్‌తో ఎలాగైతే రీచార్జ్ చేసుకుంటామో అలాగే ట్రావెల్ కార్డును కూడా మన బ్యాంకు అకౌంట్లోని డబ్బుల ద్వారా వివిధ కరెన్సీలతో నింపుకోవచ్చు. బ్యాంకులు, ఇతర సంస్థలు వీటిని జారీ చేస్తూ ఉంటాయి. ప్రయోజనాలు డబ్బుల్ని (క్యాష్) వెంట తీసుకెళ్లడమంటే రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం.‘ట్రావెల్ కార్డు’ను తీసుకుంటే మనం డబ్బుల్ని వెంట తీసుకెళ్లాల్సిన పని ఉండదు. వీటి వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం వేగంగా, సులభంగా డబ్బుల్ని వినియోగించుకోవచ్చు. ఎక్కడైనా ఖర్చు పెట్టొచ్చు. ఖర్చు చేయకుండా మిగిలిపోయిన డబ్బుల్ని తిరిగి పొందొచ్చు. చేసే ప్రతి ఖర్చు వివరాలను ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఎస్ఎంఎస్ అలర్ట్స్ సర్వీసుల ద్వారా తెలుసుకో వచ్చు. దీంతో ఖర్చులను నియంత్రించుకోవచ్చు. హాలిడే ట్రిప్‌లో మీ కార్డులోని డబ్బులు అయిపోతే మీరు మళ్లీ మీ బ్యాంకు నుంచి డబ్బుల్ని కార్డులోకి బదిలీ చేసుకోవచ్చు. ట్రావెల్ కార్డులను ఏటీఎంలలో పెట్టి నగదు తీసుకోవచ్చు. ఈ కార్డులను స్టాండర్డ్ డెబిట్ ట్రాన్సాక్షన్లకు, ఆన్లైన్, స్టోర్ లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే ఇవి పర్సనల్ ఎయిర్ యాక్సిడెంట్ కవర్‌ను (మరణిస్తేనే) అందిస్తున్నాయి. ప్రయాణంలో వీసా, పాస్‌పోర్ట్ కనిపించకుండా పోతే ఇది మనకు బాసటగా నిలుస్తుంది. మీరు ట్రావెల్ కార్డుపైనే ఎక్కువగా ఆధారపడితే అప్పుడు ఎక్స్ఛేంజ్ రేట్లపై కన్నేసి ఉంచడం మరిచిపోవద్దు. భద్రతపై భయం వద్దు.. ట్రావెల్ కార్డుల భద్రత విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కార్డు ఎక్కడైనా పోతే, దాన్ని వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. అలాగే పోయిన కార్డులో ఉన్న డబ్బుల్ని కొత్త కార్డులోనీ బదిలీ చేసుకోవచ్చు. ప్రస్తుతం ట్రావెల్ కార్డులు చిప్, పిన్ టెక్నాలజీ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లతో వస్తున్నాయి. దీంతో మీరు భద్రత గురించి భయపడాల్సిన పనిలేదు. -
300 డాలర్లతో ప్రపంచాన్ని చుట్టేశాడు..
ప్రయాణాలు చేయాలంటే బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులకు వెళ్లి టిక్కెట్లు కొనుగోలుచేసే కాలం ఎప్పుడో పోయింది. ఆఫర్లు ఇచ్చేందుకు ఆన్లైన్ వ్యాపార సంస్థలు ఒకదాని మించి మరొకటి పోటీపడుతున్నాయి. ఇలాంటి ఆఫర్లను అవసరానికి ఉపయోగించునే వారు కొందరైతే.. అవసరం లేకపోయినా ఆఫర్ల కోసం ప్రయాణించే వారు మరికొందరు. అలాంటి జాబితాకు చెందిన ఒక యువకుడు ఫస్ట్‌క్లాస్ ఫెసిలిటీస్‌తో ప్రముఖ ఎయిర్వేస్కు చెందిన విమానాల్లో ప్రపంచ దేశాలు చుట్టేశాడు. ఎవరతను..? అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి చెందిన పసదేనా నగరానికి చెందిన 26 ఏళ్ల హాంగ్.. లగ్జరీ ఫ్లైట్లలో లక్షల మైళ్లు తిరిగాడు. అందులో గొప్పేముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది మరి మనోడి స్పెషల్. అందరికీ భిన్నంగా అతి తక్కువ ధరల్లో ఫ్లైట్ టికెట్లు సంపాదించి ఫస్ట్ క్లాస్ సదుపాయాలను ఎంజాయ్ చేశాడు. ఎయిర్వేస్ ఇచ్చే ఆఫర్లలో లూప్ హోల్స్ తెలుసుకుని తక్కువ ధరకు లభించే టిక్కెట్లతో లగ్జరీ ప్రయాణాలు చేసేశాడు. ముక్కున వేలేసుకోవాల్సిందే.. సింగపూర్ నుంచి న్యూయార్క్‌కు 60,000 డాలర్ల ఖరీదు ఉండే ఎమిరేట్స్ ఫ్లైట్ మొదటి తరగతి టికెట్‌ను కేవలం 300 డాలర్లకు చేజిక్కించుకున్న మనోడి తెలివితేటలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకోవాల్సిందే. కేవలం సెలబ్రిటీలు, ప్రముఖులకు మాత్రమే కేటాయించే సీట్లలో మూడు వారాల్లో 11 నగరాలు, 7 దేశాలు, 5 ఖండాలను చుట్టేశాడు. తనలాంటి వారికో సలహా.. సుమారు 15 క్రెడిట్ కార్డులు వాడుతున్న హాంగ్.. తనలా ప్రపంచాన్ని చుట్టేయాలనుకునే వారికి చిన్న సలహా ఇస్తున్నాడు. ఒక్కోసారి ఒక్కో కార్డుతో సైన్అప్ చేయాలనీ.. అదీ ఒక్క క్రెడిట్ కార్డుకు కూడా బ్యాలెన్స్ లేకుండా ఎప్పటికప్పుడు బిల్ కట్టేస్తుండాలనీ చెప్తున్నాడు. ఒకవేళ ఏమాత్రం బిల్లు చెల్లించక పోయినా కార్డుతో అనవసర ప్రయోగాలు చేయొద్దని హెచ్చరిస్తున్నాడు. ఎయిర్‌లైన్స్‌లోని కిష్టమైన లొసుగులు తెలుసుకోడానికి ఎంతో ప్రణాళిక, పరిశోధన అవసరమనీ.. సరైన సమాచారాన్ని పొందిన తర్వాత మాత్రమే టికెట్ బుకింగ్ ప్రారంభించాలని అంటున్నాడు. తాను ఎంతో కష్టపడి సేకరించిన సమాచారం సగటు వినియోగదారుడికి ఎంతో లాభిస్తుందని చెప్పాడు. సౌకర్యాలు.. బోర్డింగ్ సమయంలో ఉండే క్యూలు, రద్దీని ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఇమిగ్రేషన్‌తో ఫాస్ట్‌ట్రాక్ సేవలు అందుకున్నాడు. స్లైడింగ్ డోర్లు, మినీబార్లు, పడుకునేటప్పుడు బెడ్‌గా మారే సీట్లు, ఎగ్జిక్యూటివ్ చెఫ్‌లు తయారు చేసే కోరిన భోజనం.. ఇలా అన్నింటినీ తన తెలివితేటలతో సొంతం చేసుకున్నాడు. ఏమిటా కిటుకు..? క్రెడిట్ కార్డు బోనస్‌లు, టికెట్ బు కింగ్‌లో ఉన్న లొసుగులు తెలుసుకుని విమానంలో స్పా, స్నానాలతో సహా.. దేన్నీ వదిలిపెట్టకుండా ఉపయోగించుకున్నాడు. అలెస్కా ఎయిర్‌లైన్‌తో భాగస్వామ్యం ఉన్న బ్యాంక్ ఆఫ్ అమెరికా క్రెడిట్ కార్డు పాయింట్లను ఉపయోగించి ట్రిప్‌ల అదును చూసుకుసి ఫ్రీగా బుక్ చేసేవాడు. -
విదేశీ పర్యటనలను తగ్గించుకోనున్న మోదీ
ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 19 నెలల కాలంలో 33 దేశాల్లో పర్యటించిన నరేంద్ర మోదీ.. కొత్త ఏడాదిలో కాస్త జోరు తగ్గించనున్నారు. ఈ ఏడాదిలో మోదీ విదేశీ పర్యటలను తగ్గించుకోనున్నట్టు పీఎంఓ అధికారులు చెప్పారు. ప్రధాని మోదీ ముఖ్యమైన అంతర్జాతీయ సదస్సులు, పర్యటనలకు మాత్రమే వెళ్లనున్నట్టు సమాచారం. భారత వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే పర్యటనలకు మోదీ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక ఎక్కువగా విదేశీ పర్యటనకు వెళ్తున్న మోదీని ప్రతిపక్షాలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనల వల్ల భారత్ ఏమి సాధించదని ప్రశ్నించాయి. ఇక కాంగ్రెస్ పార్టీ మోదీని ఎఆర్ఐ మోదీగా అభివర్ణించింది. -
పతంగులు.. ముత్యాలు..
సాక్షి, హైదరాబాద్: మకర సంక్రాంతి వేళ ‘గుజరాత్’ కొత్త శోభతో మెరిసిపోతుంది. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, థాయిలాండ్ సహా దాదాపు 45 దేశాల పర్యాటకులు అహ్మదాబాద్‌లో వాలిపోతుంటారు. 3 రోజులు అహ్మదాబాద్ ఆకాశం సప్తవర్ణశోభితంగా వెలిగిపోతుంది. ఆ వేడుకకు గిన్నిస్‌బుక్‌లో చోటు కూడా దక్కింది. అదే అంతర్జాతీయ గాలిపటాల ఉత్సవం. విదేశీ పర్యాటకులను ఎంతో ఆకట్టుకుంటున్న ఆ వేడుకకు ఈసారి మన భాగ్యనగరం కూడా వేదిక కాబోతోంది. నగర శివారులో వంద ఎకరాల సువిశాల స్థలంలో విస్తరించిన ఆగాఖాన్ ట్రస్టు అకాడమీలో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆ ట్రస్టుతో కలసి ఈ అంతర్జాతీయ ఉత్సవాన్ని నిర్వహించాలని యోచిస్తోంది. అంతర్జాతీయంగా పతంగులు ఎగురవేయటంలో దిట్టలుగా పేరున్న ప్రముఖులను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు పర్యాటక అధికారులు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ బ్రాండ్‌తో దీన్ని నిర్వహించటం ద్వారా విదేశీయుల దృష్టి హైదరాబాద్‌పై పడేలా చేయాలనేది ప్రభుత్వ ఆలోచన. ఇలాంటి మరిన్ని వేడుకలు నిర్వహించటం ద్వారా తరచూ హైదరాబాద్/తెలంగాణ పేరు అంతర్జాతీయంగా వినిపించాలనే తాపత్రయంలో ఉంది. త్వరలో ముత్యాల ప్రదర్శన భాగ్యనగరానికి మరో పేరు ముత్యాల నగరం (పెరల్స్ సిటీ). అప్పట్లో ముత్యాలను ప్రపంచం నలుమూలలకు ఎగుమతి చేసిన ఖ్యాతి ఈ నగర సొంతం. చార్మినార్‌కు ఓ పక్కన ఉన్న లాడ్ బజార్ ఇప్పటికీ దానికి గుర్తుగా నిలుస్తోంది. దీన్ని కూడా ఇప్పుడు అంతర్జాతీయ విపణిలో మరోసారి గుర్తు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం అంతర్జాతీయ స్థాయిలో ముత్యాలు, గాజుల ప్రదర్శనను నిర్వహించాలనీ యోచిస్తోంది. దీన్ని కూడా జనవరిలోనే నిర్వహించాలనే ఆలోచనతో ఉంది. మూడు రోజులు జరిగే ఈ ప్రదర్శనకు అలనాటి ప్రముఖ హోటల్ ‘రిట్జ్’ను వేదికగా చేసుకోవాలని ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ ప్రదర్శనకు అనుబంధంగా హైదరాబాద్ వంటకాల ఘుమఘుమలు, ఇక్కడి కళల హొయలనూ సందర్శకుల ముందు నిలపాలని నిర్ణయించింది. ఇందుకోసం గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరిని వేదికగా గుర్తించింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ముత్యాలు, గాజుల ప్రదర్శన.. సాయంత్రం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు అక్కడ ‘రుచులు’, కళల ప్రదర్శన నిర్వహించటం ద్వారా అంతర్జాతీయ పర్యాటకులను ఆకట్టుకోవచ్చని భావిస్తోంది. ‘బతుకమ్మ’లో సాధ్యం కాకపోవటంతో తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి తనకుంటూ ఓ ప్రత్యేకత ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం ఇందుకు బతుకమ్మ వేడుకను వినియోగించుకోవాలని భావించింది. గత బతుకమ్మ ఉత్సవాన్ని అంతర్జాతీయ వేడుకగా నిర్వహించాలని అనుకుంది. ప్రపంచంలో ఉన్న ఏకైక మహిళా పండుగగా దానికి విదేశాల్లో ప్రచారం చేసి విదేశీ పర్యాటకులను ఆకట్టుకోవాలని భావించింది. కానీ సమయం చిక్కకపోవటంతో చేయలేకపోయింది. వచ్చే ఏడాది నిర్వహించే వేడుకల్లో దాన్ని సాధించాలనే పట్టుదలతో ఉంది. -
విదేశీ యువతిపై లైంగిక దాడి
మదనపల్లె: చిత్తూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. విదేశీ యువతిపై ఓ దుర్మార్గుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. జర్మనీకి చెందిన ఇద్దరు యువతులు, ఢిల్లీకి యువతులతో కలసి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో భాగంగా మదనపల్లెకు వచ్చారు. వీరందరు స్థానిక సీటీఎం రోడ్డులోని చైతన్య రెస్టారెంట్లో దిగారు. అదే రెస్టారెంట్లో పనిచేస్తున్న రామాంజనేయులు అనే యువకుడు బుధవారం రాత్రి గది తలుపులు పగులగొట్టి గదిలోనికి చోరబడి జర్మనీకి చెందిన ఓ యువతిపై లైంగిక దాడి చేశాడు. మిగిలిన యువతులనూ లైంగికంగా వేధించాడు. ఈ విషయమై గురువారం ఉదయం టూటౌన్ పోలీస్ స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు నిర్భయ కేసు నమోదుచేసి నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
బిల్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి
హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటికి వర్తింపు * జనవరి 1 నుంచి అమల్లోకి * దేశీయంగా నల్లధనం కట్టడికి కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ (పర్మనెంటు అకౌంటు నంబరు) తప్పనిసరి చేసింది. లగ్జరీయేతర అంశాలకు సంబంధించి నగదు లావాదేవీల విషయంలో రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది. మరోవైపు పాన్ తప్పనిసరిగా పేర్కొనాల్సిన స్థిరాస్తి క్రయ, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇది అందుబాటు ధరలోని గృహాలు కొనుగోలు చేసే వారికి ఊరటనివ్వనుంది. గతంలో రూ. 5 లక్షల విలువ చేసే స్థిరాస్తుల క్రయ,విక్రయాలకు కూడా పాన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావించింది. తాజా నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. బ్లాక్‌మనీ చలామణి ఎక్కువగా జరిగే ఆభరణాలు.. బులియన్ కొనుగోళ్ల లావాదేవీ విలువ రూ. 2 లక్షలు మించితే పాన్ పేర్కొనక తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 5 లక్షలకు మించి ఉంది. మరోవైపు, రూ. 2 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలకు పాన్ నంబరును పేర్కొన డం తప్పనిసరిగా చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. 2015-16 బడ్జెట్ ప్రసంగంలో రూ. 1 లక్ష పైగా విలువ చేసే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించినా జైట్లీ తాజాగా ఆ పరిమితిని పెంచారు. బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపుల దాకా .. క్యాష్ కార్డులు లేదా ప్రీపెయిడ్ సాధనాల కొనుగోలుకు రూ. 50,000కు మించి నగదు చెల్లింపులు జరిపినా లేదా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల కొనుగోలుకు రూ. 1లక్షకు పైగా చెల్లించినా పాన్ తప్పనిసరి కానుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మినహా ఇతరత్రా బ్యాంకు ఖాతాలేవీ తెరవాలన్నా పాన్ తప్పదని అధియా వివరించారు. విలాసవంతమైన ఖర్చులు అయినందున.. హోటల్, విదేశీ పర్యటన బిల్లులను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు అధియా పేర్కొన్నారు. రూ. 2 లక్షలు మించిన మిగతా అన్ని నగదు లావాదేవీలకూ పాన్ నంబరు తప్పనిసరన్నారు. ఇది తాత్కాలికమేనని, అంతిమంగా ఈ పరిమితిని రూ. 1 లక్షకు తగ్గించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. కొన్నింట ఊరట.. సిసలైన లావాదేవీలకు నిబంధనల చిక్కులు తొలగించేందుకు, అదే సమయంలో భారీ లావాదేవీల వివరాలను సరిగ్గా రాబట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకున్నట్లు అధియా చెప్పారు. ఇందులో భాగంగానే స్థిరాస్తి కొనుగోలు, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. హోటల్, రెస్టారెంటు బిల్లుల పరిమితిని రూ. 25,000 నుంచి రూ. 50,000కు పెంచినట్లు పేర్కొన్నారు. ఇక, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల క్రయ,విక్రయాల విలువనూ రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచినట్లు వివరించారు. బేసిక్ ల్యాండ్‌లైన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకునే విషయంలో పాన్ నిబంధనను సడలించినట్లు అధియా తెలిపారు. రూ. 50,000కు మించిన నగదు డిపాజిట్లు లేదా ఒకే రోజున అంత మొత్తం విలువ చేసే బ్యాంక్ డ్రాఫ్ట్/పే ఆర్డర్లు/ బ్యాంకర్స్ చెక్ మొదలైనవి తీసుకున్నా, రూ. 50,000 జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్ తప్పనిసరి నిబంధన యథాప్రకారంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. బ్లాక్‌మనీపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .. రూ. 1 లక్ష పైగా విలువ చేసే అన్ని రకాల వస్తువులు, సర్వీసుల క్రయ,విక్రయాలకు పాన్ నంబరు తప్పనిసరి చేయాలంటూ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. -
ఏ టు జెడ్‌లో పీఎం ఎక్కడ?
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరుస విదేశీ పర్యటనలపై ఎన్నెన్నో కుళ్లు జోకులు ఇంటర్నెట్లో హల్ చల్ చేస్తుండటం తెలిసిందే. నిన్నటికి నిన్న 'మీరు విదేశాల్లో తిరగండి.. నేను రైతుల పొలాల్లో తిరుగుతా' అని కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ.. మోదీని ఉద్దేశించి సీరియస్ కామెంట్లు కూడా చేశారు. ఇప్పుడదే అంశంపై ఆ పార్టీ జాతీయ కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ చిన్నపాటి ట్వీట్ వదిలారు. అందులో ఓ టీచర్, విద్యార్థిల మధ్య సంవాదం ఇలా సాగుతుంది.. విద్యార్థిని ఉద్దేశించి టీచర్: ఒకసారి ఏబీసీడీలు గట్టిగా చదివి వినిపించు.. విద్యార్థి: ఏ బీ సీ డీ ఈ ఎఫ్ జీ హెచ్ ఐ జే కే ఎల్ ఎన్ ఓ క్యూ ఆర్ ఎస్ టీ యూ.. టీచర్: అదేంట్రా.. మధ్యలో పీ, ఎం ఎగరగొట్టావేం? విద్యార్థి: అదేంటి టీచర్ మన పీఎం ఫారిన్ లో కదా ఉన్నారు! Teacher - ABCD sunao Student ~ A B C D E F G H I J K L N O Q R S T U V W X Y Z ! Teacher ~ P M kaha gaya? Student ~ Foreign Tour!! - Sunil — digvijaya singh (@digvijaya_28) November 24, 2015 -
సంస్కరణల బాటలోనే..
అధిక వృద్ధిరేటే లక్ష్యం... - విదేశీ ఇన్వెస్టర్లకు ఆర్థికమంత్రి జైట్లీ ఆహ్వానం - వ్యాపారాలకు మరింత సానుకూల పరిస్థితులు కల్పిస్తామని హామీ హాంకాంగ్: భారత్‌కు పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా సింగపూర్‌లో పర్యటించిన ఆర్థికమంత్రి తన నాలుగు రోజుల విదేశీ పర్యటనలో భాగంగా చివరిరోజు హాంకాంగ్ చేరుకున్నారు. హాంకాంగ్‌లో సైతం ఆయన ఇన్వెస్టర్ల పెట్టుబడులే లక్ష్యంగా పనిచేశారు. ఈ దిశలో ఆయన ఏపీఐసీ-ఇండియా క్యాపిటల్ మార్కెట్స్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల సదస్సును వినియోగించుకున్నారు. అధిక వృద్ధే లక్ష్యంగా భారత్‌లో సంస్కరణల ప్రక్రియ కొనసాగుతుందన్నారు. వ్యాపారాలకు తగిన పరిస్థితులను కల్పించడానికి వీలయిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆరు నెలల్లో ఆర్బిట్రేషన్ విధానంలో వివాదాల పరిష్కారానికి కొత్త చట్టాన్ని తీసుకురావడంసహా ప్రభుత్వం తీసుకుంటున్న పలు చర్యలను ఆయన ప్రస్తావించారు. అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు వీస్తున్నా గత ఆర్థిక సంవత్సరం సాధించిన 7.3 శాతం వృద్ధి కన్నా అధికాభివృద్ధిని సాధిస్తామన్న ధీమానూ వ్యక్తం చేశారు. ఆయన ప్రసంగాన్ని క్లుప్తంగా చూస్తే... - అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో.. భారత్ మాత్రం పెట్టుబడులకు, చక్కటి వృద్ధికి వేదికగా ఉంది. ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు వంటి పలు స్థూల ఆర్థిక పునాదులు బలంగా ఉన్నాయి. - మౌలిక, తయారీ తదితర రంగాల్లో పెట్టుబడులకు మంచి అవకాశాలు ఉన్నాయి. - మా ఎగుమతులుసహా పలు అంశాల్లో అంతర్జాతీయంగా ప్రతికూల పవనాలు ఉన్నా.. గత ఏడాదికన్నా మెరుగైన ఆర్థిక అభివృద్ధి సాధన సత్తా ఉంది. - దేశంలో పన్నుల విధానాన్ని సరళీకరిస్తాం. అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా రూపొందించే కసరత్తు జరుగుతోం ది. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచీ వస్తువులు, సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వస్తుందన్న విశ్వాసంతో ఉన్నాం. - వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు అతి తక్కువగా ఉంది. ఇది ఒక సవాలే. మా దేశంలో దాదాపు 55 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల ఇబ్బంది ఉంది. ఈ పరిస్థితుల్లో వృద్ధి స్వల్ప స్థాయిల్లోనే ఉంటోంది. స్థూల దేశీయోత్పత్తిలో వ్యవసాయ రంగం వాటా దాదాపు 15 శాతంగా ఉంది. వ్యవసాయ రంగం మెరుగైన ఫలితాలు ఇస్తే వృద్ధి బాగుంటుంది. - ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ద్వారా రూ.69,000 కోట్ల సమీకరణ జరుగుతుందన్న విశ్వాసం ఉంది. ఈ దిశలో ప్రభుత్వం తగిన అన్ని చర్యలూ తీసుకుంటోంది. గత రెండు నెలల్లో మేము ఈ విషయంలో కొంత ముందడుగు వేసినా.. మార్కెట్ ఒడిదుడుకులు ఇబ్బందులు పెడుతున్నాయి. వడ్డీరేట్లు తగ్గాలని కోరిక... జైట్లీ ఈ సందర్భంగా దేశంలో అధిక వడ్డీరేట్ల అంశాన్నీ పరోక్షంగా ప్రస్తావించారు. దేశీయ ప్రైవేటు రంగం పెట్టుబడులు నెమ్మదిగా ఉన్నాయని అన్నారు. పెట్టుబడులకు సంబంధించి అధిక వ్యయభారం పలు రంగాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోందని ఆయన పేర్కొన్నారు. -
ఆ యువకులు రాత్రికి రాత్రే హీరోలు అయ్యారు
-
బాబు మాదిరి విహారానికి వెళ్లలేదు..
- కేసీఆర్ దేశం కోసం చైనా వెళ్లారు - ఏపీ సీఎం బాబుకు మంత్రి హరీశ్‌రావు చురకలు రామాయంపేట : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మాదిరిగా కుటుంబ సభ్యులతో కాకుండా, దేశ ప్రతిష్ట ఇనుమడింప చేయడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఆయన శనివారంరాత్రి రామాయంపేట వచ్చిన సందర్భంగా డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డితో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఏ హోదాతో బాబు కుమారుడు లోకేశ్ పరిశ్రమల శాఖ కార్యదర్శితో కలిసి అమెరికా వెళ్లారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ పారిశ్రామిక విధానానికి అంతర్జాతీయ స్థాయిలో ప్రశంసలు వస్తుండటంతో ఓర్వలేక కొందరు తెలంగాణ టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. బాబు ప్రత్యేక విమానంలోరూ.20 కోట్ల ప్రజాధనంతో కనీసం 65 సార్లు విదేశీ పర్యటనకు వెళ్లారని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఎప్పటికైనా విడవాల్సిన హైదరాబాద్‌లో సచివాలయం మరమ్మతులకు బాబు రూ.45 కోట్లు ఖర్చు పెట్టాడని ఎద్దేవా చేశారు. బాబు అధికార దాహంతో హైదరాబాద్, విజయవాడ, తిరుపతి, ఢిల్లీలో రూ. కోట్ల ఖర్చుతో అధికారిక కాన్వాయ్‌లను ఏర్పాటు చేసుకున్నారని ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్‌కు చైనాలో జరుగుతున్న ఎకనమిక్ ఫోరం సదస్సుకు రావాలని ఆహ్వానం అందడం గర్వకారణమన్నారు. -
ఎగురుతున్న తెలంగాణ !
-
ప్రభుత్వాన్ని కూలుస్తారని కేసీఆర్‌కు భయం: పొన్నం
కరీంనగర్ సిటీ: విదేశీ పర్యటనకు వెళ్లి తిరిగొచ్చే సరికి అల్లుడో, కొడుకో, కూతురో ప్రభుత్వాన్ని కూలుస్తారనే భయంతోనే సీఎం కేసీఆర్ తన వెంట సభాపతులను తీసుకెళ్లాడని కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఎద్దేవా చేశారు. మంగళవారం కరీంనగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్టీఆర్ తరహాలో ఏదైనా కీడు జరుగుతుందనే భయంతోనే అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లను చైనా పర్యటనకు వెంట తీసుకెళ్లారన్నారు. ప్రస్తుతం చైనాలో ఆర్థిక వ్యవస్థ కుంటుపడిందని, షేర్‌మార్కెట్ కుప్పకూలుతోందని, ఈ పరిస్థితుల్లో పెట్టుబడులు తీసుకొస్తామంటూ వెళ్లడం అవివేకమన్నారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలను పట్టించుకోకుండా చైనాకు వెళ్లడం నీరో చక్రవర్తి తీరును తలపిస్తోందన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేను కొడితే విదేశీయానం గిఫ్ట్‌గా ఇస్తామని చెప్పేందుకే ఎమ్మెల్యే గువ్వల బాలరాజును కేసీఆర్ వెంట తీసుకెళ్లారని ఆరోపించారు. సీఎం పర్యటనలను తప్పు పట్టడం లేదని, కానీ ఇప్పుడు చైనాకు వె ళ్లిన సందర్భం సరైంది కాదన్నారు. -
రైతు సమస్యలు విస్మరించి విదేశీ పర్యటనలా..!
రైతాంగ సమస్యలు పరిష్క రించాలని జిల్లా కాంగ్రెస్ పార్టీ.. సోమవారం కలెక్టరేట్ ఎదుట భారీ ఎత్తున ధర్నా నిర్వహిం చింది. ఈ సందర్భంగా కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల తీరును ఎండగట్టింది. రైతు సమస్యలు విస్మరించి విదేశీ పర్యటనలు చేస్తున్నారని మండిపడింది. - జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి - ఆత్మహత్యలకు పాల్పడిన రైతు కుటుంబాలను ఆదుకోవాలి - మాజీ మంత్రి డీసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి - కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నేతల ధర్నా - సొంత పూచీకత్తుపై అరెస్టు, విడుదల సంగారెడ్డి మున్సిపాలిటీ : రైతు సమస్యలను విస్మరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధినేతలు విదేశీ పర్యటనలు చేస్తున్నారని డిసీసీ అధ్యక్షురాలు సునీతారెడ్డి ఆరోపించారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టర్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను విస్మరించి రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందన్నారు. ఎన్నికల్లో రైతుల రుణాలు మాఫీ చేస్తామనిని చెప్పి, ఇప్పుడు వడ్డీ కట్టాలని లేని పక్షంలో కేసులు నమోదు చేస్తామనడం ఎంత వరకు సమంజసమన్నారు. రాష్ట్రంలో అత్యధికంగా సీఎం నియోజకవర్గంలోని గజ్వేల్ ప్రాంతంలోని రైతులే ఆత్మహత్యలు చేసుకుంటుంటే ప్రభుత్వం ఇంత వరకు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని పరామర్శించలేదన్నారు. తమకు ఓట్లు వేసినా వేయకపోయినా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటూ వారి సమస్యలపై పోరాటం చేస్తుందన్నారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం సైతం ఎన్నికల హామీలను విస్మరించిందన్నారు. మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని వర్షాభావ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కరువు ప్రాంతంగా ప్రకటించాలని, రైతులకు రుణాలు మాఫీ చేసి కొత్త రుణాలు అందజేయాలని డిమాండ్ చేశారు. ఆత్మహత్యలుకు పాల్పడిన రైతు కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అంతకు ముందు ఐబీ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ధర్నాలో ఎమ్మెల్సీ ఫారుక్ హుస్సేన్, శశిధర్‌రెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్, బండి నర్సాగౌడ్, బొంగుల రవి, రామక్రిష్ణారెడ్డి పాల్గొన్నారు. నాయకుల అరెస్టు విడుదల .. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఎదుట నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి సునీతారెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, శశిధర్ రెడ్డి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్తో పాటు మరో 50 మంది నాయకులను పోలీసులు అరెస్టు చేసి రూరల్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. -
ప్రధాని బసకు ఐదు కోట్లు.. అద్దె కార్లకు రెండు కోట్లు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోదీ విదేశీయానం ఖర్చు ఎంతో తెలుసా..! అక్షరాల రూ.37కోట్లు. ఇందులో అగ్రభాగం వ్యయం ఆస్ట్రేలియా పర్యటనకు అయింది. ఈ విషయం ఓ సమాచార హక్కు ఉద్యమకారుడు ద్వారా తెలిసింది. 2014 జూన్ నుంచి ఈ ఏడాది జూన్ మధ్య కాలంలో ప్రధాని నరేంద్రమోదీ చేసిన విదేశీ పర్యటన మొత్తం వ్యయం ఎంత అని ప్రశ్నిస్తూ ఆర్టీఐ ద్వారా ఓ వ్యక్తి దరఖాస్తు చేసుకోగా దాని వివరాలు తెలిసింది. ఏడాదికాలంలో మోదీ మొత్తం 20 దేశాల్లో పర్యటించారని వీటికోసం మొత్తం రూ.37.22కోట్లు ఖర్చయ్యాయని పేర్కొంది. వీటిలో అత్యధిక వ్యయం ఆస్ట్రేలియా, యూఎస్, జర్మనీ, ఫిజీ, చైనా దేశాలకు కాగా భూటాన్ పర్యటనకు మాత్రం రూ.41.33 లక్షలు అతి తక్కువగా ఖర్చయ్యాయని వివరించారు. వీటిల్లో హోటల్లలో బస ఖర్చు రూ.5.60 కోట్లు అని, అద్దె కార్లకు రూ.2.40 కోట్లు అని ఆర్టీఐ ద్వారా వెల్లడైంది.