
శుక్రవారం గాంధీభవన్‌లో అమర జవాన్లకు నివాళిగా మౌనదీక్షలో ఉత్తమ్, మల్లు రవి తదితరులు
సాక్షి, హైదరాబాద్: దేశ ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జరిపిన విదేశీ పర్యటనల వల్ల దేశ ప్రజలకు ఏం ఒరిగిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్ర శ్నించారు. సరిహద్దుల్లో ఉన్న మిత్ర దేశాలు శత్రువులుగా మారడం తప్ప మోదీ పాలనలో సాధిం చిందేమీ లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు శుక్రవారం గాంధీభవన్‌లో జరిగిన ‘అమరవీరులకు కాంగ్రెస్ సలాం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఇటీవల చైనా సరిహ ద్దులో అసువులు బాసిన వీర జవాన్లకు ఇతర కాంగ్రెస్ నేతలతో కలసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. విదేశాంగ విధానాలను అమలు చేయడంలో మోదీ నేతృ త్వంలోని బీజేపీ ప్రభుత్వం వైఫల్యం చెందిందని విమర్శించారు.
అసలు కేంద్రానికి స్పష్టమైన వైఖరి లేకుండా పోవడం దురదృష్టకరమన్నారు. కా ర్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొ న్నం ప్రభాకర్, ఉపాధ్యక్షుడు మల్లు రవి, హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, యువజన కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా ‘అమరవీరులకు కాంగ్రెస్ స లాం’ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహం గా పాల్గొన్నాయి. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జెట్టి కుసుమకుమార్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, టీపీసీసీ నేతలు, డీసీసీ అధ్యక్షులు తమ తమ ని వాసాలు, వారి ప్రాంతాల్లో మౌనదీక్షలో పాల్గొని అమర జవాన్లకు నివాళి అర్పించారు. కాగా హైదరాబాద్‌లోని తన నివాసంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన కుమార్తె జయారెడ్డితో కలసి దీక్ష చేశారు.
Comments
Please login to add a commentAdd a comment