![Mumbai Police receives Call Over PM Modi Aircraft](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/PM-MOdi.jpg.webp?itok=uK8nzqeR)
ముంబై: భారత ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటన నేపథ్యంలో ఉగ్ర బెదిరింపు కాల్ రావడం తీవ్ర కలకలం సృష్టించింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై పోలీసులకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో, రంగంలోకి దిగిన భద్రతా బలగాలు.. ఫోన్ చేసిన వ్యక్తిని తాజాగా అదుపులోకి తీసుకున్నారు. ఇదంతా ఫేక్ అని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ విదేశీ పర్యటన సందర్భంగా బెదిరింపు కాల్ రావడం అధికారులను ఆందోళనకు గురిచేసింది. గుర్తు తెలియని వ్యక్తి ముంబై కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధాని మోదీ ప్రయాణిస్తున్న విమానాన్ని లక్ష్యంగా చేసుకుంటామని వారు బెదిరించినట్టు చెప్పుకొచ్చారు. దీంతో, పోలీసు ఉన్నతాధికారులు వెంటనే ఈ సమాచారాన్ని భద్రత అధికారులకు చేరవేశారు. దీంతో, అలర్ట్ అయ్యారు. అనంతరం, ఫోన్ కాల్ చేసిన వ్యక్తని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు పేర్కొన్నారు. ఈ క్రమంలో అతడి మానసిక స్థితి సరిగాలేదని నిర్ధారించారు. ఇక, ఫోన్ కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు.
ఇదిలా ఉండగా.. భారత ప్రధాని మోదీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన ఫ్రాన్స్, అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇప్పటికే మోదీ.. ఫ్రాన్స్‌లో పర్యటించి ఏఐపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక, అమెరికాలో పర్యటనలో భాగంగా మోదీ నేడు వాషింగ్టన్ చేరుకోనున్నారు. రేపు(గురువారం) అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో మోదీ భేటీ కానున్నారు.
On 11th February, a call was received at Mumbai Police Control Room warning that terrorists may attack PM Modi's aircraft as he was leaving on an official visit abroad. Considering the serious nature of the information, the Police informed other agencies and began an…
— ANI (@ANI) February 12, 2025
Comments
Please login to add a commentAdd a comment