న్యూఢిల్లీ: ఈ ఏడాది ప్రధాని మోదీ మొట్టమొదటి విదేశీ పర్యటన ఖరారైంది. ఈనెల 2 నుంచి 4వ తేదీ వరకు ప్రధాని జర్మనీ, ఫ్రాన్సు, డెన్మార్క్‌లను సందర్శించనున్నారని శనివారం ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో యూరప్ దేశాలు రష్యాకు వ్యతిరేకంగా ఏకమైన నేపథ్యంలో జరుగుతున్న ప్రధాని పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. ఏడు దేశాలకు చెందిన 8 మంది నేతలతో ద్వైపాక్షిక, బహుళపాక్షిక చర్చలు జరుపుతారు. మొదటగా జర్మనీకి, తర్వాత డెన్మార్క్‌కు వెళ్లనున్న ప్రధాని తిరుగు ప్రయాణంలో పారిస్‌లో కొద్దిసేపు ఆగి, అధ్యక్షుడు మాక్రాన్‌తో భేటీ అవుతారు.
Comments
Please login to add a commentAdd a comment