న్యూఢిల్లీ: యూరప్ దేశాల పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు.
మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ అవుతారు. ఆపై ఆరవ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో పాల్గొంటారు. ఐజీసీ ప్రతి రెండేళ్లకొకసారి ఇరు దేశాల మధ్య జరుగుతుంటుంది. రెండు దేశాలకు చెందిన టాప్ సీఈవోలు.. వీరిరువురితో ఇంటెరాక్ట్ అవుతారు.
ఇక తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌లో, బుధవారం ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఈమధ్యే కొత్తగా ఫ్రాన్స్‌కు తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌కు పీఎం మోదీ శుభాకాంక్షలు తెలియజేసి.. భేటీ అవ్వనున్నారు.
PM Modi gets a warm welcome from the Indian diaspora in Berlin
— ANI (@ANI) May 2, 2022
He will hold his first in-person meeting with the newly appointed German Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations today pic.twitter.com/cs1c6GGMGZ
Comments
Please login to add a commentAdd a comment