Olaf Scholz
-
జీ-7: జర్మన్ ఛాన్సలర్ పుట్టినరోజు.. బర్త్ డే సాంగ్‌తో శుభాకాంక్షలు
ఇటలీలోని అపులియాలో నిర్వహిస్తున్న మూడు రోజుల జీ-7 దేశాల సమ్మిట్‌లో తొలి రోజు దేశాధినేతల రాక.. వరుస సమావేశాలతో బిజీబిజీగా గడిచింది. జీ-దేశాల సమ్మిట్ భారత్ తరఫున ప్రధానమంత్రి మోదీ హాజరయ్యారు. మోదీ సైతం పలు దేశాధినేతలతో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అయితే తోలి రోజు సమావేశాల్లో భాగంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.యురోపియన్ కమిషన్ ప్రెజిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయన్, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లడాకుంటున్నారు. అంతలోనే లేయన్ అక్కడే ఉన్న జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ బర్త్ డే ఈరోజు అని జోబైడెన్‌తో చెప్పారు. దీంతో ఆయన స్పందిస్తూ.. అయితే ఆయన కోసం మీరు బర్త్ డే సాంగ్ పాడారా? అని అడిగారు.#G7 Italia 2024: #Biden, #Meloni and other world leaders sing happy birthday song for German Chancellor Catch the day's latest news here ➠ https://t.co/mTNeb6ks1i 🗞️ pic.twitter.com/qYordDWk95— Economic Times (@EconomicTimes) June 14, 2024 బైడెన్ ఫ్యామిలీలో అయితే పుట్టినరోజు వేళ బర్త్ డే సాంగ్ పడుతామని అన్నారు. వెంటనే బైడెన్ బర్త్‌డే సాంగ్ మొదలుపెట్టగా అక్కడికి వచ్చిన దేశాధినేతలు అయనతో పాడుతూ.. ఓలాఫ్ స్కోల్జ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. తనకు బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన దేశాధినేతలకు ఓలాఫ్ స్కోల్జ్ కృతజ్ఞతలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్, కెనడా ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఈ వీడియో కనిపిస్తారు.ఓలాఫ్ స్కోల్జ్ 2021 డిసెంబర్ నుంచి జర్మనీ ఛాన్సలర్‌గా పని చేస్తున్నారు. ఆయన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ జర్మనీ (SPD)సభ్యుడు. ఛాన్సలర్ కావడానికి ముందు.. స్కోల్జ్ 2018 నుంచి 2021 వరకు మాజీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సంకీర్ణ ప్రభుత్వంలో వైస్ ఛాన్సలర్, ఆర్థిక మంత్రిగా పని చేశారు. -
G20 Summit: బిజీబిజీగా ద్వైపాక్షిక భేటీలు
న్యూఢిల్లీ: జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా విచ్చేసిన సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ విడివిడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చల్లో బిజీగా కనిపించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్, జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ ఇయోల్, తుర్కియే అధ్యక్షుడు రిసెప్ తయ్యిప్ ఎర్డోగన్, నెదర్లాండ్స్ ప్రధాని మార్క్ రెటే, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డ సిల్వా, యురోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వోండెర్ లెయిన్, నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ తినుబు, ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ అసౌమనీ తదితరుల నాయకులతో మోదీ వేర్వేరుగా చర్చలు జరిపారు. ► ‘మధ్యాహ్నం భోజనం వేళ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మేక్రాన్‌తో జరిపిన విస్తృత స్థాయి ద్వైపాక్షిక చర్చలు ఫలవంతమయ్యాయి. ఇండియా–ఫ్రాన్స్ బంధం నూతన సమున్నత శిఖరాలకు చేరేందుకు ఇరువురం కృషిచేస్తాం’ అని మోదీ ట్వీట్‌చేశారు. ► జీ20 సారథ్య బాధ్యతలను విజయవంతంగా నిర్వహించినందుకు నేతలంతా మోదీని అభినందించారు. ఇంటర్‌గవర్నమెంటల్ కమిషన్ మరో దఫా చర్చల కోసం వచ్చే ఏడాది భారత్‌కు విచ్చేయాల్సిందిగా జర్మనీ చాన్స్‌లర్ ఓలాఫ్ స్కోల్జ్‌ను మోదీ ఆహా్వనించారు. ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన ఓలాఫ్‌కు ఇది రెండో అధికారిక పర్యటన. రక్షణ, హరిత, సుస్థిరాభివృద్ధి, అరుదైన ఖనిజాలు, నైపుణ్యమైన సిబ్బంది, విద్య తదితర రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయడంపై స్కోల్జ్‌తో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ► శుద్ధ ఇంధనం, సెమీ కండక్టర్లు, డిజిటల్ సాంకేతికత తదితరాలపై నెదర్లాండ్స్ ప్రధానితో మోదీ చర్చించారు. ► వాణిజ్యం, పెట్టుబడులు, వ్యవసాయం, చిరుధాన్యాలు, ఆర్థిక సాంకేతికతలపై నైజీరియా అధ్యక్షుడు తినుబుతో మోదీ చర్చలు జరిపారు. ► జీ20లో శాశ్వత సభ్యత్వానికి కృషిచేసినందుకు ఆఫ్రికా యూనియన్ అధ్యక్షుడు అజలీ మోదీకి కృతజ్ఞతలు చెప్పారు. ► వాణిజ్యం, సాంస్కృతిక, ప్రత్యేక వ్యూహాత్మక భాగస్వామ్యం, ఈవీ బ్యాటరీ సాంకేతికతల పరిపుష్టికి మరింతగా కృషిచేయాలని నిర్ణయించామని ద.కొరియా నేత ఇయోల్‌తో భేటీ తర్వాత ప్రధాని మోదీ వెల్లడించారు. ► డిసెంబర్ ఒకటో తేదీ నుంచి బ్రెజిల్ సారథ్యంలో జీ20 మరిన్ని విజయాలు సాధించాలని ఆ దేశ అధ్యక్షుడు డ సిల్వాతో మోదీ వ్యాఖ్యానించారు. ► వాణిజ్యం, సాంకేతికత, అనుసంధానం వంటి కీలకాంశాల్లో యూరప్‌తో భారత్ బంధం మరింత పటిష్టానికి సంబంధించి యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులాతో, ఐరోపా మండలి అధ్యక్షుడు చార్లెస్ మైఖేల్‌తో మోదీ విడిగా చర్చలు కొనసాగించారు. భారత్ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి: ఎర్డోగన్ దక్షిణాసియాలో భారత్ తమకు అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అని తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగన్ పేర్కొన్నారు. భారత్–తుర్కియే పరస్పర సహకారం అవిచి్ఛన్నంగా కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఆదివారం జీ20 సదస్సు ముగిశాక ఎర్డోగన్ మీడియాతో మాట్లాడారు. ఆదివారం భారత ప్రధాని మోదీతో సమావేశమయ్యాయని, ఇరు దేశాలకు సంబంధించిన ఉమ్మడి అంశాలపై చర్చించామని తెలిపారు. జీ20లో ఆఫ్రియన్ యూనియన్ భాగస్వామిగా మారడాన్ని ఎర్డోగాన్ స్వాగతించారు. -
కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జర్మనీ ఛాన్సలర్.. ఎందుకంటే!
G20 Summit In India: భారత్ అధ్యక్షతన తొలిసారి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌కు.. భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ప్రధాని మోదీ కరచలనం చేసి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కోల్జ్.. తన కంటికి ఐప్యాచ్ ధరించి ఉన్నారు. సాధారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్‌ను స్కల్జ్ తన కంటికి ధరించారు. అయితే దీనిపై జర్మనీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్సలర్ గత శనివారం జాగింగ్ చేస్తుండగా స్వల్ప గాయాలైనట్లు అతని ప్రతినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు. దీని వల్ల ఆయన కుడి కన్ను దెబ్బతిందని, మరి కొన్ని రోజులు కంటికి ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని చెప్పారు. జర్మనీ ఛాన్సలర్‌కు ఎన్నో ఏళ్లుగా ప్రతి రోజూ జాగింగ్ చేసే అలవాటు ఛాన్సలర్ స్కల్జ్‌కు ఉన్నట్లు తెలిపారు. చదవండి: G20 Summit: కీలక ఒప్పందాలపై అగ్రనేతల చర్చలు #WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO — ANI (@ANI) September 9, 2023 అంతేగాక నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్ 4న జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ సైతం ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) తనక కంటికి గాయమైన ఫోటోను షేర్ చేవారు. ఇందులో అతడి కుడి కన్నుపై పెద్ద నల్లటి పాచ్ ధరించి ఉన్నారు. కంటి చుట్టూ ఎర్రగా దెబ్బ తగిలిన గుర్తులుకూడా కనిపిస్తున్నాయి. -
సతత హరిత వ్యూహాత్మకం
ఢిల్లీలోని చాణక్యపురిలో రోడ్డుపై దుకాణంలో తేనీరు సేవించిన జర్మనీ అధినేత! ఇది, ప్రధాని మోదీతో కలసి సంయుక్త మీడియా ప్రకటన మినహా జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల భారత అధికారిక పర్యటనపై హడావిడి వార్తలు, ప్రకటనలు మీడియాలో కనిపించి ఉండకపోవచ్చు. అంతమాత్రాన షోల్జ్ భారత పర్యటన అప్రధానమనుకుంటే పొరపాటే. రాష్ట్రపతిని కలసి సంభాషించడం, ప్రధానిని కలసి చర్చించడం, ఔత్సాహిక వ్యాపారవేత్తలతో గోష్ఠి జరపడం – ఇలా ఫిబ్రవరి 25, 26ల్లో షోల్జ్ సుడిగాలిలా చుట్టేశారు. ఇప్పటికే జపాన్, చైనా, ఆసియాన్ దేశాల్లో పర్యటించిన ఆయన తమ దేశ ఇండో–పసిఫిక్ విధానంలో భాగంగా భారత్‌తో బంధం దృఢమైనదని తేల్చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఏడాది నిండిన వేళ ఈ పర్యటన వ్యూహాత్మకంగా కీలకమనేది అందుకే. పదహారేళ్ళ సుదీర్ఘ ఏంజెలా మెర్కెల్ పాలన తర్వాత 2021 డిసెంబర్లో జర్మనీ ప్రభుత్వాధినేత అయిన షోల్జ్ ఆ పైన మన దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆ మాటకొస్తే, 2011 తర్వాత ఒక జర్మన్ నేత భారత్‌లో ప్రత్యేకంగా పర్యటించడం కూడా ఇదే ప్రథమం. అలా ఈ తాజా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. జర్మన్ అధినేత వెంట వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందంలో సీమెన్స్, శాప్ సంస్థలు ఉన్నాయి. ఐటీ, టెలికామ్ సహా కీలక రంగాల్లో భారత సంస్థలతో ఒప్పందాలు చేసు కున్నాయి. స్వచ్ఛ ఇంధనం, వాణిజ్యం, నవీన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠతే లక్ష్యంగా ప్రధాని మోదీతో షోల్జ్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా, యూరప్ తన సరఫరా వ్యవస్థలను చక్కదిద్దుతున్న వేళ షోల్జ్ చర్చలు కీలకమయ్యాయి. సహజంగానే ఉక్రెయిన్ వ్యవహారం అజెండాలో ముందుంది. అయితే, రష్యా వ్యతిరేక వైఖరి తీసుకొనేలా ఒత్తిడి తెచ్చే కన్నా... అందరికీ కావాల్సిన మనిషిగా, మధ్యవర్తిత్వం నెరిపే వీలున్న దేశంగా భారత్‌తో జర్మనీ జత కడుతోంది. జీ20 సారథిగా భారత్ ఈ యుద్ధానికి త్వరగా తెరపడేలా చేసి, ఆర్థిక పునరుజ్జీవనం జరిపించాలని భావిస్తోంది. అందుకీ పర్యటనను సాధనంగా ఎంచుకుంది. రష్యా రక్షణ ఉత్పత్తుల సరఫరాలపై భారత్ ఆధారపడినందున జలాంతర్గాముల సంయుక్త తయారీ లాంటి అంశాల్లో భారత్‌తో చేయి కలుపుతూ, సరఫరా వ్యవస్థల్లో మార్పుకు చూస్తోంది. ఈ భౌగోళిక – రాజకీయ సంక్షోభాన్ని కాస్త పక్కనపెడితే, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పటిష్ఠం చేసుకొనేలా ఒక దార్శనిక పత్రాన్ని మోదీతో కలసి షోల్జ్ ఆమోదించారు. స్వచ్ఛ ఇంధన సాంకేతికత నుంచి కృత్రిమ మేధ (ఏఐ) దాకా పలు హామీలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు అంతర్ ప్రభుత్వ పత్రాలతో పాటు, మూడు వ్యాపార ఒప్పందాల పైనా చేవ్రాలు జరిగింది. నూతన ఆవిష్కరణల పత్రంలో ప్రధానంగా హరిత ఉదజని సహా ఇంధన, స్వచ్ఛ సాంకేతి కతల్లో భాగస్వామ్యానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. హరిత ఉదజని ఆర్థికంగా గిట్టుబాటయ్యేలా చూడడమే ఉమ్మడి దీర్ఘకాలిక లక్ష్యం. కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలక రంగాల్లో జోరందుకున్నాయి. గత డిసెంబర్లో జర్మన్ విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించారు. షోల్జ్ పర్యటనకు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది కాలంలో మూడుసార్లు కలసిన మోదీ, షోల్జ్‌ల మధ్య మంచి స్నేహం నెలకొంది. నిరుడు మేలో 6వ ఇండియా– జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రతింపులలో (ఐజీసీ) ఇరువురు నేతలూ తొలిసారి సమావేశమయ్యారు. ఆపైన జర్మనీ సారథ్యంలోని ‘జీ7’ సదస్సుకు మోదీని షోల్జ్ ఆహ్వానించారు. జూన్‌లో ఆ వార్షిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇక నవంబర్‌లో ‘జీ20’ సదస్సు వేళ ఇండొనేసియాలో ద్వైపాక్షిక చర్చలతో బంధం బలపడింది. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పలు సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే విషయంలో భారత, జర్మనీల దృక్పథం చాలావరకు కలుస్తుంది. నియమానుసారమే అంతర్జాతీయ క్రమం సాగాలనీ, ఐరాస నిబంధనావళిలోని అంతర్జాతీయ న్యాయ ఆదేశిక సూత్రాలను గౌరవించాలనీ ఇరుదేశాల వైఖరి. ఈ అభిప్రాయాలతో పాటు ఇండో– పసిఫిక్ విధానంలో భాగంగా అంతర్జాతీయ అవస రాలు, అనివార్యతలు ఉభయ దేశాలనూ మరింత దగ్గర చేశాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) – భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ), ఈయూలో భాగం కాని థర్డ్ కంట్రీల్లో అభివృద్ధి పథకాలపై చర్చల్ని త్వరితగతిన ఖరారు చేయాలని జర్మనీ గట్టిగా యత్నిస్తోంది. గతంలో ఆరేళ్ళు చర్చించినా, 2013లో తొలిసారి మన ఎఫ్‌టీఏ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు షోల్జ్ సైతం ఎఫ్టీఏకు వ్యక్తిగతంగా కట్టుబడ్డారు. ఇవన్నీ ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత్ పలుకుబడికి నిదర్శనం. జర్మనీ విదేశాంగ మంత్రి ఆ మధ్య అన్నట్టు, ‘ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనాను అధిగమిస్తున్న భారత్‌ను సందర్శిస్తే, ప్రపంచంలో ఆరోవంతును చూసినట్టే.’ అలాగే, ‘21వ శతాబ్దంలో ఇండో– పసిఫిక్‌లోనూ, అంతకు మించి అంతర్జాతీయ క్రమాన్ని తీర్చిదిద్దడంలో నిర్ణయాత్మక ప్రభావం భారత్‌దే.’ ఇక, మన దేశంలో దాదాపు 1800 జర్మనీ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. భారత్‌లో భారీ విదేశీ పెట్టుబడుల్లోనూ ముందున్న ఆ దేశం వేలల్లో ఉద్యోగ కల్పనకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో షోల్జ్ ఆత్మీయ స్నేహం, అవసరమైన మిత్రుడితో మోదీ అనుబంధం అర్థం చేసుకోదగినవి. 141 కోట్ల జనాభాతో అపరిమిత ఇంధన అవసరాలున్న వేళ, హరిత ఇంధనం సహా అనేక అంశాల్లో జర్మనీతో బంధం భవిష్యత్తుకు కీలకమైనది. ఈ సమయం,సందర్భాలను అందిపుచ్చుకోవడమే భారత్‌కు తెలివైన పని. -
శాంతి ప్రక్రియలో భాగస్వామ్యానికి సిద్ధం
న్యూఢిల్లీ: ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారా పరిష్కరించుకోవాలని భారత్ పదేపదే చెబుతోందని ప్రధాని మోదీ చెప్పారు. ఇందుకు సంబంధించిన ఎలాంటి శాంతి ప్రక్రియలోనైనా భాగస్వామిగా మారేందుకు భారత్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ ఢిల్లీలో శనివారం జర్మన్ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌తో చర్చలు జరిపారు. ఏడాదిగా కొనసాగుతున్న రష్యా–ఉక్రెయిన్ సంక్షోభం పర్యవసానాలు ముఖ్యంగా ఆహారం, ఇంధన భద్రత వంటి పలు అంశాలతో వాణిజ్యం, పెట్టుబడులు, నూతన సాంకేతికతలు, వాతావరణ మార్పు వంటి అంశాల్లో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు. అనంతరం ఇరువురు నేతలు విడుదల చేసిన ఒక సంయుక్త ప్రకటనలో షోల్జ్..‘ఉక్రెయిన్‌పై రష్యా దురాక్రమణ తీవ్ర విపత్తు, ఇది ప్రపంచంపై విపరీత దుష్ప్రభావాలను కలుగజేసింది. ఈ అంశంపై ఐక్యరాజ్యసమితి సహా అన్ని వేదికలపై మనం వేసే అడుగులపై స్పష్టత అవసరం’అని పేర్కొన్నారు. హింసామార్గం ద్వారా సరిహద్దులను ఎవరూ మార్చ జాలరని షోల్జ్ పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న స్వేచ్ఛావాణిజ్యం ఒప్పందం(ఎఫ్‌టీఏ), పెట్టుబడుల రక్షణ ఒప్పందాలను సాధ్యమైనంత తొందరగా ఖరారు చేయాలనుకుంటున్నట్లు షోల్జ్ చెప్పారు. భారత్ వైఖరి మొదట్నుంచీ అదే ‘ఉక్రెయిన్ సంక్షోభాన్ని చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే పరిష్కరించుకోవాలని భారత్ మొదట్నుంచీ కోరుతోంది. ఇందుకు సంబంధించి జరిగే శాంతి ప్రక్రియలో పాలుపంచుకునేందుకు సిద్ధంగా ఉంది’అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఐక్యరాజ్య సమితిలోనూ ఇదే విషయం కుండబద్దలు కొట్టిందన్నారు. ‘భారత్, జర్మనీల మధ్య రక్షణ, భద్రత సహకారం వ్యూహాత్మక భాగస్వామ్యంలో కీలకంగా మారనుంది. ఈ రంగాల్లో మరిన్ని అవకాశాలను అన్వేషించాలి. ఉగ్రవాదం, వేర్పాటు వాదంపై పోరులో భారత్, జర్మనీల మధ్య మంచి సహకారం కొనసాగుతోందని మోదీ అన్నారు. భారత్‌లో రెండు రోజుల పర్యటనకు గాను షోల్జ్ శనివారం ఉదయం ఢిల్లీకి చేరుకున్నారు. -
25, 26 తేదీల్లో భారత్‌లో జర్మనీ అధ్యక్షుని పర్యటన
న్యూఢిల్లీ: జర్మనీ అధ్యక్షుడు ఒలాఫ్ షోల్జ్ ఈ నెల 25, 26వ తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఏడాది క్రితం అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన షోల్జ్ భారత్ రానుండటం ఇదే మొదటిసారి. సీనియర్ అధికారులు, ఉన్నత స్థాయి వాణిజ్య ప్రతినిధి వర్గంతో 25న ఆయన ఢిల్లీకి చేరుకుంటారని విదేశాంగ శాఖ తెలిపింది. షోల్జ్, ప్రధాని మోదీ పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై చర్చలు జరుపుతారు. 26న బెంగళూరులో జరిగే కార్యక్రమాల్లో జర్మనీ అధ్యక్షుడు షోల్జ్ పాల్గొంటారు. అదేవిధంగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీస్ కూడా మార్చి 8వ తేదీన భారత్‌లో పర్యటనకు రానున్నారు. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, కీలక ఖనిజాలు తదితర అంశాలపై ఆయన ప్రధాని మోదీతో విస్తృత చర్చలు జరుపుతారు. ఇరువురు నేతలు కలిసి అహ్మదాబాద్‌లో జరిగే భారత్–ఆస్ట్రేలియా క్రికెట్ మ్యాచ్‌ను తిలకించనున్నారు. ఈ పర్యటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌కు అత్యాధునిక యుద్ధ ట్యాంకులు: జర్మనీ
బెర్లిన్: తమ మిత్ర దేశాలకు కచ్చితంగా సహకరిస్తామని జర్మనీ చాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్ హామీ ఇచ్చారు. రష్యా సైన్యంపై పోరాడుతున్న ఉక్రెయిన్‌కు అత్యాధునిక లియోపార్డ్–2 ఏ6 యుద్ధ ట్యాంకులు అందజేస్తామని బుధవారం ప్రకటించారు. ఉక్రెయిన్‌కు తమ సొంత ఆయుధాగారం నుంచి తొలుత ఒక కంపెనీలు ట్యాంకులను (14 వాహనాలు) పంపించనున్నట్లు జర్మనీ ప్రభుత్వం ఒక తాజాగా ప్రకటనలో వెల్లడించింది. ఉక్రెయిన్‌కు మొత్తం 88 యుద్ధ ట్యాంకులను త్వరలో సమకూర్చాలని జర్మనీతోపాటు మిత్రదేశాలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఉక్రెయిన్‌కు సాయం అందించే విషయంలో తమ మిత్ర దేశాలతో కలిపి పని చేస్తున్నామని ఒలాఫ్ షోల్జ్ వెల్లడించారు. తమ దేశంలో తయారైన అత్యాధునిక యుద్ధ ట్యాంకులను ఉక్రెయిన్ సైన్యం మరోసారి రష్యా సేనలపై ఎక్కుపెట్టబోతోందని జర్మనీ సైనికాధికారి ఎకెహర్డ్ బ్రోస్ చెప్పారు. రష్యా దండయాత్రను అడ్డుకొనేలా ఉక్రెయిన్‌కు బాసటగా నిలవాల్సిన బాధ్యత పశ్చిమ దేశాలపై ఉందన్నారు. ఇదిలా ఉండగా, ఉక్రెయిన్‌కు అందుతున్న విదేశీ సైనిక సాయంపై రష్యా అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ దేశాలు వినాశకరమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయని హెచ్చరించారు. -
ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. విజేతలు ఎవరూ ఉండరు: ప్రధాని మోదీ
జర్మనీ పర్యటనలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై స్పందించారు. యుద్ధంలో విజేతలు ఎవరూ ఉండరని వ్యాఖ్యానించారు. ఏదేశమూ విజయం సాధించలేదని అన్నారు. భారత్ శాంతికి మద్దతిస్తుందని, యుద్ధం ముగించాలని ప్రధాని మోదీ కోరారు. బెర్లిన్‌లో జర్మనీ ఛాన్సలర్ ఒలాప్ స్కోల్జ్‌తో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్న మోదీ.. ఉక్రెయిన్-రష్యా సంక్షోభం కారణంగా వస్తువుల ధరలు పెరిగాయని అన్నారు. శాంతియుత చర్చలే ముందున్న ఏకైక మార్గమమని మరోసారి పేర్కొన్నారు. యుద్ధం ప్రభావం అభివృద్ధి చెందుతున్న దేశాలపై కూడా చూపుతోందన్న మోదీ.. యుద్ధంతో ఏర్పడిన మానవతావాద పరిణామాల గురించి భారత్ ఆందోళన చెందుతోందని మోదీ పేర్కొన్నారు. కాగా 3 రోజుల ఐరోపా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం జర్మనీ చేరుకున్నారు. బెర్లిన్ విమానాశ్రయంలో ఆయనకు అక్కడి అధికారులు, ప్రవాస భారతీయులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బెర్లిన్‌లో భారత్-జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రదింపుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, సుస్థిర ఇంధన భాగస్వామ్యం, హైడ్రోజన్ టాస్క్‌ఫోర్స్ వంటి తొమ్మిది ఒప్పందాలపై భారత్-జర్మనీ సంతకాలు చేశాయి. చదవండి: ఇమ్రాన్ ఖాన్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అరెస్ట్‌కు రంగం సిద్ధం! PM @narendramodi and @Bundeskanzler Olaf Scholz co-chaired the 6th IGC. Agreed to expand the India-Germany Strategic Partnership further to a partnership for: 1️⃣ Shared Values and Regional and Multilateral Interests 2️⃣ Green and Sustainable Development pic.twitter.com/2c2ErFo6ko — Arindam Bagchi (@MEAIndia) May 2, 2022 ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. 2022 ఏడాదిలో మొదటి విదేశీ పర్యటన జర్మనీలో జరగడం సంతోషంగా ఉందన్నారు. జర్మనీలో జూన్‌లో జరగనున్న జీ-7 శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీని ఆహ్వానించినట్లు ఆదేశ ఛాన్సలర్ స్కోల్జ్ తెలిపారు. అయితే గతేడాది డిసెంబరులో ఛాన్సలర్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత స్కోల్జ్‌తో ప్రధాని సమావేశం కావడం ఇదే తొలిసారి. #WATCH | Germany: Prime Minister Narendra Modi greets the Indian diaspora, as he departs for Federal Chancellery in Berlin. (Source: DD) pic.twitter.com/Qx2vLDAxZ4 — ANI (@ANI) May 2, 2022 ఇక ఉక్రెయిన్-రష్యా యుద్ధం కొనసాగుతున్న వేళ ఐరోపా దేశాలు ఉక్రెయిన్‌కు మద్దతు తెలుపుతుండగా భారత్ తటస్థ వైఖరిని అవలంభిస్తోంది. ఈ నేపథ్యంలో ఐరోపాలో మోదీ పర్యటిస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఐరోపా దేశాలతో బంధాన్ని పటిష్ఠం చేసుకునే దిశగా మోదీ చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా ఇంధన భద్రతే ఈ చర్చల్లో ప్రధాన అంశంగా ఉండనుంది. చదవండి: ఫిలిప్పిన్స్‌లో భారీ అగ్ని ప్రమాదం.. 6గురు మృతి, 80 ఇళ్లు దగ్ధం -
జర్మనీలో మోదీకి ఘనస్వాగతం... పాటతో అలరించిన బాలుడు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌లో తన మూడు దేశల పర్యటన సందర్భంగా మొదటగా బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు భారత సంతతికి చెందిన ప్రజలు భారీగా ఘనస్వాగతం పలికారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి దేశభక్తి పాటతో మోదీకి ఘన స్వాగతం పలకగా.. మాన్యా అనే అమ్మాయి పెన్సిల్-స్కెచ్‌తో గీసిన ప్రధాని మోదీ చిత్రాన్ని బహుకరించింది. మోదీ ఈ పర్యటన భారత్, జర్మనీ ఇరు దేశాల మధ్య స్నేహాన్ని మరింతగా పెంపొందింప చేస్తోందన్నారు "నేను జర్మనీకి కొత్తగా నియమితులైన ఓలాఫ్ స్కోల్జ్‌తో చర్చలు జరుపుతాను. ఈ సమావేశంలో వ్యాపార ప్రముఖులతో కూడా సంభాషిస్తాను." అని మోదీ ట్వీట్ చేశారు. ఈ మేరకు ఒక యువ విద్యార్థి తన పాటతో మోదీకి ఘనస్వాగతం పలికిన వీడియోతో పాటు, విద్యార్థులు మోదీ కాళ్లకు పాదాభివందనం చేస్తున్న వీడియోలు ట్విట్టర్లో వైరల్ అవుతున్నాయి. నార్డిక్ దేశాల నాయకులతో చర్చలు జరపడానికి మోదీ డెన్మార్క్‌ను కూడా సందర్శించాల్సి ఉంది. ఆ తర్వాత కొత్తగా ఎన్నికైన ఫ్రెంచ్ అధ్యక్షడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌ను కలవడానికి భారత ప్రధాని పారిస్‌కు వెళ్తారు. ఇది ఉక్రెయిన్‌పై రష్యా దాడి తర్వాత ఈ ఏడాది మోదీ చేసిన తొలి విదేశీ పర్యటన. ఉక్రెయిన్ రష్యా యుద్ధం కారణంగా పలు సవాళ్లు ఎదుర్కొంటున్న యూరప్‌లో తాను పర్యటించబోతున్నాని మోదీ పేర్కొన్న సంగతి తెలిసిందే. #WATCH PM Narendra Modi in all praises for a young Indian-origin boy as he sings a patriotic song on his arrival in Berlin, Germany pic.twitter.com/uNHNM8KEKm — ANI (@ANI) May 2, 2022 #WATCH Indian diaspora extends a warm welcome to PM Modi in Berlin, Germany (Source:DD) pic.twitter.com/H0yX5LWut4 — ANI (@ANI) May 2, 2022 (చదవండి: తండ్రి కూతురికి సరిపోయే మ్యాచ్ తీసుకువస్తే...ఆమె ఏం చేసిందో తెలుసా?) -
PM Modi Europe Visit: జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: యూరప్ దేశాల పర్యటనలో భాగంగా భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జర్మనీ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం.. సోమవారం ఉదయం ఆయన బెర్లిన్-బ్రాండెన్‌బర్గ్ ఎయిర్‌పోర్ట్‌లో అడుగుపెట్టారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ముందుకు జర్మనీ చేరుకున్న ప్రధాని మోదీ.. జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ తో భేటీ అవుతారు. ఆపై ఆరవ ఇండియా జర్మనీ ఇంటర్ గవర్నమెంటల్ కన్సల్టేషన్స్ (ఐజీసీ)లో పాల్గొంటారు. ఐజీసీ ప్రతి రెండేళ్లకొకసారి ఇరు దేశాల మధ్య జరుగుతుంటుంది. రెండు దేశాలకు చెందిన టాప్ సీఈవోలు.. వీరిరువురితో ఇంటెరాక్ట్ అవుతారు. ఇక తన పర్యటనలో భాగంగా.. ప్రధాని మోదీ మంగళవారం డెన్మార్క్‌లో, బుధవారం ఫ్రాన్స్‌లో పర్యటిస్తారు. ఈమధ్యే కొత్తగా ఫ్రాన్స్‌కు తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైన ఎమ్మాన్యుయెల్ మాక్రోన్‌కు పీఎం మోదీ శుభాకాంక్షలు తెలియజేసి.. భేటీ అవ్వనున్నారు. PM Modi gets a warm welcome from the Indian diaspora in Berlin He will hold his first in-person meeting with the newly appointed German Chancellor Olaf Scholz and co-chair the 6th India-Germany Inter-Governmental Consultations today pic.twitter.com/cs1c6GGMGZ — ANI (@ANI) May 2, 2022