G20 Summit In India: భారత్ అధ్యక్షతన తొలిసారి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు.
కాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌కు.. భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ప్రధాని మోదీ కరచలనం చేసి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కోల్జ్.. తన కంటికి ఐప్యాచ్ ధరించి ఉన్నారు. సాధారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్‌ను స్కల్జ్ తన కంటికి ధరించారు.
అయితే దీనిపై జర్మనీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్సలర్ గత శనివారం జాగింగ్ చేస్తుండగా స్వల్ప గాయాలైనట్లు అతని ప్రతినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు. దీని వల్ల ఆయన కుడి కన్ను దెబ్బతిందని, మరి కొన్ని రోజులు కంటికి ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని చెప్పారు. జర్మనీ ఛాన్సలర్‌కు ఎన్నో ఏళ్లుగా ప్రతి రోజూ జాగింగ్ చేసే అలవాటు ఛాన్సలర్ స్కల్జ్‌కు ఉన్నట్లు తెలిపారు.
చదవండి: G20 Summit: కీలక ఒప్పందాలపై అగ్రనేతల చర్చలు
#WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO
— ANI (@ANI) September 9, 2023
అంతేగాక నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్ 4న జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ సైతం ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) తనక కంటికి గాయమైన ఫోటోను షేర్ చేవారు. ఇందులో అతడి కుడి కన్నుపై పెద్ద నల్లటి పాచ్ ధరించి ఉన్నారు. కంటి చుట్టూ ఎర్రగా దెబ్బ తగిలిన గుర్తులుకూడా కనిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment