German Chancellor
-
విశ్వాస పరీక్షలో షోల్జ్ ఓటమి
బెర్లిన్: జర్మనీ చాన్సెలర్ ఒలాఫ్ షోల్జ్ సోమవారం పార్లమెంట్లో విశ్వాస పరీక్షలో ఓటమి పాలయ్యారు. యూరప్‌లోనే అత్యధిక జనాభా, అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన జర్మనీలో ఫిబ్రవరిలోనే ముందస్తు ఎన్నికలకు ఈ పరిణామం దారి తీయనుంది. మూడు పార్టీల సంకీర్ణ ప్రభుత్వం నవంబర్ 6న కుప్పకూలింది. రాజ్యాంగం ప్రకారం సభలో విశ్వాస పరీక్ష చేపట్టాల్సి ఉంటుంది. మొత్తం 733 మంది సభ్యులుండే దిగువ సభ బుండెస్టాగ్‌లో సోమవారం షోల్జ్‌కు అనుకూలంగా 207 మంది ఓటేశారు. దీంతో, ఆయన సభ విశ్వాసం పొందలేకపోయినట్లు ప్రకటించారు. విశ్వాసంలో గెలవాలంటే మరో 367 ఓట్ల అవసరముంది. ఫిబ్రవరి 23వ తేదీన ఎన్నికలు జరపాలని ప్రధాన పార్టీలన్నీ ఇప్పటికే ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఉక్రెయిన్‌కు ఆయుధ, ఆర్థిక సాయమందించేందుకు సిద్ధమని ప్రకటిస్తున్న షోల్జ్ ‘సోషల్ డెమోక్రాట్’పార్టీకి వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు తక్కువని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం యూనియన్ బ్లాక్ ముందంజలో ఉందంటున్నారు. -
కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జర్మనీ ఛాన్సలర్.. ఎందుకంటే!
G20 Summit In India: భారత్ అధ్యక్షతన తొలిసారి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌కు.. భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ప్రధాని మోదీ కరచలనం చేసి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కోల్జ్.. తన కంటికి ఐప్యాచ్ ధరించి ఉన్నారు. సాధారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్‌ను స్కల్జ్ తన కంటికి ధరించారు. అయితే దీనిపై జర్మనీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్సలర్ గత శనివారం జాగింగ్ చేస్తుండగా స్వల్ప గాయాలైనట్లు అతని ప్రతినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు. దీని వల్ల ఆయన కుడి కన్ను దెబ్బతిందని, మరి కొన్ని రోజులు కంటికి ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని చెప్పారు. జర్మనీ ఛాన్సలర్‌కు ఎన్నో ఏళ్లుగా ప్రతి రోజూ జాగింగ్ చేసే అలవాటు ఛాన్సలర్ స్కల్జ్‌కు ఉన్నట్లు తెలిపారు. చదవండి: G20 Summit: కీలక ఒప్పందాలపై అగ్రనేతల చర్చలు #WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO — ANI (@ANI) September 9, 2023 అంతేగాక నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్ 4న జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ సైతం ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) తనక కంటికి గాయమైన ఫోటోను షేర్ చేవారు. ఇందులో అతడి కుడి కన్నుపై పెద్ద నల్లటి పాచ్ ధరించి ఉన్నారు. కంటి చుట్టూ ఎర్రగా దెబ్బ తగిలిన గుర్తులుకూడా కనిపిస్తున్నాయి. -
సతత హరిత వ్యూహాత్మకం
ఢిల్లీలోని చాణక్యపురిలో రోడ్డుపై దుకాణంలో తేనీరు సేవించిన జర్మనీ అధినేత! ఇది, ప్రధాని మోదీతో కలసి సంయుక్త మీడియా ప్రకటన మినహా జర్మనీ ఛాన్స్లర్ ఒలాఫ్ షోల్జ్ రెండు రోజుల భారత అధికారిక పర్యటనపై హడావిడి వార్తలు, ప్రకటనలు మీడియాలో కనిపించి ఉండకపోవచ్చు. అంతమాత్రాన షోల్జ్ భారత పర్యటన అప్రధానమనుకుంటే పొరపాటే. రాష్ట్రపతిని కలసి సంభాషించడం, ప్రధానిని కలసి చర్చించడం, ఔత్సాహిక వ్యాపారవేత్తలతో గోష్ఠి జరపడం – ఇలా ఫిబ్రవరి 25, 26ల్లో షోల్జ్ సుడిగాలిలా చుట్టేశారు. ఇప్పటికే జపాన్, చైనా, ఆసియాన్ దేశాల్లో పర్యటించిన ఆయన తమ దేశ ఇండో–పసిఫిక్ విధానంలో భాగంగా భారత్‌తో బంధం దృఢమైనదని తేల్చేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధానికి ఏడాది నిండిన వేళ ఈ పర్యటన వ్యూహాత్మకంగా కీలకమనేది అందుకే. పదహారేళ్ళ సుదీర్ఘ ఏంజెలా మెర్కెల్ పాలన తర్వాత 2021 డిసెంబర్లో జర్మనీ ప్రభుత్వాధినేత అయిన షోల్జ్ ఆ పైన మన దేశంలో పర్యటించడం ఇదే తొలిసారి. ఆ మాటకొస్తే, 2011 తర్వాత ఒక జర్మన్ నేత భారత్‌లో ప్రత్యేకంగా పర్యటించడం కూడా ఇదే ప్రథమం. అలా ఈ తాజా పర్యటనకు విశేష ప్రాధాన్యం ఉంది. జర్మన్ అధినేత వెంట వచ్చిన వ్యాపార ప్రతినిధి బృందంలో సీమెన్స్, శాప్ సంస్థలు ఉన్నాయి. ఐటీ, టెలికామ్ సహా కీలక రంగాల్లో భారత సంస్థలతో ఒప్పందాలు చేసు కున్నాయి. స్వచ్ఛ ఇంధనం, వాణిజ్యం, నవీన సాంకేతిక పరిజ్ఞాన రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల పటిష్ఠతే లక్ష్యంగా ప్రధాని మోదీతో షోల్జ్ విస్తృత స్థాయి చర్చలు జరిపారు. మరీ ముఖ్యంగా, యూరప్ తన సరఫరా వ్యవస్థలను చక్కదిద్దుతున్న వేళ షోల్జ్ చర్చలు కీలకమయ్యాయి. సహజంగానే ఉక్రెయిన్ వ్యవహారం అజెండాలో ముందుంది. అయితే, రష్యా వ్యతిరేక వైఖరి తీసుకొనేలా ఒత్తిడి తెచ్చే కన్నా... అందరికీ కావాల్సిన మనిషిగా, మధ్యవర్తిత్వం నెరిపే వీలున్న దేశంగా భారత్‌తో జర్మనీ జత కడుతోంది. జీ20 సారథిగా భారత్ ఈ యుద్ధానికి త్వరగా తెరపడేలా చేసి, ఆర్థిక పునరుజ్జీవనం జరిపించాలని భావిస్తోంది. అందుకీ పర్యటనను సాధనంగా ఎంచుకుంది. రష్యా రక్షణ ఉత్పత్తుల సరఫరాలపై భారత్ ఆధారపడినందున జలాంతర్గాముల సంయుక్త తయారీ లాంటి అంశాల్లో భారత్‌తో చేయి కలుపుతూ, సరఫరా వ్యవస్థల్లో మార్పుకు చూస్తోంది. ఈ భౌగోళిక – రాజకీయ సంక్షోభాన్ని కాస్త పక్కనపెడితే, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారాన్ని పటిష్ఠం చేసుకొనేలా ఒక దార్శనిక పత్రాన్ని మోదీతో కలసి షోల్జ్ ఆమోదించారు. స్వచ్ఛ ఇంధన సాంకేతికత నుంచి కృత్రిమ మేధ (ఏఐ) దాకా పలు హామీలు ఇచ్చిపుచ్చుకున్నారు. రెండు అంతర్ ప్రభుత్వ పత్రాలతో పాటు, మూడు వ్యాపార ఒప్పందాల పైనా చేవ్రాలు జరిగింది. నూతన ఆవిష్కరణల పత్రంలో ప్రధానంగా హరిత ఉదజని సహా ఇంధన, స్వచ్ఛ సాంకేతి కతల్లో భాగస్వామ్యానికి అగ్ర తాంబూలం ఇచ్చారు. హరిత ఉదజని ఆర్థికంగా గిట్టుబాటయ్యేలా చూడడమే ఉమ్మడి దీర్ఘకాలిక లక్ష్యం. కొన్నేళ్ళుగా ఇరుదేశాల మధ్య సంబంధాలు కీలక రంగాల్లో జోరందుకున్నాయి. గత డిసెంబర్లో జర్మన్ విదేశాంగ మంత్రి భారత్‌ను సందర్శించారు. షోల్జ్ పర్యటనకు రంగం సిద్ధం చేశారు. గత ఏడాది కాలంలో మూడుసార్లు కలసిన మోదీ, షోల్జ్‌ల మధ్య మంచి స్నేహం నెలకొంది. నిరుడు మేలో 6వ ఇండియా– జర్మనీ అంతర్ ప్రభుత్వ సంప్రతింపులలో (ఐజీసీ) ఇరువురు నేతలూ తొలిసారి సమావేశమయ్యారు. ఆపైన జర్మనీ సారథ్యంలోని ‘జీ7’ సదస్సుకు మోదీని షోల్జ్ ఆహ్వానించారు. జూన్‌లో ఆ వార్షిక సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఇక నవంబర్‌లో ‘జీ20’ సదస్సు వేళ ఇండొనేసియాలో ద్వైపాక్షిక చర్చలతో బంధం బలపడింది. ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పలు సవాళ్ళను దీటుగా ఎదుర్కొనే విషయంలో భారత, జర్మనీల దృక్పథం చాలావరకు కలుస్తుంది. నియమానుసారమే అంతర్జాతీయ క్రమం సాగాలనీ, ఐరాస నిబంధనావళిలోని అంతర్జాతీయ న్యాయ ఆదేశిక సూత్రాలను గౌరవించాలనీ ఇరుదేశాల వైఖరి. ఈ అభిప్రాయాలతో పాటు ఇండో– పసిఫిక్ విధానంలో భాగంగా అంతర్జాతీయ అవస రాలు, అనివార్యతలు ఉభయ దేశాలనూ మరింత దగ్గర చేశాయి. యూరోపియన్ యూనియన్ (ఈయూ) – భారత్‌ల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ), ఈయూలో భాగం కాని థర్డ్ కంట్రీల్లో అభివృద్ధి పథకాలపై చర్చల్ని త్వరితగతిన ఖరారు చేయాలని జర్మనీ గట్టిగా యత్నిస్తోంది. గతంలో ఆరేళ్ళు చర్చించినా, 2013లో తొలిసారి మన ఎఫ్‌టీఏ ప్రయత్నం విఫలమైంది. ఇప్పుడు షోల్జ్ సైతం ఎఫ్టీఏకు వ్యక్తిగతంగా కట్టుబడ్డారు. ఇవన్నీ ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత్ పలుకుబడికి నిదర్శనం. జర్మనీ విదేశాంగ మంత్రి ఆ మధ్య అన్నట్టు, ‘ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశంగా చైనాను అధిగమిస్తున్న భారత్‌ను సందర్శిస్తే, ప్రపంచంలో ఆరోవంతును చూసినట్టే.’ అలాగే, ‘21వ శతాబ్దంలో ఇండో– పసిఫిక్‌లోనూ, అంతకు మించి అంతర్జాతీయ క్రమాన్ని తీర్చిదిద్దడంలో నిర్ణయాత్మక ప్రభావం భారత్‌దే.’ ఇక, మన దేశంలో దాదాపు 1800 జర్మనీ సంస్థలు క్రియాశీలంగా ఉన్నాయి. భారత్‌లో భారీ విదేశీ పెట్టుబడుల్లోనూ ముందున్న ఆ దేశం వేలల్లో ఉద్యోగ కల్పనకు కారణమవుతోంది. ఈ పరిస్థితుల్లో షోల్జ్ ఆత్మీయ స్నేహం, అవసరమైన మిత్రుడితో మోదీ అనుబంధం అర్థం చేసుకోదగినవి. 141 కోట్ల జనాభాతో అపరిమిత ఇంధన అవసరాలున్న వేళ, హరిత ఇంధనం సహా అనేక అంశాల్లో జర్మనీతో బంధం భవిష్యత్తుకు కీలకమైనది. ఈ సమయం,సందర్భాలను అందిపుచ్చుకోవడమే భారత్‌కు తెలివైన పని. -
ఉగ్రవాదాన్ని దీటుగా ఎదుర్కోవాలి
న్యూఢిల్లీ: భారత్, జర్మనీ మధ్య ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్, ప్రధాని మోదీ మరిన్ని చర్యలు తీసుకున్నారు. రెండు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చిన మెర్కెల్ శుక్రవారం మోదీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఉగ్రవాదం పీచమణచడానికి ఉమ్మడిగా పోరాటం సాగించాలని నిర్ణయించారు. వ్యూహాత్మక భాగస్వామ్యంతో సాగే పలు రంగాలైన రక్షణ, ఇంధనం, కృత్రిమ మేధ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని ఒక అవగాహనకు వచ్చారు. అయిదవ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులకు (ఐజీసీ) నేతృత్వం వహించిన ఇరువురు పాకిస్తాన్‌కు గట్టి హెచ్చరికలే పంపారు. ఇతర దేశాలు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడానికి తమ భూభాగాన్ని వాడుకుంటే చూస్తూ ఊరుకోబోమని తేల్చి చెప్పారు. కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత జర్మనీ చాన్స్‌లర్‌తో జరిగిన ఈ సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతర్జాతీయ చట్టాలను బలోపేతం చేయాలి : మోదీ నరేంద్రమోదీ, ఏంజెలా మెర్కెల్ చర్చలు పూర్తయ్యాక ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ప్రపంచ దేశాలకు ఒక శాపంలా మారిన ఉగ్రవాదాన్ని అణచివేయడంలో ఇరు దేశాలు ఉమ్మడి పోరాటం చేస్తాయని, ప్రపంచ దేశాలన్నీ తమతో చేతులు కలపాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేయడానికి ప్రపంచదేశాలన్నీ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవాలని, అంతర్జాతీయ చట్టాలను, మానవ హక్కుల చట్టాలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించే ప్రాంతాలను, అక్కడ ఉన్న మౌలిక సదుపాయాలను, వారి నెట్‌వర్క్‌లను, ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందించే సంస్థలను సర్వనాశనం చేయాలన్నారు. జర్మనీ వంటి సాంకేతిక, ఆర్థిక పరిపుష్టి కలిగిన దేశాల సహకారంతోనే భారత నవనిర్మాణం సాధ్యమవుతుందని ప్రధాని మోదీ అన్నారు. ఇరుదేశాలు అంతరిక్షం, పౌరవిమానయానం, విద్య, వైద్యం, కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ వంటి 17 రంగాల్లో అవగాహనా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. ఆర్థిక సహకారం మరింత బలోపేతం కావాలి : మెర్కెల్ 5జీ, కృత్రిమ మేధ వంటి రంగాల్లో ఎన్నో సవాళ్లు ఎదురవుతున్నాయని వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి ఇరు దేశాలు మరింతగా సహకరించుకోవాలని ఏంజెలా మెర్కెల్ అన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావాలన్నారు. మేకిన్ ఇండియా కోసం భారత్ చేస్తున్న ప్రయత్నం చాలా గొప్పదని, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మోదీ సర్కార్ ఎంత కష్టపడుతోందో తెలుస్తుందని ఆమె కొనియాడారు. భారత్ జర్మనీ సహకారం తీసుకోవడం హర్షణీయమని వ్యాఖ్యానించారు. -
జర్మనీ మాజీ చాన్స్‌లర్ మృతి
బెర్లిన్: జర్మనీ మాజీ చాన్స్‌లర్ హెల్మ్‌త్ కొహ్ల్(87) శుక్రవారం మృతిచెందారు. రిన్లాండ్-పాలాటినాట్లో లుడ్విగ్షఫెన్లోని తన నివాసంలో అనారోగ్యంతో హెల్మ్‌త్ కొహ్ల్ తుది శ్వాస విడిచారు. జర్మనీ పునరేకీకరణ పితామహుడుగా హెల్మ్‌త్ కొహ్ల్ కు మంచి పేరుంది. సమకాలీన యూరోపియన్ చరిత్రలో హెల్మ్‌త్ తన కంటూ ఓ స్థానం సంపాదించుకున్నారు. -
జర్మనీ చాన్స్‌లర్ కార్యాలయానికి సీల్
జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్ కార్యాలయం సమీపంలో అనుమానాస్పద వస్తువులు కనిపించాయి. దాంతో వెంటనే కార్యాలయానికి సీల్ వేశారు. పసుపు రంగులో ఉన్న నాలుగు ప్లాస్టిక్ క్రేట్లు మెర్కెల్ కార్యాలయం సమీపంలో ఉండటంతో వెంటనే ఆ ప్రాంతం మొత్తాన్ని సీజ్ చేసి.. తక్షణం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. అత్యవసర బృందాలు అక్కడకు చేరుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాయి. ఈ ఘటనపై మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
జర్మనీ, భారత్ ‘సౌర’బంధం
-
జర్మనీ, భారత్ ‘సౌర’బంధం
భారత్‌లో ప్రాజెక్టులకు రూ.7,300 కోట్లు ♦ సాగు, రైల్వేల్లో సహకారం ♦ జర్మనీతో 18 ఒప్పందాలు ♦ మోదీ-మెర్కెల్ మధ్య ద్వైపాక్షిక చర్చలు ♦ మహిషాసుర మర్దిని విగ్రహం భారత్‌కు అప్పగింత న్యూఢిల్లీ: భారత్‌తో వ్యాపార బంధం బలోపేతం చేసుకునే దిశగా జర్మనీ కీలకమైన ముందడుగు వేసింది. ప్రధానంగా సౌర ఇంధన రంగంలో పెద్ద ఎత్తున భారత్‌కు సహకరించటానికి జర్మనీ ముందుకొచ్చింది. రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన జర్మన్ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్‌తో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోమవారం సుదీర్ఘంగా మూడు గంటల పాటు జరిపిన ద్వైపాక్షిక చర్చల్లో 18 ఒప్పందాలు కుదుర్చుకోవటంతో పాటు.. వ్యూహాత్మక రంగాల్లో పరస్పర సహకారంపై అవగాహనకు వచ్చారు. 28 మంది ప్రతినిధులతో భారత్‌కు వచ్చిన మెర్కెల్ బృందం మోదీ నేతృత్వంలోని భారత బృందంతో పలు అంశాలపై చర్చలు జరిపింది. రక్షణ, భద్రత, నిఘా, రైల్వేలు, పెట్టుబడులు, స్వచ్ఛ ఇంధనం వంటి వివిధ కీలకమైన రంగాలపై ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ‘‘భారత ఆర్థిక పునర్వికాసంలో జర్మనీ సహజ భాగస్వామిగా ఉంటుంది. మా దృష్టి ప్రధానంగా ఆర్థిక సంబంధాలపై ఉన్నా.. ఇరు దేశాలూ సుస్థిర అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని నిర్ణయించాం’’ అని చర్చల అనంతరం సంయుక్త మీడియా సమావేశంలో ప్రధాని మోదీ అన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టే జర్మనీ కంపెనీలకు వేగంగా అనుమతులివ్వటంతో పాటు, సౌర ఇంధన నిధికి వచ్చే ఐదేళ్లలో రూ. 7,300 కోట్ల ఆర్థిక సహాయాన్ని జర్మనీ ప్రకటించింది. అయితే నేర వ్యవహారాల్లో పరస్పర సహకారానికి భారత నేర శిక్షాస్మృతిలోని ఉరిశిక్ష ప్రధాన అడ్డంకిగా మారింది. ఇరు దేశాల మధ్య నేర వ్యవహారాల్లో పరస్పర న్యాయ సహాయ ఒప్పందంపై 2007 నుంచి చర్చలు జరుగుతున్నాయి. తాజాగా సోమవారం జరిగిన చర్చల్లోనూ భారత్‌లో ఉరిశిక్ష అమల్లో ఉండటం వల్ల ఒప్పందం కుదరలేదు. పర్యటనలోని మరికొన్ని ముఖ్యాంశాలు స ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద ప్రధాని మోదీ మెర్కెల్‌కు సంప్రదాయ స్వాగతం పలికారు. భారత సైనిక వందనాన్ని మెర్కెల్ స్వీకరించారు. స మహాత్మాగాంధీ సమాధి వద్ద మెర్కెల్ నివాళులు అర్పించారు. స ఇరు దేశాల మధ్య జరిగిన చర్చల్లో 18 ఒప్పందాలపై సంతకాలు జరిగాయి. స వంకాయ, పొట్లకాయ, కాకరకాయ, ఆల్ఫాన్సో మామిడిపై యురోపియన్ యూనియన్ నిషేధం ఎత్తివేతకు సాయం చేయాలని జర్మనీని భారత్ కోరింది. స వ్యవసాయంలో అభివృద్ధికి భారత వ్యవసాయ నైపుణ్య మండలితో జర్మనీ వ్యవసాయ వ్యాపార కూటమి సహకారం. స భారత్‌లో సౌర ఇంధన ప్రాజెక్టుల అభివృద్ధికి రూ. 7,300 కోట్ల జర్మనీ ఆర్థిక సాయం స వాతావరణ మార్పునకు సంబంధించి పారిస్ ఒప్పందంలోని ముఖ్యభాగాన్ని అమలు చేసేందుకు జర్మనీ నిర్ణయం. 2020 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో హరిత పరిజ్ఞానం, పరిశుభ్రమైన వాతావరణం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలు రూ. 6 వేల కోట్ల ఆర్థిక సాయం. స భారత్‌లో జర్మన్ భాషకు, జర్మనీలో.., సంస్కృతంతో సహా భారత ఆధునిక భాషలకు విదేశీ భాషలుగా ప్రాచుర్యం కల్పించాలని ఒప్పందం. స ఉగ్రవాదం, తీవ్రవాదాన్ని కలసి కట్టుగా ఎదుర్కోవాలని నిర్ణయం. స {పపంచంలో అణ్వస్త్ర నిరోధక చర్యలను పటిష్టం చేసే ప్రయత్నాలను బలోపేతం చేయాలని నిర్ణయం. స కశ్మీర్లో దొంగతనం జరిగిన 10వ శతాబ్దం నాటి మహిషాసుర మర్దిని విగ్రహం భారత్‌కు అప్పగింత. స దక్షిణ చైనా సముద్రంలో చైనా దూకుడు పెరగటంపై ఆందోళన. స జర్మన్ కంపెనీల కోసం ఫాస్ట్‌ట్రాక్ సిస్టమ్ 2016 నుంచి పూర్తి స్థాయిలో ప్రారంభం. స పెట్టుబడుల ఆకర్షణకు మార్కెట్ ద్వారాలు తెరిచిపెట్టాలని నిర్ణయం. స స్మార్ట్ సిటీలు, గంగ శుద్ధి కార్యక్రమాలకు జర్మనీ సాయం. స ఆహార భద్రత, పౌరవిమానయానం, డిజిటల్ మౌలిక సదుపాయాలు, రైల్వేలు వంటి రంగాల్లో పరస్పర సహకారం. -
నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్!
న్యూఢిల్లీ: సహచర క్యాబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు సహా బడా వ్యాపారవేత్తలతో కూడిన భారీ బృందంతో జర్మన్ ఛాన్సలర్ ఏంజిలా మోర్కెల్ భారత్ కు విచ్చేశారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకున్న మోర్కెల్ బృందానికి కేంద్ర ఆర్ధిక శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా ఘనస్వాగతం పలికారు. 'నమస్తే.. ఛాన్సలర్ మోర్కెల్! మీకు, మీ బృందానికి హృదయపూర్వక ఆహ్వానం. మీ పర్యటనతో భారత్- జర్మనీల మైత్రి మరింత ఫలప్రదం అవుతుందని ఆశిస్తున్నా' అంటూ ఏంజెలా రాకను స్వాగతిస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. రేపు (సోమవారం) ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మోర్కెల్ భేటీ కానున్నారు. ఆరు మాసాల వ్యవధిలో రెండోసారి జరగనున్న ద్వైపాక్షిక చర్చల్లో పలు వాణిజ్య, రక్షణ ఒప్పందాలతోపాటు భారత్- యూరోపియన్ యూనియన్ వ్యాపార ఒప్పందాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. పర్యటనలో భాగంగా ఏంజిలా మోర్కెల్ బెంగళూరునూ సందర్శిస్తారు. Namaste Chancellor Merkel! Warm welcome to you & the delegation. I look forward to fruitful discussions & strengthening India-Germany ties. — Narendra Modi (@narendramodi) October 4, 2015 -
మెర్కెల్‌కు ఇందిర శాంతి బహుమతి
న్యూఢిల్లీ: యూరప్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్(59)కు ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. 2013 ఏడాదికి గాను ‘ఇందిరాగాంధీ నిరాయుధీకరణ, అభివృద్ధి శాంతి బహుమతి’కి ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఆమెను ఎంపిక చేసింది. ప్రపంచ ఆర్థిక సుస్థిరత, శాంతి కోసం చేసిన కృషికి గాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఇందిరా మెమోరియల్ ట్రస్టు మంగళవారం తెలిపింది. భారత్, ఇతర వర్ధమానదేశాలతో సంబంధాల బలోపేతానికి ఆమె కృషి చేశారని కొనియాడింది.