మెర్కెల్‌కు ఇందిర శాంతి బహుమతి | German Chancellor Angela Merkel to be awarded Indira Gandhi Peace Prize 2013 | Sakshi
Sakshi News home page

మెర్కెల్‌కు ఇందిర శాంతి బహుమతి

Published Wed, Nov 20 2013 3:28 AM | Last Updated on Sat, Sep 2 2017 12:46 AM

మెర్కెల్‌కు ఇందిర శాంతి బహుమతి

మెర్కెల్‌కు ఇందిర శాంతి బహుమతి

న్యూఢిల్లీ: యూరప్ రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తున్న జర్మనీ చాన్స్‌లర్ ఏంజెలా మెర్కెల్(59)కు ప్రతిష్టాత్మక ఇందిరా గాంధీ శాంతి బహుమతిని ప్రకటించారు. 2013 ఏడాదికి గాను ‘ఇందిరాగాంధీ నిరాయుధీకరణ, అభివృద్ధి శాంతి బహుమతి’కి ప్రధాని మన్మోహన్ నేతృత్వంలోని అంతర్జాతీయ జ్యూరీ ఆమెను ఎంపిక చేసింది. ప్రపంచ ఆర్థిక సుస్థిరత, శాంతి కోసం చేసిన కృషికి గాను పురస్కారానికి ఎంపిక చేసినట్లు ఇందిరా మెమోరియల్ ట్రస్టు మంగళవారం తెలిపింది. భారత్, ఇతర వర్ధమానదేశాలతో సంబంధాల బలోపేతానికి ఆమె కృషి చేశారని కొనియాడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement