eye injure
-
కంటికి ఐ ప్యాచ్‌తో జీ20 సదస్సుకు జర్మనీ ఛాన్సలర్.. ఎందుకంటే!
G20 Summit In India: భారత్ అధ్యక్షతన తొలిసారి జరుగుతున్న ప్రతిష్ఠాత్మక జీ20 శిఖరాగ్ర సదస్సు ప్రారంభమైంది. ఢిల్లీలోని ప్రగతి మైదాన్‌లో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన భారత్ మండపంలో ఈ సమావేశం జరుగుతోంది. పలు దేశాల అధినేతలు, అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొన్నారు. కాగా జీ20 సదస్సులో పాల్గొనేందుకు వస్తున్న జర్మనీ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్‌కు.. భారత మండపంలో ఉన్న కోణార్క్ వీల్ వద్ద ప్రధాని మోదీ కరచలనం చేసి స్వాగతం పలికారు. ఆ సమయంలో స్కోల్జ్.. తన కంటికి ఐప్యాచ్ ధరించి ఉన్నారు. సాధారణంగా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్లు ధరించే నల్ల రంగు ప్యాచ్‌ను స్కల్జ్ తన కంటికి ధరించారు. అయితే దీనిపై జర్మనీ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 65 ఏళ్ల ఛాన్సలర్ గత శనివారం జాగింగ్ చేస్తుండగా స్వల్ప గాయాలైనట్లు అతని ప్రతినిధి స్టీఫెన్ హెబిస్ట్రెయిట్ తెలిపారు. దీని వల్ల ఆయన కుడి కన్ను దెబ్బతిందని, మరి కొన్ని రోజులు కంటికి ప్యాచ్ ధరించాల్సి ఉంటుందని చెప్పారు. జర్మనీ ఛాన్సలర్‌కు ఎన్నో ఏళ్లుగా ప్రతి రోజూ జాగింగ్ చేసే అలవాటు ఛాన్సలర్ స్కల్జ్‌కు ఉన్నట్లు తెలిపారు. చదవండి: G20 Summit: కీలక ఒప్పందాలపై అగ్రనేతల చర్చలు #WATCH | G-20 in India: German Chancellor Olaf Scholz arrives at Bharat Mandapam, the venue for G 20 Summit in Delhi's Pragati Maidan. pic.twitter.com/PkBvhCKWEO — ANI (@ANI) September 9, 2023 అంతేగాక నాలుగు రోజుల క్రితం సెప్టెంబర్ 4న జర్మన్ ఛాన్సలర్ స్కోల్జ్ సైతం ఎక్స్‌లో (గతంలో ట్విట్టర్) తనక కంటికి గాయమైన ఫోటోను షేర్ చేవారు. ఇందులో అతడి కుడి కన్నుపై పెద్ద నల్లటి పాచ్ ధరించి ఉన్నారు. కంటి చుట్టూ ఎర్రగా దెబ్బ తగిలిన గుర్తులుకూడా కనిపిస్తున్నాయి. -
క్రికెటర్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయం..
భారత్ అండర్-19 మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ కంటికి తీవ్ర గాయమైంది. ఈ విషయాన్ని ఉన్మక్త్ చంద్ స్వయంగా తన ట్విటర్లో షేర్ చేసుకున్నాడు. ఉన్ముక్త్ చంద్ షేర్ చేసిన ఫోటోలో అతని ఎడమ కన్ను పూర్తిగా ఉబ్బిపోయి కనిపించకుండా పోయింది. కంటి గాయంపై ఉన్మక్త్ చంద్ స్పందిస్తూ.. ''అథ్లెట్ అంటే జీవితం చాలా సాఫీగా సాగిపోతుందని అనుకుంటారు చాలామంది. అయితే అది ఏ మాత్రం నిజం కాదు. కొన్ని సార్లు మనం విజయంతో తిరిగి వస్తాం, మరికొన్ని రోజులు నిరాశగా, ఓటమి భారాన్ని, గాయాలను ఇంటికి మోసుకురావాల్సి ఉంటుంది. పెద్ద ప్రమాదం తప్పినందుకు దేవుడికి కృతజ్ఞతలు తెలుపుతున్నా.. కష్టపడండి కానీ జాగ్రత్తగా ఉండండి... తృటిలో కన్ను పోయేది... నన్ను విష్ చేసినవారందరికీ థ్యాంక్యూ'' అంటూ ట్వీట్ చేశాడు. ఇక ఉన్ముక్త్ చంద్ 2012లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత యువ జట్టును విజేతగా నిలిపాడు. అతని కెప్టెన్సీలోనే భారత్ జట్టు ట్రోఫీ కైవసం చేసుకుంది. అయితే అండర్ 19 వరల్డ్‌కప్ సక్సెస్‌తో టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం అవుతాడనుకున్న ఉన్ముక్త్ చంద్.. చాలాకాలం పాటు ఎదురుచూసి టీమిండియాకు ఆడే అవకాశాలు అడుగంటడంతో గతేడాది భారత్‌ను వీడి యుఎస్ఏకు వలస వెళ్లాడు. ఉన్ముక్త్ ప్రస్తుతం కోరే ఆండర్సన్, లియామ్ ప్లంకెట్, జుయాన్ థెరాన్, సమీ అస్లాం తదితరులతో కలిసి యూఎస్ఏ క్రికెట్ జట్టులో కీలక సభ్యుడిగా కొనసాగుతున్నాడు. భారత క్రికెటర్‌గా రిటైర్మెంట్ ప్రకటించి యూఎస్ఏకి మకాం మార్చిన ఉన్ముక్త్.. 2021 సీజన్ అమెరికన్ మైనర్ లీగ్‌లో పరుగుల వరద పారించాడు. ఆ సీజన్లో సిలికాన్ వ్యాలీ స్ట్రైయికర్స్ తరఫున ప్రాతినిధ్యం వహించిన అతను.. 16 ఇన్నింగ్స్‌ల్లో 612 పరుగులు సాధించి సీజన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. It’s never a smooth ride for an athlete. Some days you come home victorious, other days disappointed&there are some when you come home with bruises and dents.Grateful to God to have survived a possible disaster. Play hard but be safe. It’s a thin line. Thanku for the good wishes pic.twitter.com/HfW80lxG1c — Unmukt Chand (@UnmuktChand9) October 1, 2022 చదవండి: Unmukt Chand: టీమిండియాకు ఆడాలనుకున్నాడు.. అయితే అదే జట్టుకు ప్రత్యర్ధిగా..! దురదృష్టాన్ని కొని తెచ్చుకోవడం అంటే ఇదే! -
సినిమా షూటింగ్లో టైగర్ ష్రాఫ్‌కు గాయం.. ఫొటో షేర్ చేసిన నటుడు
Tiger Shroff Got Eye Injury During Ganapath Movie Shoot: బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'గణపత్: పార్ట్ 1' (Ganapath Movie). ఇందులో టైగర్‌కు సరసన బీటౌన్ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్గా నటిస్తుంది. వికాస్ బహ్ల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూకేలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం మొదటి భాగం 2022 డిసెంబర్లో విడుదల కానుంది. యాక్షన్ స్టంట్స్‌తో అలరించే టైగర్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలో తను చేసే యాక్షన్ సీన్స్‌ను చిన్నపాటి వీడియో రూపంలో పంచుకుంటూ అభిమానులకు టచ్‌లో ఉంటాడు టైగర్. తాజాగా టైగర్ ష్రాఫ్ తనకు సంబంధించిన ఓ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. తన కంటికి స్వల్ప గాయమైనట్టు ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. దీనికి 'షిట్ హ్యాపెన్స్.. గణపత్ ఫైనల్ కౌంట్‌డౌన్' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు టైగర్. ఈ గాయం గణపత్ షూటింగ్లో జరిగినట్లుగా తెలుస్తోంది. యూకేలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. దానికి అనూహ్య స్పందన వచ్చింది. అంతకుముందు ఈ సినిమా కోసం తాను ఎలా సిద్ధం అవుతున్నాడో తెలిసేలా పలు గ్లింప్స్‌ను కూడా షేర్ చేశాడు టైగర్. గణపత్ సినిమాలో టైగర్.. బాక్సర్ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో టైగర్‌కు తండ్రిగా నటించేందుకు బిగ్‌బీ అమితాబ్‌ను సంప్రందించిందటా మూవీ యూనిట్. అయితే దీనికి సంబంధించిన ఏ విషయం అధికారికంగా వెలువడలేదు. టైగర్ నటిస్తున్న మరో సినిమా 'హీరోపంటి 2' కూడా 2022 డిసెంబర్లోనే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) View this post on Instagram A post shared by Tiger Shroff (@tigerjackieshroff) ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్ చెల్లెలి హాట్ ఫొటోషూట్.. నెట్టింట వైరల్ -
బ్లాక్ ఫంగస్: కన్ను తొలగించిన వైద్యులు, సాయం కోసం ఎదురుచూపు
సాక్షి, కాళేశ్వరం: బ్లాక్ ఫంగస్ ఓ రైతు కుటుంబాన్ని కకావికలం చేసింది. చికిత్స కోసం రూ.15 లక్షలు ఖర్చు చేయగా.. ప్రస్తుతం మందుల కోసం రోజుకు రూ.60 వేలు అవుతున్నాయి. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబం.. ఆపన్నహస్తం అందించాలని వేడుకుంటోంది. భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్పల్లికి చెందిన రైతు వావిలాల సమ్మయ్య (42) గత నెలలో కరోనా రక్కసితో పోరాడి కోలుకున్నాడు. ఇంతలోనే పక్షవాతం రావడంతో వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొంది సాధారణ స్థితికి చేరుకున్నాడు. గోరుచుట్టపై రోకలి బండలా.. వారం తర్వాత దురద మొదలై కుడి కన్ను ఎర్రగా మారింది. హన్మకొండ, అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు.. బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. ‘‘కంటికి ఇన్ఫెక్షన్ అయింది.. కుడి కన్నుపూర్తిగా తొలగించాలి.. లేదంటే ప్రాణానికి ప్రమాదం’అని వైద్యులు కుటుంబ సభ్యులకు చెప్పారు. దీంతో వారు తమకున్న మూడెకాల పొలాన్ని తనఖా పెట్టి రూ.15 లక్షల వరకు వైద్యానికి ఖర్చు చేశారు. శస్త్ర చికిత్స చేసి వైద్యులు కుడి కన్నును తొలగించారు. మూడు రోజుల క్రితం బాధితుడిని డిశ్చార్జి చేశారు. పది రోజుల వరకు మందులు వాడాలని సూచించారు. అయితే.. రోజుకు రూ.60 వేల వరకు మందులకు ఖర్చు అవుతోందని, కూలి పనులు చేసుకునే తమకు అంతటి శక్తి లేదని ఆపన్న హస్తం అందించి ఆదుకోవాలని సమ్మయ్య భార్య పద్మ, పిల్లలు వేడుకుంటున్నారు. సాయం చేయదలచిన వారు 8008240915లో సందప్రదించాలని కోరారు. చదవండి: (టాయిలెట్ ద్వారా కరోనా వ్యాపిస్తుందా?) (బ్లాక్‌ఫంగస్ చికిత్సకు తీవ్ర కొరత.. మందులు తక్కువ.. బాధితులెక్కువ..!) -
విద్యార్థిని కంటిలో పెన్సిల్ ముక్క
రాజేంద్రనగర్: తోటి విద్యార్థి దాడిలో ఓ బాలిక తీవ్రంగా గాయపడింది. పెన్సిల్ ముక్క కంటిలోపలికి వెళ్లడంతో వైద్యులు విజయవంతంగా తొలగించారు. అయితే ఆ విద్యార్థి కంటిచూపు కోల్పోయే పరిస్థితి ఉందని వైద్యులు చెప్పడంతో బాధిత కూతురు తల్లి ఆందోళన చేపట్టింది. ఈ ఘటన రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. బుద్వేల్ ప్రాంతానికి చెందిన విజయ్‌కుమార్, సుహాసిని దంపతుల కూతురు సుప్రియ (7). ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని కృషి హైస్కూల్లో పాప నాల్గో తరగతి చదువుతోంది. మంగళవారం మధ్యాహ్నం ‘‘మీ పాపకు గాయమైంది వచ్చి తీసుకెళ్లండి’ అని పాఠశాల నుంచి ఫోన్ వచ్చింది. వెంటనే పాఠశాలకు వెళ్లగా సుప్రియ ఏడుస్తూ కూర్చుంది. కంటికి ఉన్న చేతిరుమాలు తీసి చూడగా తీవ్రంగా గాయమైంది. తన తోటి విద్యార్థి పెన్సిల్‌తో కంటిలో పొడిచాడని తల్లికి పాప చెప్పింది. వెంటనే ఆమె హైదరాబాద్‌లోని ఎల్.వీ.ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలించింది. అక్కడ వైద్య సేవలు ఆలస్యమవడంతో ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఎక్స్‌రే తీయగా కంటి లోపల పెన్సిల్ ముక్కను గుర్తించారు. వెంటనే వైద్యులు ఆపరేషన్ చేసి ఆ పెన్సిల్ ముక్క తీసేశారు. అయినా కంటి లోపల రక్తం పేరుకుపోవడంతో ఇన్ఫెక్షన్ అయ్యిందని, చూపుపోయే స్థితిలో ఉందని వైద్యులు చెప్పారు. దీంతో తల్లి బోరున విలపించింది. ఈ విషయమై బుధవారం పాఠశాలకు వచ్చి ప్రిన్సిపల్‌తో పాటు నిర్వాహకులు ప్రకాశ్‌రావు, భాస్కర్, టీచర్ జమునను ప్రశ్నిస్తే తమకేమి తెలియదని బదులిచ్చారు. సుప్రియనే కళ్లల్లో పెన్సిల్‌తో గాయం చేసుకుందని చెప్పారని తెలిపారు. పాఠశాలలోని సీసీ కెమెరాలను చూపించాలని కోరినా తనపై దౌర్జన్యం చేశారని బాధిత తల్లి ఆందోళన వ్యక్తం చేసింది. ఈ విషయమై రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించింది. తన కూతురుకు న్యాయం చేయాలని కోరుతోంది. -
కోలుకుంటున్న స్వామిగౌడ్
సాక్షి, హైదరాబాద్: శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆరోగ్య పరిస్థితి మెరుగుపడినట్లు సరోజినీదేవి కంటి ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవీందర్‌గౌడ్ బుధవారం చెప్పారు. గవర్నర్ ప్రసంగ సమయంలో చోటు చేసుకున్న ఘటనలో ఆయన కంటికి గాయమైన విషయం తెలిసిందే. సరోజినీదేవి ఆస్పత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారని, ఆరోగ్యం నిలకడగా, మెరుగ్గా ఉందని తెలిపారు. గురువారం ఉదయం మరోసారి పరీక్షించిన తర్వాత ఆయన్ను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉందన్నారు. -
ఏం గుచ్చుకుందో తెలియదు: శ్రద్ధా కపూర్
నటి శ్రద్ధా కపూర్ కు కొద్ది రోజుల కిందట భయంకరమైన అనుభవం ఎదురైంది. 'రాక్ ఆన్-2' షూటింగ్ లో భాగంగా షిల్లాంగ్ (మేఘాలయ)లో ఉన్న ఆమె హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ సినిమాలో హీరోలుగా నటిస్తున్న ఫర్హాన్ అక్తర్, రితేశ్ సిద్వానీ సహా సిబ్బందంతా కంగారు పడిపోయారు. వెంటనే ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈలోపు నొప్పి ఎక్కువ కావడంతో ఇక లాభంలేదనుకుని ముంబై పంపేశారు. ఇంతకీ ఏం జరిగిందని అడిగితే.. 'షిల్లాంగ్ లో షూటింగ్ చూస్తుంగా.. నా కంట్లో ఏదో గుచ్చుకుంది. అదేమిటో గమనించలేకపోయా. నిమిషాలు గడుస్తుండగానే నొప్పి ఎక్కువైపోయింది. లొకేషన్ లో ఉన్నవాళ్లంతా నా దగ్గరికొచ్చి ఓదార్చే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటి తర్వాత కారులో ఆసుపత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు నిర్వహించిన డాక్టర్.. కనుగుడ్డు స్వల్పంగా చిట్లిందని చెప్పారు. మెరుగైన వైద్యం కోసం ముంబై రాక తప్పలేదు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మా ఫ్యామిలీ ఐ స్సెషలిస్ట్ హాస్పిటల్ కు వెళ్లా. రెండు రోజుల చికిత్స తర్వాత నొప్పి పూర్తిగా తగ్గింది. ఇంకో మూడు రోజులు రెస్ట్ తీసుకుని షిల్లాంగ్ బయలుదేరుతా' అని వివరించింది శ్రధ్ధా కపూర్.