Tiger Shroff Got Eye Injury During Ganapath Movie Shoot- Sakshi
Sakshi News home page

Tiger Shroff: సినిమా షూటింగ్‌లో టైగర్‌ ష్రాఫ్‌కు గాయం.. ఫొటో షేర్‌ చేసిన నటుడు

Published Wed, Dec 22 2021 12:30 PM | Last Updated on Wed, Dec 22 2021 1:51 PM

Tiger Shroff Got Eye Injury During Ganapath Movie Shoot - Sakshi

Tiger Shroff Got Eye Injury During Ganapath Movie Shoot: బాలీవుడ్ యాక్షన్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ ప్రస్తుతం నటిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్ మూవీ 'గణపత్‌: పార్ట్‌ 1' (Ganapath Movie). ఇందులో టైగర్‌కు సరసన బీటౌన్‌ బ్యూటీ దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. వికాస్‌ బహ్ల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జాకీ భగ్నాని, వశు భగ్నాని, దీప్షికా దేశ్‌ముఖ్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా యూకేలో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ చిత్రం మొదటి భాగం 2022 డిసెంబర్‌లో విడుదల కానుంది. యాక్షన్‌ స్టంట్స్‌తో అలరించే టైగర్‌ సోషల్‌ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటాడు. సినిమాలో తను చేసే యాక్షన్‌ సీన్స్‌ను చిన్నపాటి వీడియో రూపంలో పంచుకుంటూ అభిమానులకు టచ్‌లో ఉంటాడు టైగర్‌. 

తాజాగా టైగర్ ష్రాఫ్‌ తనకు సంబంధించిన ఓ విషయాన్ని సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు. తన కంటికి స్వల్ప గాయమైనట్టు ఇన్‌స్టా స్టోరీలో తెలిపాడు. దీనికి 'షిట్‌ హ్యాపెన్స్‌.. గణపత్‌ ఫైనల్‌ కౌంట్‌డౌన్‌' అంటూ క్యాప్షన్‌ ఇచ్చాడు టైగర్‌. ఈ గాయం గణపత్‌ షూటింగ్‌లో జరిగినట్లుగా తెలుస్తోంది. యూకేలో జరుగుతున్న ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను ఇటీవల చిత్రబృందం విడుదల చేసింది. దానికి అనూహ్య స‍్పందన వచ్చింది. అంతకుముందు ఈ సినిమా కోసం తాను ఎలా సిద్ధం అవుతున్నాడో తెలిసేలా పలు గ్లింప్స్‌ను కూడా షేర్‌ చేశాడు టైగర్‌. 

గణపత్‌ సినిమాలో టైగర్‌.. బాక్సర్‌ పాత్రలో కనిపించనున్నాడు. ఇందులో టైగర్‌కు తండ్రిగా నటించేందుకు బిగ్‌బీ అమితాబ్‌ను సంప్రందించిందటా మూవీ  యూనిట్‌. అయితే దీనికి సంబంధించిన ఏ విషయం అధికారికంగా వెలువడలేదు. టైగర్ నటిస్తున్న మరో సినిమా 'హీరోపంటి 2' కూడా 2022 డిసెంబర్‌లోనే విడుదల కానుంది. 


ఇదీ చదవండి: టైగర్ ష్రాఫ్‌ చెల్లెలి హాట్‌ ఫొటోషూట్‌.. నె​‍​ట్టింట వైరల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement