భారీ బడ్జెట్ సినిమాలు క్లిక్కయితే లాభాల వరద పారుతుంది.. తేడా వచ్చిందంటే మాత్రం రక్తకన్నీరు కారుతుంది. చాలా సినిమాల విషయంలో ఇది రుజువైంది కూడా! బాలీవుడ్ బ్యానర్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, తన తండ్రి వాసు భగ్నానీతో కలిసి ఈ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు.
రూ.250 కోట్ల అప్పు.. అయినా..
ఈ బ్యానర్‌లో ఇటీవల బడే మియా చోటే మియా, గణపత్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ రూ.250 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్యానర్‌లో అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలకుగానూ అతడికి రూ.165 కోట్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది. అది కూడా కంపెనీపై అధిక భారానికి కారణమైందన్నది చర్చ! తాజాగా దీనిపై నిర్మాత సునీల్ దర్శన్ స్పందించాడు.
అప్పట్లో సక్సెస్..
మీరు అనుకుంటున్న మొత్తానికి కాస్త అటూఇటుగా హీరో టైగర్ ష్రాప్‌కు రెమ్యునరేషన్ చెల్లించాం. అయితే అదెంత అనేది బయటకు చెప్పలేను. కానీ ఓ విషయం చెప్పాలి.. 1990'స్‌లో వాసు భగ్నానీ.. డేవిడ్ దావణ్‌తో కలిసి అర డజను సినిమాలు చేసి సక్సెస్ రుచి చూశాడు. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి! ఇప్పుడు వారి స్ట్రాటజీలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌కు ఎంత ఇచ్చారన్నది మాత్రం బయటపెట్టలేదు. ఇకపోతే పూజా బ్యానర్‌లో అక్షయ్ కుమార్.. బడే మియా చోటే మియా, బెల్ బాటమ్, మిషన్ రాణిగంజ్, కట్‌పుత్లి సినిమాలు చేశాడు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment