Bade Miyan Chote Miyan Movie
-
రకుల్ భర్త జాకీ భగ్నానికి అండగా నిలిచిన అక్షయ్ కుమార్
అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కీలక పాత్రల్లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బడేమియా ఛోటేమియా’. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమాకు భారీగానే నష్టాలు మిగిలాయి. ఏప్రిల్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని అందుకుంది. ఈ చిత్రానికి అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇందులో మానుషి చిల్లర్, అలయా ఎఫ్ ,ఇమ్రాన్ హష్మి, పృథ్విరాజ్ సుకుమారన్ వంటి స్టార్స్ ఇందులో నటించారు.‘బడేమియా ఛోటేమియా’ చిత్రాన్ని పూజా ఎంటర్టైన్మెంట్ నిర్మించింది. ఈ సంస్థపై రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, ఆయన తండ్రి వాసు భగ్నానీ అనేక చిత్రాలను నిర్మించారు. కానీ, ‘బడేమియా ఛోటేమియా’ చిత్రం కోసం రూ. 350 కోట్ల పెట్టుబడి పెట్టారు. ఆ సినిమా దారుణమైన డిజాస్టర్ కావడంతో వారికి కేవలం రూ. 110 కోట్లు మాత్రమే వచ్చాయి. దీంతో ఆ నిర్మాణ సంస్థకు కోలుకోలేని దెబ్బ పడింది. దీంతో ఆ సినిమాకు పనిచేసిన టెక్నీషియన్లు, నటీనటులకు కూడా పూర్తి చెల్లింపులు చేయలేకపోయింది. బాలీవుడ్లో ఈ విషయంపై పెద్ద ఎత్తున వివాదం మొదలైంది.ఇలాంటి సమయంలో అక్షయ్ కుమార్ పెద్ద మనుసు చేసుకొని తమకు అండగా నిలిచారని ఆ చిత్ర నిర్మాత కుమారుడు జాకీ భగ్నాని తాజాగా తెలిపారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికీ ఇవ్వాల్సిన డబ్బు ఇచ్చిన తర్వాతే తనకు ఇవ్వమని అక్షయ్ కోరారని ఆయన అన్నారు. అందరికంటే ఎక్కువ మొత్తం కూడా అక్షయ్ కుమార్‌కే ఇవ్వాల్సి ఉందని తెలుస్తోంది. అయినా సరే తనను నమ్మి సినిమా తీసిన నిర్మాణ సంస్థ ఇబ్బందులో పడకూడదని ఆయన నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలో వారి కాంబినేషన్లో మరో ప్రాజెక్ట్ చేసేందుకు ఆయన ముందకు వచ్చారట.ఈ క్లిష్ట సమయంలో తన సహాయాన్ని అందించిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్‌కు జాకీ భగ్నాని కృతజ్ఞతలు తెలిపారు. అక్షయ్ కుమార్ తనని ఇటీవల కలిశారని పరిస్థితి గురించి తెలియజేసిన తర్వాత ఆయన సాయం చేసేందుకు ముందుకు వచ్చారని జాకీ తెలిపాడు. 'అక్షయ్ సర్ .. కష్ట సమయంలో మా వెంట నిలబడ్డారు. మా పట్ల ఆయన చూపించిన ప్రేమకు మేము చాలా కృతజ్ఞులం' అని జాకీ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. -
అట్టర్ ఫ్లాప్ సినిమాలు.. హీరోకు రూ.165 కోట్ల పారితోషికం!
భారీ బడ్జెట్ సినిమాలు క్లిక్కయితే లాభాల వరద పారుతుంది.. తేడా వచ్చిందంటే మాత్రం రక్తకన్నీరు కారుతుంది. చాలా సినిమాల విషయంలో ఇది రుజువైంది కూడా! బాలీవుడ్ బ్యానర్ పూజా ఎంటర్టైన్మెంట్కు ఇలాంటి బాధాకరమైన పరిస్థితి ఎదురైంది. రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీ, తన తండ్రి వాసు భగ్నానీతో కలిసి ఈ నిర్మాణ సంస్థను నడుపుతున్నాడు.రూ.250 కోట్ల అప్పు.. అయినా..ఈ బ్యానర్లో ఇటీవల బడే మియా చోటే మియా, గణపత్ సినిమాలు తెరకెక్కాయి. ఈ రెండూ బాక్సాఫీస్ వద్ద గట్టెక్కలేకపోయాయి. ఇదిలా ఉంటే ఈ నిర్మాణ సంస్థ రూ.250 కోట్ల అప్పుల ఊబిలో కూరుకుపోయిందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ బ్యానర్లో అక్షయ్ కుమార్ నటించిన నాలుగు సినిమాలకుగానూ అతడికి రూ.165 కోట్లు చెల్లించారని ప్రచారం జరుగుతోంది. అది కూడా కంపెనీపై అధిక భారానికి కారణమైందన్నది చర్చ! తాజాగా దీనిపై నిర్మాత సునీల్ దర్శన్ స్పందించాడు.అప్పట్లో సక్సెస్..మీరు అనుకుంటున్న మొత్తానికి కాస్త అటూఇటుగా హీరో టైగర్ ష్రాప్‌కు రెమ్యునరేషన్ చెల్లించాం. అయితే అదెంత అనేది బయటకు చెప్పలేను. కానీ ఓ విషయం చెప్పాలి.. 1990'స్లో వాసు భగ్నానీ.. డేవిడ్ దావణ్‌తో కలిసి అర డజను సినిమాలు చేసి సక్సెస్ రుచి చూశాడు. ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి! ఇప్పుడు వారి స్ట్రాటజీలు మార్చుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పుకొచ్చాడు. అక్షయ్‌కు ఎంత ఇచ్చారన్నది మాత్రం బయటపెట్టలేదు. ఇకపోతే పూజా బ్యానర్లో అక్షయ్ కుమార్.. బడే మియా చోటే మియా, బెల్ బాటమ్, మిషన్ రాణిగంజ్, కట్‌పుత్లి సినిమాలు చేశాడు.చదవండి: -
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే?
వేసవి చివరకొచ్చేసింది. ఇప్పటికే ఇంటర్ కాలేజీలు తెరిచేశారు. స్కూల్స్ మరో వారంలో ఓపెన్ చేస్తారు. తల్లిదండ్రులు అందరూ ఆ హడావుడిలో ఉన్నారు. వీళ్లు కాస్త రిలాక్స్ అవ్వడానికి ఈ వారం 'మనమే', 'సత్యభామ', 'రక్షణ', 'లవ్ మౌళి' తదితర మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో దేనిపై పెద్దగా బజ్ లేదు. దీంతో ఆటోమేటిక్‌గా అందరి దృష్టి ఓటీటీ సినిమాలపై పడుతుంది. ఇకపోతే ఈ వారం ఏకంగా 31 మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?)ఓటీటీల్లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీసుల విషయానికొస్తే.. 'మైదాన్', 'వర్షంగల్కు శేషం', 'బడే మియా చోటే మియా', 'బ్లాక్ ఔట్' లాంటి పరభాష చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. వీటితో పాటే పలు ఇంగ్లీష్-హిందీ సిరీసులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏవి బాగుంటాయనేది రిలీజైతే కానీ తెలీదు. మరి ఓవరాల్‌గా ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలేంటి? ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జూన్ 03 - 09వ తేదీ వరకు)అమెజాన్ ప్రైమ్మైదాన్ - జూన్ 05నెట్ఫ్లిక్స్షూటింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 03లిటిల్ బేబీ బమ్ మ్యూజిక్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03జో కోయ్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 04ద ప్రైస్ ఆఫ్ నోన్నాస్ ఇన్హెరిటెన్స్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 04హిట్లర్ అండ్ ద నాజీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 05హౌ టూ రాబ్ ఏ బ్యాంక్ (ఇంగ్లీష్ చిత్రం) - జూన్ 05అండర్ పారిస్ (ఫ్రెంచ్ మూవీ) - జూన్ 05బడే మియా చోటే మియా (హిందీ సినిమా) - జూన్ 06బకీ హన్మా vs కెంగన్ అసుర (జపనీస్ మూవీ) - జూన్ 06బస్మా (అరబిక్ చిత్రం) - జూన్ 06కుబ్రా సీజన్ 2 (టర్కిష్ సిరీస్) - జూన్ 06నెల్మ కొడ్మా (పోర్చుగీస్ మూవీ) - జూన్ 06రఫా మార్కెజ్ (స్పానిష్ సినిమా) - జూన్ 06స్వీట్ టూత్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 06హైరార్కీ (కొరియన్ సిరీస్) - జూన్ 07హిట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 07ఫెర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 07హాట్స్టార్గుణ్హ (హిందీ సిరీస్) - జూన్ 03క్లిప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04స్టార్ వార్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05జియో సినిమాలవ్ అండర్ కవర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03ద రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ దుబాయి (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03బ్లాక్ ఔట్ (హిందీ మూవీ) - జూన్ 07ద ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 08బుక్ మై షోవిక్డ్ లిటిల్ లెటర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 04అబిగైల్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 07ఆహాబూమర్ అంకుల్ (తమిళ చిత్రం) - జూన్ 07సోనీ లివ్గులక్ సీజన్ 4 (హిందీ సిరీస్) - జూన్ 07వర్షంగల్కు శేషం (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 07(ఇదీ చదవండి: హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం) -
ఓటీటీలో రూ. 350 కోట్ల బడ్జెట్ సినిమా
బాలీవుడ్ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో సోనాక్షి సిన్హా, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. భారీ అంచనాలతో ఏప్రిల్ 11న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీ డిజాస్టర్‌గా మిగిలిపోయింది. అయితే, ఇప్పుడు ఓటీటీలోకి రానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేసింది.కొన్నేళ్ల నుంచి వరుస ప్లాపులతో ఉన్న అక్షయ్‌కుమార్ ‘బడేమియా ఛోటేమియా’తో హిట్ కొట్టాలని చాలా కష్టపడ్డాడు. కానీ, ఫలితం మారలేదు. మరో డిజాస్టర్ ఆయన ఖాతాలో చేరిపోయింది. సుమారు రూ. 350 కోట్ల బడ్జెట్‌తో భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే, ఈ సినిమాకు కేవలం రూ. 90 కోట్ల వరకు మాత్రమే కలెక్ట్ చేసింది. ఇందులో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా కనిపిస్తే.. సానాక్షి సిన్హా ఓ కీలక పాత్రలో కనిపించింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దేశభక్తి ప్రధానంగా ఈ సినిమా కథ ఉంటుంది. ఇందులో భారీ తారాగణంతో పాటు కావాల్సినంత సాంకేతిక హంగులు, మంచి లొకేషన్లు ఉన్నాయి. యాక్షన్ సీన్స్‌లలో గన్నులు, ట్యాంకర్లు, హెలికాఫ్టర్లు అడుగడుగునా ఉపయోగించి భీకర పోరాటాలు చేసినా సరైన కథ, కథనాలు లేకపోవడంతో సినిమాకు బాగా మైనస్ అయింది. జూన్ 6 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్న 'బడేమియా ఛోటేమియా'ను ఇంట్లోనే చూసేయండి. -
రూ. 350 కోట్ల సినిమా.. 1+1 ఆఫర్ ఇచ్చినా చూసేవాళ్లు లేరు
బాలీవుడ్లో అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ ఇద్దరు కలిసి నటించిన చిత్రం 'బడేమియా ఛోటేమియా'. అలీ అబ్బాస్ జాఫర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈద్ సందర్భంగా ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదలైంది. హిందీతో పాటు తెలుగు, తమిళంలోనూ రిలీజ్ అయింది. హైవోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైనా.. బాక్సాఫీస్ వద్ద నిరాశపరుస్తోంది. సుమారు రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మూవీకి నాలుగు రోజులకు గాను రూ.96 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో రూ.100 కోట్ల మార్క్ కూడా దాటలేకపోయింది. ఈ చిత్రాన్ని పూజ ఎంటర్టైన్మెంట్స్, ఏఏజెడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై జాకీ భగ్నానీ, వశు భగ్నానీ, దీప్షికా దేశ్‌ముఖ్, అలీ అబ్బాస్ జాఫర్, హిమాన్షు కిషన్ సంయుక్తంగా నిర్మించారు. సుమారు రూ.400 కోట్లు అందుకుంటుందని అంచనా వేసి సినిమా విడుదల చేస్తే.. భారీ డిజాస్టర్ దిశగా కొనసాగుతుంది. ఓ మై గాడ్ 2 తర్వాత అక్షయ్ కుమార్ నుంచి వస్తున్న సినిమా కావడం.. ఆపై ఈ చిత్రంలో జాన్వీ కపూర్, మానుషి చిల్లర్, పృథ్వీరాజ్ సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు నటించడంతో మొదటిరోజు కలెక్షన్స్ కాస్త మెరుగ్గానే వచ్చాయి. ఆ తర్వాత సినిమా బాగాలేదని టాక్ రావడంతో రెండో రోజే కలెక్షన్స్ దారుణంగా పడిపోయాయి. దీంతో ఆదివారం నాడు బుక్ మై షోలో వన్ ప్లస్ వన్ ఆఫర్‌ను ప్రకటించేశారు. ఈ నిర్ణయంతో ఆదివారం బుకింగ్స్ కాస్త పెరిగాయని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ఆఫర్లు ప్రకటించినా కూడా రూ. 350 కోట్లు పెట్టిన సినిమాకు నాలుగురోజుల్లో రూ. 100 కోట్ల మార్క్ దాటకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. -
డేంజర్ జోన్లో ప్రపంచం మెచ్చిన అందగత్తె!
-
‘బడే మియా చోటే మియా’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)
-
యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. 'బడే మియా చోటే మియా' వచ్చేస్తున్నారు!
ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ మూవీ ‘బడే మియా చోటే మియా’ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. ఈ చిత్రాన్ని ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు.భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. REAL ACTION ka ek bada dose lekar aa rahe hain #BadeMiyanChoteMiyan!#BadeMiyanChoteMiyanTrailer out on March 26! 👊 🤜🤛 IN CINEMAS ON 10th APRIL! #BadeMiyanChoteMiyanOnApril10 #BadeMiyanChoteMiyanOnEid2024 pic.twitter.com/Wzw1BbpwYf — Akshay Kumar (@akshaykumar) March 23, 2024