యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. 'బడే మియా చోటే మియా' వచ్చేస్తున్నారు! | Bade Miyan Chote Miyan Release Date Out | Sakshi
Sakshi News home page

యాక్షన్ లవర్స్ గెట్ రెడీ.. 'బడే మియా చోటే మియా' వచ్చేస్తున్నారు!

Published Sat, Mar 23 2024 4:36 PM | Last Updated on Sat, Mar 23 2024 4:57 PM

Bade Miyan Chote Miyan Release Date Out - Sakshi

ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. అక్షయ్‌ కుమార్‌, టైగర్‌ ష్రాఫ్‌ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్‌ మూవీ ‘బడే మియా చోటే మియా’ నుంచి అదిరిపోయే అప్‌డేట్‌ వచ్చేసింది.  ఈ చిత్రాన్ని ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ కళ్ళు చెదిరే పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్‌. మార్చి 26న ఈ చిత్ర ట్రైలర్ ని హిందీ, తెలుగు, తమిళం, మలయాళీ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

 ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ పోస్టర్ లో అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ యాక్షన్ అవతారంలో కనిపిస్తున్నారు.భారీ బడ్జెట్ లో రూపొందుతున్న ఈ చిత్రంలో ఉత్కంఠని పెంచే కథాంశం, నటీనటుల పెర్ఫామెన్స్, హై ఆక్టన్స్ యాక్షన్ సన్నివేశాలు అలరించబోతున్నాయి. అలీ అబ్బాస్ జాఫర్ రచన దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వశు భగ్నానీ, దీప్షిక దేశముఖ్, జాకీ భగ్నానీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రంజాన్ కానుకగా ఈ చిత్రం ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement