ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు.. అవి ఏంటంటే? | Upcoming Telugu Movies OTT Release On June 1st Week 2024 | Sakshi
Sakshi News home page

This Week OTT Movies: ఓటీటీల్లో 31 మూవీస్ రిలీజ్.. అవి మాత్రం స్పెషల్

Published Mon, Jun 3 2024 12:34 PM | Last Updated on Mon, Jun 3 2024 1:19 PM

Upcoming Telugu Movies OTT Release On June 1st Week 2024

వేసవి చివరకొచ్చేసింది. ఇప్పటికే ఇంటర్ కాలేజీలు తెరిచేశారు. స్కూల్స్ మరో వారంలో ఓపెన్ చేస్తారు. తల్లిదండ్రులు అందరూ ఆ హడావుడిలో ఉన్నారు. వీళ్లు కాస్త రిలాక్స్ అవ్వడానికి ఈ వారం 'మనమే', 'సత్యభామ', 'రక్షణ', 'లవ్ మౌళి' తదితర మూవీస్ థియేటర్లలోకి వస్తున్నాయి. వీటిలో దేనిపై పెద్దగా బజ్ లేదు. దీంతో ఆటోమేటిక్‌గా అందరి దృష్టి ఓటీటీ సినిమాలపై పడుతుంది. ఇకపోతే ఈ వారం ఏకంగా 31 మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: 'బేబి' హీరోయిన్ నుంచి త్వరలో గుడ్ న్యూస్?)

ఓటీటీల్లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీసుల విషయానికొస్తే.. 'మైదాన్', 'వర్షంగల్కు శేషం', 'బడే మియా చోటే మియా', 'బ్లాక్ ఔట్' లాంటి పరభాష చిత్రాలు కాస్త ఆసక్తి రేపుతున్నాయి. వీటితో పాటే పలు ఇంగ్లీష్-హిందీ సిరీసులు కూడా ఉన్నాయి. కాకపోతే ఏవి బాగుంటాయనేది రిలీజైతే కానీ తెలీదు. మరి ఓవరాల్‌గా ఓటీటీల్లోకి రాబోతున్న సినిమాలేంటి? ఎందులో స్ట్రీమింగ్ కాబోతున్నాయనేది ఇప్పుడు చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ లిస్ట్ (జూన్ 03 - 09వ తేదీ వరకు)

అమెజాన్ ప్రైమ్

  • మైదాన్ - జూన్ 05

నెట్‌ఫ్లిక్స్

  • షూటింగ్ స్టార్స్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 03

  • లిటిల్ బేబీ బమ్ మ్యూజిక్ టైమ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03

  • జో కోయ్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 04

  • ద ప్రైస్ ఆఫ్ నోన్నాస్ ఇన్హెరిటెన్స్ (ఇటాలియన్ మూవీ) - జూన్ 04

  • హిట్లర్ అండ్ ద నాజీస్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 05

  • హౌ టూ రాబ్ ఏ బ్యాంక్ (ఇంగ్లీష్ చిత్రం) - జూన్ 05

  • అండర్ పారిస్ (ఫ్రెంచ్ మూవీ) - జూన్ 05

  • బడే మియా చోటే మియా (హిందీ సినిమా) - జూన్ 06

  • బకీ హన్మా vs కెంగన్ అసుర (జపనీస్ మూవీ) - జూన్ 06

  • బస్మా (అరబిక్ చిత్రం) - జూన్ 06

  • కుబ్రా సీజన్ 2 (టర్కిష్ సిరీస్) - జూన్ 06

  • నెల్మ కొడ్మా (పోర్చుగీస్ మూవీ) - జూన్ 06

  • రఫా మార్కెజ్ (స్పానిష్ సినిమా) - జూన్ 06

  • స్వీట్ టూత్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 06

  • హైరార్కీ (కొరియన్ సిరీస్) - జూన్ 07

  • హిట్ మ్యాన్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 07

  • ఫెర్ఫెక్ట్ మ్యాచ్ సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 07

హాట్‌స్టార్

  • గుణ్హ (హిందీ సిరీస్) - జూన్ 03

  • క్లిప్డ్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04

  • స్టార్ వార్స్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 04

  • ద లెజెండ్ ఆఫ్ హనుమాన్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - జూన్ 05

జియో సినిమా

  • లవ్ అండర్ కవర్ (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03

  • ద రియల్ హౌస్ వైవ్స్ ఆఫ్ దుబాయి (ఇంగ్లీష్ సిరీస్) - జూన్ 03

  • బ్లాక్ ఔట్ (హిందీ మూవీ) - జూన్ 07

  • ద ఎండ్ వుయ్ స్టార్ట్ ఫ్రమ్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 08

బుక్ మై షో

  • విక్డ్ లిటిల్ లెటర్స్ (ఇంగ్లీష్ సినిమా) - జూన్ 04

  • అబిగైల్ (ఇంగ్లీష్ మూవీ) - జూన్ 07

ఆహా

  • బూమర్ అంకుల్ (తమిళ చిత్రం) - జూన్ 07

సోనీ లివ్

  • గులక్ సీజన్ 4 (హిందీ సిరీస్) - జూన్ 07

  • వర్షంగల్కు శేషం (తెలుగు డబ్బింగ్ మూవీ) - జూన్ 07

(ఇదీ చదవండి: హీరో ఆత్మహత్య చేసుకున్న ఫ్లాట్‌లో హీరోయిన్ మకాం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement